illicit alcohol
-
రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!
దుస్తులు, నిత్యం వినియోగించే వస్తువులు సహా ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) వంటి ఐదు కీలక విభాగాల్లో అక్రమ మార్కెట్ పెరుగుతోందని ఫిక్కీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ అక్రమ మార్కెట్ విలువ ఏకంగా రూ.7.97 లక్షల కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొంది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి కఠిన శిక్షలు, మెరుగైన నిఘా వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర సహాయమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు తెలిపారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) కమిటీ-క్యాస్కేడ్, థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి. అందులోని వివరాల ప్రకారం..2022-23లో అధికంగా ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో రూ.2.23 లక్షల కోట్ల అక్రమ మార్కెట్ జరిగింది. ఇది దేశంలో జరిగిన మొత్తం అక్రమ మార్కెట్లో నాలుగో వంతు కంటే ఎక్కువ. వస్త్రాలు, దుస్తుల విభాగంలో అక్రమ వ్యాపారం రూ.4.03 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ అక్రమ మార్కెట్లో దీని వాటా సగానికిపైగా ఉంది. 2017-18లో ఇది రూ.3.11 లక్షల కోట్లుగా ఉండేది. 29.67% ఈ మార్కెట్ వృద్ధి చెందింది.ఫిక్కి క్యాస్కేడ్ పదో ఎడిషన్ ‘మాస్క్రేడ్ 2024’ కార్యక్రమంలో కేంద్రమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు మాట్లాడుతూ..‘దేశ ఆర్థిక వృద్ధిని నాశనం చేసే అక్రమ మార్కెట్‌కు వ్యతిరేకంగా వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు భారీ జరిమానాలు విధించాలి’ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సీబీఐసీ సభ్యులు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ..‘నకిలీ వస్తువులు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధునాతన సాంకేతికతతో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనివల్ల రోజూ సగటున 60 అక్రమాలు గుర్తిస్తున్నాం. గత 15 నెలల్లో 3,000 మందిని అరెస్టు చేశాం. రూ.40 కోట్ల విలువైన విదేశీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాం’ అన్నారు. ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలుఅక్రమ వ్యాపారం అనేది కేవలం భారత్‌కు సంబంధించింది మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్య అని ఫిక్కీ క్యాస్కేడ్ ఛైర్మన్ అనిల్ రాజ్‌పుత్ అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ అక్రమ మార్కెట్‌పై తగిన చర్యలు చేపట్టాలి. అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలి’ అని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కంప్లయన్స్ అండ్ ఫెసిలిటేషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రణబ్ కుమార్ దాస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా పాల్గొన్నారు.నివేదికలోని వివరాలు..ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్), ఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు), మద్యం, పొగాకు, వస్త్రాలు & దుస్తులు వంటి ఐదు విభాగాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోంది.2022-23లో దేశంలో అక్రమ మార్కెట్ పరిమాణం రూ.7,97,726 కోట్లుగా ఉంది.ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్)-రూ.2,23,875 కోట్లుఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు)-రూ.73,813 కోట్లువస్త్రాలు, దుస్తులు-రూ.4,03,915 కోట్లుపొగాకు ఉత్పత్తులు-రూ.30,017 కోట్లుమద్యం-రూ.66,106 కోట్లుఇదీ చదవండి: పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓదేశీయంగా వివిధ మార్గాల్లో విభిన్న వస్తువులను అక్రమంగా తరలిస్తూ స్థానికంగా మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పన్నుల రూపంలో రావాల్సిన నిధులు సమకూరడం లేదు. దాంతో తప్పక పన్నులు, ఇతర వస్తువుల ధరలు పెంచుతున్నారు. ఏదేమైనా అక్రమ మార్కెట్ సామాన్యుడి నెత్తిన భారంగా మారుతోంది. -
ఆ భార్యాభర్తల మృతి తర్వాతే.. 55కి చేరిన తమిళనాడు కల్తీ కాటు మృతుల సంఖ్య!
చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 15 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 55కు చేరుకుంది. ప్రస్తుతం ఇంకా 100 మందికిపైనే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్లలోనూ 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.ఇక, కల్తీ సారా ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించింది. విచారణ చేపట్టాలని ఆదేశించింది. కాగా, సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా.. ఈ కేసు విచారణను సీబీసీఐడీతో కాకుండా సీబీఐతో జరిపించాలని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. #DGNews | #Kallakurichi illicit #liquor deaths:Nos of deceased at Kallakurichi Government Hospital - 30Mundiampakkam Government Hospital - 4Salem Government Hospital - 18JIPMER Hospital in Puducherry - 3Total number of deaths - 55#tamilnadu #கள்ளக்குறிச்சி #Resign_Stalin— Saji Agniputhiran (@Sajiagniputhira) June 22, 2024 మరోవైపు.. కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 55 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ స్పీకర్ అప్పావు వారిని మార్షల్స్‌తో బయటకు పంపించి వేశారు. ఈ ఆందోళనల్లో ఏఐఏడీఎంకేలోని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం సభ్యులు పాల్గొనక పోవడం గమనార్హం. #WATCH | Tamil Nadu | On Kallakurichi Hooch tragedy, PMK President Dr. Anbumani Ramadoss says, "We want a CBI inquiry into the incident...It is a sad & unfortunate incident which has happened in Kallakurichi. Last year, in the Villipuram & Kanchipuram districts, 29 people died… pic.twitter.com/uPvJvsIWIo— ANI (@ANI) June 21, 2024నిర్లక్ష్యం వల్లే ఇన్ని ప్రాణాలా?కరుణాపురంలో కల్తీసారా తాగి తొలుత దివ్యాంగుడైన పెయింటర్ సురేష్ (35) చనిపోయాడు. ఇదే సారా తాగిన ఆయన భార్య వడివుక్కరసి గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. అయితే డాక్టర్లు ఇద్దరు సహజంగా.. అనారోగ్యంతో చనిపోయారని ప్రకటించారు. రెండు రోజుల తర్వాతే కల్తీసారా వల్లే దంపతులు చనిపోయారని వైద్యులు ప్రకటించారని సురేష్ సోదరుడు మీడియాకు చెబుతున్నాడు. ఒకవేళ.. వీళ్లిద్దరూ చనిపోయిన కారణాలను వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తే మిగిలినవారైనా బతికేవారేమోనన్న చర్చా నడుస్తోందక్కడ. అయితే కావాలనే ఆ కారణం బయటకు చెప్పకుండా వైద్యులు ఉన్నారన్న విమర్శ ఒకటి వినిపిస్తోంది. మరోవైపు.. ఈ భార్యాభర్తలవి కల్తీసారా మరణాలు కావని స్థానిక కలెక్టర్ చెప్పినట్లు అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. ఆయన ప్రకటన తర్వాతే.. మిగతా వాళ్లు సారా తాగి ప్రాణాలు పొగొట్టుకున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కలెక్టర్‌ను బదిలీ చేశారు. ఎస్పీని సస్పెండ్ చేశారు. కళ్లకురిచ్చిలో కల్తీసారా విక్రేతల నుంచి పోలీసులకు మామూళ్లు వెళ్తుంటాయని బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం మృతుల్లో కళ్లకురుచ్చి ప్రభుత్వాసుపత్రిలోనే 28 మంది ప్రాణాలు వదిలారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురు కంటిచూపు కోల్పోయారు. ఈ ప్రాంతం మారుమూల ఉండడం, సకాలంలో వైద్యం అందకపోవడంతోనే పరిస్థితికి కారణమైంది. -
తమిళనాట 50కి చేరిన మద్యం మృతులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం మరో 10 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 50కి చేరాయి. అలాగే, సారా తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న మరో ఇద్దరు కూడా మరణించడంతో ఆ సంఖ్య 50ని దాటింది. అయితే, వీరి మరణంపై అధికారులు విచారణ చేపట్టారు. దీంతోపాటు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కల్తీ సారా మరణాల ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. దద్దరిల్లిన అసెంబ్లీ కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 50 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ స్పీకర్ అప్పావు వారిని మార్షల్స్‌తో బయటకు పంపించి వేశారు. ఈ ఆందోళనల్లో ఏఐఏడీఎంకేలోని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం సభ్యులు పాల్గొనక పోవడం గమనార్హం. -
కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి.. పలువురికి అస్వస్థత
పట్నా: కల్తీ మద్యానికి బిహార్‌లో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా మరో ఆరుగురు మద్యం కాటుకు బలయ్యారు. ఛాప్రా జిల్లాలోని సరన్ ప్రాంతం ఐసౌపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోయిలా గ్రామంలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించిన క్రమంలో ఐదుగురు గ్రామంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. మరికొంత మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మృతులు సంజయ్ సింగ్, హరిందర్ రామ్, కునాల్ సింగ్, అమిత్ రంజన్లు సహా మరికొంత మంది కల్తీ మద్యం తాగి అనారోగ్యానికి గురయ్యారని మధురా డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా? అనే విషయంపై విచారిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రాణం తీసిన ప్రేమ?.. 80 రోజుల క్రితం అదృశ్యమై -
అడ్డదారుల్లో మద్యం అమ్మకాలు
మద్య నిషేధం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంటే ఉన్నతాశయానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకువచ్చి విక్రయాలు చేస్తూ వ్యాపారంగా మార్చుకున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి అడ్డదారుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను (ఎన్డీపీ) అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) దృష్టి సారించింది. ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు నిర్వహించి విక్రయాలకు బ్రేక్ వేస్తోంది. నెల్లూరు(క్రైమ్): వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీ మద్యనిషేధం అమలుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే మద్యం దుకాణాల నిర్వహణ, 33 శాతం దుకాణాల కుదింపు, పరి్మట్రూమ్ల రద్దు, బెల్టుషాపులపై ఉక్కుపాదం తదితర చర్యలు తీసుకుంది. మద్య వినియోగాన్ని తగ్గించేందుకు ధరలను భారీగా పెంచింది. దీంతో కొందరు మందుబాబులు స్వచ్ఛందంగా మద్యానికి స్వస్తి పలుకుతున్నారు. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ఇంకొందరు దీనిని వ్యాపారంగా మార్చుకుని తమిళనాడు మద్యం బాటిళ్లను జిల్లాకు తీసుకువచ్చి విక్రయాలు చేస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా.. ►తమిళనాడు రాష్ట్రం జిల్లాకు సరిహద్దు ప్రాంతం. మన రాష్ట్రాంలో ఓ బ్రాండ్ క్వార్టర్ మద్యం ధర రూ.450 ఉండగా అదే మద్యం ధర తమిళనాడు రాష్ట్రంలో రూ.300కే దొరుకుతోంది. ►ఈక్రమంలో సూళ్లూరుపేట, తడ, మన్నారుపోలూరు, చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ, నడిమికుప్పం తదితర ప్రాంతాలకు చెందిన అనేకమంది మందుబాబులు పక్క రాష్ట్రంలోని ఆరంబాకం, గుమ్మడిపూండి, చిన్నోబులాపురం, వీరకాడు తదితర ప్రాంతాలనుంచి పెద్దఎత్తున మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ►కొందరు అక్రమార్కులు ఇదే అవకాశాన్ని ఆదాయవనరులుగా మార్చుకుంటున్నారు. ►తడ నుంచి తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్లేందుకు వివిధ మార్గాలు ఉండడంతో వాటిని తమకు అనుకూలంగా మలుచుకుని తమిళ మద్యాన్ని జిల్లాలోకి తీసుకువస్తున్నారు. ►ఫుల్ బాటిల్‌పై రూ.500 నుంచి రూ.800 మార్జిన్ పెట్టుకుని విక్రయిస్తున్నారు. తెలంగాణ నుంచి వివిధ మార్గాల్లో అక్కడి మద్యం సైతం జిల్లాలో అందుబాటులో ఉంది. తనిఖీలు నామమాత్రమే.. ►జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులున్నా అక్కడ తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయన్న విమర్శలున్నాయి. ►పక్కా సమాచారం ఉంటే తప్ప చెక్‌పోస్ట్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవన్న ఆరోపణలున్నాయి. ►కొందరు సిబ్బంది సైతం అక్రమరవాణాకు సహకరిస్తున్నారని ప్రచారం ఉంది. బైక్‌లు, కార్లు, ఇతర వాహనాల ద్వారా మద్యం జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ప్రత్యేక నిఘా ►పొరుగు మద్యం అక్రమ విక్రయాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దృష్టి సారించింది. ►ఆ విభాగ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వి.రాధయ్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ►ఎస్ఈబీ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసాచారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి సరిహద్దు చెక్‌పోస్టులతోపాటు అంతర్గత రహదారుల వద్ద నిఘా పెట్టి దాడులు ముమ్మరం చేశారు. ►నెలరోజుల వ్యవధిలో 21 కేసులు నమోదు చేసి 24 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 70.02 లీటర్ల మద్యం, 3.9 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. ►మద్యాన్ని తరలిస్తున్న నాలుగు వాహనాలను సీజ్ చేశారు. ►తనిఖీలను అధికారులు ముమ్మరం చేశారు. లాక్డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అధికారులు సుమారు 146 లీటర్ల మద్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. పూర్తిస్థాయిలో కట్టడికి.. స్థానిక పోలీసుల సహకారంతో పొరుగు రాష్ట్ర మద్యాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఎస్ఈబీ అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వారి ద్వారా అక్రమరవాణా, విక్రయాలపై నిఘా ఉంచనున్నారు. అక్రమ వ్యాపారానికి సహకరిస్తున్న సిబ్బంది ఎవ్వరనే విషయంపై రహస్యంగా వివరాలు సేకరిస్తున్నారు. దాడులు ముమ్మరం మద్యం అక్రమరవాణా, నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై జిల్లావ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. పెద్దఎత్తున మద్యం పట్టుకోవడంతోపాటు అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తున్నాం. పొరుగు రాష్ట్రం (ఎన్డీపీ) మద్యం అక్రమరవాణా, విక్రయాలపై దృష్టి సారించాం. దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఎస్ఈబీ ఏర్పాటైన నాటినుంచి ఎన్డీపీ విక్రయాలు, రవాణాపై ఇప్పటివరకు 21 కేసులు నమోదు చేశాం. నాటుసారా తయారీ, విక్రయాలపై దాడులు చేసి కేసులు పెట్టాం. సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాం. అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తాం. –డాక్టర్ వి.రాధయ్య,ఎస్ఈబీ డిప్యూటీ కమిషనర్ -
ఎక్సైజ్ అధికారులు దాడులు : ముగ్గురు అరెస్ట్
విజయవాడ : కృష్ణాజిల్లా నందిగామలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ముమ్మరం దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందిగామ పరిసర ప్రాంతాల్లో నాటు సారాను భారీగా తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.