farmer government
-
కౌలు రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు
-
ప్రభుత్వ నిర్ణయంపై రైతన్నల ఆనందం
-
కృష్ణా జిల్లా రైతాంగాన్ని వెంటాడుతున్న కష్టాలు
-
జాడలేని వాన
-
ఎవరికీ పట్టని కౌలు రైతు
హత్నూర(సంగారెడ్డి): సాగు చేసేందుకు సొంత భూమి లేక.. కూలీగా మిగలలేక.. ఆసాముల దగ్గర భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు ప్రభుత్వ పథకాలకు దూరంగా కష్టాల్లోనే మగ్గుతున్నారు. పెట్టుబడికి బ్యాంకు లోను రాక, అప్పు పుట్టేదారి లేక పుట్టెడు దుఃఖంలోనే తప్పని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే గడుపుతున్నారు. సొంత భూమి లేని కౌలు రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. కౌలు కట్టేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత పెట్టుబడి కోసం మరింత అప్పు చేయాల్సిన పరిస్థితి. పంట పండినా, పండకపోయినా కౌలు చెల్లించడం తప్పనిసరవడంతోపాటు, గిట్టుబాటు ధర దక్కక కౌలు రైతులు కుదేలవుతున్నారు. కౌలు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. ఆరుగాలం కష్టపడి పంట పండించినా సరైన ధర పడుతుందన్న నమ్మకం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, నీళ్ల కరువు ఎప్పుడూ కౌలు రైతులను భయపెడుతూనే ఉంటాయి. భూమికి కౌలు చెల్లించి, అప్పోసప్పో చేసి పెట్టుబడి పెట్టి సాగులోకి దిగినా భవిష్యత్ మీద బెంగ గుండెల మీద కుంపటిలాగా సెగపుట్టిస్తూనే ఉంటుంది. సాగు సగంలోకి వచ్చాక పంటలకు నీళ్లందకపోతే పెట్టుబడి సొమ్ముతోపాటు కౌలు డబ్బులు నష్టపోయి మరింత అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నా కౌలు రైతులను గాలికొదిలేశాయి. 2014 లోనే తమను కౌలుదారులుగా గుర్తించాలని ప్రభుత్వానికి దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వాలందించే సహాయం పట్టాదారుడికే చెందుతుండడం కౌలు రైతులకు కన్నీటినే మిగుల్చుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. 2014వ సంవత్సరంలో 7000 మంది తమను కౌలు రైతులు గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు వీలుగా జీఓలు తీసుకువచ్చి గుర్తింపు కార్డులైనా ఇవ్వాలని ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కౌలుదారులకు లోన్ ఎల్జిబిలిటీ కార్డులు జారీ చేస్తే బ్యాంకు రుణాలు దక్కేవి. పంట నష్ట పరిహారం అందడంతోపాటు విత్తనాలు, ఎరువులు రాయితీపై అందేవి. కానీ ఇలాంటి ఏ సౌకర్యానికీ నోచుకోక కౌలు రైతులు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకేసారి కౌలు మొత్తం చెల్లించాలి భూ యజమానికి పంట సాగు చేయడానికి ముందే కుదుర్చుకున్న కౌలు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. పంటలు దిగుబడి వచ్చినా, రాకున్నా భూ యజమానికి సంబంధం ఉండదు. ఏడాదికి వర్షాధారిత భూములకు గతంలో ఎకరాకు రూ. 6 వేలు, సాగునీటి సౌకర్యం ఉన్న భూములకు రూ. 10 వేల కౌలు ఉండేది. ప్రస్తుతం వర్షాధార భూములకు రూ.15 వేలు సాగునీటి సౌకర్యం ఉన్న వాటికి రూ. 25 వేల వరకు కౌలు వసూలు చేస్తున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు ఏడాదిగా కౌలు రైతుల ఆత్మహత్యలు జిల్లాలో పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సాయానికి నోచుకోక పంట పెట్టుబడులకు అప్పులు చేసి ఆర్థిక సమస్యల్లో మునిగిపోతున్నారు. పంట దిగుబడి రాక, వచ్చిన పంటకు గిట్టుబాటు లభించక మరింత నష్టపోతున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రకటించినప్పటి నుంచి జిల్లా 20 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. హత్నూర మండలంలో నవాబుపేట, పన్యాల, బడంపేట, సికింద్లాపూర్, దౌలాపూర్, చింతల్‌చెరువు, గ్రామాలతోపాటు జిల్లాలోని సదాశివపేట, కొండాపూర్, పుల్కల్, వట్పల్లి, కంది తదిదర మండలాల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. కొన్నేళ్లుగా భూమిని కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తున్నా. ప్రస్తుతం నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నప్పటికీ పంట పండలేదు. కౌలు మాత్రం చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. – రవి, కౌలు రైతు, బడంపేట ప్రభుత్వం కౌలు రైతులకు సైతం రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలి. సాగు సాయం చేస్తే కౌలు రైతులు కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అప్పులు చేసి పంట సాగు కోసం కౌలు చేస్తున్నప్పటికీ లాభం లేదు. అరకొర పండిన పంటకు సైతం గిట్టుబాటు ధర రాక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులకు రైతుబంధుతో పాటు రైతు బీమా పథకం కూడా వర్తింపజేయాలి.– ఎల్లయ్య, కౌలు రైతు, మారేపల్లి -
తొలి విడత 84,370 మంది అర్హులు
సాగుకు పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం అందజేయనున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్)కి ఎంపికైన అర్హుల సంఖ్య దాదాపు కొలిక్కి వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 84,370 మంది రైతులను అర్హులుగా గుర్తించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీరంతా ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్న ఒకే పట్టాదారులు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఐదెకరాల్లోపు భూమి ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.6 వేలు అందజేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. తెల్లరేషన్, ఆధార్ కార్డులు ఆధారంగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అందజేసిన జాబితాను జిల్లా వ్యవసాయ శాఖ వడపోసింది. తొలుత 530 గ్రామాల్లో ఐదెకరాల్లోపు భూమి ఉన్న 1.04 లక్షల మంది వివరాలు వ్యవసాయ శాఖ అధికారులకు అందాయి. దీని ఆధారంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నిబంధనల మేరకు అర్హతలు ఉన్నాయా.. లేవా అనేది నిర్ధారించారు. ఇందులో 84,370 మంది రైతులను అర్హులను గుర్తించారు. వీరు తొలి విడత రూ.2 వేల సాయం పొంద నున్నారు. మరో 12 గ్రామాల్లో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈనెల 28లోపు తొలి విడత అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. –సాక్షి, రంగారెడ్డి జిల్లాసాగుకు పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం అందజేయనున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్)కి ఎంపికైన అర్హుల సంఖ్య దాదాపు కొలిక్కి వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 84,370 మంది రైతులను అర్హులుగా గుర్తించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీరంతా ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్న ఒకే పట్టాదారులు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఐదెకరాల్లోపు భూమి ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.6 వేలు అందజేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. తెల్లరేషన్, ఆధార్ కార్డులు ఆధారంగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అందజేసిన జాబితాను జిల్లా వ్యవసాయ శాఖ వడపోసింది. తొలుత 530 గ్రామాల్లో ఐదెకరాల్లోపు భూమి ఉన్న 1.04 లక్షల మంది వివరాలు వ్యవసాయ శాఖ అధికారులకు అందాయి. దీని ఆధారంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నిబంధనల మేరకు అర్హతలు ఉన్నాయా.. లేవా అనేది నిర్ధారించారు. ఇందులో 84,370 మంది రైతులను అర్హులను గుర్తించారు. వీరు తొలి విడత రూ.2 వేల సాయం పొంద నున్నారు. మరో 12 గ్రామాల్లో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈనెల 28లోపు తొలి విడత అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. రంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో ఎలాంటి సంబంధం లేకుండా పీఎం–కిసాన్‌ను అమలు చేస్తున్నారు. నిజమైన అర్హులను తేల్చేందుకు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ట్రెజరీ ద్వారా వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబంలోని సభ్యులు ఎవరనేది తెలుసుకునేందుకు పౌర సరఫరాల శాఖ, భూముల వివరాల కోసం రెవెన్యూ శాఖ నుంచి సేకరించిన వివరాలను పరిశీలిస్తున్నారు. వీటికి ఆధార్ నంబర్‌ను అనుసంధానించి కుటుంబం యూనిట్‌గా అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. నిబంధనలకు లోబడి ఉన్న వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియ మూడు రోజుల్లో ముగియనుంది. రెండో విడతలో బహుళ పట్టాదారులు ఐదెకరాల లోపు భూమి ఉన్న సింగిల్ పీఎం కిసాన్ సమ్మాన్ పట్టాదారుడే అర్హుడని తొలి విడత కింద గుర్తిస్తున్నారు. రెండో విడతలో ఇందుకు భిన్నంగా ఉండనుంది. బహుళ పట్టాదారుల లెక్క తేల్చి అందులోనూ అర్హులను తేల్చే ప్రక్రియను త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. అంటే కుటుంబంలో ఎంత మంది సభ్యులున్నా వారందరి పేరిట కలిపి ఐదెకరాల లోపు భూమి ఉంటే.. ఆ కుటుంబం అర్హత సాధించినట్లే. తల్లిదండ్రుల పేరిట ఐదు ఎకరాలు ఉండి.. 18 ఏళ్ల వయసు పైబడి ఉన్న కుమారుడి పేరిట ఇంకొంచెం భూమి కలిగి ఉన్నా అర్హులుగా గుర్తించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆ వ్యక్తిని ప్రత్యేక కుటుంబంగా పరిగణించే వీలుందని వివరిస్తున్నారు. నిధులు విడుదల.. పీఎం–కిసాన్ పథకాన్ని అధికారికంగా ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కొంతమందికి తొలుత ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని వ్యవసాయశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఇందుకోసం కొంత బడ్జెట్ విడుదలైందని సమాచారం. మొత్తం మీద అర్హుల ఖాతాల్లో డబ్బుల జమ ప్రక్రియ మూడునాలుగు రోజుల్లో పట్టాలెక్కనుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. -
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
వర్ని(బాన్సువాడ): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం పలు పథకాలు తెస్తుంటే వ్యవసాయ సిబ్బంది సరిగా పని చేయడం లేదని మండిపడ్డారు. వర్నిలో మంగళవారం రాత్రి నిర్వహించిన వర్ని, కోటగిరి, రుద్రూర్ మండలాల రైతుల సమన్వయ సమితి సభ్యుల సదస్సులో ఆయన మాట్లాడారు. అసంఘటిత రైతు శక్తిని సంఘటితం చేయడానికే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. రబీ ప్రణాళిక సిద్ధం చేసి మంచి దిగుబడులు ఇచ్చే విత్తనాలు తెప్పించి రైతులకు అందజేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయానికి విద్యుత్ సమస్య లేదని, రైతులు కోరితే 24 గంటలు సరాఫరా చేస్తామని, వచ్చే ఏడాది నుంచి రెండు పంటలకు సాగు నీరందిస్తామన్నారు. ఈ రబీలో వరి నారు మళ్లు డిసెంబర్ 15 లోపు పూర్తి చేసుకుని నాట్లు వేయాలని సూచించారు. సకాలంలో నాట్లు వేస్తే వడగళ్ల బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్, ఏఎంసీ చైర్మన్ గంగారాం, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి , సమితి మండల కన్వీనర్లు ఇందూర్ సాయులు, పిట్ల శ్రీరాములు పాల్గొన్నారు. ఇష్టం లేకుంటే వెళ్లిపోండి.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతుంటే సిబ్బంది పనితీరు అధ్వానంగా ఉందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందుబాటులో ఉండి సలహాలివ్వాలని ఐదు వేల ఎకరాలకు ఒక అధికారిని నియమిస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాగైతే లాభం లేదని, సక్రమంగా పని చేయడం చేతకాని వాళ్లు రాజీనామా చేసి వెళ్లిపోవాలని, వారి స్థానంలో కొత్త వాళ్లను నియమించుకుంటామని స్పష్టం చేశారు. సమితి సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, ఇష్టం లేకపోతే స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని మందలించారు. కొందరు సభ్యులు గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఇదేనా పేదల ప్రభుత్వం?
మెంటాడ(సాలూరు): గతంలో సర్వం కోల్పోయిన అగ్నిబాధితులకు తాత్కాలికంగా నివాసం కోసం రూ. 15 వేలు అందించామని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అగ్నిబాధితులకు రూ.4,200 ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడమంటే పేదల ప్రభుత్వం ఇదేనా అని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర విస్మయం వ్యక్తం చేశారు. మండలంలోని జక్కువ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించడానికి బుధవారం జక్కువ వచ్చిన ఎమ్మెల్యే రాజన్నదొర స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మాది పేదల, రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు పాలనలో సంక్రాంతి పండగ చేసుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని విమర్శించారు. గతంలో కొంపంగి, మీసాలపేటలలో అగ్ని ప్రమాదాలు జరిగితే తమ హయాంలో ఒక్కో బాధితునికి రూ.15 వేల ఇస్తూ, వెంటనే వారికి ఐఏవై కింద ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. కొంపంగిలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఐఏవై కింద ఏడుగురు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేసినప్పటికీ నేటి వరకూ బిల్లులు చెల్లించలేదన్నారు. కలెక్టర్ ఆదేశాలను కూడా పక్కనపెట్టి తెలుగుదేశం ప్రభుత్వం వారికి బిల్లులు రాకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. జక్కువలో అగ్ని ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతున్నా కలెక్టర్, మండల స్థాయి అధికారులు కనీసం పట్టించుకోలేదని, ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయం నేటి వరకూ అందజేయలేదని ఆయన ఆరోపించారు. తక్షణమే కొంపంగి, జక్కువ, కూనేరు గ్రామాలలో జరిగిన అగ్ని ప్రమాదాల బాధితులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శొంఠ్యాన సింహాచలమమ్మ, మండల వైఎస్సార్సీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు రెడ్డి సన్యాసినాయుడు, సిరిపురపు తిరుపతి, యువజన అధ్యక్షుడు రాయిపిల్లి రామారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బాయి అప్పారావు, మరడ సింహాచలం, దాట్ల హనుమంతురాజు, నాయకులు లచ్చిరెడ్డి ఈశ్వర్రావు, లచ్చిరెడ్డి అప్పలనాయుడు, కుపురెడ్డి మోహనరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.