EMIS
-
ఈఎంఐలు ఇక దిగొస్తాయ్!
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అన్నట్లుగా దాదాపు ఐదేళ్ల తర్వాత రుణ గ్రహీతలకు ఆర్బీఐ నుంచి చల్లని కబురు అందింది. కీలక రెపో రేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు ఇక దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పెరగడమే కానీ, తగ్గడమంటే ఏంటో తెలియని గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ముంబై: రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించేలా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత కీలక రెపో రేటును పావు శాతం తగ్గించింది. దీంతో ఈ ప్రామాణిక వడ్డీ రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగి రానుంది. గవర్నర్ సారథ్యంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్లో కేంద్రం మధ్య తరగతి వర్గాలకు ఆదాయపు పన్నులో భారీ ఉపశమనం కల్పించిన వెంటనే ఆర్బీఐ కూడా తీపి కబురు అందించడం విశేషం. కాగా, ప్రస్తుత పాలసీ విషయంలో ప్రస్తుత తటస్థ (న్యూట్రల్) విధానాన్నే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వృద్ధి రేటు ఇలా...: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. మరోపక్క, ద్రవ్యోల్బణం కూడా 4.2 శాతానికి (ఈ ఆర్థిక సంవత్సరం అంచనా 4.8 శాతం) దిగొస్తుందని లెక్కగట్టింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.4 శాతానికి (నాలుగేళ్ల కనిష్టం) తగ్గిపోవచ్చని, ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేయడం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతం గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత నెమ్మదిగా శాంతిస్తూ.. నవంబర్‌లో 5.48 శాతానికి, డిసెంబర్లో 5.22 శాతానికి దిగొచ్చింది. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి వెంటాడుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం భయాలతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ ఇచ్చింది. ఈ పరిణామాలతో రూపాయి ఘోరంగా పడిపోతోంది. తాజాగా డాలరు మారకంలో సరికొత్త ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 87.60కి క్రాష్ అవ్వడం తెలిసిందే. ఈ తరుణంలో ఆర్బీఐ రేట్ల కోత దేశీయంగానూ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తుందని, రూపాయి పతనంతో విదేశీ నిధులు మరింత తరలిపోయే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.రెపో రేటు అంటే.. బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీ రేటునే రెపో (రీపర్చేజ్) రేటుగా వ్యవహరిస్తారు. రెపో అధికంగా ఉంటే బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయం పెరుగుతుంది, దీంతో రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతాయి. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బదలాయిస్తాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత కార్పొరేట్ లోన్లపైనా వడ్డీ భారం తగ్గుతుంది. అయితే, రెపో రేటు తగ్గడం వల్ల డిపాజిట్ రేట్లతో పాటు ఇతర పొదుపు సాధనాలపై కూడా తక్కువ వడ్డీ లభిస్తుంది.ఇతర ముఖ్యాంశాలు... → సైబర్ మోసాలకు అడ్డకట్ట వేసి, భద్రతను కట్టుదిట్టం చేయడం కోసం ప్రత్యేకంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటర్నెట్ డొమైన్‌ను డాట్ ఇన్ (.in)కు మార్చుకోవాలి. అంటే బ్యాంకులు ‘bank.in’, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ‘fin.in’ ఉపయోగించాలి. బ్యాంకు డొమైన్ మార్పు 2025 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండగా.. నాన్–బ్యాంకులకు రాబోయే రోజుల్లో అమలు చేయనున్నారు.→ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీలో రిజిస్టర్ అయిన బ్యాంకింగేతర బ్రోకరేజ్ సంస్థలు తమ క్లయింట్ల తరఫున... ప్రభుత్వ సెక్యూరిటీల్లో సెకండరీ మార్కెట్ లావాదేవీల కోసం ఇక నేరుగా నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్–ఆర్డర్ మ్యాచింగ్ (ఎన్డీఎస్–ఓఎం) ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎల్రక్టానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నియంత్రిత సంస్థలకు, బ్యాంకులు, ప్రత్యేక ప్రైమరీ డీలర్ల తరఫున క్లయింట్లకే అందుబాటులో ఉంది. → తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 7–9 తేదీల్లో జరుగుతుంది.గృహ రుణంపై ఊరట ఎంతంటే..? ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 9 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ. 25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.22,493 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్బీఐ తాజా పావు శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8.75 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.22093కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.400 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ. 96 వేలు మిగులుతాయి. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.5ఏళ్లలో తొలిసారి.. 2020 తర్వాత తొలి సారి రెపో రేటు ను తగ్గించగా.. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ కీలక రేట్లలో మార్పులు చేయడం విశేషం. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఆర్బీఐ రెపో రేటును ఏకధాటిగా 4% నుంచి 6.5 శాతానికి, అంటే 2.5% పెంచేసింది. ఆ తర్వాత రేట్లలో మార్పు లేకుండా యథాతథ పాలసీని కొనసాగిస్తూ వస్తోంది. ఇక గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఆల్‌టైమ్ కనిష్టాన్ని (దాదాపు 6%) తాకిన తర్వాత కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం 9–9.5% రేంజ్లో తీవ్ర భారంగా మారాయి. అధిక వడ్డీ రేట్లకు తోడు పన్నుల భారం ధరల పెరుగుదల డెబ్బతో గత రెండేళ్లుగా ఇల్లు కొనాలంటే బెదిరిపోయే పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణ గ్రహీతలకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.సానుకూల పరిస్థితులతోనే... గడిచిన కొన్ని పాలసీ చర్యల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలున్నాయి. 2025–26లో ద్రవ్యోల్బణం మరింత శాంతించి ఆర్బీఐ టార్గెట్ (4%) స్థాయికి చేరుతుందని భావిస్తున్నాం. ఈ సానుకూల పరిస్థితుల కారణంగానే మందగమనంలో ఉన్న వృద్ధికి తోడ్పాటు అందించేలా ఎంపీసీ ఏకగ్రీవంగా రెపో రేటు కోతకు మొగ్గు చూపింది. 2024–25 రెండో త్రైమాసికంలో వృద్ధి 5.4 శాతానికి (రెండేళ్ల కనిష్టం) తగ్గిన తర్వాత మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది. ఈ వృద్ధి–ద్రవ్యోల్బణం లెక్కలను భేరీజు వేసుకునే నిర్ణయం ప్రకటించాం. స్థూల ఆర్థిక అంచనాల మేరకు భవిష్యత్తు సమావేశాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటాం. ఫైనాన్షియల్ వ్యవస్థలో తగినంత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) ఉండేలా అవసరమైన చర్యలన్నీ చేపడతాం. భారత్ మళ్లీ కచ్చితంగా 7 శాతానికి మించి వృద్ధి రేటు సాధిస్తుంది. బడ్జెట్లో ఆదాయపు పన్ను ఊరట వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదు, నిజానికి ఇది వృద్ధికి చేదోడుగా నిలుస్తుంది. ఇక రూపాయి పతనం విషయానికొస్తే, డాలరుతో దేశీ మారకం విలువ ’నిర్దిష్ట స్థాయి లేదా శ్రేణి’లో ఉండాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకోలేదు. – సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ గవర్నర్సమయానుకూల నిర్ణయం.. ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయం సరైన సమయంలో వెలువడింది. నియంత్రణపరంగా చేపట్టిన చర్యలను కూడా స్వాగతిస్తున్నాం. – సి.ఎస్. శెట్టి, ఎస్బీఐ చైర్మన్ ఇది సరిపోదు... ఆర్బీఐ పావు శాతం రేట్ల తగ్గింపు వల రియల్ ఎస్టేట్ పరిశ్రమపై ప్రత్యక్ష ప్రభావం పరిమితంగానే ఉంటుంది. మొత్తం డిమాండ్‌ను పెంచి, ఇళ్ల విక్రయాలు జోరందుకోవాలంటే (ముఖ్యంగా అందుబాటు ధరల విభాగంలో) మరిన్ని రేట్ల కోతలు ఉంటాయని ఆశిస్తున్నాం. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడుహౌసింగ్కు బూస్ట్... ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రేపో తగ్గింపు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు దిగొస్తాయి. దీంతో మళ్లీ ఇళ్ల కొనుగోళ్లు పుంజుకునేందుకు దోహదం చేస్తుంది. – జి. హరిబాబు, నరెడ్కో జాతీయ అధ్యక్షుడు -
రుణబంధం పెరుగుతోంది
నూగూరి మహేందర్: ఒకప్పుడు చేబదులు కావాలంటే బంధువునో, స్నేహితులనో అడగాల్సిందే. లేదంటే తెలిసినవారి నుంచి వడ్డీకి అప్పు తీసుకోవాల్సిందే. వ్యక్తులు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. ఇప్పుడు ఒకరి ముందు నిలబడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఛాయ్ తాగేలోపు అప్పు పుడుతోంది. డబ్బులు పడ్డాయహో అంటూ ఫోన్ మెసేజ్ మోగుతుంది. ఏదైనా వస్తువు కొనాలన్నా, పేమెంట్స్ చేయాలన్నా ఖాతాలో, జేబులో డబ్బులు ఉండక్కర్లేదు. క్రెడిట్ కార్డు ఉంటే చాలు. అంతే కాదు యూపీఐ యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలను బట్టి ఇన్స్టంట్ రుణం ఇచ్చేందుకూ బ్యాంకులు క్యూ కడుతున్నాయి. సిబిల్ స్కోర్ లేకున్నా పర్వాలేదంటున్నాయి. అప్పు సరే.. తీర్చేదెలా అన్న సందేహమూ అక్కర్లేదు. సింపుల్‌గా సులభ వాయిదాల్లో (ఈఎంఐ) తీర్చేసే వెసులుబాటూ కల్పిస్తున్నాయి. కొన్నేళ్లుగా భారత్‌లో క్రెడిట్ కార్డులు, రుణాల వృద్ధి చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఈ రుణాల జోరు అభివృద్ధికి సూచికగా నిపుణులు చెబుతున్నారు. మెరుగైన జీవితం కోసం.. దిగువ–మధ్యతరగతి వినియోగదారులలో రుణాలు తీసుకునే విధానంలో గణనీయ మార్పు వచ్చింది. గతంలో మనుగడ కోసమైతే ఇప్పుడు ఆకాంక్షలు, వ్యాపారం, దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రుణాలు తీసుకుంటున్నారు. ఈ మార్పు దేశంలో అభివృద్ధి చెందుతున్న సామాజిక–ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తోందని బ్యాంకింగ్ రంగ సంస్థలు అంటున్నాయి. కస్టమర్లు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని చెబుతున్నాయి. రుణ లభ్యత, డిజిటల్ ఆధారిత బ్యాంకింగ్ మారుమూల పల్లెలకూ చొచ్చుకుపోవడం లోన్ పోర్ట్‌ఫోలియో పెరుగుదలకు దోహదం చేస్తోంది. నడిపిస్తున్న ధోరణులు.. కోవిడ్–19 మహమ్మారి రాక షాపింగ్ తీరుతెన్నులను మార్చేసింది. కన్జ్సూమర్ ఫైనాన్స్ రంగంలో ఉన్న హోమ్ క్రెడిట్ అధ్యయనం ప్రకారం.. ఆన్లైన్ షాపింగ్ వాటా 2021లో 69% ఉంటే.. 2023లో ఇది 48%కి, 2024 నాటికి 53%కి చేరింది. మహిళా కస్టమర్లలో 60%, మిలీనియల్స్ 59%, జనరేషన్ జెడ్ 58%, మెట్రోలు, టైర్–2 నగరాల్లో 56% మంది ఆన్లైన్ ట్రెండ్‌ను నడిపిస్తున్నారు. యాప్–ఆధారిత బ్యాంకింగ్‌కు మిలీనియల్స్‌లో 69% శాతం సై అంటున్నారు. జెన్ జెడ్ 65%, జెన్ ఎక్స్‌లో 58% యాప్ బేస్ట్ బ్యాంకింగ్ కోరుకుంటున్నారు. దిగువ–మధ్యతరగతి రుణగ్రహీతలలో 43% మందికి ఈఎంఐ కార్డ్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన క్రెడిట్ సాధనంగా మారాయి. క్రెడిట్ కార్డ్‌లను 24%, డిజిటల్ లెండింగ్ యాప్‌లను 12% మంది ఎంచుకుంటున్నారు. వృద్ధిలోనూ ‘క్రెడిట్’వాటికే.. 2024 డిసెంబర్ నాటికి దేశంలో జారీ అయిన క్రెడిట్ కార్డుల సంఖ్య 10.8 కోట్లు.. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం ఐదేళ్లలో క్రెడిట్ కార్డులు దాదాపు రెండింతలు అయ్యాయి. డెబిట్ కార్డులు ఐదేళ్లలో 80.53 కోట్ల నుంచి 2024 డిసెంబర్ నాటికి 99.09 కోట్లకు చేరాయి. ఏడాదిలో క్రెడిట్ కార్డుల వృద్ధి 10.31 శాతం ఉంటే డెబిట్ కార్డుల విషయంలో ఇది 3.13 శాతమే. క్రెడిట్ కార్డులతో జరిపిన చెల్లింపులు 2024 డిసెంబర్లో రూ.1,88,086 కోట్లుగా నమోదయ్యాయి. 2023 డిసెంబర్‌తో పోలిస్తే ఇది 13.9 శాతం ఎక్కువ. 2024 డిసెంబర్లో కార్డులతో చేసిన మొత్తం చెల్లింపుల విలువలో క్రెడిట్ కార్డుల వాటా 82.22 శాతం ఉండటం గమనార్హం. 2023 డిసెంబర్లో ఇది 77.5 శాతం. క్రెడిట్ కార్డుల విభాగంలో మొత్తం పోర్ట్‌ఫోలియోలో ప్రైవేటు బ్యాంకుల వాటానే 69.8 శాతంగా ఉంది. క్రెడిట్ కార్డు వినియోగదారులు 2024 మార్చి నాటికి చెల్లించాల్సిన మొత్తం 27.7 శాతం పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరింది. రుణాల వృద్ధి అభివృద్ధికి సూచిక! రుణాలు పెరుగుతుండటం అభివృద్ధికి సూచిక. బ్యాంకుల మద్దతు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. బ్యాంకింగ్ లేకుండా వ్యవస్థ లేదు. వ్యవస్థ తదుపరి స్థాయికి చేరితేనే ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరుగుతుంది. బ్యాంకులు లాభాల్లో ఉన్నాయంటే అందుకు కారణం అర్హతగల వారికి రుణాలు జారీ చేయడమే. రుణ మార్కెట్లో మొండి బాకీలు సహజం. అయితే సానుకూల ధోరణితోనే రికవరీ చేయాలి. ఆర్థిక స్థోమత చూసి క్రెడిట్ కార్డులు ఇచి్చనంత వరకు ఎటువంటి సమస్య లేదు. – వి.ఎస్.రాంబాబు, జాతీయ కార్యదర్శి, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
సామాన్యుడి దీపావళి మీ చేతుల్లోనే.!
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి ప్రేరిత సమస్యల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మారటోరియం పథకం కింద రూ.2 కోట్ల వరకూ రుణాలపై నెలవారీ వాయిదాల(ఈఎంఐ)కు చక్రవడ్డీ మాఫీని ‘సాధ్యమైనంత త్వరగా’ అమలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ‘‘సామాన్యుని దీపావళి మీ చేతుల్లోనే ఉంది’’ అని ఈ సందర్భంగా ప్రభుత్వ, బ్యాంకుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నవంబర్ 14వ తేదీ దీపావళి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘సామాన్యుని ఇబ్బందులు అర్థం చేసుకుంటామని, చక్రవడ్డీ భారం లేకుండా చూసే అంశంపై తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్రం పేర్కొంది. ఇది ఆహ్వానించదగిన అంశం. అయితే ఇందుకు సంబంధించి అధికారులు ఇంకా ఎటువంటి ఉత్తర్వునూ జారీ చేయలేదు. మీరు మాకు కేవలం ఒక్క అఫిడవిట్ అందజేశారు అంతే. వడ్డీ రద్దు ప్రయోజనాన్ని ఎలా అందిస్తున్నారన్న అంశమే మాకు ఇప్పుడు ప్రధానం. ఇందుకు తగిన ఆదేశాలను ఇచ్చారా? లేదా అని మాత్రమే మేము ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం’’ అని జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఆర్ సుభాషన్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రం తరఫున వీడియో–కాన్ఫరెన్సింగ్ ద్వారా వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘తగిన పటిష్ట నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని కూడా ధర్మాసనం పేర్కొంది. కేసు తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. కరోనా కష్టకాలం నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపులపై ఆర్బీఐ మార్చి నుంచి ఆగస్టు వరకూ మారటోరియం విధించడం తెలిసిందే. అయితే కేంద్రం నిర్ణయం ఏదైనా అమలు చేయడానికి బ్యాంకులు సిద్ధమని బ్యాంక్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. మారటోరియం కాలానికి సంబంధించి ప్రస్తుత రుణాలపై వడ్డీమీద వడ్డీవేస్తూ, బ్యాంకులు సొమ్ము చేసుకోవడం తగదని పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ దత్తా న్యాయస్థానానికి విన్నవించారు. రూ.2 కోట్ల వరకూ రుణాలు తీసుకున్న వారిపై చక్రవడ్డీ తగదన్నారు. ‘‘తగిన ద్రవ్య విధానం, ప్రతిపాదనల అమలు లేకుండా ఆయా రుణా లను మొండిబకాయిగా వర్గీకరించవద్దంటూ ఇప్పటికే మేము ఆదేశాలు ఇచ్చాము’’ అని బెంచ్ స్పష్టం చేసింది. డిఫాల్ట్ కాని రుణాలకే పునరుద్ధరణ: ఆర్బీఐ ముంబై: రుణాల పునరుద్ధరణ అవకాశం ఈ ఏడాది మార్చి 1 నాటికి చెల్లింపుల్లో ఎటువంటి వైఫల్యాలు లేని ప్రామాణిక ఖాతాలకే ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులను పరిశీలించిన తర్వాత మార్చి నుంచి ఆగస్ట్ వరకు ఆరు నెలల పాటు రుణ చెల్లింపులపై విరామానికి (మారటోరియం) ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఆగస్ట్ తర్వాత కూడా అనేక రంగాల్లో పరిస్థితులు కుదుటపడకపోవడంతో రుణాల పునరుద్ధరణకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో రుణ గ్రహీతలు, రుణదాతలకు స్పష్టతనిస్తూ ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ► మార్చి 1 నాటికి 30 రోజులకు పైగా రుణ చెల్లింపులు బకాయి పడి, ఆ తర్వాత క్రమబద్ధీకరణ చేసుకున్నప్పటికీ అవి పునరుద్ధరణకు అర్హమైనవి కావు. ► ఇక అమలు దశలో ఉన్న ప్రాజెక్టులు, కార్యకలాపాలను వాయిదా వేసిన వాటికి సంబంధించిన రుణాలను కూడా ఈ పథకం నుంచి ఆర్బీఐ మినహాయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నాటి ఆదేశాలు, ఇతర మార్గదర్శకాలు వీటికి అమలవుతాయి. ► ఒకే సంస్థకు ఒకటికి మించిన సంస్థలు రుణమిచ్చినట్టయితే.. ఆ రుణ పునరుద్ధరణకు గాను అన్ని సంస్థలు సంయుక్తంగా కలసి ఇంటర్ క్రెడిటార్ ఒప్పందానికి రావాల్సి ఉంటుంది. ► జూన్ 26 నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నిర్వచనం మారినప్పటికీ.. అదేమీ ఆయా పరిశ్రమల రుణాలపై ప్రభావం చూపించదని ఆర్ బీఐ స్పష్టం చేసింది. వీటికి సంబంధించిన రుణాల పరిష్కారానికి మార్చి 1 నాటికి అమల్లో నిర్వచనమే ఆధారంగా తీసుకోనున్నట్టు తెలిపింది. ► ప్రాపర్టీపై రుణాలకూ పునరుద్ధరణ అవకాశం ఉంటుంది. కాకపోతే అవి వ్యక్తిగత రుణాల్లోకి రాకూడదు. ► సాగుకు సంబంధించి అన్ని రుణాలు, ఎన్బీఎఫ్సీ రంగానికి సంబంధించినవీ ఈ పథకం కింద పునరుద్ధరించుకోవచ్చు. కాకపోతే పాడి, మత్స్య, పశు సంరక్షణ, పౌల్ట్రీలకు ఇచ్చిన రుణాలకు ఈ అవకాశం ఉండదు. -
మరో 3 నెలలు... వాయిదా!
ముంబై: కరోనా వైరస్ రాక ముందే దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. అదే సమయంలో వచ్చిన ‘కరోనా’.. ఆర్థిక వ్యవస్థను రెండు నెలలపాటు లాక్డౌన్ చేసేసింది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వృద్ధికి ప్రేరణగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రుణ రేట్లు మరింత దిగివచ్చేందుకు వీలుగా రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే నిధులపై వసూలు చేసే రేటు)ను 40 బేసిస్ పాయింట్ల (0.40 శాతం) మేర కోత విధించి 4 శాతానికి తీసుకొచ్చింది. ఇది 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయి. ఈ నిర్ణయంతో రెపో ఆధారిత గృహ, వాహన, వ్యక్తిగత, ఇతర టర్మ్ రుణాల రేట్లు దిగొస్తాయి. అటు రివర్స్ రెపో రేటు (బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై చెల్లించే రేటు)ను కూడా 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ఆర్బీఐ వద్ద నిధులు ఉంచడానికి బదులు రుణ వితరణ దిశగా బ్యాంకులను ప్రోత్సహించనుంది. మరోవైపు రుణగ్రహీతలకు మరింత ఉపశమనం కల్పిస్తూ.. రుణ చెల్లింపులపై మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించింది. అవసరమైతే రేట్లను మరింత తగ్గించేందుకు వీలుగా ‘సర్దుబాటు ధోరణి’నే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఎంపీసీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వీడియో సందేశం రూపంలో తెలియజేశారు. రుణగ్రహీతలపై పన్నీరు లాక్‌డౌన్‌ను చాలా వరకు సడలించినప్పడికీ సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ఎంతో సమయం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుణ చెల్లింపులపై మే వరకు ఇచ్చిన మారటోరియం (తాత్కాలిక విరామం)ను మరో 3 నెలల పాటు.. ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు ఆర్బీఐ పొడిగించింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలు, కోఆపరేటివ్ బ్యాంకులు, క్రెడిట్‌కార్డు సంస్థలు జారీ చేసిన రుణాలకు ఇది అమలవుతుంది. కాకపోతే మారటోరియంను మే తర్వాత కొనసాగించాలా లేదా అన్నది ఆయా సంస్థల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మారటోరియం కాలంలో చేయాల్సిన చెల్లింపులు తర్వాతి కాలంలో అసలుకు కలుస్తాయి. దీనివల్ల రుణ చెల్లింపుల కాల వ్యవధి పెరుగుతుంది. కంపెనీలకు మూలధన అవసరాకు ఇచ్చిన క్యాష్ క్రెడిట్/ఓవర్ డ్రాఫ్ట్‌లకు కూడా 3 నెలల మారటోరియం అమలవుతుందని ఆర్బీఐ పేర్కొంది. వృద్ధి ప్రతికూలం.. అంచనాల కంటే కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అభిప్రాయపడింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ప్రతికూల దిశలోనే (జీడీపీ వృద్ధి క్షీణత) ప్రయాణించొచ్చని పేర్కొంది. కాకపోతే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం (అక్టోబర్–మార్చి)లో వృద్ధి పుంజుకోవచ్చన్నారు. డిమాండ్ క్షీణత, సరఫరా వ్యవస్థలో అవరోధాలు కలసి 2020–21 మొదటి ఆరు నెలల కాలంలో వృద్ధిని తగ్గించేస్తాయని.. క్రమంగా ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం, ద్రవ్య, పరపతి, పాలనాపరమైన చర్యల వల్ల వృద్ధి రేటు రెటు ఆర్థిక సంవత్సరం ద్విదీయ అర్ధ భాగంలో క్రమంగా పుంజుకోవచ్చని చెప్పారు. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 60 శాతం వాటా కలిగిన ఆరు అగ్రగామి రాష్ట్రాలు రెడ్/ఆరెంజ్ జోన్లోనే ఉన్నాయని ఎంపీసీ పేర్కొంది. కార్పొరేట్ గ్రూపులకు మరిన్ని రుణాలు ఒక కార్పొరేట్ గ్రూపునకు ఒక బ్యాంకు ఇచ్చే రుణ పరిమితిని 25 శాతం నుంచి 30 శాతానికి ఆర్బీఐ పెంచింది. దీనివల్ల కార్పొరేట్ కంపెనీలకు ఒకే బ్యాంకు పరిధిలో మరింత రుణ వితరణకు వీలు కలుగుతుంది. డెట్, ఇతర క్యాపిటల్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు నిధులు సమీకరణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.15 వేల కోట్లు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంకు)కు 15,000 కోట్ల క్రెడిట్లైన్ (అదనపు రుణం) సదుపాయాన్ని (90 రోజులకు) ఆర్బీఐ ప్రకటించింది. ‘‘ఎగ్జిమ్ బ్యాంకు తన కార్యకలాపాల కోసం విదేశీ కరెన్సీపై ఆధారపడుతుంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా నిధులు సమీకరించలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కనుక నిధుల సదుపాయాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్బీఐ పేర్కొంది. రాష్ట్రాలకు మరో 13 వేల కోట్లు కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్ (సీఎస్ఎఫ్) నుంచి రాష్ట్రాలు మరిన్ని నిధులను తీసుకునేందుకు వీలుగా ఆర్బీఐ నిబంధనలను సడలించింది. దీనివల్ల రాష్ట్రాలకు మరో రూ.13 వేల కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. రుణాలకు చెల్లింపులు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐ వద్ద సీఎస్‌ఎఫ్‌ను నిర్వహిస్తుంటాయి. ద్రవ్యోల్బణంపై అస్పష్టత కరోనా మహమ్మారి కారణంగా ద్రవ్యోల్బణ గమనంపై తీవ్ర అస్పష్టత ఉందన్న అభిప్రాయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. పప్పు ధాన్యాల ధరల పెరుగుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధరలను తగ్గించేందుకు దిగుమతి సుంకాలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. 2020–21 మొదటి ఆరు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే ఉండొచ్చంటూ.. ద్వితీయ ఆరు నెలల కాలంలో లక్షి్యత 4 శాతానికి దిగువకు రావొచ్చన్నారు. దివాలా చర్యలకు మరింత వ్యవధి ఇక మారటోరియం కాలానికి దివాలా చట్టంలోని నిబంధనల నుంచి ఆర్బీఐ మినహాయింపునిచ్చింది. ఐబీసీ చట్టంలోని నిబంధనల కింద రుణ గ్రహీత సకాలంలో చెల్లింపులు చేయకపోతే.. 30 రోజుల సమీక్షాకాలం, 180 రోజుల పరిష్కార కాలం ఉంటుంది. ఇవి మారటోరియం కాలం ముగిసిన తర్వాతే అమల్లోకి వస్తాయి. మరిన్ని నిర్ణయాలకు సదా సిద్ధం 2020 మార్చి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ దెబ్బతిన్నట్టు సంకేతాలు తెలియజేస్తున్నాయి. ఆర్బీఐ ఇక ముందూ చురుగ్గానే వ్యవహరిస్తుంది. అవసరం ఏర్పడితే భవిష్యత్తు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రకాల సాధనాలను, ఇటీవల తీసుకున్న విధంగా కొత్తవి సైతం అమలు చేసేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉంటుంది – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్బీఐ అసాధారణ నిర్ణయాలు ► మార్చి 3: కరోనా వైరస్ ప్రవేశంతో, పరిస్థితులు సమీక్షిస్తున్నామని, తగి న నిర్ణయాలకు సిద్ధమని ప్రకటన. ► మార్చి 27: రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు, సీఆర్ఆర్ 100 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధింపు. ► ఏప్రిల్ 3: రోజువారీ మనీ మార్కెట్ ట్రేడింగ్ వేళలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పరిమితం చేసింది. ► ఏప్రిల్ 17: రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. నాబార్డ్, సిడ్బి, నేషనల్హౌసింగ్ బ్యాంకులకు రూ.50వేల కోట్ల నిధుల వెసులుబాటు. 90 రోజుల్లోపు రుణ చెల్లింపుల్లేని ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించాలన్న నిబంధనల నుంచి మారటోరియం రుణాలకు మినహాయింపు. ► ఏప్రిల్ 27: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుండడంతో (డెట్ ఫండ్స్‌కు సంబంధించి) వాటికి రూ.50వేల కోట్ల ప్రత్యేక విండోను (బ్యాంకుల ద్వారా) తీసుకొచ్చింది. ► మే 22: రెపో, రివర్స్ రెపో 40 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గింపు. మారటోరియం మరో మూడు నెలలు పొడిగింపు. ఇతర కీలక అంశాలు ► ఎగుమతులకు సంబంధించి ఇచ్చే రుణాల కాల వ్యవధిని ఏడాది నుంచి 15 నెలలకు ఎంపీసీ పొడిగించింది. ► దిగుమతులకు సంబంధించిన రెమిటెన్స్‌ల పూర్తికి సమయాన్ని 6 నెలల నుంచి 12 నెలలకు పొడిగించింది. ► 2020–21లో మే 15వరకు విదేశీ మారక నిల్వలు 9.2 బిలియన్ డాలర్లు పెరిగి 487 బిలియన్ డాలర్లకు చేరాయి. ► ఆరుగురు సభ్యులున్న ఎంపీసీలో గవర్నర్ దాస్ సహా ఐదుగురు 40 బేసిస్ పాయింట్లకు ఆమోదం తెలిపితే, చేతన్ ఘటే మాత్రం 25 బేసిస్ పాయింట్లకు మొగ్గు చూపించారు. ► రిజర్వ్ బ్యాంక్ ఎంపీసీ భేటీ వాస్తవానికి జూన్ 3–5 తేదీల మధ్య జరగాల్సి ఉంది. కాకపోతే తక్షణ అవసరాల నేపథ్యంలో ముందస్తుగా ఈ నెల 20–22 తేదీల మధ్య సమావేశమై నిర్ణయాలు తీసుకుంది. మారటోరియం తీసుకున్నది 20 శాతమే మా రుణ గ్రహీతల్లో 20 శాతం మందే మారటోరియం ఎంచుకున్నారు. వీరిలో అందరూ నిధుల సమస్యను ఎదుర్కోవడం లేదు. నగదును కాపాడుకునే వ్యూహాంలో భాగంగానే వారు మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్నారు నిధుల పరంగా ఎటువంటి సమస్యల్లేని వారు చెల్లింపులు చేయడమే మంచిది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ మరిన్ని చర్యలు... భవిష్యత్తు ఆర్థిక వృద్ధిపై ఎంతో అనిశ్చితి ఉందన్న అంచనాలు, ఆర్బీఐ సైతం జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల ధోరణిలో ఉం డొచ్చని అంగీకరిం చినందున.. ఆర్బీఐ, ప్రభుత్వం నుంచి ఇక ముందూ మరిన్ని మద్దతు చర్యలు అవసరం అవుతాయి. – సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ -
రుణాలు ఇక పండగే!
ముంబై: పండుగలు మొదలవుతున్న తరుణంలో రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తీపికబురు తెచ్చింది. కీలక పాలసీ రేట్లను అంచనాలకు మించి తగ్గించడంతో... ఇక అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు దిగిరానున్నాయి. నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం కూడా తగ్గనుంది. కాగా, దిగజారుతున్న దేశ ఆర్థిక వృద్ధి, పడిపోతున్న డిమాండ్ ఆర్బీఐనీ ఆందోళనకు గురిచేస్తోంది! బుధవారం వెల్లడైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష నిర్ణయాల్లో ఇదే తేటతెల్లమైంది. వృద్ధి క్షీణతకు చెక్ పెట్టేందుకు, వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు తన వంతుగా రేట్ల కోతతో ముందుకు వచ్చింది. 25 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటును తగ్గించొచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేయగా, ఈ విషయంలో ఆర్బీఐ విశాలంగానే స్పందించి 35 బేసిస్ పాయింట్లను తగ్గించి ఆశ్చర్యపరిచింది. బ్యాంకులకు సమకూర్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటుగా పేర్కొంటారు. ‘‘25 బేసిస్ పాయింట్ల తగ్గింపు సరిపోదు. 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఎక్కువ అవుతుంది. 35 బేసిస్ పాయింట్లు అన్నది సమతుల్యంగా ఉంటుందని ఎంపీసీ భావించింది’’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. సాధారణంగా ఆర్బీఐ పావు శాతం లేదా అరశాతం (25 బేసిస్ పాయింట్ల మల్టిపుల్‌లో) మేర రేట్లలో చేసే మార్పులకు, 35 బేసిస్ పాయింట్ల తగ్గింపు అన్నది వినూత్నమే. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ 1.1% రెపో రేటును తగ్గించడం విశేషం. తాజా నిర్ణయం తర్వాత రెపో రేటు 5.4%కి, రివర్స్ రెపో రేటు (బ్యాంకుల నుంచి ఆర్బీఐ సమీకరించే నిధులపై ఇచ్చే రేటు) 5.15%కి దిగొచ్చాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) జీడీపీ వృద్ధి అంచనాలను గతంలో ఉన్న 7% నుంచి 6.9 శాతానికి తగ్గించింది. సర్దుబాటు ధోరణిని కొనసాగించింది. అంటే పాలసీ విషయంలో ఉదారంగా వ్యవహరించే వెసులుబాటు ఈ విధానంలో ఉంటుందని ఆశించొచ్చు. అవసరమైతే భవిష్యత్తులోనూ రేట్ల కోత చేపట్టవచ్చని ఇది సూచిస్తుంది. బలహీనంగా ఆర్థిక రంగం ‘‘దేశీయ ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగానే ఉన్నాయి. అంతర్జాతీయ మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం వృద్ధి తగ్గే రిస్క్‌ను పెంచుతున్నాయి. వృద్ధిపై ఆందోళనలకు పరిష్కారంగా డిమాండ్‌ను పెంచేందుకు, ప్రైవేటు పెట్టుబడులను పెంచడం అన్నది ఈ దశలో అత్యంత ముఖ్యమైనది’’ అని రేట్ల కోత అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఎంపీసీ స్పష్టం చేసింది. -
ఈఎంఐలు ఎక్కువైనా చిక్కులే
♦ ఇంటి రుణం, వ్యక్తిగత రుణం, బీమా పాలసీలు... ♦ వేతనంలో పరిమితంగానే నెలసరి చెల్లింపులు రుణాలు కావచ్చు... ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు... ఖర్చులు కావచ్చు! కానీ వాటి కోసం చేసే చెల్లింపులు పరిమితి దాటితే కోరి చిక్కులు తెచ్చుకున్నట్టే.! రాబడులు తక్కువగా ఉండే సంప్రదాయ బీమా పాలసీలు, అధిక వడ్డీతో కూడిన వ్యక్తిగత రుణాలు ఆర్థిక లక్ష్యాలకు విఘాతంగా మారకూడదు. ఇంటి రుణం కూడా... ఆర్థికంగా ప్రయోజనం కల్పించేది అయి ఉండాలి గానీ, భారంగా పరిణమించకూడదు. అందుకే వచ్చే ఆదాయంలో వీటికంటూ ఓ నిర్ణీత పరిమితి విధించుకోవడం అవసరం. శేఖర్ ఈ మధ్యే గృహ రుణం తీసుకుని ఫ్లాట్ కొన్నాడు. అప్పటికే తనకు వ్యక్తిగత రుణం బకాయిలున్నాయి. ఇక గృహ ప్రవేశం ఖర్చులకు స్నేహితులనడిగి కొంత మొత్తం తీసుకున్నాడు. ఇక కార్ లోన్ ఇంకా ఏడాది చెల్లించాల్సి ఉంది. జీవిత బీమా పాలసీలకు చేసే చెల్లింపులతో కలిసి తడిసి మోపెడవుతోంది. వీటికోసం నెలనెలా క్రెడిట్ కార్డులపై వాడకం పెంచాడు. దాంతో అవి కూడా భారీగా బిల్లులొస్తున్నాయి. కనీస బిల్లు చెల్లిస్తుండటంతో వడ్డీ భారీగా పెరుగుతోంది. శేఖర్ ప్లానింగ్ మంచిదే. కానీ ఇబ్బందులు మామూలుగా లేవు. ఎందుకిలా? ఇదే విషయం చెప్పి తన మిత్రుడైన ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర వాపోయాడు శేఖర్. దానికి ఆ అడ్వయిజర్... తన క్లయింట్లు కొందరి అనుభవాలు చెబుతూ తగిన సూచనలిచ్చారు. ఆ వివరాలే ఇవి... ఇంటి రుణం... ఇంటి తాలూకూ వ్యయాలు... రుణానికి చెల్లించే ఈఎంఐ కావచ్చు లేదా ఇంటి అద్దె కావచ్చు. ఏదైనా గానీ వేతనంలో చెప్పుకోతగ్గ వ్యయం అవుతుంది. గృహ రుణ ఈఎంఐ వేతనంలో 35–40 శాతానికే పరిమితం చేయాలి. పన్ను ఆదా, పొదుపు కోసమే రుణంపై ఇంటిని కొనుగోలు చేసినా సరే... ఇది నిర్ణీత శాతం మించితే ఇబ్బందే. నిజానికి ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ ప్రస్తుతం 8–9 శాతం మధ్యనే ఉంటోంది. ఇంటి రుణం కోసం చేసే అసలు, వడ్డీ చెల్లింపులపై ఆదాయపన్ను పరంగా మినహాయింపులు కూడా ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ అసలు ఏమీ లేనట్టే భావించొచ్చు. అసలు భారమే కాని ఇంటి రుణాన్ని తీర్చేయాలన్న యోచనలో దీర్ఘకాలంలో 12 శాతం పైగా రాబడులను ఇచ్చే ఈక్విటీ పెట్టుబడులపై దృష్టి పెట్టకపోవడం ఆర్థిక ప్రణాళిక లోప మే అవుతుంది. ఇక కొందరికి అప్పు ఉందంటే నిద్ర పట్టదు. అందుకే తీసుకునే వరకూ నిద్రపోరు. దాన్ని తీర్చేవరకూ ప్రశాంతంగా ఉండరు. ఇంటి రుణంపై ప్రారంభంలో కొన్నేళ్లు వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. ఒకవేళ అప్పు తొందరగా తీర్చేయాలని అనుకుంటే ఏడేళ్ల తరువాత ముందస్తుగా తీర్చేయొచ్చు. అలాగైతే వడ్డీపై పన్ను ప్రయోజనాలన్నీ అప్పటిదాకా కలిసివస్తాయి. బీమా ప్రీమియం... సతీష్ (50) ఓ ఉద్యోగి. నెల జీతం రూ.60,000. యులిప్ పాలసీలకు, రెండు సంప్రదాయ పాలసీలకు కలిపి నెల నెలా రూ.21,000 (జీతంలో 35 శాతం) చెల్లించేవాడు. పన్ను ఆదాకు, సురక్షితమైన చక్కని రాబడుల కోసం వీటిని అతడి ఎంచుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత... రాబడులు తన లక్ష్యాలకు అనుగుణంగా లేవని గుర్తించాడు. దీంతో భారంగా మారిన అన్ని సంప్రదాయ పాలసీలను సరెండర్ చేసి వచ్చినంత వెనక్కి తీసుకున్నాడు. పెట్టుబడుల కోణంలో ఒకటికి మించిన పాలసీలను తీసుకుని ఉంటే, ద్రవ్యోల్బణానికి దీటైన రాబడులను ఇవ్వలేవు కనుక వాటిని వదిలించుకోవడమే బెటర్. అయితే, పాలసీలను రద్దు చేసుకునే ముందు సరెండ్ వేల్యూ ఎంత వస్తుందో తెలుసుకుని.. ఓ నిర్ణయం తీసుకోవాలి. నష్టపోయేది కొద్దిగానే ఉండి, పాలసీ ముగియడానికి ఇంకా కొన్నేళ్ల పాటు సమయం ఉంటే రద్దు చేసుకోవడమే కరెక్టు. బీమా... పెట్టుబడికాదు! బీమా అన్నది కేవలం రక్షణ కోసమే అయి ఉండాలి. టర్మ్ పాలసీలు ఈ కోవకు చెందినవే. వీటి ప్రీమియం సంప్రదాయ పాలసీలతో పోలిస్తే చాలా తక్కువ. కానీ, కవరేజీ ఎక్కువ. అయినా కూడా చాలామంది సంప్రదాయ పాలసీలకే మొగ్గు చూపుతుంటారు. వీటికి ప్రీమియం ఎక్కువ, బీమా రక్షణ తక్కువ. పైగా వీటిపై వచ్చే రాబడులు కూడా 5–6 శాతాన్ని మించవు. ఇక, వైద్య బీమా, క్రిటికల్ ఇల్నెస్, వాహన బీమా, గృహ బీమాలను కూడా కలిసి చూస్తే ప్రీమియం రూపంలో చెల్లించాల్సిన మొత్తం భారీగానే ఉంటుంది. పాలసీలు ఏవైనా కానీయండి... వాటికి చెల్లించే ప్రీమియం ఏడాదిలో ఓ వ్యక్తి ఆదాయంలో 6 –7 శాతాన్ని మించకుండా చూసుకోవాలి. టర్మ్ పాలసీ తీసుకునే వారు తమ వార్షికాదాయానికి పది రెట్ల మొత్తం, దీనికి అదనంగా అప్పులు తీసుకుని ఉంటే ఆ మొత్తానికి కూడా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత, ఇతర రుణాలు కొంత మంది వైద్య పరమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, వివాహాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకుంటుంటారు. వడ్డీ భారం ఎక్కువగా ఉండే వ్యక్తిగత రుణాలను ఎక్కువగా తీసుకోవటం సరికాదు. తప్పనిసరి అయితే వీటికి చేసే చెల్లింపులు తమ వేతనంలో 10 శాతం దాటకుండా చూసుకోవాలనేది ఒక నియమం. అంతకు మించితే అది ఆర్థిక లక్ష్యాలకు విఘాతంగా మారుతుంది. వేతనంలో 50 శాతం దాటితే అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. -
భారీగా తగ్గనున్న ఈఎంఐలు..!
ముంబై: నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ500,రూ.1000 నిషేధ నిర్ణయం దీర్ఘకాలంలో గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలుంటాయని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా బ్యాంకులు అందజేసే రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయని, తద్వారా ఈఎంఐల భారం కూడా తగ్గనుందని విశ్లేషిస్తున్నారు. ఈ పెద్దనోట్ల రద్దుతో అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు విపరీతంగా పెరగనున్నా యంటున్నారు. అయితే గత రెండేళ్లుగా క్షీణిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు మరింత పతనమవుతాయని భావిస్తున్నారు. డీమానిటైజేషన్ ప్రభావం స్వల్పకాలంలో తక్కువగానే ఉన్నప్పటికీ, తక్కువ వడ్డీ రేట్లు తక్కువ ఈఎంఐల ప్రభావంతో దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు. వినియోగదారుల చేతిలో తక్కువ నగదు నిల్వలు, ద్రవ్యోల్బణం క్షీణత, బ్యాంకుల వద్ద పెరిగిన మూల ధన నిల్వలు ఈ పరిస్థితికి దోహదపడనున్నాయని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణ క్షీణతకారణంగా ముందు ముందు వడ్డీరేట్లు మరింత దిగి వచ్చే అవకాశం ఉందని ఔట్ లుక్ ఏసియా క్యాపిటల్ సీఈవో మనోజ్ నాగ్ పాల్అభప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించనుందన్నారు. నోట్ల ఉపసంహరణ కారణంగా ఖాతాదారుల్లో ఖాతాలో నగదు నిల్వలు భారీగా పెరగనున్నాయని మరో ఎనలిస్టు అజయ్ బగ్గా చెబుతున్నారు. కనీసం నాలుగునుంచి అయిదు లక్షల కోట్ల రూపాయలకు పెరగనున్నాయన్నారు. గణాంకాల ప్రకారం ప్రస్తుతం చెలమాణీలోఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో 85 శాతం (17లక్షల కోట్లు) వాటా నిషేధిత నోట్లదే. కాగా పెద్ద నోట్ల రద్దుతో సాధారణ స్థాయి కంటే సగటున రెండు, మూడు రెట్లు అధికంగా దాదాపు అన్ని శాఖల్లో డిపాజిట్లు నమోదుకానున్నట్టు బ్యాంకుర్లు కూడా అంచనావేస్తున్నారు. రెండు, మూడో అంచె పట్టణాల్లోని మధ్య తరగతి వర్గం, ఉద్యోగులు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న ధోరణి నెలకొందని, ఇది మరికొన్న రోజులు కొనసాగవచ్చని ఆశిస్తున్న సంగతి తెలిసిందే. -
తగ్గనున్న గృహరుణాల ఈఎంఐలు
భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 25 పాయింట్లు, వడ్డీ రేట్లను 6.25శాతానికి తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు గృహ రుణాల చెల్లింపుదారుల పాలిట వరమే. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండిగ్ రేట్స్(ఎమ్ సీఎల్ఆర్)ను అనుసరిస్తున్న విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన వడ్డీ రేట్ల తగ్గుదల లాభాలను వినియోగదారులకు బ్యాంకులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు లోన్ తీసుకునే సమయంలో ఉన్న వడ్డీ రేట్లనే రుణం తీరిపోయే వరకూ బ్యాంకులు పాటించేవి. అంటే లోన్ తీసుకున్న వ్యక్తి ఆ మొత్తం చెల్లించే వరకూ సమకాలీన మార్పులతో సంబంధం లేకుండా వడ్డీ చెల్లింపులు చేయాల్సివచ్చేది. ఏప్రిల్1 కంటే ముందు లోన్లు తీసుకున్నవారు కూడా ఎమ్ సీఎల్ఆర్ వడ్డీ రేట్ల విధానానికి మారవచ్చు. ఆర్బీఐ రెపో రేటును కూడా తగ్గించడంతో సాధారణ వడ్డీ రేట్లు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు తాజా నిర్ణయం వల్ల మార్కెట్ లోకి ధన ప్రవాహం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2015 జనవరి నుంచి ఇప్పటివరకూ రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 175 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. కాగా తగ్గిన వడ్డీ రేట్లలో పావు శాతానికి పైగా మాత్రమే వినియోగదారుల వద్దకు వెళ్లింది. ఆర్బీఐ తగ్గించిన 25 పాయింట్ల రెపో రేటుకు చెందిన ఫలాలు వినియోగదారులను చేరితే.. రూ.30 లక్షలను(20 ఏళ్ల చెల్లింపు) గృహ రుణంగా తీసుకున్న వారికి చెల్లించాల్సిన మొత్తంలో ఏడాదికి రూ.5,855లు తగ్గుతాయి. అదే రూ.50 లక్షలు(20 ఏళ్ల చెల్లింపు), రూ.75లక్షలు(20 ఏళ్ల చెల్లింపు) రుణాలు తీసుకున్న వారికి ఏడాదికి రూ.9,759లు, రూ.14,638లు తగ్గుతాయి. -
ఆర్బీఐ నిర్ణయంతో వాహన, గృహ రుణాలు తగ్గుతాయా?
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన మానిటరీ పాలసీ రివ్యూ కమిటీ తన తొలి సమీక్షలో పండుగ కానుక అందించింది. వడ్డీరోట్ల కోత ఉండక పోవచ్చని, యథాతథంగా ఉంటుందనే ఎనలిస్టులు విభిన్న అంచనాల మధ్య ఆర్ బీఐ రెపో రేట్లలో కోత పెట్టి అందర్నీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. రెపో రేటులో 0.25 శాతం తగ్గింపు ప్రకటన మంగళవారం దలాల్ స్ట్రీట్ లో జోష్ పెంచింది. తొలిసారి ఏర్పాటైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల తగ్గింపునకే మొగ్గు చూపింది. రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగివచ్చి ఆరేళ్ల కనిష్టానికి చేరింది. ద్రవ్య నిష్పత్తి (ఎస్ఎల్ఆర్) 4 శాతం గా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 20,75 శాతం యథాతథంగా ఉంచింది. 2 015 సం.రంనుంచి దాదాపు 175 పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది. దీంతో వాహన, గృహ రుణాలు తగ్గుముఖం పట్టునున్నాయనే ఆశలుమార్కెట్ వర్గాల్లో చిగురించాయి. ఆర్ బీఐ గవర్నర్ హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడిన ఉర్జిత్ పటేల్ (52)పలు కీలక అంశాలను ప్రస్తావించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న కస్టమర్లకు లబ్ధిని చేకూర్చడంతో పాటు మరింత తక్కువ రేట్లకు నూతన రుణాల లభ్యతను పెంచే లక్ష్యంతో రెపో రేటును పావు శాతం మేరకు తగ్గించినట్టు చెప్పారు. బ్యాంకులకు గుదిబండగా మారిన బ్యాడ్ లోన్ల అంశంపై దృష్టి పెట్టామన్నారు. ఇది మానిటరీ పాలసీ ఎకగ్రీవ నిర్ణయమని ఉర్జిత్ పటేల్ వెల్లడించారు. ద్రవ్య వైఖరి లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. రోడ్డు రైల్వేలు భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని, వ్యాపారంలో సౌలభ్యం, పప్పుల సరఫరాలో వృద్ది, పోటీ ర్యాంకింగ్ లో వృద్ది ఉండనుందని ఉర్జిత్ పటేల్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడుతున్న సంక్షోభ పరిణామాల నుంచి సులువుగా, వేగంగా బయటపడేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణంతో పాటు సంతృప్తికరంగా ఉన్న రుతుపవనాలు, పంట దిగుబడి పెరగనుందన్న అంచనాలు తమ నిర్ణయానికి కారణమని ఆయన తెలిపారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు వెంటనే రుణ తగ్గింపు చర్యలు చేపట్టి వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించాలని ఉర్జిత్ కోరారు. అలాగే వచ్చే ఏడాది అమలులోకి రానున్న జీఎస్టీ (వస్తు సేవల పన్ను) దేశంలో పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచనుందని, మరిన్ని విదేశీ పెట్టుబడులు దేశానికి తరలి రానున్నాయని పటేల్ పేర్కొన్నారు. -
‘అప్పు’డే చదువుకుంటారా?
- ఖర్చుతో పాటే పెరుగుతున్న విద్యా రుణాలు - సగటు రుణంలో ఏడాదికి 35 శాతం పెరుగుదల - ఈ రంగంలోనూ పెరుగుతున్న మొండి బకాయిలు - అప్పులిచ్చేటపుడు ఆచితూచి వ్యవహరిస్తున్న బ్యాంకులు - కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం విద్యా రుణం సులువే - తొలి ఏడాది నుంచే తిరిగి చెల్లిస్తే ఈఎంఐలూ భారం కావు చదువంటే మాటలు కాదు. మంచి స్కూల్లో ఎల్కేజీలో చేర్చి డొనేషన్‌తో సహా వార్షిక ఫీజులు కట్టాలంటేనే... మధ్య తరగతి మనిషికి చుక్కలు కనిపిస్తాయి. ఇక చదువు పెరిగేకొద్దీ డబ్బుల లెక్కలూ పెరుగుతుంటాయి. ఎస్ఎస్సీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ... ఇలా ఏదో ఒక స్ట్రీమ్‌లో 10వ తరగతి అయిందనిపించాక అసలు కథ మొదలవుతుంది. ఇంటర్మీడియెట్‌కు ఏదో ఒక కార్పొరేట్ కాలేజీని ఆశ్రయించకతప్పదు. ఎందుకంటే ఏ ప్రొఫెషనల్ కోర్సుకైనా పునాది అక్కడే కనక. ఆ ఇంటర్ పూర్తయ్యాక... ప్రొఫెషనల్ కోర్సుల భారం మొయ్యటం ఎగువ మధ్య తరగతి వారికి కూడా అసాధ్యమే. ఇదిగో... ఇక్కడే బ్యాంకులు, ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. మీ చదువుకు మేం రుణమిస్తామంటూ విద్యారుణాలకోసం కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఈ విద్యారుణాలు ఎవరికిస్తారు? ఎంత ఇస్తారు? హామీ ఏం ఉండాలి? ఎలా తీర్చాలి? వడ్డీ ఎంత? ఇవన్నీ తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం... విద్యా ఖర్చులు ఏటికేడాది ఎలా పెరుగుతున్నాయో తెలుసుకోవాలంటే ఒక్కసారి క్రెడిట్ రేటింగ్ సంస్థ సిబిల్ గణాంకాలు చూడాలి. వీటి ప్రకారం 2013లో సగటు విద్యారుణం విలువ రూ.4.5 లక్షలు. 2014కు వచ్చేసరికి అది రూ.6 లక్షలకు చేరింది. అంటే ఒక ఏడాదిలో దాదాపు 35 శాతం పెరుగుదలన్న మాట. ఈ ఏడాది ఇది ఇంకా పెరగవచ్చన్నది బ్యాంకు వర్గాల మాట. విద్యా వ్యయం పెరుగుతుండటంతో సగటు రుణమే కాదు... రుణాలు తీసుకునేవారూ పెరుగుతున్నారు. రుణ మొత్తమూ పెరుగుతోంది. 2014లో రూ.53,334 కోట్లుగా ఉన్న విద్యారుణాలు 2015 మార్చినాటికి రూ.63,800 కోట్లకు చేరుకున్నాయి. అయితే ఆర్థిక వృద్ధి రేటు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మందగించి... రుణం తీసుకొని చదువుకున్న తర్వాత భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు లభించడం కష్టమవుతోంది. దీంతో విద్యారుణాల్లో మొండిబకాయిలు కూడా పేరుకుపోతున్నాయి. ఇవి క్రమంగా పెరుగుతుండటంతో ఇప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విద్యారుణాల మంజూరులో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం తిరిగి చెల్లించాల్సిందెప్పుడు? - విద్యారుణాలు మిగిలిన రుణాల్లా తీసుకున్న మరుసటి నెల నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు పూర్తయ్యాకే చెల్లించాలి. చాలా బ్యాంకులు కనీసం ఒక ఏడాది... లేదా ఉద్యోగం పొందిన ఆరు నెలల తర్వాత ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి నుంచి రుణం చెల్లించే అవకాశమిస్తున్నాయి. - కోర్సు చేస్తున్న కాలంలో సాధారణ వడ్డీని లెక్కకట్టి దాన్ని అసలుకి కలుపుతారు. అక్కడి నుంచి చక్రవడ్డీని లెక్కించి ఆ ప్రకారం ఈఎంఐ చెల్లించాలి. - రుణాన్ని గరిష్టంగా 8 సంవత్సరాల్లో చెల్లించడానికి బ్యాంకులు అనుమతిస్తున్నాయి. కాబట్టి విద్యారుణం భారం కాకుండా ఉండాలంటే తీసుకున్న తొలి ఏడాది నుంచే తిరిగి చెల్లించాలి. - చాలా బ్యాంకులు విద్యారుణాల్లో ముంధస్తు చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీలూ వసూలు చేయడం లేదు. లోన్ తీసుకున్న మరుసటి నెల నుంచే చెల్లించేవారికి కొన్ని బ్యాంకులు 1 శాతం రాయితీ కూడా ఇస్తున్నాయి. ఏయే చదువులకు..? - ఇంటర్ తరవాత చదివే కోర్సులన్నిటికీ విద్యా రుణం లభిస్తుంది. కాకుంటే వీటికి యూజీసీ, ఏఐసీటీఈ, ఐఎంసీ వంటి ప్రభుత్వ సంస్థల గుర్తింపు ఉండాలి. - ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చేసే కోర్సులు, డిప్లొమా, ఒకేషనల్ కోర్సులు, గ్యారంటీ ఉపాధి లభించే టీచర్, నర్సింగ్, పెలైట్ ట్రైనింగ్లకూ రుణాలిస్తారు. - ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ) గుర్తించిన 1,100 సంస్థల్లో చేసిన కోర్సులకే బ్యాంకులు విద్యా రుణాలిస్తున్నాయి. రుణం తీసుకునే సదరు కోర్సుకు, లేదా సంస్థకు ఐబీఏ గుర్తింపు ఉందా లేదా అన్న విషయం పరిశీలించడం మర్చిపోవద్దు. ఎంత రుణం... ఏ హామీ? - చాలా బ్యాంకులు ఇండియాలో చదివే కోర్సులకు గరిష్టంగా రూ. 10 లక్షల వరకు, కొన్ని ప్రత్యేక కోర్సులకు గరిష్టంగా రూ. 30 లక్షల వరకు రుణమిస్తున్నాయి. - విదేశీ విద్యకైతే గరిష్టంగా రూ.30 లక్షల వరకు.. కొన్ని ప్రత్యేక కోర్సులకు అవసరమైతే అంతకంటే ఎక్కువ మొత్తాన్ని కూడా ఇస్తున్నారు. - ఎంత రుణం వస్తుందనేది కోర్సు ఫీజు, కావాల్సిన పుస్తకాలు, ఇతర అవసరాలపై ఆధారపడి ఉంటుంది. రుణ మొత్తాన్ని లెక్కించడంలో కాలేజీ, స్కూల్, హాస్టల్‌కు చెల్లించాల్సిన ఫీజులు, ఎగ్జామినేషన్స్, లైబ్రరీ, ల్యాబరేటరీ, పుస్తకాలు, యూనిఫాంతో పాటు ఇతర పరికరాల ఖర్చులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. - రూ.4 లక్షల లోపు రుణానికి బ్యాంకులు ఎలాంటి హామీ అడగటం లేదు. రూ.4-7.5 లక్షల మధ్య అయితే థర్డ్‌పార్టీ గ్యారంటీని... ఆపై మొత్తానికి థర్డ్‌పార్టీతో పాటు ఏదైనా ఆస్తిని ష్యూరిటీగా చూపించాల్సి ఉంటుంది. వడ్డీ ఎంత? - విద్యారుణాలపై వడ్డీ ఎంతనేది రుణ మొత్తం, కాలపరిమితి, కోర్సు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇది బ్యాంకుల బేస్ రేటు కంటే 2-3 శాతం అధికంగా ఉంటుంది. - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.4 లక్షల లోపు రుణాలపై 13.35 శాతం, రూ.4-7.5 లక్షల మొత్తానికి 13.60%, ఆపై మొత్తానికి 11.6% వడ్డీ వసూలు చేస్తోంది. - చాలా బ్యాంకులు అమ్మాయిల విద్యా రుణాలకు 0.5 నుంచి 1 శాతం వరకు వడ్డీలో రాయితీ ఇస్తున్నాయి. రుణ గ్రహీతల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.5 లక్షల లోపు ఉన్నా వడ్డీ రాయితీ ఇస్తున్నారు. 2009 ఏప్రిల్ తర్వాత ఈ రాయితీ అమల్లోకి వచ్చింది.