doctors posts
-
AP: స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించబోతోంది. ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ)లో ఖాళీగా ఉన్న(319), ప్రమోషన్ల వల్ల ఖాళీ అయ్యే(126) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27 వరకు వాక్–ఇన్ ఇంటర్వూ్యలు చేపడుతోంది. శాశ్వత, కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 48 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. ఇదే క్రమంలో ఏపీవీవీపీ స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు రెండుసార్లు వాక్–ఇన్ ఇంటర్వూ్యలు నిర్వహించింది. ఇప్పుడు మరోసారి వాక్–ఇన్ ఇంటర్వూ్యలు చేపడుతోంది. విజయవాడలోని పాత జీజీహెచ్ ప్రాంగణంలో ఉన్న డీఎంఈ కార్యాలయంలో ఈ ఇంటర్వూ్యలు నిర్వహించనుంది. 23వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, డెర్మటాలజీకి సంబంధించి, 25వ తేదీన గైనకాలజీ, ఈఎన్టీ, అనస్తీషియా, పాథాలజీకి సంబంధించి, 27న పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. గిరిజన ఆస్పత్రుల్లో రూ.2.50 లక్షలు, గ్రామీణ ఆస్పత్రుల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంత ఆస్పత్రుల్లో రూ.1.30 లక్షల చొప్పున వైద్యులకు వేతనాలు ఇవ్వనున్నారు. గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించే ఉద్దేశంతో ప్రభుత్వం అధిక వేతనాలు ఇస్తోంది. మరిన్ని వివరాల కోసం www.hmfw.ap.gov.inను సందర్శించాలని, 6301138782 ఫోన్ నంబర్‌ను కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. -
వైద్యుల పోస్టుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య శాఖ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గత మూడేళ్లలో ఏకంగా 40,676 పోస్టుల భర్తీ చేపట్టింది. దీంతో పాటు వైద్య శాఖలో ఏర్పడిన ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకునేలా అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ)లలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(సీఏఎస్ఎస్) పోస్టుల భర్తీకి వైద్య శాఖ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో డీఎంఈలో 300కు పైగా, ఏపీవీవీపీలో 100కు పైగా పోస్టులు అభ్యర్థులు లేక మిగిలిపోయాయి. వీటిని వాక్–ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. ఈనెల 19, 20, 21 తేదీల్లో వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేశారు. స్పెషాలిటీల వారీగా డీఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు చేయనున్నారు. 19వ తేదీన కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జన్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఎండోక్రినాలజి, మెడికల్ గ్యాస్ట్రో–ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో–ఎంటరాలజీ, మెడికల్ అంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, నియోనాటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీకి సంబంధించిన పోస్టులకు ఇంటర్వ్యూ చేస్తారు. 20వ తేదీన న్యూక్లియర్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, అనస్తీషియా, ఓబీజీ, రేడియాలజీ/రేడియోడయగ్నోసిస్, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ పోస్టులకు.. 21వ తేదీన ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫోరెన్సిక్ మెడిసిన్, డెర్మటాలజి, పల్మొనాలజీ, ఎస్పీఎం, పాథాలజీ, ఈఎన్టీ పోస్టులకు వాక్–ఇన్ ఇంటర్వ్యూలు చేయనున్నారు. ఏపీవీవీపీలో సీఏఎస్ఎస్ పోస్టుల భర్తీకి.. ఏపీవీవీపీకి సంబంధించిన ఈనెల 19న అనస్తీషియా, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఫోరెన్సిక్ మెడిసిన్, రేడియాలజీ, 20వ తేదీన జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, సైకియాట్రి, 21న ఓబీజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, పాథాలజీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ పోస్టుల కోసం ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు వాటిని పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల్లోగా ఫలితాలు ప్రకటించి నియామక ఉత్తర్వులు అందజేస్తారు. డీఎంఈ పోస్టుల భర్తీకి సంబంధించిన మరిన్ని వివరాలకు dme.ap.nic.in, 7995055087, 9849902968 నంబర్లతో పాటు walkinrecruitmentdme@ gmail.comను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. ఏపీవీవీపీ పోస్టులకు సంబంధించిన వివరాలకు dme.ap.nic.in, 63011 38782, 9398344578 నంబర్లను,apvvpwalkinrecruitment@gmail. com మెయిల్‌ను సంప్రదించాలని కోరారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం ఓ యజ్ఞంలా నియామకాల ప్రక్రియ చేపడుతోంది. వాక్–ఇన్ ఇంటర్వ్యూల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శాశ్వత/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ ఉంటుంది. ఈ అవకాశాన్ని అర్హులైన వైద్యులు వినియోగించుకోవాలి. – డాక్టర్ వినోద్‌కుమార్, ఏపీవీవీపీ కమిషనర్, ఇన్చార్జ్ డీఎంఈ -
ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు
ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు ఏరియా, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల వరకు అన్నిచోట్లా డాక్టర్లు ఉన్నా, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుండటంతో వారి సేవలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలు, దిగువ మధ్య తరగతి రోగులకు సరిగా అందడం లేదు. కొందరు డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు రెండు మూడురోజులకోసారి వెళ్లి వస్తున్నారు. ఈ పరిస్థితిపై వైద్యశాఖ దృష్టి సారించింది. నిమ్స్‌లో పనిచేస్తున్న డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయవద్దన్న నిబంధన ఇప్పటికే ఉంది. అలాంటి నిబంధననే ప్రభుత్వ డాక్టర్లకు వర్తింపచేయాలని వైద్యశాఖ తొలుత నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు వర్తింపజేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కొత్తగా నియమితులయ్యే డాక్టర్లకు వర్తించేలా సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేయాలని భావిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దుతో పాటు మరికొన్ని సంస్కరణల దిశగా వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా చేయబోయే డాక్టర్ పోస్టుల భర్తీ సందర్భంగా సర్వీస్ రూల్స్‌ల్లో మార్పులు చేర్పులు చేయాలని, ఈ మేరకు ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలని వైద్యశాఖ వర్గాలు యోచిస్తున్నాయి. సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేశాక డాక్టర్ల పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. పేదలకు అందని వైద్యం ప్రభుత్వ వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రుల్లో ఉండాల్సి ఉన్నా, సొంత ప్రాక్టీస్ కారణంగా చాలామంది మధ్యాహ్నం వరకే ఉండి వెళ్లిపోతున్నారు. గాంధీ వంటి ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు కొందరు అక్కడికి సమీపంలోనే ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా వందలాది మంది ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుండటంతో, పేదలకు వైద్యం అందడం లేదని వైద్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కొందరు డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు రెండు మూడు రోజులకోసారి వెళ్లి వస్తున్నారు. హైదరాబాద్ వంటి చోట్ల ఉంటూ, ప్రభుత్వ సేవలను మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇష్టారాజ్యంగా సిజేరియన్లు దేశంలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. రాష్ట్రంలో ఎక్కువగా కరీంనగర్ జిల్లాలో సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. డబ్బులకు కక్కుర్తిపడి ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయి. సాధారణ ప్రసవానికి రూ.10 వేలు తీసుకుంటే, సిజేరియన్‌కు రూ.40 వేలు కనీసంగా వసూలు చేస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అవనసరంగా సిజేరియన్ ఆపరేషన్లు చేసే ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. సంబంధిత ఆపరేషన్‌లో పాల్గొనే డాక్టర్ రిజిస్ట్రేషన్ రద్దు చేసే ఆలోచనలో కూడా వైద్యశాఖ ఉంది. మరోవైపు కొందరు ముహూర్తాలు పెట్టి ఆ మేరకు సిజేరియన్ కాన్పులు చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు వైద్య వర్గాలకు సమాచారం అందింది. ఇందుకోసం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కూడా నిర్ణయించారు. ఆర్డీవోలు, ఐఏఎస్‌లకు బాధ్యతలు ఇటీవల ఎంజీఎం ఐసీయూలో ఒక రోగిని ఎలుకలు కరవడాన్ని (తర్వాత నిమ్స్‌లో చనిపోయాడు) వైద్యశాఖ వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. కిందినుంచి పైస్థాయి వరకు అనేక లోపాలు ఇందుకు కారణమని భావిస్తున్నాయి. ముఖ్యంగా అనేక ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో పారిశుధ్య లోపం ప్రధానంగా ఉంది. మరోవైపు రోగులు ఆసుపత్రులకు వెళితే వారిపట్ల సిబ్బంది వ్యవహరించే తీరు విమర్శలకు తావిస్తోంది. డాక్టర్లే ఆసుపత్రుల సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తుండటంతో వారికి పరిపాలనా అనుభవం ఉండటం లేదు. ఈ కారణంగానే ఆసుపత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏరియా, జిల్లా ఆసుపత్రుల పరిపాలన బాధ్యతను ఆర్డీవోలకు అప్పగించాలని వైద్య ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. వారిని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా నియమించే అవకాశముంది. గాంధీ, కాకతీయ వంటి బోధనాసుపత్రుల నిర్వహణ, పరిపాలన బాధ్యతలను ఐఏఎస్ స్థాయి అధికారులకు అప్పగించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి బాధ్యతను ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ వాకాటి కరుణకు అప్పగించారు. సీసీ కెమెరాలతో నిఘా డాక్టర్లు పీహెచ్‌సీలకు వెళ్లేలా పకడ్బందీ చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసినా వాటిని పాడుచేసి డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పీహెచ్సీలో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డాక్టర్, నర్సు, లేబరేటరీ ఫార్మసిస్ట్ ఉండే గదుల్లో వీటిని అమర్చుతారు. ఈ మేరకు కొన్నిచోట్ల ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 900కు పైగా ఉన్న పీహెచ్సీ, యూపీహెచ్సీల కెమెరాలన్నింటినీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మొబైల్ ఫోన్లకు లింక్ చేస్తారు. దీంతో ఏ పీహెచ్సీనైనా వారు తమ మొబైల్ ఫోన్‌ద్వారా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. మరికొన్ని కీలక నిర్ణయాలు.. – ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన శానిటైజేషన్ కాంట్రాక్టులన్నీ రద్దు చేయాలని నిర్ణయం. కొత్త కాంట్రాక్టులకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తారు. – గాంధీ, ఉస్మానియా సహా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ప్రైవేట్ మందుల దుకాణాలను ఎత్తివేయాలని నిర్ణయం. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు ప్రైవేట్ దుకాణాలు ఎందుకని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. – గ్రామాల్లో ఆర్థో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. మోకాళ్ల నొప్పులున్న వారిని గుర్తించి వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాళ్ల మార్పిడి లేదా చికిత్సలు చేస్తారు. – ఒక్క గాంధీలోనే దాదాపు 60 మంది వరకు అనెస్థీషియా డాక్టర్లు ఉన్నారు. ఇతర స్పెషలిస్ట్ వైద్యులు కొన్నిచోట్ల ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల డాక్టర్ల క్రమబద్ధీకరణ చేపడతారు. – ప్రతి నెలా ఆసుపత్రుల నిర్వహణపై నివేదిక రూపొందిస్తారు. ఆ ప్రకారం సమీక్ష చేస్తారు. – ప్రభుత్వ ఆధ్వర్యంలో సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా ప్రైవేట్ దోపిడీకి చెక్ పెడతారు. – నిమ్స్, గాంధీల్లో కొత్తగా 250 పడకల చొప్పున మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రులను (ఎంసీహెచ్) నెలకొల్పుతారు. -
నిమ్స్ 'ఖాళీ'!
దేశంలోని ఎయిమ్స్ సహా పలు జాతీయ వైద్య కళాశాలల్లో వైద్యుల పదవీ విరమణ వయసు 67 నుంచి 70 ఏళ్లు.. ఉస్మానియా, గాంధీ సహా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్లు.. కానీ.. ఎయిమ్స్‌కు అనుబంధంగా కొనసాగుతున్న నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యుల పదవీ విరమణ వయసు మాత్రం 60 ఏళ్లే.. దీంతో ఈ ఆస్పత్రిలో మంచి హస్తవాసి, పేరున్న వైద్య నిపుణుల సేవలు రోగులకు అందడంలేదు. వీరి పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో కీలకమైన కిడ్నీ, గుండె, కాలేయ మార్పిడి చికిత్సలు ప్రశ్నార్థకమవుతున్నాయి. ఈ వైద్యసంస్థలో వచ్చే జూలై చివరి నాటికి 12 మంది, 2022 నాటికి మరో 30 మంది సీనియర్ వైద్యులు రిటైర్డ్ కానున్నారు. సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో వైద్యుల పోస్టులు ఒక్కొక్కటే ఖాళీ అవుతున్నాయి. నెలకు సగటున ఇద్దరు వైద్యులు పదవీ విరమణ చేస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ వేతనాలు తక్కువగా ఉండటంతో మరికొందరు వైద్యులు బయటి వేతనాలకు ఆశపడి ఆస్పత్రిని వీడుతున్నారు. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ఆస్పత్రి యాజమాన్యం నోటిఫికేషన్లు ఇస్తున్నా.. ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. వచ్చిన వారు కూడా రెండు మూడేళ్లకే వెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులు కూడా వీరిని ఆపే యత్నం చేయడంలేదు. ఫలితంగా 311 పోస్టులకు 133 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్, అడిషనల్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భారీగా ఖాళీ ఉండటంతో సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్యపైనే కాదు.. రోగుల చికిత్సపైనా ప్రభావం చూపుతోంది. సీనియర్ వైద్యులు లేకపోవడంతో ఆ భార మంతా రెసిడెంట్లపై పడుతుంది. చికిత్సల్లో వారికి సరైన అనుభవం లేక, కీలక సమయంలో చేతులెత్తేస్తున్నారు. పదవీ విరమణ చేసిన కొందరు సీనియర్ వైద్యులు ఆ తర్వాత కూడా ఇక్కడ పనిచేసేందుకు సుముఖంగా ఉన్నా.. యాజమాన్యం విముఖత చూపుతోంది. జూనియర్లే పెద్దదిక్కు అంతర్గత విబేధాలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వచ్చిన ఆఫర్లతో ఇప్పటికే చాలామంది వైద్యులు నిమ్స్‌ను వీడిపోయారు. 60 ఏళ్లకే పదవీ విరమణ చేయాల్సి రావడంతో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు, మాజీ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్, డయాబెటిక్ నిపుణుడు వెంకటేశ్వరరావు, డాక్టర్ నరేందర్, డాక్టర్ సుభాష్‌కౌల్, డాక్టర్ జీఎస్‌ఎన్‌రాజు సహా పలువురు ఆస్పత్రికి దూరమయ్యారు. న్యూరో ఫిజీషియన్ విభాగాధి పతి డాక్టర్ వీణాకుమారి ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. జూలై చివరికి యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాంరెడ్డి సహా సీటీ సర్జన్ ఆర్వీకుమార్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బీరప్ప, డాక్టర్ జోత్స్న, డాక్టర్ ఉషారాణి, డాక్టర్నాగేశ్వరరావు తదితరులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయా విభాగాలకు ఇక జూనియర్ వైద్యులే పెద్దదిక్కు కానున్నారు. ఇప్పటికే సీనియర్లు లేక రుమటాలజీ, హెమటాలజీ, ఎండోక్రైనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ సహా పలు విభాగాల్లో చికిత్సలు గగనమయ్యాయి. ఆయా విభాగాలపై ఆధారపడిన రోగులతోపాటు సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. రెసిడెంట్లపైనే భారమంతా.. పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ ట్రైనింగ్ సెంటర్లలో నిమ్స్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైంది. 1986లో దీని పడకల సామర్థ్యం 500 కాగా, ప్రస్తుతం 1,500కి చేరింది. ప్రస్తుతం ఇక్కడ వివిధ విభాగాల్లో 423 మంది రెసిడెంట్ డాక్టర్లు చదువుతున్నారు. రోగుల తాకిడి పెరగడం, వారి నిష్పత్తికి తగిన వైద్యులు లేకపోవడంతో రెసిడెంట్లపై భారం పడుతోంది. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు పనిచేయా ల్సి వస్తుంది. ‘నిమ్స్‌లో రోగులకు ఇంకా సేవచేసే ఓపిక ఉంది! మరికొంత కాలం పనిచేసే అవకాశమివ్వండి’ అని పలువురు నిపుణులు నిమ్స్ పాలకమండలికి మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకపోతోంది. దీనిపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. ‘ఒకటి రెండు రోజుల్లో పాలక మండలి సమావేశం ఉంది. వైద్యుల పదవీ విరమణ వయసు పెంపుపై ఇందులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. పేరు గొప్ప.. అన్నింటా తీసికట్టు - నిమ్స్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ముఖ్యమంత్రే దీనికి ఛాన్సలర్‌గా ఉంటారు. - ఎయిమ్స్ నిబంధనల ప్రకారం ఇక్కడ నియామకాలు, పదోన్నతులు ఉంటా యి. ఉస్మానియా, గాంధీలో త్రిటైర్ విధానం అమల్లో ఉండగా, నిమ్స్‌లో ఫోర్టైర్ విధానం అమల్లో ఉంది. - ఉస్మానియాలో అసిస్టెంట్ కేడర్‌లో చేరిన ఓ వైద్యుడు ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫె సర్, చివరకు ప్రొఫెసర్ కేడర్‌కు చేరుకుంటారు. ఇందుకు తొమ్మిదేళ్లు పడుతుంది. - నిమ్స్‌లో అసిస్టెంట్ కేడర్‌లోని వైద్యు డు అసోసియేట్, అడిషనల్ ప్రొఫె సర్ కేడర్లను దాటుకుని ప్రొఫెసర్ కేడర్‌కు చేరుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రొఫెసర్ కేడర్ రావడానికి 12 నుంచి 14 ఏళ్లు పడుతోంది. - ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేసుకునే అవకాశముంది. ఆరోగ్యశ్రీ ఇంటెన్సివ్స్ కూడా వీరికి అందుతాయి. కానీ నిమ్స్ వైద్యుల బయటి ప్రాక్టీస్ నిషేధం. ఆరోగ్య శ్రీ ఇంటెన్సివ్స్ కూడా వీరికి అందవు. కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులతో పోలిస్తే వీరి వేతనాలు చాలా తక్కువ. -
వైద్యం... చోద్యం!
గుంటూరు మెడికల్ : జిల్లావ్యాప్తంగా 77 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), 680 ఉప ఆరోగ్య కేంద్రాలు, 17 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలు వైద్యసేవలు అందించే ఆరోగ్య కేంద్రాలు 32 ఉన్నాయి. ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు 177 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను మంజూరు చేయగా 43 ఖాళీలు ఉన్నాయి. పుష్కరకాలంగా వైద్యుల పోస్టులు భర్తీ కాక, ఉన్న వైద్యులు పని భారంతో అల్లాడిపోతున్నారు. స్పెషాలిటీ వైద్యుల పోస్టులను ఆరు కేటాయించగా కేవలం ఒక్క వైద్యుడు మాత్రమే పనిచేస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులు 21 ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే రోగులకు మందులు ఇచ్చేందుకు ఫార్మసిస్టులు కూడా లేని ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయంటే ఎలాంటి దుస్థితి నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫార్మసిస్టులు 88 పోస్టులకు 52 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. రక్తపరీక్షలు చేసి జ్వరం ఉందా లేదా అని నిర్ధారించి చెప్పేందుకు ల్యాబ్ టెక్నిషియన్లు కూడా లేకపోవటంతో గ్రామీణు రోగులకు కష్టాలు తప్పటం లేదు. 35 ల్యాబ్ టె క్నిషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఏఎన్ఎం పోస్టులు ... గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఆరోగ్య కార్యక్రమాల గురించి వివరించి రోగాల బారిన పడకుండా అవగాహన కల్పించటంలో కీలకమైన ఏఎన్ఎం పోస్టులు కూడా అధిక సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం 679 పోస్టులు కేటాయించగా 126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 553 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏళ్లతరబడి చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నారు. మల్టీపర్పస్‌హెల్త్ వర్కర్ పోస్టులు 447 ఖాళీగా ఉండగా, 200 మంది కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్నారు. నాల్గవ తరగతి ఉద్యోగుల పోస్టులు 133, డ్రైవర్ పోస్టులు 18, అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్ పోస్టులు 39 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్లకు చెందిన 3,677 పోస్టులను ప్రభుత్వం కేటాయించగా 947 ఖాళీగా ఉన్నాయి. సమయపాలన పాటించరు... పని చేసే చోటే నివాసం ఉండాలనే నిబంధనను ఏ ఒక్కరూ పాటించడం లేదు. ఉదయం 10 గంటలకు రావాల్సిన వైద్యులు, సిబ్బంది మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఆసుపత్రులకు చేరుకోవడం లేదు. తిరిగి 2 గంటలకు ఇళ్లకు పయనమవుతు న్నారు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు నర్సులు, ఆయాలే వైద్య చికిత్సలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు. 24 గంటలు వైద్యసేవలు అందించే ఆరోగ్య కేంద్రాల్లో రాత్రి వేళల్లో వైద్యం అంతంత మాత్రంగానే ఉంది. పారిశుద్ధ్యం చెప్పకోతగిన రీతిలో ఉండటం లేదు. మూత్రశాలలు రోగులు వినియోగించేందుకు ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సమ స్యలపై స్పందించి నాణ్యమైన వైద్యసేవలు అందించేలా కృషి చేయాలని రోగులు కోరుతున్నారు. -
572 మంది వైద్యుల భర్తీకి జీవో జారీ: కామినేని
కొవ్వూరు(పశ్చిమగోదావరి): రాష్ట్రంలో 572 వైద్యుల పోస్టులను భర్తీకి సంబంధించి శుక్రవారం జీవో జారీ చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో నిర్మించిన పీహెచ్సీ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 572 పోస్టుల భర్తీతో వైద్యుల కొరత చాలావరకు తీరిపోతుందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకంలో ఇప్పటివరకు ఉన్న 930 వ్యాధులకు అదనంగా మరో వంద రకాల వ్యాధులను చేర్చినట్టు చెప్పారు. -
‘ప్రాథమిక ఆరోగ్యం’ విలవిల
సిబ్బంది లేక.. రోగుల అవస్థలు భర్తీకాని 325 వైద్య ఖాళీలు పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రులకు వెళ్లిన 125 మంది వైద్యులు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందిలేక రోగులు నానా తిప్పలు పడుతున్నారు. వైద్య విద్యా సంచాలకుల పరిధిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఇన్ సర్వీస్ అభ్యర్థులను బోధనాసుపత్రులకు రావాలని నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సుమారు 125 మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులు డీఎంఈ ఆస్పత్రులకు వెళ్లారు. అంతకుముందే 200కు పైగా వైద్యుల(ఎంబీబీఎస్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 325 పోస్టులు ఖాళీలు ఉన్నట్టు ఆరోగ్య సంచాలకుల లెక్కల్లో తేలింది. అసలే 200 మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులు లేక అల్లాడుతున్న ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ఉన్న వైద్యుల్లో 125 మంది బోధనాస్పత్రులకు వెళ్లడం మరింతగా ఇబ్బందిగా మారింది. 120 సీహెచ్‌సీలకు.. 13 సీహెచ్సీల్లోనే వైద్యులు రాష్ట్రంలో డెరైక్టర్ ఆఫ్ హెల్త్(ఆరోగ్య సంచాలకులు) పరిధిలో 120 సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ) ఉన్నాయి. ఇవి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల గర్భిణులకు ప్రసవ కేంద్రాలుగా ఉండాలి. ప్రతి ఆస్పత్రిలోనూ అనస్థీషియా, పీడియాట్రిక్, గైనకాలజీ వైద్యుల బృందం ఉండాలి. కానీ 120 సీహెచ్‌సీలకు పదమూడింటిలోనే ముగ్గురు వైద్యుల బృందం ఉన్నట్టు తేలింది. మిగతా 107 సీహెచ్‌సీల్లో వైద్యుల కొరత ఉంది. సుమారు 20 సీహెచ్‌సీల్లో ముగ్గురు వైద్యులూ లేనివి ఉన్నాయి. ఇక్కడ కేవలం ఎంబీబీఎస్ వైద్యులే ఉంటున్నారు. నవంబర్‌లో నోటిఫికేషన్!: అక్టోబర్ 10లోగా సాధారణ బదిలీల ప్రక్రియ ముగుస్తుందని, ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 400కుపైగా వైద్య పోస్టులకు నవంబర్‌లో నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నాయి. -
నవంబర్‌లో పూర్తికానున్న వైద్యుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల నియామక ప్రక్రియ ఊపందుకుంది. 1,225 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 19 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినా.. నిబంధనల ప్రకారం వైద్యుల భర్తీ ప్రక్రియను నవంబర్‌లో పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 12 వేల దరఖాస్తులు రాగా, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 3 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలనకు ఆరోగ్యశాఖ 10 కమిటీలను నియమించింది. ఇప్పటివరకూ సుమారు 7 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. మిగిలిన దరఖాస్తుల పరి శీలనను నెలాఖరుకు పూర్తిచేసి, నవంబర్ మొదటి వారంలో పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో భర్తీ, పోస్టింగ్‌లు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరు సూత్రాల పథకం, రాష్ట్రపతి ఆదేశాలు, రిజర్వేషన్లు, జోనల్ రిప్రజెంటేషన్ అన్నీ పరిగణనలోకి తీసుకునే పోస్టింగ్‌లు ఇస్తామని ఉన్నతాధికారి చెప్పారు. -
రిమ్స్‌లో వైద్యుల పోస్టుల భర్తీ ప్రక్రియను అడ్డుకున్న: టీఆర్ఎస్
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : స్థానిక రిమ్స్ వైద్య కళాశాలలో వైద్యుల పోస్టుల భర్తీకి శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలకు తెలంగాణ సెగ తగిలింది. ఉదయమే అభ్యర్థులు అధిక సంఖ్యలో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, టీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌తో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడే వరకూ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టవద్దని ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు. ఇంటర్వ్యూల నిర్వహణకు హైదరాబాద్ నుంచి వచ్చిన అడిషనల్ డీఎంఈ డాక్టర్ రాజుతో మాట్లాడి ఇంటర్వ్యూలు నిలిపివేసే విషయమై చర్చించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తే ఈ ప్రాంత వైద్యులకు ప్రయోజనం చేకూరుతుందని, ఇప్పుడే నిర్వహిస్తే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు వచ్చే అవకాశాలు ఉంటాయని అడిషనల్ డీఎంఈకి వినతిపత్రం అందజేశారు. దీంతో ఇంటర్వ్యూలు నిలిపివేస్తున్నట్లు అడిషనల్ డీఏంఈ రాజు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ సీమాంధ్రులు కడప, శ్రీకాకుళం జిల్లాల్లోని రిమ్స్‌లో వైద్యుల ఇంటర్వ్యూలను అడ్డుకున్నారని, ఈ సమయంలో ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఆ ప్రాంతం వారు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కడప, శ్రీకాకుళం రిమ్స్‌లకు త్రైమాసిక బడ్జెట్ రూ.50 లక్షలకు పైగా విడుదల చేస్తే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి రూ.25 లక్షలు మాత్రమే విడుదల చేసి వివక్ష చూపారని తెలిపారు. రిమ్స్ వైద్యులతోపాటు, రిమ్స్ డెరైక్టర్ పోస్టులో కూడా తెలంగాణ వారే ఉండాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాజిదొద్దీన్, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బండారి సతీష్, మావల గ్రామ సర్పంచ్ రఘుపతి, టీఆర్ఎస్ నాయకులు బాదం గంగన్న, రామోజీ ఆంజనేయులు, కస్తాల ప్రేమల, ఆనంద్, ఉరుస్‌ఖాన్, సాయికృష్ణ పాల్గొన్నారు. -
ముందైతే నోటిఫికేషన్ ఇవ్వండి: ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో సందిగ్ధంలో పడిన వైద్యుల భర్తీపై ఆశలు మళ్లీ చిగురించాయి. వైద్యుల పోస్టుల నియామకాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నా ముందైతే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. వైద్యుల భర్తీ ఏపీపీఎస్సీ పరిధిలో లేకపోవడంతో నేరుగా ఆ శాఖలే నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టుకోవాలని పేర్కొంది. రాతపరీక్ష కాకుండా మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని ఆదేశాలిచ్చింది. గత నాలుగు రోజులుగా ఈ అంశంపై కసరత్తు చేసిన ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓకే చెప్పడంతో సెప్టెంబర్ 15వ తేదీలోగా నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పోస్టులు ఎన్ని..? ఆరోగ్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్)లను ఫీడింగ్ కేటగిరీగా పరిగణిస్తారు. 1,190పైగా సీఏఎస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేసేందుకు వీరిని నియమిస్తారు. బోధనాసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కూడా భారీగానే చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బోధనాసుపత్రుల్లో కలిపి 554 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ తర్వాత 251 అసోసియేట్ ప్రొఫెసర్లు, 230 ప్రొఫెసర్ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని వైద్య విద్యాశాఖ యోచిస్తోంది. అలాగే మరో 1,700 స్టాఫ్ నర్సుల పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ నియామకాలన్నీ పూర్తయితే గత నాలుగేళ్లలో ఇదే పెద్ద రిక్రూట్మెంట్ కానుంది. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తర్వాత ఇరు ప్రాంతాల ఉద్యోగుల్లో అంతరాలు ఏర్పడ్డాయి. వైద్యుల పోస్టులన్నీ రాష్ట్రస్థాయి పోస్టులు. ఉదాహరణకు విజయనగరం జిల్లాకు చెందిన వైద్యుడు మెరిట్‌పై హైదరాబాద్‌లో పోస్టింగ్ తీసుకుంటే ఇక్కడ గొడవలు వచ్చే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు. మెరిట్ ఆధారంగా జరిగే ఈ ప్రక్రియలో ఇన్‌సర్వీస్ (ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది) వారికి 15 శాతం వెయిటేజీ ఇస్తారు.