hand symbol
-
ఏనుగు..సైకిల్.. హస్తం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 1978లో చీలిపోయిన తర్వాత ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్(ఐ) కోసం ఏనుగు, సైకిల్, హస్తం గుర్తులు పరిశీలనకు రాగా, ఇందిర ‘హస్తం’ గుర్తుకు ఆమోద ముద్ర వేశారని పొలిటికల్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ తెలిపారు. ఇటీవలే విడుదలైన తన పుస్తకం ‘బ్యాలెట్– టెన్ ఎపిసోడ్స్ దట్ హావ్ షేప్డ్ ఇండియాస్ డెమొక్రసీ’లో కిద్వాయ్ వివరించారు. కాంగ్రెస్(ఐ) ఏర్పాటుతో ఇందిర ‘ఆవు–దూడ’ గుర్తును వదులుకోవాల్సి వచ్చిందని కిద్వాయ్ ఈ పుస్తకంలో తెలిపారు. ‘అప్పటి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బూటా సింగ్ తమకు కొత్త ఎన్నికల గుర్తు కేటాయించాలని ఈసీకి లేఖ రాశారు. దీంతో ఏనుగు, హస్తం, సైకిల్ గుర్తుల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలని ఈసీ సూచించింది. ఈ సమయంలో ఇందిర ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నేత పీవీ నరసింహారావుతో సమావేశమై ఉన్నారు. ఎన్నికల గుర్తుపై తుది నిర్ణయం తీసుకోలేని సింగ్.. ఇందిరకు వెంటనే ఫోన్ చేశారు. హస్తం గుర్తును ఎంపిక చేద్దామని సూచించారు. అయితే సాంకేతిక కారణమో లేక సింగ్ ఉచ్ఛారణ సరిగ్గా లేకపోవడంతోనో ఫోన్లో ఇందిరకు హాత్(హస్తం) అన్న పదం హాథీ(ఏనుగు)గా విన్పించింది. బూటా సింగ్ ఏనుగు గుర్తునే మళ్లీ మళ్లీ సిఫార్సు చేస్తున్నారని ఆగ్రహించిన ఇందిర.. చివరికి ఫోన్‌ను పీవీ నరసింహారావు చేతికిచ్చా రు. బహుభాషా పండితుడైన నరసింహారావు రిసీవర్ అందుకున్న వెంటనే సింగ్ చెబుతున్నదేంటో అర్థం చేసుకున్నారు. హాత్ అనడం ఆపి పంజా అనాలని పీవీ ఆయనకు ఫోన్లో గట్టిగా జవాబిచ్చారు. చివరికి పీవీ అసలు విషయాన్ని ఇందిరకు చెప్పడంతో హస్తం గుర్తుకు ఆమె అంగీకరిం చారు’ అని కిద్వాయ్ వివరించారు. -
కాంగ్రెస్ పార్టీ.. ‘హస్తం’ గుర్తును రద్దు చేయాలట!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అనగానే గుర్తుకువచ్చేది.. హస్తం గుర్తు. కాంగ్రెస్ అంటే హస్తం.. హస్తం అంటే కాంగ్రెస్ అన్నంతగా ఈ ఐకానిక్ గుర్తు పెనవేసుకుపోయింది. ఇప్పుడు ఈ గుర్తును కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తాన్ని ఉపసంహరించాలని కోరుతూ బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆ గుర్తును కేటాయించడం ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఆయన తన ఆరు పేజీల పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఓంప్రకాశ్ రావత్, ఎన్నికల సంఘం లీగల్ అడ్వయిజర్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తును ఉపసంహరించుకోవాలంటూ ఆయన పేర్కొన్న కారణాలేమిటంటే.. కాంగ్రెస్ ఎన్నికల గుర్తు హస్తం.. మానవ శరీరంలోని ఒక భాగం పోలింగ్ నాడు కాంగ్రెస్ నేతలు చేతులను ఊపుతూ.. చేతులను ఓటర్ల వైపు చూపుతూ.. ఎలక్షన్ సింబల్‌ను దుర్వినియోగం చేస్తున్నారు మానవ శరీరంలో విడదీయరాని భాగమైన హస్తాన్ని గుర్తుగా కేటాయించడంతో కాంగ్రెస్ నేతలు తమ గుర్తును దుర్వినియోగపరుస్తున్నారు. మానవ శరీరభాగానికి సంబంధించి.. ఎన్నికల గుర్తుగా ఉన్నది హస్తం మాత్రమే పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని ప్రవర్తనా నియమావళి స్పష్టం చేస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం పోలింగ్ కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఎలక్షన్ సింబల్‌ను ప్రదర్శించడం నిషేధం కానీ, కాంగ్రెస్ పార్టీ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా తమ గుర్తును ప్రదర్శిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతోంది -
కోడ్ ఉల్లంఘించిన రాహుల్?
-
కోడ్ ఉల్లంఘించిన రాహుల్?
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో బీజేపీ- కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. నిన్న కాక మొన్న బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ను ఎన్నికల కమిషన్ తీవ్రంగా మందలించగా, ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే కోడ్‌ను ఉల్లంఘించినట్లు కనపడుతోంది. ఆయన మోడల్ కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. హస్తాన్ని ఇక మీదట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుగా ఉండకుండా చూడాలని, దాంతోపాటు జాతీయ పార్టీ గుర్తింపును కూడా రద్దుచేయాలని బీజేపీ కోరింది. జనవేదనా సమ్మేళన్ పేరుతో ఢిల్లీలో ఒక సభ నిర్వహించిన రాహుల్ గాంధీ.. అక్కడ మతపరమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. శివుడు, గురునానక్, బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, మహ్మద్ ప్రవక్త అందరూ కాంగ్రెస్ గుర్తు అయిన హస్తాన్నే చూపిస్తారంటూ తమ ఎన్నికల గుర్తు గురించి మతపరమైన ప్రచారం చేసుకున్నారని తెలిపింది. ఫిర్యాదుతో పాటు.. రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన సీడీని కూడా జతచేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ వ్యాఖ్యలు వ్యక్తిగతం అని ఏమీ చెప్పలేదని, అందువల్ల ఆ పార్టీ కూడా తప్పు చేసినట్లే అవుతుంది కాబట్టి పార్టీకి సైతం కోడ్ ఉల్లంఘన వర్తిస్తుందని ఆ ఫిర్యాదులో బీజేపీ తెలిపింది. ఎన్నికల నిబంధనలకు సంబంధించి ఉత్తర్వులలోని 16ఎ, 18 పేరాలను ఉల్లంఘించినందున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తును రద్దుచేయాలని బీజేపీ నేతలు కోరారు. -
మొదట 'చేయి' కామ్రేడ్లదే...!
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తుగా ఉన్న హస్తంను మొదటి సార్వతిక ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలకు కేటాయించారు. 1952లో కాంగ్రెస్ పార్టీది కాడెడ్ల గుర్తు. దీంతోనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోటీ చేసింది. హైదరాబాద్ సంస్థానం మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు కంకికొడవలి గుర్తుపై పోటీ చేశాయి. హైదరాబాద్ సంస్థానంలో నిషేధం ఉండటంతో ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరిట ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల సంఘం పీడీఎఫ్ అభ్యర్థులకు హస్తం గుర్తును కేటాయించింది. 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలకు కంకికొడవలి గుర్తే లభించింది. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. 1970లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోవడంతో ఇందిరాగాంధీ అభయహస్తం గుర్తును స్వీకరించారు. అప్పటి నుంచి అదే గుర్తును కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోంది. తొలుత కమ్యూనిస్టులకు కేటాయించిన చెయ్యి గుర్తు కాలక్రమంలో కాంగ్రెస్‌కు శాశ్వత గుర్తుగా మిగిలింది.