వలకు చిక్కిన రాకాసి చేప
కొల్లూరు: వింతాకారంలో శరీరం, రెక్కలపై రంపాన్ని పోలిన ముళ్ళతో ఉన్న చేప కొల్లూరు పశ్చిమ బ్యాంక్ కెనాల్లో సోమవారం మత్యకారుల వలకు చిక్కింది. సాధారణ చేపలకు మాదిరిలా కాక దీని నోరు కింది భాగంలో ఉండి నోటికి ఇరువైపులా రెండు కోరలు వలే ఉండటంతో రాకాసి చేప అయ్యింటుందని మత్యకారులు భావిస్తున్నారు. దీనిని వల నుంచి తీసిన అనంతరం గంటపాటు నీటిలో కాకుండా నేలమీద ఉంచినా బతికేఉందని ఈచేపను పట్టుకున్న కట్టా శ్రీను తెలిపారు. చేపను తాకితే దానిపై రంపాలవలే ఉన్న ముళ్ళ వల్ల చేయి కోసుకుపోతుందని, తాము ఇటువంటి చేపను ఇంతవరకు చూడలేదని పేర్కొన్నాడు. అడుగు పొడవున్నా ఈ చేప ఏ జాతికి చెందినది అన్నది స్థానికుల్లో చర్చానీయాంశంగా మారింది.