horticulture hub
-
Fact Check: బాబు ధ్యానంలో పడి ‘అధ్వాన’ రాతలు
రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. పంటల మార్పిడి ద్వారా పెద్ద ఎత్తున దిగుబడి సాధించాలన్నది లక్ష్యం. ఆ దిశగానే నాలుగేళ్లుగా సాగుతోంది ప్రగతి ప్రయాణం. ఇప్పటికే దిగుబడి సాధనలో... ఎగుమతుల్లో పురోగతి సాధిస్తూనే ఉన్నాం. సకాలంలో రైతులకు బిల్లులు చెల్లిస్తూ వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నాం. అయినా నిరంతరం బాబు ధ్యానంలోనే గడుపుతున్న రామోజీకి గానీ... ఆయన పచ్చకళ్లకు గానీ అవేవీ కనిపించడం లేదు. ఇంకా ఆ మత్తులోనే జోగుతున్న ఈనాడు పత్రికలో నిత్యం అసత్యాలు వల్లెవేయడం అలవాటైంది. అడ్డగోలు కథనాలు వండివార్చడం నిత్యకృత్యమైంది. గత పాలనలో ఎంతగా వెనుకబడినా వారికి మాత్రం పచ్చగానే కనిపించింది. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ఇంకా అధ్వానంగానే ఆలోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా ఉద్యానాభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా ఏటా విస్తీర్ణంతో పాటు దిగుబడులు, ఎగుమతులు పెరుగుతున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకోని ఈనాడు పత్రికలో ఓ అబద్ధాన్ని అందంగా అచ్చేసింది. అందులో వాస్తవాలు ఒక్కసారి పరిశీలిద్దాం. – సాక్షి, అమరావతి ఆరోపణ: ప్రోత్సాహం కరువై...తగ్గిన తోటల విస్తీర్ణం వాస్తవం: ఉద్యాన పంటలు 2018–19లో 42.5 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి ఫలితంగా 2022–23 నాటికి ఏకంగా 45.61 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ ఐదేళ్లలో 7.49లక్షల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటలు సాగులోకి వచ్చాయి. వీటిలో 4.23లక్షల ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించగా, 3.25లక్షల ఎకరాల్లో కొత్తగా సాగవుతోంది. ప్రధానంగా 1.69లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, 1.26లక్షల ఎకరాల్లో మామిడి, 84వేల ఎకరాల్లో బత్తాయిపంటలు కొత్తగా సాగవుతున్నాయి. 2018–19 నాటికి 305 లక్షల టన్నులున్న దిగుబడులు 2022–23 నాటికి 368.89 లక్షల టన్నులకు చేరింది. 2018–19 నాటికి ఉద్యాన రంగానికి రూ.43,101 కోట్లు ఉన్న జీవీఏ 2022–23 నాటికి రూ.54,550కు పెరిగింది. సాగులో 15 శాతం, దిగుబడుల్లో 20.9 శాతం, జీవీఏలో 26 శాతం వృద్ధి రేటు సాధించింది. ఆరోపణ: గణనీయంగా తగ్గిన ఎగుమతులు వాస్తవం: టీడీపీ హయాంలోని ఐదేళ్లలో నాలుగైదు లక్షల టన్నులు కూడా ఎగుమతయ్యేవి కాదు. గడచిన ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 23.99 లక్షల టన్నులు ఎగుమతులు జరిగాయి. దేశంలోనే ప్రప్రథమంగా అరటి కోసం ప్రత్యేకంగా కిసాన్ రైళ్లను నడిపిన ఘనత ఈ ప్రభుత్వానిది. తాడిపత్రి నుంచి ముంబాయి ఓడరేవు ద్వారా ఏటా కిసాన్ రైళ్లు నడుపుతున్నారు. అక్కడి నుంచి విదేశాలకు అరటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. 2014–18 మధ్య కేవలం 24 వేల టన్నుల అరటి ఎగుమతులు చేరగా, కేవలం నాలుగేళ్లలోనే 1.62 లక్షల టన్నుల అరటి ఎగుమతయ్యింది. మన రాష్ట్రం నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు టమాటా ఎగుమతి చేస్తూ ఆదర్శంగా నిలిచింది. ఇంకా వంగ, బీర, సొర, దొండ, బెండ వంటి కూరగాయలు సైతం దేశంలోని వివిధ నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఆరోపణ: మాటల్లో తీపి.. రాయితీలకు కత్తెర వాస్తవం:2019–20 నుంచి ఇప్పటి వరకు రక్షిత సేద్యం కింద ప్రభుత్వం 15,490.53 హెక్టార్లకు రూ.41.30 కోట్లు సాయం అందించింది. కొత్తగా 29.83 ఎకరాల్లో అధిక విలువ కలిగిన కూరగాయల సాగుకోసం రూ.75.70 లక్షలు, 172.65 ఎకరాల్లో అధిక విలువ కలిగిన పూల సాగు కోసం రూ.5.85 కోట్లు ఆరి్థక సాయం చేసింది. అలాగే 478 సేకరణ కేంద్రాలు, 91 శీతల గిడ్డంగుల నిర్మాణం ద్వారా 2.44 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం పెంచారు. వీటి ద్వారా 3 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, సబ్సిడీ రూపంలో రూ.138.56 కోట్లు వారి ఖాతాలకు జమ చేశారు. కొత్తగా 200 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసింది. ఆరోపణ: ఉద్యాన రైతుకు కానరాని సాయం వాస్తవం: వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో రూ.13,500ల చొప్పున ఐదేళ్లలో 53.58లక్షల మందికి రూ.34,288 కోట్లు పెట్టుబడి సాయం అందించారు. దాంట్లో ఉద్యాన రైతులకు రూ.10వేల కోట్లకు పైగా అందించారు. పైసా భారం పడకుండా ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా 2019 నుంచి ఇప్పటి వరకు 5,35,554 ఉద్యాన రైతులకు రూ.1,409.5 కోట్ల బీమా పరిహారాన్ని అందించారు. వైపరీత్యాల వేళ 2014–15 నుంచి 2018–19 మధ్య పంట నష్టపోయిన రైతులకు రూ.387 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లిస్తే ఈ ప్రభుత్వం గత ఐదేళ్లలో 4.92 లక్షల మందికి రూ.563.03 కోట్ల పెట్టుబడి రాయితీని జమ చేసింది. ఆరోపణ: సూక్ష్మసేద్యం, ఆయిల్‌పామ్ రైతులకు మొండిచేయి వాస్తవం: బిందు, తుంపర సేద్య పరికరాలకు సంబంధించి గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.969.40 కోట్ల బకాయిలను చెల్లించడమే గాకుండా ఈ ఐదేళ్లలో 7.22 లక్షల ఎకరాల్లో కొత్తగా సూక్ష్మ సేద్యం అమలు చేసి 3.55లక్షల మంది రైతులకు సబ్సిడీ రూ.2,050 కోట్లు జమ చేశారు. ఫలితంగా 2023–24లో ఏపీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయస్థాయిలో అత్యుత్తమ దిగుబడి సాధించిన 20 జిల్లాల్లో ఏపీకి చెందిన ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలు ఉండటం విశేషం. గత ప్రభుత్వం రూ.162 కోట్లు ఖర్చు చేసి 83వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహిస్తే ఈ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.171.87 కోట్లు ఖర్చు చేసి 1.02 లక్షల ఎకరాల్లో ప్రోత్సహించింది. ఓఈఆర్ కింద గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.80 కోట్లను జగన్ ప్రభుత్వం చెల్లించగా, 32వేల మంది రైతులు లబ్ధి పొందారు. ఆరోపణ: ఉద్యాన రైతుకు చేయూత ఏదీ? వాస్తవం: గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా ఉద్యాన రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నాణ్యమైన దిగుబడులే లక్ష్యంగా ఐదేళ్లలో 8757 తోటబడుల ద్వారా 2.63లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్ఛింది. గత ఐదేళ్లలో రూ.2 కోట్ల రాయితీతో ఫ్రూట్ కవర్లను పండ్ల రైతులకు పంపిణీ చేసింది. దేశంలోనే ప్రప్రథమంగా ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపింది. క్వింటా అరటికి రూ.800, పసుపునకు రూ.6,850, ఉల్లికి రూ.770, బత్తాయికి రూ.1,400, మిర్చికి రూ. 7.000 చొప్పున కనీస మద్దతు ధరలు ప్రకటించింది. ఆరోపణ: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలెక్కడ? వాస్తవం: టీడీపీ ఐదేళ్లలో 360 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే ఈ ఐదేళ్లలో రూ.460 కోట్లతో 3,843 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు రూ.3,600 కోట్లతో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేశారు. రూ.58.57 కోట్లతో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు జిల్లాకు ఒకటి చొప్పున రూ.57 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.12.05 కోట్లతో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.15.50 కోట్లతో రాయలసీమ ప్రాంతంలో 20 ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, 20 పాలీ హౌస్‌లు, షేడ్నెట్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 4 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. 500 టన్నుల సామర్థ్యంతో 3వేల టమాటా, ఉల్లి సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్స్ ఏర్పాటు లక్ష్యం కాగా, ఇప్పటికే కర్నూలు జిల్లాలో 250 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. పులివెందులలో రూ.4 కోట్లతో బనానా క్లస్టర్, ఎల్.కోటలో రూ.2.5కోట్లతో నువ్వుల ఆయిల్, చిక్కీల క్లస్టర్ యూనిట్ ఏర్పాటయింది. రాజంపేటలో రూ.290 కోట్లతో, నంద్యాలలో రూ.165 కోట్లతో టమాటా, పండ్ల గుజ్జు, విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. జీఐఎస్–2023లో ఉద్యనవన రంగానికి సంబంధించి రూ.5,765 కోట్లతో 33 ఒప్పందాలు చేసుకోగా, ఇప్పటికే రూ.3,921 కోట్ల పెట్టుబడులు రాగా, మరో 455 కోట్ల పెట్టుబడులు పురోగతిలో ఉన్నాయి. -
టూరిజం స్పాట్.. హార్టికల్చర్ హబ్‌గా జిల్లా
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాను టూరిజం స్పాట్‌గా, హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించారని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ వీరపురెడ్డి జయరామిరెడ్డి అన్నారు. టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు–2017 గ్రహీత పంతుల పవన్‌కుమార్ అభినందన సభ సందర్భంగా ఆదివారం సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో కొండూరు పిచ్చమ్మ, వెంకట్రాజు స్మారక సంస్థ అధ్యక్షుడు కొండూరు జనార్దన్‌రాజు ఆధ్వర్యంలో జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గండికోటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని, యునెస్కో నిధులు వస్తే మరింత అభివృద్ధి అవుతుందన్నారు. గండికోటలో సాహస క్రీడల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, వంతెన నిర్మాణానికి ఇప్పటికే రూ. 3 కోట్లు విడుదల చేశామన్నారు. బ్రౌన్ నివసించిన స్థలంలో ఏర్పాటైన పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర పర్యాటక ప్రదేశాల జాబితాలో చోటు కల్పిస్తామని, అలాగే అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. ఒంటిమిట్ట చెరువును నీటితో నింపి బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. టూరిస్టులు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించి సాయంత్రానికి తిరిగి తిరుపతి వెళ్లే విధంగా బస్సులను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన విద్వాన్ కట్టా నరసింహులు మాట్లాడుతూ జిల్లాలో ఎంతో ప్రాధాన్యత ఉన్న మోపూరు, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయాల శాసనాల్లోని చరిత్రను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమలో నందలూరులో ఏకైక బౌద్ధారామం ఉందని, దాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ తిరుపతి నుంచి గండికోట వరకు పర్యాటక హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని ధ్వంసం చేయకుండా పర్యాటక ప్రదేశాల అభివృద్ధి జరగాలన్నారు. పర్యాటకశాఖ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేడా బాలసుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ గండికోట అభివృద్దికి మాస్టర్‌ప్లాన్ రూపొందించి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రీజినల్ డైరెక్టర్ జి.గోపాల్ మాట్లాడుతూ గండికోటకు సంబంధించి 20 మంది టూర్ గైడ్స్‌కు శిక్షణ ఇచ్చామన్నారు. యునెస్కో గుర్తింపునకు చర్యలు ప్రారంభించామన్నారు. ప్రభుత్వం గండికోట అభివృద్ధికి రూ. 500 కోట్లతో పలు చర్యలు చేపట్టిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. జానమద్ది విజయభాస్కర్ నిర్వహణలో సాగిన ఈ కార్యక్రమంలో అలపర్తి పిచ్చయ్యచౌదరి, మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడారు. యలమర్తి మధుసూదన్ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. తొలుత పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ జిల్లా పర్యాటక ప్రాంతాల ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ‘పంతుల’కు ఘన సన్మానం టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు–2017 అందుకున్న పాత్రికేయుడు పంతుల పవన్‌కుమార్‌ను రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరపురెడ్డి జయరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఆయనతోపాటు పలు పర్యాటక సంఘాల ప్రతినిధులు, పర్యాటకాభిమానులు పాల్గొన్నారు. -
ఉత్తమాటలే!
♦ అతీగతీ లేని ఉద్యానహబ్ ♦ ఉత్తుత్తి ప్రకటనలతో ఊరిస్తున్న పాలకులు ♦ ఫ్రూట్‌బౌల్ ఆఫ్ ఏపీగా ‘అనంత’కు గుర్తింపు ♦ మార్కెటింగ్, ఎగుమతులపై దష్టి పెడితేనే ఉద్యాన రైతులకు ఊరట జిల్లాను ఉద్యాన హబ్‌గా మారుస్తామంటూ రెండేళ్లుగా పాలకులు చెబుతున్న మాటలు నీటిమూటలే అవుతున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లాలో 22 రకాల పండ్లతోటలు సాగు చేస్తున్నారు. ఇక్కడి పండ్ల ఉత్పత్తులు నాణ్యతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. ఢిల్లీ, ముంబాయి, నాగపూర్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూణె తదితర మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాను ఉద్యాన హబ్‌గా చేస్తామంటూ సీఎం చంద్రబాబుతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆ శాఖ కమిషనరేట్ అధికారులు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ఇవి ఆచరణకు నోచుకోకపోవడంతో రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా ఏకంగా 1.71 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన తోటలు విస్తరించాయి. ఇందులో చీనీ అత్యధికంగా 48 వేల హెక్టార్లు, మామిడి తోటలు 45 వేల హెక్టార్లలో ఉన్నాయి. ఇవేగాక దానిమ్మ, ద్రాక్ష, సపోట, జామ, రేగు, అల్లనేరేడు, అరటి, బొప్పాయి, కళింగర, కర్భూజా, దోస, ఆకు, వక్క లాంటి స్వల్పకాలిక, దీర్ఘకాలిక తోటలు, పూలు, కూరగాయల తోటలు, ఔషధ పంటలు కూడా సాగవుతున్నాయి. దీంతో జిల్లాకు ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరొచ్చింది. గత ఏడాది (2015–16 ఆర్థిక సంవత్సరం) అన్ని పంటల ద్వారా 33.28 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.3,570 కోట్ల టర్నోవర్ జరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతకుముందు సంవత్సరం (2014–15)లో రూ.3,100 కోట్ల ఉత్పత్తులు వచ్చాయి. ఈ ఏడాది రూ.4,400 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు సాధించాలని ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది చీనీ, అరటి ద్వారానే రూ.1,700 కోట్ల వరకు టర్నోవర్ ఉండటం విశేషం. మార్కెటింగ్ లేక అవస్థలు జిల్లాలో ఉద్యాన తోటలు పెద్దఎత్తున విస్తరించినా.. అందుకు తగ్గట్టు మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో నాణ్యమైన పండ్లను ఎగుమతి చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో గిట్టుబాటు ధర లేనప్పుడు విలువ ఆధారిత (వ్యాల్యూ అడిషన్) ఉత్పత్తులుగా చేసుకునేందుకు అవసరమైన గ్రేడింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు జిల్లాలో లేవు. దీనివల్ల రైతులు నష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి చీనీ, బొప్పాయి, అరటి, టమాట, మిరప లాంటి పంట ఉత్పత్తులను అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. బడా కంపెనీలు చూస్తున్నా... జిల్లాలో నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తుల గురించి తెలుసుకున్న బడా కంపెనీలు కొనుగోలు, మార్కెటింగ్‌కు ముందుకు వస్తున్నా, వాటికి ప్రోత్సాహం అందించడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు. గతేడాది వాల్‌మార్ట్ ప్రతినిధులు కూడా రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అపెడా సంస్థ ప్రతినిధులు జిల్లాలో పర్యటించి ఎగుమతిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల బెంగళూరుకు చెందిన లీఫ్ సంస్థ, లక్నోకు చెందిన మరో సంస్థ ప్రతినిధులు కూడా జిల్లాపై దష్టి పెట్టారు. త్వరలో ముంబై కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న ఫూచర్ కంపెనీ ప్రతినిధులు ‘అనంత’కు రానున్నట్లు ఉద్యాన శాఖ వర్గాలు తెలిపాయి. ఇలా దేశ విదేశాల్లో పేరున్న కంపెనీలు జిల్లాలో ఉద్యాన ఉత్పత్తుల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నా .. ఈ అవకాశాన్ని రైతులకు సానుకూలంగా మలచడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు. గుత్తి, కొడికొండ ప్రాంతాల్లో హైవే బజార్లు, టమాట కిచెప్ సెంటర్, మరో నాలుగు ప్రాంతాల్లో ఫ్రూట్, వెజిటెబుల్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామంటూ ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. వీటిని ఎప్పటిలోపు ఏర్పాటు చేస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. -
కష్టపడి రుణమాఫీ చేశా : చంద్రబాబు
కడప: కష్టపడి రుణమాఫీ చేశామని... వేరే వారైతై ఆ పని చేయలేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం వైఎస్ఆర్ జిల్లా కడపలో ఉద్యాన పంటల రైతులకు రుణ ఉపశమన పత్రాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.... విభజన చట్టంతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. కట్టుబట్టలతో వచ్చామన్నారు. తెలంగాణ ఆదాయం 11 శాతం ఉంటే... మన ఆదాయం చాలా తక్కవ ఉందని చెప్పారు. జనాభా ఎక్కువ ఉన్నారని.... ఇతర రాష్ట్రాల కంటే రూ.35 వేలు తలసరి ఆదాయం తక్కువగా ఉందని... ఈ పరిస్థితుల్లో రైతులకు రుణవిముక్తి కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో మరోకరు అయితే రుణమాఫీ సాధ్యపడేది కాదని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీని వ్యవసాయ రంగంలోకి ప్రవేశపెట్టడం ద్వారా అధిక ఆదాయం గడించ వచ్చుని తెలిపారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని కొంతమంది పెద్దమనుషులు మాట్లాడుతున్నారని... 10 ఏళ్లుగా వారు ఆ ప్రాంతానికి ఏం చేశారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు రాయలసీమ ప్రయోజనం కోసమే నిర్మించామని ఆయన చెప్పారు. కడపను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని వివరించారు. -
నీటి పొదుపునకు అంతా కృషి చేయాలి
♦ ప్రపంచ జల దినోత్సవం ♦ సందర్భంగా అసెంబ్లీలో సీఎం ♦ హార్టీకల్చర్ హబ్‌గా రాయలసీమ ♦ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: జల వనరుల సమర్థతను పెంచి, వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. జల పరిరక్షణ ద్వారా పేదరికాన్ని నిర్మూలించి, ఆర్థిక అసమానతలను తగ్గించడం లక్ష్యమన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా మారుస్తామని వెల్లడించారు. నదుల అనుసంధానం తమ లక్ష్యమన్నారు. జలవనరుల సద్వినియోగానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనసభలో మంగళవారం సీఎం ప్రసంగించారు. ప్రతీ నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్లే రాయలసీమ ఇప్పటికీ కరవు ప్రాంతంగా ఉందని, నిర్దిష్ట కార్యక్రమాలతో దీన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరో రెండేళ్లు రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉండే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయన్నారు. దీనిపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వరి పంట కన్నా పండ్లతోటలే ఆదాయాన్నిస్తాయని, రాయలసీమ జిల్లాల్లో ఉద్యానవనాలను ప్రోత్సహిస్తామన్నారు. భూగర్భ జలమట్టం పెంచేందుకు చేపట్టిన పంట గుంటల కార్యక్రమం మంచి ఫలితాలిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల పంటగుంటలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు.... ♦ గడచిన రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు రూ. 7,888.62 కోట్ల నిధులు కేటాయించాం. ఈ కాలంలో మరో 1.182 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. స్థిరీకరించిన ఆయకట్టు 13.08 లక్షలు. ఏడు ప్రాజెక్టులకు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్నాం. వీటిని 2017-18 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ♦ ఈ ఏడాది డిసెంబర్ నాటికి బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు రెండో దశను పూర్తి చేసి, శ్రీకాకుళం జిల్లాలోని 45 వేల ఎకరాలకు నీరి స్తాం. 194 కట్టడాల్లో ఇప్పటికే 28 పూర్తయ్యాయి. తోటపల్లి ప్రాజెక్టును ఈ ఏడా ది జూన్ నాటికి, గజపతినగరం బ్రాంచ్ కాల్వను అక్టోబర్‌లో పూర్తవుతాయి. పట్టిసీమ ఎత్తిపోతల పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులను 2017 జూన్ నాటికి పూర్తిచేస్తాం. ♦ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును 2017-18లోగా పూర్తి చేయాలని, మొత్తం 4,47,300 ఎకరాలకు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ♦ నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొంటాం. ప్రతీ వర్షం నీటి బొట్టును ఒడిసి పట్టడం ఈ పథకం ముఖ్యోద్దేశ్యం. తిరుమల స్థాయిలో శ్రీశైలం అభివృద్ధి తిరుమల స్థాయిలో శ్రీశైలం అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.టెంపుల్ టూరిజం లో భాగంగా శ్రీశైలం,విజయవాడలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర దేవాదాయ శాఖ రూపొందించిన ప్రణాళికలపై ఆయన మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. శ్రీశైలం పరిసరాల్లో ఐదు వేల ఎకరాల్లో నాలుగైదు టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు.శ్రీశైలం చుట్టూ 8 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు నిర్మాణంతో పాటు శ్రీశైలం, సున్నిపెంటలను పట్టణాలుగా తీర్చిదిద్దాలన్నారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కాలిబాట వంతెనలు ఏర్పాటు, అర్జున వీధిని 60 అడుగుల రోడ్డుగా వెడల్పు చేయాలని భావిస్తున్నారు.