exchanges
-
ఎక్స్ఛేంజీల విద్యుత్‌తో రూ.982 కోట్లు ఆదా చేశాం
సాక్షి, హైదరాబాద్: థర్మల్ విద్యుత్‌కన్నా తక్కువ ధరకు లభించే పవర్ ఎక్స్ఛేంజీల విద్యుత్‌ను కొనుగోలు చేయడం ద్వారా 2023 డిసెంబర్ నుంచి 2025 జనవరి మధ్య రూ. 982.66 కోట్లు ఆదా చేశామని ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పవర్ ఎక్స్ఛేంజీల్లో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్న సమయాల్లో విద్యుత్ వేరియబుల్ కాస్ట్ అధికంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాక్‌డౌన్ చేసి ఈ మేరకు డబ్బు ఆదా చేశామని పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారులపై ఆ మేరకు ఆర్థిక భారం తప్పిందన్నారు. దీన్ని కేంద్రం సైతం గుర్తించి తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్‌ను దేశంలోనే అత్యుత్తమైన ఎస్ఎల్డీసీగా ఎంపిక చేసి గతేడాది డిసెంబర్ 14న పురస్కారం అందించిందని గుర్తుచేశారు.గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తయారైన విద్యుత్ యూనిట్ ధర సగటున రూ. 3.97 నుంచి రూ. 4.18గా ఉండటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాక్‌డౌన్ (ఉత్పత్తి తగ్గించి) చేసి పవర్ ఎక్స్ఛేంజీల నుంచి రూ. 2.69 నుంచి రూ. 2.82 సగటు ధరతో విద్యుత్ కొన్నామని కృష్ణ భాస్కర్ ఆ ప్రకటనలో వివరించారు. దీంతో డిసెంబర్లో రూ. 196.68 కోట్లు, జనవరిలో రూ. 185.27 కోట్లు ఆదా అయ్యాయన్నారు. దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాల ద్వారా 9,134 మెగావాట్ల విద్యుత్ మాత్రమే లభ్యతగా ఉండటంతో విద్యుత్ కొనుగోళ్లు తప్పవన్నారు. విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డు రాష్ట్రంలో గురువారం గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగి ఏకంగా 15,752 మెగావాట్లకు ఎగబాకింది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్. గతేడాది మార్చి 8న ఏర్పడిన 15,523 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇప్పటివరకు అత్యధికంకాగా దాన్ని తాజాగా రాష్ట్రం అధిగమించిందని ట్రాన్స్‌కో సీఎండీ డి.కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. వేసవిలో గరిష్ట డిమాండ్ 17,000 మెగావాట్లకు పెరిగినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లతో నష్టమే: ఎం.వేణుగోపాల్‌రావు ట్రాన్స్‌కో సీఎండీ వాదనను విద్యుత్‌రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్‌రావు తోసిపుచ్చారు. ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్ల కోసం అధికంగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఎక్స్ఛేంజీల నుంచి యూనిట్‌కు రూ. 2.82 ధరతో విద్యుత్ కొనుగోలు చేయగా ఆ మేరకు బ్యాక్‌డౌన్ చేసిన విద్యుత్ స్థిర చార్జీ యూనిట్‌కు రూపాయిన్నరగా ఉన్నా మొత్తం యూనిట్ విద్యుత్ ధర రూ. 4.32కు పెరిగిపోతుందన్నారు. మరోవైపు బ్యాక్‌డౌన్ చేసిన విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 4.15 మాత్రమే ఉండటంతో వాస్తవానికి డిస్కంలు యూనిట్‌కు అదనంగా 0.17 పైసలు నష్టపోయాయని తేల్చిచెప్పారు. బ్యాక్‌డౌన్ చేసి ఉత్పత్తి తగ్గించిన విద్యుత్‌కు సంబంధించిన మొత్తం స్థిర ధరలు చెల్లించాల్సి ఉంటుందని.. సగటు స్థిర చార్జీలు కాదన్నారు. దీనికితోడు ఎక్స్ఛేంజీల నుంచి విద్యుత్ కొంటే ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీలు, ట్రాన్స్మిషన్ నష్టాలు భరించాల్సి ఉంటుందన్నారు. -
అదానీ పవర్‌పై ఎక్స్ఛేంజీల కన్ను
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా అదానీ పవర్ కౌంటర్‌ను స్వల్పకాలిక అదనపు పర్యవేక్షణ చర్యల(ఏఎస్ఎం) మార్గదర్శకాలలోకి తీసుకువచ్చాయి. వెరసి ఈ నెల 23 నుంచి అదానీ పవర్ స్వల్పకాలిక ఏఎస్ఎం మార్గదర్శకాల తొలి దశ జాబితాలోకి చేరింది. ఈ అంశాన్ని రెండు ఎక్సే్ఛంజీలు విడిగా పేర్కొన్నాయి. సోమవారమే అదానీ గ్రూప్‌లోని అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీ స్టాక్స్‌ను ఎక్సే్ఛంజీలు దీర్ఘకాలిక ఏఎస్ఎం రెండో దశ నుంచి స్టేజ్–1కు బదిలీ చేశాయి. ఇక ఈ నెల 8న అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మర్‌లను స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 17 నుంచి వీటిని స్వల్పకాలిక ఏఎస్ఎం నుంచి తప్పించాయి. ఏఎస్ఎం పరిధిలోకి చేర్చేందుకు గరిష్ట, కనిష్ట వ్యత్యాసాలు, క్లయింట్ల దృష్టి, సర్క్యూట్ బ్రేకర్లను తాకడం, పీఈ నిష్పత్తి తదితర అంశాలను స్టాక్ ఎక్సే్ఛంజీలు పరిగణించే విషయం విదితమే. స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన స్టాక్‌లో ఓపెన్ పొజిషన్లకు 50 శాతం లేదా ప్రస్తుత మార్జిన్ ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. గరిష్టంగా 100 శాతం మార్జిన్ రేటు పరిమితి ఉంటుంది. -
చైనాకు చెక్: ట్రంప్ మరో కీలక ఆర్డర్
వాషింగ్టన్: మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి దూరం కానున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై దాడికి తన చివరి అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. చైనా కంపెనీలను అమెరికా ఎక్స్ఛేంజీల నుండి తొలగించే అవకాశం కల్పించే బిల్లుపై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. తమ దేశంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అవలంబిస్తోందంటూ చైనాపై చాలాకాలంగా విరుచుకు పడుతున్న ట్రంప్ బిలియన్ డాలపై దిగుమతులపై తారిఫ్‌లను విధించిన సంగతి తెలిసిందే. తాజాగా చైసాకు మరోసారి షాకిచ్చేలా కీలక ఆదేశాలను జారీ చేశారు. దీంతో ప్రపంచంలోని రెండు దిగ్గజ ఆర్థిక వ్యవస్థలైన అమెరికా-చైనా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతను మరింత రగిలించనుంది. మరో ట్రేడ్ వార్‌కు తేరలేవనుంది. అమెరికా స్టాక్ మార్కెట్లో నమోదైన చైనా కంపెనీల ఆడిటింగ్‌కు బీజింగ్ అనుమతించడం లేదని ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించిన ట్రంప్ ఇక కఠిన వైఖరి అవలంబించేందుకు సన్నద్ధమయ్యారు. తాజా ఆదేశాల ప్రకారం అమెరికన్ రెగ్యులేటర్లు చైనా కంపెనీల ఆర్థిక ఆడిట్లను సమీక్షించకపోతే ఆయా కంపెనీలను అమెరికా స్టాక్మార్కెట్నుంచి తొలగించే అధికారం లభించనుంది. దీంతో అమెరికా ఆంక్షలతో ఇప్పటికే చిక్కుల్లో పడ్డ అలీబాబా గ్రూప్, బైడు ఇంక్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు మరోసారి భారీ షాక్ తగలనుంది. అమెరికా క్యాపిటల్ మార్కెట్ల నుండి దశాబ్దాల తరబడిగా చైనా సంస్థలు లాభాలను ఆర్జిస్తున్నాయని, ఆ ప్రయోజనాలు చైనా ఆర్థిక అభివృద్ధికే ఉపయోగపడుతున్నాయని ట్రంప్ విమర్శించారు. అమెరికా పైనాన్స్ మార్కెట్లో చైనా సంస్థలు నిబందనలకు అనుగుణంగా నమోదు కావడం లేదని, వీటిలో పెట్టుబడులు పెట్టిన అమెరికన్లు నష్టపోతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్ విస్తరణపై చైనాపై ఆరోపణలను గుప్పిస్తున్న ట్రంప్ కోవిడ్-19 వైరస్‌ను చైనా వైరస్‌గా మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం కూడా చైనాపై ధ్వజమెత్తారు. కరోనా అంతానికి టీకాలు అందుబాటులోకి వస్తున్నాయంటూ ప్రస్తావించిన ట్రంప్ యూరప్‌తోపాటు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు చైనా వైరస్ ప్రభావానికి భారీగా ప్రభావితమైనాయి. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ ,ఇటలీ, మహమ్మారి బారిన పడ్డాయని ఆయన ట్వీట్ చేశారు. -
సెబీ సంస్కరణల జోష్!
న్యూఢిల్లీ: దేశీయ ఈక్విటీ, క్యాపిటల్ మార్కెట్లను మరింత బలోపేతం, విస్తృతం చేసే దిశగా సెక్యూరిటీస్ ఎక్సే్ఛంజ్ బోర్డు (సెబీ) శుక్రవారం నిర్ణయాలు తీసుకుంది. ట్రేడింగ్ చార్జీల భారాన్ని తగ్గించడం నుంచి స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లను అనుమతించడం వరకు ఎన్నో కీలక నిర్ణయాలను వెలువరించింది. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌ను మరింత చౌకగా మార్చే దిశగా ఫీజులను భారీగా తగ్గించింది. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం కంపెనీల నుంచి తీసుకునే ఫీజులను కూడా తగ్గించింది. సెక్యూరిటీస్ మార్కెట్‌పై లావాదేవీల రుసుములు, నియంత్రణపరమైన సమర్థత కోసం అవసరమైన ఆదాయ వనరుల మధ్య సమతుల్యత కోసం ఫీజులను పెంచడం లేదా తగ్గించడాన్ని సమయానుకూలంగా సవరించనున్నట్టు సెబీ తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, ఖర్చుల అంచనాలను పరిగణనలోకి తీసుకుని 2019 ఏప్రిల్ 1 నుంచి ఫీజులను సవరించినట్టు వెల్లడించింది. ►బ్రోకర్లు చెల్లించే ఫీజులను 33.33 శాతం తగ్గించింది. దీని ప్రకారం కోటి రూపాయల లావాదేవీల విలువపై రూ.15 చార్జీ కాస్తా రూ.10కి తగ్గింది. ► వ్యవసాయ ఉత్పత్తుల (అగ్రి కమోడిటీలు)పై ఫీజును ఏకంగా 93.33 శాతం తగ్గించింది. రూ.కోటి విలువ లావాదేవీలపై చార్జీని రూ.15 నుంచి రూ.1 చేసింది. ► కస్టోడియన్లకు ఏటా రెన్యువల్‌కు బదులు శాశ్వత రిజిస్ట్రేషన్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ►స్టాక్ ఎక్సేంజ్‌లు చెల్లించే రెగ్యులేటరీ ఫీజును 80 శాతం తగ్గించింది. ప్రస్తుతం రూ.10 కోట్లపైన టర్నోవర్‌కు కోటి రూపాయలకు రూ.6 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉండగా, దీన్ని రూ.1.20కు తగ్గించింది. ► ఆఫర్ డాక్యుమెంట్ల రీఫైలింగ్‌పై ఫీజును 50 శాతం తగ్గించింది. పరిశీలన లెటర్ జారీ చేసిన నాటి నుంచి ఏడాది లోపు రీఫైలింగ్‌కు ఇది వర్తిస్తుంది. ►డిబెంచర్ హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా డిబెంచర్ ట్రస్టీలు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను, కనీస నెట్‌వర్త్‌ను రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచింది. చెల్లింపుల్లో విఫలమైతే డిబెంచర్ హోల్డర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమోడిటీ డెరివేటివ్స్‌లోకి మ్యూచువల్ ఫండ్స్... కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లో ట్రేడింగ్‌కు మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్)ను అనుమతిస్తూ సెబీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లోకి అనుమతించాలన్న కమోడిటీ డెరివేటివ్స్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌ను కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లోకి ఇప్పటికే అనుమతిస్తుండగా... డెలివరీ విధానంలో తీసుకునే గూడ్స్‌లో డీలింగ్కు కూడా అనుమతించింది. రెండో దశలో బ్యాంకులు, ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ కంపెనీలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను సైతం అనుమతించాలని అడ్వైజరీ కమిటీ సూచించింది. సెబీ గుర్తించిన సున్నితమైన కమోడిటీలు కాకుండా, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ కమోడిటీల్లో ట్రేడింగ్‌కే అనుమతింనునున్నారు. ఫండ్స్ వ్యాల్యుయేషన్‌లో పారదర్శకత ఇక, మనీ మార్కెట్, డెట్ సెక్యూరిటీల విలువను నిర్ణయించడానికి సంబంధించిన నిబంధనలను సెబీ సవరించనుంది. పరిశ్రమ అంతటా ఒకే రీతిలో ఉండే విధంగా, ఐఎల్ఎఫ్ఎస్ తరహా రుణ చెల్లింపుల వైఫల్యాల నుంచి ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. యాంఫి నియమించిన వ్యాల్యుయేషన్ ఏజెన్సీలు మనీ మార్కెట్, డెట్ సెక్యూరిటీలకు వ్యాల్యుయేషన్ ఖరారు చేస్తారు. పారదర్శక విలువ విషయంలో ఏఎంసీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాల్యూషన్ ఏజెన్సీలు సూచించిన వ్యాల్యూషన్లకు అనుగుణంగా లేకపోతే అందుకు సంబంధించిన వివరాలను ఏఎంసీ బోర్డు, ట్రస్టీలు, ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. కామెక్స్ టెక్నాలజీపై ఐదేళ్ల నిషేధం గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) ఇష్యూలో అవకతవకలకు పాల్పడ్డందుకు కామెక్స్ టెక్నాలజీపై ఐదేళ్లు, ఆ సంస్థకు చెందిన మాజీ డైరెక్టర్లు ఆది కూపర్, కిషోర్ హెగ్డేలపై రెండేళ్లపాటు సెబీ నిషేధం విధించింది. 2009 మే 25న 1.91 మిలియన్ల జీడీఆర్‌లను (9.99 మిలియన్ల డాలర్ల విలువ) సంస్థ జారీ చేసింది. సెబీకి జైట్లీ ప్రశంసలు దేశీయ సెక్యూరిటీస్ మార్కెట్ల అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యల విషయంలో సెబీ బోర్డు, సీనియర్ అధికారులు నిర్వహించిన పాత్రను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభినందించారు. ఈ విషయాన్ని సెబీ ఓ ప్రకటనలో తెలిపింది. స్టార్టప్‌లో పెట్టుబడులిక సులువు స్టార్టప్ కంపెనీల లిస్టింగ్‌ను సెబీ సులభతరం చేసింది. నూతన తరం స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి గుర్తింపు నిబంధనలను సులభతరం చేసేందుకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. సెబీ ఆమోదించిన కార్యాచరణ ప్రకారం... డీమ్యాట్ అకౌం ట్ ఉన్న ఇన్వెస్టర్ స్టాక్ ఎక్సే్ఛంజ్ లేదా డిపాజిటరీల ద్వారా అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు, డిపాజిటరీలు ఇన్వెస్టర్లకు మూడేళ్ల కాలానికి గుర్తింపు (అక్రిడేషన్) ఇస్తాయి. అక్రిడేటెడ్ ఇన్వెస్టర్ల అర్హతకు సంబంధించి పూర్తి నిబంధనలను సెబీ తర్వాత నోటిఫై చేయనుంది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు... వార్షికంగా రూ.50 లక్షల స్థూల ఆదాయం ఉన్న వారు, కనీస లిక్విడ్ నెట్‌వర్త్ రూ.5 కోట్లు ఉన్నవారికి అక్రిడేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఓపెన్ ఆఫర్ నిబంధనల సడలింపు కార్పొరేట్ రుణ పునరుద్ధరణ కార్యక్రమాలకు సంబంధించి ఓపెన్ ఆఫర్ నిబంధనలను సెబీ సడలించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకే ఇది వర్తిస్తుంది. దీంతో రుణ సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ వంటి సంస్థలకు ఇది ఉపశమనం కల్పించనుంది. సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం.. లిస్టెడ్ కంపెనీలో నియంత్రిత వాటా లేదా 25% వాటాను తీసుకుంటే, మైనారిటీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు దీన్నుంచి సెబీ మినహాయింపునిచ్చింది. జెట్ ఎయిర్వేస్కు ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకులు రూ.8,000 కోట్ల రుణాలను ఇవ్వగా, వాటిని చెల్లించలేని పరిస్థితుల్లో వాటా కింద మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఇవి ఓపెన్ ఆఫర్ నిబంధనల మినహాయింపుపై సెబీ నుంచి స్పష్టత కోరాయి. -
‘బిట్‌కాయిన్’ కు బ్యాంకులు షాక్
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా సంచలన వార్తల్లో నిలిచిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ట్రేడర్లకు మరో షాక్ తగిలింది. దేశీయ టాప్ బ్యాంకులు ప్రధాన ఎక్స్చేంజీలలో బిట్‌కాయిన్ ఖాతాలను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. జెబ్ పే, యనోకాయిన్, కాయన్ సెక్యూర్, బీటీసీఎక్స్ ఇండియా తదితర టాప్ టెన్ ఎక్స్ఛేంజీలపై దృష్టిపెట్టాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా బిట్‌కాయిన్ ఖాతాలను నిలిపివేసిన సమాచారం తెలుస్తోందని ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. అనుమానాస్పద లావాదేవీలు భారీగా జరిగాయన్న సందేహాల నేపథ్యంలో బ్యాంకులు సంబంధిత చర్యలకు దిగాయని పేర్కొంది. ఎక్స్చేంజీల ద్వారా నిర్వహిస్తున్న అనేక ఖాతాలను, లావాదేవీలను దేశంలోని అగ్ర బ్యాంకులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసిఐసిఐ, యస్ బ్యాంక్‌తో సహా కొన్ని ఇతర టాప్ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతోపాటు ఎక్స్చేంజీల ప్రమోటర్ల నుండి సంబంధిత వివరాలను కోరినట్టు కీలక వర్గాల సమాచారం. నగదు ఉపసంహరణలు నిలిపివేసిన కొన్ని ఖాతాల్లో ఇంకా లావాదేవీలు చోటుచేసుకోవడంతో గత నెలరోజులుగా 1:1 రేషియోతో సంబంధిత అదనపు సమాచారాన్ని సేకరిస్తోందని తెలిపాయి. భారతదేశంలో టాప్ టెన్ ఎక్స్ఛేంజీల మొత్తం ఆదాయం సుమారు 40వేల కోట్ల రూపాయలు ఉండవచ్చునని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నాయి. అయితే ఈ నివేదికలపై బ్యాంకులు ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు బ్యాంకులనుంచి తమకు అలాంటి సమాచారమేమీలేదని, సంబంధిత చర్యల గురించి బ్యాంకులు లేదా ప్రమోటర్లు తమను సంప్రదించ లేదని యునికోయిన్ ప్రమోటర్ సాత్విక్ విశ్వనాథ్ చెప్పారు. కాగా బిట్‌కాయిన్ ట్రేడింగ్‌పై ఆదాయపన్ను శాఖ ఇప్పటికే స్పందించింది. పన్నులు చెల్లించాల్సింది వేలమందికి నోటీసులు పంపించింది. దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో 17 నెలల కాలంలోనే 3.5 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
ఆర్టీసీలో బెదిరించి నోట్లు మారుస్తున్నారు
-
ఎక్స్ఛేంజీలకు ఎన్నికల ఫీవర్
న్యూఢిల్లీ: రోజుకో కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో దేశీ స్టాక్ మార్కెట్లు చరిత్ర సృష్టిస్తున్న నేపథ్యంలో... ఇప్పుడు రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. వచ్చే నెల 16న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సుస్థిర ప్రభుత్వం ఏర్పడవచ్చన్న అంచనాలే మార్కెట్ దూకుడుకు దోహదం చేస్తోంది. కాగా, ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలకు వెన్నుదన్నుగా ఎఫ్ఎంసీజీ ఇతరత్రా ‘డిఫెన్సివ్’ స్టాక్స్‌వైపు మొగ్గుచూపుతున్నారు. మరోపక్క, ఫలితాల రోజు అకస్మాత్తుగా స్టాక్ సూచీలు అనూహ్య హెచ్చుతగ్గులకులోనైతే మౌలిక వ్యవస్థలు, సాఫ్ట్వేర్ పరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా నియంత్రణ సంస్థ సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు అప్రమత్తమవుతున్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా అనుకోనిరీతిలో లావాదేవీలు పెరిగిపోవడం వల్ల తలెత్తే ఒత్తిడిని ఎదుర్కోవడంకోసం సెబీ పర్యవేక్షణలో స్టాక్ ఎక్స్ఛేంజీలు ‘మాక్ స్ట్రెస్ టెస్ట్’లను నిర్వహిస్తున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2009 మే 18 నాటి అనుభవాన్ని దృష్టిలోపెట్టుకొని సెబీ తాజా ఎన్నికల ఫలితాలకు సన్నద్ధమవుతోంది. అప్పటి ఎన్నికల పలితాల సందర్భంగా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో ట్రేడింగ్‌ను నిలిపేయాల్సి వచ్చింది. ‘మేజిక్ మండే’గా నిలిచిపోయిన ఆనాటి ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ ఒక్క నిమిషంలోనే 2,100 పాయింట్లు ఎగబాకి అతిపెద్ద లాభాన్ని నమోదు చేయడం తెలిసిందే. ప్రధానంగా యూపీఏ కూటమికి అనుకూలంగానిర్ణయాత్మక ఫలితాలు వెలువడటమే దీనికి కారణం. అదేవిధంగా 2004 మే 14న ఎన్నికల ఫలితాల సందర్భంగా కూడా మార్కెట్లు తీవ్రంగానే స్పందించాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో సంస్కరణలపై నీలినీడలు అలముకోవడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలేందుకు దారి తీసింది. కాగా, ఈ ఏడాది ఇప్పటికే సెన్సెక్స్ 7% పైగా ఎగబాకి 23,000 పాయింట్ల స్థాయివైపు పరుగులు తీస్తోంది. అయితే, అందరూ అంచనావేస్తున్నట్లు స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా తాజా ఎన్నికల ఫలితాలురాకపోతే మార్కెట్లో క్రాష్‌కు ఆస్కారం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.