Direct attacks
-
Iran: ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష యుద్ధమే!
టెహ్రాన్/బీరుట్: ఒకవైపు గాజాలో మారణకాండ సాగిస్తూ, మరోవైపు హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియేను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్ దుశ్చర్య పట్ల ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం నేర్పాలన్న కృతనిశ్చయంతో ఆయన ఉన్నారు. హనియే హత్యకు ఇక ప్రతీకారం తీర్చుకోక తప్పదని భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేయాలని ఆయన తమ సైన్యానికి తాజాగా స్పష్టమైన ఆదేశాలిచి్చనట్లు ముగ్గురు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. హనియే హత్యపై ప్రకటన వెలువడగానే బుధవారం ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. చాలా అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి సమావేశం నిర్వహిస్తారు. తాజా పరిణామాలపై ఈ భేటీలో ఖమేనీ సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడులకు దిగాలని సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పడానికి ఇక ప్రత్యక్ష యుద్ధం తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదిలా ఉండగా, పూర్తిస్థాయి యుద్ధానికి తాము సైతం సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ఇరాన్‌కు సందేశం చేరవేసినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ‘చానెల్ 12’ తెలియజేసింది. తమ దేశంపై ఇరాన్ గానీ, దాని మిత్రదేశాలు గానీ దాడులకు దిగితే పూర్తిస్థాయి యుద్ధం మొదలైనట్లేనని ఇజ్రాయెల్ తేలి్చచెప్పినట్లు వివరించింది. భారీ మూల్యం తప్పదు: నెతన్యాహూ ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది ముమ్మటికీ ఇజ్రాయెల్ సైన్యమేనని ఇరాన్, హమాస్ ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా నోరువిప్పలేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తాజాగా స్పందించారు. తమ దేశం వైపు కన్నెత్తి చూస్తే శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తమకు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నామని ‘అసోసియేటెడ్ ప్రెస్’తో మాట్లాడుతూ చెప్పారు. ఇస్మాయిల్ హనియేకు ఖమేనీ నివాళులు ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు విడిచిన హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేకు, ఆయన అంగరక్షకుడికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఘనంగా నివాళుర్పించారు. గురువారం టెహ్రాన్ యూనివర్సిటీలో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో హనియే, సెక్యూరిటీ గార్డు శవపేటికల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
భయంతోనే వ్యక్తిగత దాడి
ఔరాద్ (కర్ణాటక): ప్రధాని మోదీకి భయం పట్టుకున్న ప్రతీసారి తనపై వ్యక్తిగత దాడికి దిగుతారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. తాము లేవనెత్తిన యుద్ధ విమానాల ఒప్పందం, బ్యాంకులకు రూ. వేల కోట్లు కుచ్చుటోపి పెట్టిన నీరవ్ మోదీ తదితర అంశాలపై బదులివ్వలేకే వ్యక్తిగత దాడికి దిగుతున్నారని విమర్శించారు. గురువారం రాహుల్ కర్ణాటకలోని బీదర్ జిల్లా ఔరాద్లో జరిగిన ర్యాలీ మాట్లాడారు. ‘నా గురించి ఆయన (మోదీ) ఏదైనా మాట్లాడనివ్వండి. అది తప్ప యినా, ఒప్పయినా పెద్ద విషయం కాదు. ఆయన దేశానికి ప్రధాని. అందువల్ల ఆయనపై నేను వ్యక్తిగత విమర్శలు చేయను’ అని అన్నా రు. తనపై మోదీ చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గవి కావని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గబ్బర్ సింగ్ గ్యాంగ్ మోదీ.. గాలి జనార్దన్‌రెడ్డి సోదరులకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడాన్ని రాహుల్ తప్పుపట్టారు. ‘షోలే సినిమాలో గబ్బర్ సింగ్ ఉన్నాడు. మీరు ఇప్పటికే గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీకి వ్యంగ్య వ్యాఖ్య) తెచ్చారు. కానీ ఈసారి ఇంకా ముందుకెళ్లిపోయారు. కర్ణాటక ఎన్నికల్లో మొత్తం గబ్బర్‌సింగ్ గ్యాంగ్‌ను దించేశారు. గబ్బర్ సింగ్లా యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి సోదరులు తయారయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పే మీరు.. జైలుకు వెళ్లి వచ్చిన రెడ్డి సోదరులను అసెంబ్లీకి పంపాలని ప్రయత్నిస్తున్నారు’అని ఎద్దేవా చేశారు. మోదీకి ‘ఎఫ్’ గ్రేడ్ మోదీపై రాహుల్ ట్వీట్ల దాడికి దిగారు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాముఖ్యం విషయంలో మోదీ ప్రోగ్రెస్ కార్డుకు తాను ‘ఎఫ్’గ్రేడ్ ఇస్తానంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటు మద్దతు ధరకు సంబంధించిన చార్ట్‌ను కూడా పోస్ట్ చేశారు. దేవేగౌడను అవమానించలేదు రాహుల్ జేడీ(ఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడను అవమానించలేదని, అది కాంగ్రెస్ సంస్కృతి కాదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ చెప్పారు. రాహుల్ దేవెగౌడను అవమానించారని మోదీ వ్యాఖ్యానించిన నేప థ్యంలో శర్మ ఈ మేరకు వివరణ ఇచ్చారు. -
నేనే మంత్రిని
నేను చెబితేనే నామినేటెడ్ పదవి అధికారులంతా నా మాట వినాల్సిందే లేకుంటే శంకరగిరి మాన్యాలే ఇంటి వద్దే అధికారులతో సమీక్షా సమావేశాలు బందరులో ఓ టీడీపీ నాయకుడి హల్చల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి అధికార పార్టీ నేతల ఆగడాలు శృతిమించి పోతున్నాయి. ఓ వైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల పైన ప్రత్యక్షంగా దాడులకు దిగుతూనే మరోవైపు అధికారులపై పెత్తనం చలాయిస్తున్నారు. తమ మాట వినకుంటే శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని బెదిరిస్తూ వారి పబ్బం గడుపుకొంటున్నారు. బందరులో ఓ మాజీ ప్రజా ప్రతినిధి వ్యవహరిస్తున్న తీరు విమర్శలపాలవుతోంది. మచిలీపట్నం : ‘‘ప్రభుత్వం మాదే, నేనే మంత్రిని, నా మాట వినకుంటే ఎవరినైనా శంకరగిరి మాన్యాలు పట్టిస్తా, నామినేటెడ్ పదవులు నేను చెప్పిన వారికే వస్తాయి. నేను చెప్పిన వారికే కాంట్రాక్టులు, కమీషన్లు ఇవ్వాలి. అధికారులంతా నా మాట వినాల్సిందేనంటూ’’ ఓ టీడీపీ నాయకుడు మచిలీ పట్నంలో హల్చల్ చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా మండల పరిషత్, జిల్లా పరిషత్ తదితర శాఖల అధికారులను తన ఇంటికి పిలిపించుకుని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాస్థాయి పదవిలో కొనసాగిన ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అధికార, అనధికార కార్యక్రమాల్లో ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా కార్యక్రమాలకు హాజరై తానే ప్రభుత్వం నడుపుతున్నట్లు మాటల కోటలు దాటిస్తున్నారు. అంతా ఆయన కనుసన్నల్లోనే..... మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొల్లు రవీంద్ర టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటుండగా ఇదే అదనుగా భావించిన ఈ నాయకుడు అధికారులను తన ఇంటికి పిలిపించుకుంటున్నారు. ప్రభుత్వం ద్వారా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కాంట్రాక్టు పనులను తాను సిఫార్సు చేసిన వారికే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. లేదు, కాదు అంటే ఇబ్బందులు పడతారని బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల జిల్లా పరిషత్, మండల పరిషత్ తదితర విభాగాలకు చెందిన అధికారులకు ఫోన్ చేసి మీతో మాట్లాడాలి ఇంటికి రండని తనదైన శైలిలో చెప్పి వారిని ఇంటికి పిలిపించుకున్నట్లు టీడీపీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. అసలు మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీ సమావేశాల్లో ఉండగా మచిలీపట్నంలో ఈయన మరో అనధికార మంత్రిగా పెత్తనం చెలాయించడం అధికారులు, టీడీపీ కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తానంటూ... సెప్టెంబరు 5వ తేదీ నుంచి జిల్లాలోని నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ అవుతాయని, తాను చెప్పిన వారికే నామినేటెడ్ పోస్టులు నూటికి నూరుశాతం వస్తాయంటూ ఈయన చేసే హడావుడికి కార్యకర్తలు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకైనా మంచిదని కొందరు కార్యకర్తలు ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు పడిగాపులు పడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం ఆయన వద్దకు వెళ్లిన కార్యకర్తలను తనదైన శైలిలో గాలం వేస్తూ మీకు తప్పకుండా పదవులు వస్తాయంటూ భుజం తట్టి మరీ భరోసా ఇస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మచిలీపట్నం నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొనడం అటు అధికారులకు, ఇటు కార్యకర్తలకు తలనొప్పిగా మారిందనే వాదన వినబడుతోంది. మంత్రి కొల్లు రవీంద్ర మాట వినాలా లేక తానే మంత్రినని చెప్పుకునే టీడీపీ నాయకుడి మాట వినాలో తెలియక అధికారులు, టీడీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.