వికారాబాద్‌కు పిచ్చాస్పత్రి!
* హెల్త్‌హబ్‌గా వికారాబాద్
* సీఎం కేసీఆర్ ప్రకటన
సాక్షి, రంగారెడ్డి జిల్లా : వికారాబాద్‌ను హెల్త్‌హబ్‌గా మార్చనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రస్తుతం ఎర్రగడ్డలో కొనసాగుతున్న క్షయ ఆస్పత్రి, పిచ్చాస్పత్రిని అనంతగిరికి తరలించనున్నట్లు చెప్పారు. శనివారం టీఆర్ఎస్ భవన్లో జిల్లాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి ఎంపీలు విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, యాదవరెడ్డి, జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కనకారెడ్డి, పార్టీ నేతలు నాగేందర్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, కేఎస్ రత్నం తదితరులు పాల్గొని సమస్యల్ని వివరించారు.