ex husband
-
ప్రముఖ నటికి సర్జరీ.. షాకయ్యానన్న మాజీ భర్త!
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవల తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె సోదరుడు వెల్లడించారు. అయితే రాఖీసావంత్ గర్భాశయంలో భారీ కణతి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెకు సర్జరీ చేయాల్సి వచ్చిందని ఆమె మాజీ భర్త రితేశ్ సింగ్ తెలిపారు.ప్రస్తుతం రాఖీ సావంత్‌కు శస్త్రచికిత్స విజయవంతంగాపూర్తైనట్లు ఆమె మాజీ భర్త తెలిపారు. తాజాగా ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు దాదాపు 10 సెంటిమీటర్ల కణతిని తొలగించారని పేర్కొన్నారు. మే 18న శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారని వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతర ఆమె అపస్మారక స్థితిలో ఉందని మాజీ భర్త చెప్పారు. రాఖీ గర్భాశయంలో కణితి చాలా పెద్దదిగా ఉందని.. దాదాపు అరచేతి పరిమాణంలో ఉందని రితేశ్ తెలిపారు. మొదటిసారి అది చూసి తాను షాకయ్యానని చెప్పారు. ఆమెకు దాదాపు మూడు గంటల పాటు ఆపరేషన్ జరిగినట్లు వివరించారు. రాఖీ కోలుకోవాలంటూ ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
పశ్చిమబెంగాల్లోని బిష్ణుపూర్ లోక్‌సభ స్థానం మాజీ భార్యాభర్తల మధ్య రాజకీయ యుద్ధానికి వేదికగా మారింది! బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ సౌమిత్రఖాన్పై ఆయన మాజీ భార్య సుజాత మోండల్ బరిలో దిగారు. ఆమె టీఎంసీ తరఫున పోటీ చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సౌమిత్ర విజయం కోసం అన్నీ తానై కష్టపడ్డ సుజాత, ఈసారి తన గెలుపు గ్యారంటీ అంటున్నారు. ఈ మాజీ దంపతుల దంగల్‌లో గెలుపెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. బిష్ణుపూర్‌లో మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది... రాజకీయ విడాకులు...! సౌమిత్ర ఖాన్ 2014లో తృణమూల్ పార్టీ తరఫున విజయం సాధించి బిష్ణుపూర్పై వామపక్షాల పట్టును బద్దలు కొట్టారు. తరువాత బీజేపీలో చేరి 2019లోనూ గెలిచారు. అనంతరం ఆయన వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. ఉద్యోగాల ఆశ చూపి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ముందు సౌమిత్రపై కేసు నమోదైంది. బీజేపీలోకి మారినందునే మమత సర్కారు తనను తప్పుడు కేసులో ఇరికించిందని ఆయన ఆరోపించారు. ఈ కేసు కారణంగా 2019 ఎన్నికలప్పుడు ఆయన బంకురా జిల్లాలోకి ప్రవేశించకుండా కలకత్తా హైకోర్టు నిషేధించింది. దాంతో భర్త కోసం సుజాత అన్నీ తానై బిష్ణుపూర్‌లో ప్రచారం చేశారు. ఆమె కారణంగానే 2019లో ఖాన్ విజయం సాధించారంటారు. అయితే బీజేపీ తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ సుజాత 2020లో పార్టీని వీడారు. ఈ విషయంలో భర్త తనకు మద్దతుగా నిలవడం లేదని ఆయనకూ దూరమయ్యారు! ఆమె టీఎంసీలో చేరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరంబాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో సౌమిత్ర విడాకులిచ్చారు. ఆ వెంటనే సుజాత తన పేరు నుంచి ఖాన్‌ను తొలగించుకున్నారు. స్థానిక ఎన్నికల బరిలో దిగి బంకురా జిల్లా పరిషత్ సభ్యురాలిగా గెలిచారు. ఒకప్పుడు సీపీఎం కంచుకోట బిష్ణుపూర్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2014 దాకా సీపీఎంకు కంచుకోట. దీని పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి! తృణమూల్ రెండింట్లోనే గెలిచింది. ఈసారి సీపీఎం శీతల్ కెబర్టా అనే టీచర్‌ను బరిలో దింపింది. ఆమెకు కూడా నియోజకవర్గంలో మంచి ఆదరణ లభిస్తోంది. జిల్లాను గొప్ప పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడంతో పాటు నిరుద్యోగం, నీటి కొరత సమస్యలను పరిష్కరిస్తానన్న హామీలకు ప్రజలు బాగా స్పందిస్తున్నారు. సౌమిత్రపై అసంతృప్తి... తాగునీటి ఎద్దడి, రోడ్ల దుస్థితి బిష్ణుపూర్‌లో ప్రధాన సమస్యలు. ఎంపీగా ఇచ్చిన హామీలేవీ సౌమిత్రా నెరవేర్చలేదనే విమర్శ ఉంది. ఎన్నికల తర్వాత ఆయన కని్పంచనే లేదన్నది స్థానికుల ఆరోపణ. రోడ్ల దుస్థితికి తోడు నేత కార్మికుల దుస్థితి కూడా ఈ చారిత్రాత్మక పట్టణంలో మరో పెద్ద సమస్య. బిష్ణుపూర్ పట్టు చీరలకు ప్రసిద్ధి. కానీ చేనేత ఉత్పత్తులను సేకరణకు ఏర్పాట్లే లేవని కారి్మకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు తనదేనని సుజాత విశ్వాసంతో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆమె మాటలకు షాకయ్యా.. అంతా ఆ రోజు రాత్రే: నటి మాజీ భర్త షాకింగ్ కామెంట్స్
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటి లక్ష్మి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోయిన్గా దక్షిణాది సినిమాల్లో మెప్పించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆమె హీరోయిన్గా నటించిన పలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ తనదైన నటనతో మెప్పించారు. అయితే ఆమె నటనతో పాటు తన వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె మాజీ భర్త, తమిళ నటుడు మోహన్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. లక్ష్మి, మోహన్ శర్మ జంటగా చాలా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారి.. 1975లో వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన ఐదేళ్లకే భేదాభిప్రాయాలు రావడంతో 1980లోనే విడిపోయారు. తాజా ఇంటర్వ్యూలో లక్ష్మి తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకుంటే జీవితాంతం కుక్కలా నీ వెంటే ఉంటానని తనతో చెప్పిందని మోహన్ శర్మ వెల్లడించారు. మోహన్ శర్మ మాట్లాడుతూ.. 'ఓసారి నేను, లక్ష్మి షాప్‌కు వెళ్లాం. అక్కడ ఒక సెంట్ కొనాలని చెప్పా. అప్పట్లో దాని ధర రూ.500. జీవితంలోకి ఆహ్వానిస్తే.. నీ కుక్కలా ఉంటానని లక్ష్మి నన్ను అడిగింది. ఆ మాటలకు నేను షాకయ్యా. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. తొలిసారి ఓ అమ్మాయి తన ప్రేమను వ్యక్తం చేసింది. ఆ సమయంలో లక్ష్మి మాటలను సీరియస్‌గా తీసుకున్నా. ఆ తర్వాత కాల్ చేసి తన రూమ్‌కు రమ్మని పిలిచింది. నేను వెంటనే హోటల్‌కు వెళ్లా. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగింది. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నానని.. పెళ్లి గురించి ఆలోచనే లేదని చెప్పా. కానీ.. పెళ్లి చేసుకోవాలని లక్ష్మి అడిగాక నేను ఆమె నుదుటన కుంకుమ పెట్టా. తాను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చా. ఆ రాత్రే మేం భార్యభర్తలం అయ్యాం. ఆ తర్వాత మేం చెన్నైకి వచ్చి లాయర్ ద్వారా మా పెళ్లి విషయాన్ని మీడియాకు తెలియజేశాం' అని చెప్పారు. పెళ్లి తర్వాత మాకు కలిసే అవకాశం చాలా తక్కువగా ఉండేదని మోహన్ శర్మ తెలిపారు. అయితే లక్ష్మి చాలా తప్పులు చేశారని.. వాటన్నింటి గురించి తాను ఇప్పుడు చెప్పలేనని అన్నారు. ఆమె తన జీవితంలోకి మరో వ్యక్తిని రానిచ్చారని ఆరోపించారు. కూతురు ఐశ్వర్య, లక్ష్మి మధ్య తరచూ గొడవలు కూడా అయ్యేవని ఆయన వెల్లడించారు. కాగా.. 1980లో మోహన్‌తో విడాకులు తీసుకున్న లక్ష్మి.. ఆ తర్వాత దర్శకుడు శివచంద్రన్ను పెళ్లి చేసుకున్నారు. -
నరేష్‌తో పెళ్లి.. పవిత్ర లోకేష్‌పై మాజీ భర్త సుచేంద్ర సంచలన ఆరోపణలు!
సినీ నటుడు నరేష్-పవిత్రా లోకేష్‌లు పెళ్లిబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్లో ఉన్న వీరిద్దరు మార్చి 10న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినట్లు నరేష్ ప్రకటించాడు. మీ ఆశీర్వదాలు కావాలంటూ పెళ్లి వీడియో షేర్ చేశాడు. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి వ్వవహరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. నిజంగా పెళ్లి చేసుకున్నారా? లేక మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో షేర్ చేశారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా నరేశ్‌కు ఇది నాలుగవ పెళ్లి కాగా.. పవిత్రకు మూడో పెళ్లి అనే విషయం తెలిసిందే. చదవండి: హీరోగా కొడుకు లుక్ షేర్ చేస్తూ మురిసిపోయిన యాంకర్ సుమ అయితే వీరి పెళ్లి వీడియో బయటకు వచ్చిన అనంతరం పవిత్ర మొదటి భర్త, కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్గా ఆయన కన్నడ మీడియాతో ముచ్చటించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పవిత్ర-నరేష్ పెళ్లిపై సుచేంద్రకు ప్రశ్న ఎదురవగా మాజీ భార్యపై ఆయన తీవ్ర ఆరోపణలు చేసినట్లు కన్నడ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్లాన్ ప్రకారమే పవిత్ర నరేష్‌కు దగ్గరైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడట. అంతేకాదు ‘పవిత్ర లగ్జరీ లైఫ్ కోసం ఆమె ఏమైనా చేస్తుంది. ఆస్తి కోసమే నరేష్‌తో లవ్ ట్రాక్ నడిపింది. డబ్బు కోసం ఆమె ఎంతకైన దిగజారుతుంది. చదవండి: నా పిచ్చిని భరించే ఏకైక వ్యక్తివి నువ్వు: లాస్య ఎమోషనల్ పోస్ట్ కేవలం డబ్బు పిచ్చితోనే గతంలో ఇద్దరికి విడాకులు ఇచ్చింది. పవిత్ర పచ్చి అవకాశవాది. ఆ విషయం నరేష్ ఇంకా అర్థం కావట్లేదు. నరేష్‌కు దగ్గరై విజయ నిర్మల గారు సంపాదించిన రూ. 1500 కోట్ల ఆస్తిని కొట్టేయాలనేదే ఆమె ప్లాన్. ఈ విషయం నరేష్‌కు కూడా త్వరలోనే అర్థం అవుతుంది’ అంటూ పవిత్రపై సుచేంద్ర ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఆయన వ్యాఖ్యలతో మరోసారి నరేష్-పవిత్ర ప్రేమ, పెళ్లి వార్తల్లోకెక్కింది. కాగా గతంలో కూడా సుచేంద్ర ప్రసాద్ పవిత్రపై ఇలాంటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవిత్ర లోకేష్ మంచిది కాదని, ఆమెకు కాపురాలు కూల్చే బుద్ధి ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. -
అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..
హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం ఆమె అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ ఆమె హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు ఇటీవల యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంతో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించారు. దీంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే అప్పటికే అదితికి పెళ్లై విడాకులు అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను గతంలో ఆమె వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. 2009లో వీరి వివాహం జరగ్గా.. 2013లో వీరిద్దరూ విడిపోయారు. అయితే ఇటీవల ఆమె మాజీ భర్త సత్యదీప్ మిశ్రా బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు సత్యదీప్ మిశ్రా. ఈ సందర్భంగా తన మాజీ భార్య అదితిని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: నటుడిగా బ్రహ్మానందం ఎన్ని వందల కోట్లు సంపాదించాడో తెలుసా? ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘అదితితో నా రిలేషన్ కారణంగా ప్రేమపై నాకు విరక్తి కలిగింది. మరోసారి ప్రేమ, పెళ్లి అంటేనే భయం వేసింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు మళ్లీ రిలేషన్, ప్రేమ అంటే భయపడతారు. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం’ అని మిశ్రా చెప్పుకొచ్చాడు. ఇక అనంతరం మసాబాతో ప్రేమ, రెండో పెళ్లిపై స్పందిస్తూ.. ‘మా పెళ్లి చాలా సింపుల్‌గా జరగాలని అనుకున్నాం. అందుకే కొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత ఇండస్ట్రీ వాళ్ల కోసం చిన్న పార్టీ ఏర్పాటు చేశాం. ఎందుకంటే మా బంధాన్ని మేం రహస్యంగా ఉంచాలనుకోలేదు. ఎందుకంటే సీక్రెట్స్ అనేవి రిలేషన్స్‌ని ప్రభావితం చేస్తాయని నేను నమ్ముతాను. బంధాన్ని సొంతం చేసుకోవాలి.. ఒపెన్‌గా ఉండాలి’ అని పేర్కొంది. ఇక ఆయన సమాధానం విన్న కొందరు నెటిజన్లు ఇది పరోక్షంగా అదితిగా కౌంటర్ ఇచ్చాడా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రస్తుతం అదితి సిద్ధార్థ్‌తో సీక్రెట్ డేటింగ్లో ఉంది. ఇప్పటి వరకు తమ రిలేషన్‌ని అదితి కానీ, సిద్ధార్థ్ కానీ బయట పెట్టలేదు. ఇదిలా ఉంటే మసాబాకు కూడా ఇది రెండో వివాహమనే విషయం తెలిసిందే. చదవండి: యువత పాశ్చాత్య పోకడలపై కళాతపస్వీ విశ్వనాథ్ ఏమన్నారంటే.. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
రేప్ కేసు రద్దు.. మాజీ భర్తకు వెరైటీ శిక్ష
ఢిల్లీ: అత్యాచారం ఆరోపణలతో మాజీ భర్తపై కోర్టుకెక్కింది ఓ మహిళ. అయితే.. చివరికి ఇద్దరూ ఓ ఒప్పందానికి వచ్చి కేసు వాపసు తీసుకునే యత్నం చేశారు. మరి తమ విలువైన సమయాన్ని వృథా చేస్తే న్యాయస్థానం ఊరుకుంటుందా? అందుకే విచిత్రమైన ఓ శిక్ష విధించింది. నోయిడా, మయూర్ విహార్‌లో బర్గర్ సింగ్, వాట్ ఏ బర్గర్ పేరుతో సదరు వ్యక్తికి రెండు బర్గర్ రెస్టారెంట్లు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో బాధితురాలితో విడిపోయి.. మరో వివాహం చేసుకున్నాడతను. అయితే.. వైవాహిక బంధంలో తన భర్త శారీరకంగా, మానసికంగా తనను హింసించాడంటూ 2020లో ఆమె కోర్టును ఆశ్రయించింది. రెండేళ్లపాటు కోర్టులో కేసు విచారణ కొనసాగగా.. జులై4వ తేదీన న్యూఢిల్లీ సాకేత్ కోర్టులో మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. దీంతో ఆ మాజీ భార్య అతనిపై ఎఫ్ఐఆర్ రద్దుకు అంగీకారం తెలిపింది. అయితే.. ఈ పరిణామంపై జస్టిస్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, కోర్టుల విలువైన సమాయాన్ని వృథా చేశారు. ఈ వ్యవధిలో ఎన్నో కీలక అంశాలను చర్చించే వాళ్లం. కాబట్టి, పిటిషనర్ కచ్చితంగా సంఘానికి పనికొచ్చే ఏదైనా ఒక పని చేయాల్సిందే అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు.. అతనిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటే అనాథలకు బర్గర్ అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెండు అనాథశ్రమాలను ఎంచుకుని వంద మంది దాకా అనాథలకు బర్గర్ అందించాలని ఆ వ్యక్తిని ఆదేశించింది కోర్టు. పైగా శుభ్రమైన వాతావరణంలో ఆ బర్గర్లు తయారు చేయాలని, పోలీసులు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని చూసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. అంతేకాదు.. మాజీ భార్య సమయాన్ని సైతం వృధా చేసినందుకుగానూ రూ.4.5 లక్షలు పరిహారంగా చెల్లించాలని, అనాథలకు బర్గర్లు పంచే రోజునే అది చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. -
భర్త నుంచి విడిపోయాక ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నా: నటి
భర్త అర్బాజ్‌ఖాన్‌తో 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా ఇప్పుడు మరింత ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. పెళ్లి బంధం నుంచి విడిపోయాక తమ ఇద్దరికీ జీవితం పట్ల అవగాహన పెరిగిందని, మెరుగ్గా ఆలోచిస్తున్నామని పేర్కొంది. కాగా, 1998 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న మలైక, అర్బాజ్‌ఖాన్ 2017లో పెళ్లి బంధానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత ఆమె నటుడు అర్జున్ కపూర్‌తో, అతను జార్జియా యాండ్రియానితో రిలేషన్షిప్లో ఉన్నారు. 19 ఏళ్ల కుమారుడు అర్హాన్ ఖాన్‌కు తల్లిదండ్రులుగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. మాజీ భర్తతో మీరు టచ్‌లో ఉన్నారా? అని ప్రశ్నించగా మలైకా మాట్లాడుతూ.. నచ్చినట్టు బతకడమే జీవితమని ఆమె వ్యాఖ్యానించింది. జీవితంలో సంతోషం వెతుక్కోవాలని.. తన మాజీ భర్త, తాను అదే పని చేశామని చెప్పింది. అర్బాజ్‌ఖాన్ మంచి వ్యక్తి అని, అతను బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానని తెలిపింది. ఇద్దరు వ్యక్తులు చాలా అంశాల్లో మంచివారై ఉండినప్పటికీ.. కలిసి బతికే విషయాల్లో ఆ రకంగా ఉండకపోవచ్చని.. తమ దాంపత్య జీవితంలో అదే జరిగిందని వెల్లడించింది. కుమారుడితో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొంది. తన నిర్ణయాలను అతను గౌరవిస్తాడని, తాను సంతోషంగా ఉంటే అర్హాన్ ఆనందిస్తాడని చెప్పింది. ‘విడాకుల విషయమై ముందుగా నేనే నిర్ణయం తీసుకున్నా. నాకు ఏది సరైంది అనిపించిందో అదే చేశా. మనసుకి నచ్చిన నిర్ణయాలు తీసుకోవాడానికి భయపడొద్దు. ఇబ్బందులు సహజం.. వాటిని దాటుకుని ముందుకెళ్లాలి. అందరినీ సంతోషపెట్టాలనుకోవడం కుదరదు’ అని మలైకా పేర్కొంది. ఇండియన్ బెస్ట్ డాన్సర్ షోకు ఆమె గతంలో జడ్జిగా వ్యవహరించింది. ఇక అర్బాజ్ సోని లివ్ షో ప్రసారం చేయనున్న పొలిటికల్ డ్రామా తానావ్లో నటిస్తున్నాడు. -
ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్
Shweta Tiwari Hospitalised, Ex-Husband Reacts: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటి శ్వేతా తివారి త్వరగా కోలుకోవాలంటూ ఆమె మాజీ భర్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నా కొడుకు కస్టడీకి సంబంధించిన విషయం ప్రస్తుతం కోర్టులో ఉంది. కానీ శ్వేత త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. చాలామంది యాక్టర్స్(నటీనటులు) ప్రేక్షకుల నుంచి ఎక్కువ ప్రేమ పొందేందుకు, తమను తాము మరింత అందంగా చూపించుకునేందుకు డైట్ పేరిట తక్కువ తిని, ఎక్కువ వర్కవుట్స్ చేస్తూ తమ శరీరాన్ని ఒత్తిడికి గురి చేస్తారు. ఇలానే చేస్తూ పోతే ఏదో ఒకరోజు వారి గుండె అలిసిపోతుంది అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. చదవండి: అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే.. ఖత్రోన్ కే ఖిలాడి సీజన్11 ఫైనలిస్ట్, హిందీ సీరియల్ నటి శ్వేత తివారి బలహీనత, లో- బీపీ కారణంగా హాస్పిటల్ పాలైంది. షూటింగ్స్‌లో బిజీ ఉండటంతో తగినంత విశ్రాంతి తీసుకోకపోవడంతో ఆమె అనారోగ్యానికి గురైందని శ్వేత పీఆర్ టీం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో శ్వేతా తివారికి, భర్త అభినవ్‌తో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఓ రియాలిటీ షో కోసం కేప్‌టౌన్ వెళ్లేందుకు రెడీ అయిన శ్వేత.. తన కొడుకు రేయాన్ కోసం సరైన ఏర్పాట్లు చేయకుండానే దేశం విడిచి వెళ్తుందంటూ అభినవ్ ఆరోపించాడు. దీంతో తన కొడుకును బలవంతంగా అభినవ్ తీసుకెళ్లేందుకు చూస్తున్నాడంటూ సీసీటీవీ ఫుటేజిని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కాగా బాలీవుడ్ నటి శ్వేతా తివారి 2013లో అభినవ్ కోహ్లిని రెండో పెళ్లి చేసుకుంది. విభేదాల కారణంగా 2019లో వీరు విడిపోయారు. డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు View this post on Instagram A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) -
తండ్రితోనే కాపురం పెట్టిందని తెలిసి షాకైన కొడుకు
లక్నో: నాన్న చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని.. కనిపించడం లేదంటూ ఆర్టీఐకి అప్లికేషన్ పెట్టుకున్నాడు ఒక కొడుకు. కాగా ఆర్టీఐ తన నాన్నకు సంబంధించిన సమాచారం దొరికిందని చెప్పగానే జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసుకు సంతోషంగా వెళ్లాడు. కానీ వారు ఇచ్చిన వివరాలు చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కారణం ఆ యువకుడి నాన్న మరో యువతిని పెళ్లిచేసుకొని ఆమెతో కాపురం పెట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ యువతి ఎవరో కాదు.. ఐదేళ్ల కిత్రం ఆ యువకుడి మాజీ భార్యే కావడం విశేషం. ఇప్పుడు తన మాజీ భార్యనే పిన్నిగా పిలవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ వింత ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 2016లో సదరు యువకుడు మైనర్‌గా ఉన్నప్పుడు ఒక మైనర్ అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ యువకుడు రోజు తాగి వచ్చి ఆమెను వేధించేవాడు. ఆరు నెలల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. తర్వాత ఆ యువకుడు ఊరి పెద్దల మధ్య ఇక ఎప్పుడు గొడవపడనని చెప్పాడు. కానీ ఆ యువతి అందుకు ఒప్పుకోకుండా విడాకులు తీసుకుంది. కాగా ఆ యువకుడి తండ్రి సానిటేషన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగి. ఇంటి అవసరాలతో పాటు కొడుకుకు కూడా డబ్బులు తనే ఇస్తుండేవాడు. ఇటీవలే కొన్ని రోజుల నుంచి తన తండ్రి కనిపించడం లేదని.. ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయి సాంబల్ ప్రాంతంలో ఉంటున్నారని తెలుసుకొని ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి జాడ తెలిసిందనగానే జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరుకొని వారు అందించిన వివరాలు చదువుకున్నాడు. తన మాజీ భార్యనే నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడని, అక్కడే ఆమెతో కాపురం పెట్టాడని తెలుసుకున్నాడు. వెంటనే బసౌలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం అర్థం చేసుకున్న పోలీసులు జూలై 3న ఇరు వర్గాలను పిలిచి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే యువకుడి తండ్రి భార్య మాత్రం ఇప్పుడు వరుసకు కొడుకు అయ్యే అతనితో కలిసి ఉండలేనని పేర్కొంది. తన రెండో భర్తతోనే సంతోషంగా ఉన్నానని.. అతన్ని మా దగ్గరకు పంపొద్దని పోలీసులకు చెప్పింది. పోలీసులు మరోసారి దీనిపై మాట్లాడదమని చెప్పి వారిని అక్కడినుంచి పంపించేశారు. -
అక్రమ వేట కేసులో ప్రముఖ గోల్ఫ్ ప్లేయర్ అరెస్ట్
లక్నో : అక్రమంగా వేటాడుతున్నరనే కేసులో భారత గోల్ఫర్ జ్యోతి రంధావాను ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రంధావ వద్ద నుంచి ఏ - 22 రైఫిల్, వాహనం (హెచ్ఆర్26 డీఎన్ 5299)తో పాటు వేట సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కతెర్నియాఘాట్లోని మోతిపూర్లో రంధావకు వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ అనుమానాస్పదంగా వాహనం నడుతుపుతుండటంతో పోలీసులు రంధావాను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అతని వద్ద నుంచి అడవి పంది చర్మం, బైనాక్యులర్‌తో పాటు రంధావ పేరు మీద రిజిస్టర్ అయిన వాహనాన్ని కూడా సీజ్ చేశారు. రంధావాను ప్రస్తుతం కతెర్నియాఘాట్ జిల్లా అటవీ అధికారి విచారిస్తున్నారు. చట్ట పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్ తరఫున ఒకప్పుడు అత్యుత్తమ గోల్ఫర్గా జ్యోతి రంధావ రికార్డులు సృష్టించారు. బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి బంధం ఎంతో కాలం నిలవలేదు. 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది జ్యోతి రంధావ ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారారు. ఆసియా టూర్లో 8 టైటిళ్లు గెలిచారు. 2004లో యూరోపియన్ టూర్లో జానీ వాకర్ క్లాసిక్‌తో కలిసి అత్యుత్తమంగా రెండో స్థానంలో నిలిచారు. గోల్ఫ్ ప్రపంచకప్ టోర్నీల్లో 2005, 2007, 2008, 2009లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. -
మాజీ భర్త ఘాతుకం : గ్యాంగ్‌రేప్, హత్య
జార్ఖండ్ : జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళపై (23) ఆమె మాజీ భర్త, మరో ఇద్దరితో కలిసి సామూహిక హత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు అతి దారుణంగా హింసించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. జంతర జిల్లాలోని నారాయణ పూరా పోలీస్ స్టేషన్లో పరిధిలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారి బీఎన్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం స్థానిక మహిళ సమీపంలో కాళీపూజా థియేటర్లో సినిమా చూడ్డానికి వెళ్లింది. దీన్ని గమనించిన ఆమె మాజీ భర్త పథకం పన్నాడు. సినిమా నుంచి తిరిగి వస్తున్న సమయంలో మరో ఇద్దరితో కలిసి ఆమెను అటకాయించాడు. సమీపంలోని పొలాల్లోకి తీసుకునిపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆ దుర్మార్గుల ఆగడాలు ఆగిపోలేదు. ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. అనంతరం అక్కడ్నించి పారిపోయారు. మరునాడు ఉదయం నిస్సహాయ స్థితిలో రోదిస్తున్న ఆమెను గమనించిన స్తానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ బాధితురాలి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం జంతర సదర్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. తన మాజీ భర్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా బాధితురాలు చెప్పిందన్న గ్రామస్తుల సమాచారం ఆధారంగా ఆమె మాజీ భర్తతోపాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారి సింగ్ వెల్లడించారు. -
మాజీ భర్తను దక్కించుకోవాలని సవతిపై అఘాయిత్యం
చండీగఢ్ : హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను మరో మహిళ చిత్రహింసలకు గురి చేసింది. అంబాలాలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత డిసెంబర్లో భర్త నుంచి విడాకులు తీసుకున్న నిందితురాలు.. అతడిపై పగ సాధించాలనుకుంది. ఇటీవల తన మాజీ భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో అతడి కాపురాన్ని కూల్చాలని తన కుంటుంబంతో కలిసి పథకం పన్నింది. కుటుంబ సభ్యులతో కలిసి బాధితుడి ఇంటిపై దాడి చేసిన సదరు మహిళ.. భార్యభర్తలను కిడ్నాప్ చేసి.. రెండు వేర్వేరు వాహనాల్లో వారిని పానిపట్‌కు తరలించారు. తన మాజీ భర్తకు విడాకులు ఇవ్వాలని బాధితురాలిని భయభ్రాంతులకు గురిచేసింది. ఆమె అంగీకరించక పోవడంతో తీవ్రంగా కొట్టడమే కాకుండా.. ఆమెపై సామూహిక అత్యాచారానికి ఉసిగొల్పింది. దాదాపు పదకొండున్నర గంటలు చిత్రహింసలు పెట్టిన అనంతరం గురువారం ఉదయం బహదుర్‌ఘర్‌లో బాధితులను విడిచిపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అకృత్యానికి పాల్పడిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని గురుగ్రామ్‌లో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. -
ట్విస్ట్: తెరపైకి షమీ భార్య మాజీ భర్త!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. షమీ భార్య హసీన్ జహాన్‌కు ఇదివరకే పెళ్లైనట్లు వార్తలు రావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఆమె మాజీ భర్తనంటూ షేకీ సైఫుద్దీన్ అనే పశ్చిమ బెంగాల్ వాసి ఒకరు మీడియా ముందుకు వచ్చారు. స్థానిక చానెల్ (జీ24 గంటా)తో మాట్లాడుతూ.. హసీన్ జహాన్ తన మాజీ భార్య అని, ఆమెను 2002లో పెళ్లి చేసుకున్నాని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్భమ్, సియూరిలో కొంత కాలం కాపురం చేసామన్నారు. అయితే తమ వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేదని, హసీన్‌ను తొలిసారి 2000 సంవత్సరంలో కలిసానని, అనంతరం వివాహంతో ఇద్దరం ఒక్కటయ్యామన్నారు. ఆమె ఇద్దరి కూతుళ్లకు కూడా జన్మనిచ్చిందన్నారు. 2003లో ఒకరిని, 2006లో మరొకరికి జన్మనిచ్చినట్లు సైఫుద్దీన్ తెలిపారు. అనంతరం సమస్యలు మొదలయ్యాయని, ఆమె ఉన్నత చదువులు చదువుకొని స్వతంత్రంగా నిలబడాలని కోరుకుందని, మధ్య తరగతి కుటుంబం కావడంతో అది సాధ్యం కాలేదన్నారు. దీంతోనే 2010లో విడాకులు తీసుకున్నామని, ఇద్దరు పిల్లలు హసిన్ దగ్గరే ఉండాలని, ఆమె వివాహనంతరం తండ్రి దగ్గరకు వెళ్లాలని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. షమీతో ఆమె వివాహనంతరం పిల్లలు తనవద్దకు వచ్చారన్నారు. షమీ, హసీన్ జహన్ల మధ్య వివాదం పరిష్కరమై ఒక్కటవ్వాలని సైఫుద్దీన్ కోరుకున్నారు. హసీన్ కూతుళ్లు మాట్లాడుతూ.. తన తల్లి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలన్నారు. సెలవుల్లో తన తల్లిని కలుస్తామని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు మీడియా ముందు ప్రశాంతంగా మాట్లాడిన హసీన్ మంగళవారం మీడియాపై అసహన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఆమెకు ఇదివరకే పెళ్లైందా లేదనే విషయం అధికారికంగా తెలియరాలేదు. ఇక షమీ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని, తనను వేధించాడని హాసిన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలతో షమీ క్రికెట్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. -
భానుప్రియ మాజీ భర్త మృతి
ప్రముఖ నటి భానుప్రియ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ అమెరికాలో గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరణవార్త తెలిసిన వెంటనే భానుప్రియ అమెరికాకు బయలుదేరినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న భానుప్రియ 1998లో ఆదర్శ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. ఈ జంటకు అభినయ అనే కుమార్తె ఉంది. అయితే మనస్పర్థల కారణంగా 2005లో భర్తతో విడాకులు తీసుకున్న భానుప్రియ తిరిగి ఇండియాకు వచ్చేశారు. ప్రస్తుతం కుమార్తెతో పాటు ఆమె చెన్నైలో నివాసం ఉంటున్నారు. కొంత విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆమె సపోర్టింగ్ రోల్స్‌లో కనిపిస్తున్నారు. దాంతో పాటు కూచిపూడి, భరతనాట్యం లలో చాలామందికి భానుప్రియ శిక్షణ ఇస్తున్నారు. -
మాజీ భర్తను మళ్లీ పెళ్లి చేసుకుంటా: సింగర్
లాస్ ఏంజిల్స్: ప్రముఖ పాప్ సింగర్ మడోన్నా తాజాగా తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తన మాజీ భర్త ష్యాన్ పెన్ను మళ్లీ పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రకటించింది. అందుకు బదులుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం 1.50 లక్షల డాలర్లు (రూ. కోటి 2 లక్షలు) ఇస్తానని ష్యాన్ ప్రకటించాడు. ఆఫ్రికా దేశం మలావి కోసం విరాళాలు సేకరించేందుకు అమెరికాలోని మియామి ఆర్ట్ బేస్‌లో మడోన్నా ప్రత్యేక గాలా ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె మాజీ భర్త ష్యాన్ పెన్ 1.50 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించగా.. అందుకు బదులుగా అతనిపై ఉన్న తన ప్రేమను మడోన్నా వెల్లడించింది. అతనిపై తనకు ఇప్పటికీ ప్రేమ ఉందని ప్రకటించింది. ఆయనను మళ్లీ చేసుకుంటానని సరదాగా ప్రకటించింది. భారీగా విరాళాలు సేకరించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో లియోనార్డో డికాప్రియో వంటి హాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. హాట్‌గా హాట్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మడోన్నా.. తన వస్తువులు, ఒక కారు, డిజైనర్ నగలు, మాజీ భర్త ష్యాన్ పెన్‌తో కలిసి ఉన్నప్పుడు దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు వేలం వేసి విరాళాలు సాధించింది. మొత్తం 7.5 మిలియన్ డాలర్ల (రూ. 51 కోట్ల)ను సేకరించింది. ఈ సందర్భంగా అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. -
మాజీ భర్తతో సీత
దక్షిణాదిలో పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ తారల్లో నటి సీత ఒకరు. ఆమె తమిళం, తెలుగు భాషల్లో కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్నారు. నటుడు పార్తిబన్‌తో కలిసి పుదియపాదై చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. అలాగే వారిద్దరిని ప్రేమలో పడేసి పెళ్లికి దారి తీసింది. అయితే పార్తిబన్, సీతల ప్రేమ వివాహంలో కొంతకాలం తరువాత ముసలం పుట్టింది. అది విడాకులకు దారి తీసింది. ఆ తరువాత ఇద్దరూ విడివిడిగా జీవిస్తూ నటిస్తున్నారు. అలాంటిది విడిపోయిన ఈ దంపతులను ఒకే చిత్రంలో నటింప చేయడంలో దర్శకుడు ఏఎం ఆర్ రమేష్ సఫలీకృతమయ్యారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఒరు మెల్లియకొడు అర్జున్, శ్యామ్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తమిళం, కన్నడం)లో నటి సీతతో పాటు పార్తిబన్ కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలిసింది. 25 ఏళ్ల క్రితం పుదియపాదైలో పార్తిబన్‌తో నటించిన సీత తాజాగా ఇప్పుడు ఒరు మెల్లియ కొడు చిత్రంలో నటించడం విశేషం. -
'నా మాజీ భర్తను ఎప్పటికీ క్షమించను'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ మోడల్ కాతీ ప్రైస్ కోపంతో ఊగిపోతోంది. తన మాజీ భర్త చేసిన తప్పును పదేపదే ఊహించుకుంటూ రగిలిపోతోంది. ఆయన చేసిన ద్రోహం ఎప్పటికి క్షమించరానిదంటూ ఆగ్రహంతో మండిపోతోంది. 2014 మే నెలలో తనను తన భర్త కైరాన్ హేలర్ దారుణంగా మోసం చేశాడని, తన స్నేహితురాలు జేన్ పౌట్నీతో గడుపుతూ తనకు ప్రత్యక్షంగా దొరికిపోయాడని ఆ విషయం తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. అనంతరం ఆమె అతడితో విడిపోయింది. 'నేను ఎప్పటికీ క్షమించను. నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది' అంటూ కాతీ చెప్పుకొచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ క్రిస్టమస్ కు అతడిని కలుస్తున్నానని, ఈ సందర్భంగా తనకు ఓ బహుమతి కూడా ఇస్తున్నానని, అది తనకు రెండేళ్ల కిందట చేసిన ద్రోహాన్ని గుర్తుచేసేలా ఉంటుందని చెప్పింది. అయితే, ఆ బహుమతి ఏమిటనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పనని, అతడికి తెలుస్తుందని చెప్పుకొచ్చింది కాతీ. -
యాసిడ్ బాధితురాలి నరకయాతన!