environement
-
Ashay Bhave: షూట్ ఎట్ ప్లాస్టిక్స్! నీవంతుగా ఒక పరిష్కారం..
ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి నిట్టూర్చడం కంటే.. ‘నీవంతుగా ఒక పరిష్కారం’ సూచించు అంటున్నాడు ముంబైకి చెందిన ఆశయ్ భవే. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్నీకర్స్ తయారుచేసే ‘థైలీ’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి విజయం సాధించాడు..మన దేశంలో ప్రతిరోజూ టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘థైలీ’ అనే కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలా పేరుకుపోకుండా తనవంతు కృషి చేస్తోంది. వ్యాపారపరంగా పెద్ద కంపెనీలతో పోటీ పడుతోంది.‘థైలీ’ అంటే హిందీలో సంచి అని అర్థం.‘ప్లాస్టిక్ సంచులను సరిగ్గా రీసైకిల్ చేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యం గణనీయంగా పెరుగుతుందనే విషయం తెలుసుకున్నాను. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి థైలీ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాను. పారేసిన ప్లాస్టిక్ సంచుల నుండి ప్రత్యేకంగా సృష్టించిన వినూత్న లెదర్‌ను స్నీకర్స్ కోసం వాడుతున్నాం’ అంటున్నాడు ఆశయ్ భవే.షూస్‌కు సంబంధించిన సోల్‌ను ఇండస్ట్రియల్ స్క్రాప్, టైర్ల నుండి రీసైకిల్ చేసిన రబ్బరుతో తయారుచేస్తారు. షూబాక్స్ను రీసైకిల్ చేసిన జతల నుండి కూడా తయారుచేస్తారు. వాటిలో విత్తనాలు నిక్షిప్తం చేస్తారు. మొక్కలు పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి. 2000 సంవత్సరంలో బాస్కెట్‌బాల్ స్నీకర్ ఫ్యాషన్‌ను దృష్టిలో పెట్టుకొని ‘థైలీ’ స్నీకర్ డిజైన్ చేశారు. డిస్కౌంట్ కావాలనుకునేవారు పాత స్నీకర్లు ఇస్తే సరిపోతుంది. షూ తయారీ ప్రక్రియలో ప్రతి దశలో పర్యావరణ స్పృహతో వ్యవహరించడం అనేది ఈ స్టార్టప్ ప్రత్యేకత. ఆశయ్ శ్రమ వృథా పోలేదు. కంపెనీకి ‘పెటా’ సర్టిఫికేషన్‌తో పాటు ఆ సంస్థ నుంచి ప్రతిష్ఠాత్మక ఉత్తమ స్నీకర్ అవార్డ్ లభించింది. పర్యావరణ స్పృహ మాట ఎలా ఉన్నా బడా కంపెనీలతో మార్కెట్లో పోటీ పడడడం అంత తేలిక కాదు.లాభ, నష్టాల మాట ఎలా ఉన్నా... ‘డోన్ట్ జస్ట్ డూ ఇట్ డూ ఇట్ రైట్’ అనేది కంపెనీ నినాదం.‘మా కృషికి గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని ప్రపంచం నా కల’ అంటున్నాడు 24 సంవత్సరాల ఆశయ్ భవే. న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో ఫుట్‌వేర్ డిజైన్ కోర్సు చేశాడు ఆశయ్. ఈ స్టార్టప్ పనితీరు, అంకితభావం పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రకు బాగా నచ్చింది. ‘థైలీ ఇన్స్పైరింగ్ స్టార్టప్. యూనికార్న్‌ల కంటే పర్యావరణ బాధ్యతతో వస్తున్న ఇలాంటి స్టార్టప్‌ల అవసరం ఎంతో ఉంది’ అంటూ ఆశయ్ భావేను ప్రశంసించాడు ఆనంద్ మహీంద్ర.ఆ పోటీని తట్టుకొని నిలబడింది ‘థైలీ’ కంపెని..‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాడక్ట్‌గా గుర్తింపు పొందిన ‘థైలీ’ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌పై కూడా దృష్టి సారించింది. ఇప్పటి వరకు కంపెనీ వేలాది ప్లాస్టిక్ బాటిల్స్, బ్యాగులను రీసైకిల్ చేసింది.ఇవి చదవండి: ముగ్గురు పాక్ హాకీ ఆటగాళ్లపై జీవితకాల నిషేధం -
ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం!
మనిషి బ్రతకడానికి ఊపిరి తీసుకుంటాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఊపిరి తీసుకోవడమే ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించింది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగి పోవడం వలన స్వచ్ఛమైన ప్రాణవాయువు శాతం తగ్గిపోతోంది. దీనివలన చిన్నారుల నుంచి సీని యర్ సిటిజన్స్ వరకు అనేక ఆరోగ్య సమస్యలు అనుభవించాల్సి వస్తోంది.మనం పీల్చే గాలిలో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి తీసుకున్న తరువాత శరీరంలోకి చేరిపోయి అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. మనదేశంలో అతిపెద్ద నగ రాలలో సంభవిస్తున్న మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో తెలిసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలలోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పి.ఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది. మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలిపింది. పి.ఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. 2.5 అంటే... గాలిలో ఉండే సూక్ష్మ కణాల వ్యాసం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఉన్నవని అర్థం. ఈ కణాలు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఇవి ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈ గాలిలోకి చేరే సల్ఫేట్లు, బొగ్గు సంబంధమైన కలుషితాల వంటివి ఊపిరితిత్తులకు పట్టేస్తున్నాయి. గుండెకు వెళ్లే రక్తపునాళాల్లో పేరుకుపోతున్నాయి.మనదేశంలోని పెద్ద పెద్ద నగరాలలో నిత్యం వెలువడుతున్న పి.ఎం 2.5 ధూళికణాల వలన మరణాలు రేటు నానాటికీ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగు తున్నట్లు ఒక పరిశోధనలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం ఒక రోజు అనగా 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం వుండదు, అంతకంటే పెరిగితే ముప్పు తప్పదు.భారతదేశ వాయు నాణ్యతా ప్రమాణాల ప్రకారం 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం అంతగా ఉండదు. కానీ మనదేశంలో ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తెలిసింది. క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. వాయు కాలుష్యం వలన బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మొనరీ వ్యాధులు, న్యూమోనియా, శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో చీకాకుతో పాటు దగ్గు, తుమ్ములు పెరుగుతాయి. దీనితో పాటు ఆస్తమా లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరి స్తున్నారు. ఈ వాయుకాలుష్యం ఇలానే పెరిగితే భూమికి రక్షణ కవచం అయిన ఓజోన్ పొర క్షీణించడం ఎక్కువవుతుంది. ఓజోన్ పొర దెబ్బతింటే యూవీ కిరణాలు నేరుగా భూమిపైన పడడం వలన చర్మ, నేత్ర సమస్యలు వస్తాయి. వ్యవసాయంపైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వాయుకాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వాలు సాధ్యమైనంత సత్వర చర్యలు తీసుకోవాలి. – మోతె రవికాంత్, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, హైదరాబాద్ -
గ్రీన్ చాయిసెస్..! ఎంపవర్ వాయిసెస్..!!
విశాఖపట్టణం పీ.ఎం పాలెంలోని ఈస్ట్రన్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్లో మానస తిన్ననూరి, స్పందన అంచల చేతుల మీదుగా పురుడు పోసుకుంది ‘బి ఎర్త్లీ’ అంకుర సంస్థ. కోటి మంది జీవితాలకు చేరువ కావాలనే లక్ష్యంతో వీరు తమ ప్రయాణాన్ని ్రపారంభించారు. ఇటీవల తమ సొంత స్టోర్ ‘వన సంపద’ను తూర్పు కనుమల జీవవైవిధ్య కేంద్రంలో ్రపారంభించారు. డిఎఫ్ఓ అనంత్ శంకర్ అందించిన సహకారంతో తమ కలను సాకారం చేసుకున్నారు.మానస బయోకెమిస్ట్రీలో పీజీ, ఎంబిఏ పూర్తిచేసి హార్వర్డ్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ హెల్త్ సిస్టమ్‌పై కోర్సు చేసింది. స్పందన ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఎంఐటి బూట్ క్యాంప్ ్రపోగ్రామ్ చేసింది. గత పదమూడు సంవత్సరాలుగా ఈ ఇద్దరు సామాజికసేవా రంగంలో పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో వాలెంటీలుగా పనిచేస్తూ పరిచయమయ్యారు.ప్లాస్టిక్‌ను నిరోధించాలి’ అనే నినాదంతో అగిపోకుండా ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి పరిశోధన చేసారు. దీనిలో భాగంగా చెట్ల నుంచి లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగించి, కార్యాలయాలు, ఇంటిలో ఉపకరించే వస్తువులను తయారుచేస్తున్నారు. రీసైకిల్డ్ పేపర్‌తో నోట్ పాడ్స్, డైరీలు, క్యాలెండర్లు తయారు చేస్తున్నారు. వీటిలో కంటికి కనిపించని చిన్న విత్తనాలను ఉంచుతారు. పెన్నులు, పుస్తకాలు వినియోగించిన తరువాత బయట పారవేసినా వాటిలో ఉండే విత్తనాలు సహజంగా మొలకెత్తుతాయి.రాఖీ పౌర్ణమి కోసం కొబ్బరి పెంకుతో సహజసిద్ధమైన రాఖీలు తయారుచేశారు. వెదురుతో టూత్ బ్రష్‌లు, దువ్వెనలు, పెన్‌స్టాండ్, మొబైల్ స్టాండ్, అందమైన రంగులతో కాటన్ చేతి సంచులు, మట్టి ప్రమిదలు, సీడ్ గణేష్, మట్టి, ఆవు పేడతో తయారు చేసిన కుండీలు...ఇలా పర్యావరణహితమైన ఎన్నో ఉత్పత్తులను వీరు తయారు చేసి విక్రయిస్తున్నారు. సంస్థ నినాదం గ్రీన్ చాయిసెస్.. ఎంపవర్ వాయిసెస్. వివిధ సందర్భాలలో బహుమతులుగా ఇవ్వడానికి ఉపయోగపడే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ వస్తువులను విశాఖకు అతి చేరువలో ఉన్న ఆదివాసీ గ్రామం శంభువానిపాలెంకు చెందిన ఆదివాసీ మహిళలతో చేయిస్తు వారికి ఉపాధి కల్పిస్తున్నారు. – వేదుల నరసింహం, ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం -
Aarti Kumar Rao: ప్రయాణ దారులలో.. ప్రకృతి గీతాలతో..
థార్‌లోని ఇసుక దిబ్బల గుండె సవ్వడి విన్నది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పర్వతశ్రేణులతో ఆత్మీయ స్నేహం చేసింది. అస్పాంలోని వరద మైదానాలలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న కనీళ్లను చూసింది. కేరళ, గోవా తీరాలలో ఎన్నో కథలు విన్నది. కొద్దిమందికి ప్రయాణం ప్రయాణం కోసం మాత్రమే కాదు. ఆనందమార్గం మాత్రమే కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక అన్వేషణ. తన అన్వేషణలో అందం నుంచి విధ్వంసం వరకు ప్రకృతికి సంబంధించి ఎన్నో కోణాలను కళ్లారా చూసింది బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్, రైటర్, ఆర్టిస్ట్ ఆరతి కుమార్ రావు....రాజస్థాన్‌లో ఒక చిన్న గ్రామానికి చెందిన చత్తర్‌సింగ్ గుక్కెడు నీటి కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పశ్చిమబెంగాల్లో ఒక బ్యారేజ్ నిర్మాణం వల్ల నిర్వాసితుడు అయిన తర్కిల్ భాయి నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు తక్కువేమీ కాదు. సుందర్బన్ప్రాంతానికి చెందిన ఆశిత్ మండల్ వేట మానుకొని వ్యవసాయం వైపు రావడానికి ఎంతో కథ ఉంది. బంగ్లాదేశ్‌లోని మత్స్యకార్మికుడి పిల్లాడిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేస్తే ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడ్చే దృశ్యం ఎప్పటికీ మరవలేనిది.ఒకటా... రెండా ఆరతి కుమార్ ఎన్నెన్ని జీవితాలను చూసింది! ఆ దృశ్యాలు ఊరకే ΄ోలేదు. అక్షరాలై పుస్తకంలోకి ప్రవహించాయి. ఛాయాచిత్రాలై కళ్లకు కట్టాయి. ఒక్కసారి గతంలోకి వెళితే... ‘ఉద్యోగం మానేస్తున్నావట ఎందుకు?’ అనే ప్రశ్నకు ఆరతి కుమార్ నోట వినిపించిన మాట అక్కడ ఉన్నవాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది.‘ప్రకృతి గురించి రాయాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం మానేస్తున్నాను’ అని చెప్పింది ఆమె. యూనివర్శిటీ ఆఫ్ పుణెలో ఎంఎస్సీ, థండర్ బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్–ఆరిజోనాలో ఎంబీఏ, ఆరిజోనా యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన ఆరతి అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఇన్‌టెల్‌లో ఉద్యోగం చేసింది. కొంత కాలం తరువాత తనకు ఉద్యోగం కరెక్ట్ కాదు అనుకుంది. సంచారానికే ప్రాధాన్యత ఇచ్చింది.బ్రహ్మపుత్ర నది పరివాహకప్రాంతాలకు సంబంధించిన అనుభవాలను బ్లాగ్‌లో రాసింది. పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు ఎన్నోప్రాంతాలు తిరిగిన ఆరతి ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ పేరుతో రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ప్రకృతి అందాలే కాదు వివిధ రూ΄ాల్లో కొనసాగుతున్న పురా జ్ఞానం వరకు ఎన్నో అంశాల ప్రస్తావన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రకృతికి సంబంధించిన అందం నుంచి వైవిధ్యం వరకు, వైవిధ్యం నుంచి వైరుధ్యం వరకు తన ప్రయాణాలలో ఎన్నో విషయాలను తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను అక్షరాలు, ఛాయాచిత్రాలతో ప్రజలకు చేరువ చేస్తోంది ఆరతి కుమార్ రావు.భూమాత మాట్లాడుతోంది విందామా!ఆరతి కుమార్ రావు రాసిన‘మార్జిన్‌ల్యాండ్స్’ పుస్తకం కాలక్షేప పుస్తకం కాదు. కళ్లు తెరిపించే పుస్తకం. ఇది మనల్ని మనదైన జల సంస్కృతిని, వివిధ సాంస్కృతిక కళారూ΄ాలను పరిచయం చేస్తుంది.– ‘ప్రకృతి దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం తగినంత సమయాన్ని తప్పకుండా వెచ్చించాలి. దానిలో జీవించాలి. దానితో ఏకం కావాలి’ అంటుంది ఆరతి.– ఈ పుస్తకం ద్వారా మన సంస్కృతిలోని అద్భుతాలను మాత్రమే కాదు తెలిసో తెలియకో మనం అనుసరిస్తున్న హానికరమైన విధానాలు, ప్రకృతి విపత్తుల గురించి తెలియజేస్తుంది.– ‘మన సంప్రదాయ జ్ఞానంలో భూమిని వినండి అనే మాట ఉంది. భూమాత చెప్పే మాటలు వింటే ఏం చేయకూడదో, ఏం చేయాలో తెలుస్తుంది’ అంటుంది ఆరతి కుమార్ రావు.ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'! -
లోకం పచ్చగా ఉండాలంటే..!?
సమాజం ఎంత ఆధునికంగా మారితే ప్రకృతి అంత తీవ్రంగా ధ్వంసం మవుతున్నదనేది చరిత్ర చెబుతున్న పాఠం. అడవులను విచక్షణారహితంగా నరకడం, తిరిగి చెట్లను నాటాలనే బాధ్యతను విస్మరించడం, అవసరానికి మించి ప్లాస్టిక్‌ను వాడటం, కర్బన ఉద్గారాలను తగ్గించలేకపోవటం వంటి వివిధ కారణాల వల్ల పర్యావరణం కలుషితమయ్యి నేడు సమస్త మానవాళిపై కన్నెర్ర చేస్తోంది. దీంతో మానవ మనుగడే ప్రశ్నార్థకమయ్యింది.నేడు త్రాగడానికి మంచినీరు, శ్వాసించడానికి ఆక్సిజన్ దొరకని ఆందోళనకర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది మనం గర్వంగా చెప్పుకునే 5జీ ప్రపంచం. మనమంతా ఈ అవనిపై అతిథులం అనే సత్యాన్ని చాలామంది గ్రహించలేపోతున్నారు. భవిష్యత్ తరాలకు బతుకునీయాలంటే, బతుకు ఉండాలంటే ప్రపంచ దేశాలు సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రకృతితో స్నేహం చేయాలి. పచ్చదనాన్ని పరిమళించేలా చేయాలి.మనం నాటే చెట్ల ఎదుగుదలే మానవ నాగరికత ప్రగతిగా భావించాలి. చెట్లను నాటినట్లు నటించడం మానేయాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించాలి. జల వనరులను సంరక్షించాలి. అడవులను కాపాడుకోవాలి. సౌర విద్యుత్ వినియోగం పెంచాలి. వాయు కాలుష్యం తగ్గించాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలి. ఓజోన్ పొరను కాపాడాలి.సాంకేతికంగా ఎదుగుతూనే పర్యావరణ పరిరక్షణపై ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలి. భావి పౌరులైన విద్యార్థులకు మొక్కల పెంపకం, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలపై అవగాహనా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. ప్రకృతి ప్రాణంతో ఉంటేనే మనమంతా జీవంతో ఉంటాము. లేదంటే ప్రకృతి ప్రదర్శించే విధ్వంసాన్ని ఆపడం అసాధ్యం. ‘ప్రకృతి మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది, మన అంతులేని కోరికలను కాద’ని ఏనాడో గాంధీజీ అన్నారు. కాబట్టి మనిషి ప్రకృతిని దురాశతో కొల్లగొట్టి ధ్వంసం చేయకుండా అవసరం మేరకే దానిపై ఆధారపడాలి. అప్పుడు లోకం పచ్చగా ఉంటుంది. – ఫిజిక్స్ అరుణ్ కుమార్, నాగర్ కర్నూల్ -
కాలుష్య జలాలతో సాగు.. ఆరోగ్యానికి కీడు!
హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో ఒకప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడిన మంచినీటి చెరువులు జల కాలుష్యం వలన ప్రస్తుతం మురికి నీటి కూపాలుగా మారిపోయాయి. ఈ మురికినీటితో కూర కాయల సాగు అనేది విరివిగా జరుగుతోంది. ఈ విధంగా కూరగాయల సాగు చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 11 చెరువులను పునరుద్ధరించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.కలుషితం అయిన చెరువు నీటితో కూరగాయలను సాగు చేయడం వలన కూరగాయల లోనికి రసాయన కాలుష్య కారకాలు ప్రవేశించి ఆహారపు గొలుసు ద్వారా ‘బయో మాగ్నిఫికేషన్’ చెందడం వలన అనేక అనారోగ్య, పర్యావరణం సమస్యలు తలెత్తుతాయి.భారతదేశం అంతటా... ముఖ్యంగా దేశంలోని పెద్ద మెట్రోపాలిటన్ నగరాలలో, లెక్కలేనన్ని సంఖ్యలో రైతులు తమ పంటలను శుద్ధి చేయని మురుగునీటితో పెంచుతున్నారు. ఉపరితల నీటికి శుద్ధి చేయని వ్యర్థపదార్థాలు వచ్చి కలిసినట్లయితే ఆ నీరు కలుషితం అవుతుంది. ఈ కలుషితమైన నీటిని రైతులు వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. దీని వలన డయేరియా, చర్మవ్యాధులు, కంటి వ్యాధులు వంటివి రైతులకు సంక్రమించే అవకాశం ఉంది. కలుషిత నీటితో వ్యవసాయం చేయడం వలన వ్యవసాయ భూములను సారవంతం చేసే విలువైన సూక్ష్మజీవులు, డీకంపోజర్స్, వానపాములు వంటివి నశించిపోయి సారవంతమైన వ్యవసాయ భూమి నిస్సత్తువ వ్యవసాయ భూమిగా మారిపోతుంది.శుద్ధి చేయని వ్యర్థ జలాల వలన వ్యర్థ జలాలలోని భారీ లోహాలు మొక్కలను విషపూరితం చేస్తాయి. అలాగే ఇది ఆహార కాలుష్యానికి దారితీస్తుంది. అదేవిధంగా ఈ కూరగాయలలో విటమిన్లు లోపిస్తాయి. శరీరంలో రసాయన కాలుష్యకారకాలు పేరుకుపోతాయి. దీని ఫలితంగా క్యాన్సర్లు, జన్యు ఉత్పరివర్తనలు, పోషకాహార లోపం ఏర్పడవచ్చు.2000 నుండి 2003 వరకు పరిశోధన ప్రాజెక్ట్‌లో భాగంగా యూకే డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఢిల్లీలోని వివిధ మార్కెట్ల నుండి ఆజాద్‌పూర్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌నుండి సేకరించిన బచ్చలికూరలో భార లోహాల కాలుష్యాన్ని గుర్తించింది.2015 అధ్యయనంలో, భారతీయ పరిశోధకుల బృందం ఢిల్లీలోని ఐదు మార్కెట్లలో కూరగాయలలో కాడ్మియం, సీసం, జింక్, రాగి అవశేషాలను అంచనా వేసింది. విషపూరిత కలుషితాలకు గురైన కూరగాయలు, పండ్లు వంటి ప్రాథమిక ఉత్పత్తులను పరీక్షించడానికి ఈ రోజు వరకు నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఇండియాకు లేదు. ఆహార రంగంలో నియంత్రణాపరమైన పర్యవేక్షణ లేకపోవడం, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో నిరంతర వైఫల్యం భారతదేశ రైతులు, ఆహార కంపెనీలకు ఇబ్బందిగా మారింది.రైతులు తమ పంటలను పెంచడానికి మురుగునీటిని ఉపయోగించటానికి కార ణాలు అనేకం: వేగవంతమైన జనాభా పెరుగుదల, పట్టణీకరణ, ఆహారం కోసం పెరుగుతున్న డిమాండ్, తీవ్రంగా క్షీణిస్తున్న స్వచ్ఛమైన నీటి నిల్వలు. భూగర్భ జలాలు పడిపోవడం వలన బోర్లు పడక రైతులు కలుషితమైన నీటితో వ్యవసాయం చేస్తున్నారు.నీరు కాలుష్యమయం కాకుండా ఉండటానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. పండగల సందర్భాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలను మంచినీటి చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు కలుషితం అవుతోంది. దీనికి మంచి ఉదాహరణ హుస్సేన్ సాగర్. అందువల్ల మట్టి బొమ్మలనే నిమజ్జనం చేయాలి. గృహ వ్యర్థాలను, పారిశ్రామిక వ్యర్థాలను మంచి నీటి చెరువులలోనికి విడుదల చేయకూడదు. చెరువులను కబ్జా చేసి నివాస స్థలాలుగా మార్చడాన్ని నిరోధించాలి.డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను అవలంబించాలి. కలుషితమైన చెరువులను పునరుద్ధరించి తిరిగి మంచినీటి చెరువులుగా మార్చాలి. కలుషితమైన నీటితో వ్యవసాయ చేసే ప్రదేశాలను గుర్తించి అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మంచి నీటి చెరువులు విలువైన సహజ సంపద కాబట్టి ప్రభుత్వం, ప్రజలు సమష్టి కృషితో వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.– డా. శ్రీదరాల రాము, వ్యాసకర్త ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, 9441184667 -
Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన హరి ప్రసాద్. ఈఎస్జీ (ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) మేనేజ్మెంట్కు సంబంధించి మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు, కార్పోరేషన్లకు సహాయపడడానికి ‘బియాండ్ సస్టెయినబిలిటీ’ అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు.పది మందికి మేలు చేసే వ్యక్తులు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల గురించి విన్నప్పుడు, చదివినప్పుడు హరి ప్రసాద్ భావోద్వేగంతో కదిలిపోయేవాడు. ఫ్రీడమ్ ఫైటర్స్‌కు సంబంధించిన సినిమాలను చూసినప్పుడల్లా ‘నా వంతుగా సమాజానికి ఏదైనా చేయాలి’ అనుకునేవాడు.జీవితానికి పరమార్థం ఉండాలనే భావన చిన్న వయసులోనే హరి ప్రసాద్లో మొలకెత్తింది. కాలేజీ సెకండ్ ఇయర్లో వాతావరణ మార్పులపై వచ్చిన ఎన్నో డాక్యుమెంటరీలను చూశాడు. ‘ఇలా చూస్తూ బాధ పడాల్సిందేనా! నా వంతుగా ఏమీ చేయలేనా’ అనుకుంటూ ‘తప్పకుండా ఏదైనా చేయాలి’ అనే పట్టుదలతో క్లైమెట్ యాక్షన్ వైపు అడుగులు వేశాడు.ఆ పచ్చటి అడుగులు ‘బియాండ్ సస్టెయినబిలిటీ’ అనే స్టార్టప్ మొదలు పెట్టేలా చేశాయి. ఈఎస్జీ (ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) ప్రకారం పర్యావరణానికి సంబంధించి ఉన్నతస్థాయి ప్రమాణాలను సాధించడానికి మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు, పెద్ద సంస్థలకు ఈ స్టార్టప్ తోడ్పడుతోంది.‘ఆర్గనైజేషన్స్‌కు నాలెడ్జి పార్ట్‌నర్స్‌గా వ్యవహరిస్తాం’ అంటున్నాడు హరి ప్రసాద్. సస్టెయినబిలిటీ, బాటమ్–లైన్ చాలెంజెస్‌కు సంబంధించి సంస్థల విజన్‌ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా కార్బన్ మేనేజ్మెంట్పై దృష్టి పెడుతోంది బియాండ్ సస్టెయినబిలిటీ. కంపెనీల పర్యావరణ ప్రమాణాలకు సంబంధించి బేస్‌లైన్ స్టడీని నిర్వహిస్తోంది. కర్బన ఉద్గారాలు, వ్యర్థాల ఉత్పత్తి, మెటీరియల్ వినియోగం, కంపెనీ ఉద్యోగులలో వైవిధ్యం... మొదలైన అంశాలు ఇందులో ఉంటాయి.రకరకాల విషయాను దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తారు. కంపెనీలకు సంబంధించి షార్–్ట టర్మ్, మిడ్–టర్మ్, లాంగ్–టర్మ్ టార్గెట్లను సెట్ చేస్తారు. కెపాసిటీ డెవలప్మెంట్, కార్బన్ మేనేజ్మెంట్, ఈఎస్జీ మేనేజ్మెంట్, క్లెమేట్ చేంజ్....మొదలైన వాటిపై ఆన్లైన్, ఆఫ్లైన్లలో ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించింది బియాండ్ సస్టేనబిలిటీ.అవగాహన సదస్సుల ద్వారా 65కు పైగా కంపెనీలకు, వందలాది మంది ప్రజలకు దగ్గరైంది. తయారీ ప్రక్రియలో వాతావరణ ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఈ సదస్సులు కంపెనీలకు ఉపయోగపడుతున్నాయి.‘బియాండ్ సస్టెయినబిలిటీ వోఎస్’ పేరుతో టెక్ ప్లాట్‌ఫామ్ కూడా బిల్ట్ చేశారు. కంపెనీల పాస్ట్ పర్ఫార్మెన్స్తో పోల్చుతూ విశ్లేషణ చేయడమే కాదు సస్టెయినబిలిటీ పర్ఫార్మెన్స్ను మెరుగుపరుచుకోవడానికి ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది. స్థూలంగా చెప్పాలంటే... కంపెనీల మైండ్‌సెట్ మార్చడంలో, పర్యావరణ స్పృహ వైపు నడిపించడానికి ‘బియాండ్ సస్టేనబిలిటీ’ కీలక పాత్ర పోషి స్తోంది.స్టార్టప్‌కు ముందు..డిగ్రీ పూర్తి చేసిన తరువాత వాతావరణ మార్పుల గురించి లోతుగా తెలుసుకోవడానికి నెదర్‌ల్యాండ్స్‌లోని ‘యూనివర్శిటీ ఆఫ్ ట్వంటే’లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేశాడు హరి ప్రసాద్. కర్బన ఉద్గారాలు తగ్గించడానికి సంబంధించిన ఎన్నో ప్రయోగాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తన స్టార్టప్ మొదలు పెట్టడానికి ముందు ‘ఎస్పీ ఎడ్జ్’ అనే సోషల్ స్టార్టప్‌లో పనిచేసి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. – హరి ప్రసాద్ -
సమయం లేదు మిత్రమా!
‘మానవాళి సమష్టిగా పోరాడాలి. లేదంటే అది సామూహిక ఆత్మహత్యా సదృశమే!’ ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి చేసిన ఈ హెచ్చరిక అందరినీ ఆలోచింపజేస్తుండగా, ఐరాస సారథ్య ‘పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 27వ సదస్సు’ (యుఎన్–కాప్–27) ఆదివారం ఆరంభమైంది. ఈజిప్టులో సముద్రతీరంలోని రేవుపట్నమైన షర్మ్ ఎల్–షేక్‌లో 12 రోజుల ఈ సదస్సు మరోసారి పర్యావరణ సమస్యలపై దృష్టి సారించేలా చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంతో ఇంధన సంక్షోభం నేపథ్యంలో పాశ్చాత్య ప్రపంచం మళ్ళీ బొగ్గు వాడకం వైపు వెళుతున్న పరిస్థితుల్లో, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు సైతం బొగ్గువాడకం ఆపేస్తామనే పాత వాగ్దానం నుంచి పక్కకు తప్పుకొంటున్న వేళ ఈ సదస్సు జరుగుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉండే ఈజిప్ట్‌లో, లక్ష్యాల్లో భాగస్వాములు కావాల్సిన స్వతంత్ర పౌర సమాజం పట్ల వ్యతిరేకత చూపే ప్రభుత్వ హయాంలో సదస్సు సాగడం విచిత్రం. యుఎన్–కాప్‌లోని 195 సభ్యదేశాలతో పాటు వ్యాపారవేత్తలు, శాస్త్రజ్ఞులు, పర్యావరణ ఉద్యమకారులు – ఇలా సుమారు 45 వేల మందికి పైగా ఈసారి సదస్సులో పాల్గొంటున్నారు. పెరుగుతున్న వాతావరణ సంక్షోభం నేపథ్యంలో దశాబ్దాలుగా ఏటా సాగుతున్న ఈ మెగా ఈవెంట్ మరోసారి ప్రాథమిక అంశాలపై చర్చకు తెర తీసింది. ధరిత్రి ఉష్ణోగ్రతలో పెంపు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించరాదనేది ప్యారిస్ ఒప్పందం చేసుకున్నాం. మరి, ఆ దిశగా అడుగులు వేస్తున్నామా? వాస్తవానికి ఈ శతాబ్ది చివరకు 2 డిగ్రీల మించి తాపం పెరుగుతుందంటూ వాతావరణ మార్పులపై ఐరాస ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (యూఎన్ఎఫ్సీసీసీ) చేసిన తాజా హెచ్చరిక మన మొద్దునిద్రకు దర్పణం. లక్ష్యాలు పెట్టుకోవడం కాదు... వాటిని సాధించడానికి నిజాయతీగా కృషి అవసరమని అది చెప్పకనే చెబుతోంది. అందుకే వాతావరణ నష్టనివారణకు ధనిక దేశాలు నిధులివ్వాలంటూ వర్ధమాన ప్రపంచం పట్టుబట్టే పరిస్థితి ఈసారి నెలకొంది. వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల రీత్యా 2020 నుంచి 2025 వరకు ఏటా 100 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తామని ధనిక దేశాలు ఎప్పుడో వాగ్దానం చేశాయి. 2009లో కోపెన్‌హాగెన్ (కాప్15)లో ఇచ్చిన ఆ మాటనే 2015లో ప్యారిస్ (కాప్21)లోనూ పునరుద్ఘాటించాయి. కానీ, అతీగతీ లేదు. ఆ ‘వాతావరణ ద్రవ్యసహాయం’ కిందకు ఏవేం వస్తాయో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం, పారదర్శకంగా ఆ రుణాలిచ్చే వ్యవస్థ ఏర్పాటు కాకపోవడం విడ్డూరం. భూగోళంపై వాతావరణ మార్పుల పర్యవసానం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేదు. ఈ మార్పులకు ప్రధాన కారణమవుతున్న ధనిక దేశాలు తమ పొరుగునున్న బాధిత దేశాలపై సానుభూతి చూపితే సరిపోదు. దేశాల పరస్పర సహకారంతోనే వాతావరణ విపర్యయాల నుంచి బయటపడి మానవాళి మనుగడ సాగించగలదని గుర్తించాలి. ‘వాతావరణంపై సంఘీభావ ఒప్పందం’ అన్న ఐరాస పెద్ద తాజా అభిభాషణను ఆ కోణం నుంచి అర్థం చేసుకోవాలి. ఈ ఏడాది వివిధ దేశాల్లో తలెత్తిన వాతావరణ సంక్షోభాలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పాకిస్తాన్లో వచ్చిన భారీ వరదల్లో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆహార భద్రత సైతం చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది. పెనుతుపాను ఇయాన్ దెబ్బకు క్యూబాలో ప్రాథమిక వసతులన్నీ ఛిన్నాభిన్నమై, రోజుల తరబడి విద్యుచ్ఛక్తి లేకుండా గడపాల్సి వచ్చింది. వాతావరణ మార్పుల వల్ల 55 బాధితదేశాలు ఇప్పటికే 525 బిలియన్ డాలర్ల మేర నష్టపోతున్నా యని లెక్క. 2030 కల్లా అది మరింత పెరగనుంది. ధనిక దేశాల వాతావరణ విధ్వంసం దెబ్బకు, తమకే సంబంధం లేని వర్ధమాన దేశాలు 2040కి 1 ట్రిలియన్ డాలర్ల దాకా నష్టపోతాయట. అభివృద్ధి చెందిన దేశాలే ఈ నష్టాన్ని భర్తీ చేయాలని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు కోరుతున్నాయి. నష్టపరిహార నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజా ‘కాప్27’లో దీనిపై చర్చ జరగడం అభిలషణీయమే! గ్రీన్హౌస్ వాయువులను భారీగా విడుదల చేస్తున్న అమెరికా, ఐరోపా సమాజం (ఈయూ) మంకుపట్టు పడుతున్నాయి. నిరుడు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన ‘కాప్26’లో శాశ్వత నష్టం, సరిదిద్దుకోగల నష్టాల గురించి చర్చ జరపాలని వర్ధమాన దేశాలు కోరాయి. అమెరికా, ఈయూల తీవ్ర అభ్యంతరంతో అది జరగనే లేదు. ఇప్పుడు పాకిస్తాన్ మొదలు సోమాలియా, పసిఫిక్ మహా సముద్ర ద్వీపదేశాల దాకా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వాతావరణ మార్పులతో అతలాకుతలమవుతుండడంతో ‘చిరు ద్వీపదేశాల కూటమి’ సైతం ఆ బాధను బాపేలా ప్రపంచ ‘ప్రతిస్పందన నిధి’ కావాలని ప్రతిపాదిస్తోంది. భారత్ సైతం ఈ బాధల నివారణను భుజానికెత్తు కోవాలి. అభివృద్ధి చెందిన దేశాలను చర్చలకు రప్పించే నైతిక బాధ్యత వహించాలి. ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న ద్రవ్యోల్బణాల్ని సాకుగా చూపి, గ్లోబల్ నార్త్ దేశాలు వాతావరణ మార్పుల నివారణకు పెట్టుకున్న లక్ష్యాలను వెనక్కి నెట్టడం అభిలషణీయం కాదు. దాని పర్యవసానం ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులతో, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా తదితర దేశాల గ్లోబల్ సౌత్‌కే ఎక్కువ. నిజానికి, అమెరికాలో అనావృష్టి, ఆఫ్రికాలో కరవు, యూరప్‌లో వడగాడ్పులు ధనిక దేశాలకూ ప్రమాదఘంటికలే. ఇప్పుడు భూతాపోన్నతి నివారణ, నిధులపై మీనమేషాలు లెక్కిస్తే మొదటికే మోసం. సమయం లేదు మిత్రమా! త్వరపడాలి! -
అంతా కవరింగే! ఒట్టి మాటలే తప్ప ప్లాస్టిక్ నిషేధం నై
1 జూన్ 2018. జీహెచ్ఎంసీలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను 2022 లోగా పూర్తిగా నిషేధిస్తామని 2018లో పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా జరిగిన సమావేశంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అప్పటి యూఎన్ఈపీ(యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్సోలెంతో కలిసి ఆమేరకు ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారుల కోసం ఆరు ఎలక్ట్రిక్ కార్లను లాంఛనంగా ప్రారంభించారు. 4 జూన్ 2022. నిజంగానే గ్రేటర్లో ప్లాస్టిక్ నిషేధం.. ఈపాటికి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం అమలవుతాయనుకున్న వారి అంచనాలు తప్పాయి. ఏదీ జరగలేదు. నిర్ణీత మైక్రాన్లలోపు ప్లాస్టిక్ నిషేధం అమలు కాలేదు. సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం సాధ్యం కాలేదు. ప్రారంభించిన ఎలక్ట్రిక్ కార్లు ఏమయ్యాయో తెలియదు. సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లు గడిచిపోయినా నాలుగడుగులు కూడా ముందుకు పడలేదు. సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి, అనంతరం కమిషనర్‌గా పనిచేసిన దానకిశోర్ అమలు చర్యలు ప్రారంభించి, కొంతకాలం అమలు చేసినప్పటికీ, అనంతరం పూర్తిగా కనుమరుగైంది. చిరువ్యాపారులు, మాంసం దుకాణాల వారు సైతం చాలావరకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన పొంది అమలుకు శ్రీకారం చుట్టినప్పటికీ, తదుపరి అధికారుల అశ్రద్ధతో ఆ కార్యక్రమం కుంటుపడింది. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ కథనం. ఆమోదం సై.. అమలు నై ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో గత మార్చిలో మరోసారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి, 75 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ క్యారీబ్యాగుల నిషేధానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. అందుకు స్టాండింగ్ కమిటీ సైతం ఆమోదం తెలిపింది. కానీ, దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కేంద్రప్రభుత్వ నిబంధనల మేరకు గత సంవత్సరమే ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఏళ్ల తరబడి.. జీహెచ్ఎంసీలో దాదాపు దశాబ్దం క్రితమే ప్లాస్టిక్ నిషేధచర్యలు ప్రారంభమైనప్పటికీ, రాజకీయ నేతల జోక్యం.. ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల ప్రభావంతో ముందుకు సాగలేదు.జనార్దన్‌రెడ్డి, దానకిశోర్‌లు కమిషనర్లుగా వ్యవహరించే సమయంలో కొంతమేర అమలు జరిగినప్పటికీ, ఆ తర్వాత ఆ విషయమే మరిచిపోయారు.అప్పటి నిబంధనల కనుగుణంగా 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం అమలయ్యేలా తగిన చర్యలు చేపట్టారు. నాలాల్లోనూ ప్లాస్టికే.. జీహెచ్ఎంసీలో రోజుకు సగటున ఆరున్నరవేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, వాటిల్లో దాదాపు600 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే.నాలాల్లోని వ్యర్థాల్లో 40 శాతానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే. నాలాల్లో వరదనీరు సాఫీగా సాగకుండా ముంపు సమస్యలకు ఇదీ ఓ ముఖ్య కారణమేనని ఇంజినీర్లు పేర్కొన్నారు. నగరంలో ఏటా 73 కోట్ల ప్లాస్టిక్ క్యారీబ్యాగులు వినియోగిస్తున్నట్లు ఒక అంచనా. ప్లాస్టిక్ వ్యర్థాల్లో కేవలం 14 శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోంది. ప్లాస్టిక్ క్యారీబ్యాగ్నశించేందుకు 500 సంవత్సరాలకు పైగా పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. పెనాల్టీల కోసమేనా..? ప్లాస్టిక్ నిషేధంపై జీహెచ్ఎంసీ కొద్దిరోజులు హడావుడి చేయడం.. చిరువ్యాపారులపై పెనాల్టీలు విధించడం.. అనంతరం మరిచిపోవడం పరిపాటిగా మారింది. ఏళ్ల తరబడి ఇదే తంతు. దీని వల్ల అటు వ్యాపారులు, ఇటు ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేరు. వారికి డబ్బులు అవసరమైనప్పుడు పెనాల్టీల పేరిట వేధిస్తారని భావిస్తున్నారు. అంతేకాదు.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు చూపనిదే ఎంతకాలమైనా అమలు సాధ్యం కాదు. – మహేశ్, గోల్నాక ఉన్నది భూమి ఒక్కటే.. కాపాడుకోవాలి.. ఈ సంవత్సర పర్యావరణ దినోత్సవ థీమ్ ‘ఉన్నది ఒక్కటే భూమి’. దీన్ని పరిరక్షించుకునేందుకు వివిధ అంశాలతోపాటు ప్లాస్టిక్ వినియోగం మానేయాలి. భూమి, నీటిలో సైతం అంతం కాకుండా ఏళ్ల తరబడి ఉండే ప్లాస్టిక్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తుంది. – అశోక్ చక్రవర్తి, కవి (చదవండి: ‘సన్’ స్ట్రోక్స్! ఆన్లైన్ క్లాస్‌ల పేరిట గేమ్‌లకు బానిసగా...) -
యూఏఈలో రామ్కీ ఎన్విరో ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ తాజాగా యూఏఈలో ఓ ప్రాజెక్టును దక్కించుకుంది. రస్ అల్ ఖైమాలో పారిశ్రామిక ప్రమాదకర వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రస్ అల్ ఖైమా వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీతో ఈ మేరకు రామ్కీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
పుడమి సాక్షిగా..
-
అమర్‌రాజాను ప్రత్యేకంగా టార్గెట్ చేశామన్నది అవాస్తవం
-
భూతాపానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం
కొరుక్కుపేట: భూతాపానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అని ప్రముఖ నటి, సామాజికవేత్త ఫ్రిదాపింటో పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొంటూ.. రోసాటోమ్ స్టేట్ అటామిక్ ఎనర్జీ కార్పొరేషన్ నేతృత్వంలో వాతావరణ మార్పు సమస్యలపై మూడు డాక్యుమెంటరీ చిత్రాలు రూపొందించినట్టు తెలిపారు. భారత్, బంగ్లాదేశ్ దేశాల సహజ అవాసాలలో వృక్షజాలం, జంతు జాలంపై దృష్టి సారించి డాక్యుమెంటరీ, పశ్చిమ కనుమలు, తమిళనాడులోని వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలు, సుందర్బాన్ డెల్టా రిమోట్ స్థానాల్లో డ్యాక్యూమెంటరీ చిత్రీకరించినట్టు వివరించారు. ప్రపంచ దేశాలన్నీ భూతాపంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అయితే దానిపై తగిన దృష్టి సారించకపోవడంతో మానవాళికి పెను ప్రమాదంతోపాటు ప్రకృతి వైపరిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. అరుదైన వన్యప్రాణులను కాపాడుకోవాలన్నా, మనవ మనుగడ సాగాలన్న భూతాపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా ప్రతిఒక్కరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ సవాళ్లను పరిష్కరించడంలో రొసాటామ్ స్టేట్ అటామిక్ కార్పొరేషన్ కృషి హర్షణీయమన్నారు. కాలుష్యాన్ని తగ్గించే చర్యలతోపాటు మొక్కలను పెంచాల్సిన అవసరం ఉందని ఆమె ప్రకటనలో వెల్లడించారు. -
సరికొత్త సవాల్... మైక్రో ప్లాస్టిక్ ఫైబర్స్
అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ ఫైబర్ అవశేషాలు మన శరీరాల్లోకి శ్వాసించే గాలి, తినే ఆహారం, తాగే నీటి ద్వారా కూడా చేరుతున్నట్లు తాజాగా బయటపడింది. ఈ మైక్రో ప్లాస్టిక్ ఫైబర్లు ధరణిపైనే కాకుండా సముద్రాల్లో కూడా వ్యాపించినట్లు ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. (కొలాయి) నల్లా నీటిలోనూ ప్లాస్టిక్ అవశేషాలు ఉంటున్నాయి. ప్రస్తుతం మన రోజువారీ జీవితంలో అన్నిరకాల అవసరాలకు ఒదిగిపోయేలా ప్లాస్టిక్ రూపాంతరం చెందింది. వైద్య పరికరాలు మొదలుకుని విమానాల విడిభాగాల వరకు, మనం ధరించే బట్టలు ఇలా ఒకటేమిటి అన్ని వస్తువుల్లోనూ ప్లాస్టిక్ మిశ్రమమవుతోంది. తద్వారా ఉత్పన్నమవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, గాలి,నీరు, ఆహారంలో కలిసిపోవడం ఇప్పుడు పెను సవాల్‌గా మారింది. మానవాళి ఆరోగ్యం, చుట్టూ ఉండే పరిసరాలు, పశుపక్షాదులపై ప్లాస్టిక్ వ్యర్థాల దుష్ప్రభావం ఏ మేరకు పడుతుందనే దానిపై ఇంకా పూర్తిస్థాయిలో ప్రజల్లో అవగాహన ఏర్పడలేదు. సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు కనీసం 600 రకాల జీవజాతులపై ప్రభావం చూపుతున్నాయని అంచనా వేస్తున్నారు. చేపలు, రొయ్యల వంటి సముద్రపు ఆహార ఉత్పత్తుల వల్ల కూడా ప్లాస్టిక్ సూక్ష్మ రూపాల్లో మన శరీరాల్లోకి చేరుతోంది. పంట పొలాల్లోకి కూడా... ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‌లో 9 శాతం వరకు రీసైకిల్ అవుతుం డగా, 12 శాతం వరకు భస్మం చేయగలుగు తున్నారు. మిగతాదంతా కూడా భూమి, సముద్రాలు, ఇతర సహజసిద్ధ వనరులను కలుషితం చేస్తోంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్లాస్టిక్‌లో చాలా వరకు పర్యావరణరహితంగా నాశనం కానిదే ఉంది. అలా వాడి పడేసిన ప్లాస్టిక్ పూర్తిగా నాశనం అయ్యేందుకు వందేళ్లు పట్టొచ్చు. కాల్చివేయడం తప్ప పూర్తిస్థాయిలో దీనిని నిర్మూలించే అవకాశం లేదు. కాలిస్తే మళ్లీ విషవాయువులను పర్యావరణంలోకి విడుదల చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ అంతా ఏదో ఒక రూపంలో పర్యావరణంలోనే కొనసాగుతున్నట్లుగా భావిస్తున్నారు. ప్లాస్టిక్ అవశేషాలు పెద్ద మొత్తంలో వ్యర్థ జలాల శుద్ధీకరణ ప్లాంట్లలోకి చేరుకుంటున్నాయి. అయితే అక్కడి వడపోత యంత్రాలు ప్లాస్టిక్‌ను సగం వరకు మాత్రమే నియంత్రించగలుగు తున్నాయి. మిగతాది సూక్ష్మ రేణువుల రూపంలో ఐరోపా, అమెరికాల్లోని పొలాల్లోకి చేరుకుంటోందని ‘ది జర్నల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ పత్రికలో ప్రచురితమైన ఒక సర్వే తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం ఐరోపా వ్యవసాయ భూముల్లో 4.3 లక్షల టన్నులు, ఉత్తర అమెరికాలోని పొలాల్లో మూడు లక్షల టన్నుల వరకు ప్లాస్టిక్ అవశేషా లున్నట్లు స్పష్టమైంది. ఆహార పదార్థాల్లోకి కూడా చేరిన ప్లాస్టిక్ ముప్పును ఎదుర్కొనేం దుకు శాస్త్రజ్ఞులు మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నిషేధంపై నిర్లక్ష్యం
– పర్యావరణ పరిరక్షణ చర్యలు శూన్యం – విచ్చలవిడిగా పాలిథిన్, ప్లాస్టిక్ వినియోగం – నిషేధం ఉన్నా పట్టించుకోని యంత్రాంగం – ప్రకటనలకే పరిమితమవుతున్న ప్రభుత్వం ‘పర్యావరణ పరిరక్షణతోనే రాబోయే తరాలకు భవిష్యత్.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడతాం..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అంతా తరచూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తుంటారు. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు వాడితే కఠిన చర్యలంటూ హెచ్చరికలూ చేస్తుంటారు. వాటిపై నిషేధం ఉన్నా యంత్రాంగం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. దీంతో వాటి వినియోగం జిల్లాలో విచ్చలవిడిగా సాగుతోంది. తణుకు : జనజీవన స్రవంతిలో ప్లాస్టిక్ వాడకం భాగంగా మారింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వాడిపడేసిన ప్లాస్టిక్ సంచులు, కప్పులు, గ్లాసులే కనిపిస్తున్నాయి. పలు దుకాణాల్లో వీటిని గుట్టలుగా పడేసి విక్రయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించినా ఆ దిశగా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు ప్రజల్లో సైతం అవగాహన కనిపించకపోవడంతో జిల్లాలో నిషేధం అనే పదాన్నే నిషేధించినటై ్టంది. పా్లస్టిక్ భూతం పట్టణాల్లో ప్లాస్టిక్ నియంత్రణ ఉద్యమంలా చేపట్టాలి. ప్లాస్టిక్ వల్ల కాలుష్యం ఏర్పడటంతో పాటు భవిష్యత్‌లో భారీ వినాశాలకు కారణమవుతుందంటూ ఉన్నతాధికారులు చేసే ప్రకటనలు కేవలం ప్రచారానికే ఉపయోగపడుతున్నాయి. జిల్లాలో దాదాపు ఎక్కడా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించలేదు. గతంలో ప్రభుత్వం 20 మైక్రాన్లలోపు ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించింది. మళ్లీ కొన్నాళ్ల తర్వాత 40 మైక్రాన్లలోపు సంచులను, గ్లాసులను వినియోగించరాదంటూ కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు జీవో ఎంఎస్ 158 జారీ చేసింది. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్ సహా తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించే బాధ్యతను ఆయా కమిషనర్లకు అప్పగించారు. అయితే ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా అమలవుతున్న దాఖలాల్లేవు. ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తున్న దుకాణాలపైనా అధికారులు దాడులు చేయడంలేదు. పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ సంచులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. డ్రెయినేజీలు, మురుగునీటి కాలువలు, చెత్తకుండీలు ఇలా ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. వివిధ రకాల వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే వినియగదారులు కూడా ఇళ్ల వద్ద నుంచి సంచులు తీసుకురాకుండా ప్లాస్టిక్ బ్యాగ్‌లపైనే ఆధారపడుతున్నారు. సాధారణంగా ప్లాస్టిక్ ఉత్పత్తులు మట్టిలో కలవడానికి వేల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవి విషవాయువుగా మారి ప్రజలకు క్యాన్సర్, ఆస్తమా, పిల్లల మెదడు మొద్దుబారి జ్ఞాపకశక్తి నశించడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. ప్లాస్టిక్ కప్పుల ద్వారా టీ, కాఫీ వంటి వేడి పదార్థాలు తాగడం ద్వారా గొంతుకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్న పశువులు మత్యువు బారిన పడుతున్నాయి. జరిమానా ఇలా.. జిల్లాలో ఏలూరు సహా మిగిలిన పట్టణాలు, గ్రామాల్లో నిత్యం 500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. వీటిలో సుమారు 150 టన్నుల వరకు ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్లు, గ్లాసులు ఉంటున్నట్టు అంచనా. సాధారణంగా 40 మైక్రాన్లలోపు పాలిథిన్ కవర్లను విక్రయిస్తే మొదటిసారి కూడా రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఆ మొత్తం చెల్లించి మళ్లీ విక్రయిస్తే సంబంధిత షాపును సీజ్ చేస్తారు. ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు కొనుగోలు చేసిన వారి నుంచి రూ.200 నుంచి రూ.500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే జిల్లాలో రెండేళ్ల కాలంలో ఏలూరు సహా మిగిలిన పట్టణాల్లో కేవలం 110 మంది మాత్రమే కేసులు నమోదు చేశారు. వీటిలో కొవ్వూరులోనే 85 కేసులు నమోదు చేయగా నరసాపురం, భీమవరం, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో అసలు కేసులు నమోదు చేయలేదు. ఏలూరులో 10, తణుకు, పాలకొల్లులో 5 కేసులు చొప్పున, నిడదవోలులో 2 కేసులు నమోదు చేశారు. ఆయా మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్ వినియోగిస్తున్న, విక్రయిస్తున్న వారి నుంచి కేవలం రూ.1.70 లక్షలు మాత్రమే అపరాధ రుసుం విధించారు. ప్రణాళికలు చేస్తున్నాం పా్లస్టిక్ నియంత్రణకు సంబం«ధించి ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి. గతంలో కొన్ని మునిసిపాలిటీల్లో నిషేధం అమలు చేశాం. పటిష్ట ప్రణాళికలు చేసి అమలు చేయడానికి చర్యలు తీసుకుంటాం. – సకలారెడ్డి, మునిసిపల్ ఆర్డీ, రాజమండ్రి