Extension of service
-
ఈడీ, సీబీఐ చీఫ్‌ల ‘పొడిగింపు’పై సుప్రీం తలుపుతట్టిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అధినేతల పదవీకాలం పొడగింపునకు వీలుకల్పిస్తూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకెక్కింది. ఆయా అత్యున్నత పదవుల్లోని ఉన్నతాధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై పక్షపాత ధోరణిలో దాడులు, దర్యాప్తులకు ఆదేశించేందుకే సర్కార్ వారి పదవీకాలాన్ని పొడిగించిందంటూ విపక్షాలు నిరసన వ్యక్తంచేస్తుండటం తెలిసిందే. ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలం ఐదేళ్లవరకు పొడిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తేవడం వివాదమైంది. దీంతో కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దర్యాప్తు సంస్థల స్వతంత్రత కాపాడేలా గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించేలా ఈ ఆర్డినెన్స్‌లను తెచ్చారని, దర్యాప్తు సంస్థలపై ప్రభుత్వ ఒత్తిడి తొలగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోర్టును కోరారు. -
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పదవీకాలం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పదవీకాలాన్ని పొడగించారు. ఈ ఏడాది ఆగస్టు 22 న అజయ్ భల్లా పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పొడగిస్తూ.. గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అసోం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన భల్లా, 22 ఆగస్టు, 2019 న హోం సెక్రటరీగా నియమితులయ్యారు. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా తర్వాత కేంద్ర హోం సెక్రటరీగా విధులు స్వీకరించిన భల్లా.. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో.. పార్లమెంట్లో సీఏఏ, జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు వంటి కీలక, వివాదాస్పద చట్టాలను ఆమోదించారు. అలాగే, భల్లా రామ మందిరం ట్రస్ట్, కోవిడ్ -19 నిర్వహణను పర్యవేక్షించారు. -
సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్ పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 31న రిటైర్ కావాల్సి ఉంది. కాగా టక్కర్ ను మరో ఆరునెలల పాటు కొనసాగించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఒక విడతలో మూడు నెలలు మాత్రమే కొనసాగించేందుకు అవకాశముంది. ఈ ఏడాది నవంబరు 30 వరకూ టక్కర్ సీఎ్‌స్ గా కొనసాగుతారు. కాగా తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ పదవీ కాలం కూడా మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే.