లైంగిక వేధింపులకు 857 కోట్ల జరిమానా!
లాస్ ఏంజెలిస్: అమెరికాలో ఓ ఎలిమెంటరీ టీచర్ తన విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారీ జరిమానా పడింది. టీచర్‌పై చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకుగాను కాలిఫోర్నియా రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ విద్యా వ్యవస్థ అయిన ‘లాస్ ఏంజెలిస్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్’ 81 మంది బాధిత విద్యార్థులకు 139 మిలియన్ల(రూ.857 కోట్లు) మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలంటూ కోర్టు తీర్పునిచ్చింది.
మార్క్ బెనెట్ అనే ఆ టీచర్ దురాగతాలకు సంబంధించిన ఫిల్మ్ పోలీసుల చేతికి చిక్కడంతో అతడిని 2012లో అరెస్టు చేసిన నాటి నుంచీ ఈ కేసు కొనసాగుతోంది. విద్యార్థుల కళ్లకు గంతలు కట్టి వారికి తినుబండారాలపై వీర్యం వేసి బెనెట్ తినిపించేవాడని, హస్తప్రయోగం చేసేవాడని సైతం ఆరోపణలు వచ్చినా స్కూల్ చర్యలు తీసుకోలేదని న్యాయస్థానం పేర్కొంది. నేరాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో న్యాయస్థానం అతడికి 25 ఏళ్ల జైలు శిక్షను విధించింది.