grade
-
‘గ్రాప్-3’ ఉల్లంఘనలు.. ఒక్కరోజులో రూ 5.85 కోట్ల చలానాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ‘గ్రాప్-3’ నిబంధనలను అమలు చేసింది. అయినప్పటికీ గాలి నాణ్యతలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. గాలి నాణ్యత శనివారం మరింత దిగజారింది. పలు ప్రాంతాల్లో ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకుంది. కాలుష్యాన్ని మరింతగా తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పడు గ్రాప్-3ని ఆచరణలో పెట్టింది. అయితే ఇది అమలు చేసిన మొదటి రోజునే ఈ విధానంలోని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ. 5.85 కోట్ల జరిమానా విధించింది. గ్రాప్-3ని అమలు చేసినప్పటికీ వాయు కాలుష్యంపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు.శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)417గా ఉంది. శుక్రవారం ఇదే సమయంలో ఏక్యూఐ 396గా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం వాయునాణ్యత ‘తీవ్రమైన’ కేటగిరికి చేరినప్పుడు జనం అనారోగ్యం బారిన పడతారు. ఇప్పటికే అనారోగ్యంతోవున్నవారు మరిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.నిషేధం ఉన్నప్పటికీ బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాలను వినియోగిస్తున్న వారికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 550 చలానాలను విధించారు. బీఎస్- 3 పెట్రోల్, బీఎస్- 4 డీజిల్, నాలుగు చక్రాల వాహనాలపై కూడా నిషేధం విధించామని, దీనిని ఉల్లంఘిస్తే రూ.20 వేలు జరిమానా విధించే నిబంధన ఉందని పోలీసులు తెలిపారు. కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రాలు (పీయూసీసీ)లేని వాహనాలకు కూడా పోలీసులు చలానాలు ఇచ్చారు. శుక్రవారం ఒక్కరోజునే 4,855 వాహనాలపై మొత్తంగా రూ.5.85 కోట్ల జరిమానా విధించారు.ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత -
విద్యా తేజం.. ఆంధ్రా విశ్వవిద్యాలయం
(సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) : ఉన్నతమైన, ప్రకాశవంతమైన చదువులకు ప్రతీకగా... ‘తేజస్వినావధీతమస్తు’ అనే సమున్నత ఆశయంతో ఏటా వేలాది మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దుతున్న ఆంధ్రా విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యున్నత వర్సిటీల్లో ఒకటిగా నిలిచింది. సాగర తీరంలో, విశాలమైన ప్రాంగణంలో, ప్రశాంత వాతావరణంలో అత్యున్నత వసతులు, ప్రమాణాలతో విద్యనందిస్తూ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్)ను మెప్పించి, ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ పొందింది. నాక్ ఏయూలోని వసతులను ప్రత్యక్షంగా పరిశీలించి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్‌ను మంజూరు చేసింది. దేశంలో అత్యున్నత కోర్సులు, బోధన, సౌకర్యాలు, కలిగిన అతి కొద్ది యూనివర్సిటీలకు దక్కే ఈ గ్రేడ్‌ను ఏయూ కూడా సాధించడం విశేషం. దేశంలో 3.74 స్కోర్ బెంగళూరు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలతో పాటు ఆంధ్రా యూనివర్సిటీకి మాత్రమే దక్కింది. టాప్ స్కోర్ దక్కిన నేపథ్యంలో 2030 వరకూ వర్సిటీకి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ఉండనుంది. ఈ ర్యాంకులను అధికారికంగా ఈ నెల 14న ప్రకటించనున్నట్టు తెలిసింది. ఏయూ చరిత్రలో తొలిసారిగా.. నాలుగు పుస్తకాల్లోని పాఠాలు బోధించి, మార్కులతో కూడిన పట్టాని చేతిలో పెట్టి పంపించే రోజులకు స్వస్తి చెబుతూ.. యూనివర్సిటీ ఇటీవలి కాలంలో విద్యార్థి అభివృద్ధికి మార్గదర్శిగా.. పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. వివిధ దేశాలు, యూనివర్సిటీలు, సంస్థల ఒప్పందాలతో చదువుకు సహకారం అందిస్తూ.. ప్రతి విద్యార్థినీ ఉన్నతంగా తీర్చిదిద్దుతూ జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానం పొందింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 2002లో తొలిసారిగా 86.05 స్కోర్‌తో నాక్ ఏ గ్రేడ్ పొందింది. తరువాత 2008లో 3.64తో ఏ గ్రేడ్‌ను, 2016లో 3.6 స్కోర్‌తో మరోసారి ఏ గ్రేడ్‌ను సాధించింది. తాజాగా జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ని పొందింది. ఏయూలో అత్యుత్తమ విద్యా విధానాలకు, సమర్ధతకు ఈ ర్యాంకు నిదర్శనం. రానున్న ఆరేళ్ల కాలానికి ఈ ర్యాంకు యూనివర్సిటీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలుస్తుంది. మూడు రోజులు క్షుణ్ణంగా పరిశీలన ఈ నెల 4, 5, 6 తేదీలలో ఏయూలో నాక్ బృందం పర్యటించింది. వర్సిటీలో మౌలిక వసతులు, బోధన ప్రగతి తదితర అంశాలను కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా, క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టి, నిర్వహిస్తున్న స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్, సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, యోగా, సైకాలజీ, స్పోర్ట్స్ విభాగాలతో పాటు విభిన్న విభాగాలలో సాధిస్తున్న ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. 4.0 స్కేల్ పై 3.74 స్కోర్‌ను అందిస్తూ.. ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ మంజూరు చేశారు. ఈ విజయం వెనుక సీఎం వైఎస్ జగన్ ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంతటి ఘనవిజయం సాధించడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత ఉంది. విశ్వవిద్యాలయాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్న సీఎం జగన్ ఆకాంక్షలకు, ఆలోచనలకు అనుగుణంగా పలు మార్పులు చేస్తున్న వైస్ చాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి కృషి ఉంది. వీరిద్దరూ కలిసి గత నాలుగేళ్లుగా వర్సిటీలో పలు సంస్కరణలు తెచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ఎన్నడూ లేని విధంగా స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పడం, చైర్ ప్రొఫెసర్లని ఏర్పాటు చేయడం తదితర మార్పులు చేశారు. సమాజ ఉపయుక్తంగా, పరిశ్రమల అవసరాలు తీర్చే వైవిధ్య పరిశోధన కేంద్రంగా మార్చారు. ఇంజనీరింగ్‌తో సమానంగా సైన్స్, ఆర్ట్స్ కోర్సులను ఉపాధి కల్పించేవిగా రూపుదిద్దారు. ప్రపంచంలోని ఏ పరిశ్రమకైనా అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దేలా యూనివర్సిటీ రూపాంతరం చెందింది. విశ్వవిద్యాలయంలో చేరే ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ఈ సంస్కరణలు ఊతమిస్తున్నాయి. ఇక్కడ చదివే ప్రతి విద్యార్థీ ఉన్నత సంస్థల్లో ఉపాధి పొందేలా విద్యా ప్రణాళికలను రూపొందించారు. దీంతో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రా యూనివర్సిటీ 100 పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసింది. ఇక్కడి స్టార్టప్ సెంటర్లో 150 స్టార్టప్స్ ప్రారంభమయ్యాయి. ఇవన్నీ విశ్వవిద్యాలయాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. విశ్వవిద్యాలయం ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ సాధించి, దేశంలో ఉన్నత స్థానాన్ని పొందడంపై వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్, రెక్టార్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఏయూలో కోర్సుల వివరాలు.. యూజీ ప్రోగ్రామ్స్ – 36 పీజీ ప్రోగ్రామ్స్ – 118 పీహెచ్డీ – 57 పీజీ డిప్లొమా – 03 డిప్లొమా – 08 సర్టిఫికెట్/అవేర్నెస్ – 03 టీచింగ్ స్టాఫ్ – 538 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ – 2,270 మంది విద్యార్థులు – 10,338 మంది -
టీఎస్ ఎన్పీడీసీఎల్కు ‘ఏ’ గ్రేడ్
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర ఎన్పీడీసీఎల్ గ్రేడ్ ‘బీ’ నుంచి ‘ఏ’కు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. తద్వారా గతంలో కంటే అధిక మొత్తంలో రుణాలు సులువుగా పొందే అవకాశం సంస్థకు లభిస్తుంది. ఆయా నిధులతో మెరుగైన విద్యుత్ పంపిణీ, కొత్త సబ్‌స్టేçÙన్ల నిర్మాణం, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించనున్నారు. వీటితో పాటు నష్టాల తగ్గింపు, వ్యయాల కుదింపు, మరిన్ని ఆదాయ మార్గాల అన్వేషణపై దృష్టిసారించనున్నారు. -
ఎ..బి..సి..డి..
పోలీస్ సిబ్బందికి గ్రేడ్లు బాధితులకు ఉన్నతాధికారుల ఫోన్లు సిబ్బంది పనితీరుపై వివరాలు సేకరణ కమిషనర్ మహేందర్‌రెడ్డి చర్యలు పూర్తిస్థాయిలో అమలుకు కసరత్తు ‘నమస్తే మేడమ్... మీరు పుస్తెలతాడు చోరీకి గురైందని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు కదూ. ఫిర్యాదు స్వీకరించడానికి మా సిబ్బంది మీకేమైనా ఇబ్బంది పెట్టారా? లేక సహకరించారా? లంచాలేమైనా అడిగారా? పొరపాటుగా మాట్లాడారా లేక మర్యాద పూర్వకంగా మసలుకున్నారా? ఏవైనా సమస్యలు తలెత్తితే చెప్పండి. వారి పనితీరుకు ఏ గ్రేడ్ ఇవ్వమంటారో సూచించండి’ అంటూ బంజారాహిల్స్‌కు చెందిన శాంతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆరా తీస్తే అది ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిందని ఆమె తెలుసుకుంది. ఆమెకే కాదు...ఇక ముందు నగరంలో పోలీస్ స్టేషన్లకు వెళ్లే ఫిర్యాదుదారులకు ఇదే తరహా ఫోన్ కాల్స్ రానున్నాయి. పోలీస్ సిబ్బంది పనితీరు తెలుసుకోవడం... వారికి గ్రేడ్లు కేటాయించడం ఈ కాల్స్ ముఖ్య ఉద్దేశం. సాక్షి, సిటీబ్యూరో: నేరాల నియంత్రణకు... పోలీసు సిబ్బంది వైఖరిలో మార్పునకు ఉన్నతాధికారులు విప్లవాత్మక చర్యలు చేపడుతున్నారు. వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రక్రియకు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రజలు తమ సేవలు అందుకున్నాక పోలీసులకు ఎన్ని మార్కులు వేస్తారో అధికారులు స్వయంగా పరిశీలించనున్నారు. సిబ్బంది పనితీరుకు ప్రజలు ఏ గ్రేడింగ్ ఇస్తారో చూడాలని మహేందర్‌రెడ్డి భావిస్తున్నారు. పాస్‌పోర్టు దరఖాస్తుదారుల నుంచి ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. పాస్‌పోర్టు క్లియరెన్స్ కోసం స్పెషల్‌బ్రాంచ్ సిబ్బంది ఏవిధంగా విచారించారు? వారి పని విధానంతో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా..? వారి పని విధానంపై ఏమేరకు సంతృప్తి చెందారు..? సిబ్బంది ఏమైనా తప్పులు చేశారా..? లంచాలు అడిగారా..? మరేరకమైన వేధింపులకు గురిచేశారా..? అనే విషయాలు తెలుసుకునేందుకు అధికారులే స్వయంగా దరఖాస్తుదారులకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. సిబ్బంది సక్రమంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించడంతో పాటు దర ఖాస్తుదారుకువేధింపులు, సమస్యలు కలిగించుకుండా ఉండాలన్నదే కమిషనర్ ఉద్దేశం. రాబోయే రోజుల్లో ప్రతి కేసులోనూ సిబ్బంది పనితీరు బేరీజు వేసేందుకు కమిషనర్ యత్నిస్తున్నారు. ఉదాహరణకు స్నాచింగ్ బారిన పడిన బాధితులు ఠాణాకు వ స్తే సిబ్బంది ఎలా స్పందించారు. రాగానే ఫిర్యాదు స్వీకరించారా?లేక ప్రశ్నలతో వేధించారా..అనే వివరాలను బాధితుల నుంచి సేకరిస్తారు.ఠాణాలో బాధితులతో మర్యాదగా మాట్లాడాలనే భావనతో ప్రత్యేకంగా రిసెప్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్త్రీల కోసం మహిళా సిబ్బందిని సైతం రిసెప్షన్లో కేటాయించారు. కాలనీవాసులు, బస్తీ వాసులతో ఫ్రెండ్లీ పోలిసింగ్ నిర్వహించాలని, అందుకు తగ్గ సూచనలు, పోలీసుల నడవడికపై మార్గదర్శకాలను రూపొందించారు. ఇకపై పోలీసుల నుంచి సేవలు పొందే ప్రతి వారి నుంచి సిబ్బంది పనితీరుపై అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇందుకోసం కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. గ్రేడింగ్‌పై దృష్టితో ఉపయోగాలు ప్రతి కేసులో బాధితుడిపై ఉన్నతాధికారి పర్యవేక్షణ ఉంటుంది. బాధితుడికి చట్టపరిధిలో సేవలు అందించేందుకు సిబ్బంది చొరవ చూపుతారు. బాధితుడు ఊరట చెందడంతో పాటు పోలీసులపై నమ్మకం పెరుగుతుంది. అక్రమ కేసులు బనాయించడం కుదరదు. బాధితులకు సరైన న్యాయం చేయక, నిందితులతో కుమ్మక్కైతే ఆ విషయం పై అధికారులకు తెలిసే అవకాశం ఉంది. ఠాణాలో బాధితుడికి వేధింపులు తగ్గుతాయి. కేసు దర్యాప్తు, పురోగతి విషయాలపై ఎప్పటికప్పుడు సిబ్బంది సమాచారం అందిస్తారు. బాధితులు అడిగిన సమాచారం ఇవ్వకుంటే సిబ్బందిపై వేటు పడుతుంది. తమ పనితీరుపై ప్రజల నుంచి వచ్చే సూచనలు స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది.