గురుకుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు షురూ | Online Classes Started For Gurukul Students By TS Government | Sakshi
Sakshi News home page

గురుకుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు షురూ

Published Sat, Apr 25 2020 2:51 AM | Last Updated on Sat, Apr 25 2020 2:51 AM

Online Classes Started For Gurukul Students By TS Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యార్థులకు టీ–సాట్‌ చానల్‌ ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలను శుక్రవారం నుంచి ప్రారంభించినట్లు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ కాలంలో విద్యార్థుల సమయం వృథా కాకుండా ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరగతులు మే 30 వరకు కొనసాగుతాయని, ప్రతీ రోజు 4 తరగతులు, ప్రతీ పీరియడ్‌ గంట పాటు నిర్వహిస్తామని వెల్లడించారు. రోజువారీ షెడ్యూల్‌ ముందుగానే ప్రకటిస్తామని, ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమవుతాయని, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. వీటితోపాటు ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతము, క్రీడలు, ఆరోగ్యానికి సంబంధించిన తరగతులు కూడా ఉంటాయని, ప్రతి రోజూ 4 సబ్జెక్టుల్లో ఒక్కో గంట ఎంపిక చేసిన అంశాలలో అన్ని విషయాలు గొలుసుకట్టు పద్ధతుల్లో సులభంగా అర్థమయ్యేలా బోధిస్తామని వివరించారు. విద్యార్థులు ఈ పాఠాలకు సంబంధించిన సందేహాలు, సలహాలను 91332 56222 నంబర్‌కు వాట్సాప్‌/ఎస్సెమ్మెస్‌ ద్వారా పంపితే వెంటనే సమాధానం ఇస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement