Direct Selling
-
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమతో భారీగా ఉద్యోగాలు
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ వల్ల భారీగా ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా వినియోగదారులకు, విక్రేతలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. అసోసియేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఆఫ్ ఇండియా (ఏడీఎస్‌ఈఐ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ (ఫిడ్సీ) సహకారంతో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కాన్క్లేవ్’లో ఆయన పాల్గొని మాట్లాడారు.‘ఈ పరిశ్రమ ద్వారా రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాలు సృష్టించవచ్చు. స్థానికంగా ఈ రంగం వృద్ధి చెందితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. ఈ పరిశ్రమలో సేవలందించే సంస్థలు నైతిక పద్ధతులను పాటిస్తూ స్థిరాభివృద్ధిపై దృష్టి సారించాలి. వినియోగదారులకు, విక్రేతలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ప్రభుత్వం పోత్సాహం అందిస్తుంది. రాష్ట్రంలో తయారీ యూనిట్లు స్థాపించేందుకు సంస్థలు ముందుకురావాలి. ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ విభాగంలో సేవలందించే సంస్థలకు అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుంది’ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ..‘పారదర్శకంగా వినియోగదారులకు ఉత్పత్తులు అందించడంలో ఈ పరిశ్రమ కీలకంగా మారనుంది. మోసపూరిత విధానాల నుంచి యూజర్లను రక్షిస్తూ, వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ద్వారా మెరుగైన సేవలందించేందుకు వీలుగా స్టేట్ మానిటరింగ్ కమిటీను త్వరలో ఏర్పాటు చేస్తాం. ఇది వినియోగదారులు, సంస్థల ప్రయోజనాలను కాపాడుతుంది’ అన్నారు. ఏడీఎస్‌ఈఐ అధ్యక్షుడు సంజీవ్ కుమార్ మాట్లాడుతూ..‘డైరెక్ట్ సెల్లింగ్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వంతో జతకట్టడం సంతోషకరం. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సహకారం నెలకొల్పేందుకు ఈ సదస్సు వేదికగా నిలిచింది’ అన్నారు.ఈ సందర్భంగా ఏడీఎస్‌ఈఐ, ఫిడ్సీ సంస్థలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అభివృద్ధికి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి తమ మద్దతు తెలుపుతామని ప్రకటించాయి. ఈ సమావేశంలో సామాజిక బాధ్యతను పెంపొందించడంపై దృష్టి సారించడంతో పాటు, భవిష్యత్తులో డైరెక్ట్ సెల్లింగ్ విభాగంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, డేటా అనలిటిక్స్ వినియోగంపై చర్చించారు.ఇదీ చదవండి: మానవ వనరులను ఆకర్షించడంలో విఫలంరిటైల్ వ్యాపారులు, దళారులు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తయారీదారుల నుంచి ఉత్పత్తులను వినియోగదారులకు అందించడమే ‘డైరెక్ట్ సెల్లింగ్’. భవిష్యత్తులో ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విధానంలో దళారులు లేకపోవడంతో తుది ఉత్పత్తులు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ విలువ ఏకంగా 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు)గా ఉంది. 2030 నాటికి ఈ పరిశ్రమ ఏటా 6.4 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా. -
2023 భారతదేశంలో టాప్ 10 బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్
-
డైరెక్ట్ సెల్లింగ్ పేరిట రూ.1000 కోట్ల దందా!
సాక్షి, హైదరాబాద్: డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో ప్రారంభమైన ఈ–స్టోర్ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల దందా సాగించినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ప్రధానంగా రెండు రకాలైన స్కీములతో అమాయకులను ఆకర్షించి భారీ స్కామ్‌కు పాల్పడినట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నగర కొత్వాల్ సీవీ ఆనంద్ తెలిపారు. డీసీపీ డాక్టర్ పి.శబరీష్, ఏసీపీ ఎన్.అశోక్ కుమార్‌లతో కలసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. యాక్సస్ ఈ–కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఆయుర్‌కేర్ హెల్త్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ–స్టోర్ ఇండియాను నిర్వహిస్తోంది. దీనికి హిమాయత్‌నగర్, మలక్‌పేట ప్రాంతాలకు చెందిన మనీష్ కత్తి, సయ్యద్ అజ్మల్ సజ్జద్ మార్కెటింగ్ ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద నమోదు చేసుకున్న యాక్సస్ ఈ కార్ప్ సంస్థ తమ స్కీమ్‌లకు ప్రభుత్వ అనుమతి ఉందని నమ్మబలుకుతూ నిరుద్యోగులకు ఎర వేస్తోంది. ఈ రెండు స్కీముల పేరుతో... ఇండివిడ్యువల్ డి్రస్టిబ్యూషన్ స్కీమ్ కింద అనేక మందిని ఈ–స్టోర్ ఇండియా సభ్యులుగా చేర్చుకుంది. ఎవరైనా రూ. 8,991 చెల్లించి సభ్యుత్వం తీసుకుంటే వారికి సంస్థ రూ. 9 వేల విలువైన ఆయుర్వేద ఉత్పత్తులు, కంపెనీ పేరుతో ఉన్న బోర్డు అందిస్తుంది. బోర్డును తమ ఇల్లు, దుకాణం ముందు తగిలించి ఆ ఫొటోను సంస్థకు పంపాలి. అప్పటి నుంచి కంపెనీ 36 నెలలపాటు నెలకు రూ. 1,100 చొప్పున ఇస్తామని చెప్పి పన్ను మినహాయింపుల తర్వాత రూ. 825 కొంతకాలం చెల్లిస్తుంది. ఈ సభ్యుడికి ఓ గుర్తింపు నంబర్ ఇచ్చి మరో రూ.9 వేల విలువైన ఈ–స్టోర్ ఉత్పత్తులను కొనేలా చేస్తుంది. అందుకు ప్రతిగా కొంతకాలం సభ్యుడికి చెల్లింపులు చేసి ఆపై బోర్డు తిప్పేస్తుంది. ఇక సూపర్ మార్కెట్ స్కీమ్‌లో పెట్టుబడి భారీగా ఉంటుంది. ఒక్కో వ్యక్తి రూ. 25 లక్షల చొప్పున చెల్లించి సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి అద్దె, మౌలికవసతులు, ఉద్యోగులను తామే ఏర్పాటు చేస్తామని కంపెనీ నమ్మబలుకుతుంది. వందల మంది నుంచి రూ. కోట్లు.. ఈ సంస్థ స్కీముల్లో చేరి దేశవ్యాప్తంగా అనేక మంది రూ. వందల కోట్లు నష్టపోయారు. ఇప్పటివరకు రూ. 1000 కోట్ల దందా చేసిన ఈ–స్టోర్ ఇండియా 300 మందిని ముంచింది. వారిలో రాష్ట్రానికి చెందిన 44 మంది కూడా ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు 9 మందిని నిందితులుగా గుర్తించి మనీష్, అజ్మల్ సజ్జద్‌లను అరెస్టు చేశారు. -
ఆమ్వే, ఓరిఫ్లేమ్, టప్పర్‌వేర్.. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు షాక్ !
Direct Selling New Guidelines In India 2021: నేరుగా విక్రయాలు సాగించే కంపెనీలు (డైరెక్ట్ సెల్లింగ్) పిరమిడ్, నగదు చలామణి పథకాలను నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం నోటిఫై చేసింది. దీంతో 90రోజుల్లోగా కొత్త నిబంధనలను కంపెనీలు అమల్లో పెట్టాలి. ఈ కంపెనీలు తాము విక్రయించే ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలి. టప్పర్‌వేర్, ఆమ్వే, ఒరిఫ్లేమ్ ఇవన్నీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలే. ఈ కంపెనీల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వీటి వలన ఆర్థిక, వినియోగదారుల మార్కెట్లో పోంజి స్కీమ్స్ అరికట్టవచ్చని నిపుణులు అంటున్నారు. ఆహ్వానిస్తున్నాం ప్రభుత్వం విధించిన నూతన నిబంధనలు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఆహ్వానించాయి. డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ చైర్మన్, ఆమ్వే ఇండియా, కార్పోరేట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ రజత్ బెనర్జీ స్పందిస్తూ.. ప్రభుత్వం విధించిన నూతన నిబంధనలు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌పై ఆధారపడి దేశంలో 70 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, ఇందులో సగం మంది మహిళలే అన్నారు. ప్రభుత్వం రెండేళ్లుగా ఈ విధానంపై అధ్యయనంపై చేసి తాజా నిబంధనలు రూపొందించిందన్నారు. దీని వల్ల డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌పై ఉన్న అపోహలు తొలగిపోతాయని ఆశిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కీలక నిబంధనలు ఇలా - డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు పిరమిడ్ తరహా నగదు చెల్లింపు పథకాలను అమలు చేయకూడదు - ఆమ్వే వంటి కంపెనీలు తమ ఉత్పత్తులను ఈ కామర్స్ సైట్లలో అమ్ముకోవచ్చు. అయితే కన్సుమర్ ప్రొటెక్షన్ రూల్స్ - 2020( ఈ కామర్స్) నిబంధనలు పాటించాలి - డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న సంస్థలను నియంత్రించేందుకు సమర్థవంతమైన వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలి. - డైరెక్ట్ సెలింగ్ వ్యాపారంలో ఉన్న కంపెనీలు ఇండియాలో కచ్చితంగా ఒక రిజిస్ట్రర్ ఆఫీసును భౌతికంగా కలిగి ఉండాలి - వారి ఉత్పత్తుల నాణ్యతకు అమ్మందారులు బాధ్యత వహించాలి చదవండి:ఆర్బీఎల్ బ్యాంకు ఖాతాదారులకు అండగా ఆర్బీఐ -
మహిళలే మహారాణులు,డెరెక్ట్ సెల్లింగ్లోకి 53 లక్షల మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 మహమ్మారితో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అదే సమయంలో కొత్త అవకాశాలను వెతుక్కున్నారు. ఇందులో డైరెక్ట్ సెల్లింగ్ రంగం ఒకటి. 2020 ఏప్రిల్–సెప్టెంబరు కాలంలో దేశవ్యాప్తంగా ఈ పరిశ్రమలోకి ఏకంగా 53.18 లక్షల మంది ప్రవేశించారని ఐడీఎస్ఏ చెబుతోంది. డైరెక్ట్ సెల్లింగ్ విపణిలో 2019–20లో దేశవ్యాప్తంగా 74 లక్షల మంది చురుకైన విక్రేతలు ఉన్నారు. ఇది వార్షికంగా 30% పెరుగుదల. 2019–20 గణాంకాల ప్రకారం అమ్మకందార్లలో సగం మంది మహిళలు ఉండడం గమనార్హం. -
వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ
డెరైక్ట్ సెల్లింగ్‌పై కేంద్రం మార్గదర్శకాలు న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ దిశలో కేంద్రం సోమవారం కీలక చర్య తీసుకుంది. డెరైక్ట్ సెల్లింగ్‌కు సంబంధించి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. డెరైక్ట్ సెల్లింగ్, మల్టీ-లెవిల్ మార్కెటింగ్ నియంత్రణ లక్ష్యంగా... పిరమిడ్ స్ట్రక్చర్స్, అలాగే మనీ సర్కులేషన్ స్కీమ్స్ నిషేధిస్తూ తాజా మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఆహారం, వినిమయ వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ ‘‘డెరైక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ 2016 ఫ్రేమ్‌వర్క్’ను విడుదల చేశారు. ఆమోదం నిమిత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపినట్లు వెల్లడించారు. డెరైక్ట్ సెల్లింగ్‌ను విస్పష్టంగా ఈ మార్గదర్శకాల్లో నిర్వచించడం జరిగిందనీ, పిరమిడ్, మనీ సర్క్యులేషన్‌తో దీనికి గత వ్యత్యాసాన్ని మార్గదర్శకాలు స్పష్టం చేశాయని తెలిపారు. దీనివల్ల మోసాల విచారణలో అధికారులు మరింత పటిష్టంగా వ్యవహరించగలుగుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెరైక్ట్ సెల్లింగ్‌లో వస్తువుల మార్కెటింగ్, పంపిణీ, అమ్మకాలతో పాటు నెట్‌వర్క్‌లో భాగంగా సేవలూ వినియోగదారులకు అందుతాయని మార్గదర్శకాలు వివరించాయి. పరిశ్రమ వృద్ధికి తోడ్పాటు: ఐడీఎస్ఏ తాజా మార్గదర్శకాలు డెరైక్ట్ సెల్లింగ్ రంగం పటిష్ట వృద్ధికి దోహదపడతాయని సంబంధిత ప్రాతినిధ్య సంస్థ- ఐడీఎస్ఏ పేర్కొంది. వినియోగదారులు వాస్తవ, మోసపూరిత పథకాలను గుర్తించడానికి ఇవి వీలు కల్పిస్తాయని డీఎస్ఏ చైర్మన్ జితేంద్ర జగోటా తెలిపారు. ఫిక్కీ ఇటీవలి నివేదిక ప్రకారం డెరైక్ట్ సెల్లింగ్ రంగం ప్రస్తుత విలువ రూ.7,500 కోట్లు. ఐదేళ్ల క్రితం ఈ విలువ రూ.4,100 కోట్లు. 2025 నాటికి ఈ రంగం విలువ రూ.64,500 కోట్లకు పెరుగుతుందని అంచనా, తద్వారా 14.50 లక్షల మందికి ఈ రంగం ఉపాధి కల్పించనుంది. -
75 బిలియన్ డాలర్లకు ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్!
2014-15లో ఏపీ, తెలంగాణలో 3.5 బిలియన్ డాలర్లు 2025కల్లా 50 బి. డాలర్లకు చేరే చాన్స్ డెరైక్ట్ సెల్లింగ్‌పై ఫిక్కీ నివేదిక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ కంపెనీలేవైనా తమ తొలి ఉత్పత్తులను దక్షిణాదిలోనే ప్రారంభిస్తాయి. అందుకే దేశంలో ఏటా ప్రత్యక్ష అమ్మకాల వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతుంది. దేశంలో 2009-10లో 41 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్ 2014-15 నాటికి 75 బిలియన్ డాలర్లకు చేరిందని ఫిక్కీ, కేపీఎంజీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో తేలింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో ‘ప్రత్యక్ష అమ్మకాలు- సవాళ్లు’ అనే అంశంపై ఫిక్కీ నివేదికను రూపొందించింది. ఇందులో భాగంగా ‘ప్రత్యక్ష అమ్మకాలు- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ’ రిపోర్ట్‌ను గురువారమిక్కడ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ రిటైల్ హెడ్ శిల్పా గుప్తా, ఫిక్కీ తెలంగాణ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఎండీ సఫిర్ అదేని, సివిల్ సప్లయర్స్ కమిషనర్ రజత్ కుమార్, ఇంటర్నల్ ట్రేడ్ డెరైక్టర్ జాకీర్ హుస్సేన్‌లు పాల్గొన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలివి.. {పత్యక్ష అమ్మకాలకు, కంపెనీలకు ఆమ్వే, అవాన్, హెర్బాలైఫ్, ఓరీఫ్లేమ్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఉత్పత్తులైన హెల్త్, బ్యూటీ ఉత్పత్తులు, హోమ్ నీడ్స్, కాస్మొటిక్స్, కిచెన్ వేర్స్ వం టివి ఉదాహరణ. ప్రస్తుతం ప్రపంచంలో ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్ 180 బిలియన్ డాలర్లుగా ఉంది. 2010లో ప్రత్యక్ష అమ్మకాల ఉద్యోగుల సంఖ్య 79 మిలియన్లుగా ఉంటే అది 2014 నాటికి 100 మిలియన్లకు చేరింది. ఇందులో మహిళల వాటా 75% మేర ఉంది. ఐదేళ్లుగా ఏటా 8.5 శాతం వృద్ధి రేటను కనబరుస్తుంది. ఆసియా పసిఫిక్ ప్రాం తంలో ప్రత్యక్ష అమ్మకాలతో 5.1 కోట్ల మంది ఉపాధిని పొందుతున్నారు.2013-14లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్ 3.3 నుంచి 3.5 బిలియన్ డాలర్లుగా ఉంది. వ్యాపారులు 29 మిలియన్ల మంది ఉన్నారు. 2025 నాటికి ఇది 50 బిలియన్లకు చేరుతుంది. ప్రత్యక్ష అమ్మకాలకు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం వంటి ఆర్బన్ ప్రాంతాలు బలాన్నిస్తున్నాయి. మొత్తం మార్కెట్లో 29 శాతం అంటే 22 బిలియన్ డాలర్లతో ఉత్తరాది ప్రాంతం తొలిస్థానంలో నిలవగా.. 25% వాటా.. 19 బిలియన్ డాలర్లతో దక్షిణాది ప్రాంతం రెండో స్థానంలో నిలిచింది.