Hari Narayanan
-
కలెక్టర్ వినూత్న శైలి: ఆ నోటీస్‌లో ఏముందంటే..
చిత్తూరు కలెక్టరేట్: కలెక్టర్ మురుగన్ హరినారాయణన్ విలక్షణ విధానాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటీవలే జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆర్భాటాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవడంపై అధికార వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. తనను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, శాలువాలు, బహుమతులు తీసుకురాకూడదని కలెక్టర్ ఛాంబర్ వెలుపల నోటీస్ పెట్టించారు. అలాగే చాంబర్లో నిర్వహించే సమీక్ష సమావేశాలకు స్నాక్స్ బిల్లులు పెట్టకూడదని సిబ్బందిని ఆదేశించారు. తన కార్యాలయ నిర్వహణకు అవసరమయ్యే ఖర్చును తానే భరిస్తానని స్పష్టం చేశారు. సమావేశాల్లో ఉన్నప్పుడు మినహా అర్జీదారులను నేరుగా తన చాంబర్‌కే పంపించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కొత్త కలెక్టర్ వినూత్నశైలిపై జిల్లా యంత్రాంగంలో విస్తృతంగా చర్చ మొదలైంది. (చదవండి: ఊర్మిళ జీవితంలో ‘గుడ్ మార్నింగ్’) సర్పంచ్ అభ్యర్థి భర్త అపహరణ -
భర్తల గోడు చెప్పుకునేందుకు ‘పురుష్ ఆయోగ్’..!
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలు, భార్యల చేతిలో ఇబ్బందులకు గురవుతున్న పురుషులకు కూడా తమ గోడు చెప్పుకునేందుకు ఓ కమిషన్ ఉండాలని బీజేపీ ఎంపీలు హరినారాయణ్ రాజ్‌బిహార్, అన్షుల్ వర్మ అన్నారు. చట్టాలను దుర్వినియోగం చేస్తూ భర్తలకు చుక్కలు చూపెడతున్న భార్యల నుంచి రక్షణ పొందేందుకు ‘పురుష్ ఆయోగ్’ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మగవారి బాధలు చెప్పుకునేందుకు సరైన వేదిక లేనందున ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. పురుష్ ఆయోగ్ ఏర్పాటుకు మద్దతు కూడగట్టేందుకు సెప్టెంబర్ 23న సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తామని పేర్కొన్నారు. డిమాండ్ ఓకే.. కానీ, అనవసరం.. ప్రతి ఒక్కరికి తమ డిమాండ్లను లేవనెత్తే హక్కు ఉంటుందని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్) శనివారం వెల్లడించిన నేపథ్యంలో.. పురుషులకు కూడా ఒక కమిషన్ ఉండాలని కోరుతున్నట్టు ఎంపీలు వివరించారు. అయితే, పురుషుల కోసం ఎలాంటి కమిషన్ ఏర్పాటు అవసరం లేదని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ చెప్పడం విశేషం. సెక్షన్ 498ఎ సవరించాలి.. దాడులు, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు ఐపీసీలోని సెక్షన్ 498ఎ రక్షణ కల్పిస్తోంది. అయితే, కొందరు మహిళలు ఈ సెక్షన్‌ను ఆసరాగా చేసుకుని వారి భర్తలు, అత్తింటివారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ వర్మ అన్నారు. తప్పుడు కేసుల మూలంగా 1998 నుంచి 2015 వరకు 27 లక్షల మంది అరెస్టయ్యారని తెలిపారు. 498-ఎను సవరిస్తే తప్పుడు కేసులు నమోదు కావని అన్నారు. కాగా, తప్పుడు ఫిర్యాదులతో మగవారిపై కేసుల నమోదు సంఖ్య పెరిగిందని గతేడాది కేంద్ర స్త్రీశిశు సంక్షేమశాఖ మేనకా గాంధీ పేర్కొనడం గమనార్హం. -
ముహూర్తం ఖరారైంది
మలయాళంలో ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఆది’. తాజాగా ఆయన రెండో చిత్రం ప్రారంభోత్సవం వచ్చే నెల 9న జరగనుందని మాలీవుడ్ సమచారం. అరుణ్ గోపీ దర్శకత్వం వహించనున్నారు. వివేక్ హర్షన్, హరినారాయణన్, రంగనాథ్, జోసెఫ్, ధన్య బాలకృష్ణన్, లిబిన్ మోహనన్ తదితరులు నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా వచ్చే నెలాఖర్లో స్టార్ట్ కానుందట. మరోవైపు ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా రూపొందనున్న మరార్కర్ సినిమాలో యంగ్ మోహన్‌లాల్ క్యారెక్టర్లో ప్రణవ్మోహన్లాల్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్‌లో స్టార్ట్ కానుంది. -
ఆగని ఇసుక రవాణా
బోధన్/ బాల్కొండ, న్యూస్‌లైన్: అధికారుల హెచ్చరికలు, చర్యల వల్ల ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడటం లేదు. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు స్థానిక, సార్వత్రిక ఎన్నిక విధుల్లో తలమునకలై ఉండగా ఇదే అదనుగా అక్రమార్కులు ఇసుక దందాను మొదలు బెట్టారు. కొన్ని వారాల నుంచి మంజీరా నది నుంచి ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. బోధన్ ప్రాంతంలో గోదావరి, మంజీరా, హరిద్రా (పసుపు వాగులు) నదులు పారుతున్నాయి. పలు వాగుల్లో ఇసుక మేటలున్నాయి. ఈ జలవనరులు నుంచి సులభమైన మార్గాల ద్వారా ట్రాక్టర్లతో ఇసుక రవాణా సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం బోధన్ సబ్ కలెక్టర్ హరినారాయణన్ ఇసుక అక్రమ రవాణాకు కేంద్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి వరుస దాడులు చేయగా కొన్ని మండలాల్లో ఇసుక రవాణాకు బ్రేక్ పడింది. మంజీరా తీరాన.. బోధన్ మండలంలో మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్న మందర్న, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గెల్లి గ్రామాలు కేంద్రంగా ఇసుక రవాణా సాగుతోంది. మంజీరా నది నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణ చేస్తున్నారు. ఇసుక కుప్పలు పోసి, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ దూర ప్రాంతాలకు భారీ వాహనాల్లో తరలిస్తున్నారు. నిఘా నామమాత్రమే.. గతంలో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు మంజీరా పరివాహక ప్రాంత గ్రామాల వీఆర్ఓలు, గ్రామ సేవకులతో కాపాలపెట్టారు. తహశీల్దార్, మండల రెవెన్యూ, ఇన్స్పెక్టర్లు నిఘాను పర్యవేక్షించారు. మరోవైపు పోలీసు సిబ్బంది రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించి ఇసుక లారీలు స్వాధీనం చేసుకునేవారు. ప్రస్తుతం మండల స్థాయి రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నందున ఇసుక రవాణాపై అంతగా దృష్టి సారించ లేకపోతున్నారు. ఉన్నతాస్థాయి అధికారులు కఠిన చర్యకు ఆదేశాలిస్తే ఇసుక దందాకు బ్రేక్‌లు పడే అవకాశాలుంటాయని, కింది స్థాయి రెవెన్యూ సిబ్బందిలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాత్రయితే చాలు.. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ప్రవహించే పెద్దవాగు ఇసుక వ్యాపారులకు కల్పతరువుగా మారింది. దీంతో ఇసుక రవాణాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. మండలంలోని రెంజర్ల, నాంగపేట్, నల్లూర్ మీదుగా జాతీయ రహదారి 44గుండా ఆదిలాబాద్ జిల్లావైపు నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్ల ఇసుక తరలి పోతుంది. మోర్తాడ్ మండలం వైపు నుంచి ఇసుక టిప్పర్లు జోరుగా వస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు టిప్పర్ నిండా కూలీలు మోర్తాడ్ మండలం వైపు ప్రయాణమవుతారు. రాత్రంతా పదుల టిప్పర్లు ఇసుకను తరలిస్తాయి. మళ్లీ మర్నాడు ఉద యం టిప్పర్ నిండా ఇసుక దానిపై కూలీలు కూర్చుని వస్తారు. ఇలా సుమారు 15 రోజులుగా ఈ దందా సాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూళ్ల మత్తులో ఉన్న అధికారులు ఇసుక వ్యాపారులను పట్టుకోవడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.