Enemy Property Act
-
అమ్మకానికి ‘ఎనిమీ ప్రాపర్టీ’ షేర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా 84 కంపెనీల్లోని 2.91 లక్షల ’ఎనిమీ ప్రాపరీ్ట’ షేర్లను విక్రయించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి విడతలో 20 కంపెనీల్లో 1.88 లక్షల షేర్లను విక్రయించనుంది. ఇందుకోసం 10 కేటగిరీల కొనుగోలుదార్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఇందులో వ్యక్తులు, ప్రవాస భారతీయులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదార్లు, ట్రస్టులు, కంపెనీలు ఉన్నాయి. ఫిబ్రవరి 8 కల్లా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది. 1947–1962 మధ్య కాలంలో శతృదేశాలైన పాకిస్తాన్, చైనాకు వెళ్లిపోయి, అక్కడి పౌరసత్వం తీసుకున్న వారికి భారత్‌లో ఉన్న ఆస్తులను ’ఎనిమీ ప్రాపరీ్ట’గా వ్యవహరిస్తారు. ఇవి కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఫర్ ఇండియా (సీఈపీఐ) అ«దీనంలో ఉన్నాయి. బిడ్డర్లు తమకు ఏ కంపెనీల్లో ఎన్ని షేర్లు, ఏ ధరకు కావాలనేది బిడ్‌లో తెలపాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒకో కంపెనీ షేర్లకు నిర్దిష్ట ధరను రిజర్వ్ రేటుగా నిర్ణయిస్తుంది. దీన్ని వెల్లడించదు. అంతకన్నా తక్కువ రేటు కోట్ చేసే బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఈ ప్రక్రియకు మర్చంట్ బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది. -
జీఓ 111 రద్దు.. సంబరాల్లో ఆ ప్రాంత ప్రజలు.. కానీ, కొత్వాల్‌గూడ పరిస్థితి వేరు
శంషాబాద్: రాష్ట్ర సర్కారు ఇటీవల జీఓ 111ను పూర్తి స్థాయిలో ఎత్తివేసినట్లు చేసిన ప్రకటన.. ఈ పరిధిలోని అన్ని గ్రామాలు, బస్తీల్లోని ప్రజలకు ఎంతో కొంత సంతోషాన్ని కలిగించింది. కానీ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్‌గూడ రైతులు, భూ యజమానుల్లో మాత్రం ఆ ఛాయలు ఏ మాత్రం లేవు. దశాబ్దాలుగా భూములు సాగు చేస్తున్న రైతులకు సర్కారు జారీ చేస్తున్న రైతుబంధు, రైతుబీమాలు కూడా లేవు. అత్యవసరాల కోసం భూమిని విక్రయించుకునే కనీస వెసులుబాటు కూడా లేదు. జీఓ 111 మించిన సమస్య కొత్వాల్‌గూడ వాసులకు శత్రువుగా మారింది. అదే ‘ఎనిమి ప్రాపర్టీ’ సమస్య అసలు సమస్య ఇది.. ‘ఎనిమి ప్రాపర్టీ’ పేరులాగే అక్కడి రైతుల పాలిట శత్రువుగా మారింది. అరవై ఏళ్లుగా సాగుచేస్తున్న రైతులు అవస్థల పాలయ్యేలా చేస్తోంది. అసలు విషయం ఏమిటి? అప్పట్లో కొత్వాల్‌గూడ జాగీర్దారుగా ఉన్న సయ్యద్ హసన్ అబేదీ వారసుడు ఖమ్రుద్దీన్ వారసత్వంగా తనకు దక్కిన 650 ఎకరాల భూమిని 1967లో ముంబైలోని కస్టోడియన్ ప్రాపర్టీకి అప్పగించి పాకిస్థాన్ వెళ్లి స్థిరపడ్డాడు. ఇలా అప్పగించిన సదరు భూములను కేంద్ర హోంశాఖ పరిధిలోని ఎనిమి ప్రాపర్టీ కింద కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టీ పరిధిలోకి వెళ్లిపోయాయి. మరోవైపు 1969 వరకు స్థానికంగా ఉన్న సయ్యద్ హసన్ అబేదీ ఇక్కడి రైతులకు తన భూములను విక్రయించాడు. ఆయన వద్ద భూములు కొనుగోలు చేసిన సుమారు 200 పైచిలుకు రైతులు పట్టా, పహణీలతో పాటు 38ఈ భూ యజమాన్య హక్కుపత్రాలను రాష్ట్ర రెవిన్యూ విభాగం నుంచి పొందడంతో పాటు ఏళ్లుగా పన్ను లు సైతం చెల్లిస్తూ భూములను సాగు చేసుకోవడం ఇతరత్రా పనులతో జీవనోపాధి పొందుతున్నారు. ఏడేళ్ల కిందట పిడుగులా.. ఏడు సంవత్సరాల క్రితం కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ప్రాపరీ బోర్డు నుంచి కొత్వాల్‌గూడలోని సర్వేనంబరు 1 నుంచి 174 పరిధిలో మొత్తం 650 ఎకరాలు ఎనిమి ప్రాపర్టీ ఉందని జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు స్థానిక రెవిన్యూ అధికారులక లేఖలు అందాయి. దీంతో ఒక్కసారిగా రైతుల గుండెల్లో పిడుగు పడింది. సదరు భూములకు కొత్త పాస్‌బుక్‌లు సైతం రాష్ట్ర సర్కారు జారీ చేసింది. కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టీ ఆదేశాల మేరకు మూడేళ్ల క్రితం కొత్వాల్‌గూడకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లను సైతం నిలిపివేశారు. అప్పటి నుంచి భూములు ఎక్కడ కోల్పోతామోననే దిగులుతో రైతులు బతుకులీడిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం మళ్లీ.. ● 2021 అక్టోబరులో ముంబై కస్టోడియన్ ప్రాపర్టీ కార్యాలయం నుంచి అధికారులు మరోసారి రంగంలో దిగారు. ఎనిమి ప్రాపర్టీలో ఉన్న రైతులు కొందరికి నోటీసులు సైతం జారీ చేశారు. కొత్వాల్‌గూడ వార్డు కార్యాలయం వద్ద ప్రత్యేక సమావేశాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఎనిమి ప్రాపర్టీ సూచిస్తున్న సర్వే నంబర్లలోని భూ యజమానులు ఈ మెయిల్, లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పూర్తి వివరాలను పంపాల్సిందిగా సూచించారు. ● భూ యజమానులకు సగం యజమాన్య హక్కులు కచ్చితంగా దక్కుతాయని మిగతా సగం భూములకు సంబంధించి వేలంలో కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత కల్పిస్తామని సూచించారు. దీనిపై కొత్వాల్‌గూడ వాసులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. వివిధ పార్టీల నేతలతో పాటు అధికార పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే సహా రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కొత్వాల్‌గూడ వాసులు ఆందోళన విరమించారు. కస్టోడియన్ ప్రాపర్టీ అధికారులు మరోసారి ఇక్కడికి రాలేదు. సదరు భూముల్లో క్రయవిక్రయాలకు ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. తాజాగా జీఓ 111 తొలగిస్తున్నట్లు ప్రకటించినా ఎనిమి ప్రాపర్టీ సమస్య తీరేంతవరకు ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు తీవ్ర నిరాశలో ఉన్నారు. -
రీట్స్ ద్వారా సీపీఎస్ఈ స్థలాల విక్రయం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల స్థలాల విక్రయానికి రీట్స్ విధానాన్ని వినియోగించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అంతేకాకుండా శతృ ఆస్తుల విక్రయానికి కూడా రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్) విధానాన్ని ఉపయోగించుకునే విషయాన్ని సదరు శాఖ పరిశీలిస్తోంది. రీట్స్ విధానంపై ఆర్థిక శాఖ చూపు.... వ్యూహాత్మక విక్రయం కోసం గుర్తించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన కీలకం కాని ఆస్తులను కేంద్రం విక్రయించనున్నది. ఈ ఆస్తులను పూర్తిగా అమ్మేయడం కానీ, లీజుకు ఇవ్వడం కానీ, లేదా రీట్స్ విధానాన్ని గానీ చేపట్టాలని ఆర్థిక శాఖ యోచిస్తోంది. అలాగే శతృ స్థిరాస్తుల విక్రయానికి రీట్స్‌ను పరిశీలించాలని సదరు మంత్రిత్వ శాఖ భావిస్తోంది. పాకిస్తాన్, లేదా చైనా దేశాలకు వలస వెళ్లి భారత పౌరసత్వం కోల్పోయిన పౌరుల ఆస్తులను శతృ ఆస్తులుగా పరిగణిస్తారు. శతృ ఆస్తులకు కస్టోడియన్‌గా హోమ్ మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తుంది. 2014లోనే రీట్స్ నిబంధనలు... రీట్స్‌కు సంబంధించిన నిబంధనలను సెబీ 2014లోనే రూపొందించినా, ఇవి ఇంకా ప్రాచుర్యం పుంజుకోలేదు. ఇటీవలనే ఎంబసీ ఆఫీస్ పార్క్స్ సంస్థకు చెందిన రీట్ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్, అమెరికాకు చెందిన ప్రముఖ పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్‌లు సంయుక్తంగా ఎంబసీ ఆఫీస్ పార్క్స్ జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశాయి. రూ.300 ఇష్యూ ధరతో ఇటీవలనే ఐపీఓకు వచ్చిన ఈ సంస్ట్ రీట్ ఇప్పుడు రూ.337 ధర వద్ద ట్రేడవుతోంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సాధనంగా రీట్స్ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. రీట్స్ విధానంలో స్థలాలను ఒక ట్రస్ట్‌కు బదిలీ చేస్తారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రీట్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. -
ఐదోసారి వచ్చిందని అప్సెట్ అయ్యారు!
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ప్రభుత్వంపై నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఒక సవరణ బిల్లును ఇప్పటి వరకు చట్టంగా మార్చకుండా పదేపదే ఆర్డినెన్స్‌గా తన వద్దకు పంపించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఒకటి కాదు రెండుకాదు.. ఒక ఆర్డినెన్స్‌గా రాష్ట్రపతి వద్దకు ఆ బిల్లు రావడం అది ఐదోసారి. ఇంతకీ ఏమిటా బిల్లు అని అనుకుంటున్నారా? శత్రువుల ఆస్తుల చట్టానికి సవరణ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును తీసుకొచ్చింది. ఈ సవరణ బిల్లు ఆర్డినెన్స్‌కు ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ నాలుగుసార్లు ఆమోదముద్ర వేశారు. గతంలో వచ్చినప్పుడే కేంద్రం ఇప్పటి వరకు ఈ ఆర్డినెన్స్‌ను ఎందుకు చట్టంగా మార్చలేదని ప్రశ్నించినట్లు సమాచారం. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. అంతేకాకుండా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర లేకుండానే ఆసమయంలో ఆయన వద్దకు అది వచ్చిందట. ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు నిర్ణీత కాలం తీరేలోగానే చట్టంగా మార్చుకుంటే మంచిదని, అలా కాకుండా ఇలా పదేపదే ఆర్డినెన్స్‌గా మంజూరుచేయించుకుంటే దొడ్డిదారిని ఆ చట్టాన్ని అమలు చేస్తున్నట్లవుతుందని కూడా రాష్ట్రపతి అన్నట్లు సమాచారం. ఈ చట్టం 48 ఏళ్ల కిందటిది. ఇందులో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ బిల్లు సవరణకు లోక్ సభ ఓకే చెప్పింది కానీ, విపక్ష సభ్యులు మాత్రం రాజ్యసభలో అడ్డుకున్నారు. దీంతో ప్రస్తుతం కేంద్రం ఆర్డినెన్స్ ద్వారానే అమలు చేస్తోంది.