FTL
-
8 ఎకరాల్లోని 44 నిర్మాణాలు కూల్చివేత
సాక్షి, హైదరాబాద్: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనాల నేపథ్యంలో కొంత విరామం తర్వాత హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన పని పునః ప్రారంభించింది. ఆదివారం మూడు ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు నల్లచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లతో పాటు రెండు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను పరిరక్షించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న 44 నిర్మాణాలను కూల్చివేయడం ద్వారా 8 ఎకరాలను కబ్జా చెర నుంచి విడిపించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. అయితే ఈ మూడు ప్రాంతాల్లోనూ కొన్నింటిలో సామాన్యులు నివసిస్తున్నారని, ఆ నిర్మాణాలను కూల్చివేయకుండా నోటీసులు మాత్రమే జారీ చేశామని ఆయన స్పష్టం చేశారు. కూకట్‌పల్లిలోని సర్వే నం.66, 67, 68, 69లలో విస్తరించి ఉన్న నల్లచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురయ్యాయి. మొత్తం 27 ఎకరాల్లో ఉన్న ఈ చెరువులో నాలుగు ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించిన కొందరు.. 16 షెడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మించారు. షెడ్లలో వంట శాలలు ఏర్పాటు చేసి క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నారు. వాటిలో పనిచేసే వారు కూడా ఆ షెడ్లలోనే నివాసం ఉంటున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు ఆదివారం సంబంధిత అధికారులతో కలసి ఆ షెడ్లను కూల్చేశారు. అమీన్పూర్ మండలంలో.. అలాగే అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట్ సర్వే నం.164లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఎకరం కబ్జా చేసిన కొందరు జీ+5 విధానంలో భవనాలు నిర్మించారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు రావడంతో విచారణ చేసిన అధికారులు, ఈ తరహాకు చెందిన మూడు నిర్మాణాలను కూల్చేసి స్థలాన్ని స్వా«దీనం చేసుకున్నారు. అమీన్పూర్ మండలంలోని పటేల్‌గూడలో సర్వే నం.12/2, 12/3లలో సర్కారు భూమి కబ్జాకు గురైంది. మూడు ఎకరాల స్థలంలో కొందరు 25 నిర్మాణాలు చేపట్టారు. వీటిలో గ్రౌండ్ ఫ్లోర్‌తో నిర్మించిన విల్లాలతో పాటు బహుళ అంతస్తులతో నిర్మించినవి ఉన్నాయి. ఈ 25 నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా అధికారులు.. మూడు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్‌ప్లానింగ్ అ«ధికారులతో కలసి ఈ కూల్చివేతలు చేపట్టినట్లు రంగనాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలు, జలవనరుల పరిరక్షణ కోసం హైడ్రా ఆపరేషన్లు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. కూకట్‌పల్లిలోని నల్లచెరువులో కూల్చేసిన షెడ్లు అన్నీ ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిచిన అక్రమ నిర్మాణాలు అని, వాటిని వాణిజ్య అవసరాల కోసం వాడుతున్నారని ఆయన తెలిపారు. అలాగే అమీన్పూర్ ప్రాంతంలో కూల్చేసిన మూడు బహుళ అంతస్తుల భవనాలు ప్రభుత్వ స్థలంలో ఉన్నాయన్నారు. అయితే పక్కనే ఉన్న ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్వే నంబర్‌తో అనుమతులు తీసుకున్నట్లు వివరించారు. తాము కూల్చేసిన దాదాపు 27 విల్లాలు బిల్డర్‌తో పాటు ఇద్దరు ఇతరులకు చెందినవని, రెండింటిలో మాత్రమే కుటుంబాలు నివసిస్తున్నాయని, ఆ రెండింటికీ నోటీసులు ఇచ్చి వదిలేశామని వివరించారు. అలాగే కూకట్‌పల్లిలోని నల్లచెరువులోనూ కొన్ని కుటుంబాలు నివసిస్తున్న నిర్మాణాల జోలికి వెళ్లలేదని రంగనాథ్ పేర్కొన్నారు. -
గ్రేటర్ హైదరాబాద్: సాగర ‘గోస’ పట్టదా
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్ర క హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిని పరిరక్షించడంలో గ్రేటర్ యంత్రాంగం విఫలమైంది. సాగర్‌లో కూకట్పల్లి నాలా కలిసే ప్రాంతంలో నూతనంగా పలు నిర్మాణాలు చేపడుతున్నా.. జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ యంత్రాంగాలు ప్రేక్షక పాత్రకే పరిమితమౌతున్నాయంటూ ఇటీవల పలువురు పర్యావరణ వేత్తలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ రెండు విభాగాలు తక్షణం..ఎఫ్టీఎల్ పరిధి పరిరక్షణ విషయంలో ఎందుకు విఫలమౌతున్నారన్న అంశంపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. లేని పక్షంలో హెచ్ఎండీఏ,జీహెచ్ఎంసీ కమిషనర్లు కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది. హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం విషయంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు సేవ్ అవర్ అర్భన్‌లేక్స్ సంస్థ ప్రతినిధి లుబ్నాసర్వత్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా రెండున్నరేళ్ల క్రితం..హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై తమకు నివేదిక అందించాలని కోర్టు అప్పట్లో ఆదేశించినప్పటికీ జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా నూతన కాంక్రీట్ నిర్మాణాలను అక్రమంగా నిర్మిస్తున్నారన్నారు. బీటీ రహదారులను సైతం ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పైపై మెరుగులే.. స్వచ్ఛమైన జలాలతో చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను నింపాలన్న సర్కారు సంకల్పం అటకెక్కింది. సాగరమధనంతో ప్రక్షాళన చేపట్టేందుకు ఆర్భాటంగా ప్రారంభించిన మిషన్ గాడి తప్పింది. దశాబ్దకాలంగా సాగర ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం. కూకట్పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తిచేసినట్లు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఈ నాలానుంచి పారిశ్రామిక వ్యర్థాలు జలాశయంలోకి నేటికీ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు జలాశయం అట్టడుగున గడ్డకట్టుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు పనులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే తరుణంలో జలాశయం ఉపరితల భాగంలో తెట్టులా పేరుకున్న వ్యర్థాల తొలగింపునకు విదేశాల్లో వినియోగించే ఎనిమిది కాళ్ల ఎక్స్‌కవేటర్‌ను వినియోగిస్తున్నప్పటికీ ఇవన్నీ పైపై మెరుగులేనన్న వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. జలాశయం ప్రక్షాళన పర్వంలో ప్రస్తుతానికి సాధించింది గోరంతేనని...చేయాల్సిన పనులు కొండంత ఉన్నాయని పర్యావరణ వాదులు స్పష్టం చేస్తున్నారు. (చదవండి: తెలంగాణ: నకిలీ సర్టిఫికెట్స్‌తో 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు) -
కౌంటర్ వేయండి.. లేదంటే వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్) పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగాయనే ప్రజాహిత వ్యాజ్యంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయని పక్షంలో ఆగస్టు 23న జరిగే విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వా లని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్ల ను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలీతో కూడిన ధర్మా సనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. హుస్సేన్ సాగ ర్లోని ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగాయని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త లుబ్నాసార్వత్ 2020, ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్‌కు ఈ–మెయిల్ చేశారు. గోడల నిర్మాణాలు కూడా జరిగాయం టూ ఆమె గూగుల్ ఎర్త్ నుంచి తీసిన జియో ట్యాగ్ చిత్రాన్ని కూడా హైకోర్టుకు పంపారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న ఆమె ఈ–మెయిల్ ఫిర్యాదును హైకోర్టు సుమో టో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. -
చెరువులకు శాపం ఇలా.. రక్షణ చర్యలు తీసుకోవాలిలా...
సాక్షి, హైదరాబాద్: మహానగరానికి మణిహారంలా ఉన్న జలాశయాల పరిరక్షణ, సుందరీకరణ విషయంలో సర్కారు విభాగాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులతోపాటు ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న వందలాది జలాశయాలు కబ్జాలతో కుంచించుకుపోయాయి. మరికొన్నింట గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల వ్యర్థజలాలు చేరి వాటిని కాలుష్య కాసారాలుగా మార్చివేశాయి. ఈ విషయంలో ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, పీసీబీ, పరిశ్రమలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర విభాగాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలాశయాల పరిరక్షణ విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ పలు సందర్భాల్లో జారీచేసిన మార్గదర్శకాలను సర్కారు యంత్రాంగం అమలు చేయాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. చెరువులకు శాపం ఇలా... ► పలు చెరువుల్లో ఇటీవలికాలంలో గుర్రపుడెక్క ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. ► సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతున్నాయి. దీంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధభరితంగా మార్చేస్తున్నాయి. ► ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో నీటిలో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం. ► సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరడంతోనేఈ దుస్థితి తలెత్తింది. ► గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం.. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు కూపమౌతున్నాయి. ► చాలా చెరువులు తమ ఎఫ్టీఎల్ పరిధిలో సగం భూములను కోల్పోయి చిక్కిశల్యమై కనిపిస్తున్నాయి. పైపై మెరుగులకే జీహెచ్ఎంసీ ప్రాధాన్యం ► రోజువారీగా గ్రేటర్‌వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మా త్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే చెరువులు, మూసీ లో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. రక్షణ చర్యలు తీసుకోవాలిలా... ► చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సేవ్ అవర్ అర్భన్‌లేక్స్ సంస్థ పలు సూచనలు చేసింది. ► గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. ఆయా చెరువుల్లో అట్టడుగున పేరుకుపోయిన ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. ► జలాశయాల ఉపరితలపై ఉద్ధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి. ► చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటుచేయాలి. ► గృహ,వాణిజ్య,పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. ► ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి. ► అన్యాక్రాంతం కాకుండా ఎఫ్టీఎల్ బౌండరీలు,రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. నిరంతరం నిఘా పెట్టాలి. జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలి. ► వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. ► జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయాలి. ► కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలి. -
Usman Sagar: విస్తీర్ణానికి ‘గండి’!
సాక్షి, హైదరాబాద్: శతాబ్ద కాలంగా మహానగర దాహార్తిని తీరుస్తున్న గండిపేట (ఉస్మాన్‌సాగర్) విస్తీర్ణం తగ్గిందా? అంటే.. అవుననే అంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ జలాశయ విస్తీర్ణంపై హెచ్ఎండీఏ జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ మ్యాప్, జలమండలి నుంచి గతంలో సేకరించిన మ్యాప్‌లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. వీటి ప్రకారం చూస్తే జలాశయ విస్తీర్ణం (ఎఫ్టీఎల్ పరిధి) సుమారు 300 ఎకరాల మేర తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యత్యాసంపై వ్యాజ్యం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిపై 2019లో హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలు సర్వే నిర్వహించి ప్రాథమిక నోటిఫికేషన్ మ్యాప్ విడుదల చేశాయి. గండిపేట జలాశయం విస్తీర్ణం 6,039 ఎకరాలని పేర్కొన్నాయి. అయితే పలువురు పర్యావరణవేత్తలు 2014లో సమాచార హక్కు చట్టం కింద జలమండలి నుంచి గండిపేట ఎఫ్టీఎల్కు సంబంధించిన మ్యాపులను సేకరించారు. ఇందులో జలాశయం విస్తీర్ణం 6,335.35 ఎకరాలుగా ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు పర్యావరణవేత్తలు రెండు మ్యాప్‌ల మధ్య తేడాకు కారణాలు ఏమిటన్న అంశంపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జలాశయం విస్తీర్ణం తగ్గితే నీటినిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ తీరుపై హైకోర్టు ఆగ్రహం గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల చుట్టూ 10 కి.మీ పరిధిలో ఉన్న 84 గ్రామాల పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, చెక్‌డ్యామ్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, లేఅవుట్లు చేపట్టకూడదని 1996 మార్చి 8న జారీచేసిన జీవో నంబర్ 111 స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 111 నంబర్ జీవోకు సంబంధించి 2016లో ఏర్పాటు చేసిన కమిటీ పనితీరుపై హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదేళ్లుగా నివేదిక సమర్పించక పోవడాన్ని తప్పుబట్టింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచనల నేపథ్యంలో.. జంట జలాశయాల పరిరక్షణ చర్యలు, 111 జీవోలో మార్పులు చేర్పులను సూచించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఐఏఎస్ అధికారులు ఎస్పీ సింగ్, దానకిశోర్, ఎస్కే జోషీ ఈ కమిటీలో ఉన్నారు. ఆక్రమణలే శాపం ఆరేళ్ల కిందట పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన సర్వేలో జీవో 111లో పేర్కొన్న 84 గ్రామాలకు సంబంధిచిన వేలాది ఎకరాల్లో 418 అక్రమ లే అవుట్లు, 6,682 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. మరో 5,202 వ్యక్తిగత గృహాలు కూడా కలిపి మొత్తం 11,887 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు సర్వే తేల్చింది. జంట జలాశయాలకు ఇన్‌ఫ్లో రాకుండా పలు లే అవుట్లు, ఇతర నిర్మాణాల చుట్టూ భారీ గోడలు నిర్మించారు. జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో పలువురు ప్రముఖులు ఏర్పాటు చేసిన ఫామ్‌హౌస్‌లు కూడా శాపంగా పరిణమించాయి. సమగ్ర విచారణ చేపట్టాలి గతంలో జలమండలి నుంచి మేము సేకరించిన మ్యాపులు.. హెచ్ఎండీఏ జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే గండిపేట విస్తీర్ణం 300 ఎకరాలు తగ్గినట్లు కనిపిస్తుంది. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు మూడుసార్లు లేఖ రాశాం. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి గండిపేటతో పాటు హిమాయత్‌సాగర్ జలాశయాన్నిక కూడా పరిరక్షించాలి. – లుబ్నా సర్వత్, పర్యావరణవేత్త -
కబ్జా కోరల్లో చింతల చెరువు?
హైదరాబాద్: బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని చెంగిచర్లలో ఉన్న చింతల చెరువు ఎఫ్టీఎల్ భూమి, బఫర్ జోన్ అన్యాక్రాంతమవుతుంది. ఇప్పటికే బఫర్ జోన్లో కొంత భాగం కాలనీగా ఏర్పడి కొన్ని ఇళ్లు నిర్మించుకోగా, మిగిలిన స్థలంలో మట్టినింపి చదును చేస్తున్నారు. అదే బఫర్ జోన్ పరిధిలో బహుళ అంతస్తులు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిపై మాజీ ప్రజాప్రతినిధులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చెంగిచర్లలోని చింతల చెరువు సర్వే నంబరు 57లో 23 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఒకప్పుడు తాగు, సాగునీరు అందించిన ఈ చెరువు నేడు మురికి కూపంగా మారింది. చెంగిచర్ల ఎగువ ప్రాంతంలో ఉన్న కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టగా మురుగునీరు దిగువ ప్రాంతానికి వెళ్లడానికి అవుట్ లెట్ లేకపోవడంతో కాలనీల నుంచి వచ్చే మురుగంతా చెరువులోకి వెళ్తుంది. దీంతో చెరువు అంతా మురుగునీటితో కూపంగా మారి విపరీతమైన దుర్వాసన వస్తుంది. గతంలో చెరువు ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేయక ముందు కొంత మంది సాయినగర్ కాలనీని ఏర్పాటు చేయగా, మరికొంత మంది ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం అధికారులు, పాలకవర్గం ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇటీవల కొంత మంది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న తమ ప్లాట్లకు ఎన్ఓసీలు తెచ్చుకుని మట్టి పోసి చదును చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయమై స్థానిక ప్రజలు అధికారులు, పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. చెంగిచర్ల చింతల చెరువు కట్ట ఆనుకుని ఉన్న బఫర్ జోన్లో ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరుపై ఉన్న స్థలంలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని మాజీ వార్డు సభ్యులు కుర్రి శివశంకర్, కొత్త ప్రభాకర్‌గౌడ్ మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఇరిగేషన్, రెవెన్యూ, కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. చెరువు కట్ట ఆనుకుని బఫర్ జోన్ ఉందని, సదరు స్థలానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇవ్వగా మున్సిపల్ అధికారులు ఎలాంటి పర్యవేక్షణ చేయకుండా అనుమతులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. నిబంధలనకు అనుగుణంగానే.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఎన్ఓసీ ప్రకారమే అనుమతులిచ్చాం. ఎన్ఓసీలో కట్ట అనుకుని మొత్తం 50 గజాలు బఫర్ జోన్ ఉన్నట్లు చూపారు. దాని ప్రకారం అనుమతులు మంజూరు చేశాం. మా నగరపాలక సంస్థ నుంచి ఎలాంటి అవకతవకలు జరగలేదు. –బోనగిరి శ్రీనివాస్, కమిషనర్ -
కబ్జాదారులపై ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: చెరువుల గరిష్ట నీటి మట్టం (ఎఫ్టీఎల్) పరిధిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలను తొలగించాలని, భవిష్యత్తులో ఎటువంటి నిర్మాణా లు చేపట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ప్రభుత్వం రోడ్డు నిర్మాణం చేపడుతోందని పిటిషనర్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రోడ్డు పనులను వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం మ్యాపులను మార్చేశారని, ప్రభుత్వమే రోడ్డు నిర్మాణం చేపడుతోందని, ఈ నేపథ్యంలో చెరువులు ఆక్రమణకు గురికాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సోషలిస్టుపార్టీ తెలంగాణ విభాగం కార్యదర్శి డాక్టర్ లుబ్నాసార్వత్ రాసిన లేఖను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గతంలో సుమోటో ప్రజాహిత వ్యా జ్యంగా స్వీకరించింది. ఈ వ్యాజ్యాన్ని గురు వారం మరోసారి విచారించింది. ప్రభుత్వం ఏమైనా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిందా అని ధర్మాసనం ప్రశ్నించగా ప్రభుత్వ న్యాయవాది లేదని సమాధానమిచ్చారు. గత ఏడాది ఇలాంటి అంశాన్నే విచారిస్తున్న సమయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులను ఎప్పుడైనా చూశారా అని కమిషనర్‌ను ప్రశ్నించగా లేదని చెప్పడం తనకు ఆశ్చర్యాన్ని కల్గించిందన్నారు. చెరువుల ఆక్రమణకు సంబంధించి ఏడాది కాలంగా తాను ప్రభుత్వ అధికారుల తీరును పరిశీలిస్తున్నానని, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించా ల్సిన అవసరం ఉందన్నారు. నిర్మల్ జిల్లాలో చెరువుల పరిరక్షణ కోసం కలెక్టర్, డీఎస్పీతో కూడిన చెరువుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారని, అదే తరహాలో ఇక్కడా ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. చెరువుల పరిరక్షణ కమిటీల ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకున్నా రు, ఆక్రమణల తొలగింపు చర్యలను వివరిస్తూ ఆగస్టు 17లోగా పూర్తి వివరాలను సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
వీటిల్లో కొంటే అంతే!
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొనుగోలు చేయొద్దు సాక్షి, హైదరాబాద్: ప్రతి రోజు ఎక్కడో అక్కడ అక్రమ నిర్మాణం అనో, బఫర్ జోన్‌లోనో, ఎఫ్టీఎల్లోనో అపార్ట్మెంట్ కట్టారనో వింటుంటాం. తక్కువ ధరకు వస్తుందనో లేక లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్నారనో తొందరపడి ఫ్లాట్ కొన్నారో ఇక అంతే సంగతులు. అసలు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలుసా? లేకపోతే కష్టపడి సంపాదించిన సొమ్ము కాంక్రీట్ పాలవడం తప్పదంటున్నారు నిపుణులు. బఫర్ జోన్ అంటే: బఫర్ జోన్ అంటే నీటి పరీవాహక ప్రాంతం. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు పారుతుంటుంది. దీన్ని అలుగు అంటారు. ఇక్కడి నుంచి పొలాలకు నీరు మళ్లుతుంటుంది. ఈ మధ్య ఉన్న ప్రాంతాన్నే అంటే చెరువుకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారన్నమాట. ఉస్మాన్‌సాగర్ కింద ఉన్న భూములన్నీ బఫర్‌జోన్ కిందికే వస్తాయి. ఈ కింద ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించకూడదు. కొనకూడదు కూడా. ఎఫ్టీఎల్ అంటే: ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) అంటే చెరువు కట్ట ప్రాంతం. ఈ ప్రాంతం నీటి పారుదల శాఖ విభాగం కిందికొస్తుంది. చెరువు కట్ట ప్రాంతంను ఆనుకొని నగరంలో బడా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే వీటిలో ఫ్లాట్ కొనేముందు కొనుగోలుదారులు కొన్ని కీలక పత్రాలు చూడాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ ప్రాంతంలోని నిర్మాణాలకు నీటి పారుదల శాఖ నుంచి «ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి. అలాగే సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఎంఆర్ఓ), జీహెచ్ఎంసీ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ మూడు పత్రాల్లో ఏ ఒక్కటీ లేకపోయినా సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కులు ప్రభుత్వానికుంది. ఫ్లాట్లు కొన్న కొనుగోలుదారులు కోర్టుకెళ్లినా లాభముండదు. -
సాగర్ ప్రక్షాళనకు విరామం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డులోని హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు ప్రస్తుతానికి నిలిచిపోయినట్లే. సాగర్ ప్రక్షాళన కోసం అధికారులు గత మార్చి నుంచి నీటిని ఖాళీ చేసే చర్యలు ప్రారంభించారు. దాంతో 512.9 మీ. లెవెల్ ఉన్న సాగర్ రిజర్వాయర్ మే నెలాఖరు నాటికి 512 మీటర్ల లెవెల్ వరకు తగ్గిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలతో సాగర్‌నీటి మట్టం తిరిగి 512.7 మీటర్ల వరకు చేరింది. అంటే దాదాపుగా యథావిధి స్థాయికి చేరింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్టీఎల్) 513.41 మీటర్లు. వర్షాలు కురస్తుండటంతో ఈ ఏడు ప్రక్షాళన పనుల్ని అధికారులు నిలిపివేసినట్లే. ఎప్పటిలాగే వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు తూములకు మరమ్మతులు చేస్తున్నామని చెబుతున్నారు. వర్షాల్లేని రోజుల్లోనే ఆ పనుల్ని చేస్తూ ఉన్నారు. సాగర్ నుంచి నీటిని అవసరాన్ని బట్టి విడుదల చేసేందుకు రూ.1.02 కోట్లతో అలుగు దిగువభాగం నుంచి నీరు వెళ్లేందుకు అవసరమైన పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే అలుగు కంటే తక్కువ ఎత్తులో నీరున్నా దిగువకు వదలడానికి వీలవుతుంది. రానున్న సెప్టెంబర్- అక్టోబర్ మాసాల్లో గణేశ్, బతుకమ్మల నిమజ్జనాలకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. సాగర్‌లోనే ఈ నిమజ్జనాలు పూర్తయ్యాక, వచ్చే నవంబర్- డిసెంబర్లలో తిరిగి సాగర్ ప్రక్షాళన పనులు చేపట్టి వచ్చే ఏడాది వేసవిలో సాగర్‌ను ఖాళీ చేయాలనేది అధికారుల యోచనగా తెలుస్తోంది. సీఎం ఆదేశాలతో..: వేసవిలో సాగర్‌లో నీటినంతా ఖాళీ చేసి అడుగున ఉన్న చెత్తాచెదారాల్ని తొలగించాలని నిరుడు సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సాగర్ చుట్టూ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను సీఎం పరిశీలించి వాటిలో అద్భుతమైన టవర్స్‌ను నిర్మించవచ్చని చెప్పారు. గణేశ్, బతుకమ్మల నిమజ్జనాలకు ఇందిరాపార్కులో వినాయకసాగర్ పేరిట రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినప్పటికీ, బీజేపీ తదితర పక్షాల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రక్షాళనకు రూ. 350 కోట్లు.. సాగర్ ప్రక్షాళనపై అధ్యయనం కోసం దాదాపు రూ. కోటి ఖర్చు కాగలదని అంచనా వేసిన ఆస్ట్రియా ప్రభుత్వం.. రూ. 20 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వె చ్చిస్తే మిగతా రూ. 80 లక్షల ఆర్థికసాయం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే అధ్యయనం అనంతరం సాగర్ ప్రక్షాళనకు మొత్తం రూ. 350 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనా వేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అందులో 80 శాతం నిధుల్ని ఆస్ట్రియా ప్రభుత్వమే అక్కడి ఆర్థికసంస్థల ద్వారా ఇప్పిం చేందుకు సుముఖంగా ఉందని సమాచారం. ఈ అంశంలో ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
ఆ భూముల నిగ్గు తేల్చేద్దాం...
ఇక ఎఫ్టీఎల్లు, నాలా భూముల వంతు సర్వేకు సిద్ధమైన జీహెచ్ఎంసీ వచ్చే వారం నుంచి కూల్చివేతలు హైదరాబాద్ : ఐదురోజులుగా గ్రేటర్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరుపుతున్న జీహెచ్ఎంసీ అధికారులు తాజాగా చెరువుల ఎఫ్టీఎల్లు(పూర్తిస్థాయి నీటిమట్టం), నాలా భూములు ఆక్రమించి నిర్మాణాలు జరిపిన భవనాలపై దృష్టి సారించారు. ఎఫ్టీఎల్లు, నాలా ప్రాంతాల్లోని భవనాలెన్ని ఉన్నాయో సర్వే చేసే పనుల్లో పడ్డారు. సర్వే పూర్తిచేసి సదరు ప్రాంతాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రణాళిక రూపొందించారు. గ్రేటర్ పరిధిలోని 18 సర్కిళ్లలో వెంటనే ఈ సర్వే చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, ఇతరత్రా ప్రభుత్వ స్థలాల్లో వెలసిన నిర్మాణాల సర్వే చే యాలని భావిస్తున్నారు. నగరంలో వాన కురిస్తే నీరు వెళ్లే దారి లేదు. ఇందుకు కారణం చెరువుల ఎఫ్టీఎల్ ప్రదేశాలు, నాలా భూముల్లోనూ భారీ భవంతులు వెలియడమే కారణమని గుర్తించారు. ఎఫ్టీఎల్, నాలా ప్రదేశాల్లో వెలసిన భవనాలపై సర్వే పూర్తయ్యాక, కమిషనర్ ఆదేశాల కనుగుణంగా కూల్చివేతల చర్యలు చేపడతామని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. హుస్సేన్‌సాగర్ సర్ప్లస్ నాలాకు సంబంధించిన ప్రదేశంలోనే దాదాపు వెయ్యి ఇళ్ల వరకు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన గ్రేటర్ మొత్తంలో నాలాలు, ఎఫ్టీఎల్ల పరిధిలో వెలసిన భవనాలు వేలాదిగా ఉంటాయని భావిస్తున్నారు. వీటితోపాటు నివాస గృహాలకు అనుమతులు పొంది వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న భవనాలపైనా చర్యలు తీసుకోనున్నారు. కాగా, టాటానగర్, తదితర ప్రాంతాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా ఏర్పాటైన ప్లాస్టిక్ గోడౌన్లపై శనివారం దాడి చేసి కూల్చివేతలు చేపట్టారు. 54 కూల్చివేతలు జరపగా, వాటిల్లో 40కి పైగా ప్లాస్టిక్ గోడౌన్లు, ఇతరత్రా షెడ్లే ఉన్నాయి. వనస్థలిపురం, హయత్‌నగర్, హనుమాన్ టెకిడి, కల్యాణ్‌నగర్, మాదాపూర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, యాప్రాల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చే వారం నోటీసు జారీ చేసే యోచనలో జీహెచ్ఎంసీ అధికారులున్నారు. హైకోర్టు కాపీ అందడంతో దానిని పరిశీలించి.. వచ్చే వారం నోటీసు జారీ చేసే యోచనలో ఉన్నారు. కాగా, ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి మరో కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. యూఎల్సీ భూముల సర్వే ముమ్మరం శేరిలింగంపల్లి మండల పరిధిలోని యూఎల్సీ మిగులు భూముల సర్వే కార్యక్రమం ఈ నెల 21 నుంచి ముమ్మరంగా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఖానామెట్, ఇజ్జత్‌నగర్‌లోని గురుకుల్ ట్రస్ట్ భూముల సర్వేను పూర్తిచేసిన అధికారులు ఇతర భూముల సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకు 15 టీంలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా టీంలతో వారం రోజుల్లో యూఎల్సీ మిగులు భూముల సర్వే పూర్తి చేస్తామని తహసీల్దార్ విద్యాసాగర్ తెలిపారు. కూల్చివేతలను నిలువరించండి హైకోర్టు సీజేకు సింగిరెడ్డి లేఖ జీహెచ్ఎంసీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను వెంటనే నిలువరించాలంటూ జీహెచ్ఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి శనివారం లేఖ రాశారు. జీహెచ్ఎంసీ అధికారులు సామాన్యులను లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలు జరుపుతున్నారని ఆరోపించారు. అక్రమాలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోకుండా ప్రజలను వేధిస్తున్నారన్నారు. కూల్చివేతలు జరుపకుండా అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ఎంఐఎం ఎమ్మెల్యేలకు చెందిన 24 వాణిజ్య భవనాలు, దారుసలాం భవనం, డెక్కన్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజి, బషీర్‌బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయం, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, ఖైరతాబాద్ షాదాన్ కాలేజీలకు అవసరమైన భవన నిర్మాణ అనుమతులు ఉన్నదీ లేనిదీ జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేయాలన్నారు. లేఖలో తాను ప్రస్తావించిన అంశాల్ని పిల్‌గా లేదా అత్యవసర సుమోటో కేసుగా స్వీకరించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సీఎంను కలవాల్సిన కార్పొరేటర్లు అపాయింట్మెంట్ లభించకపోవడంతో కలవలేదని తెలుస్తోంది. -
ఎన్ కన్వెన్షన్ నిర్మాణం అక్రమమే!
తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్లో 1.12, బఫర్ జోన్‌లోని 2 ఎకరాల్లో నిర్మాణం సర్వేతో నిగ్గుతేల్చిన జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేస్తామన్న కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇక అన్ని చెరువులపైనా దృష్టి సారిస్తామని వెల్లడి హైదరాబాద్ : గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కూల్చివేతలు.. సీజ్ చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు శనివారం ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై దృష్టి సారించారు. దీనికి నోటీసులు జారీ చేసేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై శ్రద్ధ చూపారు. అందులో భాగంగా త మ్మిడి చెరువు ఎఫ్‌టీఎల్‌పై సర్వే పూర్తి చేశారు. సర్వే మేరకు ప్రభుత్వ భూమిలో, చెరువు స్థలంలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేసినట్లు తేలింది. దీంతో సంబంధిత యాజమాన్యానికి నోటీసు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉండటంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే జరిపారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులతోపాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా సర్వేలో పాల్గొన్నారు. తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్‌లోని 2 ఎకరాలు ఎన్ కన్వెన్షన్‌లో ఉన్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలి పారు. నిబంధనల మేరకు పూర్తిచేయాల్సిన ప్రక్రియను పూర్తిచేసి నోటీసు జారీ చే యనున్నట్లు వెల్లడించారు. సర్వేలోని పూర్తి వివరాలను సోమవారం విడుదల చేస్తామని చెప్పారు. ఖానామెట్ సర్వేనంబర్ 11/2, 11/36లలో తమ్మిడిచెరువుకు చెంది న స్థలాన్ని చదునుచేసి కన్వెన్షన్ నిర్మాణాలు చేపట్టారని అధికారులు తెలిపారు. క్రమబద్ధీకరణకు దరఖాస్తు.. అనుమతుల్లేకుండా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను క్రమబద్ధీకరించాల్సిందిగా కోరుతూ 2010లో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. 6.69 ఎకరాల మేర స్థలంలోని నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాల్సిందిగా దరఖాస్తు చేసుకోగా, అది ప్రభుత్వ భూమి అయినందున జీహెచ్ఎంసీ అధికారులు తిరస్కరించారు. దరఖాస్తుతో పాటు 0.45 ఎకరాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను మాత్రం జతచేసినట్లు సమాచారం. విషయం కోర్టుకు వెళ్లడంతో చర్యలు తీసుకునే ముందు ఆ మేరకు తగిన సమాచారం ఇవ్వాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు పేర్కొనడంతో తాజాగా సర్వే జరిపారు. తమ్మిడికుంట చెరువు మొత్తం విస్తీర్ణం 29.24 ఎకరాలని అధికారులు తెలిపారు. చెరువుల కబ్జాదారులను జైల్లో పెట్టాలి: చెరువులు పూడ్చిన వారిని జైల్లో పెట్టాలని సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి అన్నారు. శనివారం ఆయన మాదాపూర్‌లోని తమ్మిడి చెరువును సందర్శించారు. శివారుల్లో ఉన్న చెరువులు కనుమరుగయ్యాయని, వాటిని రక్షించాలన్నారు. శేరిలింగంపల్లిలో సర్వే పూర్తి...: శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖానామెట్, ఇజ్జత్నగర్లలోని ప్రభుత్వ భూములు, చెరువులు తదితర భూముల సర్వేను రెవెన్యూ అధికారులు పూర్తిచేశారు. గత నెల 19వ తేదీనుంచి మండల పరిధిలోని ఖానామెట్ ఇజ్జత్ నగర్లలోనే గురుకుల్ ట్రస్ట్, ప్రభుత్వ, చెరువులు, కుంటల సర్వే కార్యక్రమం రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్ల ఉద్యోగులు ప్రారంభించారు. ముఖ్యంగా 5 టీంలు గురుకుల్ ట్రస్ట్‌లోని ఖాళీప్లాట్లు, భవనాలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో, ఎవరి అధీనంలో ఉన్నాయన్న వివరాలను సేకరించారు. శనివారంతో ఖానామెట్ ఇజ్జత్‌నగర్‌లలో సర్వే కార్యక్రమం పూర్తయినట్లు తహశీల్దార్ విద్యాసాగర్ తెలిపారు. సేకరించిన వివరాలను కంప్యూటర్లలో నమోదు చేస్తున్నామని, పూర్తి సమాచారం సోమవారం నాటికి అందే అవకాశం ఉందన్నారు. అన్ని చెరువులపైనా దృష్టి జీహెచ్ఎంసీలోని 168 చెరువులపైనా దృష్టి సారించి అక్రమాలుంటే చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అన్ని చెరువు ప్రాంతాలకు మార్కింగ్ చేస్తామన్నారు. దీనికి అన్ని సర్కిళ్లలోనూ ప్రత్యే క బృందాలను నియమిస్తామన్నారు. వారంలోగా చెరువు ప్రాంతాల్లో వెలసిన అక్రమ భవనాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని, అక్రమ నిర్మాణాలపై చర్యలను ఆపే ప్రసక్తే లేదన్నారు. నిబంధనల మేరకు పాటించాల్సిన విధివిధానాలు పాటిస్తామని చెప్పారు. గురుకుల్ ట్రస్ట్‌లోని భూములు అమ్మవద్దు.. కొనవద్దు.. అని శనివారం వరకు 125 భవనాలకు బోర్డులు అమర్చారు.