పథకమేదైనా దాన్ని పటిష్టంగా లబ్ధిదారులకు చేర్చినప్పుడే ఉద్దేశ్యం నెరవేరినట్లు చెప్పవచ్చు.అది కాగితాలకే పరిమితమైతే ఆ తప్పు అధికారులదే. ‘జననీ శిశు సురక్ష’ స్కీం స్థితి అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పథకాన్ని జిల్లాలో అమలు చేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది. పేద మహిళలకు ప్రసవాల సమయాల్లో ఊరటినివ్వలేక పోతోంది. వారిని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లేలా చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది.
కొత్తగా జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్‌ఎస్‌కే)ను ప్రవేశ పెట్టింది. ఈ కార్యక్రమం నాలుగు నెలల క్రితం జిల్లాలో అమలులోకి వచ్చినప్పటికీ.. ఆ శాఖ వైఫల్యం కారణంగా గ్రామీణ ప్రాంత వాసులకు ప్రయోజనం చేకూరడం లేదు. మాతా శిశు సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం కోట్లు ఇస్తున్నా లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. ఈ పథకం ఇప్పటికీ అమలుకు నోచుకోక పోవడంపై విమర్శలకు తావిస్తోంది. 24గంటల ఆసుపత్రులు, పీహెచ్‌సీలలో వైద్యులు లేని కారణంగా మాతా శిశు సంరక్ష ణకు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా నిరుపయోగం అవుతున్నాయి.
జిల్లాలో ఉన్న 85 పీహెచ్‌సీల్లో 24 గంటల వైద్యుసదుపాయం ఉన్నవి 62 మాత్రమే ఇందులోనూ 30లోపు మాత్రమే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. జిల్లాలో నాలుగు ఏరియా ఆసుపత్రుల్లోనూ అంతంత మాత్రం సౌకర్యాల నడుమే కాన్పులు జరుగుతున్నాయి. జిల్లా ఆసుపత్రిలో నెలకు కనీసం 500 వరకూ కాన్పులు చేస్తున్నారు. మాతా శిశు సంరక్షణ, మరణాల సంఖ్య తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్ధేశం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులతో పనిచేయించ లేని అధికారులు ఈ కొత్త పథకాన్ని ఏ విధంగా అమలు పరుస్తారో వేచి చూడాల్సిందే..!
అవగాహన కల్పించాలి
జననీ శిశు సురక్ష పథకాన్ని సమర్థ వంతంగా అమలు చేయాలంటే.. వైద్యులు, ఏఎన్‌ఎంలు, గ్రామీణ అధికారులకు అవగాహన కల్పించాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖకు చిత్తశుద్ధి లేకపోవడంతో అమలు జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. గ్రామీణ ప్రజల్లోనూ ఈ పథకం అమలు తీరుపై ప్రచారం కొనసాగించాలి. దీనిపై సంబంధిత శాఖ దష్టి పెట్టని కారణంగా.. నిరు పేదలు నష్టపోవాల్సి వస్తోంది.
విషయం పాతదే..?
ఈ పథకం కొత్తదైనా.. విషయం మాత్రం పాతదే.. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా గర్భిణులకు ఉచితంగానే చికిత్స అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందు నుంచే 108 అంబులెన్స్ ద్వారా గర్భిణులు ప్రసవం కోసం ఆసుపత్రికి వస్తున్నారు. వీరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రక్త నిధుల నుంచి ఉచితంగా రక్తాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ రక్త నిధిలో రక్తం లేని సమయంలో మాత్రమే ప్రైవేటు రక్త నిధులకు పంపుతున్నారు. ఈ పథకం ద్వారా కొన్ని అదనపు సదుపాయాలు కల్పించారు. అయినప్పటికీ దీన్ని అమలుపర్చడంలో సంబంధిత శాఖ విఫలమవుతోంది.
ఉద్దేశం ఇదీ..
జననీ శిశు సురక్ష పథకం ద్వారా గర్బిణులను ఇంటి నుంచి ఆసుపత్రికి తరలించేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తారు. అది కూడా 108 అంబులెన్స్ ద్వారానే ఆసుపత్రికి తీసుకెళ్తారు. గర్భిణీలకు ఆసుపత్రుల్లో ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహిస్తారు. పీహెచ్‌సీలు, 24 గంటల ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో వీరికి ఈ చికిత్సలు అందిస్తారు. గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవించే వరకు ఎప్పుడు రక్తం అవసరమైనా ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఎక్కిస్తారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలోనే సిజేరియన్ చేసి, ఉచితంగా మందులు అందజేస్తారు. ఆసుపత్రి నుంచి బాలింత డిశ్చార్జ్ అయిన వెంటనే ఆమెను ఇంటికి 108 వాహనంలో తీసుకు వెళ్తారు. పుట్టిన బిడ్డ ఆనారోగ్యంగా ఉంటే ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తారు. ముఖ్యంగా పేదలకు ఇది ఎంతో ఉపకరిస్తుంది.
ఏదీ ‘సురక్ష’..!
Published Sun, May 18 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM
Advertisement
Advertisement