gurukula students
-
కొండల్లోకి పారిపోయిన ‘గురుకుల’ విద్యార్థులు
నాదెండ్ల: గురుకుల పాఠశాలలో తమను వేధింపులకు గురిచేస్తున్నారని, సరైన ఆహారం అందించకుండా హింసిస్తూ తమతో బాత్రూమ్లు కడిగిస్తున్నారని.. అదేమని అడిగితే చావబాదుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు పాఠశాల గోడ దూకి సమీపంలోని కొండల్లోకి పారిపోయారు. సోమవారం జరిగిన ఈ సంఘటన పల్నాడు జిల్లాలో సంచలనం రేపింది. యడ్లపాడు మండలం వంకాయలపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6–10 తరగతుల్లో 450 మంది విద్యార్థులున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలో ప్రార్థన జరుగుతుండగా 67 మంది గోడ దూకి బయటకు వెళ్లారు.ఇది చూసి కొందరు ఉపాధ్యాయులు 30 మందిని వెనక్కి తేగా.. మరో 37 మంది సమీపంలోని కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీంతో చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు, ఎస్ఐ బాలకృష్ణ సిబ్బందితో కలిసి కొండల్లో విద్యార్థులను వెతికి పట్టుకున్నారు. పాఠశాలలో భోజనం బాగుండదని, తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేదని, మెనూ ప్రకారం వడ్డించరని తెలిపారు. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పాకెట్ మనీని ప్రిన్సి పాల్‌కు ఇస్తామని, సెలవుల్లో తాము ఇళ్లకు వెళ్లేట ప్పుడు అడిగినా ఆ డబ్బు ఇవ్వడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.పాఠశాల ప్రారంభంలో త మకు ఫ్రీ సీట్లు వచ్చినా ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ.4 వేలకు పైగా వసూలు చేశారని చె ప్పారు. పోలీసులు నచ్చజెప్పి తిరిగి పాఠశాలకు తీసుకెళ్లారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, గురుకుల పాఠశాల జిల్లా కో–ఆరి్డనేటర్ పద్మజ, తహసీల్దార్ జయశ్రీలు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులతో ఏకాంతంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపల్ కంచర్ల శిరీష్‌బాబు, ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు. జిల్లా కోఆరి్డనేటర్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య విభేదాలున్నాయని, దీంతో వారు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, వారి ప్రోద్బలంతోనే గోడదూకి పారిపోయారని తెలిపారు. -
ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు
సాక్షి, ఆసిఫాబాద్: ప్రిన్సిపాల్ తీరును నిరసిస్తూ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు బుధవారం రోడ్డెక్కారు. రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసి, కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ సముదాయం వద్ద ధర్నాకు దిగారు. తమ సమ స్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఉదయం అల్పాహారం తినకుండానే పాఠశాల నుంచి బయటకొచ్చారు. ఉదయం 7.30 గంటలకు అంబేడ్కర్ చౌక్ వద్ద రహదారిపై ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి తమను వేధిస్తోందని, సమయానికి భోజనం, వైద్యం అందించడం లేదని, నరకయాతన అనుభవిస్తున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు కాపలాదారులు మద్యం సేవించి విధులకు వచ్చి తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వాపోయా రు. సమస్యలు పరిష్కరించాలని ప్రిన్సిపాల్‌కు చెప్పి నా పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కినట్లు విద్యార్థినులు వెల్లడించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు పలువురు కలెక్టరేట్ వద్దకు వచ్చి వారికి మద్దతుగా నిలిచారు. ఆరు గంటలపైగా ఎండలోనే బైఠాయించడంతో కొందరు విద్యార్థినులు సొమ్మసిల్లిపడిపోయా రు. టీచర్ల విజ్ఞప్తికి స్పందించి పాఠశాలకు వెళ్లి అక్కడే చెట్ల కింద నిరసన కొనసాగించారు. చివరికి పోలీసులు సర్దిచెప్పడంతో విద్యార్థినులు భోజనాలకు వెళ్లడంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
డాక్టర్ రోబో: విశాఖ గురుకుల విద్యార్థినుల వినూత్న ఆవిష్కరణ
సాక్షి, అమరావతి: అనారోగ్యం వస్తే డాక్టర్ వద్దకు వెళ్లడం.. జబ్బు లక్షణాన్ని బట్టి వైద్యులు పరీక్షించి మందులు రాయడం అందరికీ తెలిసిందే. అదే పని ఒక రోబో చేస్తే?.. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఎస్సీ గురుకుల విద్యార్థినులు డాక్టర్ రోబోను ఆవిష్కరించారు. విశాఖపట్నంలోని మధురవాడ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం–సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు చెందిన విద్యార్థినులు జెస్సికా (10వ తరగతి), కె. వర్షిణి ప్రియాంక, కె. రేష్మా బిందు (9వ తరగతి)లు ఫిజికల్ సైన్స్ టీచర్ డాక్టర్ టి. రాంబాబు పర్యవేక్షణలో ‘డాక్టర్ రోబో’ కాన్సెప్‌్టను రూపొందించారు. ఈ ప్రాజెక్టు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్) ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్ 2021–22 టాప్‌టెన్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఎంపిక కావడం విశేషం. దీంతో జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థులు హ్యాట్రిక్ సాధించినట్లైంది. ఏటీఎల్ మారథాన్‌లో ఏడు వేల ప్రాజెక్టులు.. నీతి ఆయోగ్ పరిధిలో అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో భాగంగా నిర్వహించే ఏటీఎల్‌లో విద్యార్థుల మేధస్సుకు పోటీపెట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలను రూపొందించేలా చేస్తున్నారు. ఏటీఎల్–మారథాన్ 2021–22ను ఎంటర్ప్రెన్యూర్ ఇంటర్న్‌షిప్ పేరుతో ఈ ఏడాది జనవరి 9 నుంచి 13 వరకు నిర్వహించారు. బెంగళూరులో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 16 వేల మంది 7వేల ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటి నుంచి తొలిదశలో 350 ప్రాజెక్టులు, మలిదశలో వాటి నుంచి వంద ప్రాజెక్టులు, ఆ తర్వాత అందులోని 30 ప్రాజెక్టులు, చివరకు టాప్టెన్ను ఎంపిక చేశారు. ఇందులో ఏపీకి చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థుల డాక్టర్ రోబో ప్రాజెక్టు ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణం. డాక్టర్ రోబో పనితీరు ఇలా.. డాక్టర్ రోబో కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. రోగి తన పరిస్థితిని రోబోకు వివరిస్తే అతను వాడాల్సిన మందులను స్క్రీన్‌పై డిస్ప్లే చేయడంతోపాటు ఔషధాలను ఇస్తుంది. రోగికి ఇంకా ఏదైన సమస్య ఉంటే రోబో ప్రత్యేక వైద్యులకు వీడియోకాల్ చేసి కనెక్ట్ చేస్తుంది. రోగి వారితో మాట్లాడి వైద్య సహాయం పొందవచ్చు. అలాగే, ఏఏ ప్రాంతాల్లో వైద్యనిపుణులున్నారు? ఏ రోగానికి ఏ వైద్యుడ్ని సంప్రదించాలి? అవసరమైన వైద్యులు బిజీగా ఉంటే ఏ సమయంలో అందుబాటులోకి వస్తారు? వంటి సమాచారాన్ని డాక్టర్ రోబో అందిస్తుంది. ఇక ఈ రోబో రోగి దగ్గరకే వెళ్లి వైద్యసేవలు అందించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. డాక్టర్ రోబో వినియోగంలోకి వస్తే మేలు.. పెరుగుతున్న వైద్య అవసరాలకు తగ్గట్లు డాక్టర్ రోబో కాన్సెప్ట్ చాలా ఉపయోగపడుతుంది. ప్రధానంగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది చాలా మేలు చేస్తుంది. కోవిడ్ సమయంలో డాక్టర్‌ను సంప్రదించడం, వైద్యసేవలు అందించడం వంటి అనేక సమస్యలకు మార్గం చూపేలా డాక్టర్ రోబోను ఆవిష్కరించాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ డెవలప్చేశాం. ఇది డాక్టర్లా సేవలు అందించడమే కాదు.. డాక్టర్లకు కూడా సహాయకుడిగా ఉపయోగపడుతుంది. ఈ నెల 9 నుంచి 13 వరకు బెంగళూరులో జరిగే గ్లోబల్ బృందం పరిశీలనలో మా ప్రాజెక్టు ఎంపికైతే వైద్య రంగంలో మరింత మేలుచేసే రోబో అందుబాటులోకి వస్తుంది. – జెస్సికా, కె. వర్షిణి ప్రియాంక, కె. రేష్మా బిందు, విద్యార్థినులు ఎస్సీ గురుకులాల హ్యాట్రిక్ విద్యార్థుల్లో మేధస్సును మెరుగు పెట్టేలా అటల్ ఇన్నోవేషన్ మిషన్ కృషిచేస్తోంది. ఏటీఎల్ ప్రాజెక్టుల ప్రదర్శనలో మూడేళ్లుగా ఎస్సీ గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్‌టెన్‌లో నిలవడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ప్రోత్సాహంతో మన విద్యార్థులు జాతీయస్థాయిలో రాణిస్తుండటం రాష్ట్రానికి గర్వకారణం. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
మాకు పెట్టే భోజనం పశువులు కూడా తినడం లేదు
ధర్మసాగర్: ‘నీళ్ల కూరలు, చారు, ఉడికీ ఉడకని అన్నం.. మాకు పెట్టే భోజనం కనీసం పశువులు కూడా తినడం లేదు.అంతకన్నా హీనమయ్యామా’అంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల, కళాశాలలో భోజనం మంచిగా లేదని, నీళ్ల కూరలు, చారు, ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారని ఆ పాఠశాల, కళాశాల విద్యార్థులు గురువారం హైదరాబాద్–వరంగల్ రహదారిపై బైఠాయించారు. విద్యార్థులు మాట్లాడుతూ మెనూతో సంబంధం లేకుండా కుళ్లిన కూరగాయలు వండుతున్నారని, సాంబారు పేరుతో చింతపండు పులుసుతో వేడి నీళ్లు పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పస్తులతో కడుపు మాడ్చుకొని పడుకుంటున్నామని విలపించారు. బాత్ రూం పైపుల లీకేజీ వల్ల వచ్చే వాసన భరించలేకపోతున్నామన్నారు. అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు వేడుకున్నారు. -
సత్తా చాటిన ఆంధ్రా అథ్లెట్లు
సాక్షి, అమరావతి: ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యార్థుల మూడో జాతీయ క్రీడా పోటీల్లో సోమవారం ఆంధ్రా విద్యార్థులు అథ్లెటిక్స్‌లో సత్తా చాటారు. విజయవాడ లయోలా కాలేజీ, గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ మైదానాలలో గిరిజన బాలల క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి. రన్నింగ్, బాడ్మింటన్, కబడ్డీ, హాకీ, వాలీబాల్, ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. రెండవ రోజు క్రీడల్లో ఆంధ్రాతోపాటు తెలంగాణ క్రీడాకారులు రాణించారు. ముఖ్యంగా మెడల్స్ జాబితాలో తెలంగాణ దూసుకుపోతోంది. ఇప్పటివరకు తెలంగాణ క్రీడాకారులు వివిధ విభాగాల్లో 27 పతకాలు కైవసం చేసుకున్నారు. వీటిలో 14 స్వర్ణం, 4 రజతం, 9 కాంస్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 11 పతకాలు దక్కించుకుంది. వీటిలో 2 స్వర్ణాలు, 5 రజతం, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్ మెడల్స్ జాబితాలో గుజరాత్ 20 పతకాలతో రెండో స్థానంలో ఉంది. గుజరాత్‌కు 6 స్వర్ణం, 3 రజతం, 11 కాంస్య పతకాలున్నాయి. నాగార్జున మైదానంలో.. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మైదానంలో జరిగిన అథ్లెటిక్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అండర్–19 బాలికల ట్రిపుల్ జంప్‌లో 9.90 మీటర్లతో రాష్ట్రానికి చెందిన డి.శ్రీజ మొదటి స్థానంలో నిలిచింది. ఇక 9.55 మీటర్లతో తెలంగాణకు చెందిన బొంత స్నేహ రెండో స్థానం, 9.30 మీటర్లతో మూడో స్థానంలో ఏపీకి చెందిన శ్రీవల్లి నిలిచింది. అండర్–14 బాలుర విభాగంలో డిస్కస్ త్రోలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 29.79 మీటర్లతో మొదటి స్థానాన్ని మన రాష్ట్రానికి చెందిన బోయ మహేంద్ర దక్కించుకోగా.. 25.99 మీటర్లతో రెండో స్థానంలో ఏపీకి చెందిన వి.సుశాంత్‌రెడ్డి, 24.53 మీటర్లతో ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేశ్ చౌహాన్ మూడో స్థానంలో నిలిచారు. అండర్–19 హై జంప్ బాలుర కేటగిరీలో 1.64 మీటర్లతో ఒడిశాకు చెందిన ఎం.రంజిత్ మొదటి స్థానం, 1.64 మీటర్లతో ఒడిశాకు చెందిన హెచ్.దీపక్ కుమార్ రెండో స్థానం, 1.61 మీటర్లతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కె.అనిష్ మూడో స్థానం దక్కించుకున్నారు. అండర్–19 800 మీటర్ల రన్నింగ్ బాలుర విభాగంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అరుణ్ కొవచి 2.05.90 సమయంలో లక్ష్యం చేరి తొలి స్థానంలోను, 2.08.80 సమయంలో లక్ష్యం చేరి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రంజిత్ కుమార్ రెండో స్థానంలోను, 2.12.30 సమయంలో లక్ష్యం చేరి జార్ఖండ్‌కు చెందిన అలోక్ మూడో స్థానంలో నిలిచారు. లయోలా క్రీడా మైదానంలో.. విజయవాడ లయోలా క్రీడా మైదానంలో తైక్వాండో అండర్–14 పోటీలు ఆద్యంతం ఉత్సహభరితంగా సాగాయి. 21:23 వెయిట్ బాలుర కేటగిరీ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్‌కు చెందిన చౌదరి స్మిత్కుమార్పై మధ్యప్రదేశ్‌కు చెందిన నర్సింగ్ టెకం విజయం సాధించారు. 23:25 వెయిట్ ఫైనల్ మ్యాచ్‌లో మహారాష్ట్రకు చెందిన రితేష్రాజు వడావ్పై మధ్యప్రదేశ్‌కు చెందిన హర్ష మేరవి విజయం సాధించారు. బాడ్మింటన్ అండర్–19 కేటగిరీ 52–56 కేజీలలో హిమాచల్‌ప్రదేశ్‌పై ఆంధ్రప్రదేశ్ గెలుపొందింది. అండర్–19 కేటగిరీ 57–60 కేజీల విభాగంలో మధ్యప్రదేశ్‌పై ఆంధ్రప్రదేశ్ గెలుపొందింది. హాకీ బాలుర 7వ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్–కర్ణాటక మ్యాచ్‌లో 1–0 తేడాతో ఆంధ్రప్రదేశ్ గెలిచింది. జూడో (బాలికలు) అండర్–14 కేటగిరీ ఫ్రీస్టయిల్ 39, 42, 46 విభాగాల్లో జరిగిన మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్ బాలికలు విజయం సాధించారు. వాలీబాల్ పోటీల్లోనూ హిమాచల్‌ప్రదేశ్‌పై ఏపీ జట్టు విజయకేతనం ఎగురవేసింది. -
‘నేను ఎవరికీ ఇష్టం లేదు.. బతకాలని లేదు’
సాక్షి, కొయ్యూరు(పాడేరు): ‘నేనంటే ఇంటిలో ఎవరికీ ఇష్టం లేదు... నాకు నేనే నచ్చను.. సంతోషం ఆవిరవుతున్న క్షణం ఇది.. నాకు బతకాలని లేదు..’ అంటూ లేఖ రాసి ఓ విద్యార్థి డార్మెటరీలో కట్‌చేసిన రగ్గు పీలికతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానిక గురుకుల పాఠశాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు మండలం లగిజేపల్లి పంచాయతీ గురుపల్లికి చెందిన పూజారి హరికృష్ణరాజు, సరస్వతి కుమారుడు సౌజిత్‌రాజు (15) స్థానిక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఐదేళ్లుగా ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. అమ్మ ఒడి పథకానికి సంబంధించి పాఠశాలలో సోమవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిర్వహించిన సమావేశంలో రాజు పాల్గొన్నాడు. అతని తల్లిదండ్రులు హాజరుకాలేదు. పండగ సెలవులు ఇవ్వడంతో మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులందరూ తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. స్వగ్రామాలకు వెళ్తున్నట్టు అందరితో పాటు సౌజిత్‌రాజు కూడా రిజిస్టర్లో సంతకం చేశాడు. మా నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తాడని స్నేహితులతో చెప్పి అక్కడే ఉండిపోయాడు. సాయంత్రం ఆరుగంటలకు ఒకసారి, ఎనిమిది గంటలకు మరోసారి పాఠశాల వాచ్‌మన్ కోటి డార్మెటరీలో గదులన్నీ చెక్ చేశాడు. విద్యార్థులెవరూ కనిపించలేదు. చదవండి: ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్..! మంగళవారం ఉదయం లైట్లు ఆర్పేందుకు వెళ్లిన కోటికి సౌజిత్‌రాజు విగతజీవిగా కనిపించాడు. వెంటనే ప్రిన్సిపాల్ శ్రీనివాసరావుకు సమాచారం అందించడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొయ్యూరు సీఐ వెంకటరమణ, ఎస్ఐ నాగేంద్రలు పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులను విచారణ జరుపుతామని సీఐ,ఎస్ఐలు తెలిపారు. అందరితో పాటు పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయిన రాజు అర్ధరాత్రి సమయంలో డార్మెటరీకి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. సమాచారం తెలుసుకుని రాజు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. స్నేహితులు, పాఠశాల సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు. పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే ఇలా జరిగిందని రాజు బంధువులు, తల్లిదండ్రులు కొద్ది సేపు వాచ్‌మన్ కోటితో వాగ్వాదం చేశారు. చదవండి: ‘చోర్ సింగర్’.. సిటీలోనూ వాంటెడ్ !! లేఖను చదువుతున్న తండ్రి హరికృష్ణరాజు తదితరులు రాజు కోసం వడ్డాది వెళ్లాం.. శుక్ర, శనివారాల్లో పాఠశాలకు రెండు సార్లు ఫోన్ చేస్తే సోమవారం అమ్మఒడి సమావేశం అయిన తరువాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. దీంతో రాజు వస్తాడని సోమవారం రాత్రి వడ్డాది వెళ్లాం. అక్కడ చాలా సేపు వేచి ఉన్నామని రాజు తండ్రి హరికృష్ణరాజు విలపిస్తూ విలేకరులకు తెలిపాడు. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తరువాత వడ్డాది నుంచి పాడేరు వచ్చేందుకు ఎలాంటి వాహనాలు ఉండవు. దీంతో తమ బిడ్డ వడ్డాదిలో ఉండిపోయి ఉంటాడని భావించి అక్కడ వెతికామని చెప్పారు. ఎక్కడా కనిపించకపోవడంతో మంగళవారం వస్తాడన్న ఆశతో వెళ్లిపోయామన్నారు. ఉదయం లేవగానే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చిందని వాపోయాడు. ఆరు పేజీల లేఖ ఆత్మహత్య చేసుకునే ముందు సౌజిత్ రాజు ఆరు పేజీల లేఖ రాశాడు. ఇంగ్లిష్ మీడియం కావడంతో తెలుగులో తప్పులు వస్తాయని పేర్కొన్నాడు. చిన్ననాటి విషయాలు, స్నేహితులతో ఆడుకున్న పాత జ్ఞాపకాలు ప్రస్తావించాడు. నాకు ఒత్తిడి పెరిగిపోతోంది. ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉందని తెలిపాడు. తల్లిదండ్రులు మందలించారని పేర్కొన్నాడు. సొంత గ్రామానికి వెళ్లాలని లేదని తెలిపాడు. పరీక్షల అట్ట, కొన్ని నోట్‌పుస్తకాలపై పబ్జీతోపాటు ప్రీఫైర్ ఆటల బొమ్మలు వేసి ఉన్నాయి. అయితే ఈ ఆటలంటే నాటు ఇష్టం లేదంటూ ఆ లేఖలో తెలిపాడు. నా చావుకు ఎవరూ బాధ్యులు కారని పేర్కొన్నాడు. -
గురుకుల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు షురూ
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యార్థులకు టీ–సాట్ చానల్ ద్వారా ఆన్లైన్ పాఠాలను శుక్రవారం నుంచి ప్రారంభించినట్లు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. లాక్డౌన్ కాలంలో విద్యార్థుల సమయం వృథా కాకుండా ఆన్లైన్ పాఠాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరగతులు మే 30 వరకు కొనసాగుతాయని, ప్రతీ రోజు 4 తరగతులు, ప్రతీ పీరియడ్ గంట పాటు నిర్వహిస్తామని వెల్లడించారు. రోజువారీ షెడ్యూల్ ముందుగానే ప్రకటిస్తామని, ఉదయం 11 గంటలకు ఆన్లైన్ తరగతులు ప్రారంభమవుతాయని, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. వీటితోపాటు ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతము, క్రీడలు, ఆరోగ్యానికి సంబంధించిన తరగతులు కూడా ఉంటాయని, ప్రతి రోజూ 4 సబ్జెక్టుల్లో ఒక్కో గంట ఎంపిక చేసిన అంశాలలో అన్ని విషయాలు గొలుసుకట్టు పద్ధతుల్లో సులభంగా అర్థమయ్యేలా బోధిస్తామని వివరించారు. విద్యార్థులు ఈ పాఠాలకు సంబంధించిన సందేహాలు, సలహాలను 91332 56222 నంబర్‌కు వాట్సాప్/ఎస్సెమ్మెస్ ద్వారా పంపితే వెంటనే సమాధానం ఇస్తామన్నారు. -
విద్యార్థుల అదృశ్యం..కల్వకుర్తిలో ప్రత్యక్షం
సాక్షి, కల్వకుర్తి(మహబూబ్‌నగర్) : స్థానిక గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినుల అదృశ్యం కథ సుఖాంతమైంది. బాలికలు అమ్రాబాద్‌లో క్షేమంగా పట్టుబడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా.. కల్వకుర్తిలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు రాజేశ్వరి, పావని, సుజాత, నాగేశ్వరి ఈ నెల 26న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తమ సామగ్రిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. అదేరోజు అర్ధరాత్రి కల్వకుర్తి బస్టాండ్‌లో సంచరిస్తున్నట్టు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు నమోదైంది. అయితే పాఠశాలలోని సీసీ కెమెరాల్లో మాత్రం ఈ దృశ్యాలు నమోదు కాలేదు. ఈ నెల 27న దీపావళి పండుగ కావడంతో వారిని ఎవరూ గుర్తించలేదు. చివరికి మధ్యాహ్నం సమయంలో ఆ నలుగురు విద్యార్థినులు పాఠశాలలో లేరని సిబ్బంది తెలుసుకుని పాఠశాల ప్రిన్సిపాల్ విజయరాంరెడ్డికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకుని తల్లిదండ్రులకు తెలియజేశారు. అదే రోజు రాత్రి 11 గంటలకు కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ సావిత్రమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురుకులాల కార్యదర్శి ఆరా ఈ ఘటనపై రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరా తీశా రు. ఆయన ఆదేశాల మేరకు సోమవారం ఐటీడీఏ పీఓ వెంకటయ్య, గిరిజన పాఠశాలల ఆర్సీఓ కల్యాణిని పాఠశాలకు వెళ్లి అక్కడి సిబ్బంది, తోటి వి ద్యార్థినులతో వివరాలు సేకరించారు. ఇక గిరిజన గురుకుల పాఠశాలలో ఏ ర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగా ప నిచేయడం లేదు. ఈ ఘటనపై దృశ్యా లు ఏవీ అందులో రికార్డు కాలేదు. ఈ పాఠశాల నుంచి తప్పిపోయిన విద్యార్థిని సుజాతకు సోమవారం హాజరుపట్టికలో ఉపాధ్యాయులు హాజరు వేయడం గమనార్హం. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా పాఠశాల సిబ్బంది బయటకు పొక్కనీయలేదు. చివరకు పోలీసులతోపాటు తల్లిదండ్రులకు సైతం విషయాన్ని ఆలస్యంగా తెలియజేశారు. ఈ నలుగురు విద్యార్థినులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. వారి ట్రంకు పెట్టెల్లో దొరికిన కొన్ని పత్రాలు, నోట్‌బుక్స్‌లో ఫోన్ నంబర్లు, ఉత్తరాల ఆధారంగా అలవాట్లను పాఠశాల సిబ్బంది వివరించారు. -
లిక్కర్ కాదు..లైబ్రరీ కావాలి
శంకరపట్నం(మానకొండూర్): గ్రామాల్లో లిక్క ర్ కాదు ..చదువుకునేందుకు లైబ్రరీ ఉండాలే... ఆకలేస్తే అక్షరాలు తినాలని గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. శంకరపట్నం మండలం కన్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. ప్రభుత్వ బడిలో చదువుకున్న ఎస్సెస్సీలో 600మార్కులకు 389 మార్కులు సాధించిన, ఇంటర్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని కష్టపడి ఐపీఎస్ సాధించినప్పుడు మీరెందుకు ఐఏఎస్ కాకూడదని విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించారు. ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పేదవిద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు అయ్యేందుకు ఉపాధ్యాయులు ప్రోత్సహించా లని సూచించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థికి ఒక్క రూపాయి ఇవ్వండి మీరు ఇచ్చేది రూపాయే కని విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. విద్యార్థి దశలో కష్టపడి చదువుకున్న ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇంటర్ తర్వాత ముఖ్యంగా బాలికలు మంచి కాలేజీ ఎంపిక చేసుకుని డిగ్రీ చదువుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు విద్యార్థులు శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను సన్మానించారు. -
నీటి కొరత ఉందని ఓ ప్రిన్సిపాల్ దారుణం..!
సాక్షి, మెదక్ జోన్: గురుకులంలో నీటి ఎద్దడి ఉందనే సాకుతో ఓ ప్రిన్సిపాల్ విద్యార్థినుల జుట్టు కత్తిరింపజేసిన ఉదంతం మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ పట్టణంలోని మినీ గురుకులంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు 180 మంది విద్యారి్థనులు ఉన్నారు. వారి వసతి గృహానికి నీటిని సరఫరా చేసే బోరుబావి ఏప్రిల్‌లో ఎండిపోయింది. దీంతో నీటి సమస్య తీవ్రంగా మారింది. మూడ్రోజులకోసారి రూ.600 వెచి్చంచి ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థినులతల వెంట్రుకలు పెద్దగా ఉండడంతో నీటిఖర్చు అధికమవుతుందని భావించిన ప్రిన్సిపాల్ అరుణారెడ్డి తల్లిదండ్రులకుగానీ, పాఠశాల కమిటీకి గానీ సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 9న విద్యారి్థనుల జుట్టు కత్తిరింపజేసి వాటిని విక్రయించారు. విషయం బయటికి పొక్కడంతో మరుసటి రోజు కొంతమంది తల్లిదండ్రులు గురుకులం వద్ద ఆందోళన చేశారు. దీంతో ప్రిన్సిపాల్ తమ సిబ్బందిపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం మరి కొంతమంది సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇంత జరుగుతున్నా ప్రిన్సిపాల్ గది నుంచి బయటికి రాలేదు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా నీటిసమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని తెలిపారు. -
డ్రైనేజీ సంపులో పడ్డ విద్యార్థినులు
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: డ్రైనేజీ సంపు పైనున్న మూత విరిగిపోవడంతో దానిపై ఉన్న ముగ్గురు విద్యార్థినులు డ్రైనేజీలో పడిపోయిన సంఘటన జిల్లాలోని గోపాలపురం బాలయోగి గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. మ్యాట్రిస్ రాణి ఆదేశాల మేరకు విద్యార్థినులు పాఠశాల ఆవరణలో మొక్కలు శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంపు సుమారు ఆరు అడుగుల లోతు ఉండడంతో విద్యార్థినులు అందులో మునిగిపోయారు. దీంతో పక్కనే ఉన్న తోటి విద్యార్థినులు సెక్యూరిటీ గార్డు సహాయంతో వారిని బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. పిల్లలతో పనులు చేయించడమేంటని వార్డెన్‌ను నిలదీశారు. పోలీసులు రంగప్రవేశం చేసి తల్లిదండ్రులకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం విద్యార్థినిలను ప్రథమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అద్దెకోసం అడ్డదారులు
గురుకుల పాఠశాలలు కొనసాగుతున్న ప్రైవేటు భవనాలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తోంది. దీంతో పక్క జిల్లాలో ఇప్పటికే మూతబడిన ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాల దృష్టి వీటి వైపు మళ్లింది. స్కూల్ పర్యవేక్షణ అధికారులకు పర్సెంటేజీలు ఇచ్చి.. జిల్లాలో కొనసాగుతున్న పాఠశాలలను మూతబడిన తమ కళాశాల భవనాలకు తరలించేలా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఫలితంగా గత మూడేళ్లుగా జిల్లాలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల్లో నీళ్లు లేవని, ఇరుగ్గా ఉన్నాయని సాకులు చూపుతున్న అధికారులు.. చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయకుండా జిల్లా దాటిస్తున్నారు. పరిగి : గురుకులాలకు గూడు కష్టాలు మొదలయ్యాయి. ఆర్భాటంగా ఆశ్రమ పాఠశాలలను మంజూరు చేస్తున్న ప్రభుత్వం వీటికి సొంత భవనాలు నిర్మించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు మంజూరైన గురుకులాల నిర్వహణను గాలికి వదిలేయడంతో.. పక్క జిల్లాకు తరలిపోతున్నాయి. చిన్నచిన్న విషయాల్లో రాజకీయాలు చేసే జిల్లా ఎమ్మెల్యేలకు వీటి గోడు పట్టడంలేదు. ఈ స్కూళ్లకు కనీసం స్థానికంగా అద్దె భవనాలు కూడా సమకూర్చలేకపోతున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ఇంజినీరింగ్ కళాశాలల ఓనర్లు.. అద్దె ఆశతో ఒక్కో ఆశ్రమ పాఠశాలను పక్క జిల్లాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన మూడు గురుకులాలు రంగారెడ్డికి పయనమయ్యాయి. జిల్లాలో 24 గురుకులాలు.. గతంలో నియోజకవర్గానికి రెండు చొప్పున గురుకుల పాఠశాలలు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరాక ఒక్కో నియోజకవర్గానికి నాలుగు గురుకులాలు మంజూరు చేసింది. దీంతో జిల్లాలో వీటి సంఖ్య 24కు చేరింది. జిల్లా వ్యాప్తంగా గతంలో ఉన్న ఎనిమిది స్కూళ్లకు సొంత భవనాలు ఉండగా.. కొత్తగా మంజూరైన వాటిని అద్దె భవనాల్లో ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ స్కూళ్లు కొనసాగుతున్నా ఇప్పటికీ సొంత గూళ్లకు నోచుకోలేదు. పరిగిలో మొదట రెండు గురుకులాలు ఉండేవి. వీటికి సొంత భవనాలు ఉన్నాయి. అయితే కొత్తగా మంజూరైన మూడు స్కూళ్లకు సంబంధించి ఒక్క ట్రైబల్ వెల్ఫేర్ గురుకులానికి మాత్రమే సొంత భవనం మంజూరు చేశారు. దీని నిర్మాణ పనులు సైతం నత్తనడకన కొనసాగుతున్నాయి. మిగతా వాటికి ఇంకా భవనాలే మంజూరు కాలేదు. నెలకు 6.లక్షల అద్దె.. మూడేళ్ల క్రితం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా జిల్లాకు మహిళా డిగ్రీ కళాశాల మంజూరైంది. భవనం నిర్మించే వరకు వికారాబాద్‌లోని కొత్తగడిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం కాలేజీని రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం సమీపంలో ప్రారంభించారు. అప్పటికే ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో గురుకుల పాఠశాల కొనసాగుతోంది. అయితే తమకే స్థలం సరిపోవడం లేదని చెప్పటంతో మొయినాబాద్‌కు మార్చారు. అక్కడ ఓ ఏడాది కొనసాగిన తర్వాత మళ్లీ చేవెళ్ల సమీపంలోని తోల్కట్ట దగ్గర్లో ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ భవనంలోకి మార్చారు. దీనికి ప్రస్తుతం నెలకు రూ.6 లక్షలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. ఊరెళ్ల భవనానికి రూ.10 లక్షలు రెండేళ్ల క్రితం పరిగిలో పరిగితో పాటు బురాన్‌పూర్‌కు సంబంధించిన రెండు బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. వీటిలో ఒక్కోదానికి నెలకు రూ.98 వేల అద్దె చెల్లించే వారు. అయితే ఏడాదికి పైగా కొనసాగిన తర్వాత కొత్తగా సమస్యలు పుట్టుకొచ్చాయి. ఈ సాకుతో బురాన్‌పూర్ బీసీ గురుకులాన్ని చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ల ఇంజినీరింగ్ కళాశాలలోకి మార్చారు. దీంతో పాటు పరిగి గురుకులానికి చెందిన మూడు తరగతులను కూడా పక్క జిల్లాకు మార్చారు. ఒకే గురుకులాన్ని ఒక చోట సగం.. పక్క జిల్లాలో సగం తరగతులు నిర్వహిస్తున్న అధికారుల ధోరణిపై తల్లిదండ్రులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇక్కడ నెల అద్దెరూ.98 వేలు చెల్లిస్తూ రాగా.. పక్కజిల్లాలోని భవనానికి మాత్రం నెలకు రూ.10 లక్షల అద్దె చెల్లిస్తున్నారు. ఇలా రెండేళ్ల పాటు చెల్లించే అద్దెతో ఏకంగా గురుకుల భవన నిర్మాణమే పూర్తి చేయవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ వచ్చేందుకు సిద్ధం.. గురుకుల పాఠశాలలు, కళాశాలలు వికారాబాద్ జిల్లా నుంచి పక్క జిల్లాకు తరలిపోవడంపై ఓ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తాము వికారాబాద్ జిల్లాకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఇదే విషయాన్ని పలుమార్లు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారుల దృష్టికి కూడా తీసుకు వెళ్లామని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో భవనం చూయిస్తే అందులోకి షిఫ్ట్ అవుతామని చెప్పారు. వికారాబాద్ జిల్లాకు చెందిన స్కూళ్లు, కాలేజీ కావడంతో ఏ సమస్య ఎదురైనా రంగారెడ్డి జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న భవనాలు ఏ పట్టణానికి దగ్గరగా లేకపోవటంతో విద్యార్థులు అనారోగ్యానికి గురైతే రాత్రి వేళల్లో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. అధికారుల అత్యుత్సాహం జిల్లాలోని గురుకులాలను పక్క జిల్లాలకు మార్చేందుకు అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు. గురుకులాలు మంజూరవగానే దగ్గరుండి నాలుగు భవనాలు చూపించా. కొడంగల్‌లో స్థలం దొరకడంలేదంటే దానికి కూడా పరిగిలో భవనం చూపించా. ఏదో కారణం చెప్పి దాన్ని మరోచోటకు మార్చారు. ఇంకో గురుకులానికి చెందిన మూడు తరగతులను పక్క జిల్లాకు తరలించారు. ఇక్కడికి తెస్తామంటే తోల్కట్ట వద్ద కొనసాగుతున్న కాలేజీకి కూడా పరిగిలో భవనం సమకూరుస్తాం. – టి.రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి -
ఆరోగ్యానికి హైజిన్ కిట్లు
రాయపోలు(దుబ్బాక): బాలికల విద్యకు భరోసానిస్తూ ప్రభుత్వం మరో మహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. చదువుకు దూరంగా ఉంటున్న ఆడపిల్లలను బడిలో చేర్పించేందుకు వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. వారి ఆరోగ్య సంరక్షణకూ పెద్దపీట వేస్తూ మరో ముందడుగు వేసింది. వసతి గృహాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు హెల్త్ అండ్ హైజిన్ కిట్లను అందజేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో 33,534 మంది బాలికలకు ఈ పథకం కిట్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికా విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా బాలికల ఆరోగ్య సంరక్షణకు దోహదపడేలా హెల్త్ అండ్ హైజిన్ కిట్లు అందజేయనున్నారు. గత విద్యా సంవత్సరం చివర్లో కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు విస్తరింపచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని 111 ప్రాథమికోన్నత పాఠశాలలు, 228 ఉన్నత పాఠశాలలు, 22 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, 14 ఆదర్శ పాఠశాలలున్నాయి. వీటితో పాటు సాంఘీక సంక్షేమ, బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 7 నుంచి 12వ తరగతి చదువుకుంటున్న 33,534 మంది విద్యార్థినులకు ప్రభుత్వం ఆరోగ్య కిట్లు అందజేయనుంది. మూడు నెలలకోసారి.. ప్రతీ విద్యార్థినికి మూడు నెలలకోసారి ఆరోగ్య కిట్లను అందజేయనున్నారు. గత విద్యా సంవత్సరం ఫిబ్రవరి చివర్లో కస్తూర్బా గా>ంధీ బాలికల పాఠశాలల్లో చదువుకుంటున్న 6 నుంచి 10వ తరగతి విద్యార్థినులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థినులందరితో పాటు సర్కారు పాఠశాలల్లో చదువుకునే 7వ తరగతి పైబడిన విద్యార్థులకు కిట్లను అందజేయనున్నారు. రూ.400ల వరకు విలువైన 15 రకాల వస్తువులు ఒక కిట్టుగా తయారు చేసి విద్యార్థులకు అందజేయనున్నారు. అందులో సబ్బులు, కొబ్బరినూనె నుంచి దువ్వెన, న్యాప్కిన్స్ కూడా ఉన్నాయి. -
పేదింటి కుసుమాలు.. కాబోయే డాక్టర్లు
రాయదుర్గం : వారంతా పేదింటి పిల్లలు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, గురుకుల విద్యా సంస్థల తోడ్పాటుతో కాబోయే డాక్టర్లుగా మారబోతున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన రైతులు, నిత్యకూలీల పిల్లలలో 13 మంది డాక్టర్లు అయ్యే అవకాశం రావడం విశేషం. నీట్లో గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ /మెడికల్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 54 మంది విద్యార్థులు నీట్ çపరీక్ష రాయగా ఈ ఏడాది 11 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు, మరో ఇద్దరు విద్యార్థులకు బీడీఎస్ సీట్లు రావడం ఖాయంగా మారింది. 13 మంది విద్యార్థులు పది వేల లోపు ర్యాంకులు సాధించారు. కళాశాల నుంచి ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులుగా అఖిల భారత స్థాయి ఎస్టీ కేటగిరిలో రాజు (2,876), అనూష (2,900), ఎస్సీ కేటగిరిలో రాము (3519 ర్యాంకు), కార్తీక్ (4452), మాధవి (4,982), అన్వేష్ (5,737), ఆర్.శ్వేత (6,213), అభిలాష్ (7,091), నవ్యశ్రీ (7860), సాయితేజ (9480), సంధ్య(9707) ర్యాంకులను సాధించడం విశేషం. వీరందరికీ ఎంబీబీఎస్ సీట్లు రావడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. పది వేలకుపైగా ర్యాంకులు సాధించిన రాధిక (10,471), లావణ్య (10,751) బీడీఎస్ సీట్లు రావడం ఖాయమని వారు తెలిపారు. 30 మందికి టాప్–5 కళాశాలల్లో ఇంజనీరింగ్ సీట్లు ఖాయం నగరంలోని టాప్–5 కళాశాలల్లో 30 మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లు కచ్చితంగా వస్తాయని గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ/మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వివేకానంద అన్నారు. మరో 20 మంది విద్యార్థులకు ఏజీ బీఎస్సీలో కూడా సీట్లు వస్తాయన్నారు. నీట్లో సత్తా చాటిన విద్యార్థులలో 11 మంది ఎంబీబీఎస్ సీట్లు, ఇద్దరికి బీడీఎస్ సీట్లు ఖాయంగా వస్తాయని చెప్పారు. గత ఏడాది 8 మందికి మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయని, ప్రస్తుత ఏడాది పెరగడం ఉపాధ్యాయులు, విద్యార్థులు సమిష్టి కృషి ఫలితమన్నారు. కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఉన్నతాధికారుల ప్రోత్సాహం తోనే అత్యుత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. -
సామాజిక సేవకు మేము సైతం..
రాయదుర్గం : గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇఫ్లూ యూనివర్సిటీ జర్నలిజం కోర్సులకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 13 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. వీరిలో ముగ్గురు గౌలిదొడ్డి ఐఐటీ గురుకుల విద్యార్థులే కావడం విశేషం. మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లోని ఇఫ్లూ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు అవకాశం వచ్చింది. ఇటీవలే జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ చాటి అడ్వాన్స్‌కు అర్హత సాధించిన గురుకుల విద్యార్థులు రమేష్‌చంద్ర, ఎ.మదర్ ఇండియా, జి. శశిశ్వేత జర్నలిజం కోర్సుకు ఎంపికయ్యారు. ఇటీవలే నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చాటి విద్యార్థులు సీట్లు సాధించడం విశేషం. ఇఫ్లూ యూనివర్సిటీ జర్నలిజం కోర్సుకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపాల్ వివేకానందను టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం.. గౌలిదొడ్డిలోని గురుకుల కళాశాలలో ఐఐటీ, నీట్ కు శిక్షణ ఇస్తామని, కానీ విద్యార్థులు తమ ఇష్టం తో చదివి జర్నలిజం కోర్సును ఇఫ్లూ యూనివర్సిటీలో చేసేందుకు ఆసక్తి కనబరిస్తే ప్రోత్సహిం చా మని ప్రిన్సిపాల్ వివేకానంద పేర్కొన్నారు. ప్రభు త్వం ద్వారా పూర్తి వ్యయాన్ని భరించి చదివించేందుకు కార్యదర్శి అంగీకరించారన్నారు. గౌలిదొడ్డి ఐఐటీ కళాశాల ద్వారా గత ఏడాది నలుగురు ఐఐటీ సీట్లు, 15 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా 8 మంది విద్యార్థులు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీకి ఎంపికయ్యారని ఆయన తెలిపారు. -
గురుకులంలో దారుణం.. ప్రిన్సిపాల్ భర్త అసభ్య ప్రవర్తన!
సాక్షి, హైదరాబాద్ : తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో కామాంధుడు. నగరంలోని శేర్లింగంపల్లి గోపంపల్లిలోని గురుకుల పాఠశాలలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ భర్త తొమ్మిదో తరగతి విద్యార్థిని పట్ల నీచంగా ప్రవర్తించాడని ఈ నెల 3న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెక్షన్ 354 ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపంపల్లిలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్ ప్రమోదీని భర్త నాగేశ్వర్ రావు అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గురుకుల పాఠశాల ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్ ప్రమోదీని సస్సెండ్ చేశారు. అయితే ఈ నీచానికి పాల్పడిన నాగేశ్వర్ రావు పరారీలో ఉన్నట్లు పోలీసు తెలిపారు. -
గిన్నిస్ రికార్డు చేరువలో గురుకుల విద్యార్థులు
అనంతపురం రూరల్ : గురుకులాలకు చెందిన విద్యార్థులు గిన్నిస్ రికార్డు కోసం చేసిన ప్రయత్నం ఫలిస్తుందని గురుకుల విద్యా సంస్థల కో ఆర్డినేటర్ ఉషారాణి అన్నారు. తిరుపతిలో జరిగిన గురుకుల విద్యార్థుల నాట్య విశేషాలను ఆమె ఆదివారం తెలిపారు. గ్రామీణ విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలను చాటడానికి రాష్ట్రవ్యాప్తంగా తిరుపతి వేదికగా 125 పాఠశాలల నుంచి దాదాపు 3,150 మంది విద్యార్థులు పోటీపడగా, జిల్లా తరుపున కురుకుంట అంబేడ్కర్ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత నాట్యంతో ఆకట్టుకున్నారని ప్రశసించారు. డాన్స్‌మాస్టర్ మక్బుల్ శిక్షణలో విద్యార్థులు అద్భుతంగా రాణించారన్నారు.