Electrical Engineering
-
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదు..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచి్చనా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్‌లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్‌గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జన్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్‌తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్‌కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్‌కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్‌కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్‌గా.. అమెరికాలోని అయోవా స్టేట్‌లో రిపబ్లికన్ పారీ్టకి మూడు సార్లు చైర్మన్‌గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్‌గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
ఆ సీట్లు ఏమైనట్టు?
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది సివిల్, మెకానికల్ సీట్లు భారీగా తగ్గే అవకాశం కన్పిస్తోంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో చేర్చిన సీట్ల వివరాలే దీనికి నిదర్శనం. ఇప్పటివరకూ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చిన సీట్లలో ఎక్కువగా కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఏఐఎంఎల్, ఇతర కంప్యూటర్ కోర్సులవే ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు తక్కువగా కన్పిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ విభాగాల్లో సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోకి మారబోతున్నాయా? లేదా కాలేజీలు రద్దు చేసుకుంటాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే వంద కాలేజీల వరకూ సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించాలని, కంప్యూటర్ సైన్స్, ఇతర కోర్సుల్లో సీట్లు పెంచాలని దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కారణంగానే దాదాపు 40 వేల సీట్లను కౌన్సెలింగ్‌లో పెట్టలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆప్షన్లన్నీ సీఎస్ఈ వైపే... ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఇప్పటివరకు 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడత సీట్లు కేటాయించే నాటికి ఈ సంఖ్య 80 వేలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 1,56,879 మంది అర్హత సాధించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది కంప్యూటర్ కోర్సులకే ఆప్షన్లు ఇస్తున్నారు. ఇందులో ఎంసెట్, జేఈఈ ర్యాంకర్లు కూడా ఉన్నారు. తొలిరోజు దాదాపు 6 వేల మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 5 వేలు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులవే ఉన్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో కూడా 62,079 సీట్లు చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా, ఇందులో సివిల్ 3087, మెకానికల్ 2667, ఎలక్ట్రికల్ 3854 సీట్లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 30 శాతం తగ్గాయి. ప్రైవేటు కాలేజీలు కోరినట్టు బ్రాంచీల్లో సీట్ల మార్పు జరిగితే కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే గత ఏడాది సివిల్‌లో 36.38, మెకానికల్‌లో 31.92, ఈఈఈలో 56.49 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆ సీట్లపై ప్రైవేటు కాలేజీల గురి కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఈ ఏడాది భారీగా సీట్లున్నాయి. అయినప్పటికీ విద్యార్థుల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రైవేటు కాలేజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. జేఈఈ, ఎంసెట్‌లో 3 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల చేత మొదటి కౌన్సెలింగ్‌లోనూ దరఖాస్తు చేయిస్తున్నాయి. వీళ్లకు కంప్యూటర్ కోర్సుల్లో తొలి దశలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంది. ముందు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పటికీ, ఆఖరి కౌన్సెలింగ్ వరకూ వీళ్లు కాలేజీల్లో చేరరు. జేఈఈ ర్యాంకు ఉండటంతో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరతారు. రాష్ట్రంలో అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో తొలి విడతలో వచ్చిన సీటును వదులుకుంటున్నారు. అప్పుడు ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లో ఇష్టమొచ్చిన వాళ్లకు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అయితే, దీన్ని కట్టడి చేయడం ఎవరి వల్లా కావడం లేదని సాక్షాత్తు అధికార వర్గాలు చెబుతుండటం కొసమెరుపు. -
Allola DIVYA REDDY: గోమాత
ఆవు... అమ్మ తర్వాత అమ్మ. పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. నేలకు సారం... మట్టికి జీవం ఇస్తుంది. పంటకు ప్రాణం... అవుతుంది. అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది. మనిషి మనుగడకు ఆధారం అయింది. అలాంటి మన ఆవు ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఆవును కాపాడే ఒక అమ్మ కావాలి. ఆ అమ్మ... అల్లోల దివ్యారెడ్డి. పెట్ రైట్స్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు చట్టాలున్నాయి. పులుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి పర్యావరణ వ్యవస్థలో మన ఆవులు ఎందుకు స్థానాన్ని కోల్పోతున్నాయి. ఆవును మచ్చిక చేసుకుని అడవి నుంచి ఇంటికి తెచ్చుకున్నారు మన పూర్వికులు. ఇప్పుడవి ఎల్లలు దాటి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం మనం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే ఆ తర్వాత ఉద్యమించినా ప్రయోజనం ఉండదంటారు అల్లోల దివ్యారెడ్డి. మన దేశీయ ఆవులను సంరక్షించే బాధ్యతను చేపట్టారామె. ‘ప్రమాదం అంచున ఉన్న దేశీయ ఆవులను సంరక్షించు కుందాం’... అని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు ఎకలాజికల్ ఇంజనీరింగ్ బాధ్యతను చేపట్టిన ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె. ఏటూ మిల్క్ మన ఆవులవే! ‘‘మాది తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కేంద్రం. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాన్న వాటర్ వర్క్స్‌లో ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా రిటైర్ అయ్యారు. నేను ఇంజనీరింగ్ తర్వాత పెళ్లి చేసుకుని, మా వారికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాను. అత్తగారిల్లు నిర్మల్. ఇద్దరు పిల్లలతో నాలోకం నాదిగా, పిల్లలను చక్కగా పెంచుకోవడమే తొలి ప్రాధాన్యంగా ఉండేది. అలాంటిది 2014 నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పుడు వార్తా పత్రికల్లో, టీవీ చానెళ్లలో పాల కల్తీ గురించి వరుస కథనాలు వచ్చాయి. నా పిల్లలకు తాగిస్తున్న పాలు స్వచ్ఛమైనవి కావా, విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు ఇస్తున్నానా... అని ఎంత ఆవేదన చెందానో మాటల్లో చెప్పలేను. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఏటూ (అ2) పాల గురించి అధ్యయనం మొదలుపెట్టాను. మన దేశీయ ఆవు ఇచ్చే పాలే ఏటూ మిల్క్ అని తెలిసిన తర్వాత సంతోషం వేసింది. హైదరాబాద్‌లో ఏటూ మిల్క్ కోసం అన్వేషణ మొదలు పెట్టాను. ఆశ్చర్యం... పాలు దొరకనే లేదు. మనం, మన పిల్లలు మాత్రమే కాదు, మన ఆవు కూడా ప్రమాదం అంచున ఉన్నట్లు అప్పుడు తెలిసింది. వెంటనే పది ఆవులతో సంగారెడ్డిలోని మా పొలంలోనే క్లిమామ్ గోశాల మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఇంటికి నలభై నిమిషాల ప్రయాణం. అప్పటి నుంచి మా పిల్లలు స్వచ్ఛమైన పాలతో పెరుగుతున్నారు. మన దేశీయ గోసంతతి పెంచడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 2015లో పది ఆవులతో మొదలైన గోశాలలో ఇప్పుడు 250 ఉన్నాయి. మా క్లయింట్లు చాలా మంది ఇప్పుడు రెండు – మూడు ఆవులను పెంచుకుంటున్నారు. కొంతమంది ఏకంగా వంద ఆవులతో ఫార్మ్ పెట్టారు. దేశ పర్యటన మూపురం ఉన్న ఆవు మన దేశీయ ఆవు. అలాంటి దేశీయ ఆవుల సంఖ్య పెంచడానికి దాదాపుగా దేశమంతా పర్యటించాను. రైతులతో మాట్లాడాను. ఆవును పెంచడం పాలకోసం అనుకుంటారు, కానీ నిజానికి ఆవు పాలు మనకు బోనస్ మాత్రమే. అసలైన ప్రయోజనం నేలకోసం. నేలను సారవంతంగా ఉంచుకున్నంత కాలమే మనిషికి మనుగడ. వందగ్రాముల ఆవుపేడలో పదిలక్షల సూక్ష్మజీవులుంటాయి. అవి నేలను సజీవంగా ఉంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుమందులతో నేలలో ఉండాల్సిన జీవజాలం అంతరించిపోతోంది. ఆవుపేడ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చు. అందుకే ‘నేల పండాలంటే ఆవు ఉండాలి. అది మన దేశీయ ఆవు అయి ఉండాలి’ అంటాను. సేంద్రియం మనకు కొత్త కాదు! మన రైతులు సేంద్రియ వ్యవసాయమే చేసేవారు. యాభై – అరవై ఏళ్ల వెనక్కి వెళ్లి చూడండి. వాళ్లకు యూరియాలు, డీఏపీలు తెలియదు. ఆవులు, గేదెల ఎరువుతో సేద్యం చేసుకుంటూ రైతు రాజులాగా జీవించాడు. అలాంటి రైతును అధిక దిగుబడి అంటూ రసాయన ఎరువులతో పక్కదారి పట్టించాం. ఇప్పుడు రైతు ఉన్నంత దీనస్థితిలో మరెవరూ ఉండకపోవచ్చు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు మరే పరిశ్రమలోనూ కనిపించవు. ఇప్పుడు మళ్లీ రైతును సేంద్రియం వైపు మళ్లించడానికి వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక్క దేశీయ ఆవు ఉన్నా చాలు, దేశంలో ఆవుల సంతతి పెరుగుతుంది, వ్యవసాయం బాగుపడుతుంది. మనిషి జీవనం గాడిలో పడుతుంది. ఆవులకు కృత్రిమ గర్భధారణను తప్పనడం లేదు, కానీ విదేశీ బ్రీడ్‌తో గర్భధారణను వ్యతిరేకిస్తున్నాను. రెడ్ సింధీ, సహీవాల్, గిర్ వంటి రోజుకు పదిహేను లీటర్ల పాలిచ్చే రకాలున్నాయి. అలాంటి మనదేశీయ జాతితో గర్భధారణ చేసినప్పుడే మన ఆవు మనకు మిగులుతుంది. లేకపోతే శ్రీలంక పరిస్థితి తప్పదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి ఆవులను దిగుమతి చేసుకుందా దేశం. సొంత నేల ఆవు జాతులను పట్టించుకోలేదు. చివరికి దిగుమతి చేసుకున్న బ్రీడ్ నిలవలేదు, సొంత బ్రీడ్ అంతరించిపోయిందక్కడ. నేను న్యాయస్థానం మెట్లెక్కింది కూడా ఈ విషయంలోనే. కృత్రిమ గర్భధారణ హైబ్రీడ్‌తో వద్దు, మన దేశీయ జాతులతో చేయాలని న్యాయస్థానాన్ని కోరాను’’ అన్నారు అల్లోల దివ్యారెడ్డి. ఇంత పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ ఎక్కడా అవరోధాలు లేకుండా ముందుకు సాగడానికి ఇంట్లో అందరి సహకారం ఉందని, కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారామె. ఆవు నన్ను ఎంచుకుంది! అవుతో కలిసి సాగుతున్న నా జర్నీ అంతటినీ ఓసారి వెనక్కి చూసుకుంటే... గోసేవను ఎంచుకున్నది నేను కాదు, గోవులే నన్ను ఎంచుకున్నాయనిపిస్తోంది. నేను చేస్తున్నదేదీ ముందుగా ప్రణాళిక వేసుకుని మొదలుపెట్టింది కాదు. పాల కల్తీ గురించి తెలిసినప్పటి నుంచి ఒక్కటొక్కటిగా అడుగులు వాటంతట అవే పడుతున్నాయి. ఈ పోరాటంలో విజయం సాధించేవరకు విశ్రమించను. ఆవును నగరాల్లో ఇళ్లకు కూడా పరిచయం చేయడానికి మట్టి గణపతిలో కొద్దిగా గోమయం కలిపి చేస్తున్నాను. గోమయంతో కూడిన మట్టి గణపతి విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయవచ్చు లేదా కరిగించి ఇంట్లో మొక్కలకు ఎరువుగానూ వేసుకోవచ్చు. మన ఆవు కోసం ఇంకా ఏ ఆలోచన వస్తే దానిని ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తాను. మన జాతీయ చిహ్నంలో ఉన్న ఎద్దు బొమ్మను ఉదహరిస్తూ జాతి సంపదను పరిరక్షించుకుందాం... అని సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నంలో ఉన్నాను. – అల్లోల దివ్యారెడ్డి, వ్యవస్థాపకురాలు, క్లిమామ్ గోశాల – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
ఏసీబీ వలలో ఎలక్ట్రికల్ ఏఈ.. రూ.2లక్షలు లంచం తీసుకుంటూ
అనకాపల్లి టౌన్: లేబర్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఏఈ శుక్రవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. జిల్లా ఇన్చార్జి ఏసీబీ డీఎస్పీ వీవీఎస్ఎస్ రమణమూర్తి అందించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది ఏఈగా మహేశ్వరరావు పనిచేస్తున్నారు. బిల్లులను క్లియర్ చేసేందుకు నర్సీపట్నానికి చెందిన లేబర్ కాంట్రాక్టర్ పైలా రమణ నుంచి మహేశ్వరరావు రూ.3.20 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే.. రమణ రూ.2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. శుక్రవారం సాయంత్రం ఏఈ మహేశ్వరరావు అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ దుకాణం వద్ద రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బిల్లుల మొత్తానికి మహేశ్వరరావుకు 5 శాతం చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు డీఎస్పీ తెలిపారు. ఏఈని శనివారం విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు కె.లక్ష్మణమూర్తి, రమేష్, సతీష్, కిశోర్‌కుమార్, పి.శ్రీనివాసరావు, వి.విజయకుమార్ పాల్గొన్నారు. -
ఒక్క క్లిక్‌తో ఐఐటీ సీటు ఢమాల్!
ముంబై: ఆల్ ఇండియా జేఈఈ పరీక్షలో 270వ ర్యాంకు పొందిన ఒక యువకుడు ఒక్క తప్పిదంతో ప్రఖ్యాత ఐఐటీలో ఇంజనీరింగ్ సీటు కోల్పోయాడు. ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బత్రాకు తల్లీ తండ్రీలేరు. కష్టపడి చదవి జేఈఈలో మంచి ర్యాంకు సంపాదించాడు. ఐఐటీ బోంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సీటు సైతం సంపాదించాడు. అయితే అక్టోబర్ 31న తన రోల్‌నెంబర్‌పై అప్డేట్ల కోసం నెట్లో బ్రౌజ్ చేస్తుండగా ఒక లింక్‌ను అనుకోకుండా క్లిక్ చేశాడు. ‘‘విత్ డ్రా ఫ్రం సీట్ అలకేషన్ అండ్ ఫరదర్ రౌండ్స్’ అని ఉన్న లింక్‌ను తను క్లిక్ చేశాడు. ఇప్పటికే తనకు సీటు దొరికినందున ఇకపై ఎలాంటి అడ్మిషన్ రౌండ్లు ఉండవన్న నమ్మకంతో ఈ లింక్‌ను క్లిక్ చేసినట్లు బత్రా చెప్పారు. దీంతో ఆయనకు నవంబర్ 10న విడుదలైన అడ్మిటెడ్ స్టూడెంట్స్ లిస్టు చూశాక షాక్ తగిలింది. ఆయన పేరు 93మంది విద్యార్దుల తుది జాబితాలో లేదు. దీంతో ఆయన బాంబే హైకోర్టులో పిటీషన్ వేశారు. 19న పిటిషన్ విచారించిన కోర్టు రెండురోజుల్లో బత్రా పిటిషన్‌ను ఆయన విజ్ఞాపనగా పరిగణించమని ఐఐటీని ఆదేశించింది. అయితే విత్‌డ్రా లెటర్‌ను రద్దు చేసే అధికారం తమకు లేదంటూ ఐఐటీ ఈ నెల 23న బత్రా అప్పీలును తిరస్కరించింది. నిబంధనలు అతిక్రమించి ఏమీ చేయలేమని తెలిపింది. అడ్మిషన్లన్నీ జేఒఎస్‌ఎస్‌ఏ చూసుకుంటుందని ఐఐటీ రిజిస్ట్రార్ చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఖాళీ సీటు లేదన్నారు. వచ్చేఏడాది జేఈఈకి బత్రా అప్లై చేసుకోవచ్చన్నారు. దీంతో ఈ విషయంపై బత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు జరిగిన నష్టం పూడ్చేందుకు అదనపు సీటు కేటాయించాలని కోరుతున్నారు. తాను కేవలం సీటు దొరకడం వల్ల ఇకపై అడ్మిషన్ ప్రక్రియ ఉండదన్న అంచనాతో ఫ్రీజ్ లింక్‌ను క్లిక్ చేశానని కోర్టుకు చెప్పారు. అయితే విత్‌డ్రా చేసుకోవడం రెండంచెల్లో జరుగుతుందని, విద్యార్థి ఇష్టపూర్వకంగానే సీటు వదులుకున్నట్లు భావించాలని, ఆ మేరకు సదరు విద్యార్థ్ధికి రూ.2వేలు మినహాయించుకొని సీటు కోసం తీసుకున్న ఫీజు రిఫండ్ చేస్తామని ఐఐటీ పేర్కొంది. సీట్లు వృథా కాకుండా ఈ విధానం తెచ్చినట్లు తెలిపింది. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. -
ర్యాప్ న మ హా
మనసులోని భావాలను వచన కవిత్వంలో సూటిగా చెప్పొచ్చు. పదునైన వచన కవిత్వానికన్నా పదునైనది ర్యాప్. తీవ్ర భావోద్వేగాలను సైతం ర్యాప్‌లో సున్నితంగా, అదే సమయంలో శక్తిమంతంగా చూపించవచ్చు. అంతటి శక్తిమంతమైన ర్యాప్‌తో ప్రణవ్ చాగంటి ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకుంటున్నాడు. ర్యాప్ పాడుతూ యువతకు తెలుగును పరిచయం చేస్తున్నాడు. న, మ అక్షరాలతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రెండు అక్షరాల ర్యాప్‌ను సృష్టించాడు. తనలో నిద్రాణంగా ఉండిపోయిన భావాలను బయటకు తీసుకురావడానికి ర్యాప్ తనను ఎంచుకుంది అంటున్న 29 ఏళ్ల ఈ హైదరాబాద్ ర్యాపర్ గురించి అతడి మాటల్లోనే..! నా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగాన్వేషణలో ఉన్న సమయంలో మా చుట్టాలాయన ఒకరు వచ్చి, ‘నేవీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్ అవకాశాలు ఉన్నాయి. చేరిపో, మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని చెప్పారు. నాకు అమ్మని వదిలి ఉండటం ఇష్టం లేదు. అయినా ఇంట్లో వారి బలవంతం మీద రెండేళ్లు నేవీలో చేరాను. క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ అవ్వడం వల్ల చాలాసేపు సముద్రం మీదే ఉండవలసి వచ్చేది. నౌక పోర్టులోకి వచ్చినా కొద్దిగంటల్లోనే మళ్లీ బయలుదేరిపోతుంది. . ఇంజనీరింగ్ చదివానన్న మాటే గానీ చిన్నప్పటి నుంచీ నాకు సంగీతమంటే చాలా ఇష్టం. భాషాభేదం లేకుండా అన్ని పాటలు వినేవాడిని. కానీ నౌకలో ఆ అవకాశం దొరికేది కాదు. అమ్మానాన్నలకు, సంగీతానికి దూరంగా ఉండటం నా మనసుకి నచ్చలేదు. అందుకే ఆ ఉద్యోగంలో ఉండలేక వచ్చేశాను. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండటం నా నైజం. ఒక లైన్ రాయగానే, ఏదో ఒక పాట రాయొచ్చుగా అనుకుంటాను. నా మైండ్ క్షణం కుదురుగా ఉండేది కాదు. రచన, సంగీతం.. వీటి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండేది. కదిలించిన యాసిడ్ ఘటన ఢిల్లీలో 2004లో జరిగిన ఒక యాసిడ్ దాడి దేశంతోపాటు నన్నూ కదిలించేసింది. ప్రేమను ఒప్పుకోకపోతే యాసిడ్ దాడి చేయడమేంటి?! మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనుకున్నాను. ఎమోషనల్‌గా షేక్ అయ్యాను. ఆ భావాన్ని ఎలా బయటపెట్టాలో ఆ చిన్న వయసులో నాకు అర్థం కాలేదు. పెద్దవాడినయ్యాక పాటల రూపంలో నాలోని ఉద్వేగాలను బయటకు తీసుకురావడం ప్రారంభించాను. ‘ఆవేదన’ అనే ర్యాప్‌గా ఆ యాసిడ్ దాడి గురించి నా ఎమోషన్ బయటకు వచ్చింది. నాలో ఏదో తెలియని రిలీఫ్. ఆ తరవాత నిర్భయ గురించి రాయడానికి నాలో ఆవేశం కట్టలు తెంచుకుని వచ్చింది. అప్పటికి నా భాష మెరుగైంది. తెలుగు భాష గొప్పదనం గురించి కూడా నలుగురికీ చెప్పాలనిపించింది. ఆ ప్రయత్నంగానే న, మ అక్షరాలతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రెండు అక్షరాల ర్యాప్‌ను సృష్టించాను. దానికి ‘దివ్యాక్షరి’ అని పేరు పెట్టాను. – డా. వైజయంతి పురాణపండ -
టీటీడీలో డెప్యుటేషన్ల గోల
ఎస్పీడీసీఎల్ ఇంజినీర్లను తీసుకోవడంపై అసంతృప్తి ప్రమోషన్లు ఆగిపోతాయని ఆలయ ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగుల ఆవేదన ప్రతినెలా టీటీడీకి రూ.లక్షల్లో నష్టం టీటీడీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలోని ఉద్యోగులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ విభాగంలో ఇంజినీర్ల కొరత లేకున్నా డెప్యుటేషన్‌పై ఎస్పీడీసీఎల్(సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్) నుంచి తీసుకొస్తుండడమే దీనికి కారణం. ఇలా చేస్తే తమకు ప్రమోషన్లు ఆగిపోవడమేగాక టీటీడీ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు. సాక్షి: టీటీడీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం కీలకమైంది. ఈ విభాగంలో 55 మంది ఇంజినీర్లు, పెద్ద సంఖ్యలో కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. వీరిని కాదని ఇద్దరు డీఈలు, ఇద్దరు ఏఈఈలను డెప్యుటేషన్‌పై తీసుకురావడంపై ఆ శాఖ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్న వారితోనే పని చేయించుకోలేని అధికారులు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగులను తెచ్చుకొని ఏం సాధిస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి. టీటీడీపై అదనపు భారం తప్పితే లాభమేమీ ఉండదని పలువురు అంటున్నారు. డెప్యుటేషన్‌పై వచ్చిన వారివల్ల ఉన్న వారికి ప్రమోషన్లు ఆగిపోయి గంగదరగోళ పరిస్థితులు ఏర్పడతాయన్న వాదన వినిపిస్తోంది. సౌరవిద్యుత్ ప్లాంటు నిర్వహణ కోసమే.. టీటీడీ అవసరాల కోసం తంబళ్లపల్లి వద్ద 5.25 మెగావాట్ల సౌరవిద్యుత్ కేంద్రాన్ని బీవోటీ పద్ధతిలో నిర్మించతలపెట్టింది. దీన్ని ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. 20 సంవత్సరాల తర్వాత విద్యుత్ ప్రాజెక్టును టీటీడీకి అప్పగించేలా ఒప్పందం జరిగింది. ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు ప్రైవేటు కంపెనీనే ఈ ప్రాజెక్టును నిర్వహించాలి. టీటీడీకి ఏ మాత్రమూ సంబంధం ఉండదు. ఈ ఒప్పందాన్ని బుట్టదాఖలు చేసి సౌరవిద్యుత్ ప్లాంటు కోసం ఎస్పీడీసీఎల్ నుంచి ఇంజినీర్లను డెప్యుటేషన్‌పై తీసుకుంటుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న ఒక డీఈకి కొండపై బాధ్యతలు అప్పగించారు. టీటీడీ ఆధ్వర్యంలోని వేదిక్ యూనివర్సిటీలో డెప్యుటేషన్‌పై వచ్చిన ఏఈఈకి బాధ్యతలు అప్పగించింది. ఎస్పీడీసీఎల్ ఇంజినీర్లకు టీటీడీ ఇంజినీర్ల కన్నా పది శాతం జీతాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ప్రతినెలా టీటీడీకి లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. ఈవోను తప్పుదోవ పట్టిస్తున్నారా..? టీటీడీలోని ఇంజినీరింగ్ ఉద్యోగుల సామర్థ్యం సరిగాలేదంటూ ఉన్నతాధికారులు ఈవో సాంబశివరావును తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఆ ఉన్నతాధికారుల వల్లనే ఇతర ప్రభుత్వ శాఖల నుంచి డెప్యుటేషన్‌పై ఇంజినీరింగ్ విభాగంలోకి ఎక్కు వ మంది వస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఎలాంటి సామర్థ్యమూ లేకుండానే పది మెగావాట్ల విండ్పవర్ను ఉత్పత్తి చేస్తున్నామా అని ప్రశ్నిస్తున్నారు. ప్రమోషన్లు ఆగిపోతాయి.. డెప్యుటేషన్‌పై ఎక్కువ మంది అధికారులను అరువు తెచ్చుకోవడం వల్ల ఇక్కడ ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని టీటీడీ ఇంజినీర్లు వాపోతున్నారు. సాధార ణ పనికి కూడా ఎస్పీడీసీఎల్ ఇంజినీర్లను తెచ్చుకోవడం వల్ల తమకు ఉద్యోగోన్నతులు ఆగిపోతాయని అంటున్నారు. దీనిపై ఈవో ఆలోచించాలని కోరుతున్నారు. -
క్యాంపస్ అంబాసిడర్స్ - చలమలశెట్టి సురేఖ
ఉన్నత విద్య కోసం ప్రతి ఏటా విదేశాలకు వెళ్లే భారతీ య విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ కోవలోనే యూఎస్ లోని రైట్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు చలమలశెట్టి సురేఖ. యూఎస్ విద్య, క్యాంపస్ ప్రత్యేకతలను వివరిస్తున్నారిలా.. ప్రవేశాలు ఫాల్, స్ప్రింగ్‌లో: క్యాంపస్‌లో దాదాపు 200 మంది వరకు భారతీయ విద్యార్థులున్నారు. అమెరికా విద్యార్థులు భారతీయ విద్యార్థులతో స్నేహంగా ఉంటారు. క్యాంపస్‌లో జాతివివక్షత లేదు. అలా ఎవరైనా ర్యాగింగ్ చేస్తూ దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రవేశాలు ప్రతి ఏటా వేసవిలోనూ, శీతకాలంలో ఉంటాయి. పరీక్ష విధానం కోర్సు, ప్రొఫెసర్ల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. మిడ్ టర్మ్, ఫైనల్ ఎగ్జామ్స్ లేదా ప్రాజెక్ట్ వర్క్‌తోపాటు వీక్లీ టెస్టులు, క్విజ్, క్లాస్రూమ్ ఎక్సర్‌సెజైస్ కూడా ఉంటాయి. క్యుములేటివ్ గ్రేడ్ పా యింట్ ఏవరేజ్(సీజీపీఏ)ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. యూఎస్ విద్యా విధానం ప్రత్యేకం: మిగిలిన దేశాలతో పోలిస్తే యూఎస్ విద్యావిధానం ప్రత్యేకంగా ఉంటుంది. విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లభిస్తోంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా టెక్నికల్ హబ్‌గా ఉన్న దేశం అమెరికా. థియరీ కంటే ప్రాక్టికల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రాబ్లం సాల్వ్డ్ లెర్నింగ్‌తో ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. కరిక్యులం, బోధ న కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఉంటుంది. లేబొరేట రీలు అత్యాధునికంగా అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. నిష్ణాతులైన ఫ్యాకల్టీ: హాస్టల్ వసతి కూడా ఉంది. అమెరికన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. చాలాచోట్ల భారతీయ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆహారం విషయంలో ఆందోళన అనవసరం. ఫ్యాకల్టీ అంతా కూడా వారివారి సబ్జెక్టులలో డాక్టరేట్ చేసినవాళ్లే. అంతేకాకుండా ఎంతో అనుభవజ్ఞులు. ఇండియన్ సొసైటీ ఉంది: నేను ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. యూఎస్కొచ్చే భారతీయ విద్యార్థుల కు సహాయం చేయడానికి ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంది. వీరు విద్యార్థులు విమానం దిగిన దగ్గర నుంచి యూనివర్సి టీలో చేరేవరకు అన్ని విధాలా సహాయం అందిస్తారు. ఎంచుకున్న కోర్సును బట్టి ఫీజులుంటాయి. ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షల స్కోర్ తప్పనిసరి: అమెరికాలో చదవాలను కునేవారు ఆయా కోర్సులకు అనుగుణంగా శాట్/జీఆర్ఈ/ టోఫెల్/ఐఈఎల్టీఎస్/జీమ్యాట్ వంటి పరీక్షల్లో మంచి స్కోర్ సాధించాలి. ఇందుకోసం రెండేళ్ల ముందుగానే తమ సన్నాహాలు ప్రారంభించాలి. ఆయా టెస్టులకు సంబంధించి ఎన్నో వెబ్‌పోర్టళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలి. ఆయా అంశాలను వీలైనన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. దరఖాస్తు ఇలా: యూనివర్సిటీ వెబ్సైట్ (www.wright.edu) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ సర్టిఫికెట్లు, రికమండేష న్స్ లెటర్స్, రెజ్యూమే, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, పని అనుభవం వివరాలతో దరఖాస్తు చేయాలి. తర్వాత వీసాకు దరఖాస్తు చేసుకో వాలి. అప్లికేషన్‌తో పాటు అకడమిక్ సర్టిఫికెట్లు, యూఎస్‌లో ప్రవే శం లభించినట్లు కన్ఫర్మేషన్ లెటర్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, ఐ-20, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ సమర్పించాలి. వీసా ఆఫీసర్‌తో మాట్లాడేటప్పుడు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ఉండాలి. -
వీఐటీ విద్యార్థుల ప్రతిభ
వేలూరు, న్యూస్‌లైన్: పెద్ద పెద్ద మిద్దెలు, భవనాల మెట్లు ఎక్కే రోబోను దేశంలోనే మొట్టమొదటి సారిగా వీఐటీ విద్యార్థులు అయూష్‌కుమార్, పల్లవిపంబ్రే తయారు చేశారు. పెద్ద భవనాల్లోని కార్యాలయాలకు తపాల సర్వీసులు, ప్రతిరోజూ తీసుకెళ్లేందుకు సమయం వృథా కావడమే కాకుండా పలు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. దీంతో వీఐటీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం విద్యార్థులు ఆయూష్ కుమార్, పల్లవి పంబ్రే, ప్రొఫెసర్లు పార్థా ఎస్ మాలిక్, మత్యూ మిత్రాల సహకారంతో విద్యార్థులు ఈ రోబోను తయారు చేశారు. ఈ రోబో 15 సెంటీమీటర్ల ఎత్తుగల మెట్లను ఎక్కడం, దిగడం వంటివి చేస్తుందని వీటికి 1.5 కిలోల బరువు గల వస్తువును ఇది తీసుకొని రాగలదని విద్యార్థులు తెలిపారు. రోబోను తయారు చేసిన విద్యార్థులను చాన్స్‌లర్ విశ్వనాథన్, వైస్ చాన్స్‌లర్ రాజు, ఉపాధ్యక్షులు జీవీ సెల్వం, శంకర్ అభినందించారు. -
మేడారంలో పాలిటెక్నిక్ కాలేజీ
సాక్షి, హన్మకొండ ఏజెన్సీ వాసులకు సాంకేతిక విద్య అందుబాటులోకి రానుంది. మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లతో కళాశాల ప్రారంభం కానుంది. 6.54 కోట్లతో కళాశాల భవనాలను నిర్మించనున్నారు. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఏడు కళాశాలలు మంజూరు చేసింది. తెలంగాణ పరిధిలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, వరంగల్ జిల్లా మేడారంలో నూతన కాలేజీలు ఏర్పాటు కానున్నారుు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో కోర్సులు ప్రారంభమవుతాయి. ఒక్కో విభాగానికి 60 సీట్లు కేటాయించారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ? ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులకు సంబంధించిన కౌన్సెలిం గ్ ప్రక్రియ ముగిసి తరగతులు ప్రారంభమయ్యాయి. దీం తో ఈ ఏడాది అడ్మిషన్లకు ఏఐసీటీఈ నుంచి అనుమతి లభించడం కష్టమే. వచ్చే ఏడాది నుంచి ఈ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి. నూతన భవనాల నిర్మా ణం పూర్తయ్యేంత వరకు మేడారంలో అందుబాటులో ఉన్న గిరిజన గురుకుల కళాశాల భవనాలు లేదా అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాల్లో కళాశాలను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో రెండు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా, పరకాలలో 2008లో మరో కళాశాల మంజూరైంది. ఆ తర్వాత 2011లో చేర్యాలకు మరో కళాశాల మంజూరు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటిచింది. అయితే ఇప్పటి వరకు పరకాల కళాశాల అద్దె భవనాల్లో కొనసాగుతుండగా చేర్యాల కాలేజీ ప్రకటనలకే పరిమితమైంది. కాగా, మేడారం కళాశాలకు మాత్రం ప్రారంభంలోనే భారీగా నిధులు మంజూరు కావవడంతో ఈ కాలేజీ భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి.