Egg production
-
2022–23లో గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నంబర్‌వన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. అలాగే ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలోనూ మొదటి స్థానం దక్కించుకుంది. ఇవేకాకుండా మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2023–24 సామాజిక, ఆరి్థక సర్వే ఈ వివరాలను వెల్లడించింది. 2022–23 ఆరి్థక ఏడాదిలో రాష్ట్రంలో పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని, తద్వారా రాష్ట్ర ఆరి్థక వ్యవస్థకు గణనీయంగా తోడ్పాటు లభించిందని సామాజిక, ఆరి్థక సర్వే పేర్కొంది. పెరిగిన ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణంఆయిల్పామ్ సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని సర్వే పేర్కొంది. ప్రస్తుతం 5.68 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు ఉండగా హెక్టార్‌కు ఉత్పత్తి 19.81 టన్నులుగా ఉందని తెలిపింది. 2022–23లో 18.95 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి కాగా 3.31 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉత్పత్తి అయినట్లు పేర్కొంది. గత మూడేళ్లలోనే 18 జిల్లాల్లో 124 కొత్త మండలాల్లో 42,098 రైతులు నూతనంగా 1,13,670 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటల పెంపకాన్ని చేపట్టారని తెలిపింది.రైతు భరోసా కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు.. ఆంధ్రప్రదేశ్ అత్యంత సంపన్న పశు సంపదను కలిగి ఉందని, దీంతో పశు సంవర్థక రంగం ప్రముఖ స్థానంలో ఉందని సామాజిక, ఆర్థిక సర్వే–2023–24 తెలిపింది. రైతు భరోసా కేంద్రాల్లో 6,542 మంది పశు సంవర్థక సహాయకులను నియమించడం ద్వారా పశువుల యజమానులకు అవసరమైన సేవలందించారని వెల్లడించింది. పశు వైద్యుల మార్గదర్శకత్వంలో పశు సంవర్థక సహాయకులు ప్రథమ చికిత్స వంటి సేవలను ఆందిస్తున్నారని వివరించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా 75 శాతం సబ్సిడీతో రైతులకు సరి్టఫైడ్ పశుగ్రాసం విత్తనాలను, 60 శాతం సబ్సిడీతో చాఫ్ కట్టర్లను పంపిణీ చేశారని వెల్లడించింది. అలాగే 2,02,052 మందికి పశు కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేసినట్లు పేర్కొంది. రైతుల ఇంటి వద్దే వెటర్నరీ సేవలను అందించేందుకు గత ప్రభుత్వం రెండు దశల్లో నియోజకవర్గానికి రెండు చొప్పున మొబైల్ అంబులేటరీ వెటర్నరీ క్లినిక్‌లను ఏర్పాటు చేసిందని సర్వే తెలిపింది. -
వేడికి ‘కోడి’ విలవిల!
సాక్షి, భీమవరం: మండుతున్న ఎండలు పౌల్ట్రీ పరిశ్రమకు గుబులు పుట్టిస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక ఫారాల వద్ద వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం కోళ్ల రైతులను కలవరపరుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోట్లలో నష్టం వాటిల్లి పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కోస్తాలోని ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుడ్లు పెట్టే లేయర్ కోళ్లు నాలుగు కోట్ల వరకు ఉండగా, ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కోటి వరకూ ఉన్నాయి. గుడ్లు పెట్టే దశకు చేరువలోని బ్రోయర్, చిక్స్ మూడు కోట్ల వరకు ఉంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో సాధారణంగా రోజుకు 60 నుంచి 80 కోళ్లు వరకు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఈ మరణాల సంఖ్య 450 నుంచి 500 వరకు చేరింది. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకూ తట్టుకుంటాయి. గత మూడు రోజులుగా 40 డిగ్రీలకు పైబడి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో ముందెన్నడూ లేనంతగా ఈ ఏడాది కోళ్ల మరణాలు పెరిగాయి. కోస్తా ప్రాంతంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. ఒక కోడి చనిపోవడం వల్ల రూ.250 వరకు నష్టం వాటిల్లుతుంది.. ఈ మేరకు గత మూడు రోజుల్లో రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల కోళ్లు చనిపోగా పరిశ్రమకు రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. పడిపోయిన గుడ్ల ఉత్పత్తి ఎండల తీవ్రత వల్ల గుడ్ల ఉత్పత్తి 15 శాతం మేర తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకు 4.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా వడగాలుల తీవ్రతకు ఆ ఉత్పత్తి 3.49 కోట్లకు తగ్గిపోయింది. డ్రాపింగ్ కారణంగా రోజుకు 61.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ.4.85 ఉండగా.. రోజుకు రూ.2.98 కోట్ల చొప్పున మూడు రోజుల్లో రూ.8.95 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లకు ఉపశమన చర్యలతో ఖర్చులు పెరిగిపోయాయి.వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులివ్వడం, ఫారాల్లో వాతావరణాన్ని చల్లబర్చేందుకు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు.. పెరిగిన మేత ధరలు, కూలి రేట్లతో నిర్వహణ భారం మారిందని కోళ్ల రైతులంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు గుడ్డు సరఫరా లేక స్థానిక వినియోగం తగ్గి గుడ్డుకు రైతు ధర పతనమవుతోందని చెబుతున్నారు.ప్రభుత్వం ఆదుకోవాలి.. ఎప్పుడూ లేనంతగా ఈసారి ఎండల తీవ్రతకు కోళ్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రభుత్వం ఆదుకోకుంటే కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుంది. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయిస్ గోదాముల్లోని మనుషులు తినడానికి పనికిరాకుండా నిల్వ ఉన్న గోధుమలు, మొక్కజొన్న, నూకలను తక్కువ ధరపై కోళ్ల రైతులకు ప్రభుత్వం అందజేయాలి. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
కౌజు పిట్టల పెంపకం.. తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం
-
కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో దేశంలోనే ఏపీది అగ్రస్థానం
-
కోడిగుడ్డు.. ఏపీ రికార్డు.. మొదటి 5 స్థానాలు ఈ రాష్ట్రాలవే..
సాక్షి, అమరావతి: కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత దేశంలో మూడో స్థానంలో ఉంది. మన దేశంలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ సర్వే–2022 వెల్లడించింది. దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో తలసరి గుడ్ల లభ్యత అత్యధికంగా ఉందని.. ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఏడాదికి తలసరి 501 గుడ్ల లభ్యతతో నంబర్–1 స్థానంలో ఉందని సర్వే వెల్లడించింది. గుడ్ల లభ్యతలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సర్వే పేర్కొంది. తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత 442 కాగా.. దేశవ్యాప్తంగా ఏడాదికి సగటు తలసరి గుడ్ల లభ్యత కేవలం 95 మాత్రమే ఉందని సర్వే పేర్కొంది. 1950లో ఏడాదికి 5 గుడ్లే 1950–51 కాలంలో ఏడాదికి తలసరి కోడిగుడ్ల లభ్యత మన దేశంలో కేవలం ఐదు మాత్రమే ఉండగా.. 1960–61లో కేవలం 7 మాత్రమే ఉంది. తొలిసారిగా 1968–69లో జాతీయ స్థాయిలో సగటు తలసరి గుడ్ల లభ్యత 10కి చేరిందని సర్వే పేర్కొంది. 2020–21లో జాతీయ స్థాయిలో ఏడాదికి తలసరి గుడ్ల లభ్యత 90 ఉండగా 2021–22లో 95కు చేరినట్టు వెల్లడించింది. మొదటి 5 స్థానాలు ఈ రాష్ట్రాలవే కాగా.. కోడిగుడ్ల ఉత్పత్తి విషయంలోనూ దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కోడిగుడ్ల లభ్యతలో నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడు గుడ్ల ఉత్పత్తిలో మాత్రం రెండో స్థానంలోను.. గుడ్ల లభ్యతలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఉత్పత్తిలో మాత్రం మూడో స్థానంలోనూ ఉన్నాయని సర్వే విశ్లేషించింది. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో టాప్ ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లోనే 64.56 శాతం గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని సర్వే వెల్లడించింది. దేశంలో 2021–22లో 129.60 బిలియన్ కోడిగుడ్లు ఉత్పత్తి కాగా.. వాణిజ్య పౌల్ట్రీల ద్వారా 109.93 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అయినట్టు, పెరటి పౌల్ట్రీల ద్వారా 19.67 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అయినట్టు సర్వే పేర్కొంది. రాష్ట్రంలో మూడేళ్లుగా (2019–20 నుంచి 2021–22) వరకు కోడిగుడ్ల ఉత్పత్తి పెరుగుతోందని సర్వే వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో పెరటి కోళ్ల సంఖ్య కూడా రెండేళ్లుగా పెరిగిందని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 2020–21లో పెరటి కోళ్ల సంఖ్య 1,23,70,740 ఉండగా.. 2021–22లో 1,31,69,200కు పెరిగినట్టు సర్వే స్పష్టం చేసింది. -
వెరీ‘గుడ్డు’.. దేశంలోని టాప్–5 రాష్ట్రాల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: పశుసంవర్థక రంగంలోని పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తిలో ఐదు రాష్ట్రాలు మంచి ఫలితాలు కనబరిచాయని నాబార్డు నివేదిక వెల్లడించింది. ఇవి కోవిడ్ సంక్షోభంలో ఈ ఘనత సాధించాయని తెలిపింది. గుడ్ల ఉత్పత్తిలో టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పశుసంవర్థక రంగం ఉత్పత్తుల వృద్ధిపై నాబార్డు తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాలు గుడ్ల ఉత్పత్తిలో 64.77 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో తెలంగాణ, నాల్గో స్థానంలో పశ్చిమ బెంగాల్, ఐదో స్థానంలో కర్ణాటక నిలిచాయి. ఏపీ ప్రభుత్వం కోవిడ్ సమయంలో పశు సంవర్థక, వ్యవసాయ కార్యకలాపాలు నిలిచిపోకుండా అవసరమైన చర్యలను తీసుకోవడంవల్లే ఈ ఘటన సాధించింది. అలాగే.. ♦మాంసం ఉత్పత్తి విషయానికొస్తే.. టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాల్గో స్థానంలో ఉంది. ♦పాల ఉత్పత్తిలో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. 2020–21లో ఏపీ సహా ఐదు రాష్ట్రాలు 52.70 శాతం వాటా కలిగి ఉన్నాయి. ♦అలాగే, మాంసం ఉత్పత్తిలో ఈ ఐదు రాష్ట్రాలు 57 శాతం వాటా కలిగి ఉన్నాయి. ♦దేశంలో పశువుల జనాభా 1951లో 155.3 మిలియన్లు ఉండగా 2019 నాటికి 193.46 మిలియన్లకు పెరిగింది. పశుసంవర్థక రంగం వాటా పెరుగుదల మరోవైపు.. వ్యవసాయ రంగంలో పశుసంవర్థక రంగం వాటా దేశంలో భారీగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. 1950–51లో వ్యవసాయ రంగం స్థూల విలువల జోడింపులో పశు సంవర్థక రంగం వాటా 17.95 శాతం ఉండగా 2020–21 నాటికి అది 30.13 శాతానికి పెరిగింది. వ్యవసాయ రంగం స్థిరత్వానికి పశువుల రంగం చాలా ముఖ్యమైనదిగా నివేదిక స్పష్టం చేసింది. చదవండి: ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది! గ్రామీణ ఆదాయ వృద్ధికి పశుపోషణ ప్రధాన చోదకశక్తి అని నివేదిక వ్యాఖ్యానించింది. అలాగే, రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు పశుసంవర్థక రంగంలో అధిక ప్రభుత్వ పెట్టుబడులు అవసరమని సూచించింది. పాలు, పాల ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని నివేదిక పేర్కొంది. ఇటీవల కాలంలో శాస్త్రీయ, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా దేశంలో పశువుల ఉత్పత్తిని పెంచినట్లు నివేదిక పేర్కొంది. -
మన గుడ్డు వైపు.. విదేశాల చూపు
సాక్షి, అమరావతి: భారత దేశ కోడి గుడ్లకు.. మరీ ముఖ్యంగా ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల గుడ్లకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. పలు దేశాలు కోడి గుడ్ల కోసం దక్షిణాది రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా కోడి గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో మలేసియా, తైవాన్, హాంకాంగ్, జపాన్ వంటి దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. మన రాష్ట్రంలో రోజుకు 5.5 కోట్ల కోడి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం దేశీయ గుడ్ల ఎగుమతుల్లో రాష్ట్రం వాటా సుమారు 20 శాతం ఉంది. ప్రస్తుత డిమాండ్‌తో ఇది మరింత పెరగనుంది. స్థానిక డిమాండ్‌కు తోడు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో గుడ్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఫాం గేటు వద్ద గుడ్డు ధర రూ.4.20 నుంచి రూ.5.60కి పెరిగింది. రిటైల్ మార్కెట్లో చాలా చోట్ల ధర రూ.7కు చేరింది. మలేసియా వంటి దేశాల్లో గుడ్డు ధర రూ.8.50 దాటడంతో ఎగుమతులపై రాష్ట్ర పౌల్ట్రీ రైతులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటివరకు సౌదీ అరేబియా వంటి దేశాలకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న రాష్ట్రం.. ఇప్పుడు మలేషియా, తైవాన్, హాంకాంగ్, జపాన్ వంటి దేశాల మార్కెట్లలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ధరలు పెరగడానికి కారణమిదే బర్డ్‌ఫ్లూ, ఏవియన్ ఫ్లూ వంటి వైరస్లు వ్యాప్తి చెందడంతో అమెరికా, జపాన్ వంటి దేశాల్లో కోళ్ల ఉత్పత్తిని నిలిపివేశారు. ఒక్క అమెరికాలోనే వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా 8 కోట్ల కోళ్లను చంపేశారు. జపాన్‌లో మరో కోటికిపైగా కోళ్లను చంపేశారు. దీంతో అంతర్జాతీయంగా కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని శ్రీనివాస హేచరీస్ ఎండీ సురేష్ చిట్టూరి ‘సాక్షి’కి తెలిపారు. ఇదే సమయంలో కోళ్ల దాణా వ్యయం భారీగా పెరగడంతో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కోళ్ల పెంపకనానికి విరామం ఇచ్చారు. మిగతా రాష్ట్రాల్లో ఉత్పత్తిని కొంత మేర తగ్గించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 45 లక్షల వరకు కోళ్ల ఉత్పత్తి తగ్గగా, ఆంధ్రా, తెలంగాణల్లో కలిసి 20 లక్షలకు పైగా ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో డిమాండ్‌కు తగినంతగా సరఫరా లేకుండాపోయింది. ఒక్క మహారాష్ట్రలోనే రోజుకు కోటికి పైగా గుడ్లకు కొరత ఉందని అధికారులు ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇవన్నీ రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులకు కలిసొచ్చే అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలోనూ భారీగా పెరుగుతున్న గుడ్డు వినియోగం దేశంలో తలసరి కోడి గుడ్డు వినియోగం పెరుగుతుండటం కూడా గుడ్ల ధరలు పెరగడానికి మరో కారణమని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దేశంలో గడిచిన 15 ఏళ్లలో కోడి గుడ్ల తలసరి వినియోగం మూడురెట్లు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2005లో దేశీయ తలసరి కోడిగుడ్డు వినియోగం 34 ఉండగా అది 2021కి 90 గుడ్లకు పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత కోడి గుడ్ల వినియోగం భారీగా పెరిగిందని సురేష్ తెలిపారు. కోవిడ్‌కు ముందు తలసరి గుడ్డు వినియోగం 70గా ఉంటే అది 90కి చేరినట్లు తెలిపారు. కానీ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశీయ తలసరి కోడిగుడ్ల వినియోగం 180కి చేరినప్పుడే పిల్లలు బలవర్థకంగా ఉంటారని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో గుడ్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచి, దేశీయంగా, విదేశాలకు ఎగుమతుల్లోనూ రాష్ట్ర రైతులు దూసుకుపోయే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
భారత్‌లో పాలు, మాంసానికి భారీ డిమాండ్.. నివేదికలో కీలక అంశాలు!
సాక్షి, అమరావతి: పాలు, మాంసం, గుడ్లు, చేపలు.. దేశంలో వినియోగం భారీగా పెరుగుతున్న ఆహారం. జనాభా పెరుగుదల, సంపన్నులు పెరుగుతుండటంతో ఈ డిమాండ్ ఇంకా భారీగా పెరుగుతుందని నాబార్డు అంచనా వేస్తోంది. 2050 నాటికి దేశ జనాభా 1.6 బిలియన్లు దాటే అవకాశం ఉందని, వీరిలో సగం మంది నగరాలు, పట్టణాల్లో నివసిస్తారని, సంపన్నుల సంఖ్యా పెరుగుతున్నందున వీటికి డిమాండ్ వేగంగా పెరుగుతుందని ‘పశువులు, వ్యవసాయ వృద్ధి – పేదరిక నిర్మూలన’పై నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి వినియోగం పెరుగుతోందని, గుడ్ల వాడకం మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది. భారతదేశం పశు సంవర్ధక రంగంలో డిమాండ్‌కు తగినట్లుగా వృద్ధి సాధిస్తోందని తెలిపింది. 2010–11 నుంచి 2019–20 మధ్య పశు సంవర్ధక రంగం రికార్డు స్థాయిలో 7.6 శాతం మేర వార్షిక వృద్ధి సాధించిందని వెల్లడించింది. వ్యవసాయ వృద్ధి కంటే ఇది రెండింతలు ఎక్కువని తెలిపింది. వ్యవసాయ వృద్ధిలో పశువుల రంగం వాటా 30 శాతం ఉందని పేర్కొంది. పేదరికాన్ని తగ్గిస్తున్న పశు సంవర్థక రంగం దేశంలో పేదరికాన్ని తగ్గించడంలో పశు సంవర్ధక రంగం ప్రభావం ఎక్కువ ఉంది. పశు పోషణ రంగంలో దేశంలో 70 శాతం కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు. మహిళా సాధికారతకు పశు పోషణ దోహదపడుతోంది. పశువుల ద్వారా వచ్చిన ఆదాయాన్నే మహిళలు ఇంటి బడ్జెట్‌కు వినియోగిస్తున్నారు. ప్రధానంగా ఈ ఆదాయాన్ని పిల్లల పోషకాహారం, ఆరోగ్యం, విద్యకు కేటాయిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పేదరిక నిర్మూలనకు దోహదపడే పశు సంవర్ధక రంగాన్ని, పశు పోషణను మరింతగా ప్రోత్సహించాలని నాబార్డు నివేదిక సూచించింది. ఆహార అలవాట్లలో మార్పు 1990–91 నుంచి మొత్తం జనాభా వృద్ధి రేటు 1.57 శాతంతో పోల్చితే పట్టణ జనాభా వృద్ధి రేటు 2.64 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. దేశ జనాభాలో మూడింట ఒక వంతు నగరాలు, పట్టణాల్లోనే నివశిస్తున్నారు. ఈ ప్రభావంతో ఆహార అలవాట్లలో మార్పు వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా పట్టణాల్లో తలసరి పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 10 శాతం పెరిగింది. గుడ్లు వినియోగం 13 శాతం, మాంసం, చేపల వినియోగం 25 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపల వినియోగం దాదాపు ఇదే స్థాయిలో పెరిగాయని పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో గుడ్ల వినియోగం చాలా వేగంగా 45.5 శాతం మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి దేశంలో పాల డిమాండ్ 65.2 శాతం, మాంసం డిమాండ్ 75.5 శాతం, గుడ్లకు డిమాండ్ 65.7 శాతం, చేపల డిమాండ్ 75.0 శాతం మేర పెరుగుతుందని నాబార్డు నివేదిక అంచనా వేసింది. -
ఏపీ వెరీ‘గుడ్డు’!
దేశవ్యాప్తంగా పండ్లు, కోడి గుడ్లు, చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ధాన్యం, మాంసం ఉత్పత్తిలో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2018–19లో పోల్చితే 2019–20లో ఈ ఉత్పత్తుల న్నింటిలో వృద్ధి నమోదైంది. వివిధ రాష్ట్రాల్లో 2012–13 నుంచి 2019–20 వరకు ఆహార ధాన్యాలు, పండ్లు, మాంసం, గుడ్లు, చేపల ఉత్పత్తి గణాంకాలపై ఆర్బీఐ ఇటీవల నివేదిక విడుదల చేసింది. – సాక్షి, అమరావతి మూడిట్లో మనదే పైచేయి పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో, మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. 2018–19తో పోల్చితే 2019–20లో రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తి 3,89,400 టన్నులు అదనంగా పెరిగింది. చేపల ఉత్పత్తిలో ఏపీ తరువాత రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. మూడో స్థానంలో గుజరాత్ ఉంది. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి 2018–19తో పోల్చితే 2019–20లో 1.82 లక్షల టన్నులు అదనంగా పెరిగింది. కోడి గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా తమిళనాడు రెండో స్థానం సాధించింది. తెలంగాణ మూడో స్థానం దక్కించుకుంది. ధాన్యం..బెంగాలే 2018–19తో పోల్చి చూస్తే 2019–20తో ఏపీలో కోడి గుడ్ల ఉత్పత్తి 217.3 కోట్లు ఎక్కువగా నమోదైంది. వరి ధాన్యం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో పశ్చిమబెంగాల్, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో పంజాబ్ ఉన్నాయి. ఒడిశా ఐదో స్థానంలో, తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నాయి. 2018–19తో పోల్చితే ఏపీలో 2019–20లో 4,24,200 టన్నులు అదనంగా ధాన్యం ఉత్పత్తి అయ్యింది. మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉండగా ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో, మహారాష్ట్ర రెండో స్థానంలో, పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉన్నాయి. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో ఉత్తర ప్రదేశ్, రెండో స్థానంలో రాజస్థాన్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్, నాలుగో స్థానంలో గుజరాత్ ఉన్నాయి. -
పడిపోతున్న 'గుడ్డు'
సాక్షి, అమరావతి బ్యూరో: కోడి గుడ్ల ధరలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. నెల రోజుల్లోనే వంద కోడిగుడ్ల ధర దాదాపు రూ.50 మేర పడిపోయింది. రాష్ట్రంలో రోజుకు సగటున ఐదు కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. పొరుగున ఉన్న తెలంగాణ, కర్నాటక, తమిళనాడుల నుంచి మరో కోటి గుడ్లు ఏపీకి దిగుమతి అవుతాయి. వీటిలో 2.50 కోట్ల గుడ్లను ఏపీ నుంచి ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రంలో స్థానికంగా 3.50 కోట్ల గుడ్లను వినియోగిస్తుంటారు. సాధారణంగా వాతావరణ ప్రభావంతో సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కోడిగుడ్ల వినియోగం పెరుగుతుంటుంది. దీంతో గుడ్ల ధర కూడా పైకి ఎగబాకుతుంది. కానీ ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా గుడ్ల ధర క్షీణిస్తుండడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో సెప్టెంబర్ 25న వంద గుడ్ల ధర రూ.441గా ఉండగా 30వ తేదీ నాటికి రూ.456కి చేరింది. అప్పటి నుంచి ధర క్రమంగా కిందకి పడిపోవడం మొదలైంది. ఈనెల 5వ తేదీ నాటికి రూ.431కి పడిపోయిన ధర.. 25వ తేదీకల్లా రూ.392కి క్షీణించింది. ఒడిశా, బెంగాల్ ఎఫెక్ట్.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆశ్వయుజ పౌర్ణమి నుంచి మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం బాగా తగ్గిపోయింది. అదే సమయంలో అక్కడ గుడ్ల ఉత్పత్తి మాత్రం పెరిగిపోయింది. ఫలితంగా ఆయా రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు గుడ్లను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి చేసే గుడ్లకు పోటీ ఏర్పడి.. ధర భారీగా పడిపోయింది. గత ఏడాది ధర వెరీ గుడ్.. గతేడాది ఇదే సమయానికి వంద గుడ్ల ధర రూ.500కి పైగా ఉంది. ప్రస్తుత సీజన్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాదితో పోలిస్తే వంద గుడ్ల ధర రూ.100కు పైగానే దిగజారిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. వంద గుడ్ల ధర రూ.470కి పైగా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ(నెక్) జోనల్ చైర్మన్ కుటుంబరావు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. -
గణనీయంగా పెరిగిన గుడ్లు, మాంసం ఉత్పత్తి
సాక్షి, అమరావతి: రాష్రంలో గుడ్లు, మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తి 15 శాతం, మాంసం ఉత్పత్తి 11.76 శాతం పెరిగాయి. 2019–20లో 8.50 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి కాగా 2020–21లో 9.54 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిందని పశుసంవర్ధకశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 2019–20లో 2,170.77 కోట్ల గుడ్లు ఉత్పత్తి కాగా 2020–21లో 2,496.39 కోట్లు ఉత్పత్తి అయినట్లు అంచనా వేశారు. 2020–21లో 147.13 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ అంచనాలను రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కేంద్రానికి పంపించింది. కేంద్రం ఆమోదిస్తే వాటి విలువ ఎంత అనేది కూడా తేలనుందని అధికారులు తెలిపారు. మరోపక్క తాజా గణాంకాల మేరకు రాష్ట్రంలో మొత్తం 3,40,68,177 పశుసంపద ఉంది. ఇందులో అత్యధిక పశుసంపద అనంతపురం జిల్లాలో 66.06 లక్షలుండగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 14.44 లక్షలు ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరగతి రైతుల వద్ద ఎక్కువగా పశుసంపద ఉంది. కరువు పరిస్థితుల్లో ఆ రైతులకు ప్రధాన ఆదాయవనరు పశుసంపదే. రాష్ట్రంలో మొత్తం 46,00,087 ఆవులు ఉండగా 62,19,499 గేదెలున్నాయి. 1,76,26,971 గొర్రెలుండగా 55,22,133 మేకలు ఉన్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో మేకలు, గొర్రెల సంపద గణనీయంగా పెరిగింది. గతంలో గొర్రెలు 135.60 లక్షలుంటే తాజా గణాంకాల ప్రకారం 176.26 లక్షలకు, మేకలు 44.96 లక్షల నుంచి 55.22 లక్షలకు పెరిగాయి. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలకు పాడిపశువులు రాష్ట్రంలో మరింత పాలు, మాంసం ఉత్పత్తి పెంచడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు జీవనోపాధి మెరుగుపరచడం ద్వారా ఆర్థికంగా వారి కాళ్లమీద వారే నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత ద్వారా ఆర్థికసాయం అందించింది. వారు కోరుకున్న మేరకు పాడి పశువులు, మేకలు, గొర్రెలు కూడా సమకూర్చేందుకు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు జగనన్న పాలవెల్లువ కింద 1,12,008 యూనిట్లను అందజేయాలని, అలాగే జగనన్న జీవక్రాంతి ద్వారా 72,179 యూనిట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 70 శాతం మేర యూనిట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. పాల ఉత్పత్తి పెంచేందుకు నాణ్యమైన దాణా రైతుభరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు నాణ్యమైన పశువుల దాణాను సబ్సిడీపై సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మినరల్, మిశ్రమ లవణాలు ఉన్న దాణాను సరఫరా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఉపాధి హామీ పథకం కింద 20 వేల ఎకరాల్లో 150 కోట్ల రూపాయలతో పశుగ్రాసం పెంచేందుకు చర్యలను చేపట్టాం. ఈ చర్యలతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. చేయూత మహిళలకు జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి ద్వారా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను రాష్ట్రం నుంచే సరఫరా చేస్తున్నాం. – అమరేంద్రకుమార్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ -
గడ్డు కాలం
* ఇతర రాష్ట్రాల్లో తగ్గిన గుడ్డు వినియోగం * స్థానిక ఎగుమతులపై ప్రభావం * రైతు వద్ద రూ.2.78లకు తగ్గిన ధర * వేసవితో 8 శాతం క్షీణించిన ఉత్పత్తి * రోజుకు సుమారు రూ.87.2 లక్షల నష్టం * మునుముందు మరింత గడ్డుకాలం మండపేట : మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన తయారైంది జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి. సీజన్లో గుడ్డు ధర తీవ్ర నిరాశపరిస్తే తాజాగా పరిశ్రమకు వేసవి బెడద పట్టుకుంది. గుడ్డు ధర పతనమవుతోంది. వేసవి గుబులుతో గుడ్ల ఉత్పత్తి ఎనిమిది శాతం మేర పడిపోయింది. మునుముందు 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కానుండటంతో మరింత కష్టకాలం తప్పదని పౌల్ట్రీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తగ్గిన ఉత్పత్తి, పతనమవుతున్న ధరల రూపంలో కోళ్ల పరిశ్రమకు రోజుకు సుమారు రూ.87.2 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. జిల్లాలో సుమారు 1.30 కోట్ల కోళ్లు ఉండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిలో 60 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా తదితర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. శీతల ప్రభావంతో ఎగుమతులకు డిమాండ్ పెరిగి గుడ్డు రైతు ధర జనవరిలో రూ.4.07 పైసలకు చేరి సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే కోళ్ల రైతుల ఆశలను ఆవిరి చేస్తూ ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఎండల తీవ్రత మొదలవడంతో వినియోగం తగ్గి స్థానిక ఎగుమతులకు డిమాండ్ తగ్గిపోయింది. బరవాలా, పంజాబ్, తమిళనాడులోని నమ్మక్కల్ ప్రాంతాల నుంచి ఎదురవుతున్న పోటీ స్థానిక ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. జనవరిలో కోస్టల్ ఏరియాలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా నుంచి రోజుకు సుమారు 160 లారీల గుడ్లు ఎగుమతి కాగా అనేక కారణాలతో క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 130 లారీల గుడ్లు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. దీంతో పౌల్ట్రీల్లో గుడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. ఫిబ్రవరి నుంచి గుడ్డు రైతు ధర పతనమవుతూనే వస్తోంది. జనవరి నెలాఖరు నాటికి రూ.4.05 పైసలు ఉన్నరైతు ధర పలు ఒడిదుడుకులకు గురై ప్రస్తుతం రూ.2.78 పైసలకు తగ్గిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధర మరింత తగ్గుతుందని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రతి గుడ్డుపై 62 పైసల నష్టం ఎండలు మండుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా జిల్లాలో గుడ్ల ఉత్పత్తి సుమారు ఎనిమిది శాతం మేర తగ్గినట్టు పౌల్ట్రీవర్గాలు అంచనా వేస్తున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో సుమారు 1.01 కోట్లు గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుత గుడ్డు ధర మేరకు తగ్గిన ఉత్పత్తి రూపంలో రోజుకు సుమారు రూ.24.46 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. మరోపక్క తెగుళ్ల నివారణ కోసం మందుల వాడకం, మేత, కూలీల ఖర్చులు పెరిగిపోవడం, వేసవి ఉపశమన చర్యలు తదితర కారణాలతో పౌల్ట్రీల నిర్వహణ భారంతో గుడ్డు రైతు ధర రూ.3.40 పైసలు ఉంటేనే గిట్టుబాటు కాదని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రస్తుత రైతు ధర రూ.2.78 ధర మేరకు రోజుకు ఒక్కో గుడ్డు రూపంలో 62 పైసల వరకు కోళ్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. గిట్టుబాటు కాని ధర రూపంలో పరిశ్రమకు రోజుకు సుమారు రూ.62.74 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు పరిశ్రమ వర్గాలంటున్నాయి. మునుముందు ఎండలు, వేడిగాలుల తీవ్రతతో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గిపోవడంతో పాటు కోళ్ల మరణాలు పెరిగి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని కోళ్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండలతో మరింత సంక్షోభం ఎండల తీవ్రతతో ఇప్పటికే పరిశ్రమకు వేసవి కష్టాలు మొదలయ్యాయి. ఎగుమతులకు డిమాండ్ లేక ధర తగ్గిపోతోంది. ఎండలు మరింత ముదిరితే వడదెబ్బతో కోళ్ల మరణాలు పెరుగుతాయి. గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గి ఆ మేరకు కోళ్ల రైతులు నష్ట పోవాల్సి వస్తుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న పరిశ్రమను ఈ ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేలా ఉన్నాయి. - పడాల సుబ్బారెడ్డి, జిల్లా నెక్ చైర్మన్, పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు