gj reddy
-
రామోజీ ఆర్థిక ఉగ్రవాదే కాదు.. దేశద్రోహి కూడా!
సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావు ఆర్థిక ఉగ్రవాదే కాదు.. దేశ ద్రోహి కూడా అన్న విషయం బయటపడింది. ఏడు దశాబ్దాలుగా ఆయన సాగిస్తున్న ఆర్థిక అక్రమాల వెనుక దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరాలు కూడా ఉండటం సంచలనంగా మారింది. విదేశాల నుంచి అక్రమంగా తెచ్చిన నిధులే పునాదిగా రామోజీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్, ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్ ఇలా అన్నింటిలోనూ అక్రమ పెట్టుబడులు, ఆర్థిక మోసాల దందా దాగుందన్నది స్పష్టమైంది. రామోజీ దేశద్రోహం అనంతర కాలంలో జీజే రెడ్డిపై దేశద్రోహం కేసు నమోదైంది. దాంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. కానీ ఈ కేసు విషయంలో ఆయన ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను మాత్రం కేంద్ర ప్రభుత్వం విచారించకపోవడం గమనార్హం. జీజే రెడ్డి దేశం విడిచి పారిపోయిన తరువాత ఆయన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఆయన పేరిట ఉన్న 288 షేర్లను రామోజీరావు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయలేదు. చట్టానికి వ్యతిరేకంగా తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అది తీవ్రమైన దేశ ద్రోహ నేరం. అంతేకాదు జీజే రెడ్డి దేశం విడిచిపారిపోవడానికి రామోజీ సహాయం చేశారని కూడా అప్పటి పరిణామాలను నిశితంగా పరిశీలించిన వారు చెబుతుండటం గమనార్హం. ఆ కేసులో ఇతర నిందితులు ఈమేరకు వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్‌లోనూ జీజే రెడ్డి పెట్టుబడులు! రామోజీరావు ప్రధాన వ్యాపార సంస్థలైన ఈనాడు పత్రిక, డాల్ఫిన్ హోటల్స్‌లోనూ జీజే రెడ్డి పెట్టుబడులు పెట్టారని బలమైన వాదన ఉంది. జీజే రెడ్డి 1963లోనే రామోజీరావుతో ఎలైట్ అనే ఇంగ్లిష్ పత్రికను పెట్టించారని, ఆ తర్వాత ఈనాడు పత్రిక ప్రారంభానికి కూడా ఆయన పెట్టుబడి పెట్టారని ఆనాటి ఈనాడు సంస్థ ఉద్యోగులే చెప్పడం గమనార్హం. కమ్యూనిస్టు కార్డును ఉపయోగించి రష్యా నుంచి ప్రింటింగ్ యంత్రాలు తెప్పించి ఈనాడు పత్రికను ప్రారంభించడంలో జీజే రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈనాడు స్థాపన సమయంలో పెట్టుబడులపై కూపీ లాగితే విదేశాల నుంచి అక్రమ నిధుల బాగోతం బయటపడుతుంది. 1960లలో రష్యా నుంచి తెచ్చిన నిధులను ఈనాడు, డాల్ఫిన్ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. రష్యా నుంచి అక్రమంగా నిధుల తరలింపు విషయంలో జీజే రెడ్డిపై అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహ నేరం కింద కేసు పెట్టింది. అలా అక్రమ నిధులు పెట్టుబడిగా పెట్టిన ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్, వాటి యజమాని రామోజీరావుపైనా దేశ ద్రోహ నేరం నమోదు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రామోజీ వాటా 100 షేర్లే... జీజే రెడ్డి పేరిట 288 షేర్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు. ఆ సంస్థపై సర్వాధికారాలు ఆయన కుటుంబానివేనని అందరూ భావిస్తారు. కానీ అసలు మార్గదర్శి సంస్థను ఏర్పాటు చేసిందే రామోజీ స్నేహితుడు జీజే రెడ్డి అని, దానిని ఏర్పాటు చేసే నాటికి రామోజీరావు షేర్లకంటే జీజేరెడ్డి షేర్లు చాలా రెట్లు ఎక్కువ అనే విషయాన్ని ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచారు. 1960ల నాటికే జీజే రెడ్డి ఢిల్లీలో బాగా పరపతి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీరావుకు తన సంస్థలో గుమస్తాగా ఉద్యోగం ఇచ్చారు. అనంతరం వారిద్దరూ కలిసి 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. ఆ సంస్థకు జీజే రెడ్డి ప్రధాన ప్రమోటర్. 1962 ఆగస్టు 31 నాటికి హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం రామోజీరావు ప్రారంభ వాటా కేవలం రూ.10 మాత్రమే. ఆయన సోదరుడు విశ్వనాథం పేరిట మరో వాటా ఉంది. ఇక 1960–70లలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రామోజీరావు పేరిట ఉన్నవి కేవలం 100 షేర్లు మాత్రమే. కానీ జీజే రెడ్డి పేరిట 288 షేర్లు ఉండటం విశేషం. అంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ప్రధాన వాటాదారు జీజే రెడ్డే. జీజే రెడ్డి కుటుంబాన్ని మోసం చేసిన రామోజీ 1986లో జీజే రెడ్డి మరణానంతరం ఆయన ఇద్దరు కుమారులు తమ తండ్రి పేరిట ఉన్న 288 షేర్ల వాటాను తమ పేరిట బదిలీ చేయమని కోరితే రామోజీ ససేమిరా అన్నారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డిలను తుపాకితో బెదిరించారు. జీజే రెడ్డి పేరిట ఉన్న 288 షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేశారు. దీనిపై ఆయన కుమారులు ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు జీజే రెడ్డి కుటుంబం తమ వాటా షేర్ల కోసం న్యాయ పోరాటం కూడా చేస్తోంది. -
తుపాకి గురిపెట్టి... షేర్లు కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి : మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల బాగోతం బయటపెట్టాల్సిందేనన్న సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పుతో ఆర్థిక ఉగ్రవాది రామోజీ అక్రమాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులోనే మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే మరో కంపెనీని ఏర్పాటు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అని కనీసం బోర్డు కూడా పెట్టకుండా వేల కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లుగా సేకరించారు. రామోజీ ఇంతటి ఆర్థిక అక్రమానికి కేంద్ర బిందువుగా మార్చుకున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ అనే సంస్థ ఏర్పాటుకు, తన ఉన్నతికి సాయం చేసిన చేతినే ఆయన కాటేశారన్న వాస్తవం కూడా విస్మయపరుస్తోంది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. దీనిపై జీజే రెడ్డి వారసుల ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఆ సోదరులు ఇద్దరూ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు. సాయం చేసిన మిత్రుడిని ముంచేసిన రామోజీ కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావు 1960లలో నిరుద్యోగి. చిన్న ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత కొండపల్లి సీతారామయ్యను కలిసి ఏదైనా ఉద్యోగానికి సిఫార్సు చేయమని ప్రాథేయపడేవారు. ఇదే జిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లో్లవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీకి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. రెండేళ్ల తరువాత 1962లో ఇద్దరూ కలిసి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. జీజే రెడ్డి తన స్వగ్రామం జొన్నలపాడులోని భూముల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇందులో పెట్టుబడిగా పెట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత జీజే రెడ్డి చెకొస్లో వేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని ఎన్నిసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. తుపాకితో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించారు. చిట్టచివరకు 2016 సెప్టెంబరు 29న రామోజీరావు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007 – 08 వార్షిక సంవత్సరం షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని కోరగా, అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోపెట్టారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు వారిపై ఆగ్రహంతో చిందులు తొక్కారు. తుపాకీ తీసి మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తారని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బతుకు జీవుడా అని బయటపడ్డారు. రామోజీ, శైలజపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీరావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. మరోవైపు ఇదే అంశంపై యూరి రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్న రామోజీరావు, శైలజ కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ షేర్లను తమ పేరిట బదిలీ చేసేలా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ను ఆదేశించాలని కోరుతున్నారు. దీనిపై న్యాయస్థానంలో వ్యాజ్యం కొనసాగుతోంది. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ, తమ షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. తమ తండ్రి వాటా షేర్లను అట్టిపెట్టుకోవాలనే నిర్ణయించుకున్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మారిస్తే చట్ట ప్రకారం షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. వాటన్నింటిపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ ఆర్థిక అక్రమాల్లో ఆరితేరిన రామోజీ తాను అనుకున్నంతా చేశారు. జీజే రెడ్డి షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తన పేరుతో ఒక్క షేరు కూడా లేకపోవడంతో విస్తుపోయారు. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. కంపెనీల చట్టం మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో అక్రమంగా షేర్లు బదిలీ చేసేసుకున్నట్లు వెల్లడైంది. -
సంతకాలు చేస్తారా.. చస్తారా?
సాక్షి, అమరావతి: ఆదరించినవారికి ద్రోహ చేయడం, ఆశ్రయం కల్పించిన వారిని ముంచేయడం అంటే ఠక్కున చంద్రబాబే గుర్తుకు వస్తారు. కానీ ఆయన రాజగురువు రామోజీరావు కూడా ఆ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. రామోజీ వ్యాపార సామ్రాజ్యానికి నల్లధనం సరఫరా యూనిట్‌గా నిలుస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్సే నమ్మక ద్రోహం, మోసాల పునాదుల మీద ఏర్పడింది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. రామోజీ చేసిన ద్రోహంపై జీజే రెడ్డి వారసులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పాయింట్ బ్లాంక్‌లో తుపాకి గురిపెట్టి రామోజీ చేసిన మైండ్ బ్లోయింగ్ దుర్మార్గం ఇదిగో ఇలా ఉంది.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అదే జిల్లా పెదపారుపూడికి చెందిన రామోజీరావు అప్పట్లో నిరుద్యోగి. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సు చేయడంతో రామోజీకి జీజే రెడ్డి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. అంతేకాదు.. రెండేళ్లకే అంటే 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం కోసం రామోజీరావుకు జీజే రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. తదనంతర పరిణామాల్లో జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. కాగా జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని చాలాసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. ఆ షేర్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తుపాకీతో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత... 2016 సెప్టెంబరు 29న రామోజీరావు ఆ సోదరులిద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5 వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. దాంతో ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బయటపడ్డారు. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ తమ వాటా షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. అందుకే వారు రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు. ఆ చెక్కును నగదుగా మారిస్తే షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ అక్రమాల్లో ఆరితేరిన రామోజీ మాత్రం ఫోర్జరీ సంతకాలతో జీజే రెడ్డి షేర్లను తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని విస్తుపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. రామోజీ, శైలజలపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహా రాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీ రావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. -
చంద్రబాబు, రామోజీ అసలు బండారం బట్టబయలు: సజ్జల
-
రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు
సాక్షి, అమరావతి: ‘రామోజీరావు పచ్చి మోసం చేశారు. తొలుత మమ్మల్ని ఓ గదిలో నిర్బంధించి, తుపాకీతో బెదిరించి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్లు బదిలీ చేయించుకోవాలని ప్రయత్నించారు. ప్రాణా లు దక్కించుకొనేందుకు ఆయనిచ్చిన ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు పెట్టి బయట పడ్డాం. షేర్లు మాత్రం బదిలీ చేయలేదు. ఆ తర్వాత ఫోర్జరీ సంతకాలతో మాకున్న 288 షేర్లను ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు బదలాయించుకున్నారు’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి చెప్పారు. తమ షేర్లను బదిలీ చేసి రామోజీ మోసానికి పాల్పడ్డారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని సీఐడీని, న్యాయస్థానాన్ని కోరారు. యూరి రెడ్డి మంగళవారం తన న్యాయవాది శివరామిరెడ్డితో కలిసి విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రామోజీరావు ఏ విధంగా తమ షేర్లను అక్రమంగా బదలాయించుకున్నదీ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. తుపాకితో బెదిరించి.. మా తండ్రి జీజే రెడ్డి చనిపోయిన తరువాత మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా అన్నయ్య మార్టిన్ రెడ్డి, నేను మా వాటా షేర్ల కోసం ఎన్నో ఏళ్లు రామోజీరావును సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి 2016లో హైదరాబాద్‌లో ఆయన్ని కలిశాము. మాకు డివిడెండ్ కింద చెక్ ఇచ్చారు. ఆ తరువాత మా షేర్లపై సర్టిఫికెట్ అడిగితే ఓ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు. మమ్మల్ని లోపల ఉంచి తలుపులు వేసేశారు. చాలాసేపటి తరువాత రామోజీరావు వచ్చి ఖాళీ స్టాంపు పేపర్లు ముందు పెట్టారు. వాటిపై సంతకాలు చేయమన్నారు. మేము నిరాకరించడంతో మా తలలకు తుపాకి గురి పెట్టి ‘సంతకాలు పెడతారా లేదా.. మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరు ఇక్కడ’ అని బెదిరించారు. అది ఆయన సామ్రాజ్యం. అంతా ఆయన మనుషులే. మా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేరు. ఆ సమయంలో అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడతామనుకోలేదు. ఆయనకు ఎదురు చెబితే ప్రాణాలు దక్కవన్నది అర్థమైంది. కేవలం ప్రాణాలు కాపాడుకొనేందుకే ఆ ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు చేసి బయటకు వచ్చాం. షేర్ల బదిలీకి మేము అంగీకరించలేదు. షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేయలేదు. రామోజీరావు మాకు ఇచ్చిన చెక్‌ను కూడా నగదుగా మార్చుకోలేదు. చట్ట ప్రకారం ఇది చెల్లదు కంపెనీల చట్టం ప్రకారం ఏదైనా షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి కావాలంటే మూడు అంశాలు తప్పనిసరి. ప్రతిపాదన (ఆఫర్), ఆమోదం (యాక్సెప్టెన్సీ), ప్రతిఫలం బదిలీ (కన్సిడరేషన్) తప్పనిసరి. మా షేర్ల బదిలీ విషయంలో ఆ మూడూ జరగలేదు. షేర్లు బదిలీ చేస్తామని మేము ఎక్కడా చెప్పలేదు. అందువల్ల ప్రతిపాదనే లేదు. రామోజీరావు కోరినా మేము ఆమోదించలేదు. అందువల్ల యాక్సెప్టెన్సీ లేదు. మా షేర్ల బదిలీకి ప్రతిఫలంగా మాకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలమూ దక్కలేదు. కాబట్టి మేము షేర్లు విక్రయించామన్న రామోజీరావు వాదన చెల్లదు. ఆయన వాదన పూర్తిగా అబద్ధం, మోసపూరితం. చేతి అప్పు అంటూ బుకాయింపు మా తండ్రికి చేతి అప్పుగా ఇచ్చిన దానికి ప్రతిఫలంగానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి నిధిని సమకూర్చారని రామోజీరావు ముందుగా బుకాయించారు. చేతి అప్పు తీర్చాలి అంటే నగదు ఇస్తారు గానీ కంపెనీలో పెట్టుబడి పెడతారా అని మేము ప్రశ్నిస్తే రామోజీరావు సరైన సమాధానం ఇవ్వలేదు. అనంతరం షేర్లు బదిలీ చేయాలని మమ్మల్ని తుపాకీతో బెదిరించారు. ఫోర్జరీ సంతకాలతో షేర్ల బదిలీ.. ఆర్వోసీకి ఫిర్యాదు మేము సమ్మతించకపోయినా, చెక్‌ను నగదుగా మార్చుకోకపోయినా మా వాటా 288 షేర్లను రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారని 2017లో గుర్తించాం. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి వెళ్లి సంబంధిత పత్రాలను పరిశీలిస్తే అసలు విషయం తెలిసింది. పలు పత్రాల్లో మా సంతకాలను ఫోర్జరీ చేశారు. దీనిపై అప్పట్లోనే ఆర్వోసీకి ఫిర్యాదు చేశాను. సీఐడీ దర్యాప్తుతో ధైర్యం వచ్చి.. రామోజీరావు తుపాకీతో బెదిరించారని కొందరికి మా ఆవేదన చెప్పుకున్నా అప్పట్లో ఫలితం లేకపోయింది. దాంతో ఫిర్యాదు చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఆయన రాజకీయ పరపతి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వ్యవస్థలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల సొమ్ము అక్రమ పెట్టుబడులకు మళ్లించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ రామోజీ, ఇతరులపై కేసు నమోదు చేసింది. సోదాలు నిర్వహిస్తోంది. దాంతో మాకు ధైర్యం వచ్చింది. అందుకే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని సీఐడీకి కొన్ని నెలల క్రితం ఫిర్యాదు చేశాము. సీఐడీ అధికారులు నాలుగైదు నెలలపాటు మా ఫిర్యాదును పరిశీలించారు. ఆధారాలు తెమ్మన్నారు. మేము ఇచ్చిన ఆధారాలను పరిశీలించారు. మా ఫిర్యాదు సరైనదే అని నిర్ధారించుకున్న తరువాతే కేసు నమోదు చేశారు. మూలధన నిధి ఏపీ నుంచే వచ్చింది కాబట్టి.. మా తండ్రి జీజే రెడ్డి కృష్ణా జిల్లాలోని తన వ్యవసాయ భూమి ద్వారా వచ్చిన ఆదాయాన్నే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టారు. అంటే మూలధన నిధిని ఏపీ నుంచే సమీకరించారు. ఆ పెట్టుబడితోనే మా పేరిట 288 షేర్లు వచ్చాయి. ఆ షేర్లనే రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారు. అందుకే ఈ కేసు ఏపీకి సంబంధించినదని న్యాయ నిపుణులు చెప్పారు. దాంతోనే ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశాం. మాకు జరిగిన అన్యాయంపై సీఐడీని సంప్రదించాం. సీఐడీ, న్యాయస్థానం మా ఆవేదనను గుర్తించి న్యాయం చేస్తాయని విశ్వసిస్తున్నాం. శైలజ పేరిట అప్పుడు 100 షేర్లే.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ పేరిట 2017 వరకు 100 షేర్లే ఉన్నాయి. జీజే రెడ్డి పేరిట మాత్రం 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి షేర్లను అక్రమంగా బదిలీ చేసిన తరువాత ప్రస్తుతం శైలజ కిరణ్ పేరిట 388 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి తప్ప మిగిలిన షేర్ హోల్డర్లంతా రామోజీ కుటుంబ సభ్యులే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఆరుగురు షేర్ హోల్డర్లే ఉన్నారు. ఎందుకంటే ఆ సంస్థ ఏనాడూ పబ్లిక్ ఇష్యూ జారీ చేయలేదు. ఉన్న ఆరుగురు షేర్ హోల్డర్లలో అయిదుగురు రామోజీరావు కుటుంబ సభ్యులే. జీజే రెడ్డి ఒక్కరే బయట వ్యక్తి. ఆయన పేరిట ఉన్న షేర్లను కూడా అక్రమంగా శైలజ కిరణ్ పేరిట బదిలీ చేశారు. ఆ అక్రమ వ్యవహారానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని ఇతర షేర్ హోల్డర్లు.. అంటే రామోజీ కుటుంబ సభ్యులు సహకరించారు. రామోజీరావు పెద్ద గూడుపుఠాణికి పాల్పడ్డారు. -
1962 నుంచి నా తండ్రి పేరు మీద మార్గదర్శిలో షేర్లు ఉన్నాయి
-
నా తండ్రి పేరు మీద షేర్స్ ఉన్నాయి: యూరిరెడ్డి
-
రామోజీరావు, శైలజ క్వాష్ పిటిషన్.. హైకోర్టులో విచారణ వాయిదా
-
షేర్ల కోసం.. తుపాకీతో రామోజీ బెదిరింపు
సాక్షి, అమరావతి: ‘మీ షేర్లను బదిలీ చేస్తున్నట్లు సంతకాలు పెడతారా లేదా!?’.. ఓ గదిలో తలకు తుపాకి గురిపెట్టి మరీ ఇలా బెదిరిస్తే ఎవరైనా ఏం చేస్తారు.. ప్రాణభయంతో సంతకాలు చేసేస్తారు కదా. ఈ ఉదంతంలోనూ బాధితులు అదే పనిచేశారు. కానీ, ఇక్కడ తలకు తుపాకి పెట్టి బెదిరించింది ఎవరో కాదు.. చెరుకూరి రామోజీరావు అలియాస్ ఈనాడు రామోజీరావు. ఆ బాధితులు మరెవరో కాదు.. రామోజీరావుతో కలిసి మార్గదర్శి చిట్‌ఫండ్స్ స్థాపించిన జీజే రెడ్డి కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి. ఇలా.. తుపాకితో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని 288 షేర్లను తన కోడలు శైలజా కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారు రామోజీ. ఆ ఒక్క సంతకమే కాకుండా మరికొన్ని ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో తతంగం కానిచ్చేశారు. ఆ విధంగా 2016 నాటికి రూ.1,59,69,600 మూలధన విలువ ఉన్న 288 షేర్లను అక్రమంగా కైవసం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించిన బాధితుడు యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఈనెల 13న ఫిర్యాదు చేయడంతో రామోజీరావు అక్రమాల బండారం బట్టబయలైంది. జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్‌రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. భారత్‌లో నివసిస్తూ తన కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఆయన రెండో కుమారుడు యూరి రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉండటంతో రామోజీరావు, శైలజ కిరణ్‌లపై సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజ కిరణ్‌లను నిందితులుగా చేర్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంచలనాత్మక కేసు వివరాలివీ.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకోస్లేవేకియాలో ఉన్నత విద్య పూర్తిచేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటుచేశారు. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో తన జిల్లాలోని పెదపారుపూడికి చెందిన రామోజీరావుకు తన కంపెనీలో టైపిస్ట్‌గా ఉద్యోగం ఇచ్చారు. అనంతరం జీజే రెడ్డి ఆర్థిక సహకారంతో రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను 1962లో నెలకొల్పారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి 1985లో చెకోస్లోవేకియాలో చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. ఆ తర్వాత.. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్ల కోసం రామోజీరావును చాలాసార్లు సంప్రదించినప్పటికీ ఆయనేమీ చెప్పలేదు. పత్రికల ద్వారా తెలుసుకుని సంప్రదిస్తే.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను 2014లో పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా మార్టిన్‌రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత 2016, సెప్టెంబరు 29న రామోజీరావు తనను కలిసేందుకు ఆ సోదరులు ఇద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్‌రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన ఏళ్లకు సంబంధించిన డివిడెండ్ మొత్తాన్ని కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. తుపాకి పెట్టి బెదిరించి మరీ.. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిలను ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద మార్టిన్రెడ్డిని సంతకం చేయమన్నారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరంలేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016, అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీలేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. వెంటనే రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు’ అని బెదిరించారు. దీంతో ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందనిగానీ, తేదీగానీ ఆ ఫామ్‌పై లేవు. రామోజీరావు తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి వారు బయటకొచ్చారు. చెక్కు మార్చలేదు.. షేర్ల బదిలీకి అంగీకరించలేదు.. మరోవైపు.. ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ.. తమకు రామోజీరావు ఇచ్చిన చెక్కును మాత్రం వారు నగదుగా మార్చుకోలేదు. ఎందుకంటే షేర్లు బదిలీ చేయడం సమ్మతం కాదు కాబట్టి. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకంచేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. అలాగే, రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి తాను షేర్లు బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. కానీ, ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో.. 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ.. మరోవైపు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో వాటాదారు అయిన యూరి రెడ్డి తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజకిరణ్ పేరిట బదిలీ చేసినట్లు గుర్తించారు. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే రామోజీరావు కుతంత్రం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేశారన్నది వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. మూలధన నిధి సేకరించింది ఏపీలోనే కాబట్టి.. తన షేర్లను అక్రమంగా శైలజకిరణ్ పేరిట బదిలీ చేయడంపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే తన తండ్రి జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాబట్టి తన షేర్ల అక్రమ బదిలీపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే ఆయన నిబంధనల మేరకు ఫిర్యాదు చేశారు. యూరి రెడ్డి ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్‌లను పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
Ramoji : రామోజీరావు ఘరానా మోసం, CID కేసు, వెంటనే క్వాష్ పిటిషన్
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్‌ఫండ్ చైర్మన్ రామోజీరావు నుంచి మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఆయనపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు వెళ్లింది. మార్గదర్శిలతో తమక రావాల్సిన వాటాల కోసం వెళ్తే.. రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు గాదిరెడ్డి యూరిరెడ్డి. మార్గదర్శి వ్యవస్థాపకులు జీ జగన్నాథరెడ్డి రెడ్డి కొడుకే ఈ యూరిరెడ్డి. తన తండ్రి వాటా షేర్లు తమకు ఇవ్వకుండా రామోజీరావు మోసం చేశారని.. గతంలో స్వయంగా కలిసి షేర్ల గురించి అడిగితే రామోజీరావు తుపాకీతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ ఫిర్యాదు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు.. 420, 467, 120-B, R/w 34 ప్రకారం కేసు నమోదు అయ్యింది. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అవినీతి అక్రమాల పుట్ట కదిలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మధ్యే తమ షేర్‌హోల్డింగ్‌పై స్పష్టత రావడంతోనే. ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదుదారుడు యూరిరెడ్డి పేర్కొన్నారు. యూరిరెడ్డి ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన తన తండ్రి జీజే రెడ్డి.. జెకోస్లోవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా నవభారత్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలను స్థాపించారు. అదే జిల్లాలోని పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావుని.. కమ్యూనిస్ట్ నేత అయిన కొండపల్లి సీతారామయ్య ఉద్యోగం కోసం జీజే రెడ్డికి రికమండ్ చేశారు. దీంతో ఢిల్లీలోని తన కంపెనీలో రామోజీరావుకు టైపిస్ట్ కమ్ స్టెనో ఉద్యోగం ఇప్పించారు జీజే రెడ్డి. అయితే రామోజీరావు తన బిజినెస్ స్కిల్స్ చూపించి.. తన తండ్రికి దగ్గరయ్యారని, ఆపై చిట్‌ఫండ్‌కంపెనీ కోసం రూ.5 వేలు పెట్టుబడి కూడా పెట్టారన్నారు. ప్రతిగా మా నాన్నకు(జీజే రెడ్డికి) రామోజీరావు షేర్లు కేటాయించారు.. అని ఫిర్యాదులో యూరిరెడ్డి పేర్కొన్నారు. 1985లో తన తండ్రి జీజే రెడ్డి మరణించిన తర్వాత షేర్ల గురించి తెలియదు. అయితే.. 2014లో సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగానే తనకు తన తండ్రి మార్గదర్శిలో ఎంత కీలకంగా వ్యవహరించారో తెలిసొచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. గుమాస్తా రామోజీ .. మరి ఎలా ఓనర్ అయ్యాడు? వాటాల కోసం పలుమార్లు సంప్రదించే యత్నం చేశాం. కానీ, రామోజీరావు మమ్మల్ని కలవలేదు. ఎట్టకేలకు 2016లో తనను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు రామోజీరావు. నా తండ్రి పేరు మీద ఉన్న షేర్లు నా పేరు మీద బదలాయించామని ఆయన్ని కోరాను. దానికి ఆయన.. కొంతకాలానికి బదిలీ చేస్తానని చెప్పారు. తిరిగి ఆయన్ని కలిశాక.. నా పేరిట షేర్లు బదిలీ చేయడానికి నా సోదరుడిని నుంచి అఫిడవిట్‌పై నో అబ్జెక్షన్ సంతకం చేయమన్నారు. అయితే అక్కడ ఓ ఖాళీ అఫిడవిట్ కాగితలం ఉండడంతో మేం అభ్యంతరం వ్యక్తం చేశాం. ఆ సమయంలో కోపంతో ఉన్న తుపాకీతో బెదిరించి కాగితాలపై బలవంతంగా సంతకాలు కూడా చేయించుకున్నట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. కానీ, ఆ కాగితాలు చెల్లవని.. ప్రస్తుతం మార్గదర్శి మోసాలు వెలుగు చూస్తుండడం, ఆ షేర్లు శైలజా కిరణ్ పేరు మీద బదలాయించడంతో.. దర్యాప్తు సంస్థను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారాయన. అలా ఫిర్యాదు, ఇలా క్వాష్ పిటిషన్ యూరి రెడ్డి ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ CID పోలీసులు కేసు నమోదు చేయగానే.. రామోజీ రావు ఎక్కడ లేని తొందర చూపించారు. ఆఘమేఘాల మీద ఆయన లీగల్ టీం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ నమోదు చేశారు. కేవలం కొన్ని గంటల్లోనే క్వాష్ పిటిషన్ వేయడం సామాన్యులెవరికీ సాధ్యం కాని విషయం. ఈ కేసు నేడు హైకోర్టు ముందు విచారణకు రానుంది. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ ఫిర్యాదు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు.. 420, 467, 120-B, R/w 34 ప్రకారం కేసు నమోదు అయ్యింది. ఈ FIRను సవాలు చేస్తూ క్వాష్ పిటిషన్ వేసింది రామోజీ టీం. -
రామోజీరావును పెంచి పోషించింది మా నాన్నే
‘సాక్షి’ ఇంటర్వ్యూలో జీజేఆర్ కుమారుడు యూరి మార్గదర్శి మా నాన్న నాటిన విత్తనమే ‘ఈనాడు’ ఆలోచన కూడా నాన్నదే పెట్టుబడి నుంచి యంత్రాల దాకా సమకూర్చి పెట్టారు డాల్ఫిన్ హోటల్స్‌లోనూ నాన్న పెట్టుబడులున్నాయి చాలా సంస్థల్లో ఆయన బినామీ పెట్టుబడులు పెట్టారు వ్యాపార భాగస్వాములని నమ్మినవారే ముంచేశారు మృత్యుశయ్య నుంచి ఆయన నాకు చెప్పిన విషయాలివి తొలినాళ్లలో రామోజీ ఎదుగుదల వెనక ఉన్నది జీజే రెడ్డేనని ఆయన కుమారుడు యూరీ రెడ్డి ధ్రువీకరించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన తండ్రి పెట్టుబడులు పెట్టారని, ఆ సంస్థతో పాటు ‘ఈనాడు’ ఏర్పాటుకు కూడా అన్నివిధాలా సాయం చేశారని వివరించారు. ఢిల్లీ స్థాయిలో తన తండ్రి పలుకుబడి, పరిచయాలను రామోజీ పూర్తిగా వాడుకుని ఎదిగారని చెప్పారు.చట్టపరమైన మార్గాల ద్వారా తన తండ్రి వాటాలను, పెట్టుబడులను రాబట్టుకునే ఆలోచన ఉందని ‘సాక్షి’ ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలు... రామోజీ మీ నాన్న కోసం పని చేసేవారని అంటారు? అవును. రామోజీరావుకు మా నాన్నతో సన్నిహిత సంబంధముండేదన్నది నిజం. ఆయన మా నాన్న దగ్గర పని చేసేవారని విన్నాను. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తొలి నుంచీ మా నాన్నకు వాటాలుండేవి. అప్పట్లో రామోజీకి ఓ కంపెనీ పెట్టేంత స్తోమత ఉండేది కాదని, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు మీ నాన్నే ప్రైమ్ మూవర్ అని, అందుకే ఆ సంస్థలో ఆయన వ్యవస్థాపక ఇన్వెస్టర్‌గా చేరారని, అందులో ఉన్నది మీ నాన్న డబ్బేనని అంటారు. నిజమేనా? నిజమే. మా నాన్న మార్గదర్శి వ్యవస్థాపక డెరైక్టర్లలో ఒకరు. దాని ప్రారంభ పెట్టుబడి (సీడ్ క్యాపిటల్) పెట్టింది ఆయనే. మా నాన్నే నాతో ఎన్నోసార్లు చెప్పారిది. నవభారత్ ఎంటర్ప్రైజెస్, మార్గదర్శి వంటి ఈ కంపెనీలన్నీ పరస్పరం ఇంటర్ లింక్డ్ అనేవారు. మా నాన్న ఒక స్నేహితునిగా తన కంపెనీల నుంచి డబ్బును రామోజీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. నేను కొంచెం ఎమోషనల్‌గా ఫీలవుతున్నాను. మరణశయ్య నుంచి ఒక తండ్రి తన కుమారునికి చెప్పిన సత్యాలను మీతో పంచుకుంటున్నాను. డాల్ఫిన్ హోటల్స్‌లో కూడా తన పెట్టుబడులున్నాయని మా నాన్న తన చివరి క్షణాల్లో నాతో చెప్పారు. ‘ఈనాడు’ పత్రికకు అవసరమైన ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా తూర్పు జర్మనీ నుంచి మా నాన్నే దిగుమతి చేయించారని మా అంకుల్స్ నాకు చెప్పారు. ఇప్పుడు భారత్‌లో ఆస్తుల ధరలు బాగా పెరగడంతో నాటి మా నాన్న పెట్టుబడుల విలువ కూడా భారీగా పెరిగింది. భారత్‌లోని తన ఆస్తులు తదితరాలకు ఏఎస్ చౌదరి అనే ఆయన కేర్టేకర్అని మా నాన్న నాతో చెప్పారు. మీ నాన్న నాటిన విత్తనమే ఇప్పుడు ఏటా కొన్ని వేల కోట్ల టర్నోవర్‌తో కూడిన వ్యాపార సామ్రాజ్యంగా మారిందని భావిస్తున్నారా? అవును. ఇక్కడి తన ఆస్తులను, షేర్ల ద్వారా డివిడెండ్ వంటివేమైనా వస్తే వాటిని ఆంధ్రప్రదేశ్‌లోనే ధార్మిక కార్యకలాపాలకు వినియోగిస్తే ఎంతో సంతోషిస్తానని మా నాన్న తన చివరి రోజుల్లో మాతో చెప్పేవారు. మీ తల్లిదండ్రులకు హైదరాబాద్, ఢిల్లీల్లో భూములు, పలు కంపెనీల్లో మంచి పెట్టుబడులుండేవా? అవును. బిగ్ మనీ, బిగ్ పాలిటిక్స్. వాటి మధ్య విభజన రేఖ చాలా సన్ననిది! మీ నాన్న తన వ్యాపార భాగస్వాముల సంస్థల్లో చాలా పెట్టుబడులు పెట్టారని, వాటిని వారే నియంత్రించేవారని అంటారు. ఆయన తదనంతరం ఆ పెట్టుబడుల జాడే లేకుండా పోయిందంటారు. వ్యాపార భాగస్వాములే మీ నాన్నను ముంచారా? నిజం. ఢిల్లీలోని మీ బంగ్లాకు రామోజీరావు తరచూ వచ్చేవారట? అవును, నిజం. ఆయన తరచు అక్కడకు వస్తుండేవారు. ‘ఈనాడు’ పత్రిక పెట్టాలన్న ఆలోచన కూడా మీ నాన్నదేనటగా? అవును. ఆ ఐడియా మా నాన్నదే. ఈనాడుకు ప్రింటింగ్ ప్రెస్‌ను మీ నాన్నే సమకూర్చారటగా! అవును. తూర్పు జర్మనీ నుంచి వాయిదాల చెల్లింపు పద్ధతిన మా నాన్నే సమకూర్చారు. అప్పట్లో ఆయన చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. రామోజీ తన సంస్థ ఎదుగుదలకు మా నాన్న పలుకుబడిని, పరిచయాలను వాడుకోవడాన్ని ఆయనెప్పుడూ కాదనలేదు. రామోజీ గురించి మీ నాన్న ఏం చెప్పేవారు? ఆయన్ను తన కొలీగ్‌గా, క్లోజ్ ఫ్రెండ్‌గా భావించేవారు. మీ నాన్న తీర్చిదిద్దిన రామోజీ, 1985 నాటికి ప్రభుత్వాలనే మార్చగలిగే స్థాయికి ఎదిగారు. దీనిపై మీ నాన్న ఏమంటుండేవారు? పోలియో బాధితుడైన మా నాన్న తన జీవితంలో చాలామందికి సాయం చేశారు. ఎంతోమందిని పెంచి పోషించారు. తన పర్యవేక్షణలో విజయం సాధించిన రామోజీని చూసి, అలాంటి వ్యక్తిని పెంచి పోషించింది తానేనని ఆయన చాలా సంతోషపడేవారు. అప్పట్లో మా నాన్నకు డబ్బు ప్రధానం కాదు. రామోజీ సంస్థల్లో డబ్బు ఇన్వెస్ట్ చేసినా, మెషినరీ వంటిది ఏర్పాటు చేసినా... సాయపడాలన్నది మాత్రమే ఆయన తత్వం. మార్గదర్శి-నవభారత్ లింకు గురించి మీ నాన్న ఏం చెప్పేవారు? వాటిది చాలా సన్నిహిత సంబంధం. భారత్‌లో అప్పట్లో పన్ను భారం ఎక్కువగా ఉండేది. దాన్ని తప్పించుకునేందుకు మిగులు నిధులన్నింటినీ బినామీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారు. అదంతా ఇప్పటి ప్రమాణాల ప్రకారం చట్టబద్ధం కాకపోవచ్చు. మా నాన్న పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఆస్తులు కొన్నారు. కానీ వాటిని ఆయన పేరుతో పెట్టేందుకు వీల్లేకపోవడంతో ఎన్నో కంపెనీల్లో బినామీ పేర్లతో పెట్టారు. అలా ఎందుకు చేశారో నాకిప్పటికీ అర్థం కాదు. బహుశా అప్పట్లో పరిస్థితులు, వ్యాపార వాతావరణం అలా ఉండేవేమో. అయితే ఇలాంటి అనధికారిక విషయాల గురించి నేను మాట్లాడటం లేదు. చట్టప్రకారం మా తండ్రికి వారసులుగా మాకుండే హక్కుల గురించే మాట్లాడుతున్నాం. మా నాన్న ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో మా వాటాను మాకిప్పించమని కోరుతున్నాం. అప్పట్లో వీటి గురించి మేం పట్టించుకోలేదు. నాన్న పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, పోలియో బాధితులకు ఆసరాగా ఉండటం నా ఆశయం. ఒక వ్యక్తిగా రామోజీ గురించి ఏమంటారు? కొన్నేళ్ల క్రితం ఆయన్ను కలిశాను. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా నాన్న పెట్టుబడి రూ.35 వేలు మాత్రమేనని ఆయనన్నారు. అదంత పెద్ద మొత్తం కాదనిపించింది. దాంతో వదిలేశాను. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మీ నాన్నకు ఇప్పటికీ 288 షేర్లున్న విషయం మీకు తెలుసా? ఇటీవలే తెలిసింది. అయితే 90 షేర్లేనన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని మీ నాన్న వాటాల విలువను తెలుసుకునే ప్రయత్నమేమైనా చేశారా? రామోజీ కంపెనీల్లోని మీ నాన్న పెట్టుబడులను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తారా? దీనిపై చర్చిస్తాను. నా సోదరుడు నాకిప్పటికే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు. అయినా ఆయనతో కూడా ఈ విషయమై మాట్లాడాలి. రామోజీ ఎప్పుడన్నా మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేశారా? అప్పట్లో ప్రాగ్ (చెకస్లొవేకియా రాజధాని)లో నేను ప్రియా పచ్చళ్ల వ్యాపారం చేసేవాడిని. కొన్నేళ్ల క్రితం దాన్ని తిరిగి మొదలు పెట్టాలనుకున్నాను. అందుకు రామోజీ ఆఫర్ ఇచ్చారు. -
‘ఈనాడు’ కూడా జీజేఆర్ మానసపుత్రికే.
రామోజీ చురుకుదనాన్ని గమనించిన జీజేఆర్ ఆయనకు క్రమక్రమంగా ప్రాధాన్యం కల్పించారని అప్పటి సహోద్యోగులు వివరించారు. ఈ క్రమంలోనే రామోజీని ముందు పెట్టి మార్గదర్శికి జీజేఆర్ శ్రీకారం చుట్టారని, తర్వాత 1963లోనే రామోజీతో ‘ఎలైట్’ అనే సాయంకాలం దినపత్రిక (ఇంగ్లిష్) కూడా పెట్టించారని చెబుతారు. అప్పటికే మార్గదర్శిలోనూ, ఆ తర్వాత రామోజీ పెట్టిన డాల్ఫిన్ హోటళ్లలోనూ జీజేఆర్ పెట్టుబడులే ప్రధానంగా ఉన్నాయి. అనంతర కాలంలో ఈనాడు’ పత్రిక పుట్టుకొచ్చింది కూడా జీజేఆర్ ఆలోచనల్లో నుంచేనని ఆయన సన్నిహితులు వెల్లడించారు. 1974లో రామోజీ ‘ఈనాడు’ పెట్టేనాటికి ఢిల్లీలో జీజేఆర్ పలుకుబడి పతాక స్థాయిలో ఉంది. ఆ పత్రికకు ఆయనే ఆర్థిక సాయం చేశారని జీజేఆర్ సన్నిహితులు వివరించారు. ‘‘ఈనాడుకు ప్రింటింగ్ ప్రెస్ కూడా జీజేఆర్ చలవే. కమ్యూనిస్టు కార్డును పూర్తిస్థాయిలో ఉపయోగించి తూర్పు జర్మనీ నుంచి సెకండ్ హ్యాండ్ ముద్రణా సామగ్రి మొత్తాన్నీ ఈనాడుకు సాధించి పెట్టారు జీజేఆర్. ఆ రుణాన్ని ఏడేళ్ల పాటు సులభ వాయిదాల్లో చెల్లించే ఏర్పాటు కూడా చేయించారు. ఇలా తొలినాళ్లలో రామోజీ పెట్టిన సంస్థల పునాదులన్నీ పూర్తిగా జీజేఆర్ వేసినవే’’ అని వివరించారు. అంతేకాదు, ‘‘రామోజీ ఒకట్రెండుసార్లు నా సమక్షంలోనే జీజేఆర్ దగ్గరికి డబ్బుల కోసం వచ్చి వెళ్లాడు. అది రామోజీకి నిత్యకృత్యమేనని ఆ తర్వాత జీజేఆర్ నాతో చెప్పారు’’ అని జీజేఆర్‌కు అతి సన్నిహితుడైన ఓ ప్రముఖ వ్యక్తి కూడా సాక్షి ప్రతినిధికి వివరించారు. -
రామోజీ! జీజే రెడ్డి గుర్తున్నాడా?
నేటికీ మార్గదర్శి రికార్డుల్లో జీజేఆర్ పేరుతోనే షేర్లు మార్గదర్శితో పాటు ‘ఈనాడు’ కూడా జీజేఆర్ మానసపుత్రికే! అతని వద్ద గుమస్తాగా చేరి, అంచెలంచెలుగా ‘ఎదిగిన’ రామోజీ మార్గదర్శిలో రామోజీ ప్రారంభ వాటా కేవలం 10 రూపాయలే! పెట్టుబడులన్నీ జీజేఆర్వేనంటున్న నాటి రామోజీ సహోద్యోగులు ‘ఈనాడు’ పెట్టుబడులు, మెషినరీ... అన్నీ జీజేఆర్ పుణ్యమే! దేశం నుంచి సాగనంపి... వాటన్నింటినీ దిగమింగిన రామోజీ! నమ్మకద్రోహానికి రామోజీ నిలువెత్తు నిదర్శనం: జీజేఆర్ గ్రామస్తులు రాజగురువు ఎదుగుదల వెనక ‘దేశద్రోహ’ కోణం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో జీజే రెడ్డి అనే వ్యక్తి పేరిట షేర్లు దేశద్రోహం కేసులో దేశం వదిలి పరారైన చరిత్ర అతనిది అతని ఆస్తులు, ఖాతాలు, షేర్లనూ జప్తు చేసిన ప్రభుత్వం మార్గదర్శిలోని జీజేఆర్ షేర్లను మాత్రం స్వాధీనం చేయని రామోజీ దేశద్రోహానికి తీసిపోని నేరమేనంటున్న విశ్లేషకులు నిత్యం ఉషోదయంతోపాటు సత్యం నినదించాలంటూ శ్రీరంగనీతులు వల్లించే పచ్చ పుత్రిక ‘ఈనాడు’ మూలాల్లోనే దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేంతటి ‘ద్రోహం’ దాగుంది! పోటీ పత్రికల ఉసురు తీసేందుకు పతాక శీర్షికన పనికిరాని పాచి కథనాలను నిత్యం వండి వార్చి వినోదించే రామోజీ తాలూకు మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలోని పెట్టుబడులే... సీఐఏ ఏజెంట్‌గా న్యాయస్థానమే ప్రకటించిన ఓ వ్యక్తివి!! అంతేనా... పునాదుల నుంచి పెరుగుదల దాకా వాటికి కావాల్సిన నిధులు, ఇతరత్రా సాయం వంటి సర్వ వనరులూ.. దేశ రహస్యాలను విక్రయానికి పెట్టిన కేసులో ఇరుక్కున్న ఆ వ్యక్తి అందజేసినవే. అసలు మార్గదర్శి, ఈనాడు ప్రాణం పోసుకున్నది కూడా.. ‘అపరాధిగా ప్రకటితుడై’, అరెస్టు భయంతో దేశం వదిలిపోయిన ఆ వ్యక్తి ఆలోచనల్లో నుంచే! అతని పేరు గాదిరెడ్డి జగన్నాథరెడ్డి, ఉరఫ్ జి.జె. రెడ్డి. అతను 1960, 1970ల్లో ఢిల్లీ రాజకీయ, అధికార వర్గాల్లో తిరుగులేని రీతిలో హవా చలాయించిన వ్యక్తి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కార్యాలయంలోకి కూడా నేరుగా వెళ్లగలిగిన హై ప్రొఫైల్ ‘పెద్దమనిషి’! అలాంటి వ్యక్తి దగ్గర తొలినాళ్లలో గుమస్తాగిరీ చేసిన రామోజీ... ఆనక అతని పెట్టుబడితో, ఆద్యంతం అతని దన్నుతోనే ఇటు చిట్‌ఫండ్, అటు పత్రిక పెట్టి... జీజేఆర్ దేశం వదిలిపోయాక వాటిని సొంతం చేసుకుని... పోటీ పత్రికలను, సంస్థలను అడ్డంగా అణగదొక్కి మరీ ‘పెద్ద’మనిషిగా ఎదిగారు. రాజగురువుగా దర్జాగా రూపాంతరం చెందారు! దేశద్రోహం కేసులో జీజేఆర్ స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతాలతో పాటు పలు సంస్థలు, కంపెనీల్లో అతనికున్న వాటాలను కూడా 1977లోనే ప్రభుత్వం స్తంభింపజేసింది. అయినా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో జీజేఆర్‌కున్న షేర్లను, అతనివేనని భావిస్తున్న ఇతర పెట్టుబడులను మాత్రం గుట్టుగా దాచేసుకున్న గుండెలు తీసిన బంటు రామోజీ! వాటిని తక్షణం ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉంటుందని తెలిసి కూడా దర్జాగా అట్టిపెట్టుకోవడం ద్వారా దేశద్రోహానికి ఏ మాత్రమూ తక్కువ కాని నేరానికి పాల్పడ్డారాయన. మార్గదర్శిలో ఆ షేర్లు ఇప్పటికీ జీజేఆర్ పేరుతోనే కొనసాగుతుండటం విశేషం. తన తండ్రి పెట్టుబడులను తిరిగివ్వండని ఆయన కొడుకు అడిగినా ‘అలాంటివేమీ లేవు పొ’మ్మంటూ ఉత్తి చేతులతో తిప్పి పంపిన కర్కశ హృదయుడు రామోజీ... ‘‘అతనికి పలు కంపెనీల్లో భారీ మొత్తంలో షేర్లున్నాయి. పలు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. షేర్లు చేతులు మారకుండా వేగంగా స్పందించండి. బ్యాంకు ఖాతాలను తక్షణం స్తంభింపజేయండి. ఇందుకవసరమైన అన్ని అధికారాలూ సమకూరుస్తూ సీఐడీ డీఎస్పీ అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నాం. డీఎస్పీ తక్షణం రంగంలోకి దిగి వివిధ సంస్థల్లోని ఆయన షేర్లను జప్తు చేయాలి. బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలి. ఆ వివరాలను కోర్టుకు సమర్పించాలి’’ - ఇవీ ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పి.కె.ధామ్ 1977 ఏప్రిల్ 7న ఇచ్చిన ఉత్తర్వులు! ఇందులో పేర్కొన్న ‘భారీ మొత్తంలో షేర్లున్న’ ఆ ‘అతను’ గాదిరెడ్డి జగన్నాథరెడ్డి. ఈయనను చాలా రకాలుగా పరిచయం చేయవచ్చు. జీజే రెడ్డిగా 1960లు, 70ల్లో ఢిల్లీలో బాగా పేరు మోసిన బడా బాబు. పెద్ద పెద్ద వ్యక్తులు, నేతలతో సంబంధాలతో పాటు పలు కమ్యూనిస్టు దేశాలతో మన దేశానికి, ఇక్కడి నాయకులకు మధ్య ‘సంధానకర్త’గా కూడా చక్రం తిప్పిన వ్యక్తి. వీటికి తోడు.. ‘సీఐఏ ఏజెంటు’ అని సాక్షాత్తూ భారత ప్రభుత్వమే పేర్కొన్న వ్యక్తి!! వీటన్నింటికీ మించి.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ లిమిటెడ్‌కు జీజేఆరే ప్రమోటర్ డెరైక్టర్! అంతకంటే కూడా మించి.. రాష్ట్ర రాజకీయాల్లో చిరకాలం పాటు తెర వెనకగా చక్రం తిప్పిన, మళ్లీ తిప్పాలని ఎంతగానో ఆశ పడుతున్న రామోజీకి ఆరంభ దశలో ‘అన్నివిధాలా’ దారి చూపిన ‘మార్గదర్శి’ కూడా ఈయనే!! మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో నేటికీ 288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయి. దేశద్రోహ చట్టం కింద నేరాభియోగం ఎదుర్కొన్న జీజేఆర్, 1977లో దేశం వదిలిపోయారు. అనంతరం ఆయన ఆస్తులన్నింటినీ భారత ప్రభుత్వం జప్తు చేసింది. ఢిల్లీలో అత్యంత ఖరీదైన బంగ్లా, హైదరాబాద్ రామచంద్రాపురంలో భూములు, బ్యాంకు ఖాతాలతో పాటు పలు సంస్థల్లో ఆయన పేరిట ఉన్న షేర్లన్నీ జప్తయ్యాయి. కానీ రామోజీ మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని జీజేఆర్ షేర్లను ప్రభుత్వానికి స్వాధీనం చేయలేదు. అంతేకాదు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, రామోజీ కోడలు శైలజా కిరణ్‌కు ఆ సంస్థలో కేవలం 100 షేర్లుంటే.. అంతకు దాదాపు మూడు రెట్ల వాటాలు నేటికీ మార్గదర్శి వాటాదారుల జాబితాలో జీజేఆర్ పేరిటే దర్శనమిస్తున్నాయి. వాటిని 1977లోనే ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిన రామోజీ, అలా చేయకపోవడం ద్వారా ఢిల్లీ కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా తుంగలో తొక్కారు! అది తీవ్రమైన నేరమని తెలిసి కూడా అసలే ఖాతరు చేయలేదు. ‘అమ్మ రామోజీ!’ అని ఎవరికైనా అనిపించే ఈ అంశాలన్నీ అసలు వాస్తవాలకు కేవలం ఒక పార్శ్వం మాత్రమే. వీటి ఆధారంగా తీగ లాగితే అసలు డొంకంతా అడ్డంగా బయటపడింది. మార్గదర్శితో పాటు రాజగురువు ఆర్థిక మూలాలన్నీ జీజేఆర్ పెట్టుబడులతోనే ముడిపడి ఉన్న వైనం వెలుగులోకి వచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ 1962 ఆగస్టు 31న హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదైంది. అందులో రామోజీ ప్రారంభ వాటా కేవలం 10 రూపాయలు! ఆయన సోదరుడు కాశీ విశ్వనాథం పేరిట మరో వాటా ఉంది. అలా ఇద్దరు సోదరులూ కలిసి కేవలం 20 రూపాయల పెట్టుబడితో సంస్థను స్థాపించారు. వాస్తవానికి సంస్థకు భారీ మొత్తంలో నిధులను ఒంటి చేత్తో సమకూర్చింది.. దాని ప్రమోటర్ డెరైక్టర్‌గా రంగప్రవేశం చేసిన జీజేఆరే అన్నది ఆయన సన్నిహితులతో పాటు అప్పటి రామోజీ సహోద్యోగులు కూడా ఘంటాపథంగా చెప్పేమాట! ‘ఇంతింతై...’ అన్నట్టుగా అనంతర కాలంలో సాగిన మార్గదర్శి, రామోజీ ఎదుగుదలకు జీజేఆర్ పెట్టుబడులే ప్రధాన ఆలంబన! మార్గదర్శితో పాటు రామోజీకి చెందిన డాల్ఫిన్ హోటల్స్‌లోనూ జీజేఆర్ పెట్టుబడులున్నట్టు ఆయన కుమారుడు యూరి రెడ్డి కూడా స్వయంగా ధ్రువీకరించారు. పైగా, తాను పెంచి పోషించిన రామోజీ ఎదుగుదలను చూసి జీజేఆర్ సంతోషించేవారని కూడా ఆయన చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు, గుడివాడ తదితర చోట్ల క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ జరిపిన విస్తృత పరిశోధనలో రామోజీ సహచరులు, వ్యాపారంలో ఆయనకు అండగా నిలిచిన వ్యక్తులు, వారి పిల్లలు వెల్లడించిన వివరాలు దిగ్భ్రాంతి గొలిపేలా ఉన్నాయి... జీజేఆర్‌ను నిచ్చెనలా వాడుకున్న రామోజీ... కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని జొన్నపాడుకు చెందిన జీజేఆర్‌కు ఢిల్లీలోని సంపన్నులు, రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ పెద్దలతో కూడా అతి సన్నిహిత సంబంధాలుండేవి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కార్యాలయంలోకి కూడా నేరుగా వెళ్లగలిగిన సత్తా అతనిది! ఇందిర ఇంటి సమీపంలోనే సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో విశాలమైన బంగ్లాలో ఆయన నివాసం. పైగా ఆమె చిన్న కొడుకు సంజయ్‌గాంధీతో పాటు అప్పట్లో రాజకీయంగా చక్రం తిప్పిన మహ్మద్ యూనస్ వంటి పలువురు రాజకీయ ప్రముఖులతో చెప్పలేనంత చనువు! ఇక రాష్ట్రానికి చెందిన జలగం వెంగళరావు, పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, అంజయ్య, రఘురామయ్య వంటి రాజకీయ దిగ్గజాలతో జీజేఆర్‌కున్న పరిచయాలు, సాన్నిహిత్యం గురించైతే చెప్పనవసరమే లేదు! వీటన్నింటినీ తన వ్యాపారాభివృద్ధికి అత్యంత తెలివిగా వాడుకున్నారు రామోజీ. 1960ల తొలి నాళ్లలో కృష్ణా జిల్లా గుడివాడ రోడ్లపై రామోజీ సైకిల్ మీద తిరిగేవారని ఆయన సొంతూరు పెదపారుపూడి వాసులే చెబుతుంటారు. అప్పట్లో రామోజీ ఆర్థికంగా ఏమాత్రమూ స్థితిమంతుడు కాదనేందుకు సొంతూళ్లోని ఆయన ఇల్లే నిదర్శనం. అలాంటి రామోజీ, జొన్నపాడుకే చెందిన ప్రముఖ నక్సలైటు, అప్పటి కమ్యూనిస్టు నాయకుడు కొండపల్లి సీతారామయ్య సిఫార్సు లేఖతో జీజేఆర్ చెంతకు చేరారు. రామోజీని జీజేఆర్ ఢిల్లీలోని తన బంగ్లాలోనే గుమస్తాగా కుదుర్చుకున్నాడని ఆయన సన్నిహితులు చెబుతారు. ఇదంతా 1960ల నాటి సంగతి. అప్పట్లో తాను ఢిల్లీలో ఒక మలయాళీకి చెందిన అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో పనిచేశానని రామోజీ తనకు 75 ఏళ్లు నిండిన సందర్భంగా రాసుకున్న ‘75 వసంతాల వెలుగు’ పుస్తకంలో స్వయంగా చెప్పుకున్నారు. వాస్తవానికి మార్గదర్శిని స్థాపించకముందు ఢిల్లీలో రామోజీ పని చేసింది జీజేఆర్ బంగ్లాలోనేనంటారు. అనంతర కాలంలో కూడా రామోజీ ఆ బంగ్లాకు తరచూ వచ్చి వెళ్లేవారని జీజేఆర్ కుమారుడు యూరి వివరించారు. పైగా మార్గదర్శితో తన సాన్నిహిత్యం గురించి జీజేఆర్ ఇతర డెరైక్టర్లతో తాను రాసుకున్న అవగాహన పత్రంలో స్వయంగా ఇలా పేర్కొన్నారు... ‘‘నాకు కొన్ని కంపెనీల్లో తక్కువ, మరికొన్నింట్లో ఎక్కువ షేర్లు ఉండొచ్చు. నేను చేసే పని స్వభావం మన డెరైక్టర్లందరికీ తెలిసిందే. నేను వ్యవస్థాపకునిగా ఉన్న నవభారత్లోనూ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోనూ మనమంతా సమాన భాగస్వాములుగానే చేరాం. సంస్థను నిర్వహించే వారే డెరైక్టర్ల తరఫున ట్రస్టీగా వ్యవహరించాలని కూడా మనం ముందుగా అనుకున్నదే. రష్యా నుంచి అందిన డబ్బే మన సంస్థ ఎదుగుదలకు కారణమన్నది కూడా నేను మళ్లీ చెప్పాల్సిన పని లేదు. అయితే (మన) రెండో తరం వారికి ఈ విషయాలన్నీ తెలియవు. కాబట్టి షేర్లను డెరైక్టర్లందరికీ సమాన నిష్పత్తిలో కేటాయిస్తే వారికి (మున్ముందు) పేచీలుండవు’’ అని! అంతేకాదు, 1976లో జీజేఆర్ సమర్పించిన ఐటీ రిటర్నుల్లో నంబర్‌వన్ కంపెనీ కూడా.. మార్గదర్శి చిట్‌ఫండ్సే! ఎన్నెన్నో ప్రశ్నలు...! జీజేఆర్ ఉదంతానికి సంబంధించి ఇటు రామోజీ తీరుపై, అటు ప్రభుత్వ వ్యవహార శైలిపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి... 1. మార్గదర్శి చిట్‌ఫండ్స్ తొలి డెరైక్టర్లలో ఒకరు దేశద్రోహానికి పాల్పడి పారిపోయినా, ఆ సంస్థను మాత్రం ప్రభుత్వం విచారించలేదు. ఎందుకు? 2. దేశం వదిలి వెళ్లేనాటికి మార్గదర్శి డెరైక్టర్ హోదాలో ఆ సంస్థలో జీజేఆర్ పెట్టిన పెట్టుబడులు ఎన్ని? ఇప్పుడు వాటి వాస్తవ విలువెంత? 3. జీజేఆర్ దేశద్రోహి అని కోర్టే నిర్ధారించిన నేపథ్యంలో, మార్గదర్శిలోని వాటాలు ప్రభుత్వానికే చెందుతాయి కదా! మరి వాటిని ప్రభుత్వం ఎందుకు జప్తు చేయడం లేదు? 4. జీజేఆర్ వంటి అజ్ఞాత ఇన్వెస్టర్లు మార్గదర్శిలోనూ, రామోజీ గ్రూపులోని ఇతర సంస్థల్లోనూ ఇంకెంతమంది ఉన్నారు? 5. నవభారత్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎదుగుదలకు రష్యా నుంచి అందిన డబ్బే కారణమని ఇతర డెరైక్టర్లతో రాసుకున్న అవగాహన ఒప్పందంలో జీజేఆరేస్వయంగా ధ్రువీకరించిన విషయం. దీనిపై కూడా ప్రభుత్వం గానీ, దర్యాప్తు సంస్థలు గానీ ఎందుకు దృష్టి సారించలేదు? తవ్వుకుంటూ పోయేకొద్దీ ఈ అనుమానాల జాబితా పెరిగేదే తప్ప తరిగేది కాదు. పైగా రామోజీ వైపు వేలెత్తి చూపుతున్న ఈ ఉదంతానికి సంబంధించిన కేసు కూడా అలాంటిలాంటిది కాదు. అత్యంత తీవ్రమైన దేశద్రోహ అభియోగం. ఈ నేపథ్యంలో పై సందేహాలకు సమాధానాలు దొరకాలన్నా, రామోజీ అసలు రంగు నిగ్గుదేలాలన్నా.. ఈ మొత్తం బాగోతానికి సంబంధించి 1960 నుంచి నేటిదాకా నిష్పాక్షికంగా లోతైన దర్యాప్తు జరగడమే ఏకైక మార్గం! జీజేఆర్ పరారీ వెనక ఉన్నదెవరు? అరెస్టు ఖాయమని ముందే పక్కా సమాచారం అందడంతో, వారంటు జారీ కాకముందే జీజేఆర్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. చెకస్లోవేకియా పాస్‌పోర్టుపై అతను దేశం వదిలి వెళ్లినట్టు చెబుతారు. 1985లో అక్కడే చనిపోయినట్టు కుమారుడు చెప్పారు. అయితే జీజేఆర్ పరారీ వెనక కూడా రామోజీ హస్తమే ఉన్నట్టు చెబుతారు. కేసులోని ఇతర నిందితులు ఢిల్లీ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలాలు కూడా ఆ అనుమానాలను బలపరిచేవిగానే ఉన్నాయి. జి.ఎస్.మూర్తి అనే రామోజీ సహచరుడు చెకస్లోవేకియా దౌత్య కార్యాలయంలో పనిచేసే జీజేఆర్ భార్య సాయంతో అతని ప్రయాణానికి డాక్యుమెంట్లు సిద్ధం చేయించారని వారు కోర్టులో వాంగ్మూలమిచ్చారు. హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న జీజేఆర్‌కు వాటిని అందజేశారని కూడా వివరించారు. జీజేఆర్ తొలుత ఢిల్లీ నుంచే పారిపోయేందుకు ప్రయత్నించినట్టు, అశోకా ట్రావెల్స్ సంస్థ ద్వారా టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు సమాచారం. కానీ ‘ఎందుకనో’.. చివరి నిమిషంలో వ్యూహం మార్చి, హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి దేశం వదిలి ఉడాయించాడు! ఇదంతా రామోజీయే ఏర్పాటు చేశారని, తదనంతరం ‘తన’ సంస్థల్లోని జీజేఆర్ పెట్టుబడులన్నింటినీ దర్జాగా సొంతం చేసుకున్నారని చెబుతారు. ఇదీ కేసు దేశ రహస్యాలను ఇతరులకు చేరవేయడం ద్వారా అంతర్గత భద్రతకు విఘాతం కలిగించే పనులకు పాల్పడ్డాడంటూ జీజేఆర్పై 1977లో ఢిల్లీ శ్రీనివాసపురి పోలీస్‌స్టేషన్‌లో అధికార రహస్యాల చట్టం కింద కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 26/1977) నమోదైంది. జీజేఆర్తో పాటు చెకస్లోవేకియాకు చెందిన ఆయన భార్య నటాషా, నాటి ప్రణాళికా సంఘం టెక్నికల్ డెరైక్టర్ కె.సారిన్తో పాటు మరో నలుగురు ఇందులో నిందితులు. 1977 ఏప్రిల్ 7న ఢిల్లీ కోర్టు జీజేఆర్‌ను దోషిగా నిర్ధారించింది. ఆయన సీఐఏ ఏజెంటుగా పని చేస్తున్నాడని, తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో ‘బి-5/23, సఫ్దర్‌జంగ్ ఎన్క్లేవ్’లోని జీజేఆర్ ఇంటితో పాటు అక్కడ, హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఇతరత్రా ఆస్తులను, బ్యాంకు ఖాతాలను జప్తు చేశారు. మార్గదర్శి వంటి పలు సంస్థల్లో జీజేఆర్‌కు ఉన్న షేర్లను కూడా జప్తు చేసేందుకు కోర్టు ఒక రిసీవర్‌ను నియమించింది. కోర్టు తీర్పు చాలావరకు అమలైంది. పైగా, జప్తు చేసిన బంగ్లాను తమకు తిరిగివ్వాలంటూ కొంతకాలానికి జీజేఆర్ భార్య నటాషా ఢిల్లీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసినా లాభం లేకపోయింది. అందులో తాముండేందుకు కనీసం ఒక గదినైనా ఇవ్వాలని కోరినా కోర్టు ససేమిరా అంది. పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా కొట్టేసింది. జీజేఆర్ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అప్పగించరాదన్న ప్రభుత్వ కృతనిశ్చయానికి ఇదే నిదర్శనం. అలాంటిది... మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని జీజేఆర్ షేర్లను మాత్రం ప్రభుత్వం ఎందుకనో ‘పట్టించుకోలేదు’. నాటి నుంచీ నేటిదాకా రామోజీ వ్యాపార మూలాలను కదప(లే)కుండా ఉండిపోయింది. మార్గదర్శితో పాటు రామోజీ సంస్థల్లోని ఆస్తులన్నీ జీజేఆర్వేనని, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లగానే రామోజీ వాటిని కాజేశారని జొన్నపాడువాసులు చెబుతారు.