Dr Manmohan Singh
-
IND VS AUS 4th Test: నల్లటి ఆర్మ్ బ్యాండ్లతో టీమిండియా ప్లేయర్లు
బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు టీమిండియా ప్లేయర్లు నల్లటి ఆర్మ్ బ్యాండ్లతో బరిలోకి దిగారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohansingh) మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు ఎడమ చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించారు. 92 ఏళ్ల డాక్టర్ మన్మోహన్ సింగ్ వయో సంబంధిత సమస్యల కారణంగా గురువారం (డిసెంబర్ 26) రాత్రి 9:51 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004-14 మధ్యలో వరుసగా పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రణాళిక సంఘం చైర్మన్‌గా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి యావత్ భారతావణి నివాళులు అర్పిస్తుంది. కాగా, మెల్బోర్న్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. రెండో రోజు లంచ్ విరామం సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 454 పరుగులు చేసింది. రెండో రోజు తొలి సెషన్లో ఆసీస్ పాట్ కమిన్స్ (49) వికెట్ మాత్రమే కోల్పోయింది. స్టీవ్ 139 పరుగలతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా స్టార్క్ (15) క్రీజ్‌లో ఉన్నాడు.309/6 వద్ద ఆస్ట్రేలియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఆసీస్ బ్యాటర్లలో కాన్స్టాస్(60), ఖావాజా(57), లబుషేన్(72) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా 2, ఆకాష్ దీప్, సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు.స్టీవ్ స్మిత్ రికార్డు సెంచరీఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ రికార్డు సెంచరీతో మెరిశాడు. టెస్ట్‌ల్లో స్టీవ్‌కు భారత్‌పై ఇది 11వ సెంచరీ (43 ఇన్నింగ్స్‌ల్లో). ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు భారత్‌పై ఇన్ని టెస్ట్ సెంచరీలు చేయలేదు. స్టీవ్ తర్వాత ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ (10) భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేశాడు.టెస్ట్‌ల్లో 34వ సెంచరీస్టీవ్కు ఇది కెరీర్లో 34వ టెస్ట్ సెంచరీ. మెల్బోర్న్లో ఐదవది. టెస్ట్‌ల్లో స్టీవ్‌కు వరుసగా ఇది రెండో సెంచరీ. గబ్బా వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లోనూ స్టీవ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ తన సెంచరీ మార్కును 167 బంతుల్లో చేరుకున్నాడు. ఇందులో రెండు సిక్స్‌లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి.విరాట్ రికార్డును అధిగమించిన స్టీవ్టెస్ట్ల్లో స్టీవ్ విరాట్ పేరిట ఉన్న ఓ రికార్డును అధిగమించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బీజీటీలో స్టీవ్ ఖాతాలో 10 సెంచరీలు (41 ఇన్నింగ్స్‌లు) ఉండగా.. విరాట్ 9 (47 ఇన్నింగ్స్‌లు), సచిన్ 9 (65 ఇన్నింగ్స్‌లు), పాంటింగ్ 8 (51 ఇన్నింగ్స్‌లు), మైఖేల్ క్లార్క్ 7 సెంచరీలు (40 ఇన్నింగ్స్‌లు) కలిగి ఉన్నారు.గవాస్కర్, లారా సరసన స్టీవ్టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ 11వ స్థానానికి చేరాడు. స్టీవ్.. దిగ్గజాలు బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్, యూనిస్ ఖాన్, జయవర్దనే సరసన చేరాడు. స్టీవ్‌తో పాటు వీరంతా 34 టెస్ట్ సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది. -
జీడీపీ పతనంపై మాజీ ప్రధాని తీవ్ర అందోళన
ముంబై: భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వృద్ధి రేటు క్షీణతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఆర్థికమంత్రి కూడా అయిన మన్మోహన్ మరోసారి క్యూ2 జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడంపై స్పందించారు. ప్రభుత్వం తాజాగా విడుదలచేసిన గణాంకాల ప్రకారం క్యూ2లో జీడీపీ 4.5 శాతానికి పడిపోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉందన్నారు. వృద్ధి రేటు తగ్గుదల కేవలం ఆర్థిక వ్యవస్థకే కాకుండా సమాజానికి ఎంతో నష్టం చేకూరుస్తుందంటూ ట్విటర్లో పేర్కొన్నారు. దేశంలో 8నుంచి 9శాతం వృద్ధి రేటు నమోదుకావాల్సి ఉండగా 4.5శాతానికి పడిపోవడం విచారించదగ్గ విషయమన్నారు. ఆర్థిక విధానాల మార్పు ఏ విధంగాను సానుకూల ఫలితాలు ఇవ్వలేదన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా కేంద్రానికి ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలన్నా, ప్రస్తుత సమాజంలో ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కలగాలంటే 8 శాతం వృద్ధి రేటు నమోదవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆర్ధిక వ్యవస్థ బలోపేతంతో సమాజంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణాన్ని సానుకూలంగా మార్చవచ్చన్నారు. సమాజ స్థితి ఏ విధంగా ఉంటుందో ఆర్థిక వ్యవస్థ చూస్తే అర్థమవుతుందని స్పష్టం చేశారు. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు నమ్మకం, విశ్వాసం పూర్తిగా నశిస్తోందని ఆయన విమర్శించారు. మరోవైపు ఉపాధి రంగాలైన ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ పరిశ్రమలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మార్కెట్లో తిరిగి డిమాండ్ పుంజుకునేలా చొరవ చూపాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. "#GDP figures released today are as low as 4.5%.This is clearly unacceptable. Aspiration of our country is to grow at 8-9%. Sharp decline of GDP from 5% in Q1 to 4.5% in Q2 is worrisome. Mere changes in economic policies will not help revive the economy," says #ManmohanSingh pic.twitter.com/QweBGroiQY — Times of India (@timesofindia) November 29, 2019 -
ఎకానమీ ఎదిగేలా చేస్తాం..
వాషింగ్టన్ : దేశ ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోదీ సర్కార్ సవ్యంగా నిర్వహించడం లేదని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ప్రభుత్వానికి తాను ఏం చేయాలనేది తెలుసునని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో మాట్లాడే వారిని ఎవరూ అడ్డుకోలేరని, అయితే ఆర్థిక వ్యవస్థను ఎలా హ్యాండిల్ చేయాలన్నది ప్రభుత్వానికి తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. ఏయే రంగాలకు ఉత్తేజం కల్పించే చర్యలు అవసరమో తాము క్షుణ్ణంగా తెలుసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవేమనని అంగీకరించారు. ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగిందనేది గుర్తించే క్రమంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ల హయాంలోనే వీటికి బీజం పడిందన్నది వెల్లడైందని చెప్పారు. మన్మోహన్ సింగ్‌పై తనకు గౌరవం ఉందని, ఎవరినీ నిందించాలని తాము కోరుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అత్యంత పారదర్శకంగా ఎదుగుతుందని నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎకానమీపై తమ భరోసాను కాంగ్రెస్ పార్టీ శ్రద్ధగా వినాలని ఆమె చురకలు అంటించారు. కాగా భారత బ్యాంకుల దీనస్థితికి మన్మోహన్ సింగ్, రఘురామ్ రాజన్ల హయాంలో చేపట్టిన విధానాలే కారణమని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై డాక్టర్ సింగ్ స్పందించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం పక్కనపెట్టి ప్రత్యర్ధులపై నిందలు మోపడంలో నిమగ్నమైందని డాక్టర్ సింగ్ వ్యాఖ్యానించారు. -
సర్ధార్జీ పాక్ పర్యటన..
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నవంబర్ 9న పాకిస్తాన్ వెళ్లనున్నారు. కర్తార్‌పూర్ గురుద్వారను సందర్శించే తొలి యాత్రికుల బ్యాచ్‌లో నవంబర్ 9న పాల్గొనేందుకు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆహ్వానాన్ని మన్మోహన్ అంగీకరించారు. సుల్తాన్పూర్ లోధిలో భారత్ సరిహద్దు వద్ద జరిగే ప్రధాన కార్యక్రమంలోనూ మన్మోహన్ పాల్గొంటారు. కర్తార్‌పూర్‌ను సందర్శించే తొలి యాత్రికుల జాబితాలో మన్మోహన్‌తో పాటు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఆయన మీడియా సలహాదారు రవీన్ తక్రాల్ తదితరులున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీని గురువారం కలిసిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రధానిని కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా వ్యవహరించిన పదేళ్లలో ఎన్నడూ పాకిస్తాన్‌ను సందర్శించకపోవడం గమనార్హం. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావియన్స్‌లోని గా ప్రాంతంలో మన్మోహన్ జన్మించగా దేశ విభజన అనంతరం వారి కుటుంబం అమృత్‌సర్‌కు తరలివచ్చింది. మరోవైపు కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానిస్తామని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి ప్రకటించగా దీనిపై మన్మోహన్ సింగ్ అధికారికంగా స్పందిచాల్సి ఉంది. ఇక ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ము కశ్మీర్ పరిణామాలపై భారత్-పాక్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని విస్మరిస్తూ కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని పాక్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాక్ వెళ్లేది లేదు.. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభానికి తాము పాకిస్తాన్‌కు వెళుతున్నట్టు వచ్చిన వార్తలను పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తోసిపుచ్చారు. ఈ కారిడార్ ద్వారా తాను కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లే తొలి అఖిలపక్ష యాత్రకు సారథ్యం వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి పాకిస్తాన్ వెళతారని తాను భావించడంలేదని అన్నారు. -
స్లోడౌన్‌కు చెక్ : సర్దార్జీ చిట్కా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనానికి మోదీ సర్కార్ విధానాలే కారణమని విరుచుకుపడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తాజాగా స్లోడౌన్ నుంచి బయటపడేందుకు సలహాలతో ముందుకొచ్చారు. ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించి, జీడీపీ వృద్ధి పతనానికి దారితీస్తున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన మోదీ సర్కార్‌కు హితవుపలికారు. ఆర్థిక మందగమనం పర్యవసానాలను ప్రభుత్వం పూర్తిగా గ్రహించలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు జీఎస్టీ పన్ను రేట్లను హేతుబద్ధీకరించడంతో పాటు డిమాండ్‌ను పెంచే చర్యలు చేపట్టాలని చెప్పారు. వ్యవసాయ రంగ పునరుద్ధరణకు తోడ్పడేలా సేద్యానికి పరపతి సాయం పెంచాలని సూచించారు. ఉపాధి రంగాలైన ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ పరిశ్రమలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మార్కెట్లో తిరిగి డిమాండ్ పుంజుకునేలా చొరవ చూపాలని కోరారు. ఆర్థిక మందగమనానికి ప్రధాన కారణమైన నగదు కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రుణ లభ్యత, నగదు అందుబాటులో లేకపోవడంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుదేలైన తీరును ఆయన వివరించారు. అమెరికా-చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో ఎగుమతుల పెంపునకు అందివచ్చే నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రైవేట్ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు అవకాశాలను అన్వేషించాలని కోరారు. -
మన్మోహన్ వస్తున్నారు
దేశ ప్రధానమంత్రిగా 2004 నుంచి 2014 వరకు బాధ్యతలు నిర్వర్తించారు డా. మన్మోహన్సింగ్. ఈ పదేళ్లలో ఆయనను కొందరు ప్రశంసించారు. మరికొందరు విమర్శించారు. పదవీకాలం ముగిసిపోయే సమయంలో ఆయన జీవితంపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పుస్తకం విడుదల అయ్యింది. 2004 మే నుంచి 2008 ఆగస్టు వరకు మన్మోహన్‌సింగ్‌కు మీడియా అడ్వైజర్‌గా వర్క్ చేసిన సంజయ్‌బారు ఈ పుస్తకం రాయడం విశేషం. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్లో రూపొందుతున్న సినిమా‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. విజయ్ గుట్టే దర్శకత్వం వహిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. బోహ్రా బోస్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు. ‘‘సినిమాలో డా. మన్మోహన్ సింగ్ లుక్‌ని షేర్ చేయడం హ్యాపీగా ఉంది’’ అని అనుపమ్ పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 21న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. మరోవైపు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్కాశర్మ ముఖ్య తారలుగా నటిస్తున్న ‘జీరో’ చిత్రాన్ని ఇదే రోజున రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో.. బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పదన్న మాట. -
ఉర్జిత్‌ను కాపాడిన మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దును వ్యవస్థీకృత దోపిడీగా అభివర్ణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఆదుకున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పద్దని ఉర్జిత్ పటేల్‌కు సలహా ఇచ్చారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెబితే సెంట్రల్ బ్యాంకు స్వతంత్రతకు ముప్పు వస్తుందంటూ హెచ్చరించారట. అయితే ఆ ప్రశ్నలేమిటో తెలుసా? నగదు విత్డ్రాయల్స్పై ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆంక్షలను ఒకవేళ తొలగిస్తే గందరగోళాలన్నీ తొలగిపోతాయా.. 50 రోజుల్లో ఎన్ని పాత కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చాయంటూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బుధవారం ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నిస్తూ ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్రయత్నించింది. పార్లమెంటరీ కమిటీ ఈ ప్రశ్నలు అడిగిన వెంటనే మధ్యలో కల్పించుకుని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవద్దని ఉర్జిత్‌కు మన్మోహన్ సింగ్ సలహా ఇచ్చారట. హఠాత్తుగా నోట్లను రద్దు చేసిన అనంతరం తలెత్తిన పరిణామాలపై వివరణ ఇవ్వడానికి ఉర్జిత్పటేల్, ఆర్థికశాఖ అధికారులు నేడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ అడిగిన ఈ ప్రశ్నలకు ఉర్జిత్ సమాధానం ఇవ్వద్దని మన్మోహన్ సూచించారని తెలిసింది. సెంట్రల్ బ్యాంకు టాప్ బాస్‌గా పనిచేసిన మన్మోహన్, అనుభవపూర్వకంగా ఉర్జిత్‌ను ఆదుకున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకించిన మన్మోహన్, ఈ మేరకు సలహా ఇవ్వడం విశేషం. మన్మోహన్ సలహా మేరకు రద్దయిన ఎన్నినోట్లు వెనక్కి వచ్చాయి? నగదు పరిస్థితి ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తుందనే దానిపై ఉర్జిత్ పటేల్ సమాధానం ఇవ్వలేదు.