four months
-
USA: టోర్నడో ఎగరేసుకుపోయినా... చెక్కుచెదరలేదు!
అమెరికాలోని టెన్నెసీలో గత వారం ఓ అద్భుతమే జరిగింది. రెండు భయానక టోర్నడోలు రాష్ట్రాన్ని నిలువునా వణికించాయి. ఓ చిన్నారితో సహా ఆరుగురు వాటి బారిన పడి దుర్మరణం పాలయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నో ఆస్తులు ధ్వంసమయ్యాయి. కానీ భయానకమైన అంతటి టోర్నడోలో అమాంతం గాల్లోకెగిసి ఏకంగా 30 అడుగుల దూరం ఎగిరిపోయిన ఓ నాలుగు నెలల బుడతడు మాత్రం చెక్కు చెదరలేదు! అంతటి ప్రమాదం నుంచి నిక్షేపంగా బయటపడి ఔరా అనిపించాడు. సినిమాల్లోనే కని్పంచే అద్భుతం తమ జీవితంలో నిజంగా జరిగిందంటూ అతని తల్లిదండ్రులు దేవునికి దండం పెట్టుకుంటున్నారు. ఇలా జరిగింది.. సిడ్నీ మూర్ (22), అరామిస్ యంగ్‌బ్లడ్ (39) దంపతులది టెన్నెసీలోని క్లార్క్స్‌విల్లే. మొబైల్ వ్యాన్లోనే నివాసం. వారికిద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రిన్స్టన్కు ఏడాది కాగా రెండో వాడు లార్డ్‌కు నాలుగు నెలలు. గత శనివారం హఠాత్తుగా టోర్నడో (భారీ సుడిగాలి) క్లార్క్స్విల్లేను కకావికలు చేసి పారేసింది. స్థానిక అధికార యంత్రాంగం టోర్నడో సైరన్ ఇవ్వకముందే వారి మొబైల్ వ్యాన్‌పై విరుచుకుపడింది. చూస్తుండగానే పైకప్పును లేపేసింది. దాంతో మూర్ హుటాహుటిన ప్రిన్స్టన్ను హృదయానికి హత్తుకుని నేలకు కరుచుకుపోయింది. ఊయలలో నిద్రిస్తున్న లార్డ్‌ను కాపాడేందుకు తండ్రి పరుగులు తీశాడు. అప్పటికే ఆ చిన్నారిని టోర్నడో అమాంతంగా ఎగరేసుకుపోయింది. సుడిగాలి, అందులో అప్పటికే చిక్కిన అనేకానేక శిథిలాల మధ్య పాపం పసివాడు సుడులు తిరుగుతూ కొట్టుకుపోయాడు. ఆ వెంటనే మొబైల్ వ్యాన్ పూర్తిగా నేలమట్టమైంది. హోరు గాలులు, వాటిని మించిన జోరు వానతో పరిస్థితి భీతావహంగా తయారైంది. శిథిలాల్లోంచి పెద్ద కొడుకుతో పాటుగా మూర్ పాక్కుంటూ సురక్షితంగా బయటికి రాగలిగింది. కానీ పసివాడితో పాటు అతన్ని కాపాడబోయిన తండ్రి సైతం సుడిగాలి దెబ్బకు కొంత దూరం ఎగిరిపడ్డాడు. అంతెత్తు నుంచి అమాంతంగా కిందపడి భుజం విరగ్గొట్టుకున్నాడు. అంతటి నొప్పితోనే బాబు కోసం 10 నిమిషాల పాటు శిథిలాల దిబ్బలన్నీ ఆత్రంగా వెదికాడు. చివరికి 30 అడుగుల దూరంలో పడిపోయిన చెట్టు కింద చిన్నారి లార్డ్ గుక్కపట్టి ఏడుస్తూ కని్పంచాడు. అంత దూరం ఎగిరిపోయి అమాంతంగా కింద పడ్డా గాయాలు కాకపోవడం విశేషం. ఇదంతా ఏదో సినిమాలో సన్నివేశంలా తోస్తోందంటూ జరిగిన భయానక ఘటనను మూర్ గుర్తు చేసుకుంది. ‘‘హోరు వానలో జారిపోయిన భుజంతో నిలువెల్లా తడిసి చేతుల్లో మా చిన్న కొడుకుతో నా భర్త తిరిగొస్తున్న దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ హర్షాతిరేకాలు వెలిబుచ్చింది. టెన్నెసీలో అంతే... టెన్నెసీ రాష్ట్రం అమెరికాలో భారీ టోర్నడోలకు పెట్టింది పేరు. గత శనివారం గంటకు ఏకంగా 125 మైళ్ల వేగంతో కూడిన గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడ్డ టోర్నడోలు పెను విధ్వంసమే సృష్టించాయి. వాటిలో ఒక టోర్నడో అయితే మాంట్గొమరీ కౌంటీ నుంచి లొగాన్ కౌంటీ దాకా ఏకంగా 43 మైళ్ల దూరం ప్రయాణించింది. దారిపొడవునా సర్వాన్నీ తుడిచిపెట్టేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వివాహితపై నలుగురి అత్యాచారం... ప్రస్తుతం 4 నెలల గర్భవతి
ఆదిలాబాద్‌రూరల్: వివాహితపై నలుగురు లైంగికదాడికి పాల్పడిన ఘటన మావల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై విష్ణువర్ధన్ తెలి పిన వివరాల ప్రకారం.. మావల గ్రామంలో నివాసం ఉంటున్న వివాహితకు 2014 లో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. ఈ క్రమంలో వారికి ముగ్గురు సంతానం అయ్యారు. భర్త మూడేళ్ల క్రితం ఆమెను వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కూలీ పనులు చేసుకుంటూ ఆమె పిల్లలతో పాటు తల్లి, సోదరుడితో కలిసి మావల గ్రామంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆమెకు మాయమాటలు చెప్పి వేర్వేరు సందర్భాల్లో కొద్ది రోజులుగా లోబర్చుకున్నారు. ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణి కావడంతో విషయం బయటపడింది. దీంతో ఆమె శనివారం పోలీసులకు తనపై కొంతకాలంగా నలుగురు వేర్వేరుగా లైంగికదాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి కేసు నమోదైంది. ఆమెను లోబరుచుకున్న నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. త్వరలో వారిని పట్టుకుంటామని ఎస్సై వెల్లడించారు. -
ఉక్రెయిన్‌లో హోరాహోరీగా యుద్ధం: మరో 4 నెలలు?
కీవ్: రష్యా తెర తీసిన అకారణ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తమ అందమైన దేశంలో జరిపిన ప్రతి హత్యాకాండకూ, దాడికీ పుతిన్ పశ్చాత్తాపపడేలా చేసి తీరతామన్నారు. ‘‘డోన్బాస్లో రోజుల వ్యవధిలో చేజిక్కించుకుంటానని ఫిబ్రవరిలో యుద్ధ ప్రారంభంలో రష్యా ఆశ పడింది. నాలుగు నెలలవుతున్నా అక్కడ పోరాటం సాగుతూనే ఉంది. అక్కడ రష్యా బలగాలను సమర్థంగా అడ్డుకుంటున్న మా సేనలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది’’ అన్నారు. యుద్ధం తొలినాళ్లలో ఆక్రమించుకున్న దక్షిణ ఖెర్సన్ నుంచి కూడా రష్యా బలగాలను తాజాగా వెనక్కు తరిమినట్టు ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లో పౌరులకు రష్యా పాస్‌పోర్టుల జారీ, రష్యా చానళ్ల ప్రసారం, రష్యా స్కూలు యూనిఫాం ప్రవేశపెట్టడం వంటివి జరుగుతుండటం తెలిసిందే. యుద్ధ లక్ష్యాలను త్వరగా సాధించలేమన్న వాస్తవాన్ని రష్యా అర్థం చేసుకుందని, అందుకే అక్టోబర్ దాకా పోరు కొనసాగించాలని నిర్ణయించుకుందని ఉక్రెయిన్ సైన్యం అంచనా వేస్తోంది. డోన్బాస్ చిక్కితే ముందుగానే ముగించొచ్చని భావిస్తోంది. చదవండి: Russia-Ukraine war: మెక్‌డొనాల్డ్స్ రీ ఓపెన్ హోరాహోరీ లుహాన్స్క్లో ఉక్రెయిన్ అధీనంలో ఉన్న చివరి పెద్ద పట్టణాలు సెవెరోడొనెట్స్క్, లిసిచాన్స్క్ల్లో హోరాహోరీ జరుగుతోంది. సెవెరోడొనెట్స్క్లోని కెమికల్ ప్లాంటులో 400 మంది దాకా ఉక్రెయిన్ సైనికులు చిక్కుపడ్డారని సమాచారం. మారియుపోల్లోనూ ఇలాగే చిక్కుబడ్డ వేల మంది ఉక్రెయిన్ సైనికులు నెలల తరబడి పోరాడి చివరికి లొంగిపోవడం, వారిని రష్యా యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తున్న పశ్చిమ దేశాలే శాంతి ప్రక్రియకు సంధి కొడుతున్నాయని చైనా మండిపడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలకు తమ మద్దతుంటుందని ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ వెయ్ ఫెంగ్ అన్నారు. -
మే 13 తర్వాతే మళ్లీ మంచి రోజులు
సాక్షి, హైదరాబాద్: ఒకదాని వెంట ఒకటిగా గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమిలు కలిసి రావటంతో కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఏకంగా 115 రోజులపాటు శుభ ముహూర్తాలు లేకుండా పోయాయి. దీంతో వరసగా మూడున్నర నెలలపాటు పెళ్లి భాజాలకు విరామమే. జనవరి ఏడుతో చివరి మంచి ముహూర్తం ముగియనుండగా, మళ్లీ మే 14 నుంచి బలమైన ముహూర్తాలు మొదలు కానున్నాయి. జనవరి 8 దశమి ముగుస్తుంది. ఆ తర్వాత సంక్రాంతి పీడ దినాలుగా భావిస్తూ శుభకార్యాలు నిర్వహించరు. జనవరి 14 పుష్య శుద్ధ పాఢ్యమి నుంచి ఫిబ్రవరి 12 వరకు శూన్యమాసం కొనసాగనుంది. ఈ సమయంలో శుభ దినాలు ఉండవని పండితులు పేర్కొంటున్నారు. అదే సమయంలో జనవరి 15 పుష్య శుద్ధ విదియ నుంచి ఫిబ్రవరి 12 మాగ శుద్ధ పాఢ్యమి వరకు 29 రోజులపాటు గురు మౌఢ్యమి కొనసాగనుంది. మళ్లీ ఫిబ్రవరి 14 మాగ శుద్ధ తదియ నుంచి మే 4 చైత్య బహుళ అష్టమి వరకు ఏకంగా 80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి ఏర్పడనుంది. ఆ తర్వాత మరో పది రోజులపాటు శుభ దినాలున్నా బలమైన ముహూర్తాలు లేవు. తిరిగి మే 14 నుంచి బలమైన ముహూర్తాలు మొదలవుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ రెండు మూఢముల మధ్య రెండు రోజుల విరామం ఉన్నా, అవి బలమైన ముహూర్తాలకు అవకాశం లేనివేనని పండితులు పేర్కొంటున్నారు. ఆ తర్వాతే బలమైన ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. మళ్లీ జూలై 4 నుంచి మొదలయ్యే అషాఢమాసం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. ఇది కూడా శుభముహూర్తాలు లేని సమయ మే. ఇలా 2021లో ముహూర్తాలకు కొరతే ఏర్పడనుంది. బంధువులను పిలుచుకోవడం సాధ్యం కాకపోవడంతో కరోనా సమయంలో చాలా మంది శుభకార్యాలు నిర్వహించుకోలేదు. ఇప్పుడు కాస్త కోవిడ్ ప్రభావం తగ్గినా జనవరి 7 తర్వాత మంచి ముహూర్తాలు లేవు. దీంతో తప్పని పరిస్థితిలో పెళ్లిళ్లు నిర్వహించుకుంటున్నారు. లేదంటే 4 నెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. శుభ ముహూర్తాలకు ఇన్ని రోజుల విరామం రావటానికి గురు, శుక్ర మౌఢ్యమిలు కలిసి రావటమే కారణమని, ఆ సమయంలో శుభకార్యాలకు దూరంగా ఉండటమే మంచిదని ప్రముఖ పౌరాణికులు శ్రవణ్‌కుమార్ శర్మ పేర్కొన్నారు. రెండు మౌఢ్యమిలు కలిసి రావటం అరుదే.. ‘ఇలా వరసగా రెండు మూఢాలు కలిసి రావటం ప్రత్యేకమేమీ కానప్పటికీ అరుదుగా మాత్రమే సంభవిస్తుంది. దీన్ని శాస్త్ర ప్రకారం చెడు చేసే కాలంగా భావించాల్సిన అవసరమేమీ లేదు.’ – శృంగేరీ ఆస్థాన పౌరాణికులు బాచంపల్లి సంతోషకుమారశాస్త్రి -
సోనూసూద్ స్పందించినా.. దక్కని పసివాడి ప్రాణం
సాక్షి, బోయినపల్లి (చొప్పదండి): సినీనటుడు సోనూసూద్‌తోపాటు పలువురు దాతలు చికిత్సకు సాయం చేసినప్పటికీ ఆ నాలుగు నెలల పసివాడి ప్రాణం దక్కలేదు. శస్త్రచికిత్స తర్వాత శ్వాస అందకపోవడంతో పసివాడు ఆదివారం కన్నుమూశాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన పందిపెల్లి బాబు, రజిత దంపతుల కుమారుడు నాలుగు నెలల అద్విత్‌శౌర్య గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. చదవండి: (ఆంగ్లంలో అనర్గళంగా..) పేదవాడైన అద్విత్ తండ్రి బాబు, తన కుమారుడి ఆరోగ్యం బాగు చేయడానికి ఆర్థిక సాయం చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులో అధికభాగం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కాగా, హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అద్విత్‌కు శుక్రవారం ఆపరేషన్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున అద్విత్‌కు శ్వాస ఆడకపోవడంతో ఆక్సిజన్ పెట్టారు. అయితే పరిస్థితి విషమించడంతో చిన్నారి అద్విత్ కన్నుమూశాడు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: (ఏసీ బస్సా... మేమెక్కం!) -
నాలుగు నెలలకు రూ.8 కోట్ల నష్టం
ఆర్టీసీ ఆర్ఎం రవికుమార్ తుని : రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో నాలుగు నెలలకు రూ.8 కోట్ల నష్టం వచ్చిందని ఆర్టీసీ ఆర్ఎం సి.రవికుమార్ తెలిపారు. తుని డిపోలో వివిధ విభాగాలను మంగళవారం పరిశీలించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆక్యుపెన్సీ రేటు (ఓఆర్) తగ్గడంతో ఏప్రిల్ నుంచి జూలై వరకూ అన్ని డిపోలూ కలిపి రూ.8 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం ఓఆర్ 65 శాతం ఉందన్నారు. కిలోమీటరుకు రూ.32 ఖర్చవుతుండగా, రూ.26 ఆదాయం వస్తోందన్నారు. నష్టాల భర్తీకి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. కృష్ణా పుష్కరాలకు రీజియన్ నుంచి రోజుకు 70 నుంచి వంద ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆయన వివరించారు. అలాగే పార్సిల్ సర్వీసు ద్వారా రూ.కోటి ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆయన వెంట ట్రాఫిక్ ఇన్స్పెక్టరు వై.చెల్లారావు ఉన్నారు. -
ఐటీ రైడ్స్‌లో భారీగా బ్లాక్‌మనీ!
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ నిర్వహిస్తున్న రైడ్స్ లో భారీగా బ్లాక్‌మనీ బయటపడుతోంది. మొదటి నాలుగు నెలల కాలంలో రూ.3,300 కోట్ల ఆదాయాన్ని ఐటీశాఖ తవ్వి తీసినట్టు వెల్లడైంది. 2016-17 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై మధ్యకాలంలో కనీసం 145 రైడ్స్‌ను ఆదాయపు పన్ను శాఖ నిర్వహించింది. ఆ రైడ్స్‌లో రూ.245 కోట్లను లెక్కలో చూపని నగదుగా(బ్లాక్ మనీగా) గుర్తించి ఐటీ శాఖ సీజ్ చేసింది. అంతేకాక నగదు, జ్యువెలరీని తీసివేస్తే, మొత్తంగా లెక్కలో చూపని ఆదాయంగా రూ.3,375 కోట్లను గుర్తించింది. 2015లో మొదటి నాలుగునెలలో లెక్కలో చూపని ఆదాయం రూ.2,252 కోట్లగా ఉండేది. అదేవిధంగా రూ.85 కోట్ల జువెల్లరీని స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ శాఖ తెలిపింది. పన్ను ఎగవేతదారులకు వ్యతిరేకంగా ఈ దాడులను జరుపుతున్నట్టు ఐటీశాఖ వెల్లడించింది. నగదు సీజ్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నట్టు తెలిపింది. అధిక లావాదేవీలు జరుపుతూ టాక్స్ రిటర్న్‌లు ఫైల్ చేయని కనీసం 90 లక్షల లావాదేవీలపై కూడా ఐటీ శాఖ ఓ కన్ను వేసి ఉచ్చింది. ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ, బ్లాక్‌మనీ బయటకు రావడం లేదని ఐటీ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో దేశమంతటా టాక్స్ రైడ్స్ జరిపి, పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు సిద్ధమైనట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. -
ఆ ఆలయంలో 4 నెలల్లో ఏడోసారి చోరీ
కోరుట్ల: వరుస దొంగతనాలతో దోపీడీ దొంగలు ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. చివరకు ఈ దొంగల బెడద దేవాలయాలకు తాకింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఆలయంలో దొంగలు చేతివాటం చూపెడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఒకే ఆలయంలో గత నాలుగు నెలల్లో వరుసగా ఏడోసారి దొంగతనం జరగడం స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలోని శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయంలో మరోసారి దొంగలు పడడంతో వార్తల్లోకిక్కెంది. సోమవారం అర్థరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు అమ్మవారి వెండి ఆభరణాలతోపాటు హుండీని పగులగొట్టి నగదును ఎత్తుకుపోయారు. సోమవారం ఉదయం ఆలయంలోకి వెళ్లిన పూజారి విషయం గ్రహించి, స్థానికులకు సమాచారం అందించారు. ఈ ఆలయంలో గత నాలుగు నెలల్లో ఇది ఏడో దొంగతనం కావటం గమనార్హం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఏదీ ‘సురక్ష’..!
పథకమేదైనా దాన్ని పటిష్టంగా లబ్ధిదారులకు చేర్చినప్పుడే ఉద్దేశ్యం నెరవేరినట్లు చెప్పవచ్చు.అది కాగితాలకే పరిమితమైతే ఆ తప్పు అధికారులదే. ‘జననీ శిశు సురక్ష’ స్కీం స్థితి అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పథకాన్ని జిల్లాలో అమలు చేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది. పేద మహిళలకు ప్రసవాల సమయాల్లో ఊరటినివ్వలేక పోతోంది. వారిని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లేలా చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. కొత్తగా జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కే)ను ప్రవేశ పెట్టింది. ఈ కార్యక్రమం నాలుగు నెలల క్రితం జిల్లాలో అమలులోకి వచ్చినప్పటికీ.. ఆ శాఖ వైఫల్యం కారణంగా గ్రామీణ ప్రాంత వాసులకు ప్రయోజనం చేకూరడం లేదు. మాతా శిశు సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం కోట్లు ఇస్తున్నా లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. ఈ పథకం ఇప్పటికీ అమలుకు నోచుకోక పోవడంపై విమర్శలకు తావిస్తోంది. 24గంటల ఆసుపత్రులు, పీహెచ్సీలలో వైద్యులు లేని కారణంగా మాతా శిశు సంరక్ష ణకు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా నిరుపయోగం అవుతున్నాయి. జిల్లాలో ఉన్న 85 పీహెచ్‌సీల్లో 24 గంటల వైద్యుసదుపాయం ఉన్నవి 62 మాత్రమే ఇందులోనూ 30లోపు మాత్రమే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. జిల్లాలో నాలుగు ఏరియా ఆసుపత్రుల్లోనూ అంతంత మాత్రం సౌకర్యాల నడుమే కాన్పులు జరుగుతున్నాయి. జిల్లా ఆసుపత్రిలో నెలకు కనీసం 500 వరకూ కాన్పులు చేస్తున్నారు. మాతా శిశు సంరక్షణ, మరణాల సంఖ్య తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్ధేశం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులతో పనిచేయించ లేని అధికారులు ఈ కొత్త పథకాన్ని ఏ విధంగా అమలు పరుస్తారో వేచి చూడాల్సిందే..! అవగాహన కల్పించాలి జననీ శిశు సురక్ష పథకాన్ని సమర్థ వంతంగా అమలు చేయాలంటే.. వైద్యులు, ఏఎన్ఎంలు, గ్రామీణ అధికారులకు అవగాహన కల్పించాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖకు చిత్తశుద్ధి లేకపోవడంతో అమలు జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. గ్రామీణ ప్రజల్లోనూ ఈ పథకం అమలు తీరుపై ప్రచారం కొనసాగించాలి. దీనిపై సంబంధిత శాఖ దష్టి పెట్టని కారణంగా.. నిరు పేదలు నష్టపోవాల్సి వస్తోంది. విషయం పాతదే..? ఈ పథకం కొత్తదైనా.. విషయం మాత్రం పాతదే.. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా గర్భిణులకు ఉచితంగానే చికిత్స అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందు నుంచే 108 అంబులెన్స్ ద్వారా గర్భిణులు ప్రసవం కోసం ఆసుపత్రికి వస్తున్నారు. వీరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రక్త నిధుల నుంచి ఉచితంగా రక్తాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ రక్త నిధిలో రక్తం లేని సమయంలో మాత్రమే ప్రైవేటు రక్త నిధులకు పంపుతున్నారు. ఈ పథకం ద్వారా కొన్ని అదనపు సదుపాయాలు కల్పించారు. అయినప్పటికీ దీన్ని అమలుపర్చడంలో సంబంధిత శాఖ విఫలమవుతోంది. ఉద్దేశం ఇదీ.. జననీ శిశు సురక్ష పథకం ద్వారా గర్బిణులను ఇంటి నుంచి ఆసుపత్రికి తరలించేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తారు. అది కూడా 108 అంబులెన్స్ ద్వారానే ఆసుపత్రికి తీసుకెళ్తారు. గర్భిణీలకు ఆసుపత్రుల్లో ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహిస్తారు. పీహెచ్‌సీలు, 24 గంటల ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో వీరికి ఈ చికిత్సలు అందిస్తారు. గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవించే వరకు ఎప్పుడు రక్తం అవసరమైనా ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఎక్కిస్తారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలోనే సిజేరియన్ చేసి, ఉచితంగా మందులు అందజేస్తారు. ఆసుపత్రి నుంచి బాలింత డిశ్చార్జ్ అయిన వెంటనే ఆమెను ఇంటికి 108 వాహనంలో తీసుకు వెళ్తారు. పుట్టిన బిడ్డ ఆనారోగ్యంగా ఉంటే ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తారు. ముఖ్యంగా పేదలకు ఇది ఎంతో ఉపకరిస్తుంది.