Illegal connection
-
కంగనా రనౌత్‌కు బీఎంసీ మరో షాక్
న్యూఢిల్లీ : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ముంబై కార్యాలయాన్ని బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూలగొట్టిన కొద్దిరోజులకే బీఎంసీ నుంచి ఫైర్‌బ్రాండ్ నటికి మరో నోటీసు అందింది. ఖర్‌లోని ఆమె ఇంటిని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ బీఎంసీ ఈ నోటీసులు జారీ చేసింది. పాలీహిల్‌లోని ఆమె కార్యాల్యం కంటే ఇంటి నిర్మాణంలోనే అధికంగా అవకతవకలు చోటుచేసుకున్నాయని బీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. ఖర్ వెస్ట్ ప్రాంతంలోని భవనంలో కంగనా ఐదో అంతస్తులో ఉంటున్నారు. ఈ భవనంలో ఆమెకు మూడు ఫ్లాట్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 9న కంగనా ముంబైకి చేరుకునేందుకు సిద్ధమైన క్రమంలో ఆమె కార్యాలయాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ బీఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. తన కార్యాలయం కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ కంగనా రనౌత్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆపై కంగనా కార్యాలయ కూల్చివేతపై కోర్టు స్టే విధించి నటి పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేయాలని బీఎంసీని ఆదేశించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసుపై ముంబై పోలీసుల దర్యాప్తు పట్ల తనకు విశ్వాసం లేదని కంగనా ప్రకటించడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, శివసేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సంజయ్ రౌత్ తనను బెదిరించారని అంటూ ముంబైని పీఓకేతో కంగనా పోల్చడం కలకలం రేపింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరును వివరించేందుకు కంగనా మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీతో భేటీ అయ్యారు. చదవండి : మహారాష్ట్ర గవర్నర్‌తో కంగనా భేటీ -
వేరు కాపురం పెట్టి.. భార్య హత్య
గద్వాల క్రైం: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త గొంతునులిమి హత్య చేసిన సంఘటన సోమవారం సాయంత్రం గద్వాలలో చోటు చేసుకుంది. స్థానికులు, పట్టణ ఎస్ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. గద్వాలలోని తెలుగు రంగన్న, అంజనమ్మల దంపతుల కుమారుడు రామాంజనేయులుకు మల్దకల్ మండలం వామనపల్లికి చెందిన తెలుగు రేణుక(22)తో మూడేళ్ల క్రితం వివాహం చేశారు. అనోన్యంగా ఉంటున్న క్రమంలో రేణుక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని రామాంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను ఎలాగైనా అంతం చేయాలని పథకం వేశాడు. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న నేపథ్యంలో భార్యను ఏం చేయలేక గత 20 రోజుల క్రితం రామాంజనేయులు తల్లిదండ్రులతో ఘర్షణ పడి నాయిబ్రాహ్మణకాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఇంట్లో భార్యను గొంతునులిమి హత్య చేసి పారిపోయాడు. వీరికి ఒక సంవత్సరం బాబు ఉన్నాడు. సంఘటన జరిగిన విషయాన్ని అదే కాలనీలో గొర్రెలు కాస్తున్న వ్యక్తి ఇంట్లో నుంచి కేకలు రావడంతో అక్కడకి వెళ్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రామాంజనేయులుకు ఇదివరకే ఓ మహిళతో వివాహం కాగా విడాకులు ఇచ్చాడు. రేణుక బంధువుల అమ్మాయి కావడంతో గత మూడేళ్ల క్రితం కుటుంబ సభ్యులు మళ్లీ వివాహం జరిపించారు. రామాంజనేయులు ఓ ప్రైవేట్ సెల్‌ఫోన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. -
సర్వేతో అక్రమ కనెక్షన్ ‘కట్’
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం 58,496 ఇళ్లు, 86,344 కుటుంబాలు ఉన్నాయి. అధికారికంగా కార్పొరేషన్ రికార్డుల్లో మాత్రం 24,500 మంచినీటి కనెక్షన్లు ఇచ్చినట్లు ఉంది. వీటిల్లో బీపీఎల్ కోటాలో 5వేలు, జనరల్ కేటగిరీ కింద 19,500 కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుపేదలు కనెక్షన్ తీసుకోవడానికి రూ.200, జనరల్ కేటగిరి కింద రూ.8 వేలు చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించడం కంటే కార్పొరేషన్ సిబ్బంది చేయి తడిపితే వెంటనే కనెక్షన్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క ప్రతీ కనెక్షన్‌కు నెలకు రూ. 110 చెల్లించాలి. ఈ కనెక్షన్ల ద్వారా కార్పొరేషన్‌కు నెలకు సుమారు రూ. 27లక్షల ఆదాయం రావాలి. కానీ కొంత మంది ఇళ్లలో పన్ను వసూళ్ల గురించి అధికారులపై రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అలాగే మరికొన్ని మొండి బకాయిలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రతినిధుల బకాయిలు పోను నెలకు రూ.15 లక్షలు కూడా కార్పొరేషన్‌కు ఆదాయం రావడం లేదు. నిరుపేదలను ముక్కుపిండి పన్ను వసూలు చేస్తున్న సిబ్బంది, బడా బాబుల పన్ను వసూళ్లపై కినుక వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ కనెక్షన్లతో ఆదాయానికి గండి.. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో సుమారు 5 వేల అక్రమ మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. ఒక ఇంటికి ఒక కనెక్షన్ ఉంటే కార్పొరేషన్ సిబ్బందితో తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని మరో కనెక్షన్‌ను అక్రమంగా ఏర్పాటు చేయించకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఏటా ఈ అక్రమ కనెక్షన్ల సంఖ్య పెరుగుతోంది. వీటికి తోడు చిన్నచిన్న మోటార్లను ఈ కనెక్షన్లకు ఏర్పాటు చేసిన నీటిని తోడుతుండడంతో శివారు కాలనీలకు మంచినీరు సరఫరా కావడం లేదు. పట్టణంలోని శ్రీనివాస్‌నగర్, ముస్తఫానగర్, జహిర్పుర, చెరువుబజార్, పార్శీ బంధం, కాల్వొడ్డు ప్రాంతాల్లో ఎక్కువగా అక్రమ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి వీధిలో ఇష్టారీతిలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది సహకారంతోనే అక్రమ కనెక్షన్లు పుట్టకొస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఈ కనెక్షన్ల ద్వారానే నెలకు రూ.5.50 లక్షల కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతోంది. అక్రమ కనెక్షన్లపై కొరఢా ఝుళిపించాల్సిన మున్సిపల్ ఉన్నతాధికారులు వాటిని ముట్టుకుంటే తమ సీట్లకు ఎసరు వస్తుందన్న ఉద్దేశంతో వెనకడుగు వేస్తున్నారు. పక్కాగా సమాచారం సేకరిస్తేనే.. ఈనెల 19న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సర్వేతో ఇళ్లు, కుటుంబం పొందుతున్న సంక్షేమ పథకాలు అన్నీ రికార్డు కానున్నాయి. అయితే సర్వే ఫామ్‌లో మంచినీటి సౌకర్యం కూడా నమోదు చేశారు. తొలిసారిగా ఇంటింటికి వెళ్లి ఈ సర్వే చేస్తుండడంతో అక్రమ కనెక్షన్లు బయట పడే అవకాశం ఉంది. ఇతర శాఖల సిబ్బందిని కూడా సర్వేకు వినియోగిస్తుండడంతో కార్పొరేషన్ పరిధిలో అక్రమ కనెక్షన్ల సంఖ్య తేలనుంది. ప్రతి ఇంటికి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో ‘మంచి నీటి సౌకర్యం’కాలంలో విధిగా ఎన్యుమరేటర్ పేర్కొనాలి. ఇలా వచ్చిన సమాచారాన్ని కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. ఈ నివేదికలో అక్రమ కనెక్షన్ల సంఖ్య కూడా పేర్కొననున్నారు. దీంతో సర్వే అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కనెక్షన్లను కట్ చేయనున్నారు. ఇదంతా మున్సిపల్ అధికారులు పారదర్శకంగా చేస్తేనే జరుగుతుంది... లేకపోతే ప్రభుత్వం బృహత్తరంగా తీసుకున్న సమగ్ర సర్వే బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారనుంది.