florals
-
దేవర బ్యూటీ చీర సోయగాలు,ఒక్కసారి చూస్తే..! (ఫొటోలు)
-
పూల రంగులు మార్చేయండి
సాక్షి, అమరావతి: పెళ్లిళ్లు.. వేడుకల్లో భారీగా వినియోగించే పూలను ఒకే రంగులోకి మార్చాలంటే టింటింగ్ పద్ధతి మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. ఈ పద్ధతిలో ఒక్కొక్క పువ్వును మాత్రమే రంగు మార్చాల్సి వస్తోంది. ఇలా చేయడం చాలా కష్టతరమైన పని. ఒకేసారి అన్ని పూల రంగును సులువుగా మార్చేందుకు ఇంతవరకు ఎలాంటి పద్ధతి కనుగొనలేదు. ప్రపంచంలోనే తొలిసారి ఈ సమస్యకు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తిరుపతిలో ఉన్న ఉద్యాన పరిశోధన స్థానం ఓ చక్కని పరిష్కారాన్ని కనుగొంది. పువ్వుల నుంచి ఇంకులను తయారు చేసి.. వాటితో విలువ ఆధారిత వస్తువులను తయారు చేసేందుకు పీహెచ్డీ విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా పూల ఇంకులను వినియోగించి ఒకేసారి మనకు నచ్చిన రంగులో భారీ ఎత్తున పూలను ఉత్పత్తి చేసుకునే విధానాన్ని కనుగొన్నారు. ఎలా తయారు చేస్తారంటే.. సేకరించిన పూలను మెత్తగా గ్రైండ్ చేస్తారు. ఆ తర్వాత ప్రకృతి సిద్ధంగా లభించే ద్రవ్యాలను జతచేసి మరోసారి గ్రైండింగ్ చేస్తారు. ఇలా వచ్చిన ద్రవ్యాలను వడగట్టి వాటి సహజతత్వం కోల్పోకుండా శీతలీకరణ చేయడం ద్వారా రంగు ద్రావణాన్ని తయారు చేస్తారు. ఎంపిక చేసిన తెలుపు రంగు పూలపై.. వాటిని కోసేందుకు ముందు ఆ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. స్ప్రే చేసిన వెంటనే పూల రంగు మనకు కావాల్సిన రంగులోకి సహజ సిద్ధంగా మారిపోతుంది. గంటసేపు ఆరిన తరువాత పువ్వుల్ని కోత కోసి నిల్వ చేసుకోవచ్చు. ఈ విధానంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో పూలను కావాల్సిన రంగులోకి మార్చుకునే వెసులుబాటు ఉంది. ప్రయోగం ఇలా.. తిరుమల శ్రీవారి సేవకు ఉపయోగిస్తున్న పూల నుంచి తయారు చేసిన రంగులతో కోతకు సిద్ధంగా ఉన్న తెల్ల రంగు చామంతి పూలపై ప్రయోగించి ఫలితాలను రాబట్టారు. కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటుందని గుర్తించారు. అలాగే పూర్ణిమ రకం చామంతి తోటలోని పూలపై ఇలా తయారు చేసిన పూల రంగును ప్రయోగాత్మకంగా పిచికారీ చేసి వాటి రంగు, తాజాదనాన్ని పరిశీలించారు. ఇది నూరు శాతం సహజసిద్ధంగా తయారవడంతోపాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపలేదని గుర్తించారు. వినియోగదారుల కోరిక మేరకు అవసరమైతే వారు కోరుకున్న సువాసనల కోసం సెంట్‌ను అద్దుకునే వెసులుబాటు సైతం ఉంది. ప్రస్తుతానికి తిరుమల శ్రీవారి సేవకు ఉపయోగించే పూలను ఉచితంగా సేకరిస్తున్నారు. వాడిన పూలను కొనుగోలు చేస్తే కిలోకు సుమారుగా రూ.10 ఖర్చవుతుంది. వీటి ద్వారా ఒక లీటర్ రంగు తయారీకి రూ.20 నుంచి రూ.50 వరకు ఖర్చవుతుంది. లీటర్ ద్రావణం 15–20 మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. ఒక ఎకరాకు 2 వేల లీటర్ల ద్రావణం అవసరమవుతుంది. మరింత విస్తృతంగా పరిశోధనలు జెక్స్ బెరా (వైట్), రోజా (వైట్) ఇతర రకాల పూలపై కూడా ప్రయోగాలు చేసేందుకు ఉద్యాన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పూల రంగులతో పెన్నుల తయారీపైనా పరిశోధనలు చేస్తున్నారు. రంగుల కోసం ప్రస్తుతం ఏ పూలను వినియోగిస్తున్నారంటే రోజా (మిరాబుల్ రెడ్), డెకరేషన్‌కు ఉపయోగించే బంతి (ఆరంజ్), చామంతి (ఎల్లో), తామర (పింక్, వైట్), ఆర్కిడ్స్ (సోనియా రకం పర్పల్ కలర్)ను ఉపయోగిస్తున్నారు. తోటల్లోని పూలపై స్ప్రే చేసినప్పుడు వాతావరణంలో తేమను బట్టి వాటి రంగులు మారే అవకాశం ఉందని గుర్తించారు. సాఫ్ట్ ల్యాండ్ స్కేపింగ్ ఇండస్ట్రీ, ఫ్లోరిస్ట్స్–బాక్వీ షాప్స్, ఇన్‌స్టంట్‌గా కలర్ చేంజ్ చేసి కస్టమర్ చాయిస్‌కు అనుగుణంగా బాంక్విట్స్ను ఇచ్చేందుకు ఉపయోగించవచ్చు. చాలా ఆనందంగా ఉంది రసాయనాలు కలపకుండా ప్రకృతిలో లభించే పూల నుంచే సహజ సిద్ధమైన రంగులను తయారు చేయవచ్చని నిరూపించాం. తద్వారా ఏక మొత్తంలో ఒకే రంగు పూలను తయారు చేసేందుకు వీలుగా నూతన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భాగస్వామి అయినందుకు చాలా ఆనందంగా ఉంది. – జగదీశ్వరి, పీహెచ్డీ విద్యార్థిని, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, తాడేపల్లిగూడెం పరిశోధన విజయవంతం పువ్వుల నుంచి ఇంకులను తయారు చేసి వాటి ద్వారా విలువ ఆధారిత వస్తువులను తయారు చేసే క్రమంలో పలువురు పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులు చేసిన ఈ తరహా ప్రయోగం సక్సెస్ అయ్యింది. 10 రోజుల్లో 8 వేల లీటర్ల ద్రావణం తయారు చేశాం. ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటివరకు సైడ్ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఇతర పూల విషయంలో ఈ తరహా ప్రయోగం చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోననే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. పూలకు సెంట్స్ యాడ్ చేసే విషయంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. – ఆర్.నాగరాజు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా స్థానం ఫ్లోరీ కల్చర్ ఇండస్ట్రీలో ముందడుగు ఫ్లోరీ కల్చర్ ఇండస్ట్రీలో ఇదో గొప్ప చారిత్రాత్మక ముందడుగుగా పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు ఇలా ఏక మొత్తంలో ఒక రంగు పూలను కావాల్సిన రంగులోకి మార్చుకునే సాంకేతికత ఎక్కడా లేదు. ఈ తరహా ప్రయోగం జరిగినట్టుగా జర్నల్స్‌లో కూడా ఎక్కడా లేదు. కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన పీహెచ్డీ విద్యార్థిని జగదీశ్వరి బృందంకు నా అభినందనలు. – టి.జానకీరామ్, వీసీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
Fashion: ఈవెనింగ్ పార్టీల్లో ఫ్లోరల్ డిజైనర్ వేర్‌తో మెరిసిపోండిలా!
Winter Fashion: వింటర్ సీజన్ ఈవెనింగ్ పార్టీలతో బ్రైట్‌గా వెలిగిపోతుంది. గెట్ టు గెదర్ కాన్సెప్ట్స్ గెట్ రెడీ అంటుంటాయి. ఇలాంటప్పుడు నలుగురు కలిసే చోట న్యూ లుక్‌తో కనిపించాలని కోరుకుంటుంది నవతరం. ఇండో–వెస్టర్న్ లుక్‌తో అట్రాక్ట్ చేయాలనుకుంటుంది. వారి అభిరుచులకు తగినట్టు డిజైన్ చేసిన డ్రెస్సులు ఇవి... ఈ డ్రెస్సులన్నీ దాదాపుగా ఫ్లోరల్ కాన్సెప్ట్‌గా డిజైన్ చేశాం. ప్లెయిన్ శాటిన్, రా సిల్క్, జార్జెట్, ఆర్గంజా మెటీరియల్‌ని డ్రెస్ డిజైనింగ్‌లో వాడాం. ఫ్లోరల్ డిజైన్ కోసం హ్యాండ్ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశాం. ఇండోవెస్ట్రన్ లుక్‌కి పలాజో, ధోతీ, లాంగ్ ఫ్రాక్స్, లెహంగా మోడల్స్ తీసుకున్నాం. – తరుణి శ్రీగిరి , ఫ్యాషన్ డిజైనర్ చదవండి: Aishwarya Lekshmi: పెళ్లి కూతురి కలెక్షన్స్‌కు పెట్టింది పేరు ఈ బ్రాండ్! ఐశ్వర్య ధరించిన డ్రెస్ ధర ఎంతంటే! Winter Sweater Trendy Designs: శీతాకాలం.. ఆధునికతకు అద్దం పట్టేలా ఊలుదారాల అల్లికలు -
పూల పరిమళాలు
మానవత్వానికి సజీవరూపాలే దైవాత్మక ధార్మిక పౌరాణిక సాంప్రదాయాలు. వీటికి తార్కాణమే వివిధ దైవ స్వరూపాలు, విభిన్న పూజా విధానాలు. ఈ శరన్నవరాత్రులలో జగన్మాతను వివిధ రూపాలలో దర్శించి, పూజించి తరిస్తారు భక్తులు. అమ్మవారి పూజా ద్రవ్యాలలో పుష్పాలదే ప్రథమస్థానం. ప్రకృతి దత్తమైన ఈ పువ్వులు వివిధ వర్ణాలతో శోభిల్లుతుంటాయి. ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజున ఒక్కొక్క రంగులో గల పువ్వులతో పూజించడం సాంప్రదాయం. వీటిలో ప్రాంతీయ భేదాలుండటం సహజం. వివిధ వర్ణ పుష్పాలతోనే దైవాంశ సంభూతమైన బతుకమ్మలను రూపొందించి ఆరాధించటం తెలంగాణ తెలుగు ప్రజల విశిష్టత. ఈ పువ్వుల ఔషధ విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఆయుర్వేద గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్నాయి. వీటి ప్రాబల్యాన్ని నేటి ఆధునిక పరిశోధనలు మరింత విస్తృతం చేసాయి. తంగేడు, సంపంగి, బంతి, చేమంతి వంటి పసుపు పచ్చని పూలను, మందార, ఎర్రగులాబీ, గునుగు, పట్టుకుచ్చు వంటి ముదురు లే త ఎరుపురంగుపూలను, కనకాంబరాలను, నందివర్ధనం, మల్లి, జాజి, పున్నాగ, తామర వంటి తెలుపురంగు పూలను, నీలిరంగు కట్ల పూలను, ఆకుపచ్చని బిళ్ల సంపంగి పూలను మనం తరచుగా చూస్తుంటాం. తంగేడు: మార్కండీ, భూమి వల్లీ, పీత పుష్పీ మొదలైనవి కొన్ని పర్యాయపదాలు. కాశ్మీర దేశపు నేలలో... తంగేడు లతలా, ఇతర ప్రాంతాలలో మొక్కలా పెరుగుతుంది. ఇది వాంతులను, విరేచనాలను కలిగించి దేహశోధనకు ఉపకరిస్తుంది. క్రిమిహరం, విషహరం. చర్మ, మూత్ర, ఉదర రోగాలు, కీళ్ల నొప్పులు, మధుమేహ, కంటి రోగాలకు ఉపశమనం కలిగిస్తుంది. మార్కండికా కుష్ఠ హారీ ఊర్ధ్వ అధః కాయశోధినీవిషదుర్గంధ కాసఘ్నీ గుల్మ ఉదర వినాశినీ ‘‘ బంతి: శరీర గాయాలను మాన్పుతుంది. క్రిమిహరం. మొటిమలు, చర్మరోగాలను తగ్గిస్తుంది. కళ్లకలకకు ఉపశమనం కలిగిస్తుంది. రుద్రాక్ష: దీనిని చంద్రకాంత అని కూడా అంటారు. వాపులను, వ్రణాలను, సెగ గడ్డలను తగ్గిస్తుంది. తెల్ల చామంతి: ఇది శీతకరం. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కంటి రోగాలకు మంచిది. బలకరం. నందివర్ధనం: పొట్టలోని కృములను నశింపచేస్తుంది. పంటినొప్పిని, కంటిరోగాలను పోగొడుతుంది. కట్ల: వాపులను, మధుమేహాన్ని, క్యాన్సరును అదుపు చేస్తుంది. కనకాంబరం: కృమిహరం బీర: ముక్కు దిబ్బడను, పడిశాన్ని తగ్గిస్తుంది. ఛాతీ, కండరాల నొప్పులకు ఉపశమనం కలుగచేస్తుంది. చిట్టి చేమంతి: జ్వరాలు, వాపులు, జలుబులను తగ్గిస్తుంది. మధుమేహం, ప్రోస్టేట్ క్యాన్సర్లను అదుపు చేస్తుంది. వాము పువ్వు: జలుబు, ముక్కుదిబ్బడ, ఆంత్రకృతములు, పంటి నొప్పి, అతిసారం, మూత్రాశయంలో రాళ్లు, ఎసిడిటీ, వికారాలలో గుణకారి. సంపంగి: చంపక, చాంపేయ, సురభి, శీతల, హేమపుష్ప మొదలైనవి పర్యాయపదాలు. ఇది చలవ చేస్తుంది. క్రిమి, విషహరం. రక్తస్రావాలను అరికడుతుంది. వాత, కఫరోగహరం. మూత్రం కష్టంగా అవ్వటాన్ని పోగొడుతుంది. (చంపకః విష క్రిమిహరః మూత్రకృచ్ఛ్ర; కఫ, వాత రక్త పిత్త జిత్) మొగలి: కేతక, సూచి, ఇందుకలికా, జంబుల, చామర అనేవి కొన్ని పర్యాయాలు. ఇది ఉష్ణకరం, లఘువు, కఫహరం, నేత్రాలకు మంచిది. (హేమకేతకీ... చక్షుష్యా, ఉష్ణా, లఘు, చక్షుస్యా....) మందార: జపా, రాగపుష్పి, అర్కప్రియా... అనేవి కొన్ని పర్యాయాలు. ఎర్ర మందారం కఫవాతహరం, కేశవర్ధకం, అతిసారహరం. (జపా సంగ్రాహిణీ కేశ్యా.... కఫవాతజిత్) మంకెన: రక్తక, బంధుక, అర్కవల్లభ, హరిప్రియ... అనేవి కొన్ని పర్యాయాలు. ఇది లఘువు, కఫకరం, వాతపిత్తహరం, గ్రాహి (దేహం నుంచి ద్రవాంశలు బయటికి పోయి వ్యాధికారకమైనప్పుడు, వాటిని బయటకు పోనీయదు. కనుక అతిసారహరం), (బంధూకః కఫకృత్ గ్రాహీ వాతపిత్త హరో లఘుః) సిందూర పుష్పం: రక్తబీజా, సుకోమలా, కరచ్ఛదా... మొదలైనవి పర్యాయాలు. ఇది చలువ చేస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. విషహరం, దప్పిక, వాంతులను పోగొడుతుంది. (సిందూరీ విష, రక్త పిత్త తృష్ణా వమనహరీ హిమా) గులాబీ: శతపత్రీ, తరుణీ అతి మంజులా, సుమనా.. కొన్ని పర్యాయాలు. ఇది లఘువు, శీతలం, గ్రాహి, త్రిదోష రక్తదోషాలను పోగొడుతుంది. హృదయానికి మంచిది. వీర్యవర్థకం. చర్మకాంతిని పెంచుతుంది. (శతపత్రీ హిమా హృద్యా గ్రాహిణీ శుక్రలా లఘుః, దోషత్రయా ర క్తజిత్, వర్ణ్యా.... పాచనీ) మల్లె: శ్రీపదీ, వార్షికీ, ముక్తబంధనా మొదలైనవి పర్యాయాలు. ఇది సుగంధకరమై మనసుకి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కామోద్దీపకం, చెవి, కన్ను, ముఖ (నోరు) రోగాలకు హితకారి. శీతలం, లఘువు, శిరశ్శూలహరం. (వార్షికీ శీతలా లఘ్వీ... కర్ణ అక్షి ముఖరోగఘ్నీ, సమ్మోహకరీ... తల్తైలం తద్గుణం స్మృతమ్) జాజి: జాతీ, సుమనా, మాలతీ, ప్రియా, రాజపుత్రికా పర్యాయాలు. ఇది లఘువు, ఉష్ణం, అక్షి, ముఖ, దంత రోగాలను తగ్గిస్తుంది. విషహరం, చర్మరోగాలలో, వాతరక్తం (గౌట్)లో గుణకారి. కలువ: కుముదం, కువలయం, ఉత్పల, సౌగంధిక మొదలైనవి పర్యాయాలు. ఇది మధురంగా, జిడ్డుగా ఉంటుంది. శీతలం, ఆహ్లాదకరం. ఇది తెలుపు, ఎరుపు, నీలిరంగులలో లభిస్తుంది. తామరపువ్వు: పద్మ, కమల, సరోజ, అరవింద, నలినీ, బిసినీ, మృణాళినీ మొదలైనవి పర్యాయాలు. ఇది గురువు, శీతలం, స్త్రీల రుతు రోగహరం. వాత, మలబంధకరం, క్యాన్సర్లలో గుణకారి. మెట్ట తామర: భూమి మీద పెరుగుతుంది. మూత్రాశయంలోని రాళ్లను కరిగిస్తుంది. శూలహరం, దగ్గు, ఆయాసం, విషహరం. గునుగు: ఇది గడ్డిజాతి విశేషం. రక్తస్రావహరం. స్త్రీ రోగాలలోను, రక్తపోటుకు గుణకారి. జమ్మి: శమీ, శివఫలా, శుభగా, సుభద్రా పర్యాయాలు. ఇది శీతలం, లఘువు, విరేచనకారి. దగ్గు, ఆయాసం, చర్మరోగాలు, భ్రమ (తల తిరుగుడు), ఆర్శమొలలను తగ్గిస్తుంది. జమ్మి కాయ మేధ్యం, వెంట్రుకలను రాలుస్తుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
పూలచొక్కాలోయ్!
స్టైల్: మర్యాదకరంగా కనిపించే దుస్తులను మాత్రమే ధరించే అలవాటు మీకు ఉండొచ్చుగాక, కానీ అప్పుడప్పుడూ లేటెస్ట్ ట్రెండ్ మీద కూడా ఒక నజర్ వేయండి. కాస్త భిన్నంగా ఉండడానికి ప్రయత్నించండి. హాటెస్ట్ ట్రెండ్‌లో ‘ఫ్లోరల్స్’ షర్ట్స్ ధరించడం కూడా ఒకటి. ఈ పూల చొక్కాలు మీ లుక్కును పూర్తిగా మార్చేస్తాయి. ఈ వారమే ప్రయత్నించి చూడండి మరి.