సోనూసూద్‌ స్పందించినా.. దక్కని పసివాడి ప్రాణం  | Four Month Old Baby Deceased In Hyderabad | Sakshi
Sakshi News home page

సోనూసూద్‌ స్పందించినా.. దక్కని పసివాడి ప్రాణం 

Nov 23 2020 9:04 AM | Updated on Nov 23 2020 9:04 AM

Four Month Old Baby Deceased In Hyderabad - Sakshi

చిన్నారి అద్విత్‌ శౌర్య (ఫైల్‌)

సాక్షి, బోయినపల్లి (చొప్పదండి): సినీనటుడు సోనూసూద్‌తోపాటు పలువురు దాతలు చికిత్సకు సాయం చేసినప్పటికీ ఆ నాలుగు నెలల పసివాడి ప్రాణం దక్కలేదు. శస్త్రచికిత్స తర్వాత శ్వాస అందకపోవడంతో పసివాడు ఆదివారం కన్నుమూశాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన పందిపెల్లి బాబు, రజిత దంపతుల కుమారుడు నాలుగు నెలల అద్విత్‌శౌర్య గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే.  చదవండి: (ఆంగ్లంలో అనర్గళంగా..)

పేదవాడైన అద్విత్‌ తండ్రి బాబు, తన కుమారుడి ఆరోగ్యం బాగు చేయడానికి ఆర్థిక సాయం చేయాలని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్‌ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులో అధికభాగం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కాగా, హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అద్విత్‌కు శుక్రవారం ఆపరేషన్‌ చేశారు. ఆదివారం తెల్లవారుజామున అద్విత్‌కు శ్వాస ఆడకపోవడంతో ఆక్సిజన్‌ పెట్టారు. అయితే పరిస్థితి విషమించడంతో చిన్నారి అద్విత్‌ కన్నుమూశాడు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.    చదవండి:  (ఏసీ బస్సా... మేమెక్కం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement