focused
-
ఆన్లైన్ దిగ్గజాల కట్టడిపై ఈయూ దృష్టి - ఎక్కువ కానున్న నిఘా!
లండన్: ఆన్లైన్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని కట్టడి చేయడంపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్త డిజిటల్ చట్టాల కింద ఆరు కంపెనీలను ఆన్లైన్ ‘గేట్‌కీపర్స్‘ పరిధిలోకి చేర్చింది. వీటిలో యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ ఉన్నాయి. గేట్‌కీపర్లుగా ఈ సంస్థలపై నిఘా మరింత ఎక్కువగా ఉంటుంది. ఆయా కంపెనీలు డిజిటల్ మార్కెట్స్ చట్టాలను పాటించడం మొదలుపెట్టేందుకు ఆరు నెలల గడువు ఉంటుంది. చట్టం ప్రకారం తమతో పాటు ఇతర కంపెనీలు కూడా తమ తమ ఉత్పత్తులు, సర్వీసుల పనితీరులో గణనీయంగా మార్పులు, చేర్పులు చేయాల్సి రానున్నట్లు గూగుల్ తెలిపింది. కొత్త చట్టం ప్రకారం.. మెసేజింగ్ సేవల సంస్థలు ఒకదానితో మరొకటి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు టెలిగ్రామ్ లేదా సిగ్నల్ యూజర్లు తమ టెక్ట్స్ లేదా వీడియో ఫైల్స్‌ను వాట్సాప్ యూజర్లకు కూడా పంపించుకోవచ్చు. ఇక ప్లాట్‌ఫామ్‌లు సెర్చి రిజల్ట్‌లో తమ ఉత్పత్తులకు .. పోటీ సంస్థల ఉత్పత్తులు, సర్వీసులకు మించిన రేటింగ్ ఇచ్చుకోకూడదు. కాబట్టి అమెజాన్ లాంటివి థర్డ్ పార్టీ వ్యాపారుల ఉత్పత్తుల కన్నా తమ ఉత్పత్తులే సులభంగా కనిపించేలా చేయడానికి ఉండదు. అటు ఆన్లైన్ సేవల సంస్థలు .. నిర్దిష్ట యూజర్లు లక్ష్యంగా పంపే ప్రకటనల కోసం వివిధ వేదికల్లోని యూజర్ల వ్యక్తిగత డేటాను కలగలిపి వాడుకోవడానికి కుదరదు. ఉదాహరణకు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్ సర్వీసులను వినియోగించుకునే యూజర్ల డేటాను వారి సమ్మతి లేకుండా ఆయా వేదికల మాతృసంస్థ మెటా కలగలిపి వినియోగించుకోవడానికి కుదరదు. -
తెలంగాణ ఎన్నికలపై ఈసీ కసరత్తు
-
పొలిటికల్ కారిడార్: కమలం రేకులను కలిపేందుకు హైకమాండ్ కసరత్తు
-
పొలిటికల్ కారిడార్ : తెలంగాణ బీజేపీ టార్గెట్ 2023 ..
-
రహస్య సర్వే: హస్తం కేడర్‌పై.. అధిష్టానం నజర్..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ స్థితిగతులపై కాంగ్రెస్ దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీకి పునర్వైభవం కల్పించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరుపై రహస్య సర్వే ప్రారంభించింది. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పరిస్థితి, నాయకుల పనితీరు.. ఎవరెవరు క్రియాశీలకంగా ఉన్నారు? ఎవరెవరు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు? ఎవరు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు? అన్న విషయాలపై రేవంత్‌రెడ్డి నియమించిన ప్రత్యేక నిఘా బృందం వివరాలు తెప్పించుకుంటోంది. చదవండి: కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి జిల్లాలో పార్టీ ప్రాబల్యాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా చాటుకుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత కాంగ్రెస్ పార్టీ జిల్లాలో క్రమంగా జనాదరణకు దూరమవుతూ వస్తోంది. కీలకమైన నాయకులు టీఆర్ఎస్, ఇతర పార్టీలకు వెళ్లిపోవడంతో కేడర్పరంగా పార్టీ బాగా బలహీనంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక.. పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. వచ్చేవారంలో రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తారని, వేములవాడలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈలోపు జిల్లా కేడర్, స్థితిగతులపై రేవంత్‌కు పూర్తిస్థాయి నివేదిక అందించేందుకు గాంధీభవన్ వర్గాలు సిద్ధమయ్యాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భంగపాటు..! టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రోడ్‌షోల కు జనాల నుంచి అపూర్వ స్పందన వచ్చినా పార్టీ వాటిని ఓట్లుగా మలచుకోవడంలో విఫలమైంది. ♦ఉమ్మడి జిల్లా నాయకులంతా రేవంత్ సభలకు హాజరైనా.. కనీసం డిపాజిట్ దక్కించుకోలేక ఘోర పరాజయం మూటగట్టుకుంది. ♦అయితే.. అది ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగిన ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆ పరాజయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ♦ఆ వెంటనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకలేదు. ♦ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులంతా ఎవరికి నచ్చినట్లు వారు వ్యవహరించారు. ♦అయితే.. ఇటీవల చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదుకు మాత్రం మంచి స్పందన రావడం పార్టీలో ఆశలు చిగురిస్తున్నాయి. సీనియర్లకు సైతం ఫోన్స్.. కొంతకాలంగా కొత్త జిల్లాల వారీగా పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు లేదా ముగ్గురు నేతలు మాత్రమే క్రియాశీలకంగా ఉంటున్నారు. పార్టీపరంగా నిరసనలు, ధర్నాలకు వారు మాత్రమే హాజరవుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో వెలుగువెలిగిన చాలామంది సీనియర్లు పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లుగా ఉండటంతో కేడర్ కూడా నిస్తేజంలోకి జారిపోతోంది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఇప్పటి నుంచి పార్టీని సమాయత్తం చేయాలని టీపీసీసీ రేవంత్‌రెడ్డి వర్గం ఆలోచనగా తెలుస్తోంది. అందుకే.. సీనియర్ నేతలకు ఫోన్లు చేసి తిరిగి వారిని క్రియాశీలకంగా మార్చే యత్నాలను ప్రారంభించారు. యువత, పనిచేసేవారికే టికెట్లు..! అదేసమయంలో పార్టీలో కొత్తనాయకుల పనితీరుపై దృష్టి సారించారు. పార్టీలో ఎవరు నిత్యం వార్తల్లో ఉంటున్నారు? ఎవరు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు? ఎవరు నిరసనలు, ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయి? కొత్తగా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశిస్తున్నవారి ఆర్థిక స్థితిగతులు ఏంటి? వారి అంగబలం, ఆర్థిక సామర్థ్యం, జనాదరణ ఎలా ఉంది? తదితర విషయాలపై రేవంత్ స్పెషల్ టీమ్ రహస్య సర్వే నిర్వహిస్తోంది. ఉత్తర తెలంగాణలో అందులోనూ పార్టీకి కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెరికల్లాంటి యువ నాయకులకు ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేసేలా దిశానిర్దేశం చేసేందుకు సమాయత్తం అవుతోంది. మొత్తానికి ఎన్నికల ముందు చుట్టపు చూపులా వచ్చి టికెట్లు తీసుకునే సంప్రదాయానికి ఇకపై చెల్లదని, ప్రజాదరణే ప్రామాణికంగా టికెట్లు ఇచ్చే ఉద్దేశంతోనే ఈ సర్వే నిర్వహిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
నిషేధిత జాబితా.. నెల రోజుల్లో
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితా (22–ఏ)పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న భూముల విషయంలో తప్పులున్నాయని, చాలా చోట్ల ప్రభుత్వ భూములు ఈ జాబితాలో లేవని, కొన్నిచోట్ల ప్రజావసరాల కోసం సేకరించి పరిహారం చెల్లించిన భూములూ ఆయా పట్టాదా రుల పేర్ల మీదనే ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం వెంటనే ఈ జాబి తాను మళ్లీ తయారు చేయడంపై దృష్టి పెట్టా లని కలెక్టర్లను ఆదేశించింది. జాబితాలో మార్పుచేర్పులు, తొలగింపుల ప్రక్రియ ప్రారంభించి వారంలో నివేదిక పంపాలని సీసీఎల్ఏ కార్యాలయ వర్గాలు కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. విభజన... ఆధునీకరణ ప్రస్తుతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖకు అందుబాటులో ఉన్న నిషేధిత భూముల జాబితాలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా గతంలో ఓ సర్వే నంబర్‌ను పూర్తిగా ఈ జాబితాలో చేర్చిన కారణంగా ఆ సర్వే నంబర్ పరిధిలో భూములున్న పట్టాదారులు కూడా వారి భూముల క్రయవిక్రయ లావాదేవీలు జరగక ఇబ్బందులు పడ్డారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది కేసులున్నాయి. దీంతో ఈ సమస్యను కలెక్టర్లతో సమావేశంలో సీఎం దృష్టికి రెవెన్యూ అధికారులు తీసుకొచ్చారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించడంతో ఇప్పుడు ఆ సర్వే నంబర్లను విభజించే పని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ఏ దిశానిర్దేశం చేసింది. ప్రభుత్వ భూములు, పట్టా భూములను ఒకే సర్వే నంబర్లో సబ్ డివిజన్లుగా చేసి కేవలం ప్రభుత్వ భూములన్న డివిజన్లనే నిషేధిత జాబితాలో ఉంచి మిగిలిన వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇలాంటి తప్పులపై వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు స్వయంగా పరిశీలించి ఆ భూములపై నిర్ణయం తీసుకుంటూ నివేదిక పంపాలని పేర్కొంది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్లు తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో వివరించింది. అలాగే అనేక సందర్భాల్లో ప్రజావసరాల కోసం సేకరించిన భూములు ఇంకా పట్టాదారుల పేరిటే ఉన్నాయని, రైతులు లేదా పట్టాదారులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాక కూడా ఆ భూముల పట్టాలు వారి పేరిటే ఉండటంతో అనేక ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహకాలను ఈ భూములపై పొందుతున్నారని, వెంటనే వాటిని సవరించాలని కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై జరిగే భూసేకరణలో పరిహారం చెల్లింపునకు ముందే ఆ భూముల సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చాలని కూడా పేర్కొంది. నెల దాటనివ్వద్దు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కలెక్టర్లు నడుంబిగించాలని సీసీఎల్ఏ సూచించింది. ఈ భూముల జాబితాలో ఉన్న తప్పొప్పులను నెల రోజుల్లోగా తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని తెలిపింది. అలాగే భూసేకరణ ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన భూములు, నిషేధిత జాబితాలో చేర్చాల్సిన భూములు, ఆ జాబితా నుంచి తొలగించాల్సిన భూముల వివరాలను నిర్దేశిత ఫార్మాట్లలో వారంలో తమకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో సీసీఎల్ఏ కలెక్టర్లను ఆదేశించింది. -
‘ఏఐ’పై రాష్ట్రం దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ సేవలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బ్లాక్‌చెయిన్, మెషీన్ లెర్నింగ్, డ్రోన్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రత్యేకించి కృత్రిమ మేథస్సు (ఏఐ) రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ డొమైన్లో అగ్రస్థానం కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఏఐ రంగంలో 200 ఆవిష్కర్తలు, స్టార్టప్‌లను ఆకర్షించడంతోపాటు భవిష్యత్తులో రూ. 2 లక్షల కోట్ల పరిశ్రమగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. కృత్రిమ మేథో సంవత్సరంగా 2020 ఇప్పటికే ఈ సంవత్సరాన్ని ‘ఇయర్ ఆఫ్ ది ఏఐ’గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు ఐటీ, విద్యాసంస్థలు, స్టార్టప్ కమ్యూనిటీ, పౌర సమాజం భాగస్వామ్యంతో ఆరు అంచెల వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన సంస్థలతో ఏఐ పరిశోధన, ఆవిష్కరణల కోసం ఐటీశాఖ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఒప్పందంలో భాగంగా పలు సంస్థలు రాష్ట్రంలో ఏఐ రంగంలో పరిశోధన, అభివృద్ది (ఆర్ అండ్ డీ) సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ► హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీఎఫ్హెచ్ఐ), ఇంటెల్ భాగస్వామ్యంతో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ అప్లైడ్ ఏఐ (క్రియా) ఏర్పాటైంది. వైద్య పరీక్షలు, ప్రజారోగ్యం, సప్లై చైన్ వంటి వాటిపై ఈ సెంటర్ దృష్టి పెడుతుంది. రవాణా, సెక్యూరిటీ, వ్యక్తిగత సమాచార గోప్యత, డేటా సెట్లు, మల్టీ వెహికల్ సిస్టమ్‌పై పరిశోధన చేస్తుంది. ► క్వాలిటీ డేటా సెంటర్ల నిర్మాణంతోపాటు విద్య, శిక్షణ రంగాల్లో పరిశ్రమలు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏఐ కోర్సులకు అవసరమైన పాఠ్యాంశాలను తయారు చేసేందుకు ఐఐటీ హైదరాబాద్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ► సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (సీఎఫ్‌ఐఆర్), వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలసి ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్ (ఏఐ4ఏఐ) ద్వారా వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రయత్నం చేయనుంది. ► ఎన్విడియా భాగస్వామ్యంతో ఏర్పాటైన హై పర్ఫార్మెన్స్ ఏఐ కంప్యూటింగ్ (హెచ్పీఏఐసీ) ద్వారా ఇన్నోవేటివ్ స్టార్టప్‌ల ఇంక్యుబేషన్‌కు తోడ్పాటు లభిస్తుంది. ► ఐఐటీ ఖరగ్‌పూర్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ‘ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ద్వారా మ్యాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ), లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా పరిష్కారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ► ప్రజారోగ్య రంగంలో ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఆవిష్కరణల కోసం నాస్కామ్ భాగస్వామ్యంతో డేటా సైన్స్ అండ్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ► ఏఐ రంగంలో మహీంద్ర ఎకోల్ సెంట్రల్ (ఎంఈసీ)కి ఉన్న సూపర్ కంప్యూటర్ సౌకర్యాలను స్టార్టప్‌లు, ఇతరులు ఉపయోగించుకొనేందుకు ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. -
నా శైలిని మార్చుకోను
మహిళల టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం కాకుండా ఈ టోర్నీ ద్వారా భారత జట్టుకు జరిగిన మరో మేలు ఒక సంచలన బ్యాటర్ వెలుగులోకి రావడం. 16 ఏళ్ల వయసులోనే దాదాపుగా ప్రపంచకప్‌ను గెలిపించాల్సిన పెను భారాన్ని ఆ అమ్మాయి మోసింది. దురదృష్టవశాత్తూ టైటిల్ నెగ్గకపోయినా మన మహిళల క్రికెట్ భవిష్యత్ భద్రంగా ఉందన్న ధైర్యం కలిగిందంటే ఆమె ఇచ్చిన ప్రదర్శనే కారణం. ఇదంతా హరియాణా టీనేజర్ షఫాలీ వర్మ గురించే. తన దూకుడైన ఆటతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆమె కూడా మున్ముందు మరింతగా దూసుకుపోవాలని పట్టుదలగా ఉంది. సాక్షి క్రీడా విభాగం: టి20 ప్రపంచకప్‌లో షఫాలీ వర్మ 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 158.25 స్ట్రయిక్ రేట్‌తో 163 పరుగులు చేసింది. ఫైనల్లో షఫాలీ వైఫల్యం భారత జట్టు తుది ఫలితంపై బలంగా పడిందంటే టోర్నీలో ఆమె ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఐపీఎల్ సమయంలో జరిగిన ఉమెన్ చాంపియన్స్ టి20 టోర్నీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షఫాలీ ఏడాది తిరిగేలోగా భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది. రాబోయే రోజుల్లోనూ తన సత్తా చాటాలని ఉత్సాహంగా ఉన్న షఫాలీ తన కెరీర్‌కు సంబంధించి వివిధ అంశాలపై మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే.... ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌పై... నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ దాకా చేరడం సంతోషకరమే అయినా మున్ముందు కఠిన పరీక్షా సమయం ఉంది. అయితే నాకు ఎదురయ్యే ఎలాంటి సవాల్‌కైనా సిద్ధంగా ఉన్నా. రాబోయే రోజుల్లో భారత జట్టు ఎక్కువ మ్యాచ్‌లు గెలిచేలా ప్రయత్నించడం, వాటిలో నేనూ కీలక పాత్ర పోషించడమే ప్రస్తుతానికి నా దృష్టిలో లక్ష్యాలు. వరల్డ్‌కప్ ఫైనల్ ఫలితంపై... ఆ రోజు మాకు కలిసి రాలేదు. క్రీడల్లో గెలుపోటములు సహజమే. మేం ఒడిసిపట్టుకొని విజయాన్ని అందుకొనే మరిన్ని అవకాశాలు మున్ముందు వస్తాయి. ఫలితం వచ్చేశాక దానిని మనం మార్చలేం కానీ భవిష్యత్‌లో ఏం చేయాలో మా చేతుల్లోనే ఉంది. తన వ్యక్తిగత ప్రదర్శనపై... క్రీజ్‌లోకి అడుగు పెట్టాక వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి భారత జట్టును మెరుగైన స్థితిలో నిలపడమే నా బాధ్యత. ఎందరో ప్రముఖులు నా ప్రదర్శనను ప్రశంసించినప్పుడు గర్వంగా అనిపిస్తుంది. అయితే ట్రోఫీ గెలిచి ఉంటే ఇది మరింత అద్భుతంగా ఉండేది. జట్టులో వాతావరణంపై... చాలా బాగుంటుంది. సీనియర్లే మాట్లాడాలని, జూనియర్లు వారు చెప్పింది వినాలని అస్సలు ఉండదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతిలాంటి సీనియర్లయితే నన్ను మరింతగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇక డబ్ల్యూవీ రామన్ సర్ రూపంలో అద్భుతమైన కోచ్ మాకు ఉన్నారు. ఎలాంటి సమస్య గురించి చెప్పినా ఆయన దగ్గర పరిష్కారం ఉంటుంది. తన మార్గనిర్దేశనంతో మనలో ఎనలేని ఆత్మవిశ్వాసం నింపగలరు. స్మృతితో ఓపెనింగ్‌పై... మేం అతిగా ఆలోచించం. ఇద్దరం సహజసిద్ధమైన ఆటనే ఆడేందుకు ప్రయత్నిస్తాం. కాస్త తేలికైన బంతి పడిందంటే చాలు చితక్కొట్టడమే. దానిపై మరో ఆలోచన లేదు. ఈ విషయంలో ఇద్దరం ఒకే తరహాలో ఆలోచిస్తాం. ఇక మంచి బంతులు వస్తే సింగిల్స్‌పై దృష్టి పెడతాం. సహజసిద్ధమైన ఆటను ఆడటంలో ఉండే సౌకర్యం మరోదాంట్లో రాదు. దానిని మార్చాలని ప్రయత్నిస్తే అది పని చేయదని నా నమ్మకం. కరోనాతో వచ్చిన విరామంపై... నా ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాను. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండటం కూడా ఎంతో కీలకం. దీనికి సంబంధించి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ నాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇక ఒక స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీతో ఒప్పందం కుదరడం వల్ల ఆర్థికపరంగా నేను ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండగలుగుతున్నా. ఎన్నో కష్టాలకోర్చి నేను ఈ స్థాయికి చేరడానికి కారణమైన మా నాన్నపై కూడా ఇప్పుడు ఆ భారం తగ్గింది. -
పల్లె ప్రగతిలో ‘వీడియో షూట్’
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి కార్యక్రమ అమలు, పర్యవేక్షణ విషయంలో ఉన్నతాధికారులు, పంచాయతీ సిబ్బంది మధ్య పొసగడంలేదు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కొందరు జిల్లా కలెక్టర్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఇబ్బందిగా మారాయని పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఉదయం 6 గంటలకే గ్రామాల్లో పర్యటించాలని, విధిగా వాట్సాప్ కాల్ చేయాలని, ప్రతి 2 గంటలకు వీడియో ఫుటేజీని పోస్ట్ చేయా లనే షరతులు విధించడం పట్ల ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. వర్క్ టు రూల్ నిబంధనకు విరుద్ధంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేయాలని ఒత్తిడి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కామారెడ్డి మొదలు భూపాలపల్లి వరకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే రెండు విడతల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాల్వల్లో పూడిక తీత, పాత బావులు, బోరుబావుల పూడ్చివేత తదితర చర్యలు తీసుకోవాల ని ప్రభుత్వం నిర్దేశించింది. ఆ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని గ్రామ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులను ఆదేశించింది. పల్లె ప్రగతి పనుల్లో వేగం పెంచేందుకు కలెక్టర్లు/అదనపు కలెక్టర్లు కొందరు.. గ్రామ కార్యదర్శులు ప్రభాతవేళ పంచాయతీల్లో సందర్శించాలని ఆదేశించారు. ఉదయం 8 గంటలకు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఏ వీధిలో పర్యటిస్తున్నారో తెలపాలని కామారెడ్డి కలెక్టర్ ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును 30 సెకన్ల నిడివి గల వీడియో చిత్రీకరించి.. ప్రతి 2 గంటల కోసారి పోస్టు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ నిర్దేశించారు. ఉదయం 6 మొదలు సాయంత్రం 6 గంటలకు చివరిసారిగా ఈ వీడియో పోస్టు చేయాలన్నారు. పల్లె నిద్రలు చేయాలని, గ్రామస్తులతో మమేకం కావాలని మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయం పట్ల ఉద్యోగసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అవమానించేలా చర్యలు పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సమర్థనీయం కాదు. 12 గంటలపాటు విధులు నిర్వర్తించాలనే ఆదేశాలు ఉపసంహరించుకోవాలి. అత్యవసరవేళల్లో పనులు చేసేందుకు అభ్యంతరంలేదు. పారిశుద్ధ్య నిర్వహణ, పల్లె ప్రగతి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కానీ, తమను అవమాన పరిచేలా వీడియో కాల్, ఫుటేజీ పంపాలనడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వర్క్ టు రూల్ పాటిస్తామని ఆయన హెచ్చరించారు. – మధుసూదన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
‘నాలా’ ఫీజులపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల నుంచి ఎగ్గొట్టిన నాలా (వ్యవసాయేతర భూ మదింపు చట్టం) ఫీజులను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుంచి ఇప్పటివరకు రూ. 815.48 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా యం రావాల్సి వుండగా.. రెవెన్యూ శాఖ పట్టించుకోవట్లేదని ఇటీవల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిగ్గు తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా 105 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించింది. జిల్లాలవారీగా విజిలెన్స్‌శాఖ ఈ నివేదికను అందజేసింది. వ్యవసాయ భూములు.. ఇతర అవసరాలకు మార్పిడి చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ విలువలో 3 శాతాన్ని చెల్లించాలి. కొందరు రియల్టర్లు, బడా బాబులు ఇవేమీ పట్టించుకోకుండా వ్యవసాయేతర అవసరాలకు భూములను మళ్లిస్తున్నారు. లేఔట్లను అభివృద్ధి చేసుకోవడమో లేక పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపార సంస్థలను నెలకొల్పడమో చేశారు. ఇలా భూ వినియోగ మార్పిడి ఫీజు చెల్లించకుండా.. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన కేసులను గుర్తించిన విజిలెన్స్ విభాగం.. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు ఇటీవల ఆదాయ వనరులను సమీక్షించిన మంత్రి హరీశ్‌రావు.. పెండింగ్‌లో ఉన్న నాలా ఫీజులను వసూలు చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో జిల్లాలవారీగా రావాల్సిన నిధులను తక్షణమే వసూలు చేయాలని ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. -
చైనాలో యాపిల్ ఆర్అండ్డీ సెంటర్!
బీజింగ్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్... చైనాపై అధికంగా దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే అక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది. యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు చైనాలో క్షీణబాటలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను అధిగమించడానికి, చైనాలో తన ఉనికిని స్థిరంగా అలాగే ఉంచుకోవాలనే ఉద్దేశంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరకు చైనాలో ఒక స్వతంత్ర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. కాగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కంపెనీకి ఇది తొలి ఆర్అండ్డీ కేంద్రం కానుంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ ఐదవ స్థానానికి పడింది. తొలి నాలుగు స్థానాల్లో హువావే, వివొ, ఒప్పొ, షావోమి ఉన్నాయి. -
ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్
-
‘ ఫేస్ టూ వేస్ట్’
చికాకు పడిన మేయర్ మధ్యలో నిలిచిన కార్యక్రమం ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురి ఫిర్యాదు సాక్షి,సిటీబ్యూరో: మేయర్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదిక ‘ఫేస్ టూ ఫేస్’ అభాసుపాలైంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాఫిర్యాదుల్ని పరిష్కరించేందుకు ప్రతినెలా మొదటి శనివారం గంటసేపు నిర్వహిస్తున్నారు. ఇందులో తొలి అరగంట ఫోన్ల ద్వారా వచ్చే ఫిర్యాదుల్ని..అనంతరం వ్యక్తిగతంగా ఇచ్చే ఫిర్యాదుల్ని స్వీకరిస్తారు. శనివారం కార్యక్రమం ప్రారంభం కావడమే నిర్ణీత సమయం కంటే కొద్దిగా ఆలస్యమైంది. ప్రారంభమయ్యాక కూడా ఫోన్ ద్వారా అందే ఫిర్యాదులు మేయర్‌కు సరిగ్గా వినిపించకపోవడం.. మధ్యమధ్య అవాంతరాలు ఎదురవడంతో చిరాకుకు గురైన మేయర్ టెలిఫోన్ ఫిర్యాదులు ఆపాల్సిందిగా ఆదేశించారు. ప్రతినెలా దాదాపు 20 ఫిర్యాదుల్ని ఫోన్‌ద్వారా స్వీకరించేవారు. అలాంటిది ముగ్గురి ఫోన్‌కాల్స్‌తోనే మేయర్ ఫోన్ కార్యక్రమాన్ని ముగించి, వ్యక్తిగత దరఖాస్తుల్ని స్వీకరించారు. జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేవని ప్రజలు విమర్శిస్తుండ గా..ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ సైతం సక్రమంగా లేకపోవడం జీహెచ్ఎంసీ పనితీరుకు అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా హాజరైన వారు కూడా ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్య పరిష్కారం కావడంలేదని వాపోయారు. మలేసియా టౌన్షిప్లో అక్రమ నిర్మాణాల్ని అడ్డుకోవాలని, ప్రజారోడ్డును మూసివేసిన వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యల్లేవని గతంలో ఫిర్యాదు చేసిన గోపాలరావు మరోమారు ఫిర్యాదు చేశారు. ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇచ్చిన నీటి, కరెంటు కనెక్షన్లు తొలగించాల్సిందిగా పదేపదే ఫిర్యాదులు చేసిన సీహెచ్ కృష్ణ సంబంధిత డాక్యుమెంట్లతో మరోమారు విషయాన్ని మేయర్ దృష్టికి తెచ్చారు. ఇకపై ఫేస్ టూ ఫేస్‌కు కాకుండా తన చాంబర్‌కు రావాల్సిందిగా మేయర్ ఆయనకు సూచించారు. దాదాపు 20 ఫిర్యాదులు వ్యక్తిగతంగా అందజేశారు. -
ఇదే వ్యూహం.. పాటిస్తే విజయం
సంకల్ప బలమే అసలైన ఆయుధం కష్టపడి చదివితే ఉద్యోగం మీదే.. కాబోయే వీఆర్వో, వీఆర్ఏలకునేటి ఉద్యోగుల టిప్స్ భర్త ప్రోత్సాహంతో వైకల్యాన్ని జయించా పుట్టుకతోనే వికలాంగురాలిని. బీకాం, బీఈడీ చదివా. జగ్గయ్యపేటలోని లిటిల్ ఏంజిల్స్ హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ 2012లో వీఆర్ఏ పరీక్ష రాశా. అదే పాఠశాలల పనిచేస్తున్న నా భర్త కరుణాకర్ నన్ను ఎంతగానో ప్రోత్సహించి పరీక్షకు సిద్ధంచేశారు. మూడు నెలలపాటు రోజుకు 8 గంటలకు పైగా కష్టపడి చదివా. గ్రామీణ అభివృద్ధి, విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై ఎక్కువగా దృష్టిసారించా. అమ్మ అన్నీ దగ్గరుండి చూసుకోవడంతో రాత్రులు, తెల్లవారు జామునే నిద్రలేచి చదువుకునేదాన్ని. అమ్మ సహకారం, భర్త ప్రోత్సాహం, నా కృషి ఫలించి ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తున్నా. - నోముల కనకదుర్గ, జగ్గయ్యపేట సాక్షి తోడ్పాటుతో ఉద్యోగం వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి చెందిన నేను ఎమ్మెస్సీ చదివా. మొదటి ప్రయత్నంలోనే వీఆర్వోగా ఎంపికై పెనుగంచిప్రోలు మండలంలో విధులు నిర్వహిస్తున్నా. సాక్షి దినపత్రికలో వచ్చే బిట్లు ప్రతిరోజూ చదివా. గురువారం వచ్చే భవిత మార్గదర్శకత్వంచేసింది. పరీక్షకు నెల రోజుల ముందు నుంచి వచ్చిన మోడల్ పేపర్లు బాగా ఉపయోగపడ్డాయి. దీంతో పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం పొందా. గ్రామీణ ప్రజలకు సేవ చేయటంలో ఎంతో తృప్తి కలుగుతోంది. - గుగులోతు లావణ్య, వీఆర్వో, పెనుగంచిప్రోలు ఏకాగ్రత అవసరం ఏకాగ్రతతో అన్ని అంశాలను చదువుకోవాలి. ఆ చదువుకున్నదానిలో ఎంతవరకు అవగాహన చేసుకున్నామన్న అంశాన్ని అభ్యర్థులు గ్రహించాలి. గ్రామీణ వాతావరణంపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పూర్వపు పరీక్షల మోడళ్ల్ పేపర్లను చదివి అర్థం చేసుకోవాలి. రోజుకు 5 నుంచి 6 గంటల సమయం ఏకాగ్రతతో చ దవటం వల్ల టాపర్‌గా నిలిచాను. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తథ్యం. - తేరా వినోద్‌కుమార్, పూర్వపు జిల్లా టాపర్, ఆచవరం వీఆర్వో అమ్మే స్ఫూర్తి నేను ఎమ్మెస్సీ, బీఈడీ చేశా. నిత్యం అమ్మ పడే కష్టం నన్ను ప్రభావితంచేసింది. కుటుంబపోషణకు ఆమె ఎంతో కష్టపడింది. నేను కూడా ఎంత కష్టపడైనా ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకున్నా. 2012 వీఆర్వో, వీఆర్ఏ నోటిఫికేషన్ వెలువడటంతో పరీక్షకు సిద్ధమయ్యా. మూడు నెలలపాటు కష్టపడిచదివా. జనరల్ సైన్స్, గ్రామీణాభివృద్ధి, అర్థమేటిక్స్, లాజికల్ స్కిల్స్ అంశాలపై రోజుకు 8 గంటలకు పైగా శ్రమించా. అమ్మ, తమ్ముడు ఎంతో సహకరించారు. ప్రతి అంశాన్ని ప్రతిరోజూ ఎక్కువసార్లు మననం చేసుకున్నా. తొలి ప్రయత్నంలో వీఆర్ఏగా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం జగ్గయ్యపేట మండలంలోని బలుసుపాడు వీఆర్ఏగా పనిచేస్తున్నా. ప్రస్తుతం వీఆర్వో పరీక్షకు సిద్ధమవుతున్నా. ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివితే ఎవరైనా అనుకున్నది సాధించవచ్చు. - కొంగల బలుసుపాడు వీఆర్ఏ జగ్గయ్యపేట రోజూ దినపత్రికలు చవివా నేను బీఎస్సీ చదివాను. 2012 వీఆర్వో, వీఆర్ఏ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి రోజూ దినపత్రికల్లో ఇచ్చిన ప్రశ్నలను వదలకుండా చదివా. ముఖ్యమైనవి అనుకుంటే వేరే పుస్తకంలో రాసుకున్నా. విజయవాడలోని స్నేహితుని గదిలో ఉండి పరీక్షలకు సిద్ధమయ్యా. మొదటి ప్రయత్నంలోనే వీఆర్ఏగా ఉద్యోగం వచ్చింది. మా అన్నయ్య కూడా వీఆర్ఏగా పని చేస్తున్నారు. ఆయన సూచనలు ఉపయోగపడ్డాయి. - నెమలి జగన్మోహనరావు, వీఆర్ఏ, ముచ్చింతాల కరెంట్ అఫైర్స్ కీలకం టీవీల్లో, దినపత్రికల్లో వచ్చే కరెంట్ అఫైర్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాను. నా భర్త గణితంలో పీజీ చేశారు. అర్థమేటిక్స్లో కొన్ని షార్ట్‌కట్స్ చెప్పటంతో పరీక్ష కష్టం అనిపించలేదు. ప్రస్తుతం ఆయన వీఆర్వోకు పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠ్య పుస్తకాలు చదివాను. రోజులో కొంత సమయం కేటాయించుకుని, కరెంట్ ఆఫైర్స్‌ను ఫాలో అవుతూ, ప్రణాళికా బద్ధంగా చదివితే పరీక్ష సులభంగా ఉంటుంది. -కట్టా రాణి, గుమ్మడిదూర్రు, వీఆర్ఏ ఎప్పుడూ చదువుతూ ఉండేవాడ్ని వీఆర్వోగా ఎంపిక కావాలంటే ప్రభుత్వం గ్రామస్థాయిలో అమలుచేసే సంక్షేమ పథకాలపై అభ్యర్థులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. మచిలీపట్నం లక్ష్మణరావుపురానికి చెందిన నేను ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తలంపుతో చదివాను. ఒకవైపు ఎల్ఐసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తూ గ్రూప్-2కు ప్రిపేర్ అయ్యేవాడ్ని. వీఆర్వో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావటంతో ఎల్ఐసీలో ఉద్యోగాన్ని వదులేసుకున్నా. మూడు నెలల పాటు రోజుకు 15 నుంచి 16 గంటలు చదివాను. తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 6 గంటల వరకు, 6 గంటలకు అన్ని పత్రికలు కొని దానిలో వీఆర్వో పరీక్షకు సంబంధించిన సమాచారం చూసేవాడ్ని. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు లెక్కల పుస్తకాలు పదో తరగతి వరకు సాంఘికశాస్త్ర, సైన్స్ పాఠ్యాంశాలు చదివా. అర్థమేటిక్స్లో మార్కులు సాధించేందుకు ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు, కరెంటు అఫైర్స్ కోసం పత్రికలను ఆశ్రరుుంచా. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి పేర్లు, అమలుతీరు, ప్రజలకు ఎలా ఉపయోగపడతారుు... వంటి అంశాలపై దృష్టిపెట్టాను. ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయి ప్రజలకు ఉపయోగపడే విధానాన్ని పూర్తిగా తెలుసుకున్నాను. సమయాన్ని వృథా చేయకుండా చదవడం వల్లే ఇప్పుడు ఉద్యోగం సాధించాను. వీఆర్వో పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించటంతో మెరిట్ జాబితాలో ఎంపికయ్యూను. మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, గూడూరు మండలాల నుంచి నేను ఒక్కడినే వీఆర్వోగా ఎంపికయ్యూను. ఉద్యోగం సాధించి మా అమ్మ షహజాది కోరిక తీర్చాను. ప్రస్తుతం గ్రూప్-1కి సిద్ధమవుతున్నాను. - మహ్మద్ షాకీరుల్లా, బందరు మండలం రుద్రవరం వీఆర్వో