hundred years
-
వందేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి... ఇంకా ఇప్పటికీ చెక్కుచెదరకుండా..
ఇంతవరకు ఎన్నోరకాల మమ్మీలు గురించి చదివాం. పైగా వాటి అవయవాలు జాలా జాగ్రత్తగా భద్రపర్చారంటూ విన్నాం. ఆయా మమ్మీల వద్ద విలువైన నాణేలు, బంగారం వంటి వస్తువులను చూశాం. ఇంతవరకు చూసిన మమ్మీలన్నీ చాలా వరకు కాస్త డికంపోజ్ అయినట్లుగానే ఉన్నాయి. చనిపోయినప్పుడు ఎలా ఉండేవో అలానే యథాతథంగా ఉండటం అసాథ్యం. కానీ ఇక్కడొక చిన్నారి మమ్మీ మాత్రం తాజా మృతదేహంలా చెక్కు చెదరకుండా ఉండటమే కాకుండా ప్రపంచంలో అందమైన మమ్మీగా పేరుగాంచింది. వివరాల్లోకెళ్తే....రోసాలియా లాంబార్డో అనే రెండేళ్ల చిన్నారి డిసెంబర్ 2, 1920న తన రెండో పుట్టిన రోజున చనిపోయింది. వాస్తవానికి 1918 నుంచి 1920 మధ్య కాలంలో స్పానిష్ ప్లూ మహమ్మారీ ప్రబలంగా ఉండేది. ఆ సమయంలో ఈ చిన్నారి ఆ మహమ్మారి బారిన పడి మృతి చెందింది. అప్పటి నుంచి ఆ చిన్నారి మృతదేహాన్ని మమ్మీలా అత్యంతా జాగ్రత్తగా భద్రపరిచారు. ఈ మేరకు ఆ చిన్నారి మృతదేహం ఉత్తర సిసిలీలో పలెర్మోలోని కాపుచిన్ కాటాకాంబ్స్ అనే చోట భద్రపరచారు. వందేళ్ల తర్వాత కూడా ఆ చిన్నారి మృతదేహం ఆమె చనిపోయినప్పుడూ ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండటం గమనార్హం. పర్యావరణ కారకాల నుంచి ఆ మృతదేహం పాడవకుండా అత్యంత బహు జాగ్రత్తగా నైట్రోజన్‌తో నిండిన గాజు సేవ పేటికలో భద్రపరిచారు. ఈ చిన్నారి మమ్మీ ప్రస్తుతం పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ కాపుచిన్ కాటాకాంబ్స్ అనేది దక్షిణ ఇటలీలో ఉండే అతి పెద్ద మమ్మీల పరిశోధన కేంద్రం లేదా మమ్మీలను భద్రపరిచే భూగర్భ శ్మశాన వాటిక. ఇందులో దాదాపు ఎనిమిది వేల మమ్మీలు ఉన్నాయి. రోసాలియా అనే రెండెళ్ల చిన్నారిని భద్రపరిచినంతగా మిగతా వాటిని భద్రపర్చలేదు. ఆ చిన్నారి రాగి జుట్టు, చర్మం రంగు మారకుండా ఏదో మనిషి నిద్రపోతున్నట్లుగా ఉంటుంది. చాలామంది నకిలీ మమ్మీ అని, మైనపు ముద్ద అంటూ పుకార్లు సృష్టించారు. మరికొంతమంది ఆ చిన్నారిని చూసినప్పుడు మమ్మల్ని చూసి రెప్పవేసిందని కూడా చెప్పారు. ఐతే వాటన్నింటిని కొట్టి పారేస్తూ...ఆ చిన్నారి శరీరం పై చేసిన పరిశోధనల్లో శరీరం, ఎముకలు, అవయవాలు ఏ మాత్రం చెక్కు చెదరలేదని, కేవలం మెదడు మాత్రమే ఉండాల్సిన పరిమాణం నుంచి 50% తగ్గిపోయిందని నిర్థారించారు ఆర్కియాలజిస్ట్‌లు. ఏ మాత్రం పాడవకుండా ఉన్న ఈ చిన్నారి మమ్మీ ఇటలీ పురాణాల్లో ప్రసిద్ద అంశంగా మారింది. ఈ చిన్నారిని టాక్సీడెర్మిస్ట్, ఎంబాల్మర్ ఆల్ఫ్రెడో సలాఫియాలు మమ్మీగా మార్చారని చెబుతున్నారు. కానీ కొంతమంది శాస్తవేత్తలు మాత్రం ఈ మమ్మీ శవపేటికలో ఉండటం వల్ల ఇరు పక్కల ఉండే గాజు విండోలు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ కలిగించి ఆ మమ్మీ చెక్కుచెదరకుండా ఉన్నట్లు కనిపించేలా చేస్తున్నాయని, పగటి పూట వేరేలా ఉంటుందని చెబుతున్నారు. (చదవండి: ఏనుగులతో సెల్ఫీ అంటే... అట్లుంటది మరీ!) -
తెల్లవారిని హడలెత్తించిన ఎర్ర మిరపకాయ్
రంపచోడవరం(తూర్పుగోదావరి): పచ్చని మన్య సీమలో అమాయక గిరిజనంపై ఆంగ్లేయులు సాగించిన అకృత్యాలపై.. విల్లంబులు ఎక్కుపెట్టిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సాగించిన మహోజ్వల సాయుధ పోరాటం ఇప్పటికీ.. ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఈ పోరాటంలో భాగంగా ఆయన సారథ్యంలోని గిరిజన వీరులు బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై వరుస దాడులు చేశారు. ఆ క్రమంలో తాము దాడులు చేస్తున్నట్టు బ్రిటిష్ సైన్యానికి ముందుగానే హెచ్చరిక సందేశం పంపేవారు. కాగితంపై రాసిన ఆ సందేశాన్ని బాణానికి గుచ్చి, దానిపై ఎర్ర మిరపకాయల గుత్తి తగిలించేవారు. ఆవిధంగా ఎర్ర మిరప కాయల గుత్తితో పోలీస్ స్టేషన్ వద్ద బాణం నాటుకొంటే చాలు.. బ్రిటిష్ పోలీసులు హడలెత్తిపోయేవారు. అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద సీతారామరాజు కొంత కాలం నివాసం ఉన్నారు. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జెండా ఎగుర వేసిన తరువాత అడవుల్లోకి వెళ్లి బ్రిటిష్ సేనలను ఎదిరించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 1922లో విశాఖ జిల్లా కృష్ణదేవీపేట (కేడీ పేట) పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడి ఆయుధాలను స్వా«దీనం చేసుకుని, దాడి చేసినట్టు సమయం తెలుపుతూ ఉత్తరం ఉంచారు. కొద్ది రోజుల్లోనే రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడికి కొంత సమయం తీసుకోవడంతో బ్రిటిష్ అధికారులకు సీతారామరాజు భయపడ్డాడని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద ఆయన గిరిజనులతో సమావేశమయ్యారు. అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తున్నట్లు 1922 అక్టోబర్ 10న బాణానికి మిరపకాయ గుత్తి ఉంచి సందేశం పంపించారు. ఆ స్టేషన్‌పై దాడి చేసేందుకు గుర్రం మీద తేనెలమంగి గ్రామంలోని తెల్ల మద్ది చెట్టు వద్దకు రాత్రి చేరుకుని వ్యూహం రచించారు. 1922 అక్టోబర్ 15న దాడి చేసి ఆయుధాలు కొల్లగొట్టారు. స్టేషన్‌పై దాడి చేసినట్టు లేఖ ఉంచారు. ఆ తరువాత నాలుగు రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 19న రంపచోడవరం పోలీస్ స్టేషన్‌పై కూడా అల్లూరి దాడి చేశారు. తెల్లవారి వెన్నులో వణుకు పుట్టించేలా అల్లూరి మహోధృతంగా సాగించిన సాయుధ పోరాటంలో మిరపకాయ టపాకు ఈవిధంగా ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉద్యమానికి వందేళ్లు అయిన సందర్భంగా నాటి సంఘటనకు గుర్తుగా ఆ మహావీరుని చిత్రంతో తపాలా శాఖ ప్రత్యేక కవర్ విడుదల చేస్తోంది. రంపచోడవరంలో బుధవారం జరిగే ఈ కార్యక్రమంలో కలెక్టర్ సి.హరికిరణ్, రంపచోడవరం ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత పటేల్, రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు, రంపచోడవరం సర్పంచ్ మంగా బొజ్జయ్య పాల్గొంటారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అడ్డతీగలలో కూడా అల్లూరి పోరాటంపై ప్రత్యేక తపాలా చంద్రికను ఆవిష్కరించనున్నారు. తపాలా శాఖ, హైదరాబాద్‌కు చెందిన మిత్రా గ్రూప్ కంపెనీల అధినేత ఆర్‌ఆర్‌కే రాజుల సంయుక్త ఆధ్వర్యాన స్థానిక శ్రీ సాయి సన్నిధి ఫంక్షన్ హాలులో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. -
మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన
సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన స్వాతం త్య్రోద్యమ వీరుడు ఉన్నవ లక్ష్మీ నారాయణ. ఆయన న్యాయ వాది. 1877 డిసెంబర్ 4న గుంటూరు జిల్లా వేములూరు పాడు గ్రామంలో జన్మించారు. అనేక సాహిత్య గ్రంథాలు చదివిన స్ఫూర్తితో 1900 సంవ త్సరంలో గుంటూరులో యంగ్‌మెన్ లిటరరీ అసోసియేషన్ స్థాపించారు. సంస్కరణ దృక్పథంతో 1902లో గుంటూరులో వితంతు శరణాలయం స్థాపించారు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగాన్ని ఆహ్వానించి ఆయన అధ్యక్షతన తొలి వితంతు వివాహం జరిపించారు. సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే రచనలు, సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్నది ఉన్నవ ఆశయం. సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించి సమతా ధర్మాన్ని స్థాపించడం ఆయన లక్ష్యం. కులవ్యవస్థను నిరసించారు. అగ్రవర్ణాలు, హరిజనులు కలిసి మెలసి ఉండాలని భావించారు. సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఆ లక్ష్య సాధనకై విప్లవాత్మకమైన ‘మాలపల్లి’ రచించారు. జాతీయోద్యమంలో రాజకీయ వాతావరణాన్ని, గాంధీ ఆశయాలను, తెలుగు వారి జీవన విధానాన్ని ప్రతిబింబించిన నవల మాలపల్లి. ( వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) ఉన్నవ 1922లో పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయి రాయవెల్లురు జైలుకు వెళ్లారు. అక్కడే ఈ నవల రాశారు. మంగళపురంలో రామదాసు, మాలక్ష్మి దళిత రైతు దంపతులు. వాళ్లకు వెంకటదాసు, సంగదాసు, రంగడు అనే ముగ్గురు కొడుకులు. ఆ ఊరి భూస్వామి చౌదరయ్య. సంగదాసు చదువుకున్నాడు. దేనిమీదనైనా సొంత అభిప్రాయాలు ఉన్నవాడు. అతడు చౌదరయ్య దగ్గర పాలేరు. అతనికి చౌదరయ్య కుమారుడు రామానాయుడు స్నేహితుడు. చౌదరయ్యకు అది నచ్చదు. వరి కోతల సమయంలో రైతులు ధాన్యానికి బదులు రోజుకు ఆరణాల కూలీ ఇస్తామంటే కూలీలు అందుకు ఒప్పుకోకుండా ధాన్యమే కావాలన్నప్పుడు సంగదాసు కూలీల అభిప్రాయాన్ని సమర్థిస్తాడు. కూలీల తిరుగుబాటుకు సంగదాసు కారణమని చౌదరయ్యకు కోపం వస్తుంది. ఆనాటి సమాజంలో హరిజనుల కుటుంబ బాధను ఇతివృత్తంగా తీసుకుని హరిజనుడిని నాయకుడిగా చేసి నవల రాయడం సాహసం. అందుకే ఈ నవలకు నాయకుడి పేరు కలిసి వచ్చేలా ‘సంగ విజయం’ అనే మరో పేరు సార్థకమైంది. ఆ నవల నూరేళ్ల సందర్భం ఈ సంవత్సరం. ఈ నవలలో చరమగీతం, సమతాధర్మం అనే రెండు గేయాలను వాడుకభాషలో రాసి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. బెల్లంకొండ రాఘవరావు ఆర్థిక సహ కారంతో 1922లో రెండు భాగాలుగా ప్రచురితమైన ఈ నవల 1923, 1936లో మద్రాసు ప్రభుత్వం వారి నిషేధానికి గురైంది. రాజాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1937 నిషేధాన్ని తొలగించారు. గాంధేయ సిద్ధాంతాలను, శాంతి అహింసలను ఆచరణలో చూపిన వ్యక్తి ఈ నవలలో రామదాసు. భూస్వామి చౌదరయ్య తన కుమారుడిని చంపినపుడు, భార్య మరణించినపుడు, కుమారుడు వెంకటదాసు క్షతగాత్రు డైనప్పుడు, శాంతి, సహనం రూపుదాల్చినట్లు ప్రవర్తించాడు. భారతజాతి నెత్తురు బొట్టు కారకుండా స్వాతంత్రాన్ని పొందగలిగితే అది మహా అద్భుత కార్యంగా పరిగణిస్తారని రామదాసు గాంధేయ మార్గాన్ని ప్రతి పాదించాడు. (Mannu Bhandari: రాలిన రజనీగంధ) ఈ నవలకు పీఠిక రాసిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రసాహిత్య హృదయ పరి ణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ కావ్యమ న్నారు. నగ్నముని ఈ నవలని నాటకీకరించారు. ఆచార్య రంగా దీన్ని టాల్‌స్టాయ్ బృహన్నవల ‘వార్ అండ్ పీస్’తో పోల్చదగినది అన్నారు. ’మాలపల్లి’ని అనుసరించి ఆయన ‘హరిజన నాయకుడు’ నవల రాశారు. గుంటూరు శేషేంద్రశర్మ ప్రశంసించినట్లు ‘తెలుగు విప్లవ సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహా కావ్యం మాలపల్లి’ అనడం అతిశయోక్తి కాదు. గాంధేయవాదిగా, స్వాతంత్య్రయోధుడిగా, సంఘ సంస్కర్తగా, గుంటూరు శారద నికేతన్ వ్యవస్థాపకుడిగా, తెలుగు నవల సాహిత్య వైతాళికుడిగా గణనీయమైన కీర్తి పొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ 1958 సెప్టెంబర్ 25వ తేదీన పరమపపదించాడు. తెలుగు నవలా సాహిత్యంలో ‘మాలపల్లి’ చిరస్మరణీయం. - డా. పీవీ సుబ్బారావు వ్యాసకర్త సాహితీ విమర్శకులు (ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ నవలకు శతవసంతాలు; డిసెంబర్ 4న ఉన్నవ జయంతి) -
సింగరేణి సెంచరీ..
నల్లబంగారం.. తనువెల్ల ధరించె.. తరాలే తరించె.. తరగని గనులు.. తగ్గని ఘనత.. నిలువెల్లా గాయాలె.. నిను మరువని గేయాలె.. కార్మికుల కడుపు నింపె.. కడుపున చీకటిని దాచె.. లోకానికి వెలుగులు పంచె.. చీకటి సూరీళ్లకు చిక్కటి వెలుగాయె.. సిరుల రాణి సింగరేణికి రేపటి (బుధవారం)కి వందేళ్లు... బొగ్గు నిల్వల గుర్తింపు, ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి లెక్కిస్తే 131 ఏళ్ల చరిత్ర సింగరేణి సొంతం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందింది. మూడు తరాల కార్మికుల చెమట చుక్కలకు ప్రత్యక్ష నిదర్శనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.వందల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. జియోలాజికల్ సర్వే ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాలో గోదావరితీరంలో 22,207 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఇప్పటివరకు 1,500 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును వెలికితీశారు. మరోవైపు కాలక్రమేణా భూ గర్భగనుల తగ్గుదలు, ఓసీపీలు పెరగడం, యాంత్రీకరణతో కార్మికుల సంఖ్య తగ్గుతోంది. కొత్త కార్మిక చట్టాలు, బొగ్గు గనుల ప్రైవేటీకరణ, కాలుష్య నియంత్రణలో భాగంగా థర్మల్ విద్యుత్ నియంత్రించడం తదితర కారణాలు సింగరేణి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. -సాక్షి, మంచిర్యాల తగ్గుతున్న కార్మిక భాగస్వామ్యం కాలానుణంగా గనుల్లో తట్టా, చమ్మాస్ నుంచి అత్యాధునిక హై కెపాసిటీ లాంగ్వాల్ లాంటి యంత్రాల రాకతో కార్మికుల భాగస్వామ్యం తగ్గుతూ వస్తోంది. 1991లో సంస్థలో లక్షకుపైగా కార్మికులు ఉండగా ఇప్పుడా సంఖ్య 45 వేలకు పడిపోయింది. వచ్చే రెండేళ్లలో ఉద్యోగ విరమణలతో 25 వేలకు తగ్గనుంది. ఖాళీస్థానంలో కొత్త నియామకాలు జరగకపోగా, తక్కువ ఖర్చు, ఎక్కువ ఉత్పత్తి కోసం భూగర్భ గనుల కంటే ఓపెన్ కాస్ట్‌లకే మొగ్గు చూపడంతో కార్మికులకు ఉపాధి తగ్గిపోతోంది. అదే సమయంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరగడంతో తక్కువ జీతాలతో ఎక్కువ పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గనులపై ‘ప్రైవేటు’ పిడుగు కొత్త చట్టాల ప్రకారం బొగ్గు గనుల ప్రైవేటీకీరణతో కొత్త బ్లాకులు సింగరేణికి దక్కుతాయా అనే సందేహం కార్మికుల్లో నెలకొంది. ఇప్పటికే దేశంలో 50 బ్లాకులను ప్రైవేట్‌వారికిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సింగరేణిలో 27 భూగర్భ, 18 ఓసీపీల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు సింగరేణి అధీనంలో ఉంటాయా లేదా అనే అనుమానాలున్నాయి. రాబోయే కాలంలో థర్మల్ విద్యుత్‌కు పోటీగా సౌర, పవన, జల విద్యుత్ లాంటి ఉత్పాదక ఇంధనాల ప్రాధాన్యత పెరగడం బొగ్గు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపనుంది. అయితే రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌తో సంస్థకు మేలు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. చదవండి: (టీఆర్టీ కంటే ముందే టెట్) ప్రత్యామ్నాయంపై దృష్టి మనుగడ కోసం ప్రత్యామ్నాయంపైనా సింగరేణి దృష్టి సారించింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో సొంతంగా థర్మల్ విద్యుత్ రెండు ప్లాంట్లను స్థాపించింది. 2016 నుంచి ఇవి 1,200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి చెందిన ఖాళీ భూములతోపాటు మూతపడిన ఓసీపీలు, భూగర్భగనుల పరిసరాలు, నీటి ఉపరితలాలపై సౌర విద్యుత్ ఉత్పత్తికి మొదలుపెట్టింది. మూడు దశల్లో 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయదల్చింది. వీటితోపాటు గనుల నుంచి గ్యాసిఫికేషన్ వంటివి చేపట్టే యోచనలో ఉంది. కొత్త చట్టాలతో కార్మికులకు నష్టం కొత్త చట్టాలతో ప్రైవేటీకరణ కొనసాగితే సంస్థ భవిష్యత్తుకు, కార్మికుల జీవనోపాధికి తీరని నష్టం జరుగుతుంది. సింగరేణిని భవిష్యత్తు తరాలకు అందించాలంటే ప్రైవేటీకరణను విరమించుకోవాలి. అలాగే కొత్త గనులు చేపట్టి కొత్త కార్మికుల నియామకాలు చేపట్టాలి. –మంద నర్సింహారావు, ప్రధానకార్యదర్శి, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ భవిష్యత్తుపై ఆలోచించాలి కోల్ ఇండియా, సింగరేణి సంస్థలు కార్మికుల సంక్షేమం దృష్ట్యా భవిష్యత్తు ప్రధాన దృష్టి సారించాలి. కేవలం బొగ్గు ఉత్పత్తి కాకుండా విద్యుత్, సిమెంట్, గ్యాసిఫికేషన్, సొలార్ తదితర ఆదాయ మార్గాలను అన్వేషించాలి. ప్రైవేటులో పోటీని తట్టుకునేలా అన్ని రకాలుగా వృద్ధి చెందాలి. –జనక్‌ప్రసాద్, సెక్రటరీ జనరల్, ఐఎన్టీయూసీ ఇదీ ‘బొగ్గు చరిత్ర’ 1871- బ్రిటిష్ హయాంలో జియోటాజికల్ సర్వే ఇండియాకు చెందిన డాక్టర్ కింగ్ జార్జ్ అప్పటి ఖమ్మం జిల్లా ఇల్లెందులో బొగ్గు నిల్వలను కనుగొన్నారు 1886- బ్రిటిష్ ఇండియాలోని హైదరాబాద్ (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ ఇల్లెందులో బొగ్గు వెలికితీత కోసం అనుమతి పొందింది 1889- నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం 1920- డిసెంబర్ 23న ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)గా అవతరణ 1945- హైదరాబాద్ రాష్ట్రం కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు 1949- హైదరాబాద్ ప్రభుత్వం ఈ కంపెనీని ఇండస్ట్రీయల్ ఫండ్ ట్రస్ట్‌కు అప్పగించింది 1956- ఉమ్మడి రాష్ట్ర అవతరణ తర్వాత కంపెనీల చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థగా మార్పు 1960- మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో కంపెనీని విస్తరించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ, రుణ సాయం పెంచుతూ భాగస్వామ్యం ప్రారంభం (కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి సంస్థగా మార్పు) 1974- కేంద్రం కంపెనీ మూల ధన వాటాను కేంద్ర బొగ్గు గనుల సంస్థకు బదిలీ. అదే ఏడాది కేంద్రం, రాష్ట్రం, సంస్థ మధ్య ఒప్పందం జరిగింది. ప్రస్తుతం సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం, రాష్ట్ర వాటా 51 శాతం ఉంది. -
ముప్పేట దాడిలో విలవిల!
వందేళ్ల నాడు పుట్టిన స్పానిష్ వైరస్ దెబ్బకు మన దేశంలో 1.25 కోట్ల మంది చనిపోయారని బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా చెబుతోంది. ఆ సంఖ్య గరిష్టంగా 1.75 కోట్ల వరకు ఉందని అమెరికాకు చెందిన మెడికల్ హిస్టోరియన్ జేఎం బారీ వెల్లడించారు. మహమ్మారి ధాటికి బలైనవారి సంఖ్యలో ఇంతటి వ్యత్యాసం కనిపిస్తోంది. దీనికి కారణం హైదరాబాద్ స్టేట్ పరిధిలో చనిపోయినవారి వివరాలను నాటి నిజాం ప్రభుత్వం తొక్కిపెట్టడం.. ఇలాగే మరికొన్ని సంస్థానాలు కూడా చేశాయి. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం వేసిన లెక్కలు తక్కువగా ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: కోట్ల మందిని పొట్టన పెట్టుకుంటున్న వైరస్ ఓవైపు.. అప్పటికే కరువు విలయతాండవం చేస్తుండటంతో ఆకలి చావులు మరోవైపు.. రుతుపవనాలు బాగా ఆలస్యమై సాగును దెబ్బతీసిన కలసిరాని కాలం మరోవైపు.. ఇదీ అసలైన ముప్పేట దాడి అంటే. 1920.. సరిగ్గా వందేళ్ల కింద ఇదీ మన పరిస్థితి. ఇప్పుడు కరోనా వైరస్ పంజా విసిరినా.. దాని బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు మనకు ఊరటనిస్తోంది. త్వరలోనే దాని బారి నుంచి మనం బయటపడతామనే ధీమాతో పాటు ఒక్క పేద కుటుంబం కూడా పస్తులుండని పరిస్థితి ఇప్పుడు ఉంది. కానీ నాటి పరి స్థితి ఎంత భయానకంగా ఉండేదో ఓ సారి తెలుసుకుందాం.. ఇటు అంటు వ్యాధి.. అటు ఆకలి చావులు ఏడో నిజాం.. నాడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. హైదరాబాద్ నగరంలో అన్ని హంగులు ఉండాలని తాపత్రయపడి ఆధునికతకు ఆద్యుడయ్యాడు. కానీ ప్రజల సంక్షేమం అంతగా పట్టదన్న చరిత్రకారుల మాటలు నిజం చేసేలా వందేళ్ల నాటి పరిస్థితులు నిలిచాయి. 1918 నుంచి రెండేళ్ల పాటు స్పానిష్ వైరస్ ధాటికి జనం పిట్టల్లా రాలిపోయారు. అప్పటికే దక్కన్ పీఠభూమిపై ఆకలి కేకలు మిన్నంటాయి. 1890 నుంచి కరువు కరాళ నృత్యం చేస్తోంది. తరచూ ఏర్పడుతున్న కరువులో ఆకలి చావులు తీవ్రమయ్యాయి. దీనికి తోడు మూసీ వరదలు, గత్తర ప్రబలడం.. వెరసి అంతా గందరగోళంగా ఉంది. అదే సమయంలో మరోసారి కరువు పంజా విసిరింది. జనం తిండి లేక చనిపోతున్నతరుణంలో స్పానిష్ వైరస్ విరుచుకుపడింది. ఇటు ఆకలి చావులు, అటు అంటువ్యాధి మృతులు వెరసి.. దక్కన్ పీఠభూమి శవాల దిబ్బగా మారింది. అక్కడితో ప్రకృతి కడుపు మంట తీరలేదు. వైరస్ ప్రభావం తగ్గుతోందనుకుంటున్న తరుణంలో అదే సమయంలో రుతు పవనాలు ఆలస్యంగా రావటంతో కాలం కలసిరాలేదు. దీంతో ఏకంగా 20 శాతానికంటే ఎక్కువ మేర దిగుబడులు తగ్గిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా కనిపించింది. దీనివల్ల ఒక్కసారిగా ధరలు భగ్గుమన్నాయి. రెండేళ్ల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. మృతుల వివరాలు వెలుగు చూడనివ్వని నిజాం ఆకలి చావులు, అంటువ్యాధి మృతులు హైదరాబాద్ సంస్థానంలో అధికంగా నమోదయ్యాయి. కానీ ఈ మృతుల వివరాలు బయటి ప్రపంచానికి నిజాం తెలియనివ్వలేదు. స్పానిష్ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయినవారిలో 43 శాతం భారతీయులే కావటంతో ఇక్కడి మృతుల సంఖ్యపై యావత్తు ప్రపంచం దృష్టిపెట్టింది. చనిపోయిన వారి వివరాలను సేకరించే బాధ్యతను నాటి బ్రిటిష్ పాలకులు కొందరు నిపుణులకు అప్పగించారు. వారు దేశవ్యాప్తంగా వివరాలు సమీకరించారు. కానీ నిజాం మాత్రం తన పరిధిలో చనిపోయిన వారి లెక్కలు ఇచ్చేందుకు నిరాకరించాడు. అపర కుబేరుడిగా, హైదరాబాద్ సంస్థానాన్ని ఆధునిక ప్రాంతంగా, అన్ని వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు పేరు గడించాలన్నది ఆయన ఆరాటం. ఆ పాలనకు ఈ మృతుల లెక్కలు మచ్చలా మిగిలిపోతాయని భయపడ్డట్టు చరిత్రకారులు చెబుతారు. అందుకే బ్రిటిష్ పాలకులు వేసుకున్న లెక్కలు చాలా తక్కువగా ఉన్నాయని అమెరికా కోడై కూసింది. బ్రిటిష్ ఎన్సైక్లోపీడియాలో ఇప్పటికీ ఈ‘తప్పుడు’ లెక్కలే ఉన్నాయి. ఈ మరణాలపై తదుపరి ఇతర పరిశోధకులు వెలువరించిన పుస్తకాల్లో లెక్కలు ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం. అమెరికాకు చెందిన మెడికల్ హిస్టోరియన్ జేఎం బారీ చూపిన లెక్కల్లోని గరిష్ట మొత్తం అంత ఎక్కువగా ఉండటానికీ ఇదే కారణం. ఉచిత భోజనాలు పెట్టాల్సిందే అంటు రోగం, కరువుకాటకాలతో అతలాకుతలమైన సమయంలో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాల్సిందే. కానీ నిజాం ఆ పని చేపట్టలేదని తెలుస్తోంది. హైదరాబాద్ సంస్థానం పరిధిలో ఆకలితో ఎంతోమంది అలమటిస్తూ తనువు చాలిస్తున్నా.. ఆయన ఖజానా నుంచి వారికి సాయం చేయలేదని చెబుతారు. విషయం తెలిసి ఈ ప్రాంత బ్రిటిష్ రెసిడెంట్ జోక్యం చేసుకుని నిజాంకు ఆదేశాలు జారీ చేయటంతో అప్పుడు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేయించే చర్యలు ప్రారంభించారని చెబుతారు. అంటువ్యాధులకు చికిత్స కోసం వైద్య వసతి కొంత వరకు మెరుగ్గానే ఉన్నా.. పేదలను ఆదుకునే చర్యలు మాత్రం లేవనేది వారి మాట. -
జన గణ మనకు 'వంద'నం
అఖండ భారతావనిని ఒక్కటి చేసిన జనగణమన గీతానికి వందేళ్ల పండుగొచ్చింది. విశ్వకవి రవీంద్రనాథ్ఠాగూర్ విరచించి తొలిసారి స్వయంగా ఆలపించి ఈ గీతం ఈ నెల 28 నాటికి వందో ఏట అడుగుపెడుతోంది. ఆ మహనీయుడు ఆలపించింది మరెక్కడో కాదు.. మదనపల్లె బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాలలో..అందరం ఒక్కటే..మనందరి గీతం ఒక్కటేనంటూ జాతికి అంకితం చేసిన జాతీయగీతానికి బాణి కట్టింది కూడా ఇక్కడే.. వేష, భాషలు వేరైనా, కట్టుబాట్లు, విశ్వాసాలు విభేదించినా, రైతు నుంచి సరిహద్దులో సైనికుడి వరకు, పలుగు, పార పట్టే శ్రామికుడి నుంచి మరయంత్రాల మధ్య నరయంత్రంలా పని చేసే కార్మికుడి వరకు ఏ గీతం వింటే గుండె నిండా దేశభక్తి అలుముకుంటుందో ఆ జనగణమనకు రేపేశత వసంతాల సంబరం జరుగనుంది. మదనపల్లె సిటీ వందేళ్ల ఉత్సవాలకు శ్రీకారం ఈ నెల 24 నుంచి 28 వరకు భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహణకు కళాశాల యాజమాన్యం కసరత్తులు ప్రారంభించారు. కళాశాల కరస్పాడెంట్ విజయభాస్కర్‌చౌదరి, బీజేపీ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి కలిసి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి ఉత్సవాలను ఆహ్వానించారు. ఠాగూర్ కాటేజీ రవీంద్రనాథ్ ఠాగూర్ బస చేసిన గదిని కాటేజీ ఏర్పాటు చేశారు. అందులో విశ్వకవి చిత్రపటాలను పెట్టారు. కాటేజీ ఎదురుగా రవీంద్రుడి 90 కిలోల పాలరాతి విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఠాగూర్ ఆడిటోరియం నిర్మాణం జరుగుతోంది. లక్ష గళార్చన విశ్వకవి రవీంద్రుడి 150 జన్మదిన వేడుకలు పురస్కరించుకుని 2012లో బి.టి.కళాశాలలో లక్ష గళార్చన నిర్వహించారు. భారీ ఎత్తున జరిగిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 20 వేల విద్యార్థులచే ఐదు సార్లు జాతీయగీతం ఆలపించారు. దక్షిణ భారతదేశంలో శాంతినికేతన్‌గా పేరుపొందిన బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాల(బి.టి) జాతీయగీతం వందేళ్ల పండుగకు ముస్తాబవుతోంది. విశ్వ కవి రవీంద్రనాథ్ఠాగూర్ జనగణమనను ఆంగ్లంలోకి తర్జుమా చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి చరిత్రలో చెరగని స్థానం దక్కింది. మారుమూల ప్రాంత యువతకు విద్యను అందించాలన్న ధ్యేయంతో 1915లో డాక్టర్ అనిబీసెంట్ ఏర్పాటు చేసిన బీటీ కళాశాల స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది. ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఎందరెందరో దేశభక్తులను తయారు చేసింది. తొలిసారిగా.. దక్షిణ భారతదేశ పర్యటనను బెంగుళూరుకు వచ్చిన విశ్వకవి రవీంద్రనాథ్ఠాగూర్ విశ్రాంతికి 1919 ఫిబ్రవరి 25న మదనపల్లెకు విచ్చేశారు. ఇక్కడ వాతావరణానికి ముగ్ధుడైన ఆయన మార్చి 2 వరకు మదనపల్లెలోని బి.టి.కళాశాలలో బస చేశారు. ఈ సమయంలో ఇండోర్ గేమ్స్, సంగీత పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీల్లో విద్యార్థుల గళం నుంచి జాలువారిన దేశభక్తి గీతాలకు స్పందించిన ఠాగూర్ పోటీల అనంతరం ఆర్ట్స్ రూములో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తాను బెంగాల్ భాషలో రాసిన జనగణమణ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. అప్పటి బీటీ కళాశాల ప్రిన్సిపాల్ జేమ్స్ హెచ్.కజిన్స్ భార్య మార్గరేట్ కజిన్స్ సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఠాగూర్ అనువదించిన జనగణమణ గీతాన్ని మార్గరేట్ కజిన్స్ బాణి సమకూర్చారు. కళాశాలలో పెద్ద ఎత్తున జరిగిన పోటీల్లో ముగింపు సమావేశంలో ఈ గీతాన్ని తొలిసారిగా తానే స్వయంగా ఆలపించారు. ఠాగూర్ అనువదించిన జనగణమణ గీతాన్ని మార్గరేట్ కజిన్స్ బాణి సమకూర్చి విద్యార్థులతో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. 1950 జనవరి 24న జనగణమణను భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయగీతంగా ప్రకటించింది. 1950 జనవరి గణతంత్ర దినోత్సవాల్లో జాతీయగీతాన్ని అధికారికంగా మెట్టమొదట ఆలపించారు. మన జాతీయగీతానికిఅర్థం ఇది.. ‘జనులందరి మనస్సుకూఅధినేతవు. భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక. పంజాబు, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగ దేశాలతోనూ వింధ్య, హిమాలయ పర్వతాలతోనూ, యమునా గంగ ప్రవాహాలతోనూ, ఉవ్వెత్తుగా లేచే సముద్ర తరంగాలతోనూ శోభించే ఓ భారత విధాతా! వాటికి నీ శుభ నామం ఉద్భోద కలిగిస్తుంది. అవి నీ ఆశీస్సులు అర్థిస్తాయి. నీ జయగాథల్ని గానం చేస్తాయి. సమస్త జనులకూ మంగళ ప్రదాతవు. భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగు గాక! జయమగుగాక! జయమగుగాక!’ -
రూపాయికి వందేళ్లు
సరిగ్గా వందేళ్ల కింద (1917 నవంబర్ 30న) కాగితపు కరెన్సీలో అతి తక్కువ విలువ కలిగిన రూపాయి నోటును అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో మాత్రమే దీన్ని ప్రవేశపెట్టారు. అంటే మన రూపాయి నోటుకు వందేళ్లు నిండాయన్న మాట. తొలుత నోటును ముద్రించినపుడు ఒక్క రూపాయికి 10 గ్రాముల వెండి నాణెం విలువ ఉండేది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి రూ.390. వందేళ్లలో రూపాయి విలువ 400 పర్యాయాలు పడిపోయింది. 1861 నుంచే వేరే కరెన్సీ నోట్లను విడుదల చేస్తున్నా మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా ఆయుధాల విడిభాగాల తయారీకి రూపాయి వెండి నాణేలను కరిగించడంతో రూపాయి నోట్లను ముద్రించాల్సి వచ్చింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఆసక్తికరమైన పలు అంశాలు... ♦ అప్పటి బ్రిటిష్ రాజు కింగ్ జార్జి–5 బొమ్మతో ఇంగ్లండ్‌లో ముద్రించి ఇక్కడ విడుదల చేశారు. 1926లో దాన్ని ఉపసంహరించారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా కింగ్‌జార్జి–6 బొమ్మతో మళ్లీ ప్రవేశ పెట్టారు. ♦ 1917 నవంబర్ 30న విడుదల చేసినపుడు ‘నేను ఈ మొత్తం చెల్లించడానికి వాగ్దానం చేస్తున్నాను’అని ముద్రించారు. దీనిపై ముగ్గురు బ్రిటిష్ ఆర్థిక శాఖ కార్యదర్శుల సంతకాలున్నాయి. ఇతర పెద్దనోట్లపై మాత్రం ‘ఈ నోటు కలిగిన వారికి ఫలానా మొత్తం ఇచ్చేందుకు నేను హామీ ఇస్తున్నాను’అని ఉంటుంది. ♦ ఉస్మానియా, హైదరాబాద్ రాష్ట్రంలో రూపాయి నోటును 1919, 1943, 1946లలో విడుదలచేశారు. ♦ 1945లో ఈ రూపాయి నోట్లను బర్మాలో కూడా ఉపయోగించేలా సైనికులకు వాటిపై ఎర్రటిముద్రతో పంపిణీచేశారు. ♦ ఫ్రెంచ్ కాలనీల కోసం ఫ్రాన్స్ లోని బ్యాంక్ ఆఫ్ ఇండో చైనా, తమ కాలనీల కోసం పోర్చుగీస్ ప్రభుత్వం ఫ్రెంచ్ ఇండియన్ రూపాయి, పోర్చుగీస్ ఇండియ న్ రూపియాని విడుదల చేశాయి. ♦ 1948 నుంచి 60 రకాల నోట్లు, విభిన్న సీరియల్ నంబర్లు, వాటిని జారీ చేసిన సంవత్సరాలను ముద్రించి విడుదల చేశారు. ♦ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాక గతంలోని నోటు కంటే భిన్నమైన సైజు, రంగుతో ‘ఒక రూపాయి’అని ముద్రించారు. తెలుగు సహా 8 భాషల్లో వెలువడగా, మలయాళాన్ని మినహాయించి 1956లో కేరళ ఏర్పడ్డాక మళ్లీ జతచేశారు. ♦ 1949లో 4 సింహాలు, అశోక చక్రం బొమ్మలతో కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టారు. ♦ అప్పటి ఆర్థిక శాఖ కార్యద ర్శి కేఆర్కే మీనన్ సంతకంతో వెలువడ్డ కొత్త డిజైన్ నోట్లు పాకిస్తాన్‌లోనూ చెలామణి కాగా 1949లో రద్దు చేశారు. ♦ భారత్ గణతంత్ర దేశంగా మారిన తర్వాత విడుదల చేసిన అన్ని ఒక్క రూపాయి నోట్లపై దేశ ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకాలు ఉండగా, మిగతా అన్ని కరెన్సీ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంతకాలున్నాయి. ♦ రూపాయి నోటుపై మాత్రమే భారత ప్రభుత్వం అని ముద్రిస్తుండగా, మిగతా కరెన్సీ నోట్లపై భారతీయ రిజర్వ్‌బ్యాంక్ అని ముద్రించి ఉంటుంది. ♦ 1969లో గాంధీజీ శతజయంతి సందర్భంగా ఆయ న బొమ్మతో ఉన్న రూపాయి నోటు విడుదలైంది. ♦ ఉత్పత్తి ఖర్చు బాగా పెరగడంతో 1995లో రూపాయి డిజైన్‌ను ఉపసంహరించారు. 2016లో పునర్ ముద్రణను ఆర్బీఐ మొదలుపెట్టింది. ♦ 2017లో కొత్త టెలిస్కోపిక్ సిరీస్‌తో రూపాయి నోటును ప్రవేశపెట్టారు. ♦ 1985లో ఎస్.వెంకిటరమణన్ సంతకంతో వెలువడిన ఒక్క రూపాయి నమూనా నోటు 2017 జనవరి 21న క్లాసికల్ నుమిస్మాటిక్స్ గ్యాలరీలో అధికంగా రూ.2.75 లక్షలకు అమ్ముడుపోయింది. ♦ 2015లో ముద్రించిన రూపాయి నమూనా నోటు 2017లో రూ.లక్షన్నరకు విక్రయించారు. 1970 వరకు భారత రూపాయి కరెన్సీని దుబాయ్, బహ్రెయిన్, మస్కట్, ఒమన్ తదితర గల్ఫ్, పర్షియన్ దేశాలు కూడా ఉపయోగించాయి. ఇప్పటివరకు ఈ నోట్లు ఎవరైనా కలిగి ఉంటే ప్రస్తుత పాతనోట్ల సేకరణ మార్కెట్లో రూ.20–30 వేలు వచ్చే వీలుంది. -
ఇజ్రాయెల్ పునాదికి వందేళ్లు!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైన యూదులకు సొంత రాజ్యం పేరుతో 1948 మే 23న ఇజ్రాయెల్ ఏర్పాటుకు ఊతమిచ్చిన ‘బేల్ఫర్ ప్రకటన’కు గురువారంతో వందేళ్లు నిండుతున్నాయి. ప్రత్యేక దేశం కావాలన్న యూదుల ఆకాంక్షకు ఇంగ్లండ్ మద్దతుకు హామీ ఇస్తూ బ్రిటన్ విదేశాంగమంత్రి ఆర్థర్ బేల్ఫర్ 1917 నవంబర్ 2న బేల్ఫర్ డిక్లరేషన్ విడుదల చేశారు. బేల్ఫర్ ప్రకటన నాటికి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది. బ్రిటన్ వ్యతిరేక శిబిరంలోని ఒట్టోమన్ సామ్రాజ్యంలో అంతర్భాగమైన పాలస్తీనా ప్రాంతం ఈ యుద్ధంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్ నాయకత్వంలోని మిత్రదేశాల కూటమి ఆక్రమణలోకి వచ్చింది. అప్పటికే అనేక మంది కుబేరులకు జన్మనిచ్చిన యూదు జాతి నుంచి యుద్ధానికి విరాళాలు, ఆర్థికసాయం సంపాదించే లక్ష్యంతో ఇంగ్లండ్ ఇజ్రాయెల్ స్థాపనకు అనుకూలంగా ఈ ప్రకటన చేసింది. బేల్ఫర్ డిక్లరేషన్ విడుదలైన నాటి నుంచి పాలస్తీనా ప్రాంతానికి ఇతర దేశాల నుంచి యూదుల వలస ఊహించని స్థాయిలో ఊపందుకుంది. ఇజ్రాయెల్ పునాదికి వందేళ్లు! 1947 నవంబర్ 29న ఐరాస తీర్మానం 181 ప్రకారం కొత్తగా ఏర్పడే ఇజ్రాయెల్‌లో యూదులకు 55 శాతం భూభాగాన్ని కేటాయించారు. వాటిలో పాలస్తీనా అరబ్బులు మెజారిటీగా ఉన్న విలువైన మధ్యధరా సముద్రతీర నగరాలున్నాయి. నిజానికి జనాభాలో యూదుల వాటా అప్పటికి మూడో వంతు మాత్రమే. వారి చేతుల్లో ఆరు శాతం కన్నా తక్కువ భూములున్నాయి. దీంతో పాలస్తీనీయులు ఐరాస తీర్మానాన్ని తిరస్కరించారు. వెంటనే పాలస్తీనా అరబ్బులకు, యూదుల జియోనిస్ట్ సాయుధ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో అరబ్బుల ఆస్తి, ప్రాణనష్టం విపరీతంగా జరిగింది. రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్ సేనలతో కలిసి పోరాడిన అనుభవం యూదులకు కలిసొచ్చింది. పాలస్తీనాలో పాలనా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు 1948 మే 15న బ్రిటన్ ప్రకటించింది. అదే నెల 23న యూదుల సొంత దేశం పాలస్తీనా గడ్డపై ఇజ్రాయెల్గా అవతరించింది. అప్పటి నుంచి యూదు జాత్యహంకార ప్రభుత్వాల హింస ఫలితంగా పాలస్తీనా అరబ్బులు లక్షలాది మంది ఇతర దేశాలకు వలసపోయారు. ప్రపంచవ్యాప్తంగా కోటీ 24 పాలస్తీనీయులుండగా, యూదుల ఆధిపత్యంలో జాతి వివక్ష అమలవుతున్న ఇజ్రాయెల్‌లో వారి సంఖ్య నేడు దాదాపు 17 లక్షల(20%)కు పడిపోయింది. యూదుకు సొంత రాజ్యం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచీ ఏడు దశాబ్దాలుగా పాలస్తీనీయులు సొంత పాలన కోసం పోరాడుతూనే ఉన్నారు. పాలస్తీనా విమోజన సంస్థ నేత యాసిర్ అరాఫత్ నాయకత్వాన 1994లో పాలస్తీనా అథారిటీ పేరిట పరిమిత అధికారాల ‘సర్కారు’ను సాధించారు. సంపూర్ణ స్వరాజ్యం వారికి కనుచూపు మేర కనిపించడం లేదు. వందేళ్ల క్రితం బ్రిటన్ ‘బేల్ఫర్ డిక్లరేషన్’మూడు దశాబ్దాలకే యూదులకు సొంత రాజ్యం అందించిందిగాని అక్కడి మెజారిటీ పాలస్తీనీయులకు సొంత దేశం లేకుండా పోయింది. మూడు శాతం నుంచి 75 శాతానికి పెరిగిన యూదుల సంఖ్య! మొదటి ప్రపంచయుద్ధకాలంలో ఒట్టోమన్ సామ్రాజ్యం పతనమయ్యాక పశ్చిమాసియా ప్రాంతాన్ని ఇంగ్లండ్, ఫ్రాన్స్ పంచుకున్నాయి. 1920లో పాలస్తీనా తన పాలనలోకి రావడానికి ముందే తనదికాని ఈ భూభాగాన్ని యూదుల పరం చేస్తామని బేల్ఫర్ ప్రకటన ద్వారా బ్రిటన్ వారిని ఆకట్టుకుంది. ఈ ప్రకటన తర్వాత అంతకుముందు ఉగాండా, అర్జెంటీనాలో ఏదోఒక చోట యూదు రాజ్యం స్థాపన జరుగుతుందనుకున్న ఈ జాతి జనం ‘ఇజ్రాయెల్’వైపునకు పెద్ద సంఖ్యలో పయనమయ్యారు. 1880ల్లో పాలస్తీనాలోని స్థానిక యూదుల జనాభా మూడు శాతం మాత్రమే. బేల్ఫర్ ప్రకటనతో వరదలా వచ్చిపడిన విదేశీ యూదుల్లో ఇజ్రాయెల్ స్థాపనే బలమైన ఆకాంక్ష. 1922–33 మధ్య యూదుల సంఖ్య మొత్తం పాలస్తీనా జనాభాలో 9 నుంచి 27 శాతానికి పెరిగింది. బ్రిటన్ సర్కారు అండతో ధనిక యూదులు పాలస్తీనీయుల భూములను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. జర్మనీలో నాజీల పాలనలో ఎదురైన వేధింపుల వల్ల 1933–36 మధ్య దాదాపు 60 వేల యూదులు దేశం వదలి పాలస్తీనా చేరుకున్నారు. -
11 గంటలు@ వందేళ్లు
న్యూయార్క్: వృత్తిజీవితంలో ఎన్నో ఏళ్లు పనిచేశాం. ఇక విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటున్నారా? అలాంటి వారు ఈ బామ్మ తెలుసుకోవాల్సిందే. వందేళ్లు దాటినా చలాకీగా ఉండే ఈ బామ్మ పేరు ఫెలిమినా రొటుండే. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈవిడ తన వందో పుట్టినరోజు జరుపుకుంది. 50 ఏళ్లు పూర్తయిన వాళ్లలో చాలా మంది రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ, ఈ బామ్మ శతాయుష్షులోనూ పనిచేస్తోంది. అమెరికాలోని బఫెలో నగరంలోని ఓ లాండ్రీ షాపులో పనిచేస్తోంది. పని అంటే అల్లాటప్పా పని కాదు. రోజుకు ఏకబిగిన 11 గంటల పని. బట్టలు ఉతకడం, డ్రైక్లీనింగ్ పనులు బామ్మ చకచక చేసేస్తుంది. ఉదయం ఏడుగంటలకు పని మొదలుపెడితే సాయంత్రంఆరింటికి ముగుస్తుంది. ‘15 ఏళ్లప్పుడు పనిలో చేరా. నా ఉద్దేశంలో అనారోగ్యం వస్తేనే 75ఏళ్లకు రిటైర్ కావాలి. ఆరోగ్యంగా ఉంటే జీవితాంతం పనిచేస్తూ ఉండాలి’ అంటోంది బామ్మ. -
మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు
-
మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు
హైదరాబాద్: మొదటి ప్రపంచ యుద్ధం (జూలై 28, 1914 - నవంబర్ 11, 1918) ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తి అయింది. ఆ యుద్దం ముగిసి రేపటికి 96 సంవత్సరాలు కానుంది. ఈ సందర్భంగా ఆనాటి అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం స్మరించుకోనుంది. చాదర్‌ఘాట్‌లోని మొదటి ప్రపంచ యుద్ధం స్మారక స్థూపం వద్ద రేపు శుక్రవారం ఆధికారికంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్, ప్రాన్స్, జర్మనీ కౌన్సిల్ జనరల్స్ పాల్గొంటారు. మొదటి ప్రపంచం యుద్ధంలో 15 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు. యుద్దంలో 75వేల మంది సైనికులు కన్నుమూశారు. ** -
మొదటి ప్రపంచ యుద్ధం ఘోరానికి నూరేళ్లు
కాలం గుండెల లో ఎప్పటికీ మానని గాయాన్ని మిగిల్చిన ఘటన అది. అత్యాధునిక ఆయుధాలూ, యూనిఫారాలూ ధరించిన రాతియుగపు మనుషులు చేసిన ‘మొదటి ఆధునిక యుద్ధ’మది. కాలం మీద అది తవ్విన రక్తకాసారాలు ఇప్పటికీ కమురు కంపును వెదజల్లుతూనే ఉన్నాయి. అది చరిత్రను రోదింప చేసిన పెను విషాదం. భవిష్యత్ తరాలు నిర్వేదంతో నవ్వుకునేటట్టు చేసిన పెద్ద ప్రహసనం కూడా అదే. ‘సకల యుద్ధాలకూ స్వస్తి చెప్పడానికి’ మొదలైనా, ఆ విఫల యత్నానికి పది లక్షల మందిని బలి చేసిన ఘోర యుద్ధమది. ప్రపంచ మానవాళి మీద చేదు జ్ఞాపకాల గుచ్ఛాన్ని విసిరి వెళ్లిపోయింది. ఆ మహా సమరంలో విజయం నెత్తుటి ధారలదీ, కన్నీటి చారికలదే. ఆధునిక చరిత్ర పొడవునా ఆ పీడకలల ఊరేగింపు ఆ యుద్ధం ఫలితమే. అదే నూరేళ్ల నాటి మొదటి ప్రపంచ యుద్ధం. గ్రేట్‌వార్. కందకాలు మొదటి ప్రపంచ యుద్ధం అనగానే మొదట గుర్తుకు వచ్చేవి కందకాలు లేదా ట్రెంచ్‌లు. ఎనిమిది లేదా తొమ్మిది అడుగుల లోతున, ఐదడుగుల వెడల్పున మైళ్ల కొద్ది వాటిని తవ్వి అందులో నుంచే యుద్ధం చేశారు. అయితే ఇవి భూలోక నరకాలను మరిపించేవి. వర్షం, మంచుతో ఇవి మోకాలిలోతు బురదతో ఉండేవి. ఎలుకలు లక్షలలో ఉండేవి. ఎక్కడ చూసినా శవాలు, వాటి నుంచి వస్తున్న కుళ్లిన వాసన. కందకాల పక్కనే తవ్వే మరుగుదొడ్ల నుంచి వచ్చే దుర్గంధం మరొకటి. శవాల కళ్లు, కాలేయాలు తిని ఎలుకలు అసాధారణ పరిమాణంలోకి ఎదిగిపోయేవి. యుద్ధాన్ని రొమాంటిక్‌గా ఊహించుకుని వచ్చిన కుర్రాళ్లకీ, స్వచ్ఛంద సైనికులకీ వీటితో జీవితం మీద విరక్తి పుట్టిందంటే అతిశయోక్తి కాదు. కందకంలోకి ప్రవేశించాక నా కాళ్లు ఎప్పుడూ పొడిగా లేవు అని రాసుకున్నాడొక సైనికుడు. ఈ భూమ్మీదకి ‘ట్రెంచ్‌ఫుట్’ ఒక కొత్త రోగాన్ని అవి తెచ్చాయి. కందకాల నుంచి ఆనాటి సైనికులు రాసిన ఉత్తరాలలో వాటిలోని స్థితిగతుల గురించి కలచివేసే, కంటి నీరు తెప్పించే అనేక వర్ణనలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం (జూలై 28, 1914-నవంబర్ 11, 1918) ఓ అగ్ని పర్వతంలా బద్ధలైన ఆకస్మిక ఘటన కాదు. దాదాపు నలభయ్ సంవత్సరాల వ్యవధిలో యూరప్‌లో సంభవించిన అనేక వికృత రాజకీయ, సైనిక పరిణామాలకు పరాకాష్ట. 1871 నుంచి జరిగిన యుద్ధాలూ, కుటిలత్వాన్ని రంగరించుకున్న దౌత్యాలూ, రహస్య ఒప్పందాల కారణంగా 1909 ప్రాంతానికే ఆ ఖండం రణ దాహంతో తహ తహలాడిపోతున్న రెండు శత్రు శిబిరాలుగా చీలిపోయింది. ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, జపాన్ ఒక శిబిరంలో చేరాయి. జర్మనీ, ఆస్ట్రియా-హంగెరీ ద్వంద్వ రాజరికం, టర్కీ, ఇటలీ (యుద్ధం వేళకి ఇంగ్లండ్ వైపు జరిగింది) వైరి శిబిరంగాను అవతరించాయి. ఇందులో ‘సూర్యుడు అస్తమించని’ దేశం ఇంగ్లండ్. ‘సూర్యుడి మీద స్థానం’ అని నినాదం అందుకున్న దేశం జర్మనీ. ‘ప్రపంచాధిపత్యం లేదా పతనం’ అంటూ జర్మనీ ఇంకో ఉప నినాదాన్ని కూడా స్వీకరించింది. ఇవన్నీ కలిసి ఆ ఖండాన్ని మందుగుండు గోదాములా మార్చేశాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అపారమైన వ్యయంతో నిర్మించుకున్న మారణాయుధాల గుట్టలతో ఆ గోదామును నింపేశాయి. ఓ చిన్న రివాల్వర్ పేల్చి దానికి నిప్పు ముట్టించినవాడే గవ్రిలో ప్రిన్సిప్. సరాయేవో జంట హత్యలు ‘మా ప్రథమ శత్రువు ఆస్ట్రియా పాలకుడు’ - నరోద్నా ఓద్బ్రానా. ‘ఆస్ట్రియా పాలక హాబ్స్బర్గ్ వంశీకులు ఎవరు కనిపించినా చంపుతాం’- బ్లాక్‌హ్యాండ్. బోస్నియా, హెర్జిగోవినా పాలనా కేంద్రం సరాయేవో నగరం గోడలన్నీ ఇలాంటి రాతలతో, పోస్టర్లతో నిండిపోయి, ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్న సమయంలో ఆస్ట్రియా-హంగెరీ ద్వంద్వ రాజరికానికి వారసుడు, హాబ్స్బర్గ్ వంశీకుడు ఫ్రాంజ్ ఫెర్డినాండ్.. భార్య సోఫీ చోటెక్తో కలసి అక్కడికే వచ్చాడు. సరాయేవో శివార్లలోనే ఉన్న ఫిలిపోవిక్ సైనిక శిబిరంలో ఉన్న 70,000 ఆస్ట్రియా సేన సంసిద్ధతను, తర్ఫీదును పరీక్షించే పేరుతో ఆ ప్రాంత గవర్నర్ జనరల్ ఆస్కార్ పొటియోరిక్ కావాలని యువరాజును రప్పించాడు. ఈ పని ముగిశాక సరాయేవో సిటీ హాలు(విజేనికా)లో ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ఫెర్డినాండ్ హాజరు కావలసి ఉంది. ఏ111 118 నెంబరు నలుపు రంగు 3 గ్రాఫ్ అండ్ స్టిఫ్ట్ స్పోర్ట్స్ కారులో మిల్జాకా నది ఒడ్డునే యాపిల్‌కే మార్గంలో గవర్నర్ పొటియోరిక్, ఫెర్డినాండ్ దంపతులు హాలుకు వెళుతుండగా ఒక యువకుడు డైనమైట్ విసిరాడు. అది తృటిలో తప్పి వెనుక కారు ముందు పడి పేలింది. అయినా ఫెర్డినాండ్ సన్మానానికి హాజరైనాడు. తిరిగి వస్తుంటే మిల్జాకా నది మీదే ఉన్న లాటిన్ బ్రిడ్జికి ఎదురుగా, షిల్లర్ మార్కెట్ అనే తినుబండారాల దుకాణం ముందు రాజ దంపతులను ప్రిన్సిప్ (బెల్జియంలో తయారైన 9ఎ- 17 ఎం ఎం (.380 ఎసిపి) ఫాబ్రిక్ నేషనల్ మోడల్, 1910 సెమీ ఆటోమేటిక్ పిస్తోలుతో) కాల్చి చంపాడు. ప్రిన్సిప్ బ్లాక్‌హ్యాండ్ రహస్యోద్యమ సంస్థ సభ్యుడే. ‘సోఫీ! నువ్వు పిల్లల కోసం బతకాలి’ అంటూనే ఫెర్డినాండ్ చనిపోయాడు. కొన్ని నిముషాలకు సోఫీ కూడా మరణించింది. అప్పటికి ఆమె గర్భవతి. ఆ ఇద్దరిదీ గొప్ప ప్రేమ కథ. వారి పెళ్లికి రాచరికం అంగీకరించలేదు. రాజ్యం అక్కరలేదని హెచ్చరించాక కొన్ని షరతుల మీద (మోర్గనాటిక్ మ్యారేజ్) పెళ్లి చేశారు. ఎవరీ గవ్రిలో ప్రిన్సిప్? సెర్బు జాతీయవాది ఇతడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పేలిన మహా మారణాయుధాల కంటె ఇతడు పేల్చిన చిన్న రివాల్వర్ శబ్దమే చరిత్రను కంపించేలా చేసింది. యువరాజు ఫెర్డినాండ్‌ను హతమార్చాలని బ్లాక్‌హ్యాండ్, నరోద్నా ఓద్బ్రానా వంటి సెర్బు ఉగ్రవాద సంస్థలు కొన్ని నెలల నుంచి వేసిన పథకం వలెనే, హాబ్స్బర్గ్ వంశంతో, ఆస్ట్రియా ఆధిపత్యంతో సెర్బులకున్న వైరం కూడా లోతైనది. గవ్రిలో బోస్నియాలోని గ్రహావా లోయలోని ఒబ్లజాజ్ గ్రామంలో పుట్టాడు. తండ్రి జావో ప్రిన్సిప్, ఇతర కుటుంబ సభ్యులంతా ఉద్యమకారులే. జూన్ 28, 1398న జరిగిన కొసావో యుద్ధంలో సెర్బు వీరుడు లాజరస్ చనిపోయినప్పటి నుంచి వీరి పోరాటం సాగుతోంది. విదోవ్దన్ పేరుతో ఆ రోజును అప్పటి నుంచి ప్రతి ఏటా తలుచుకుని పండుగ చేసుకుంటారు. అప్పటి నుంచి సెర్బుల చాలా భూభాగాలతో పాటు మాంటెనీగ్రో, గ్రీస్, బల్గేరియా వంటి బాల్కన్ ప్రాంతాలన్నీ టర్కీ వశమైనాయి. తరువాత టర్కీ బలహీన పడడంతో 1878లో జరిగిన బెర్లిన్ కాంగ్రెస్‌లో కొన్ని ప్రాంతాలను ఇతర రాజ్యాల అధీనంలో ఉంచారు. అలా బోస్నియా, హెర్జిగోవినా ప్రాంతాలు ఆస్ట్రియా చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ అధీనంలోకి వచ్చాయి. వీటిని కలిపి, పొరుగునే ఉన్న సెర్బియా, దానికి సమీపంలోని కొసావోనూ కలుపుకుని ‘విశాల సెర్బియా’ను ఏర్పాటు చేయాలన్నదే సెర్బుల ఉద్యమం ఉద్దేశం. అదే ఈ అశాంతికి కారణం. అంటే ఆరు దశాబ్దాల నుంచి సెర్బులు చేస్తున్న పోరాటానికి ఇది పరాకాష్ట. సెర్బులు అంటే ఐరోపా దక్షిణాది స్లావ్ జాతీయులే. ఆ కారణంతో జారిస్ట్ రష్యా సెర్బుల ఉద్యమానికి చిరకాలంగా దన్నుగా నిలబడింది. యువరాజు విజేనికా హాలుకు వెళుతుండగా డైనమైట్ విసిరిన మరొక యువకుడు కూడా బ్లాక్‌హ్యాండ్ సభ్యుడే. పేరు- నెడెల్కో కాబ్రినోవిక్. యువరాజు ప్రయాణించిన యాపిల్‌కే దారిలో బాసిక్, ప్రిన్సిప్ సహా ఎనిమిది మందిని ఆయుధాలతో రహస్య సంస్థలు నిలబెట్టాయి. నిజానికి ఈ పథక రచన అంతా సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లోనే కల్నల్ డ్రాగూటిన్ సమక్షంలోనే జరిగింది. ఆయుధాలు కూడా అక్కడ నుంచే రహస్యంగా వచ్చాయి. సరిగ్గా విదోవ్దన్ పండుగ నాడే జూన్ 28, 1914- ఫెర్డినాండ్ సెర్బుల భూభాగంలో పర్యటనకు వచ్చాడు. కాబట్టి అతడు తిరిగి వెళ్లవలసింది- ఆస్ట్రియా రాజధాని వియన్నాకు కాదు, పైలోకాలకే అని సెర్బు జాతీయవాదులు నిశ్చయించుకున్నారు. యుద్ధారంభం తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో చనిపోతే, తమ్ముడు కొడుకు ఫెర్డినాండ్‌ను ఆస్ట్రియా చక్రవర్తి జోసెఫ్ యువరాజుగా ప్రకటించాడు. అతడు కూడా ఇలా దుర్మరణం చెందడం ఆ వృద్ధ చక్రవర్తిని తీవ్రంగా బాధించింది. ‘భగవదేచ్ఛ ఇలా ఉంది!’ యువరాజు మరణవార్తను మోసుకువచ్చిన టెలిగ్రామ్ చూశాక జోసెఫ్ అన్న మాట ఇదే. ఎనభయ్ ఏళ్ల జోసెఫ్ గొప్ప నిర్వేదంలో పడిపోయాడు. కానీ ఆస్ట్రియాకు సన్నిహితుడు, ఫెర్డినాండ్ మిత్రుడు, జర్మనీ చక్రవర్తి విల్హెల్మ్ రంగంలోకి దిగి సెర్బియాకు గుణపాఠం చెప్పే పనికి ఆస్ట్రియాను సిద్ధం చేశాడు. జూలై 5, 1914న విల్హెల్మ్ ఆస్ట్రియాకు ‘బ్లాంక్ చెక్’ ఇచ్చాడు. సెర్బియా టర్కీకి పక్కలో బల్లెం మాదిరిగా ఉంది. దీనితో ఈ విధంగా సెర్బియాను లొంగదీయాలని విల్హెల్మ్ పాచిక పన్నాడు. టర్కీ అండతో విల్హెల్మ్ బాగ్దాద్-బెర్లిన్ రైలు మార్గాన్ని నిర్మించాడు. చమురు రవాణాయే దీని ఉద్దేశం. అక్కడి చమురు నిల్వల మీద ఆనాడే విల్హెల్మ్ కన్నేశాడు. ఆ క్రమంలో అతడు ‘ఇస్లాం పరిరక్షకుడు’ అంటూ తనను తాను చిత్రించుకున్నాడు. జర్మనీ అండతో ఆస్ట్రియా జూలై 23, 1914న సెర్బియాకు అల్టిమేటం జారీ చేసింది. కుట్రదారులను ఆస్ట్రియాకు అప్పగించాలన్న షరతు సహా 10 షరతులను విధించింది. వాటిని ఏ దేశమూ ఆమోదించలేదని ఆస్ట్రియాకు తెలుసు. సెర్బియాను యుద్ధంలోకి దించే వ్యూహంలో భాగంగానే ఆ అల్టిమేటం పంపారు. అయినా రెండు తప్ప మిగిలిన షరతులను సెర్బియా ఆమోదించింది. అయినా ‘ధిక్కారం’ పేరుతో ఆస్ట్రియా జూలై 28న సెర్బియా మీద యుద్ధం ప్రకటించింది. ఆస్ట్రియా ఉనికి బాల్కన్ ప్రాంతాలు లేదా సెర్బుల భూభాగాల మీద విస్తరించడం ఇష్టం లేని రష్యా ఆ మరునాడే సేనల తరలింపును ఆరంభించింది. ఈ దూకుడు ఆపాలని హెచ్చరిస్తూ జర్మనీ ఆగస్టు 1, 1914న రష్యా మీద యుద్ధం ప్రకటించింది. అయితే మొదట జర్మనీ తన సేనను నడిపించినది మాత్రం ఫ్రాన్స్ దిశగా. ష్లీఫెన్ పథకం ప్రకారం రష్యా, ఫ్రాన్స్‌లను ఏకకాలంలో దాసోహమనిపించుకోవాలని జర్మనీ వ్యూహం. దారిలో ఉన్న లక్సెంబర్గ్ విధ్వంసం, తరువాత పక్కనే ఉన్న బెల్జియం విధ్వంసం వరసగా జరిగిపోయాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు దాదాపు నలభయ్ కిలోమీటర్ల దూరంలోని మోన్స్ వరకు జర్మనీ సేనలు వచ్చేశాయి. అదో అత్యంత శక్తిమంతమైన సేన. తటస్థ దేశమైన బెల్జియం మీద దాడికి నిరసనగా ఆగస్టు 4న ఇంగ్లండ్ జర్మనీ మీద యుద్ధం ప్రకటించి, సేనలను ఇంగ్లిష్ చానెల్ మీదుగా ఫ్రాన్స్ వైపు కదిలించింది. మోన్స్ (ఫ్రాన్స్ సరిహద్దు) దగ్గర ఇంగ్లండ్, ఫ్రాన్స్ సేనలు జర్మనీతో తలపడి ఆపాయి. యుద్ధంలో ప్రతిష్టంభన ఏర్పడింది. భూ ఉపరితలం మీద నిలబడి ఎక్కువ సమయం యుద్ధం చేయడం సాధ్యం కాలేదు. అయితే వెనక్కు తగ్గే యోచన ఎవరికీ లేదు. దీనితో అవసరమైనవే కందకాలు (ట్రెంచ్‌లు). ఫ్రాన్స్ సరిహద్దు నుంచి బెల్జియం సరిహద్దుల వరకు దాదాపు ఏడు వందల కిలోమీటర్ల మేర ఈ కందకాలు తవ్వి అందులో ఉండి సైన్యాలు నాలుగేళ్లు యుద్ధం చేశాయి. లూసిటేనియా పేల్చివేత: అమెరికా ప్రవేశం ఇటలీ మొదట జర్మనీ శిబిరంలోనే ఉన్నా, సంవత్సరం తరువాత యుద్ధ ఫలితాలను బట్టి ఇంగ్లండ్ శిబిరం వైపు మారింది. ఇక ‘యూరప్ దగ్ధమైతే మనకేమిటి?’ అన్నదే మొదట అమెరికా అనుసరించిన విధానం. కానీ లూసిటేనియా నౌక పేల్చివేత (మే 7, 1915) అంతిమంగా అమెరికాను యుద్ధంలోకి దిగేటట్టు చేసింది. ఇదొక ఘోరమైన సంఘటన. ఇంగ్లండ్‌కు చెందిన ఈ నౌక టైటానిక్ వంటిదే. న్యూయార్క్ నుంచి మే 1, 1915న అట్లాంటిక్ సాగర జలాలలో లివర్‌పూల్‌కు బయలుదేరిన ఈ నౌకలో 1,248 షెల్స్ (యుద్ధంలో ఉపయోగించే శక్తిమంతమైన బాంబులు) ఉన్నాయని ఆరోపణ. ఐరిష్ తీరానికి 8 మైళ్ల దూరంలోనే జర్మనీకి చెందిన యూ-బోట్ యూ-20 టార్పెడోను ప్రయోగించి పేల్చివేసింది. నౌకలో ఉన్న 1,924 మందిలో 1,119 మంది చనిపోయారు. అందులో అమెరికన్లు 128 మంది. ఈ నౌకలో ప్రయాణించవద్దని అప్పుడు అమెరికా పత్రికలు అన్నింటిలోను జర్మనీ ప్రకటనలు ఇవ్వడం విశేషం. ఈ నౌకా మార్గ రక్షణ వ్యవహారాలు చూస్తున్నవాడు అప్పటి ఇంగ్లండ్ నౌకా విభాగం అధిపతి విన్స్టన్ చర్చిల్. కానీ అమెరికాను యుద్ధంలో దించేందుకు కావాలనే టార్పెడోను నౌక వైపు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. 1917లో ఎన్నికలు ముగిసిన తరువాత అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఏప్రిల్ 6న జర్మనీ మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధ రంగాలు మొదటి ప్రపంచ యుద్ధం పశ్చిమ యుద్ధరంగం (ఫాన్స్- బెల్జియం మధ్య) తూర్పు యుద్ధం రంగం (రుమేనియా-రష్యా మధ్య) ఇటాలియన్ ఫ్రంట్, గల్లిపోలీ (టర్కీ) కేంద్రాలుగా జరిగింది. కానీ ఈ యుద్ధంలో అనేక చిన్న చిన్న యుద్ధాలు కనిపిస్తాయి. మోన్స్ యుద్ధం మొదలు మార్నే, టానెన్‌బర్గ్, అర్రాస్, ఐపర్, వెర్డన్, జట్లాండ్, సొమ్మె, పాశ్చాండల్ వంటి అనేక యుద్ధాలు కనిపిస్తాయి. ప్రతి యుద్ధం ఘోరమైనదే. నాలుగేళ్ల పాటు సగటున గంటకు 230 మందిని బలి తీసుకున్న ఘోర యుద్ధమిది. అర్రాస్ యుద్ధంలో విజయం సాధించి పెట్టి కెనడా (నాడు బ్రిటిష్ వలస) స్వతంత్ర దేశమైంది. నాలుగేళ్లు సాగిన ఈ యుద్ధం చరిత్ర మీద ఏ విప్లవమూ వేయలేనంత ముద్రను వేసింది. వ్యవస్థలను తలకిందులు చేసింది. యుద్ధానికి అంకురార్పణ చేసిన జర్మనీ, దాని ప్రోద్బలంతో యుద్ధాన్ని ఆరంభించిన ఆస్ట్రియా-హంగెరీ, పరోక్ష కారణమైన టర్కీ, సెర్బులకు అండగా, జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగిన రష్యా - ఆ నాలుగు మహా సామ్రాజ్యాలు కూలిపోయాయి. రష్యాకు లెనిన్ నాయకత్వం వచ్చింది అప్పుడే. చిత్రం ఏమిటంటే- ఈ ఘోర యుద్ధంలో అంతిమ విజేతలు సెర్బులే. అయితే ఇది చరిత్రలో అంత ప్రాధాన్యం లేని విషయంగా మిగిలిపోయింది. కొన్ని శతాబ్దాల విశాల సెర్బియా స్వప్నం సాకారమౌతూ సెర్బియాను కలుపుకుని కింగ్డమ్ ఆఫ్ సెర్బ్స్, క్రొయేట్స్ అండ్ స్లొవేన్స్ ఆవిర్భవించింది. అప్పటికి కొద్ది నెలల క్రితమే ఏప్రిల్ 28, 1918న టెరిజిన్ సైనిక కారాగారం (ప్రాగ్ శివార్లలో ఉంది)లో గవ్రిలో ప్రిన్సిప్ చనిపోయాడు. కానీ కింగ్డమ్ ఆఫ్ సెర్బ్స్ ఆవిర్భవించిన ఆ క్షణంలో కారాగారం పరిసరాలలోని ఓ శ్మశాన వాటికలో జైలు అధికారి పుణ్యమా అని రహస్యంగా ఖననమైపోయి, గుప్తంగా ఉన్న గవ్రిలో సమాధిలో ప్రేతాత్మ ముఖం మీద ఓ చిరునవ్వు విరిసి ఉండాలి! కానీ 1915 నుంచి దాదాపు 1938 చివరి వరకు నిర్మించిన కొన్ని లక్షల యుద్ధ మృతుల సమాధుల కింద ఉన్న ఆత్మలు మాత్రం ఇప్పటికీ కుమిలిపోతూనే ఉండి ఉండవచ్చు. - డా॥గోపరాజు నారాయణరావు (గ్రేట్ వార్ ఘటనల ఆధారంగా ఈ వ్యాసకర్త రాసిన నవల ‘క్రిస్మస్చెట్టు’ ప్రస్తుతం కినిగె డాట్ కామ్ వెబ్సైట్లో లభ్యమవుతోంది.) బ్రిటిష్ ఇండియా సేనలు పది లక్షలు మొదటి ప్రపంచ యుద్ధంతో బ్రిటిష్ ఇండియా ప్రమేయం తక్కువదేమీ కాదు. పది లక్షల సైన్యం, మూడు లక్షల ఇతర సిబ్బంది యుద్ధ రంగాలకు వెళ్లారు. అందులో 62,000 మంది చనిపోయారు. యుద్ధం తరువాత చనిపోయిన వారిని కలిపితే మొత్తం 74,187 మంది. 67,000 మంది గాయపడ్డారు. (ఆ దారుణ యుద్ధంలో చనిపోయిన మొత్తం సైనికుల సంఖ్య పది లక్షలు.) ఫ్రాన్స్, ఈజిప్ట్, గల్లిపోలీ, మెసపుటేమియా యుద్ధ రంగాలలో వీరు ఎక్కువగా పోరాడారు. ఐపర్ యుద్ధంలో పాల్గొన్న భారత సిపాయీ ఖుద్అదాద్ ఖాన్ ఆ యుద్ధంలో విక్టోరియా క్రాస్‌ను అందుకున్నాడు. ఇంతకీ 1902లో బ్రిటిష్ ఇండియా సైనిక దళాల సర్వ సేనానిగా ఉన్న లార్డ్ కిష్నర్ యుద్ధ సమయంలో ఇంగ్లండ్ ప్రభుత్వంలో యుద్ధ మంత్రిగా పని చేశాడు. ఇతడి పిలుపు మేరకే కొన్ని లక్షల మంది బాలలు యుద్ధంలో చేరారు. మూడు ఖండాలలో, దాదాపు 33 దేశాల సైన్యాలు గ్రేట్‌వార్‌లో తలపడ్డాయి. భారత్-మహాయుద్ధం ఇంగ్లండ్ వలసగా భారతదేశం ఈ యుద్ధంలో పాల్గొన్నది. ముఖ్యంగా పంజాబ్ శక్తి మేరకు సాయం చేసింది. అప్పటిదాకా అరవై వేలు ఉన్న సిక్కు సైన్యం, మొదటి ప్రపంచ యుద్ధంలో చేరండి అంటూ ఇంగ్లండ్ ఇచ్చిన పిలుపునకు తీవ్రంగా స్పందించింది. ఆ సంఖ్య మూడు లక్షలకు చేరింది. అలాగే పది లక్షల రూపాయల వార్ బాండ్లు పంజాబ్‌లోనే అమ్ముడుపోయాయి. ఫ్రాన్స్‌లో సిక్కు సైనికులు పడిన వేదన కొన్ని ఉత్తరాలలో నిక్షిప్తమై ఉంది. అంహిసాయుత పథంలో భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్న మహాత్మా గాంధీ ఈ యుద్ధానికి బేషరతు మద్దతు ప్రకటించి విమర్శల పాలైనారు. నిజానికి ఆయన ఎప్పుడు ఇంగ్లండ్ యుద్ధంలో దిగినా స్వచ్ఛందంగా సేవలు అందించాడు. 1906 నాటి జులూ యుద్ధం, బోయర్ యుద్ధంలోనూ ఆయన ఆంగ్లేయులకు తన వత్తాసు పలికాడు. దీనిని అనిబిసెంట్ వంటి వారు కఠిన పదజాలంతో విమర్శించారు కూడా. 1918 ఏప్రిల్‌లో వైస్రాయ్ జరిపిన యుద్ధ గోష్టిలో తీసుకున్న నిర్ణయం మేరకు గుజరాత్ అంతా తిరిగి గాంధీ యువకులను పోగు చేయడానికి ప్రయత్నించి విఫలమైనాడు. ఊరికి పది మంది అంటూ ఆయన ఇచ్చిన నినాదం అపహాస్యానికి గురైంది. మొత్తం పది మంది కూడా రాలేదు. అయితే భారతీయ సైనికులను ఆ యుద్ధంలో ఉపయోగించుకునే హక్కు ఇంగ్లండ్‌కు లేదనీ, ఒకవేళ ఉపయోగించుదలుచుకుంటే దేశానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చే విషయం మీద ఒక హామీ ఇవ్వాలనీ మహమ్మదాలి జిన్నా కోరాడు. నిజాం నవాబు సహా, దేశంలోని ఎందరో సంస్థానాధీశులు యుద్ధానికి నిధులూ, సైనికులను సమకూర్చి పెట్టి ప్రభు భక్తిని చాటుకున్నారు.