Hizbul Mujhaideen
-
6 గంటల పోరు: హిజ్బుల్ కమాండర్ హతం!
శ్రీనగర్: భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టులు నక్కి ఉన్నారనే సమాచారంతో సోపియాన్ జిల్లాలోని రేబన్ ప్రాంతంలో భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ రేబన్ పేరుతో భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో.. టెర్రరిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య దాదాపు 6 గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. చివరికి భద్రత బలగాలు ఐదుగురు ట్రెరిస్టులను మట్టుబెట్టాయని రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేష్ కాలియ తెలిపారు. తొలుత ఉగ్రవాదులను లొంగిపోవాలని హెచ్చరించినా వారు వినలేదని దాంతో.. ఎన్కౌంటర్ తప్పలేదని కల్నల్ పేర్కొన్నారు. కాగా, మృతుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ ఫారూక్ అసద్ నల్లి, విదేశానికి చెందిన టెర్రరిస్టులు ఉన్నట్టు సమాచారం. ఘటనాస్థలంలో భారీగా తుపాకులు, మందుగుండు సామాగ్రిని సెక్యురిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో కొందరు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారని తెలిసింది. -
కశ్మీర్లో హై అలర్ట్
శ్రీనగర్: ఉగ్రవాదులు దాడులకు పాల్పడతారనే సమాచారంతో కశ్మీర్లో భద్రతా బలగాలు సోమవారం హై అలర్ట్ ప్రకటించాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. ‘భద్రతాబలగాలే లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఉప్పందించాయి. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ నైకూను చంపినందుకు ప్రతీకారంగా కారు బాంబు, లేక ఆత్మాహుతి దాడి జరిపేందుకు కుట్ర పన్నినట్లు మాకు తెలిసింది’ అని ఓ అధికారి తెలిపారు. రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యమున్న 17వ రోజున గతంలో ఇక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు. -
నర హంతకుడిగా.. లెక్కల మాస్టారు
న్యూఢిల్లీ : కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూను హతమార్చడం చాలా కాలం తర్వాత భారత భద్రతా బలగాలు సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న అతడ్ని కశ్మీర్‌లోని సొంత గ్రామంలోనే మట్టుబెట్టడం మరో విజయం. అయితే ఓ లెక్కల మాస్టారు జమ్మూ కశ్మీర్‌కు చెందిన టాప్ మిలిటెంట్ కమాండర్లలో ఒకడిగా మారిన వైనం ఆశ్చర్యకరం. మార్పు తెచ్చిన జైలు జీవితం .. రియాజ్ నైకూ.. పంజ్గామ్లోని నైకూ మొహల్లాలో 1985లో జన్మించాడు. నలుగురు సంతానంలో అతడు రెండో వాడు. ఇంటర్లో 600లకు గానూ 464 మార్కులు తెచ్చుకున్న నైకూ ఇంజనీర్ అవ్వాలని అనుకునేవాడు. కానీ, గ్రాడ్యూయేషన్ అయిపోగానే ఓ ప్రైవేట్ స్కూల్లో లెక్కల మాస్టారుగా చేరాడు. పేద విద్యార్థులకు ఉచితంగా తరగతలు కూడా చెప్పేవాడు. 2012లో ఓ కేసులో జైలుకు వెళ్లాడు. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత అతడిలో మార్పు వచ్చింది. ఆ తర్వాత 2012 జూన్ 6న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. ఇప్పటివరకు అతనిపై 11 కేసులు ఉన్నాయి. ( హిజ్బుల్ కమాండర్ హతం ) భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. అయితే నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లానింగ్‌తో గత మంగళవారం రాత్రి అతన్ని హతమార్చారు. ( కశ్మీర్లో 64 మంది ఉగ్రవాదుల ఏరివేత) -
కశ్మీర్లో 64 మంది ఉగ్రవాదుల ఏరివేత
శ్రీనగర్ : ఈ ఏడాది జనవరి నుంచి భద్రతాబలగాలు జరిపిన మొత్తం 27 ఆపరేషన్లలో 64 మంది ఉగ్రవాదులను ఏరివేశామని కశ్మీర్ రేంజ్ పోలీస్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. యాక్టివ్‌గా ఉన్న మరో 25 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశామని చెప్పారు. గత ఆరునెలలుగా కరడుగట్టిన ఉగ్రవాది, ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో కమాండర్ రియాజ్ నైకూ(32) కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. కాగా, ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన రియాజ్ నైకూ చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే బుధవారం హతమయిన విషయం తెలిసిందే. నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం మంగళవారం రాత్రే పోలీసులకు అందింది. అయితే పోలీసులు వెంటనే కాల్పులు జరపలేదు. నైకూ గతంలో ఇలాంటి పరిస్థితుల నుంచే తప్పించుకున్నందున, ఈసారి తప్పించుకోకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తనిఖీ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ గ్రూపును, జమ్మూకశ్మీర్ పోలీసులను ఈ ఆపరేషన్ కోసం వినియోగించుకున్నారు. మరోవైపు సీఆర్పీఎఫ్ బలగాలు నైకూ ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఈలోగా విషయం అర్థం చేసుకున్న ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు జరపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో బయటకు వచ్చిన ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. అనంతరం లోపల ఉన్న ఉగ్రవాదిని కూడా భద్రతాబలగాలు హతమార్చాయి. అయితే మరణించింది నైకూనా లేక మరొకరా అన్నది వెంటనే తెలియలేదు. తర్వాత పోలీసులు నైకూ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా, గత నెల రోజులుగా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో ఒక కల్నల్, ఒక మేజర్తోపాటూ మొత్తం 18మంది భద్రతా సిబ్బంది వీర మరణం పొందారు. నైకూ చరిత్ర ఇది.. మొదట్లో లెక్కల టీచర్‌గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్ 6న పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. -
హిజ్బుల్ కమాండర్ హతం
శ్రీనగర్: ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్ నైకూ (32) చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే హతమయ్యాడు. ఇతడు ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో కమాండర్‌గా పనిచేస్తున్నాడు. కశ్మీర్‌లోని అతడి సొంత గ్రామంలోనే నైకూను మట్టుబెట్టడం గమనార్హం. మంగళవారం రాత్రి నుంచి సాగిన ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా రెండు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరగాయి. అందులో ఒకటి దక్షిణ కశ్మీర్‌లోని షార్షవల్లి కాగా, రెండోది అవంతిపొరలోని బీగ్ పొర. రెండు చోట్లా ఇద్దరు చొప్పున ఉగ్రవాదులు మరణించారు. అవంతిపొర ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నైకూను మట్టుబెట్టారు. నైకూ పోలీసుల నుంచి ఇప్పటికే మూడుసార్లు తప్పించుకున్నాడు. అయితే ఈసారి తప్పించుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అతన్ని హతం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సాగిందిలా.. నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం మంగళవారం రాత్రే పోలీసులకు అందింది. అయితే పోలీసులు వెంటనే కాల్పులు జరపలేదు. నైకూ గతంలో ఇలాంటి పరిస్థితుల నుంచే తప్పించుకున్నందున, ఈసారి తప్పించుకోకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తనిఖీ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ గ్రూపును, జమ్మూకశ్మీర్ పోలీసులను ఈ ఆపరేషన్ కోసం వినియోగించుకున్నారు. మరోవైపు సీఆర్పీఎఫ్ బలగాలు నైకూ ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఈలోగా విషయం అర్థం చేసుకున్న ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు జరపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో బయటకు వచ్చిన ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. అనంతరం లోపల ఉన్న ఉగ్రవాదిని కూడా భద్రతాబలగాలు హతమార్చాయి. అయితే మరణించింది నైకూనా లేక మరొకరా అన్నది వెంటనే తెలియలేదు. తర్వాత పోలీసులు నైకూ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. షర్షాలి అనే మరోగ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులు ఎవరో గుర్తించాల్సి ఉంది. కశ్మీర్ వాలీలో శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని సెల్‌ఫోన్ టవర్లను మూసేసినట్లు తెలిపారు. నైకూ చరిత్ర ఇది.. మొదట్లో లెక్కల టీచర్‌గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్ 6న పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. నైకూ ఎన్‌కౌంటర్‌పై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. అతడి మరణం మరికొందరు చేసే అల్లర్లకు, నిరసనలకు కారణంగా మారేందుకు అంగీకరించరాదని ట్వీట్ చేశారు. -
నలుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూ: ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతాబలగాలు సోదాలు చేపట్టి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంది. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని దార్ మొహల్లా వాటరిగమ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మరణించిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా, హిజ్బుల్ ఉగ్రసంస్థలకు చెందిన ముజఫర్ అహ్మద్ భట్, ఒమర్ అమీన్ భట్, సాజద్ అహ్మద్ భట్, గుల్జార్ అహ్మద్ భట్‌లుగా గుర్తించారు. ఇందులో గుల్జార్ హిజ్బుల్‌కు చెందిన ఉగ్రవాది కాగా, మిగిలిన వారు లష్కరే తోయిబాకు చెందిన వారు. వీరంతా కుల్గామ్ జిల్లాకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు, రెండు పిస్తోళ్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
‘ప్రపంచంలోని ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు’
శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడిని మరువక ముందే ఆత్మాహుతి దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కశ్మీరీ వేర్పాటువాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ హెచ్చరించింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కశ్మీరీ యువకులు ఆత్మబలిదానాలకు వెనుకడుగు వేయరని పేర్కొంది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కమాండర్ ఆదిల్... సీఆర్పీఎఫ్ బలగాల వాహన శ్రేణిని ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ క్రమంలో పుల్వామా దాడిలో కీలక సూత్రధారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంతరం.. కశ్మీర్లో తిరిగే ప్రతీ ఉగ్రవాదిని అంతం చేస్తామని ఆర్మీ అధికారులు మీడియా ముఖంగా హెచ్చరించారు. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న కశ్మీరీ యువత లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.(‘లొంగిపోండి.. లేదంటే అంతం చేస్తాం’) వాళ్లను బతకనివ్వం ఈ విషయంపై స్పందించిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ నైకూ సుమారు 17 నిమిషాల నిడివి గల ఆడియో మెసేజ్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ‘లొంగిపోవడం కంటే కూడా చావడానికే ప్రాధాన్యం ఇస్తాం. మీ సైనికులు ఇక్కడ(కశ్మీర్) ఉన్నంత కాలం మీరు ఏడవాల్సిందే. మీ జవాన్ల శవపేటికలు వస్తూనే ఉంటాయి. చావడానికైనా మేము సిద్ధమే. కానీ వాళ్లను మాత్రం బతకనివ్వం. ఆత్మబలిదానాలకు సిద్ధంగా ఉన్నాం. మా దళంలోని 15 ఏళ్ల పిల్లలు.. వారి శరీరాలకు బాంబులు కట్టుకుని.. భారత ఆర్మీ వాహనాలపై దాడి చేసే రోజు ఎంతో దూరంలో లేదు. బానిసత్వం కంటే చచ్చిపోవడమే మాకు ఇష్టం. మొన్న దాడి చేసింది కూడా ఓ కశ్మీరీ యువకుడే. సైన్యం కారణంగానే అతడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు మరికొంత మంది సిద్ధంగా ఉన్నారు. ప్రపంచంలోని ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు’ అంటూ రియాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కాగా 2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన బుర్హన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం ఆ సంస్థలో చేరుతున్న కశ్మీరీ యువత సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చదవండి : పుల్వామా ఉగ్రదాడి; మాస్టర్ మైండ్ హతం! ఉగ్ర మారణహోమం -
మేం పచ్చి అబద్దాలకోరులం..
కశ్మీర్లో తమ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారన్న ఆగ్రహంతో రాష్ట్ర పోలీస్ అధికారుల కుటుంబీకులు 11 మందిని హిజ్బుల్ ఉగ్రవాదుల కిడ్నాప్ చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారుల కుటుంబాలు పడుతున్న మానసిక క్షోభ, కశ్మీర్‌లోయలో పరిస్థితులపై ఓ పోలీస్ అధికారి భార్య, ఉద్యోగిని అయిన ఆరీఫా తౌసిఫ్ ఓ స్థానిక వార్తాపత్రికకు భావోద్వేగ లేఖ రాశారు. శారీరకంగా పక్కనున్నా మానసికంగా విధుల్లోనే ‘ఒంటరిగా ఇంట్లో నిద్రపోవడమన్నది పెద్ద సమస్యేం కాదు. కానీ అర్ధరాత్రి భయంతో ఉలిక్కిపడి లేచిన సందర్భాల్లో పక్కనుండి ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు ఎవ్వరూ లేకపోవడంతో మానసిక క్షోభను అనుభవిస్తాం. అంతేకాదు భర్తతో కలసి ఈ రోజు లేదా రేపు లేదా ఎల్లుండి బయటకు వెళ్లాలనుకుని మేం అనుకుంటే అవి ఎప్పుడోకాని జరగవు. అదృష్టంకొద్దీ అది జరిగినా పోలీస్ అధికారులు శారీరకంగా మాత్రమే కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉంటారు. కానీ మానసికంగా, ఫోన్ ద్వారా వాళ్లు అప్పుడు కూడా విధుల్లోనే ఉంటారు. కశ్మీర్లో ఆపరేషన్ల సందర్భంగా ఎక్కడ, ఏ పోలీస్ అధికారి చనిపోయినా మేమంతా తీవ్రమైన భయం, అభద్రతాభావంలోకి జారిపోతున్నాం’ బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది కశ్మీర్లో పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకనే కశ్మీర్లో యువకులు పోలీస్‌శాఖలో చేరుతున్నారు. వారు చదివింది ఒకటి. చేసేది మరోటి. దేశంలో కశ్మీర్లో మాత్రమే రిటైర్డ్ అధికారులు డిప్యూటీ సూపరింటెండెంట్(డీఎస్పీ)లుగా, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీచేసిన వారు ప్రభుత్వ అధికారులుగా చేస్తున్నారు. కొన్నిసార్లు ఇంటినుంచి బయటికెళ్లాలంటే భయమేస్తోంది. భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో పెల్లెట్లు తగలడంతో నష్టపోయినవారు, ఇతరులు ఆ దురదృష్టకర ఘటనకు మేమే బాధ్యులం అన్నట్లు చూస్తారు. ఏదైనా పోలీస్ అధికారికి ప్రమాదం జరిగితే కనీసం మా పట్ల సానుభూతి చూపేవారు ఒక్కరు కూడా ఉండటం లేదు. ఈ విషయాలను నా పిల్లలు చిన్నతనంలోనే అర్ధం చేసుకున్నారు. ప్రస్తుతం నా రాష్ట్రంపై కమ్ముకున్న కారు చీకట్లు తొలగిపోయి సుసంపన్నమైన, శాంతియుత కశ్మీర్‌ను చూడాలని నేను కోరుకుంటున్నా’ అంటూ తన భావోద్వేగ లేఖను ముగించారు. చిన్నచిన్న కోరికలూ సుదూర స్వప్నాలే.. ‘భర్తతో సరదాగా షికారు, కష్టసుఖాల్లో కలసిఉండటం వంటి చిన్నచిన్న కోరికలు సైతం పోలీస్ అధికారుల భార్యలకు సుదూర స్వప్నాలే. రాత్రి భర్త ఇంటికొస్తే కుటుంబమంతా కలసి భోంచేద్దామని ఎదురుచూస్తాం. కుటుంబంలో వేడుకలు, అంత్యక్రియలకు కలసి వెళ్లాలనుకుంటాం. పిల్లలతో కలసి షికారుకు వెళ్లాలనుకుంటా. కానీ వీటిలో ఏవీ నెరవేరవు. మా పిల్లలను ఒంటరిగా పెంచుతాం. మేం పచ్చి అబద్దాలకోరులం. మాలో చాలా మంది ‘నాన్న శనివారం ఇంటికొస్తారు’ ‘నాన్న పేరెంట్ మీటింగ్‌కు కచ్చితంగా వస్తారు’ ‘మనం ఈవారం నాన్నతో కలసి పిక్నిక్కు పోదాం’, ‘పండుగకు నాన్న ఇంటికొస్తానన్నారు’ అంటూ మా పిల్లలకు అబద్ధాలు చెబుతూనే ఉంటాం. అనారోగ్యంతో బాధపడే మా అత్తమామలకు ‘మీ అబ్బాయి ఫలానా రోజు వస్తానన్నారు’ అంటూ అబద్ధాలు చెబుతాం. ఇలా అబద్ధాలు చెబుతూ మమ్మల్ని మేమే మోసం చేసుకుంటున్నాం’ -
కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో పాటు ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. పుల్వామాలోని ద్రబ్గమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘావర్గాల సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీస్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సంయుక్త బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అనంతరం తనిఖీలు చేపడుతున్న భద్రతాబలగాలపై ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన సమీర్ అహ్మద్‌భట్ అలియాస్ సమీర్ టైగర్, అక్విబ్ ముస్తఖ్లు చనిపోయారు. ఎన్కౌంటర్ జరుగుతుండగానే ఉగ్రవాదుల్ని తప్పించేందుకు పెద్దసంఖ్యలో అక్కడి చేరుకున్న స్థానిక యువత.. భద్రతాబలగాలపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ బుల్లెట్ తగిలి షాహీద్ అహ్మద్ దార్(25) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కశ్మీర్లో హిజ్బుల్‌కు రిక్రూటర్‌గా ఉన్న సమీర్ సోషల్‌మీడియా సాయంతో ఇప్పటివరకూ 80 మంది యువకుల్ని ఈ ఉగ్రసంస్థలో చేర్పించాడు. -
తీవ్రవాద సంస్థలోకి కశ్మీరీ యువత
శ్రీనగర్ : కశ్మీరీ యువతను ఆకర్షించడమే లక్ష్యంగా తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. గతంలో మన్వన్ వనీ అనే పీహెచ్డీ విద్యార్థి ఈ సంస్థలో చేరాడు. తాజాగా కుప్వారాకు చెందిన బిలాల్ అహ్మద్ షా అనే 27 ఏళ్ల యువకుడు హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరినట్లు ప్రకటించాడు. చేతిలో తుపాకీ పట్టుకుని తీవ్రవాద సంస్థ యూనిఫామ్ ధరించిన బిలాల్ ఫోటో షాబాజ్ అనే మారు పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరిగి రావాలంటూ అభ్యర్థన.. మార్చి 2న లడఖ్ వెళ్తున్నట్లుగా సోదరునితో చెప్పిన బిలాల్ ఇంటి నుంచి బయలుదేరాడు. ఆనాటి నుంచి అతని గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ తుపాకీ పట్టుకున్న నా సోదరుని ఫోటో చూస్తే ఆందోళన కలుగుతోంది. మా మాట విని ఇంటికి తిరిగి రా. చిన్ననాడే నాన్నను మనకు దూరం చేసిన అదే మార్గంలోకి వెళ్లి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ’ బిలాల్ సోదరి షకీనా అక్తర్ పలు న్యూస్ ఏజెన్సీల ద్వారా అభ్యర్థిస్తోంది. కాగా బిలాల్ తండ్రి షంషుద్దీన్‌కు కూడా తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉండేవి. 1992లో భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో అతను మృతి చెందాడు. మూడేళ్లలో 280 మంది.. గతంలోనూ ఉత్తర కశ్మీర్ నుంచి ఎంతో మంది యువకులు హిజ్బుల్‌లో చేరారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత మూడేళ్ల కాలంలో 280 మంది యువకులు మిలిటెంట్ గ్రూపులో చేరారు. అందులో 126 మంది గతేడాది వివిధ ర్యాంకులు కూడా పొందారు. 2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన బుర్హన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం ఆ సంస్థలో చేరుతున్న కశ్మీరీ యువత సంఖ్య క్రమంగా పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
అట్టుడుకుతోన్న కశ్మీర్ లోయ..
-
అట్టుడుకుతోన్న కశ్మీర్ లోయ..
శ్రీనగర్: ఆందోళనకారుల రాళ్ల దాడి, పోలీసుల కాల్పులతో కశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ కు నిరసనగా లోయలోని కుల్గాం, అనంత్ నాగ్, బారాముల్లా జిల్లాల్లో జరుగుతోన్న ఆందోళనలు హింసాయుతంగా మారాయి. ఆందోళనకారులు పోలీస్, ఆర్మీ చెక్ పోస్టులపై రాళ్లు రువ్వారు. కుల్గాం లోని బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. నిరసనకారుల్ని అదుపుచేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించారు. రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు సహా 11 మంది గాయపడ్డారు. (చదవండి: ఈ టెర్రరిస్టు ఒక్కరిని కూడా చంపలేదు!) అనంతనాగ్ జిల్లాలోని బందిపోరా, ఖాజిగుండ్, లర్నోలో, కుల్గాం జిల్లాలోని మీర్ బజార్, దమ్హాల్ ప్రాంతాల్లో, అనంత్ నాగ్ జిల్లాలోని వార్పోరాలో ఆందోళనకారుల ఉధృతి తీవ్రంగా ఉందని, దక్షిణ కశ్మీర్ లోని ఓ మైనారిటీల నివాస సముదాయం వద్ద పహారా కాస్తున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని పోలీస్ అధికారులు చెప్పారు. (చదవండి: అమర్ నాథ్ యాత్ర నిలిపివేత) బుర్హాన్ ఎన్ కౌంటర్ నిరసనల వేడి శ్రీనగర్ ను కూడా రగిలిస్తుండటంతో అధికారులు అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అమర్ నాథ్ యాత్ర ఆసాంతం కశ్మీర్ లోయ గుండా సాగాల్సిఉండగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సీఆర్ఫీఎప్ డీజీ దుర్గా ప్రసాద్ తెలిపారు. మరోవైపు అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.