hordes
-
జగిత్యాల: పేరుకే పంచాయతీలు..!
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల): నిధులు లేక పంచాయతీలు నీరసించిపోతున్నాయి. తండాల నుంచి పంచాయతీలుగా మారినా.. అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. పంచాయతీలుగా గుర్తించి ఆర్నెళ్లయినా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదంటే అతిశయోక్తికాదు. పంచాయతీల్లో పారిశుధ్యం పడకేసింది. ప్రత్యేక అధికారులకు పాలనపగ్గాలు అందించడం.. అదనపు బాధ్యతలతో వారు సరిగా విధులు నిర్వర్తించకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. 500 జనాభా దాటిన తండాలను చాయతీలుగా చేస్తామని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల ప్రస్తుతం ఉన్న పంచాయతీలు గిరిజన తండాలకు, గిరిజనేతర శివారు గ్రామాలకు దూరంగా ఉండి, తక్కువ జనాభా కలిగి ఉన్నా అట్టి తండాలను, శివారు గ్రామాలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ప్రకటించి, రాష్ట్ర అవతరణ రోజైన జూన్ రెండు నుంచి తండాల్లో ప్రత్యేక పంచాయతీల పాలన ఆరంభించింది. పంచాయతీలు 21 జిల్లాలో మొత్తం 380 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జూన్ 2న జిల్లాలో గిరిజన, గిరజనేతర జనాభా ప్రాతిపదికన కొత్తగా 60 గ్రామపంచాయతీలను ఏర్పాటుచేశారు. గతంలోనే రాయికల్ మండలం జగన్నాథపూర్ గిరిజన గ్రామపంచాయతీగా ఉండగా.. కొత్తగా 20 తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించగా..ఇక్కడ 100 శాతం గిరిజనులే ఉన్నారు. మండలాల వారీగా గిరిజన గ్రామపంచాయతీలు సారంగాపూర్ మండలంలో భీంరెడ్డిగూడెం, ధర్మనాయక్తండా, మ్యాడారం తండా, లచ్చనాయక్‌తండా, నాయికపుగూడెం బీర్పూర్ మండలంలో చిన్నకొల్వాయి, చిత్రవేణిగూడెం, కందెనకుంట, రాయికల్ మండలం అలియనాయక్తండా, జగన్నాథపూర్, కైరిగూడెం, మంత్యనాయక్తండా, లొక్యనాయక్తండా, వాల్మీకితండా, మల్లాపూర్ మండలంలో ఓబులాపూర్ తండా, వాల్గొండతం డా, మెట్పల్లి మండలంలో ఏఎస్ఆర్ తండా, కేసీఆర్ తండా, పటిమిడి తండా, ఇబ్రహీంపట్నంలో తిమ్మాపూర్ తండా, కథలాపూర్‌లో రాజారంతండాలు కొడిమ్యాల మండలంలో గంగారాంతండా గిరిజన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. నెలలు గడుస్తున్నా అభివృద్ధి లేదు గ్రామపంచాయతీలు ఏర్పాటు జరిగినా తండా పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మినహాయించి ప్రభుత్వం నుంచి ఇతర అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలే దు. దీంతో పంచాయతీల ఏర్పాటు ద్వారా పెద్దగా ఒరిగిన ప్రయోజనం ఏమిలేదని గిరిజనులు పేర్కొంటున్నారు. జూన్ 2న పంచాయతీలను ఏర్పాటు చేసిన సమయంలో పంచాయతీ కార్యాలయాల కోసం తాత్కాలికంగా అందుబాటులో ఉన్న కమ్యూనిటీ భవనాలు, పాఠశాల భవనాలు, కొన్ని గ్రామాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుని పంచా యతీ కార్యాలయాలను ప్రారంభించారు. పంచా యతీలు ఏర్పాటు జరిగినా, ఇప్పటి వరకు ఆయా పంచాయతీ కార్యాలయాల్లో సరిౖయెన ఫర్నిచర్ కూడా అందుబాటులో లేదు. కొత్తగా నిధులు లేవు గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి జనాభా ప్రాతిపదికన వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం విభజించి ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో పంచాయతీ ప్రత్యేకాధికారి, ఇన్చార్జి కార్యదర్శి పేరును జమ చేశారు. ఈ నిధులను తండాలోని వీధిదీపాల ఏర్పా టు, బావుల్లో క్లోరినేషన్ నిర్వహించడంతోపాటు, మురికి కాల్వలను శుభ్రం చేయడానికి వినియోగించారు. ఇతరనిధులు మంజూరు కాకపోవడంతో గ్రామాల్లో కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టలేదు. అధికారుల హాజరు చుట్టచూపే ప్రత్యేకాధికారులు వారికి కేటాయించిన గ్రామాలకు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారే తప్ప, గిరి జనులతో ఎలాంటి ప్రత్యేక సమావేశాలు జరప డం లేదని సమాచారం. చుట్టపుచూపుగా గ్రామాలకు వస్తున్నారని, తండాల్లోని సమస్యలపై చర్చలు నిర్వహించడం లేదని పేర్కొంటున్నారు. -
ఆడజన్మకు ఎన్ని శాపాలో..?
► తండాల్లో కొనసాగుతున్న భ్రూణ హత్యలు ► పేదరికంతో శిశువులను అమ్ముకుంటున్న గిరిజనులు మంచాల: ఓ వైపు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ... తమదైన ముద్ర వేస్తున్నారు. పురుషులకు దీటుగా ఏమాత్రం తీసిపోకుండా విద్య, వైద్యం వంటి ఉన్నత రంగాల్లో ముందుంటున్నారు. అయినా ఆడపిల్లల పట్ల వివక్ష మాత్రం తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల సంరక్షణ విషయంలో అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుంది. అయినా నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట ఆడపిల్లలు భ్రూణ హత్యలు, శిశు విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. మాతా–శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా మార్పు మాత్రం ఆశించిన్నంతగా రావడం లేదు. అందుకు నిదర్శనం మంచాల మండలంలోని లోయపల్లి అనుబంధ గ్రామాలైన ఆంబోత్ తండా, సత్తి తండా, గిరిజన తండాలు. మంచాల మండలం పూర్తిగా వెనుకబడి ప్రాంతం. గిరిజన తండాలు కూడా అధికంగా ఉన్నాయి. మంచాల మండల వ్యాప్తంగా తొమ్మిదేళ్ల కాలంలో ఐదు కేసులు నమోదు కాగా, కేవలం ఒక ఆంబోత్ తండాలో మాత్రం శిశు విక్రయాలకు సంబంధించి ఏడు కేసులు నమోదయ్యాయి. అనేక మంది ఆడ పిల్లలను శిశు విహార్‌కు తరలించడం జరిగింది. ప్రధానంగా మంచాల మండలంలో గిరిజన గ్రామాల్లోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయి. చెన్నారెడ్డి గూడ గ్రామంలో రెండు, బోడకొండ గ్రామంలో రెండు, ఎల్లమ్మ తండా, బండలేమూర్ గ్రామంలో ఒకటి చొప్పున జరిగాయి. ఆంబోత్ తండాలో.... మంచాల మండలంలో లోయపల్లి అనుబంధ గ్రామం ఆంబోత్ తండా. ఈ తండాలో 1260 మంది జనాభా ఉంది. 258 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 240 కుటుంబాలు ఎస్టీ వర్గానికి చెందినవారు. మరో 18 బీసీ కుటుంబాలు ఉన్నాయి. ఈ తండాలోనే అధికంగా శిశు విక్రయాలు, భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. చాలామంది పేదరికం పేరుతో ఆడపిల్లలపై వివక్షతో సాకలేమని ఐసీడీయస్ అధికారులకు అప్పగిస్తున్నారు. 8) 2016 డిసెంబర్ 5న ( సూజాత–సేవ దంపతులు) మూడో సంతానం ఆడపిల్ల పుట్టిందని మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. తాజాగా సత్తి తండాలో వనిత– జవహర్ అనే దంపతులు ఇబ్రహీం పట్నంలో ఓ ప్రైవేట్ వైద్యశాల నిర్వాహకుల సహాయంతో మరో ఆడపిల్లను విక్రయించడం జరిగింది. ఇలా వెలుగుచూసిన కేసులు కొన్నే. అయితే గుట్టుచప్పుడు గాకుండా, వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. ఈ తండాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి మహిళలు ముందుకు రావడం లేదు. తండాలో 25 నుండి 30 మంది మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు. గిరిజన తండాల్లో ఆడ పిల్లలపై వివక్ష చూపిస్తున్నారు. ఐసీడీయస్ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా మార్పు రావడం లేదు. ఆడపిల్లలపై వివక్ష రూపు మాపాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి సృష్టికి మూలమైన ఆడపిల్లలు వివక్షతకు, భ్రూణ హత్యలు, శిశు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆడపిల్లల విక్రయాలు 1) 2007 నవంబర్ నెలలో (లలిత– లక్కు దంపతులు) 2) 2008 జూలై 4న (రంగలి– తావు దంపతులు) 3) 2010మే 14న (బిచ్చి–బాలు దంపతులు) 4) 2015 మార్చి 10న (మాధవి– శంకర్ దంపతులు) 5) 2015 ఏప్రిల్ 6న (సంధ్య –లచ్చిరాం దంపతులు) 6) 2015 ఏప్రిల్ 13న (అనిత– రవి దంపతులు) 7) 2015 జూన్ 4న (సునీత– భాస్కర్ దంపతులు ) -
కాలిఫోర్నియా బీచ్ లో 'రెడ్ కార్పెట్'
కాలిఫోర్నియాః అక్కడి తీర ప్రాంతాలు ఇప్పుడు సందర్శకులకు, పర్యటకులకు రెడ్ కార్పెట్ తో భయాన్ని గొల్పుతున్నాయి. రెడ్ కార్పెట్ అంటే సాదర స్వాగతం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నీటిలో కాలుష్య ప్రభావమో.. వాతావరణ ప్రతికూల పరిస్థితులో కానీ జలచరాలు కుప్పలు తెప్పలుగా ఒడ్డుకు చేరుకుంటుండటంతో ఎర్రని ట్యూనా పీతలతో నిండిన తీరం రెడ్ కార్పెట్ ను తలపిస్తోంది. వేలకు వేలుగా ఎర్ర పీతలు దక్షిణ కాలిఫోర్నియా బీచుల్లో చేరడం న్యూ పోర్ట్ బీచ్ సందర్శకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరుదుగా కనిపించే ఆ దృశ్యాన్ని కొందరు వింతగా చూస్తుంటే... అక్కడి మునిసిపల్ సిబ్బంది మాత్రం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయలేక తీవ్ర కష్టాలు పడుతున్నారు. కొన్నేళ్ళ క్రితం ఇలాగే సుమారు మూడు అంగుళాల పొడవైన ఎర్ర పీతలు కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీ ప్రాంతాన్ని ముంచెత్తాయి. అయితే కొందరి కష్టం మరి కొందరికి ఆనందం అన్నట్టు.. శాండియాగోకి దగ్గరలో ఉన్న ఇంపీరియల్ బీచ్ లో పక్షుల ఆనందం మాత్రం పట్టలేకుండా ఉంది. ఓ స్పెషల్ బఫెట్ ను వాటి ముందు పెట్టినట్లు బీచ్ ఒడ్డుకు చేరిన పీతలను తినేందుకు ఉత్సాహంగా పక్షులు అక్కడికి చేరుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి చేరిన పీతలను అక్కడే వదిలేయాలా, తిరిగి సముద్రంలోకి పంపించాలా అన్న విషయంపై అధికారులు తలమునకలౌతున్నారు. గత 15 సంవత్సరాలనుంచి ఇలా ఎర్ర పీతలు సముద్ర తీరాల్లోకి కొట్టుకు వస్తున్నట్లు పురపాలక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క క్రితం సంవత్సరంలోనే బాల్బోవా ఐస్ ల్యాండ్, చైనా కోవ్ ప్రాంతాల్లో కార్మికులు, స్వచ్ఛంద సభ్యులు కలసి ఎనిమిది టన్నుల దాకా ఒడ్డుకు చేరిన పీతలను పట్టుకొన్నట్లు లాస్ ఏంజిల్స్ దగ్గరలోని ఆరెంజ్ కౌంటీ న్యూపోర్ట్ నగరం చెప్తోంది. ఇలా నీటినుంచి జలచరాలు బయటకు వచ్చేయడానికి తీవ్ర వాతావరణ మార్పులే కారణమని సైంటిస్టులు చెప్తున్నారు. -
తండా నుంచి వండర్
తల్లిదండ్రులు నిరక్షరాస్యులు... నివసించేది మారుమూల తండా.. కుటుంబంలో తనతో పాటు తన కంటే పెద్దవారైన ముగ్గురిని చదివించడానికి వారు పడిన కష్టాన్ని చూశాడు. అన్నం పెట్టే సాగుభూమిని అమ్ముతున్న కన్నవారి ఆవేదనను గమనించాడు. మళ్లీ తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే తాను బాగా చదువుకుని ఉన్నత స్థారుుకి ఎదగాలని అప్పట్లోనే నిర్ణరుుంచుకున్నాడు. అంతటితోనే వదిలివేయకుండా కష్టపడి చదివాడు. మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్న ఆయన.. ఎన్నో లక్షల మంది కలలు కనే సివిల్ సర్వీస్‌పై దృష్టిపెట్టాడు. మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపికయ్యూడు. తద్వారా తల్లిదండ్రులతో పాటు తండాకు పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చాడు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఐజీ స్థాయిలో పనిచేస్తున్నాడు. ఉన్నత చదువుల ద్వారా వ్యక్తికి గుర్తింపు రావడమే కాకుండా.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పెరిగిన ప్రాంతానికి గుర్తింపు లభిస్తుందనేది అందరికీ తెలిసిందే. ఈ విషయూన్ని చిన్నతనంలోనే ఆ వ్యక్తి గుర్తించారు. ఇంకేం.. చదువులో ఎక్కడా వెనుకబడలేదు. ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగినా ప్రతిష్టాత్మక కాన్పూర్ ఐఐటీలో బీటెక్ సీటు సాధించాడు. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసినప్పటికీ సివిల్స్‌పై మక్కువతో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించాడు. ఇవన్నీ ఏదో నగరం, పట్టణ ప్రాంతానికి చెందిన వ్యక్తి వివరాలు కాదు... డోర్నకల్ నియోజకవర్గం ఉయ్యూలవాడ గ్రామపంచాయతీ పరిధిలోని చాప్లాతండాకు చెందిన గుగులోతు లక్ష్మణ్ స్ఫూర్తిదాయక విశేషాలివి. - డోర్నకల్ చదువులో ఫస్ట్ లక్ష్మణ్ లక్ష్మణ్ చిన్ననాటి నుండే చదువుల్లో విశేషంగా రాణించేవాడు. ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు డోర్నకల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన లక్ష్మణ్ ఆరు నుండి పదో తరగతి వరకు కల్లూరులోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో, ఇంటర్ నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత బీటెక్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) కాన్పూర్ ఐఐటీలో, ఉస్మానియా యునివర్సిటీలో ఎంబీఏ చదివారు. అరుుతే, సివిల్స్‌కు ఎంపికై ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా లక్ష్మణ్ చదువు కొనసాగించారు. ప్రతిష్టాత్మక బెంగళూరులోని ఐఐఎంలో ఎంబీఏ పీజీపీఎం చదివిన ఆయన పబ్లిక్ సర్వీస్‌కు చెందిన ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ కోర్సును అమెరికాలోని మోడల్ విత్ మాక్స్వెల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, సైరాకూర్ యునివర్సిటీలో పూర్తి చేశారు. కుటుంబమంతా విద్యావంతులే... గుగులోత్ గోల్యానాయక్, సాలమ్మ సంతానమంతా విద్యావంతులే. ఎలాంటి వసతులు లేని చాప్లాతండాలో వ్యవసాయం చేసుకుంటున్న గోల్యానాయక్ తన పిల్లలను పట్టుదలతో చదివించగా అందరూ ప్రయోజకులయ్యారు. గోల్యానాయక్కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమార్తె రంగమ్మ ఏడో తరగతి వరకు చదవగా అదే తండాకు చెందిన పాండునాయక్‌తో వివాహం జరిగింది. రంగమ్మ గతంలో ఉయ్యాలవాడ సర్పంచ్‌గా, డోర్నకల్ ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేయగా, ప్రస్తుతం డోర్నకల్ పీఏసీఎస్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె కొర్ర చుక్కమ్మ హైదరాబాద్‌లో ఎల్ఐసీ అధికారిగా, మూడో కుమార్తె భూక్యా సత్యమ్మ ట్రాన్స్‌కో డీఈగా పని చేస్తున్నారు. నాలుగో సంతానమైన లక్ష్మణ్ ఐపీఎస్‌కు ఎంపిక కాగా, చిన్నకుమారుడు రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. డోర్నకల్ మండలం ఉయ్యలవాడ గ్రామపంచాయతీ పరిధిలోని చాప్లాతండాకు చెందిన గుగులోత్ గోల్యానాయక్, సాలమ్మకు ఐదుగురు సంతానం. వీరిలో నాలుగో సంతానం, కుమారుల్లో మొదటి వాడైన లక్ష్మణ్ ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ)గా విధులు నిర్వహిస్తున్నారు. 19ఏళ్ల క్రితం 1997లో సివిల్స్ రాసిన ఆయన మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపిక కాగా, కేరళ కేడర్‌కు నియమించారు. కేరళ రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందిన లక్ష్మణ్ పోలీస్ శాఖలో వివిధ స్థాయిలో పనిచేసి ప్రస్తుతం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) స్థాయిలో.. ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ట్రావెన్కోర్ సిమెంట్స్ లిమిటెడ్(టీసీఎల్) ఎండీగా పని చేస్తున్నారు. లక్ష్మణ్ తల్లిదండ్రులు గోల్యానాయక్, సాలమ్మతోపాటు పెద్ద సోదరి బానోత్ రంగమ్మ, బావ పాండూనాయక్ ప్రస్తుతం చాప్లాతండాలోనే ఉంటున్నారు. తీరిక వేళల్లో చాప్లాతండాకు వచ్చి తల్లిదండ్రులు, తండావాసులను కలిసే లక్ష్మణ్... మాజీ పోలీసు అధికారి డీటీ.నాయక్ కుమార్తె, వైద్యురాలు కవితను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఇప్పటి వరకు పనిచేసిన హోదాలు {పస్తుతం కేరళ రాష్ట్రంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) హోదాలో ట్రావెన్కోర్ సిమెంట్స్ లిమిటెడ్(టీసీఎల్) మేనేజింగ్ డెరైక్టర్‌గా పని చేస్తున్న గుగులోతు లక్ష్మణ్ గతంలో అనేక హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. వాటి వివరాలు... అలెప్పుజా, అలువా, మలప్పురం, కోజికోడ్‌లో ఏఎఎస్పీగా.. మలప్పురం జిల్లాలో జారుుంట్ ఎస్పీగా.. {తివేంద్రం జిల్లాలో రూరల్ ఎస్పీ(లా అండ్ ఆర్డర్)గా.. {తివేంద్రం ఎస్ఏపీ బెటాలియన్ కమాండెంట్‌గా.. {తివేంద్రంలోని కేరళ పోలీసు కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ హెడ్‌గా.. కేరళ పోలీసు టెలీ కమ్యునికేషన్స్ ఇన్చార్జి హెడ్‌గా.. తిరువనంతపురంలోని రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఏఐజీ(అడ్మినిస్టేషన్)గా.. హైదరాబాద్ బీసీఆర్(డీఆర్సీ), అడ్మినిస్ట్రేషన్, ఎస్టేట్, హెచ్ఆర్(ఐఆర్), డీఐఎస్(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టర్ సర్వీసెస్) అండ్ సెక్యూరిటీ ఎట్ బీఎస్ఈ హెడ్‌గా.. బీఎస్ఈ, ఎస్ఎంఈ సీఈఓగా.. తిరువనంతపురంలోని మత్స్య ఫెడ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా.. కొచ్చిలోని కౌన్సిల్ ఫర్ ఫుడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(సీఎఫ్ఆర్డీ) సీఈఓగా.. కేరళ రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ సప్లై కో మేనేజింగ్ డెరైక్టర్‌గా.. చదువును నిర్లక్ష్యం చేయవద్దు. యువతీ, యువకులు చదువులను నిర్లక్ష్యం చేయవద్దు. చదువుల్లో రాణిస్తే ఏ స్థాయికైనా ఎదగవచ్చు. కష్టపడి చదవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. విద్యార్థి దశలో కష్టపడి చదివితే భవిష్యత్ మొత్తం అందంగా ఉంటుందనే విషయూన్ని గుర్తించారు. చదువుకుని ఉన్నత స్థారుుకి ఎదిగిన వారికి సమాజం, కుటుంబం, బంధువుల్లో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. చదువు విలువ తెలుసు కాబట్టే నేను ఐపీఎస్‌కు ఎంపికయ్యూక కూడా పలు కోర్సులు పూర్తి చేశాను . - గుగులోత్ లక్ష్మణ్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేరళ కేరళ ఐజీగా చాప్లా తండా వాసి {sావెన్కోర్ సిమెంట్స్ లిమిటెడ్ (టీసీఎల్) ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మణ్ మొదటి నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే విద్యాభ్యాసం ఐపీఎస్‌కు ఎంపికయ్యూక కూడాచదువు కొనసాగింపుఐఐఎంలో ఎంబీఏ, అమెరికాలో ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ కోర్సు -
‘ఫిట్స్’తో గజగజ..
కౌడిపల్లి: మెదక్ జిల్లాలోని రెండు గ్రామాలు, ఓ తండా ఫిట్స్‌తో గజగజలాడుతున్నాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో వణికించిన ఈ జబ్బు తిరిగి అలజడి రేపుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కౌడిపల్లి మండలంలోని భుజిరంపేట, వెంకటాపూర్‌లతో పాటు మరో తండాలో ఫిట్స్‌తో గత 15 రోజుల్లో 40 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు. గతేడాది ఇదే రోజుల్లో.. గతేడాది ఇవే గ్రామాల్లో పలువురికి ఫిట్స్ వచ్చాయి. అప్పటి కంటే ఇప్పుడు తీవ్రత ఎక్కువగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం ఉన్నట్టుండి కళ్లు తిరుగుతున్నాయంటూ, మైకం కమ్మి కిందపడిపోతున్నారు. గాయాలకు గురవుతున్నా తెలియనంతగా సొమ్మసిల్లిపోతున్నారు. 20 నిమిషాల నుంచి అరగంట వరకు ఏమీ గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితికి గురవుతున్న వారి ప్రవర్తనను బట్టి ఫిట్స్‌గా భావించి పక్కనున్న వారు బాధితుల చేతిలో తాళాలు పెట్టడం, నుదుటపై వేలితో ఒత్తడం వంటివి చేస్తున్నారు. ఫిట్స్‌తోనే మృతి చెందాడు! వెంకటాపూర్‌కి చెందిన ఒడిగంటి భిక్షపతి (42) గత సోమవారం తన పొలంలో గడ్డి కోయడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా నీటికుంటలో బోర్లాపడిఉన్నాడు. ఫిట్స్ రావడంతోనే కుంటలో పడి మృతిచెందాడని గ్రామస్తులు అంటున్నారు. తనకు అనారోగ్యమంటే తెలియదని, కానీ నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి కిందపడిపోయానని, అరగంట తరువాత కోలుకున్నానని వెంకటాపూర్‌కి చెందిన పుట్టి వెంకటేశం తన అనుభవాన్ని చెప్పాడు. ఎంపీపీ చిలుముల పద్మ నరసింహారెడ్డి భుజిరంపేట, వెంకటాపూర్ గ్రామాల్లో బాధితుల్ని గురువారం కౌడిపల్లి పీహెచ్‌సీకి తరలించారు. సమస్యను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు ఎంపీపీ తెలిపారు. 2 గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆందోళన వద్దు..వైద్యపరీక్షలు నిర్వహిస్తాం భుజిరంపేట, వెంకటాపూర్‌లలో పలువురు ఫిట్స్‌కు గురవుతున్న మాట వాస్తవమేనని, అయితే ఆందోళన అవసరం లేదని డీఎంఅండ్‌హెచ్‌ఓ బాలాజీపవార్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన కౌడిపల్లి పీహెచ్‌సీని సందర్శించారు. ఫిట్స్‌తో అస్వస్థతకు గురైన వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. -
మృత్యు తాండవం
ఈ తండాల మట్టి తీసుకెళ్లి రోడ్డు వేశారు. ఇప్పుడు ఆ తండాల్లో మట్టి మిగల్లేదు.. అవును.. ఆ రోడ్డు మట్టినంతా మింగేసింది. మనిషిని ఖననం చేసేటంత మట్టిని కూడా మిగల్చలేదు... నిజానికి హైవే అన్నది ప్రగతికి పునాది కావాలి... కాని పెద్దకుంట, ధన్సింగ్ తండాలకు అది సమాధి అయింది హైవేల మీద తరచుగా సైన్‌బోర్డులు చూస్తూ ఉంటాం.. అతి వేగం ప్రాణాంతకం.. వేగం కన్నా ప్రాణం మిన్న.. అని! ఇది నడిపేవారికి హెచ్చరిక... కానీ ఇక్కడ అది నడిచేవారికి మరణశాసనం అవుతోంది! మృత్యు‘తాండ’వం అవుతోంది. ఈ చావు లెక్కలకు ఆ హైవే దేశంలోనే అతిపెద్ద మైలురాయిగా నిలుస్తోంది... అది ఊరు కాదు. వల్లకాడు. ఇది ఆగ్రహం కాదు. వాస్తవం. ఊరు ఊరంతా నెత్తుటి ప్రవాహమే అయితే, చిన్నా పెద్దా అందరినీ మృత్యువు కాటేస్తే చివరకు ఊరే వల్లకాడవుతుంది. ఒక్కో యింట్లో ఇద్దరూ, ముగ్గురూ... నలుగురూ... అక్కడ చనిపోయిన వారిని పూడ్చిపెట్టేందుకు అటు ఆరు, ఇటు మూడడుగుల జాగా కూడా మిగల్లేదు. కానీ అక్కడ ఇళ్ళన్నీ మనుషుల్ని కోల్పోయి మట్టిదిబ్బలుగా మారాయి. ఇళ్లకు తాళాలు తప్ప మానవ సంచారం కనిపించదు. బిడ్డల పొట్టనింపేందుకు భర్తల శరీరాలను ఛిద్రం చేసిన నెత్తుటి రహదారిపైనే స్త్రీలు తమ శరీరాలను అమ్మకానికి పెడుతున్నారు. ఇదంతా ఎక్కడో కాదు హైదరాబాద్‌కి కూతవేటు దూరంలోని మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కి దగ్గరలోని కొత్తూరు మండలం హైవే పక్కనే వున్న పెద్దకుంట తండా, ధన్సింగ్ తండాల పరిస్థితి. ఆ తండాలకు వెళితే వృద్ధులు, స్త్రీలు తప్ప పురుషులు కనిపించరు. వాళ్ళంతా ఒకే చోట, జాతీయ రహదారిని దాటుతుండగా యాక్సిడెంట్లో చనిపోయినవారే. సహజంగా రహదారుల్లో జరిగే ప్రమాదాలను నివారించడం కష్టమే కావచ్చు. కానీ ఒకే ప్రదేశంలో, ఒకే తండాకి చెందిన వారు పదే పదే యాక్సిడెంట్లో చనిపోతున్నారంటే దానర్థం ఎక్కడో పొరపాటు జరుగుతున్నట్టే. ఆ నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు. మానని గాయాలు శాంతికి నలుగురు కొడుకులు. పదేళ్ల క్రితం పెద్ద కొడుకు మల్లేష్, ఆ తర్వాత మూడేళ్లకు రెండోవాడు రవి, మిగిలిన ఇద్దరు కొడుకులు శంకర్, గోపాల్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ బాధతోనే భర్త పోయాడు. జబ్బుతో శాంతి కాళ్ళు చచ్చుబడిపోయాయి. నడవలేదు, నించోలేదు. ఇంత ముద్దపెట్టే దిక్కులేక జీవచ్ఛవంలా బతుకీడుస్తోంది. పదహారేళ్ల శారద భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటికే ఆమెకు ఓ కొడుకు. మామ పంచన బతుకుతోంది. ఆర్నెల్ల క్రితం మామ కిషన్‌కి కూడా యాక్సిడెంట్ అయ్యింది. అతనిప్పుడు నడవలేడు. గాయాలకు మందులేక ఇంకా రక్తమోడుతూనే వున్నాయి. రేషన్‌కార్డు కూడా లేకుండా బతికేదెలా ప్రశ్నిస్తోంది శారద, తన జీవితంలోని విషాదానికి కారకులెవరో తెలియక. ఇదే తండాకు చెందిన కొర్ర నేజి అనే మహిళ భర్త, అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ బాధ భరించలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరిగా ఇంట్లో ఉండే ధైర్యం చేయలేక రెండిళ్ళకి తాళాలు వేసి, భర్త చనిపోయిన హస్లి అనే ఆమె దగ్గర ఉంటోంది. ‘చిన్నపిల్లలున్నారు... రేషన్ కార్డయినా యిప్పించండం’టూ వేడుకుంటోంది. ఎందుకీ విషాదం... ధన్సింగ్, పెద్దకుంట తండాల నుంచి ఏ పనికి బయటకు వెళ్ళాలన్నా రహదారిని దాటాల్సిందే. అక్కడ ఎటువంటి ప్రమాద హెచ్చరికలు ఉండవు. సాయంత్రం అయ్యిందంటే చీకట్లో మలుపు అసలే కనిపించదు. 140, 120 స్పీడుతో వెళ్ళే వాహనదారులకు రోడ్డుదాటుతున్న వారు దగ్గరకొచ్చేంత వరకు కనిపించరు. పొలాల్లోనుంచి జనం పూర్తిగా రోడ్డుపైకి వచ్చే వరకు ఎత్తై రహదారిపైన ఏ వాహనాలొస్తున్నాయో కనిపించదు. నెత్తుటి దారిలోనే చిన్నారుల పాదముద్రలు... పనికే కాదు, పాఠశాలకు వెళ్ళాలన్నా రక్తసిక్తమైన రహదారులను దాటుకుంటూ భయం భయంగా వెళ్ళాల్సిందే. ప్రైమరీ స్కూల్లో చదువు అయిపోయాక ఆ చిన్నారులను హైస్కూల్‌కి పంపాలంటే ఆ దారి తప్ప వేరే దారి లేదు. చిన్నారులకు ఏ రోజు ఏం జరుగుతుందోనని ఆ తండాల జనం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. అందుకే పిల్లలు బడికి దూరంగా తండాల్లోనే ఉంటున్నారు. ఏం జరుగుతోంది? హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు మండలంలో జరిగిన యాక్సిడెంట్లను పరిశీలిస్తే... 2010లో 41 మంది, 2011లో 39 మంది, 2012లో 39 మంది, 2013లో 47 మంది, 2014లో 61 మంది చనిపోయారు. 2015 జనవరి నుంచి ఈనెల 30 వరకు ఈ మండలంలో జరిగిన యాక్సిడెంట్లు 30, ఇందులో 19 మంది మరణిస్తే, 20 మంది క్షతగాత్రులయ్యారు. అయితే పైన వివరించిన లెక్కల్లో అత్యధిక శాతం పెద్దకుంట తండా, ధన్ సింగ్తండాకి చెందిన వారేనన్నది లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ కేవలం ప్రభుత్వం చెబుతున్నవి. పోలీస్ రికార్డుల్లోకి ఎక్కని యాక్సిడెంట్లెన్నో చెప్పడం కష్టం. గత్యంతరం లేక... ఇంటి పెద్ద దిక్కు చనిపోతే, గత్యంతరం లేక పడుపువృత్తిలోకి దిగుతున్నారు ఇక్కడి స్త్రీలు. ఒక్కో ఇంట్లో ముగ్గురు పిల్లలు ముసలి వాళ్ళూ కలుపుకొని ఐదారుగురు వుంటే వాళ్ళకిస్తోంది 12 కేజీల రేషన్ బియ్యం. ‘ఎలా సరిపోతాయ’ని ప్రశ్నిస్తున్నారు. పడుపు వృత్తిని ఎంచుకున్న వీరి జీవితంలో భద్రత గాలిలో దీపమే. ఎలాంటి రక్షణా లేని వారి జీవితాలలో పొంచి వున్నది పెనుభూతమే. హెచ్.ఐ.వి లాంటి వ్యాధుల నిర్ధారణ కోసం చేసే వైద్యపరీక్షలేవీ వీరికి జరపకపోవడం విచారకరం. ప్రమాదాలను నివారించాలి... తండాల నుంచి నేరుగా హైవే పైకి ఎక్కకుండా లింక్ రోడ్డు వేయడం ద్వారా ప్రమాదాలు నివారించొచ్చు. రోడ్డు దాటే దగ్గర ప్రమాద హెచ్చరికలు, హైమాస్ట్ లైట్లు అమర్చాలి. స్టాపర్స్, సేఫ్టీ గార్డ్స్ పెట్టాలి. రహదారి మధ్యలో వున్న డివైడర్ పై చెట్లు లేకపోవడం వల్ల ఎదురెదురుగా వస్తున్న వాహనాల లైట్లు కళ్ళల్లో పడుతుంటాయి. యాక్సిడెంట్లకి మద్యం కూడా కారణమే. వీటికి తోడు జిల్లాలో ప్రత్యేకించి ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ లేదు. లా అండ్ ఆర్డర్ పోలీసులే ట్రాఫిక్‌నీ చూసుకోవాలి. దీనివల్ల ప్రత్యేకించి నిధులు కూడా జిల్లా పోలీసు యంత్రాంగానికి ఉండవు. ట్రాఫిక్ ఆంక్షలను అతిక్రమించినందుకు వసూలు చేసినదంతా ప్రభుత్వ ఖజానాకే పోతోంది. దీనివల్ల ఏ చర్యలు తీసుకోవాలన్నా జిల్లా అధికారులకు అవకాశం లేదన్నది కొందరి వాదన. టోల్ గేట్ లో హైదరాబాద్ నుంచి అడ్డాకుల వరకు 24 గంటల్లో 6 నుంచి 8 లక్షల పైచిలుకే ఆదాయం వస్తోంది. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు పెట్టాలని టోల్గేట్ యాజమాన్యానికీ. జాతీయ రహదారుల అధికారులకు ఎన్నో విజ్ఞాపనలు చేసారు. ఎవ్వరూ స్పందించలేదు. కనీసం హైమాస్ట్ లైట్లు కూడా పెట్టలేదు. - టి.జి.శ్రీనివాస్, లెక్చరర్ జాతీయ రహదారి నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రజలు ఆందోళనలు చేశారు. అనేక సందర్భాల్లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. టోల్ గేట్ యాజమాన్యాన్ని అడిగితే అది పంచాయితీ పరిధిలోనిదంటున్నారు. కానీ జాతీయ రహదారిపై భద్రతా చర్యలు చేపట్టే అధికారం మాకు లేదు. చేసేది లేక చేజేతులా ప్రమాదాలను ఆహ్వనిస్తున్నారు తండా ప్రజలు. - కొమ్ము క్రిష్ణ, నందిగామ గ్రామ సర్పంచ్ -
పల్లె పొమ్మంది.. వలస రమ్మంది!
బతుకుదెరువు కోసం గిరి‘జనం’ పట్నం బాటపట్టారు. మూణ్నెల్లుగా పనులు లేకపోవడం, జీవనం భారంగా మారడంతో వలసే శరణ్యమైంది. భర్త విడిచి వెళ్తున్న నవవధువు.. అమ్మకు దూరమవుతున్న కొడుకు.. పిల్లలను ఇంటివద్దే ఉంచి వెళ్తున్న తల్లి.. ఎవరిని తట్టినా కంటినిండా శోకం. ఆత్మీయులను విడిచి వెళ్తున్నామన్న దిగులును బిగపట్టి ఆ వలసకూలీలు బస్సులో ఎక్కారు. ఊరిని వదులుతున్నామన్న బాధ, వెళ్లకపోతే బతలేమన్న భయం.. వెరసి ఇష్టం లేకున్నా నవాబ్‌పేట మండలంలోని పలు గిరిజన తండాల నుంచి గురువారం ఇలా ముంబైకి పయనమయ్యారు. నవాబుపేట: ఈ ఏడాది జిల్లాలో ఆశించినస్థాయిలో వర్షాలు కురవలేదు. ఖరీఫ్ పంటలు అంతంత మాత్రంగానే చేతికొచ్చాయి. పత్తి, కంది తదితర పంటలు ఇప్పటికే పూర్తయ్యాయి. మూడునెలలుగా గ్రామాల్లో పనులు దొరకడం లేదు. వచ్చేది ఎండకాలం ఉండటంతో ఉపాధి దొరకదని భావించి మండలంలోని హజిలాపూర్ గ్రామ పంచాయతీ కుమ్మరిగడ్డ, పుణ్యనాయక్ తండాలకు చెందిన 10 గిరిజన కుటుంబాలు ముంబాయి బాట పట్టాయి. గురువారం మూటముళ్లె సర్దుకుని నవాబ్‌పేట నుంచి వలసవెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పనులు లేకపోవడంతోనే ముంబై వెళ్లాల్సి వస్తోందని పలువురు వలస కూలీలు వాపోయారు. నాలుగు పైసలు సంపాదించి మరో ఆర్నెళ్లకు వస్తామని సెలవిచ్చారు. -
రెండు జిల్లాల సరిహద్దున తండ్లాట !
ఖమ్మం.. వరంగల్ నడుమ లచ్యాతండా దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని గూడెం పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు మౌలిక వసతులు లేక అల్లాడుతున్న గిరిజనులు ఖమ్మం జిల్లాలో కలపాలని కోరుతున్న స్థానికులు అదో చిన్న తండా. రెండు జిల్లాల సరిహద్దులో ఉంది. సగం ఇళ్లు ఖమ్మం జిల్లా కామెపల్లి మండల పరిధిలో, మిగతా సగం ఇళ్లు డోర్నకల్ మండల పరిధిలో ఉండడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కనీస వసతులు కొరవడి గిరిజనం తండ్లాడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. డోర్నకల్- లింగాల ప్రధాన రహదారిలో రోడ్డుకు పావు కిలోమీటర్ దూరంలో ఉన్న లచ్యా తండా పరిస్థితి ఇది. డోర్నకల్ : లచ్యాతండా.. మొత్తం 400మంది జనాభాతో ఖమ్మం.. వరంగల్ జిల్లాల సరిహద్దున ఉన్న ఈ చిన్న తండా రెండుగా చీలిపోయింది. తండా మధ్యనుంచి వెళ్తున్న రహదారికి ఒకవైపున ఉన్న ఇళ్లన్నీ డోర్నకల్ మండల పరిధిలోకి, మరోవైపున ఉన్న ఇళ్లన్నీ ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పొన్నెకల్లు గ్రామ పరిధిలోకి వస్తాయి. మొత్తం 80కుటుంబాలు ఉన్న ఈ తండాలో 240మంది ఓటర్లున్నారు. డోర్నకల్-లింగాల ప్రధాన రహదారిలో రోడ్డుకు పావు కిలోమీటరు దూరంలో ఉన్న లచ్యాతండాలోని సగం ఇళ్లు డోర్నకల్ నాలుగో వార్డు పరిధిలో, అలాగే మూడవ మండల ప్రాదేశిక స్థానం పరిధిలో ఉన్నాయి. డోర్నకల్ మండలకేంద్రం నుంచి ఇది రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఖమ్మం జిల్లాలోని కామెపల్లి మండలకేంద్రం నుంచి 20కిలోమీటర్ల దూరంలో ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా.. నిర్లక్ష్యమే.. లచ్యాతండా ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలోనే ఉంది. రెండు జిల్లాల సరిహద్దులో ఉండడంతో ఏ జిల్లా అధికారులూ, ప్రజాప్రతినిధులూ పట్టించుకోవడం లేదు. తండాలో తాగునీరు, విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. రోడ్డుకు ఇరుపక్కల ఉన్న వాళ్లు గొడవలు పడితే ఇటుపక్క ఉన్నవారు డోర్నకల్‌లో, అటుపక్కన వారు కామెపల్లి మండలం తోడేళ్లగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తండాలోని ఇరుపక్కల ఉన్న చేతిపంపులు పనిచేయడం ఏనాడో మానివేశాయి. తండాలోని ఏకైక వీధిలో కొద్ది దూరం మాత్రం సిమెంటు రోడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో వర్షాకాలంలో తండావాసులు అనుభవిస్తున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. చిన్నపాటి వర్షానికే వీధంతా బురదమయమై మోకాలు లోతు వరకు భూమిలోకి కూరుకుపోతుందని తండావాసులు చెబుతున్నారు. తండాలో పాఠశాల లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు పొన్నెకల్లు, మరికొంతమంది డోర్నకల్‌లోని పాఠశాలలకు వెళ్తున్నారు. ఇరు జిల్లాల ప్రజాప్రతినిధులు తండాను గాలికొదిలేయడంతో కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. కామెపల్లి మండలం ఏజెన్సీ ప్రాతం కింద ఉన్నందున తండా మొత్తాన్ని కామెపల్లి మండలం కిందకు మార్చి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు. తాగునీటి సమస్య తీవ్రం డోర్నకల్ వైపు ఉన్న లచ్యాతండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎండాకాలంలో వ్యవసాయ బావుల్లోని నీరే ఆధారం. తండాలో వసతుల కల్పన కు అప్పుడప్పుడు అరకొరగా నిధులు కేటాయిస్తున్నా పెద్దగా ఉపయోగపడడం లేదు. - తేజావత్ బాలు, లచ్యాతండా, డోర్నకల్ మండలం తాతల కాలం నుంచీ ఇంతే.. మా తాతల కాలం నుంచీ తండా ఇలాగే ఉంది. మా తాత బోల్యా, తండ్రి పంతులు, నేను, నా కొడుకు రవి ఇక్కడే పుట్టాం. సమస్యలతో సర్దుకుపోతున్నాం. రెండు జిల్లాల వాళ్లు మా తండా అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. - భూక్యా రాములు లచ్యాతండా, కామెపల్లి మండలం ఖమ్మంలో కలిపితేనే మేలు ప్రస్తుతం మేమున్న వైపు తండా ఏజెన్సీ మండలమైన కామెపల్లి పరిధిలో ఉంది. కాబట్టి తండా మొత్తాన్ని కామెపల్లి మండలంలో కలిపితే కొంతమేలు జరిగే అవకాశం ఉంది. నేను డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాలేదు. తండాను కామెపల్లిలో కలిపితే కొందరికైనా మేలు జరుగుతుంది. - భూక్యా నరేష్ లచ్యాతండా, కామెపల్లి మండలం కరెంటు సక్రమంగా ఉండదు తండాలో ఎప్పుడూ కరెంటు సక్రమంగా ఉండదు. వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి బయటకు వెళ్లాలంటే భయమేస్తుంది. మారుమూలన ఉన్నందునే మా తండాను ఎవరూ పట్టించుకోవడం లేదు. - భూక్యా పద్మ లచ్యాతండా, కామెపల్లి మండలం -
గిరిజన తండాలకు మహర్దశ!
మాచర్ల టౌన్: ఎన్నికల సమయంలో 500 మంది జనాభా ఉన్న గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తామని టీడీపీ ఇచ్చిన హామీ మేరకు గిరిజనతండాల్లో జనాభా సర్వే చేయిస్తోంది. వారం రోజుల కిందట ప్రభుత్వం ఆయా గ్రామాల్లో గిరిజనులకు సంబంధించిన జనాభాను లెక్కించి అందుకు సంబంధించి నివేదిక అందించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులను కోరింది. 500మంది జనాభా ఉంటే గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసేందుకు నివేదికలు అడిగినట్లు మండల అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా మాచర్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో తండాల్లో జనాభా లెక్కింపు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుతం మాచర్ల మండలం లచ్చంబావి పంచాయతీ కింద ఉన్న రేగులవరంతండాలో 770 మంది జనాభా, అచ్చమ్మకుంటతండాలో 1116మంది , కొప్పునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని హస్నాబాద్తండాలో 828మంది, బెల్లంకొండ వారిపాలెం పరిధిలోని పెద్దఅనుపు, చెంచు కాలనీల్లో 732మంది గిరిజన జనాభా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నాలుగు తండాల్లో గిరిజనులు 500మందికి మించి ఉండడంతో మాచర్ల మండలంలో నాలుగు గ్రామ పంచాయతీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వెల్దుర్తి మండలంలోని గొట్టిపాళ్ల పరిధిలోని మొరసపెంటతండాలో 1079 మంది, గంగలకుంట పరిధిలోని హనుమాపురం, రామచంద్రాపురంతండాల్లో 1095 మంది, లోయపల్లి పరిధిలోని పిచ్చయ్యబావితండాలో 568 మంది, ఉప్పలపాడు పరిధిలోని చినపర్లపాయతండాలో 735 మంది, వజ్రాలపాడు పరిధిలోని దావుపల్లితండాలో 465మంది జనాభా ఉన్నట్లు మండల అధికారులు లెక్కలు తేల్చారు. దావుపల్లి తండాలో మరో 35మంది తక్కువ ఉన్నా ఈ ఐదు గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా మారే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దుర్గి మండలంలోని నెహ్రూనగర్తండాలో 700 మంది పైగా జనాభా, రెంటచింతల మండలంలోని జెట్టిపాలెంగ్రామ పంచాయతీ పరిధిలో 500 మందిపైగా గిరిజన జనాభా ఉన్నారు. ఈ విధం గా దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాల్లో ఐదు తండాలు గ్రామ పంచాయతీలుగా మారనున్నాయి. ప్రభుత్వం చేయిస్తున్న సర్వే దుర్గి, రెంటచింతల మండలాల్లో ఇంకా పూర్తికాలేదు. -
తీరనున్న తండ్లాట
పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వ నిర్ణయం * ఎంపీడీఓల ఆధ్వర్యంలో వివరాల సేకరణ పూర్తి * 500పైన జనాభా కలిగినవి 163...నెరవేరనున్న గిరిజనుల కల గ్రామాలకు సుదూరంగా అడవుల్లో, గుట్టల్లో, గుడ్డి దీపాలతో కాలం వెళ్లదీస్తున్న గిరిజన బతుకుల్లో వెలుగులు రానున్నాయి. అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన వారి జీవితాలకు బంగారు బాటలు పడనున్నాయి. తండాలను పంచాయతీలుగా మార్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి కల సాకారమయ్యే రోజులు మరింత దగ్గరలోనే ఉన్నాయి. చిలుకూరు : జిల్లాలోని గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. తండాలను పంచాయతీలుగా మార్చాలని ఏళ్ల తరబడి గిరిజనులు వినిపిస్తున్న డిమాండ్ త్వరలో నెరవేరనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులేస్తోంది. అధిక జనాభా కలిగిన తండాల వివరాలు సేకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు జిల్లాలకు ఉత్తర్వులు పంపించారు. ఈ మేరకు ఎంపీడీఓలు తమకు అప్పగించిన పనిని పూర్తిచేసి ఉన్నతస్థాయి అధికారులకు అందజేశారు. 500 జనాభా ఉన్న తండాలు 163 జిల్లా వ్యాప్తంగా 905 తండాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 500, ఆపై జనాభా కలిగిన తండాలు 163 ఉన్నట్లు గుర్తించారు. పంచాయతీలుగా మార్చేందుకు గుర్తించిన తండాలను కొన్ని షరతుల మేరకు పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీకి, కొత్తగా పంచాయతీగా మార్చేందుకు గుర్తించబడిన తండాలకు మధ్య ఉన్న దూరం, ఆదాయం తదితర అంశాల ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. గిరిజనులు అధికంగా ఉన్న మండలాలివే... మఠంపల్లి, దామరచర్ల, నేరేడుచర్ల, మేళ్లచెర్వు, చివ్వెంల, చందంపేట, పెదవూరు, పీఏపల్లి, కోదాడ మండలాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా మండలాల్లో ఉన్న తండాలు ఇప్పటి వరకు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. వీటిని పంచాయతీలుగా గుర్తిస్తేనే అభివృద్ధికి బాటలు పడే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాం : కృష్ణమూర్తి, డీపీఓ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంపీడీఓల సహకారంతో జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న తండాలకు సంబంధించిన సమాచారం సేకరించాం. ప్రభుత్వం ఏ క్షణంలో సమాచారం అడిగినా వెంటనే ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నూతన గ్రామ పంచాయతీలను గుర్తిస్తాం. -
తీరనున్న తండ్లాట
- గ్రామ పంచాయతీల ఏర్పాటుపై ఆశలు - 500 జనాభా గల తండాలు గుర్తింపు - 341 కొత్త జీపీలు అయ్యే అవకాశం జిల్లావ్యాప్తంగా 1,207కు పెరగనున్న జీపీలు ఉట్నూర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా అడుగులు వేస్తోంది. 500 జనాభా ఉన్న గిరిజన తండాలు, గూడెలను పంచాయతీలుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పంపించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అందుకు అనుగుణంగా నివేదికలు పంపించారు. జిల్లా వ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వం గుర్తించిన 32 నోటిఫైడ్ గిరిజన మండలాలతోపాటు మరో 12 మండలాల్లో 4,95,794 గిరిజన జనాభా ఉంది. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలుండగా ఇందులో షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కలిపి 272 గిరిజన పంచాయతీలు, 646 గ్రామాలు, 2 వేల వరకు అనుసంధాన గ్రామాలు ఉన్నాయి. ఇక తెగలవారీగా గిరిజన జనాభాలో గోండులు 2,63,515, లంబాడాలు 1,12,793, కోలాంలు 38,176, ప్రధాన్స్ 26,029, మన్నెవార్ 15,370, నాయక్‌పోడ్ 5,206, తోటి 2,231, ఎరుకల 1,735, కోయ, ఇతరులు 30,739 చొప్పున నివాసం ఉంటున్నారు. 341 పంచాయతీలు అయ్యే అవకాశం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలుగా మార్చితే నూతనంగా 341 గ్రామ పంచాచతీలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. తండాలు, గూడాల పూర్తి వివరాలు ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లాలో 272 గిరిజన గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి అనుసంధానంగా ఉన్న తండాలు, గూడాలను గుర్తించి వాటిలో 500 గిరిజన జనాభా ఉన్న వాటిని విలీనం చేస్తూ నూతన పంచాయతీల ఏర్పాటు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే గిరిజన పంచాయతీల ఏర్పాటు ఏ విధంగా చేపట్టాలో ప్రభుత్వం నుంచి విధివిధానాలు రాక పోవడంతో తాము కేవలం సమాచారం సేకరించి పంపినట్లు అధికారులు తెలిపారు. అభివృద్ధి వేగవంతం గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం పంచాయతీలకు అనుసంధాన తండాలు, గూడాలు కిలోమీటర్ల దూరం ఉండటంతో పాలకవర్గాలు, యంత్రాంగం పూర్తిస్థాయి దృష్టి సారించక అభివృద్ధి కుంటుపడుతోంది. ఇప్పటికీ తండాలు, గూడాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, ప్రభుత్వ విద్య తదితర మౌలిక వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు తమ మనుగడ, ఓటు బ్యాంక్ కోసం ప్రభుత్వాలు విడుదల చేసే నిధులను జనాభా అధికంగా ఉండే పంచాయతీల్లో ఖర్చు చేస్తూ అనుబంధంగా ఉన్న పంచాయతీలను విస్మరించారు. నూతన పంచాయతీలుగా ఏర్పాటుతో అయా పంచాయతీల్లో స్థానికంగా రాజకీయ అవకాశాలు పెరుగడంతోపాటు ప్రభుత్వం బాధ్యత పెరిగి అభివృద్ధి వేగవంతం అవుతుంది. ప్రయోజనాలు ఇవే.. - నూతన పంచాయతీల వల్ల పాలన సులభం అవుతుంది. తద్వారా ప్రజలు పంచాయతీల ద్వారా వివిధ ధ్రువీకరణ పత్రాలు సునాయసంగా పొందవచ్చు. - పంచాయతీల విడిది చిన్నదిగా ఉండటంతో గ్రామాల్లో మురికి కాలువల నిర్వహణ, వీధి దీపాలు, తాగు నీరు ఇతర వసతుల కల్పనలో ఎలాంటి అటంకాలు ఉండవు. - పంచాయతీ జనాభా తక్కువగా ఉండటం వల్ల పంచాయతీ పాలక వర్గాలు ప్రజలకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయి. - ప్రజలకు పంచాయతీలకు మధ్య దూరభారం తగ్గుతుంది. గ్రామ సమస్యలను ప్రజలు పాలకుల దృష్టికి తీసుకురాగలుగుతారు. - ప్రభుత్వ నిధుల విడుదలతో గ్రామాల అభివృద్ధి వేగం అవుతుంది. - ప్రభుత్వం పంచాయతీల ద్వారా అమలు చేసే సంక్షేమ పథకాలు నేరుగా అర్హులకు అందించేందుకు వీలవుతుంది.