immigration policy
-
భారత నిపుణుల చూపు కెనడా వైపు
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాలు, తదితర కాలం చెల్లిన ఇమిగ్రేషన్ విధానాల ఫలితంగా భారతీయ నిపుణులు అమెరికాకు బదులు కెనడాకు తరలిపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు (శాశ్వత నివాస) హోదాను దేశాలవారీ కోటా ప్రకారం మంజూరు చేయడం కూడా ఇందుకు కారణమని తెలిపారు. హెచ్–1బీ వీసా గానీ, శాశ్వత నివాస హోదా పొందడం గానీ కెనడాతో పోలిస్తే అమెరికాలో కష్టతరమైన విషయం కాబట్టే ఇలా జరుగుతోందన్నారు. అమెరికాకు రావాల్సిన భారత నిపుణులు, విద్యార్థులు కెనడా వైపు మొగ్గు చూపడాన్ని ఆపేందుకు తక్షణమే తగు చర్యలు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ అనుమతి కోసం ఎదురుచూడకుండా, ఉద్యోగిత ఆధారంగా భారతీయులకు ఇచ్చే మూడు రకాలైన వీసాల సంఖ్యను ప్రస్తుతమున్న 9,15,497 నుంచి 2030కల్లా 21,95,795కు పెరిగేలా చూడాలని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టువార్ట్ ఆండర్సన్ చెప్పారు. గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్లుగా, దశాబ్దాలుగా ఎదురుచూసే వారి సంఖ్యను 20 లక్షల నుంచి కనీస స్థాయికి తగ్గించాలంటూ ఆయన హౌస్ జ్యుడిషియరీ కమిటీలోని ఇమిగ్రేషన్, సిటిజన్‌షిప్ ఉపకమిటీ ఎదుట హాజరై తెలిపారు. అమెరికా యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య 2016–17, 2018–19 సంవత్సరాల్లో 25%పైగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. అమెరికా వర్సిటీల్లోని ఫుల్‌టైమ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 75% మంది విదేశీయులు కాగా, వారిలో 2016–17లో మూడింట రెండొంతులు భారతీయులే ఉన్నారని ఆయన వివరించారు. అదే సమయంలో, కెనడాలో చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య 2016లో 76,075 కాగా 2018 నాటికి ఇది 127% పెరిగి 1,72,625కు చేరిందని పేర్కొన్నారు. -
కీలక ఉత్తర్వులపై బైడెన్ సంతకం
వాషింగ్టన్: దేశ వలస విధానంలో సమూల మార్పులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి 3 కార్యనిర్వాహక ఉత్తర్వులపై బైడెన్ సంతకాలుచేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ వలసదారులపై అమలు చేసిన అత్యంత కఠిన నిబంధనల్ని వెనక్కి తీసుకున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసే దుర్మార్గమైన విధానాల్ని ట్రంప్ అనుసరించారని వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు బైడెన్ చెప్పారు. డాలర్ డ్రీమ్స్ కలలు తీరేలా, ముస్లింలపై నిషేధం ఎత్తివేసి దేశ సరిహద్దుల్లో సక్రమం పర్యవేక్షణ జరిగేలా వలస విధానం ఉంటుందన్నారు. వచ్చే 180 రోజుల్లో∙ప్రభుత్వ సంస్థల చేసే సిఫారసుల మేరకు జరిగే మార్పుల వల్ల అమెరికా పౌరసత్వం కావాలనుకునే భారతీయుల కలలు నెరవేరే అవకాశాలున్నాయి. ఆ మూడు ఉత్తర్వులు ఇవే.. ! 1. ట్రంప్ హయాంలో చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోయిన వలసదారుల కుటుంబాలను కలపడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ మొదటి కార్యనిర్వాహక ఉత్తర్వుని జారీ చేశారు. విడిపోయిన తల్లిదండ్రుల్ని, పిల్లల్ని కలిపే కార్యక్రమాన్ని ఈ కమిటీ నిర్వహిస్తుంది. అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసల నివారణకు ట్రంప్ ప్రభుత్వం అనుసరించి, జీరో టాలరన్స్ విధానం వల్ల 5,500 కుటుంబాలు విడిపోయాయి. ఇప్పటికీ 600కిపైగా పిల్లల తల్లిదండ్రుల్ని గుర్తించలేకపోయారు. 2. అమెరికాకు వలసలు పోటెత్తడానికి గల కారణాలను తెలుసుకొని వాటిని నివారించడం, మానవతా దృక్ఫథంతో శరణార్థుల్ని అక్కున చేర్చుకునే విధంగా వ్యూహాన్ని రచించడమే లక్ష్యంగా రెండో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఉత్తర మెక్సికోలో మానవీయ సంక్షోభానికి దారి తీసిన మైగ్రెంట్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ కార్యక్రమాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ ఉత్తర్వుల్లో హోంల్యాండ్ సెక్యూరిటీని ఆదేశించారు. 3. ఇక మూడో కార్యనిర్వాహక ఉత్తర్వు స్వేచ్ఛాయుత చట్టబద్ధమైన విలస విధానానికి సంబంధించింది. ఇటీవల కాలంలో వలస విధానానికి సంబంధించిన నియంత్రణల్ని, విధానాలను ప్రభుత్వం సమూలంగా సమీక్షించడం కోసం మూడో ఉత్తర్వుపై సంతకం చేశారు. దేశంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించే గ్రీన్ కార్డు రాకుండా అడ్డుకునే పబ్లిక్ చార్జ్ నిబంధనల్ని ప్రభుత్వం సమీక్షిస్తుంది. విదేశాల్లో జన్మించి అమెరికాలో ఉంటున్న వారు 40 లక్షల మందికిపైగా ఉన్నారు. వీరిలో భారతీయులే అధికం. ఈ కొత్త అమెరికన్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఊతంగా ఉంటారని భావిస్తున్న బైడెన్ వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ఉత్తర్వుల్ని తీసుకువచ్చారు. -
ముగిసిన మాటల పోరు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగే ప్రెసిడెన్షియల్ డిబేట్స్‌లో చివరి డిబేట్ హోరాహోరీగా ముగిసింది. అయితే తొలి డిబేట్‌తో పోలిస్తే ఈసారి వ్యక్తిగత దూషణలు, మాటలకు అడ్డం పడడాలు చాలావరకు తగ్గాయి. ముఖ్యంగా అభ్యర్థుల మైక్‌ను మ్యూట్ చేసే ఆప్షన్ బాగా ఉపయుక్తమయింది. ట్రంప్, బైడెన్లు డిబేట్లో కరోనా, జాత్యహంకారం, పర్యావరణం, వలస విధానం తదితర అంశాలపై తమ వైఖరులను వివరించారు. నాష్‌విల్లేలోని బెల్మాట్ యూనివర్సిటీలో సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ డిబేట్లో కరోనా వైరస్ కట్టడి విషయంలో ఒకరినొకరు దుయ్యబట్టుకున్నారు. డిబేట్‌కు ఎన్బీసీ న్యూస్‌కు చెందిన క్రిస్టిన్ వెల్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఎన్ని కట్టడులు చేసినా ట్రంప్, బైడెన్ ఒకరి వ్యక్తిగత విషయాలను మరొకరు విమర్శించడం మానలేదు. తొలి డిబేట్ అనంతరం ట్రంప్ కరోనా బారిన పడి కోలుకోవడంతో ఈ చివరి డిబేట్ ఆసక్తికరంగా మారింది. వివిధ అంశాలపై అభ్యర్థుల వాదనలు... కరోనా వైరస్: ట్రంప్: ఇది ప్రపంచవ్యాప్త సమస్య. కానీ, దీన్ని ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నానని పలు దేశాలు ప్రశంసించాయి. చైనా కారణంగానే ఈ వైరస్ ప్రబలింది. టీకా అతి త్వరలో అందుబాటులోకి రానుంది. కొన్ని వారాల్లోనే దీనిపై ప్రకటన రావచ్చు. ప్రభుత్వం వ్యాక్సిన్ సత్వర పంపిణీకి తయారుగా ఉంది. బైడెన్: ట్రంప్ విధానాలతో కరోనా కారణంగా దేశంలో లక్షల మరణాలు సంభవించాయి. అమెరికా త్వరలో మరో డార్క్‌వింటర్‌ను(తీవ్రమైన చలికాలం అని ఒక అర్థం కాగా, అమెరికాపై జరిగే బయోవెపన్ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధమయ్యే ప్రాజెక్ట్ అని మరో అర్థం) చూడనుంది, కానీ, ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్లాన్ లేదు. వచ్చే ఏడాది మధ్య వరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా కనిపించడంలేదు. కరోనాతో జీవించడాన్ని ప్రజలు నేర్చుకుంటున్నారని ట్రంప్ చెబుతున్నాడు, కానీ ప్రజలు దీంతో చావును నేర్చుకుంటున్నారు. నా వద్ద కరోనా కట్టడికి మంచి ప్రణాళిక ఉంది. జాత్యహంకారం.. ట్రంప్: నల్లజాతీయుల చాంపియన్ నేనే. అబ్రహం లింకన్ తర్వాత నల్లజాతీయులకు అనేక ప్రయోజనాలు చేకూర్చిన ప్రెసిడెంట్ సైతం నేనే. ఇక్కడున్న వారందరిలో అతితక్కువ జాత్యహంకారం ఉన్న వ్యక్తిని కూడా నేనే! బైడెన్: ఆధునిక అమెరికా చరిత్రలో అత్యంత జాత్యహంకార అధ్యక్షుల్లో ట్రంప్ ఒకరు. ప్రతి జాతి ఘర్షణలో ఆజ్యం పోస్తాడు. గత డిబేట్లో సైతం తన జాత్యహంకార బుద్ధిని ప్రదర్శించాడు. వలసవిధానం.. ట్రంప్: అక్రమ వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం సబబే. ప్రభుత్వం వారిని సురక్షితంగా చూసుకుంది. బైడెన్: పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం అమెరికా పాటించే విలువలకే అవమానం. హెల్త్‌కేర్.. ట్రంప్: ఒబామా కేర్ కన్నా మెరుగైన ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చాను. దీన్ని ఇంకా మెరుగుపరుస్తాను. బైడెన్: ఉత్తమమైన ఒబామా కేర్‌ను తీసివేసిన అనంతరం సరైన హెల్త్‌కేర్ పాలసీని ట్రంప్ తీసుకురాలేకపోయారు. పర్యావరణం.. ట్రంప్: చైనా, ఇండియా, రష్యాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏమీ చేయట్లేదు. చైనాను చూడండి ఎంత మురికిగా ఉందో. ఇండియా, రష్యాలు కూడా అంతే. ఆ దేశాల్లో గాలి శ్వాసించలేనంత కలుషితంగా ఉంది. పర్యావరణ పరిరక్షణ పేరిట అమెరికా వృ«థా ఖర్చును నివారించేందుకు పారిస్ డీల్ నుంచి బయటకు వచ్చాము. ఆ ఒప్పందం కారణంగా మన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమెరికా ఉద్గార గణాంకాలు 35 ఏళ్లలోనే ఉత్తమంగా ఉన్నాయి. బైడెన్: మరింత ఎకోఫ్రెండ్లీ ఆర్థిక వ్యవస్థగా అమెరికాను మార్చే ప్రణాళిక ఉంది. దీనివల్ల మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచ పర్యావరణానికి గ్లోబల్ వార్మింగ్ ముప్పు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. అవినీతి ట్రంప్: బైడెన్ లాగా నేను చైనా నుంచి అక్రమ సొత్తు సంపాదించలేదు. ఉక్రెయిన్ నుంచి లంచాలు తీసుకోలేదు. రష్యా నుంచి ముడుపులు స్వీకరించలేదు. బైడెన్: చైనా నుంచి ముడుపులు తీసుకుంది నా కుమారుడు కాదు. ట్రంపే ముడుపులు స్వీకరించాడు. హంటర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణల్లో ఎలాంటి తప్పులు జరిగినట్లు తేలలేదు. అమెరికాను మరోమారు అగ్రగామిగా నిలుపుతానని ట్రంప్ పేర్కొనగా, ఈ ఎన్నికల ఫలితాలపై అమెరికా భవిష్యత్ ఆధారపడి ఉంటుందని బైడెన్ చెప్పారు. హోరాహోరీగా జరిగిన డిబేట్లో ఎవరూ పైచేయి సాధించలేదని, ఇరువురూ తమ తమ విధానాలను గట్టిగా సమర్ధించుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. సీఎన్ఎన్ మాత్రం తాము జరిపిన పోల్ ప్రకారం డిబేట్లో బైడెన్‌దే పైచేయిగా 53 శాతం మంది భావించినట్లు తెలిపింది. చాలావరకు ప్రశాంతం.. తొలి డిబేట్‌తో పోలిస్తే మలి డిబేట్ చాలావరకు ప్రశాంతంగా జరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పలు అంశాలపై ఇరువురూ తీవ్రంగా విభేదిస్తూ వాదించుకున్నా, ఒకరికొకరు అడ్డంపడి మాట్లాడటం చాలావరకు తగ్గింది. చాలామంది గతంతో పోలిస్తే ట్రంప్ ఈ దఫా చాలా హుందాగా ప్రవర్తించారని భావించారు. ఉదాహరణకు డిబేట్‌కు ముందు వ్యాఖ్యాతపై పలు నెగెటివ్ వ్యాఖ్యలు చేసిన ట్రంప్ డిబేట్ అనంతరం ఆమెను ప్రశంసించారు. డిబేట్‌ను చాలా బాగా నిర్వహించారన్నారు. కరోనా కారణంగా డిబేట్ చూసేందుకు ప్రత్యక్షంగా 200 మందిని మాత్రమే అనుమతించారు. అభ్యర్థ్ధులకు మధ్య గ్లాస్ గోడలు పెట్టాలని నిర్ణయించినా చివరకు ఏర్పాటు చేయలేదు. డిబేట్‌కు ముందు ఇరువురికీ కరోనా పరీక్ష నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఈసారి ట్రంప్ కుటుంబసభ్యులతో సహా ప్రేక్షకులంతా మాస్కులు ధరించారు. -
ట్రంప్ నిజంగా మూర్ఖుడు, అబద్దాల కోరు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజంగా మూర్ఖుడు, అబద్దాల కోరు అంటూ ట్రంప్ సోదరి మరియన్నే ట్రంప్ బారీ ఆరోపించారు. అతను ఎవరిని అంత త్వరగా నమ్మడని.. తన సిద్దాంతాల కోసం ఎంతదూరమైనా వెళ్తాడంటూ ఆమె పేర్కొన్నారు. మరియన్నే చేసిన వ్యాఖ్యలు సీక్రెట్‌గా రికార్డ్ చేయబడ్డాయి.. ఇవన్నీ ట్రంప్ మేనకోడలు మేరీ ట్రంప్ రాసిన టాక్సిక్ ఫ్యామిలీలో ప్రచురించబడ్డాయి. ఇమ్మిగ్రేషన్ విధానంపై ట్రంప్ వైఖరిని తప్పుబడుతూ.. తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి డిటెన్షన్ సెంటర్‌కు తరలించడాన్నిమరియన్నే ట్రంప్ బారీ ఎండగట్టారు. (అవసరమైతే చైనాతో అన్నీ బంద్: ట్రంప్) తన సిద్దాంతాల కోసం ఎవరిని లెక్కచేయడని.. అతను మాట్లాడే ప్రతి వ్యాఖ్యం అబద్ధమేనని.. ట్వీట్లు కూడా అదే విధంగా ఉంటాయన్నారు. అదే విధంగా ట్రంప్ వైఖరిని ప్రశ్నిస్తూ.. ట్రంప్ మేనకోడలు మేరీ ట్రంప్ రాసిన టాక్సిక్ ఫ్యామిలీ పబ్లికేషన్‌ను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత వారం మరణించిన అధ్యక్షుడి తమ్ముడు రాబర్ట్ ట్రంప్ మేరీ రాసిన పుస్తక ప్రచురణను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లారు. మేరీ తన తాత ఎస్టేట్‌లో స్థిరపడిన తరువాత 2001లో సంతకం చేసిన బహిర్గతం కాని ఒప్పందాన్ని ఆమె ఉల్లంఘిస్తున్నారని వాదించారు. కానీ రాబర్ట్ చేసిన వ్యాఖ్యలు కోర్టులో నిరూపితం కాలేదన్నారు. అంతేకాదు.. ఇప్పటివరకు 9లక్షల 50వేల కాఫీలు అమ్ముడయ్యాయని.. కానీ వైట్ హౌస్ మాత్రం అది ఒక అబద్దాల పుస్తకం అంటూ తప్పడు ప్రచారం చేశారన్నారు. ఇది ట్రంప్ మూర్కత్వాన్ని చూపిస్తుందని.. తనకు అడ్డు వస్తే ఎంతదూరమైన వెళ్లడానికి వెనుకాడడని మేరీకి తాను చెప్పినట్లు బారీ వివరించారు. ట్రంప్ యునివర్సీటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ప్రవేశం పొందడానికి వేరొకరితో పరీక్ష రాయించాడని.. ఇంకా ఆ వ్యక్తి పేరు నాకు గుర్తుంది అంటూ తెలిపారు. అయితే ట్రంప్ సోదరి వ్యాఖ్యలపై వైట్‌హౌస్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే రిపబ్లికన్ పార్టీ స్పందిస్తూ.. రానున్న ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించాలనే ప్రయత్నంలోనే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని పేర్కొంది. -
డీఏసీఏ రద్దు ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానాన్ని తీసుకురావడానికి కసరత్తు ముమ్మరం చేశారు. ప్రతిభ ఆధారిత వలస విధానానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులకు తుదిరూపం తీసుకువచ్చే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా డిఫర్డ్ యాక్షన్స్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవడానికి సంకల్పించారు. ఈ మేరకు శుక్రవారం వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకు ముందు ట్రంప్ ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా ఎవరూ అమెరికాలో నివసించకుండా అత్యంత పటిష్టమైన బిల్లును తీసుకువస్తున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ స్థానికుల మెప్పు పొందడానికి గత కొన్నాళ్లుగా వలస విధానాలను సంస్కరించడంపైనే దృష్టి సారించారు. గత ప్రభుత్వం వలస విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. డీఏసీఏను కూడా ఉపసంహరించడానికి కూడా ప్రయత్నాలు చేశారు. అయితే దీనిపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవంటూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల ఆ ప్రణాళికలకు అడ్డుకట్ట వేసింది. దీంతో ట్రంప్ ఈ కార్యక్రమాన్ని వలస విధానంలో చేర్చి పూర్తిగా దానిని రద్దు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డీఏసీఏకు చట్టబద్ధమైన పరిష్కారం, సరిహద్దుల్లో భద్రత, ప్రతిభ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన సంస్కరణలపై కాంగ్రెస్‌లో చర్చించడానికి సిద్ధమేనని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. డీఏసీఏ అంటే? 2012లో ఒబామా సర్కార్ మానవతా దృక్పథంతో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం చిన్నప్పుడే తల్లిదండ్రులతో అమెరికాకి వచ్చి ఉంటున్న వారికి ఇది చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. అమెరికా పౌరసత్వం, లేదంటే చట్టపరంగా నివాస హక్కులు లేనివారికి డీఏసీఏ ఒక వరంలాంటిది. దాదాపుగా 7 లక్షల మంది యువత డీఏసీఏతో లబ్ధి పొందుతున్నారు. వీరందరికీ వర్క్ పర్మిట్లు, హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఈ కార్యక్రమం కింద లభిస్తాయి. ప్రతీ రెండేళ్లకి ఒకసారి దీనిని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే అమెరికా పౌరసత్వం మాత్రం లభించదు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి దీనిని వెనక్కి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు డెమోక్రాట్లు అడ్డం పడుతూనే ఉన్నారు. ఇది చాలా సమగ్రమైన బిల్లు. ఎంతో మంచి బిల్లు. ప్రతిభ ఆధారంగా వలస విధానం ఉంటుంది. ఇందులో డీఏసీఏని కూడా చేరుస్తున్నాం. డీఏసీఏ ద్వారా లబ్ధి పొందుతున్న వారికి అమెరికా పౌర సత్వం లభించేలా కొత్త విధానం బాటలు వేస్తుం ది. దీనిపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు’ డోనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు -
వలస విధానం: ట్రంప్ మరో సంచలనం !
వాషింగ్టన్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వలస విధానంలో సమూల సంస్కరణల్ని చేపట్టి ప్రతిభ ఆధారంగా వీసాలు మంజూరు చేసే క్రమంలో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం(డీఏసీఏ)ను రద్దు చేసేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా చిన్నవయస్సులోనే తల్లిదండ్రులతో పాటు వచ్చిన వారు, చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారికి ప్రభుత్వపరంగా రక్షణలు కల్పిస్తూ ఒబామా సర్కారు 2012లో డీఏసీఏ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆది నుంచి దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్రంప్.. ప్రముఖ అమెరికా మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. (హెచ్ 1బీ ఆపేశారు) ‘‘ఎంతో శ్రేష్టమైన, కీలకమైన బిల్లును ప్రవేశపెట్టబోతున్నాం. ప్రతిభ ఆధారిత బిల్లు అందులో డీఏసీఏ కూడా ఇమిడి ఉంటుంది. ఇది పౌరసత్వానికి రోడ్‌మ్యాప్‌లా ఉంటుంది. నాకు తెలిసి ఇది ఎంతో మంది ప్రజలకు సంతోషాన్నిస్తుంది’’ అని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అధ్యక్షుడు ఈరోజు ప్రకటించినట్లుగా.. అమెరికా వర్కర్లను కాపాడేందుకు ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తీసుకువచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అంతేగాక డీఏసీఏపై చట్టసభలో తీర్మానానికి కాంగ్రెస్ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులోనే పౌరసత్వం, సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు, శాశ్వత ప్రతిభ ఆధారిత వలస విధాన సంస్కరణలు కూడా ఉంటాయి’’ అని తెలిపింది. ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవనీ.. అయితే ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకించే డెమొక్రాట్లు దీనిని కూడా వ్యతిరేకిస్తామనడం దురదృష్టకరమని పేర్కొంది. (హెచ్1 బీ వీసాదారులకు బిడెన్ తీపి కబురు) అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ట్రంప్ కఠిన వలస నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జీరో టాలరెన్స్ విధానంతో ఎంతో మందిని దేశ సరిహద్దుల వద్దే నిలిపివేశారు. ఈ క్రమంలో ఎన్నెన్నో హృదయవిదారక ఘటనలకు సంబంధించిన ఫొటోలు చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. అయితే రెండోసారి కూడా వలస వ్యతిరేక ఎజెండాతో గద్దెనెక్కాలని భావిస్తున్న ట్రంప్.. ఇమ్మిగ్రేషన్ విధానికి సంబంధించి కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ, హెచ్–2బీ, జే, ఎల్1, ఎల్2 వీసాలపై నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగించారు. అదే విధంగా గ్రీన్‌కార్డుల జారీని కూడా 2020 డిసెంబర్ వరకు నిలిపివేశారు. అంతేగాక ఆన్లైన్ క్లాసులు నిర్వహించే యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా నిబంధనలు తీసుకువచ్చారు. ఇక తాజాగా ఆయన డీఏసీఏపై మరోసారి దృష్టి సారించారు. దేశంలో ఉన్న దాదాపు ఆరున్నర లక్షల యువ వలసదారుల ఆశలపై నీళ్లు చల్లేలా డీఏసీఏను ఉపసంహరించేందుకు ట్రంప్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ట్రంప్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డీఏసీఏ ఉపసంహరణ తీరు సరిగాలేదని ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి డీఏసీఏ గురించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాక్!
వాషింగ్టన్: విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాకిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు విద్యా సంస్థలు మొగ్గు చూపినట్లయితే విదేశీ విద్యార్థులు అమెరికా విడిచి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అదే విధంగా కొత్తగా విద్యార్థి వీసాలు జారీ చేయబోమని పేర్కొంది. ఈ మేరకు.. ‘‘వచ్చే విద్యా సంవత్సరానికి గానూ పూర్తి స్థాయిలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీచేయబోం. అలాంటి వారిని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ దేశంలోకి అనుమతించదు. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(ఎఫ్-1 ఎం-1-తాత్కాలిక ప్రాతిపదికన జారీ చేసేవి) మీద ప్రస్తుతం అమెరికాలో ఉండి ఆన్లైన్ క్లాసులు వింటున్న వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది, లేదా చట్టబద్ధంగా అమెరికాలో ఉండాలనుకుంటే స్కూల్‌కు వెళ్లేందుకు అనుమతి ఉన్న విద్యా సంస్థకు బదిలీ చేయించుకోవాలి. అలా జరగని పక్షంలో ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అనుసరించి ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’’అని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. (హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ!) కాగా ట్రంప్ యంత్రాంగం తీసుకున్న తాజా నిర్ణయం భారత విద్యార్థులపై దుష్ప్రభావం చూపనుంది. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) గణాంకాల ప్రకారం 2018-19 విద్యా సంవత్సరానికి గానూ అమెరికాలో దాదాపు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో అత్యధికులు చైనా, భారత్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా నుంచి వచ్చినవాళ్లే. ఇదిలా ఉండగా.. లాక్డౌన్ కారణంగా కోల్పోయిన సిలబస్, కొత్త సెమిస్టర్లకు సంబంధించి తమ విధానం ఎలా ఉండబోతుందో పలు కాలేజీలు, యూనివర్సిటీలు ఇంతవరకు స్పష్టం చేయలేదు. మరికొన్ని విద్యాసంస్థలు వర్చువల్ క్లాసెస్‌తో పాటు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు విద్యార్థులకు అవకాశమిస్తామని పేర్కొనగా.. హార్వర్డ్ యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులకే మొగ్గుచూపాయి. మరోవైపు.. అమెరికాలో కరోనా రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే అక్కడ దాదాపు 29 లక్షల మంది మహమ్మారి బారిన పడగా.. దాదాపు లక్షా ముప్పై వేల మంది కరోనాతో మృతి చెందారు. ఇలాంటి తరుణంలోఅమెరికాలో ఉంటే కాలేజీకి వెళ్లాలి లేదంటే స్వదేశానికి వెళ్లిపోవాలి అన్నట్లుగా ట్రంప్ సర్కారు నిర్ణయం ఉందంటూ ఇమ్రిగ్రేషన్ అటార్నీ సైరస్ మెహతా విమర్శించారు. ట్రంప్ క్రూర పాలనకు ఇది నిదర్శనం.. విదేశీ విద్యార్థుల ప్రాణాలను అపాయంలోకి నెట్టారు అంటూ డెమొక్రాట్లు మండిపడుతున్నారు. (కువైట్‌లో 8 లక్షల మంది భారతీయులకు కత్తెర?) -
భారత్‌లో చిక్కుకున్న ఎన్నారైల కష్టాలు!
మహిమ(పేరు మార్చాం).. సాఫ్ట్వేర్ డెవలపర్. తాత్కాలిక వీసా మీద అమెరికాలో ఉండేవారు. భర్త, ఇద్దరు కూతుళ్ల(వీరికి అమెరికా పౌరసత్వం ఉంది)తో కలిసి కాలిఫోర్నియాలో నివసించేవారు. ఈ క్రమంలో మార్చి తొలి వారంలో తన తల్లి అనారోగ్యం పాలయ్యారనే విషయం తెలిసి దాదాపు దశాబ్ద కాలం తర్వాత భారత్‌కు పయనమయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆమె భర్త, కూతుళ్లు అక్కడే ఉండిపోయారు. ఇదిలా ఉండగా.. తల్లి మరణించిన ఎనిమిది రోజుల తర్వాత మహిమ.. తిరిగి అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వీసా స్టాంపింగ్‌కై మార్చి 16న ముంబైలోని పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లగా.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కార్యాలయం మూసి ఉండటం గమనించారు. అనంతరం లాక్డౌన్ పరిణామాల నేపథ్యంలో ఇక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం... ముంబై శివార్లలోని బంధువుల ఇంట్లో ఆమె ఆశ్రయం పొందుతున్నారు. ఇక అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ, హెచ్–2బీ, జే, ఎల్1, ఎల్2 వీసాలపై నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిమ 2020, డిసెంబరు వరకు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం గురించి ఆమె రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే నేను నా తల్లిని కోల్పోయాను. ఇక ఇప్పుడు మాతృత్వానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు నా మనసంతా దిగులుతో నిండిపోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలం పిల్లలకు దూరంగా ఉంటే అది వాళ్ల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ట్రంప్ తాజా నిర్ణయంతో మహిమ ఒక్కరే కాదు ఆమెలాంటి ఎంతో మంది ఎన్నారైలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా, ఇతర పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన వారు ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. ఈ విషయం గురించి వినోద్ అల్బూకర్క్ అనే బిజినెస్ కన్సల్టెంట్ మాట్లాడుతూ.. ‘‘నేను అట్లాంటాలో పనిచేస్తున్నా. ఫిబ్రవరిలో నా తండ్రికి గుండెపోటు రావడంతో.. గర్భవతి అయిన భార్య, ఆరేళ్ల కుమారుడిని అక్కడే వదిలి హుటాహుటిన మంగళూరుకు వచ్చాను. అమెరికాలో ఇలాంటి హెచ్1 బీ వీసా విధానం వస్తుందని ఊహించలేదు. నేను నేటికీ అమెరికాలో పన్నులు చెల్లిస్తూనే ఉన్నాను. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో నా కంట్రిబ్యూషన్ కూడా ఉంది. కానీ ఇలాంటి నిర్ణయాల వల్ల భార్యా, పిల్లలకు దూరం కావాల్సి రావడం దురదృష్టకరం’’ అని పేర్కొన్నారు.(హెచ్ 1బీ ఆపేశారు.. అమెరికన్ల హర్షం) కాగా గ్రీన్‌కార్డుల జారీని కూడా 2020 డిసెంబర్ వరకు నిలిపివేసిన ట్రంప్.. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సోమవారం సంతకం చేశారు. ఇక ఈ ఉత్తర్వులు జూన్ 24 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే అత్యవసరాలైన ఆహారం, వైద్య రంగాలతోపాటు కరోనా పరిశోధనల్లో పని చేసే వారికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు శ్వేతసౌధం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వైట్‌హౌజ్ ప్రకటన అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలకు మేలు చేకూర్చే విధంగా ఉండగా.. అమెరికా పౌరులైన పిల్లల తల్లిదండ్రులకు ఇది ఏవిధంగా ప్రయోజనం కలిగించనుందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు... అమెరికాలో ఇప్పటికే వివిధ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారిపై ట్రంప్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదన్న విషయం తెలిసిందే. -
అమెరికాలో హెచ్ 1 బీ టెన్షన్...
‘‘ప్రస్తుతం పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఇదంతా ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఒత్తిడి కారణంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి’’అంటూ మహిమ(పేరు మార్చాం) ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్-1 బీ వీసా మీద న్యూజెర్సీలోని పేసియాక్ కౌంటీలో దంత వైద్యురాలిగా ప్రాక్టీసు చేస్తున్నారామె. గత రెండేళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో మార్చి మూడో వారం నుంచి క్లినిక్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. అప్పటి నుంచి జీతంలేని సెలవుపై ఇంట్లోనే ఉంటున్నారు మహిమ. ఈ క్రమంలో చట్టబద్ధంగా అమెరికాలో నివసించడానికి ఆమెకు ఇంకా మూడు వారాల కంటే తక్కువ గడువు మాత్రమే మిగిలి ఉంది. ఎందుకంటే స్థానిక చట్టాల ప్రకారం హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న వారు ఉద్యోగం కోల్పోతే రెండు నెలల్లో(60 రోజులు) కొత్త ఉద్యోగం పొందాలి. లేదంటే వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశం కాదు కదా ఇంటి నుంచి కూడా అడుగుతీసి బయటపెట్టలేని పరిస్థితి. ఇక మహిమతో పాటు ఆమె భర్త కూడా అమెరికాలోనే డెంటిస్ట్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. ఆయన హెచ్1-బీ వీసా గడువు జూన్‌తో ముగియనుంది. అంతేకాదు ఉన్నత విద్యనభ్యసించడం కోసం ఇద్దరూ కలిసి తీసుకున్న స్టూడెంట్ లోన్ దాదాపు 5,20,000 డాలర్ల మేర బకాయి ఉంది. ప్రస్తుతం వీసా గడువు ముగియనుండటం, ఉద్యోగం కోల్పోయే పరిస్థితి తలెత్తడంతో ఆ దంపతులు రోజంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మహిమ దంపతులే కాదు వారిలా హెచ్-1బీ వీసాపై నివసించే ఎంతో మంది పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉంది.(హెచ్1బీ రిజిస్ట్రేషన్లలో మనవాళ్లే టాప్) కాగా వలసలన్నిటిపైనా రెండు నెలలపాటు తాత్కాలిక నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై వ్యాపార సంస్థలన్నీ మండిపడటంతో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో రెండు నెలలపాటు కొత్తగా వీసాలు లేదా గ్రీన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ మాత్రమే నిలిపివేసేలా ట్రంప్ సర్కారు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమెరికాలో వున్నవారికి ఈ నిషేధ ఉత్తర్వులు వర్తించవు అనే నిబంధన కాస్త ఊరట కలిగించేదిగా కనిపిస్తున్నా... ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు మాత్రం ఉద్యోగ భద్రత లేకపోవడం కలవరపెడుతోంది. జూన్ చివరి నాటికి దేశాన్ని వీడాల్సిందేనా అగ్రరాజ్యంలో గెస్ట్ వర్కర్ వీసా కింద పనిచేస్తున్న వారిలో దాదాపు 2,50,000 మంది గ్రీన్ కార్డు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో దాదాపు 2 లక్షల మంది హెచ్-1బీ వీసా గడువు జూన్ చివరి నాటికి ముగియనుందని ఇమ్మిగ్రేషన్ పాలసీ అనలిస్ట్ జెరేమీ న్యూఫెల్డ్ బ్లూమ్‌బర్గ్‌కు తెలిపారు. పెద్ద సంఖ్యలో హెచ్-1బీ వీసాదారులు స్వదేశాలకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగానికి చెందిన తాత్కాలిక వీసాదారులపైనే భారం పడనుందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం కారణంగా గత రెండు నెలల్లో అమెరికాలో ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక హెచ్-1బీ వీసాదారుల్లో కొంతమంది ఉద్యోగాలు ఇప్పటికిప్పుడు భద్రంగానే ఉన్నా.. భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని మరో నిపుణుడు హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోతే తిరిగి సంపాదించడం, వీసాను పునరుద్ధరించుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు.(చైనాపై లోతైన దర్యాప్తు: ట్రంప్) మనిషి జీవన విధానం, ఆర్థిక వ్యవస్థకు సంభవించిన అతిపెద్ద విపత్తు ఇక ఒబామా పాలనా కాలంలో ఇమ్మిగ్రేషన్ పాలసీ అధికారిగా పనిచేసిన డోగ్ ర్యాండ్ మాట్లాడుతూ.. వీసా సంక్షోభం.. ‘‘మనిషి జీవన విధానం, ఆర్థిక వ్యవస్థకు సంభవించిన అతిపెద్ద విపత్తు’’ అని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా దారులు ఉద్యోగులు ఉపాధి కోల్పోతే వారిపైనే ఆధారపడి ఇక్కడ బతుకుతున్న కుటుంబాలు గందరగోళ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఆపిల్, అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర దిగ్గజ సంస్థలు సభ్యులుగా ఉన్న టెక్‌నెట్ అనే లాబీయింగ్ గ్రూప్ ఏప్రిల్ 17న హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. విదేశాల్లో పుట్టిపెరిగి.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న నిపుణులకు ప్రస్తుతం పరిస్థితుల్లో వీసా గడువు సెప్టెంబరు 10 వరకు పొడిగించాలని లేఖలో కోరింది. తమ అభ్యర్థనను మన్నించనట్లయితే అది ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అయితే ఈ లేఖపై ట్రంప్ పాలనా యంత్రాంగం నేరుగా స్పందించలేదు. ఈ మేరకు వీసా గడువు పొడిగించే అవకాశాల గురించి ప్రస్తావించకుండా.. అమెరికా సిటిజన్‌షిఫ్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తప్పక అండగా నిలబడతామని పేర్కొన్నారు. అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికాలో ఉన్న భారతీయ పౌరులకు హెచ్-1 బీ సహా, వివిధ రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని భారత ప్రభుత్వం కోరిగా.. తాము ఈ విషయం గురించి ఆలోచిస్తున్నామని (యుఎస్సిఐఎస్) పేర్కొంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కోవిడ్-19 కారణంగా వీసా పునరుద్ధరణకు అప్లై చేయనివాళ్లకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఆ తర్వాతే తదుపరి నిర్ణయం ఇదిలా ఉండగా... వలసలపై ట్రంప్నకున్న వ్యతిరేకత గురించి ప్రత్యేకంగా చెప్సాలిన పనిలేదు. అమెరికాలోని ఉపాధి అవకాశాలన్నిటినీ వలసదారులు దక్కించుకోవడం వల్లే స్థానికులకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆయన మొదటినుంచీ ఆరోపిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో సైతం ఈ ఎజెండాతోనే అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటం, కరోనా సంక్షోభాన్ని రూపుమాపడంలో ట్రంప్ సర్కారు విఫలమైందన ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో తాను పాత వాగ్దానానికి కట్టుబడి ఉన్నానన్న విషయాన్ని రుజువుచేసుకునేందుకు ఏప్రిల్ 20న మరోసారి వలసల అంశాన్ని తెరమీదకు తెచ్చారు. అంతేకాదు ఈ తాత్కాలిక నిషేధం గడువు ముగిశాక దాన్ని పొడిగించాలో లేదో నిర్ణయిస్తామని కూడా చెప్పి బాంబు పేల్చారు. దీంతో కరోనా మహమ్మారి కట్టడి మాటున సొంత ఎజెండాను అమలు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనా? ఈ నేపథ్యంలో విదేశీ ఉద్యోగుల నైపుణ్యంతో అధిక లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్‌కార్డు బ్యాన్ వంటి అంశాలు ఉద్యోగుల మానసిక స్థితిని గందరగోళంలోకి నెట్టేస్తాయని.. ఇది అవుట్‌పుట్‌పై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నాయి. అంతేగాక కంపెనీలు, ఉద్యోగులు ఇతర దేశాలకు తరలివెళ్లే అవకాశం ఉందని.. దీంతో మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలో స్థిరపడాలని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చిన తమకు నిరాశే ఎదురైందని షాన్ నారోన్హా అనే 23 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో తన వర్క్ వీసాను టూరిస్ట్ వీసాగా మార్చుకున్నానని.. పేచెక్స్ లేకపోవడంతో సేవింగ్స్ మొత్తం ఖర్చయిపోతున్నాయని పేర్కొన్నాడు. ఇమ్మిగ్రేషన్ విధానంపై పునరాలోచన చేయాలని ట్రంప్‌ను ట్విటర్ వేదికగా అభ్యర్థించానని.. ఒకవేళ పరిస్థితలు ఇలాగే ఉంటే స్వదేశానికి వెళ్లిపోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. (కర్టెసీ: బ్లూమ్‌బర్గ్) -
వీసాలపై ట్రంప్ పిడుగు
కరోనా వైరస్ మహమ్మారి కట్టడి మాటున సొంత ఎజెండాలను అమలు చేయడానికి దేశదేశాల పాలకులు తహతహలాడుతున్నారు. వలసలన్నిటిపైనా రెండు నెలలపాటు నిషేధం విధిస్తూగురు వారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆ బాపతే. వాస్తవానికి ఆయన అన్ని రకాల వీసాలనూ తాత్కాలికంగా నిలిపేస్తామని నాలుగురోజుల క్రితం ప్రకటించారు. ఆ ప్రతిపాదన అమలైతే గెస్ట్ వర్కర్ వీసా మొదలుకొని గ్రీన్ కార్డుల వరకూ అన్నీ నిలిచిపోయేవి. ఐటీ నిపుణులు మొదలుకొని వ్యవసాయ కార్మికుల వరకూ అందరిపైనా తీవ్ర ప్రభావం చూపేది. కానీ ఆ విష యంలో వ్యాపార సంస్థలన్నీ ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో ఆయన వెనక్కి తగ్గారు. తాజా ఉత్తర్వుల ప్రకారం రెండునెలలపాటు కొత్తగా వీసాలు లేదా గ్రీన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ నిలిచిపోతుంది. అయితే ప్రస్తుతం అమెరికాలో వున్నవారికి ఈ నిషేధ ఉత్తర్వులు వర్తించవు. విదే శాల్లో వుంటూ వీసా పొడిగింపునకు, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నవారికి మాత్రం కొన్నాళ్లపాటు సమస్యే. ఇతర రకాల వలసలపై ఇప్పటికే ట్రంప్ ఆంక్షలు విధించారు. మెక్సికో, కెనడాల నుంచి వచ్చే ‘అనవసర వలస’లను పూర్తిగా నిలిపివేశారు. వీసాల జారీ ప్రక్రియ ఆపేయాలని గత నెలలోనే అన్ని దేశాల్లోని కాన్సులేట్లకూ ఆదేశాలు జారీ చేశారు. చైనా, యూరప్‌ల నుంచి ఎవరూ అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించారు. వలసలపై ట్రంప్‌కున్న వ్యతిరేకత ఎవరికీ తెలియనిది కాదు. అమెరికాలోని ఉపాధి అవకాశా లన్నిటినీ వలసదారులు తన్నుకుపోతున్నారని, స్థానికులకు ఇందువల్ల తీరని అన్యాయం జరుగు తున్నదని ఆయన మొదటినుంచీ ఆరోపిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో సైతం ఆయన దీనిపైనే ప్రధానంగా ఆధారపడ్డారు. అది వృధా పోలేదు. శ్వేతజాతి అమెరికన్ల ఓట్లన్నీ ఆయన ఖాతాలోనే పడి ఘన విజయం సాధించారు. అధికారంలోకొచ్చాక వివిధ రకాల వీసాలపై అడపా దడపా ఆంక్షలు విధించడం, నిబంధనలు కఠినం చేయడం, అందరూ గగ్గోలు పెట్టాక కొన్ని సడలింపు లివ్వడం కొనసాగిస్తూవచ్చారు. మళ్లీ ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలు ముంగిట్లో వున్నాయి. కనుక ఆ ఎజెండాను మరోసారి ఆయన బయటకు తీశారు. కరోనా మహమ్మారి కాటుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కకావికలైంది. కనీవినీ ఎరుగని రీతిలో 2 కోట్ల 20 లక్షలమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పో యారు. ఈ సంఖ్య మున్ముందు రెట్టింపు కావొచ్చునన్న అంచనాలున్నాయి. ఇదంతా తన పాలనపై అసంతృప్తిగా పరిణమిస్తుందన్న భయాందోళనలు ఆయన్ను పీడిస్తున్నాయి. వలసలపై తన ప్రభు త్వం కఠినంగా వ్యవహరించి, పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్టు అందరూ అనుకోవాలని ఆయన తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగానే నిషేధం బాంబు పేల్చారు. ఈ తాత్కాలిక నిషేధం గడువు ముగిశాక దాన్ని పొడిగించాలో లేదో నిర్ణయిస్తామని కూడా ట్రంప్ చెప్పారు. అప్పటి కింకా తనపై అసంతృప్తి పోలేదన్న సంశయం కలిగితే దాన్ని పొడిగించడానికి కూడా ఆయన వెనకాడరు. ప్రస్తుతం గ్రీన్ కార్డు దరఖాస్తులు దాదాపు 3,58,000 పెండింగ్‌లో వున్నాయి. ఇవన్నీ ఇప్పుడు నిలిచిపోతాయి. అమెరికాలో వైద్య ఉపకరణాల కొరత, టెస్టింగ్‌ల సమస్య వగైరాలతో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ సమస్యలపై దృష్టి పెట్టవలసి రావడం వల్ల వలసల విషయంలో కేంద్రీకరించడం ఇన్నాళ్లూ ఆయనకు సాధ్యం కాలేదు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయకపోతే తన విజయావకాశాలు దెబ్బతింటాయని ట్రంప్ భావిస్తున్నారు. అయితే వైద్య, వ్యవసాయ రంగాలు కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఒకపక్క కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా రోగుల సంఖ్య పెరుగుతుండగా, వారికి వైద్య సేవలందించేందుకు తగినంతమంది సిబ్బంది లేరు. కరోనా సోకడం వల్ల, క్వారంటైన్లో వుండటం వల్ల చాలామంది విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రులన్నీ సిబ్బంది లేక ఇబ్బందిపడుతున్నాయి. అమెరికా వైద్య, ఆరోగ్య రంగంలో వలస కార్మికులు 17 శాతం వుంటారు. వైద్యుల్లో 25 శాతం వలసవచ్చినవారే. కొన్ని రాష్ట్రాలైతే విదేశాల్లో పట్టభద్రులైనవారికి లైసెన్స్లివ్వడానికి వుండే లాంఛనాలను సడలించమని కోరుతున్నాయి. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో అది అవసరమని కోరుతున్నాయి. వ్యవసాయరంగానిదీ ఇదే సమస్య. కార్మికుల కొరత వల్ల పనులు సాగడం లేదని, ఇది ఆహార కొరతకు దారితీసే ప్రమాదం వున్నదని రైతులు హెచ్చరి స్తున్నారు. అమెరికా వ్యవసాయరంగంలో మెక్సికో నుంచి హెచ్–2ఏ వీసాలతో వచ్చే కార్మికులే అధికం. ఇంతక్రితమైనా, ఇప్పుడైనా ట్రంప్ అమల్లోకి తెచ్చిన ఆంక్షలన్నీ గత నాలుగేళ్లుగా ఆయన అమలు చేయడానికి తహతహలాడినవే. ఇందులో కొన్నిటిని పాక్షికంగా అమలు చేసిన సందర్భా లున్నాయి కూడా. కాంగ్రెస్ అనుమతి వుంటే తప్ప అమలు చేయడం సాధ్యంకాని ఆంక్షలను ఆయన కరోనా పేరు చెప్పి ఏకపక్షంగా అమలులో పెట్టగలిగారు. పైగా 1980 నుంచీ శరణార్థులకు ఆశ్రయ మివ్వడానికి తోడ్పడుతున్న కీలకమైన నిబంధనను పక్కనపెట్టగలిగారు. తమ తమ దేశాల్లో వేధిం పులను ఎదుర్కొనే ప్రమాదం వున్నదని భావించే వ్యక్తులకు ఆ నిబంధన కింద ఆశ్రయం కల్పిం చేవారు. ట్రంప్ తాజా ఉత్తర్వులతో అది నిలిచిపోయింది. కరోనా వైరస్ బెడద తొలగిపోయాక తన తాజా నిర్ణయం వల్ల అమెరికన్లకు భారీయెత్తున ఉపాధి అవకాశాలొస్తాయని ఆయన ఊరిస్తున్నారు. ఆ మాటెలావున్నా అమెరికన్ల కోసం పాటుపడుతున్నట్టు ప్రచారం చేసుకోవడానికి తోడ్పడుతుంది. కానీ కరోనా మహమ్మారివల్ల కలిగే ప్రమాదాన్ని ట్రంప్ మొదట్లో తేలిగ్గా కొట్టిపారేయడం వల్లే దేశానికి ఈ దుర్గతి పట్టిందని అనేకులు భావిస్తున్నందువల్ల తాజా చర్యలు రాజకీయంగా ఆయనకు ఎంతవరకూ మేలుచేస్తాయో చెప్పలేం. అయితే సంక్షోభాలను పాలకులు ఎలా అవకాశాలుగా మలు చుకుంటారనడానికి ట్రంప్ ఉత్తర్వులు తాజా ఉదాహరణ. -
సమగ్ర గల్ఫ్ విధానానికి ఇదే తరుణం
గల్ఫ్‌లోని 87 లక్షల మంది భారతీయ శ్రామికుల్లో 17 శాతం, అంటే 15 లక్షల మంది తెలంగాణ వాళ్లు. ప్రవాసిమిత్ర, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రకారం, కరోనా కారణంగా ఇందులో 25 శాతం అనగా 3.7 లక్షల మంది ఉపాధిని కోల్పోవచ్చు. వీళ్లు రానున్న ఆరు నెలల్లో తెలంగాణకు తిరిగి రావచ్చు. ఈ సంక్షోభంతో పాటు, ప్రతియేటా వచ్చే సుమారు రూ. 6,300 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితిని ఎదుర్కోవడం ప్రభుత్వానికి పెద్ద సవాలు. గల్ఫ్ కార్మికుల చిరకాల వాంఛ అయిన సమగ్ర ప్రవాసీ విధానాన్ని రూపొందించడానికీ, క్షేత్ర స్థాయి సమస్యలను వ్యక్తిగతంగా అధ్యయనం చేయడానికీ తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 26 నుంచి గల్ఫ్ దేశాల్లో పర్యటించాలని అనుకున్నారు. తెలంగాణలో తగినంత పని ఉంది, వారు స్వదేశానికి తిరిగి రావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద, తక్కువ ఆదాయ వర్గాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆకట్టుకునే మూలధన పెట్టుబడులతో ముందుకు వెళుతున్నప్పటికీ నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఉంది. మరోవైపు కేరళ ఎన్నారై విధానాన్ని అధ్యయనం చేయ డానికి అధికారుల బృందాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపింది. వివిధ దేశాల్లో నివసిస్తున్న కేరళీయుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలపై ఈ బృందం సమగ్ర చర్చలు జరిపింది. రాష్ట్రంలోని ముఖ్యమైన పనుల ఒత్తిడితోపాటు, కరోనా సంక్షోభం కారణంగా ముఖ్యమంత్రి గల్ఫ్ పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో చాలాకాలంగా రగులు తున్న గల్ఫ్ వలస కార్మికుల సమస్యలకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక పరిష్కారం వెతకడం ముఖ్యం. భారత్ కార్మికులు గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రె యిన్, ఒమన్, కువైట్లలో పని చేస్తున్నారు. భారత్‌కు అనేక శతాబ్దాలుగా అరబ్ దేశాలతో నాగరికత సంబంధ మూలా లున్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) ప్రకారం, గల్ఫ్‌కు వలస కార్మి కులను పంపే రెండు ప్రధాన దేశాలలో ఒకటి భారత్ (మరొకటి ఫిలిప్పీన్స్). ఈ వలసదారులు విదేశీ మారక ద్రవ్య బదిలీ ద్వారా మన దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంటున్నారు, అదే సమయంలో గల్ఫ్ దేశాల ఆర్థిక అభివృద్ధిలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. 1970 లలో చమురు వికాసం తరువాత గల్ఫ్‌కు భారత కార్మికుల వలసలు పెరిగాయి. తక్కువ జీతానికి చేయడానికి సిద్ధంగా ఉన్న కారణంగా భారత్, ఇతర దక్షిణాసియా దేశాల కార్మి కులను నియమించుకోవడానికి గల్ఫ్ దేశాలు ఆసక్తి చూపాయి. 2018–19 కాలంలో ఎన్నారైలు భారత్‌కు పంపిన మొత్తం విదేశీ మారకద్రవ్యంలో అమెరికన్ ఎన్ఆర్ఐల వాటా కేవలం 12.5 శాతం. మిగిలిన 87.5 శాతం సొమ్ము ప్రధానంగా గల్ఫ్, ఐరోపా దేశాల నుంచి వచ్చింది. మన ఆర్థిక వృద్ధికి తోడ్పడే గల్ఫ్ ఎన్ఆర్ఐల కొరకు మన విధానాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. భారతీయ వలసదారుల్లో పాక్షిక నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికులు 70 శాతం, వైట్ కాలర్ ఉద్యోగులు 20 శాతం, నిపుణులు 10 శాతం ఉన్నారు. దక్షిణాసియా కార్మికులు గల్ఫ్ దేశాల్లో రాజకీయ హక్కులను కోరలేదు, ఆ దేశాల రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో జోక్యం చేసుకో లేదు. ఇది అక్కడి పాలకవర్గాలు తమ అధికారాన్ని స్థిరీక రించుకోవడానికి ఉపయోగపడింది. గల్ఫ్ వలసదారులు రెండు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొదటిది చట్టపరమైన ప్రక్రియకు సంబంధించినది; రెండవది వారి జీవన, పని పరిస్థితులకు సంబంధించినది. అందులో ముఖ్యమైనవి: తాత్కాలిక నుంచి శాశ్వత ఉద్యోగానికి మారడం (పర్యాటక వీసాలతో సహా), ఉద్యోగ ఒప్పం దాలను ముందస్తుగా రద్దుచేయడం, కాంట్రాక్టు నిబంధన లను కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మార్చడం, చెల్లింపుల్లో ఆలస్యం, కనీస వేతన ప్రమాణాలను ఉల్లం ఘించడం, ప్రతిఫలం ఇవ్వకుండా అధిక సమయం పని చేయించుకోవడం, పాస్‌పోర్టు, ఇతర చట్టపరమైన పత్రాలను యజమాని స్వాధీనంలో ఉంచుకోవడం. చాలా మంది కార్మికులు ప్రాథమిక సదుపాయాలు లేని బహిరంగ ప్రదే శాల్లో తాత్కాలిక లేదా అక్రమ స్థావరాలు ఏర్పాటు చేసుకొని వంతులవారీగా ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఆహా రాన్ని రాయితీ ధరలకు అందించే స్థానిక రేషన్ కార్డులు లేవు. వారు వృత్తిపరమైన ఆరోగ్య ప్రమాదాలకు, అంటు వ్యాధులకు గురయ్యే అవకాశముంది. సంవత్సరాలకొద్దీ నివసించినప్పటికీ, వారి కుటుంబాలను తెప్పించుకోవడా నికి అనుమతిలేదు. ఆదాయం పెరిగే అవకాశముంటేనే ఎవరైనా వలస వెళతారు. మనవాళ్ళు పెద్ద సంఖ్యలో యూఎస్, యూరప్, ఆస్ట్రేలియాకు వలస వెళ్లడాన్ని గమనించవచ్చు. కానీ గల్ఫ్ సోదరులు కనీస జీవనోపాధి దొరక్క వలస పోతున్నారు. ప్రజలు తగిన జీవనోపాధిని పొందే పరిస్థితులను కల్పించ డంలో గత ఆరు దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు, అభివృద్ధి సంస్థల సుదీర్ఘ విధాన వైఫల్య ఫలితమే ఈ వలసలు. గల్ఫ్ ఎన్నారై విధానాన్ని ఎందుకు రూపొందించు కోవాలి అనే దానికి మరో ముఖ్యమైన వాదన ఉంది. 2018–19 కాలంలో ఎన్నారైలు విదేశాల నుంచి భారత్‌కు పంపిన మొత్తం విదేశీ మారకద్రవ్యం 80 బిలియన్ డాలర్లు (సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయలు). ఇందులో అమెరికన్ ఎన్ఆర్ఐల వాటా కేవలం 12.5 శాతం. మిగిలిన 87.5 శాతం సొమ్ము ప్రధానంగా గల్ఫ్, ఐరోపా దేశాల నుంచి వచ్చింది. గల్ఫ్‌లోని చాలా మంది స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటారు. దానికి అనుగుణంగానే కుటుం బం కోసం పెట్టుబడులు పెట్టారు. కానీ యూఎస్, కెనడా, యూరప్, ఆసియా–పసిఫిక్ భారతీయుల్లో స్వదేశానికి వచ్చి స్థిరపడాలనే ఆలోచన లేదు. కాబట్టి వారు ఆయా దేశాల్లోనే గణనీయమైన పెట్టుబడి పెడతారు. ఇక్కడ పెట్టుబడి పెడితే ఆస్తిని కిరాయికి ఇస్తారు, లేదా కొన్నేళ్ల తర్వాత అధిక లాభాలకు అమ్ముకుంటారు. పెట్టుబడులను ఆకర్షించడా నికి ప్రోత్సాహకాల ద్వారా ప్రాధాన్యతలను ఇవ్వాలను కుంటే విధాన రూపకర్తలు ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. మన సొంత ఆర్థిక వృద్ధికి తోడ్పడే గల్ఫ్ ఎన్ఆర్ఐల కొరకు మన విధానాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రవాసీ కేరళీయ వ్యవహారాల విభాగం (నోర్కా) వలస వెళ్లాలనుకునే వ్యక్తులకు త్వరగా, సజావుగా డాక్యుమెంటే షన్ చేయడంలోనూ, వారి నైపుణ్యాలు మెరుగుపరిచే శిక్షణ ఇవ్వడంలోనూ సాయపడుతుంది. విదేశీ కార్మికుల డేటా బేస్ ఏర్పాటు చేయడం, మరణిస్తే మృతదేహాన్ని తెప్పిం చడం, తిరిగి వచ్చిన వారికి బీమా, ఆర్థిక సహాయ పథకాలు, పునరావాస సబ్సిడీ ఇవ్వడం లాంటివన్నీ చేస్తుంది. 35 లక్షల కేరళ ప్రవాసుల అవసరాలు తీర్చడానికి నోర్కాకు రూ.80 కోట్ల బడ్జెట్ ఉంది. గల్ఫ్‌లో పనిచేస్తున్న 15 లక్షల మంది తెలంగాణ ప్రవాసులు అలాంటి విధానం కోసం ఎదురు చూస్తున్నారు. డా. రమేశ్ చెన్నమనేని వ్యాసకర్త వేములవాడ శాసనసభ్యులు -
అమెరికాలో ఎంబీఏకు గడ్డుకాలం
ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, చైనాతో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాలోని ప్రఖ్యాత బిజినెస్ స్కూల్స్ విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ ఏడాది ఆయా బిజినెస్ స్కూళ్లలో విద్యార్థుల అడ్మిషన్లు గణనీయమైన సంఖ్యలో తగ్గిపోయాయి. హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర అమెరికా అగ్రస్థాయి విద్యాసంస్థల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వీటి అనుబంధ బిజినెస్ స్కూళ్లలో ప్రతి ఏడాది అడ్మిషన్ దరఖాస్తుల సంఖ్య తగ్గిపోతోంది. డార్ట్మౌత్ కాలేజీకి చెందిన టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో దరఖాస్తుల సంఖ్య ఏకంగా రెండంకెల శాతానికి పడిపోయింది. చదవండి: హెచ్-1బీ వీసాలు: ట్రంప్‌కు సంచలన లేఖ వరుసగా ఐదో ఏడాది కూడా అమెరికాలో ఎంబీఏ కోర్సు దరఖాస్తుల సంఖ్య పడిపోయింది. గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ కౌన్సిల్ విశ్లేషణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. బిజినెస్ స్కూల్స్ అసోసియేషన్ అయిన ఈ స్వచ్ఛంద సంస్థ.. జీమ్యాట్ అడ్మిషన్స్ టెస్టు నిర్వహిస్తుంది. ప్రస్తుత వేసవికాలంలో ముగిసే విద్యా సంవత్సరానికిగాను అమెరికా బిజినెస్ స్కూళ్లకు విద్యార్థుల నుంచి 1,35,096 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో సంప్రదాయ ఎంబీఏ కోర్సు దరఖాస్తులు కూడా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే గత ఏడాది కన్నా దరఖాస్తులు 9.1శాతం పడిపోయాయి. గత ఏడాది కూడా బిజినెస్ కోర్సుల దరఖాస్తుల్లో 7శాతం తగ్గుదల నమోదైంది. ఒకప్పుడు విదేశీ విద్యార్థులు పెద్దసంఖ్యలో అమెరికాలో ఎంబీఏ కోర్సు చేసేందుకు ఉత్సాహం చూపేవారు. అగ్రరాజ్యంలో ఎంబీఏ చేస్తే.. ఆ దేశ ప్రముఖ కంపెనీల్లో అత్యున్నత మేనేజ్మెంట్ హోదాలో ఉద్యోగం సంపాదించవచ్చునని, తద్వారా కంపెనీ నాయకత్వ దశకు ఎదుగుతూ.. భారీ వేతనాలు అందుకోవచ్చునని ఆశించేవారు. కానీ, ఇటీవల చేపట్టిన ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, చైనాతో రాజకీయ, వాణిజ్య ఘర్షణలు, టెక్నాలజీ పరిశ్రమ ఉద్యోగాలు ఎక్కువ ఆకర్షణీయంగా ఉండటంతో అమెరికాలో ఎంబీఏ చేసే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతూ వస్తోంది. రెండేళ్ల ఎంబీఏ కోర్సుకు అంతగా డిమాండ్ లేకపోవడం, ఉద్యోగావకాశాలు క్రమంగా తగ్గడం, దీనికితోడు అండర్ గ్రాడ్యుయేట్ రుణభారాలతో మినినీయల్స్ సతమతమవుతుండటంతో ఒకింత ఖరీదైన ఎంబీఐ కోర్సును చేసేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
హెచ్-1బీ వీసాలు: ట్రంప్‌కు సంచలన లేఖ
న్యూయార్క్: అమెరికా ఇమ్మిగ్రేషన్ (వలస) విధానంలో సత్వరమే మార్పులు తీసుకురావాలని, మంచి నైపుణ్యం గల విదేశీ వర్కర్స్‌ను మరింతగా దేశంలోకి అనుమతించాలని, అమెరికా ఆర్థిక వృద్ధికి, భవిష్యత్ సాంకేతిక రంగ పునర్నిర్మాణానికి ఇది అత్యవసరమని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆ దేశ బిజినెస్ విశ్వవిద్యాలయాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరాయి. మంచి నైపుణ్యం గల వర్కర్స్‌ను ఆకర్షించేవిధంగా దేశ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని సమీక్షించాలని ట్రంప్‌తోపాటు అమెరికా చట్టసభ నాయకులను అభ్యర్థిస్తూ 50 బిజినెస్ స్కూళ్ల డీన్స్ ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను వాల్‌స్ట్రీట్ జనరల్ బుధవారం ప్రచురించింది. యేల్, కొలంబియా, స్టాన్ఫోర్డ్, డ్యూక్, న్యూయార్క్ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత వర్సిటీల అధిపతులు ఈ లేఖపై సంతకం చేశారు. వివిధ దేశాలకు ఇస్తున్న వీసాల మీద పరిమితులు ఎత్తివేయాలని, అత్యున్నత నైపుణ్యం గల వ్యక్తులు అమెరికాకు వచ్చేందుకు వీలుగా హెచ్-1బీ వీసా విధానంలో సంస్కరణలు తీసుకురావాలని, స్కిల్డ్ వర్కర్స్ అమెరికా రాకను ప్రోత్సహించేందుకు ‘హార్ట్‌ల్యాండ్ వీసా’ లాంటి విధానాన్ని అమల్లోకి తీసుకురాలని వారు తమ లేఖలో కోరారు. కాలం చెల్లిన చట్టాలు, ఇమ్మిగ్రేషన్‌పై ప్రాంతాల వారీగా విధిస్తున్న పరిమితులు, ఇటీవలి అస్థిర వాతావరణం వంటి కారణాలు.. అత్యున్నత నైపుణ్యంగల వలసదారులను దేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని, దేశ ఆర్థిక వృద్ధికి వారి రాక కీలకమని డీన్స్ పేర్కొన్నారు. గత మూడేళ్లుగా అమెరికా యూనివర్సిటీల్లో, బిజినెస్ స్కూళ్లలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిందని తాము చేపట్టిన విశ్లేషణలో వెల్లడయిందని డీన్స్ పేర్కొన్నారు. ప్రతిభను, నైపుణ్యాన్ని గుర్తించకపోతే అది దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తుందని డీన్స్ హెచ్చరించారు. చదవండి: అమెరికాలో ఎంబీఏకు గడ్డుకాలం అమెరికా విధించిన పరిమితుల కారణంగా హెచ్-1బీ వీసాలు గణనీయంగా తగ్గిపోయాయని, 2004లో లక్ష95వేల హెచ్-1బీ వీసాలు జారీచేయగా.. ప్రస్తుతం 85వేల వీసాలు మాత్రమే జారీచేస్తున్నారని, డొనాల్డ్ ట్రంప్ హయాంలో హెచ్-1బీ వీసాల తిరస్కరణ గణనీయంగా పెరిగిందని, 2015లో 6శాతం వలసదారులకు మాత్రమే ఈ వీసాలు తిరస్కరించగా.. 2019లో అది ఏకంగా 32శాతానికి ఎగబాకిందని తెలిపారు. అంతేకాకుండా హెచ్-1బీ వీసాల కోసం వస్తున్న దరఖాస్తులు కూడా గణనీయంగా తగ్గిపోయాయని, 2017లో రెండు లక్షల 36వేల హెచ్-1బీ వీసా దరఖాస్తులు రాగా, 2018కి అవి లక్షా 99వేలకు పడిపోయాయని డీన్స్ వెల్లడించారు. ట్రంప్ సర్కారు ఆలాపిస్తున్న వలస వ్యతిరేక రాగం.. తీవ్ర ప్రభావం చూపుతోందని, దీంతో విదేశీ వలసదారుల్లో ఒకరకమైన భయం ఆవరించిందని వారు తెలిపారు. -
ప్రతిభ వలసల వీసాలు 57 శాతం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా సరికొత్త వలసవిధానంపై దృష్టి సారించింది. ప్రతిభ ఆధారిత వలసలకు మొత్తం వీసాల్లో 57 శాతం కేటాయించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీనియర్ సలహాదారు, అల్లుడు జరెడ్ కుష్నర్ నేతృత్వంలోని కమిటీ నూతన వలస విధానాన్ని రూపొందించింది. ఈ విషయమై వైట్‌హౌస్‌లో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కుష్నర్ మాట్లాడుతూ..‘నూతన ప్రతిభ ఆధారిత వలసవిధానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను, ప్రతిభావంతులను అమెరికావైపు ఆకర్షించవచ్చు. దీనివల్ల మన దేశానికి రాబోయే పదేళ్లలో పన్నులరూపంలో 500 బిలియన్ డాలర్ల(రూ.34.41 లక్షల కోట్ల) ఆదాయం సమకూరుతుంది. మన సామాజికభద్రత పథకాలకు చెల్లింపులు జరుపుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల అమెరికన్లు లబ్ధి పొందుతారు. మనతోటి దేశాలను పోల్చుకుంటే అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు కాలంచెల్లింది. కెనడాలో 53 శాతం విదేశీ నిపుణులు, ప్రతిభావంతులకు వీసాలు జారీచేస్తున్నారు. ఈ సంఖ్య న్యూజిలాండ్‌లో 59 శాతం, ఆస్ట్రేలియాలో 63 శాతం, జపాన్‌లో 52 శాతంగా ఉంటే, అమెరికాలో మాత్రం 12 శాతానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో నూతన వలసవిధానం ప్రకారం మొత్తం వీసాల్లో 57 శాతం ప్రతిభ ఆధారంగా జారీచేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. దీనివల్ల మిగతా దేశాలతో అమెరికా పోటీపడగలుగుతుంది’ అని కుష్నర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల వలస చట్టాలను అధ్యయనం చేసిన ఈ నూతన వలస విధానాన్ని రూపొందించామనీ, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న దీన్ని త్వరలోనే ప్రజలముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. -
గ్రీన్‌కార్డుల నిరీక్షణకు తెర?
వాషింగ్టన్: ప్రతిభ ఆధారిత వలస విధానం, సరిహద్దు భద్రతల కోసం ఉద్దేశించిన బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని అమెరికా చట్టసభల సభ్యులను అధ్యక్షుడు ట్రంప్ బుధవారం కోరారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డులు పొందేందుకు భారతీయులు సుదీర్ఘకాలం వేచి ఉండాల్సి వస్తుండగా, ఇప్పుడున్న గ్రీన్‌కార్డుల జారీ విధానాన్ని రద్దు చేసి అసలైన అర్హతలు ఉన్న వారికి సరళంగా, వేగంగా గ్రీన్‌కార్డులను ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. దీంతో భారత్ వంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్లే ప్రతిభావంతులకు గ్రీన్‌కార్డులు వేగంగా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. ‘బిల్లుపై బుధవారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం) సభలో ఓటింగ్ జరగనుంది. ప్రతిభ, నైపుణ్యాలను పరిగణలోనికి తీసుకుని విదేశీయులకు గ్రీన్‌కార్డు మంజూరు చేయడం, లాటరీ విధానంలో వీసాల జారీ రద్దు, డీఏసీఏ (చిన్నతనంలో వచ్చిన వారిపై చర్యల వాయిదా) పథకం కింద లబ్ధి పొందుతున్న వారికి మరో ఆరేళ్లు అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగించడం తదితరాలు ఈ బిల్లులో ఉన్నాయి -
ట్రంప్ వాదనలో నిజమెంత ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఆదినుంచి వివాదాస్పదమే. అధ్యక్షుడి హోదాలో ఆయన చేసే ప్రకటనల్లో నిజం కూడా నేతి బీరకాయలో నెయ్యి చందంగానే మారుతోంది. శరణార్థుల పేరు చెబితే అంతెత్తున లేస్తున్న ట్రంప్ అమెరికా వలస విధానంపైనా, మెక్సికో సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపైనా తాజా ప్రకటనలన్నీ తప్పుడు తడకలే. వలసవాదులు వాళ్లు చేస్తున్న నేరాలపై ఈ మధ్య కాలంలో ట్రంప్ చేసిన ప్రకటనలేంటి ? వాటి వెనుకనున్న వాస్తవాలేంటి ? వలస న్యాయమూర్తులపై ట్రంప్ : అక్రమంగా వలస వచ్చిన వారి విచారణకు వేలకు వేల మంది న్యాయమూర్తులున్నారు. పనికిమాలిన వలస చట్టాల కారణంగా వారిని నియమించాల్సి వస్తోంది. ఇక మా చట్టాలను మార్చేస్తాం. సరిహద్దుల్లో గోడలు కట్టేస్తాం. అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే ఇక కోర్టులు, కేసులు ఉండవు. వెనక్కి తిరిగి పంపేస్తాం. వాస్తవం : అక్రమ వలస కేసుల్ని విచారించానికి వేలాది మంది న్యాయమూర్తులు ఉన్నారన్నది పూర్తిగా తప్పు. ఈ విచారణకు ఉద్దేశించిన కోర్టుల్లో దేశవ్యాప్తంగా 335 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. 150 మంది అదనపు న్యాయమూర్తుల నియామకానికి బడ్జెట్ ఉంది. ఇంకా ఏడు లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ కేసులన్నీ పూర్తి కావాలంటే ఒక్కో న్యాయమూర్తి 2 వేలకు పైగా కేసుల్ని విచారించాల్సి ఉంది. తల్లీ బిడ్డల్ని వేరు చేయడంపై ట్రంప్: అత్యంత అమానవీయంగా సరిహద్దుల్లో తల్లీ బిడ్డల్ని వేరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన ట్రంప్ జీరో టాలరెన్స్ విధానానికి స్వస్తి పలికే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేస్తూ .. ఇకపై మేము కుటుంబాల్ని కలిపే ఉంచుతాం. దీంతో సమస్య పరిష్కారమైపోతోందని వ్యాఖ్యానించారు. వాస్తవం : వలసదారుల సమస్యలు ఎంత మాత్రం పరిష్కారం కావు. వారిపై కేసుల విచారణ ముగిసేవరకు తల్లీబిడ్డల్ని వేర్వేరుగా బదులుగా ఒకే చోట నిర్బంధించి ఉంచుతారు. అంతేకాదు అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వ్యక్తుల నుంచి వారి పిల్లలను 20 రోజులకు మించి వేరు చేసి ఉంచకూడదని 1997 నాటి ఫ్లోర్స్ ఒప్పందం చెబుతోంది. అమెరికన్ కాంగ్రెస్ లేదంటే అక్కడి కోర్టులు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు ఈ 20 రోజుల విధానం అమల్లోనే ఉంటుందని న్యాయశాఖ స్పష్టం చేసింది. దాని ప్రకారం చూస్తే ప్రభుత్వ అధికారులకు మూడు వారాల తర్వాత మళ్లీ తల్లీ బిడ్డల్ని బలవంతంగా వేరు చేయడానికి అన్ని అధికారాలు సంక్రమిస్తాయి. వలసదారుల అరెస్టులపై ట్రంప్ : 2011 ప్రభుత్వ నివేదిక ప్రకారం హత్యా నేరం కింద 25 వేల మంది, దోపిడి కేసులో 42 వేల మంది, లైంగిక నేరాల్లో 70 వేల మంది, కిడ్నాప్ కేసుల్లో 15 వేల మంది అక్రమవలదారుల అరెస్టులు జరిగాయి. గత ఏడేళ్లుగా కేవలం టెక్సాస్‌లోనే రెండున్నర లక్షల మంది అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేశాం. వారిపై ఆరులక్షలకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవం: అక్రమ వలసదారుల అరెస్టులపై ప్రభుత్వ అధికారిక గణాంకాలు, నివేదికలో అంశాలనే ట్రంప్ ప్రస్తావించారు. సరిహద్దులు దాటుకొని వచ్చిన నేరగాళ్లలో 30 లక్షల మందికి పైగా జరిగిన అరెస్టులు వాస్తవమే కానీ, అందులో సగానికిపైగా అక్రమవలస, మాదకద్రవ్యాలు, ట్రాఫిక్ నేరాల కింద జరిగాయి. చాలా వరకు కేసులు పౌర చట్టాల అతిక్రమణలకు సంబంధించిన కేసులే తప్ప, క్రిమినల్ అభియోగాలు కాదు. వలసదారుల నేరాలపై ట్రంప్ : ఎప్పుడూ నా చెవుల్లో ఒక మాట వినపడుతూ ఉంటుంది. అమెరికా పౌరుల కంటే వాళ్లు (వలస వచ్చిన వారు) మంచివాళ్లు అని.. అదెంత మాత్రం సరైంది కాదు. వాళ్లే అధిక నేరాలు చేస్తున్నారు. వాళ్లున్న చోటే శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది. వాస్తవం : అమెరికాలో వివిధ సామాజిక సంస్థలు, కాటో ఇనిస్టిట్యూట్ వంటి మేధో సంస్థల గణాంకాల ప్రకారం అమెరికా పౌరులతో పోల్చి చూస్తే వలసదారులు చేసే నేరాల సంఖ్య చాలా తక్కువ. 1990 సంవత్సరం నుంచి 2014 వరకు గణాంకాలను పరిశీలిస్తే వలసదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో క్రైమ్ రేటు చాలా తక్కువగా నమోదైంది. అత్యధిక వలసదారుల జనాభా ఉన్న న్యూయార్క్ నగరంలో (5 లక్షల మంది వరకు అక్రమంగా ఉన్నారని అంచనా) గత ఏడాది 292 హత్యలు జరిగాయి. అమెరికాలో ఎన్ని హత్యలు జరిగాయన్నదానిపైనే శాంతి భద్రతల్ని అంచనా వేస్తారు. అలా చూస్తే వలస వచ్చిన వారు స్థిరపడిన ప్రాంతాల్లోనే హత్యలు తక్కువగా జరిగాయి. ఆర్థిక వ్యవస్థకు వాళ్లే ఆలంబన గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ‘ వలసదారులు లేకుండా ఒక్కరోజు‘ పేరుతో ఇమిగ్రెంట్స్ అందరూ 24 గంటల సమ్మెకు దిగేసరికి అమెరికా వణికి పోయింది. రెస్టారెంట్లు, నిర్మాణ కంపెనీలు, ఇతర వాణిజ్య కేంద్రాల్లో వలస వచ్చిన వారుపనికి హాజరుకాకపోయేసరికి ఆ ఒక్క రోజే దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వలసదారుల శ్రమ లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుందని కొన్ని స్వతంత్ర సంస్థలు చెబుతున్నాయి. అమెరికా పౌరులు వలస వచ్చిన వారిని ఎంత చిన్న చూపు చూసినా రెస్టారెంట్లలో వంటలు చెయ్యడానికీ మెక్సికన్లు కావాలి, వ్యవసాయ క్షేత్రాల్లోపని చేయడానికి వాళ్ల సహకారమే ఉండాలి. అమెరికన్ల ఇళ్లు శుభ్రం చేయాలన్న, గిన్నెలు తోమాలన్నా, తోటల్లో మాలీలుగానైనా, పిల్లల్ని సంరక్షించాలన్నా మెక్సికన్లే దిక్కు అని అమెరికాలోని ప్రముఖ షెఫ్ ఆంథోని బౌర్డెన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సేవారంగంలో వసలదారులే ఎక్కువగా ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు అమెరికన్ల ఉద్యోగాలు కాజేస్తున్నారని అందరూ గగ్గోలు పెడుతున్నారు కానీ, గత రెండు దశాబ్దాల్లో రెస్టారెంట్లలో వంటలు, డిష్ వాషింగ్ వంటి ఉద్యోగాల కోసం ఒక్క అమెరికన్ కూడా ముందుకు రాలేదు. మెక్సికన్లు అంటూ లేకపోతే అమెరికాలో సేవా రంగం కుదేలైపోతుందని ఆంథోని చెబుతున్నారు. అమెరికన్ రెస్టారెంట్లలో 75 శాతం వలసదారులే పని చేస్తున్నారు. ఇక వ్యవసాయ రంగంలో కూడా అత్యధికులు వలసదారులేనని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ చదవండి: ట్రంప్ అభిశంసనకు 42 శాతం మొగ్గు -
అర్హతల ఆధారంగానే వలసలకు అనుమతి
వాషింగ్టన్: అర్హతల ఆధారంగానే వలసలను అనుమతిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అనధికారికంగా ఎవరూ దేశంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. కఠిన వలస విధానాలపై ఇంటాబయటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రతిపక్ష డెమోక్రాట్లు, మీడియా తీరుపైనా ఆయన విరుచుకుపడ్డారు. అక్రమ వలసదారుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, బాధితులను శనివారం ట్రంప్ వైట్‌హౌస్‌లో కలుసుకుని మాట్లాడారు. దేశ సరిహద్దులతోపాటు పౌరులకు కూడా భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. ఇతర దేశాల వారు ఇక్కడికి రావడాన్ని కోరుకుంటున్నామనీ, అయితే, అది పద్ధతి ప్రకారం మాత్రమే జరగాలన్నారు. ‘సమర్థత ఆధారంగానే వలసలను కోరుకుంటున్నాం. అంతేకానీ, అనర్హులకు కూడా అనుమతి ఇచ్చే డ్రా విధానాన్ని మాత్రం కాదు’ అని ‘యాంజెల్ ఫ్యామిలీస్’గా పేర్కొనే బాధిత కుటుంబాలతో అన్నారు. ‘విదేశీ నేరగాళ్ల కారణంగానే దేశంలో నేరాల రేటు పెరుగుతోంది. బాధిత కుటుంబాల ఇబ్బందులపై చర్చించటానికి ప్రతిపక్ష డెమోక్రాట్లతోపాటు, బలహీన వలస విధానాలను బలపరిచే కొందరు ఇష్టపడడం లేదు’ అని ట్రంప్ ఆరోపించారు. 2011 గణాంకాల ప్రకారం విదేశీ నేరగాళ్ల కారణంగా దేశంలో 25వేల హత్యలు, 42వేల దోపిడీలు, 70వేల లైంగిక నేరాలు, 15వేల కిడ్నాప్‌లు జరిగాయని తెలిపారు. గత ఏడేళ్లలో ఒక టెక్సస్‌లోనే 6 లక్షల నేరాలకు సంబంధించి 2.5లక్షల మందిని అరెస్ట్ చేశామన్నారు. ‘హెరాయిన్ అతిగా తీసుకున్న కారణంగా కేవలం 2016లోనే 15వేల మంది చనిపోయారు. దేశంలోకి అక్రమంగా సరఫరా అయ్యే హెరాయిన్‌లో 90 శాతం దక్షిణ సరిహద్దుల నుంచే వస్తోంది’ అని అన్నారు. 2017లో అరెస్టయిన 8 వేల మంది విదేశీ నేరగాళ్లను బలహీన చట్టాల కారణంగానే విడిచి పెట్టాల్సి వచ్చిందన్నారు. ‘ప్రజలను చంపేస్తోన్న డ్రగ్స్ సరఫరాదారులను పట్టుకుని వదిలి పెడుతుంటే ఈ మీడియా ఏం చేస్తోంది’ అని ప్రశ్నించారు. అక్రమ వలస నేరగాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, ఇబ్బందులు పడిన వారికి సాయ పడేందుకు ‘వాయిస్’ అనే విభాగాన్ని ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ట్రంప్ 2017లో ఏర్పాటు చేశారు. -
మీ పాలసీ బాలేదు
వాషింగ్టన్: అమెరికా సరిహద్దుల్లో వలసదారుల నుంచి వారి పిల్లల్ని వేరుచేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ‘జీరో టాలరెన్స్’ ఇమిగ్రేషన్ పాలసీగా అమెరికా పేర్కొంటున్న ఈ విధానాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాతో పాటు మాజీ ప్రథమ మహిళలు కూడా తప్పుపట్టారు. వేలాది మంది చిన్నారుల్ని తల్లిదండ్రుల నుంచి విడదీయడం అమానుషమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.‘జీరో టాలరెన్స్’ వలస విధానం అమల్లో భాగంగా.. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోని అక్రమ వలసదారుల నుంచి చిన్నారుల్ని బలవంతంగా వేరు చేసి వివిధ వసతి కేంద్రాల్లో ఉంచారని అమెరికా హోంల్యాండ్ భద్రతా విభాగమే స్వయంగా వెల్లడించింది. అయితే ట్రంప్ వివాదాస్పద వలస విధానానికి చిన్నారుల్ని బలిపశువుల్ని చేయడం అన్యాయమని మానవతావాదులు మండిపడుతున్నారు. పసివారిని వేరు చేయొద్దు పిల్లల హక్కులకు భంగం కలిగించే ‘జీరో టాలరెన్స్’ వలస విధానాన్ని ట్రంప్ భార్య మెలానియా సైతం తప్పుపట్టారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తోన్న మెక్సికన్ల నుంచి వారి పిల్లలను వేరుచేయడంపై ఆమె స్పందించారు. ‘చట్టప్రకారం వ్యవహరించండి, కానీ మానవత్వంతో వ్యవహరించండి’ అని అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరిని పరోక్షంగా తప్పుపట్టారు. తల్లిదండ్రుల నుంచి పసివారిని వేరు చేయడాన్ని సహించలేనని మెలానియా వ్యాఖ్యానించారని, రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఏకమై ఉన్నతమైన వలస సంస్కరణల్ని సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారని మెలానియా ప్రతినిధి స్టిఫాని గ్రీషం వెల్లడించారు. మెలానియా కూడా అమెరికాకు వలస వచ్చి ఆ దేశ పౌరసత్వం పొందడం గమనార్హం. జీరో టాలరెన్స్ దారుణం: లారా బుష్ అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ భార్య లారా బుష్ స్పందిస్తూ.. ‘ఈ జీరో టాలరెన్స్ విధానం అమానుషం. అనైతికం. ఇది విన్నాక నా గుండె బద్దలైంది’ అని వాషింగ్టన్ పోస్టు పత్రికలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘నేను కూడా సరిహద్దు రాష్ట్రంలోనే నివసిస్తున్నాను. మన అంతర్జాతీయ సరిహద్దుల్ని కాపాడాల్సిన అవసరాన్ని, ప్రయత్నాల్ని నేను అభినందిస్తున్నాను. అయితే ఈ జీరో టాలరెన్స్ విధానం దారుణం’ అని పేర్కొన్నారు. పిల్లల్ని వేరుగా ఉంచడం వంటి చర్యలకు అమెరికా ప్రభుత్వం పాల్పడకూడదని లారా బుష్ చెప్పారు. పిల్లల పట్ల అలాంటి చర్యలకు పాల్పడడం అనైతికమని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ హై కమిషనర్ జైద్ రాద్ అల్ హుస్సేన్ అన్నారు. అనుమతించేది లేదు: ట్రంప్ అయితే జీరో టాలరెన్స్ విధానాన్ని ట్రంప్ సమర్ధించుకున్నారు. ఇకపై అమెరికా వలసదారుల శిబిరంగా, శరణార్థుల కేంద్రంగా ఉండబోదని తేల్చి చెప్పారు. యూరప్, ఇతర దేశాల్లో వల్లే అమెరికాలో జరిగేందుకు అనుమతించమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులకు దూరంగా... అమెరికా సరిహద్దుల నుంచి మెక్సికో చొరబాటుదారుల్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలను కట్టుదిట్టం చేస్తూ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అమెరికాలోకి అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులతోపాటు ఉన్న పిల్లల్ని వేరుచేసి వేర్వేరు కేంద్రాల్లో ఉంచారు. ఎలాంటి సంరక్షణా లేకుండా తాత్కాలికంగా తయారుచేసిన కేజ్‌ల్లో ఐదారేళ్ల పసివారిని నిర్బంధిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో వారిని ఉంచుతున్నారని అమెరికా మహిళా శరణార్థుల కమిషన్ డైరెక్టర్ మైఖేల్ బ్రేన్ తెలిపారు. ఈ అమానుషంపై అమెరికా వెలుపల, లోపల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అమెరికా ప్రతినిధి జాన్తన్ హాఫ్మాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికా నూతన వలస విధానం అమలులోకి వచ్చాక.. ఏప్రిల్ 19 నుంచి మే 31 వరకు 2వేల మంది పసివారు తల్లిదండ్రులకు దూరమయ్యారు. అయితే ట్రంప్ మాత్రం తన విధానాన్ని సమర్థించారని అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ మే 7న ప్రకటించారు. మెక్సికన్ చొరబాటుదారుల పిల్లల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న అమెరికాపైనా, ఆ దేశ భద్రతా దళాల విధానాలపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఇరు దేశాల్లోనూ ఉద్యమాలు పెల్లుబికాయి. -
ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మిసెస్ ట్రంప్
వాషింగ్టన్ : డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వలసదారుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలిసిన విషయమే. మెక్సికో నుంచి వచ్చే అక్రమ వలసదారులను అరికట్టేందుకు ఏకంగా మెక్సికో - అమెరికా సరిహద్దులో గోడ నిర్మిస్తానన్న సంగతి విధితమే. గోడనైతే నిర్మించలేదు కానీ అంతకంటే కఠిన చట్టాలు చేసి వలసదారులకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ అనుసరిస్తున్న ‘కఠిన సరిహద్దు భద్రతా విధానం’ పట్ల అమెరికాలోని అన్ని రాజకీయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షం నుంచే కాక స్వయంగా స్వపక్షం నుంచి కూడా విమర్శలు ఎదురవుతుండటం గమనార్హం. చివరకు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా వలసదారుల పట్ల ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరును తప్పు పట్టారు. నిన్న ప్రపంచవ్యాప్తంగా ‘ఫాదర్స్ డే’ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెలానియా ట్రంప్...‘చట్టాలు నిక్కచ్చిగా అమలు చేసే దేశం, అమెరికా అంటే నాకు నమ్మకం ఉంది. కేవలం చట్టాలతో మాత్రమే కాక హృదయంతో కూడా పాలన కొనసాగడం మరింత శ్రేయస్కరం. వలసదారులను వెనక్కి పంపించే క్రమంలో చాలామంది పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. ఈ జఠిల సమస్య పరిష్కారానికి ఇరు రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. ఇరువురు ఉమ్మడిగా ఆలోచించి సరైన వలసదారుల విధానాన్ని రూపొందించాలి’ అన్నారు. ఇదిలా ఉండగా ట్రంప్ ప్రభుత్వం కొన్ని రోజుల కిందట ‘వలసదారుల అమెరికా విడిచి పోవాల్సింది’గా ఆదేశాలు జారీ చేయడమే కాక అందుకు ఆరు వారాల గడువు విధించింది. ఇచ్చిన గడువు లోపు వలసదారులు వారి దేశాలకు తిరిగి వెళ్లాలి. లేదంటే వారిని అరెస్టు చేస్తామని ఆదేశించింది. అంతేకాక వలసదారుల పిల్లలకు అమెరికాలోనే ఆశ్రయం కల్పిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన నేపధ్యంలో దాదాపు 2 వేల మంది మైనర్ పిల్లలను వారి కుటుంబం నుంచి వేరు చేసి, వారిని శరణార్ధుల శిబిరానికి తరలించారు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ చర్యలు పిల్లలను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని...ఈ చర్యలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. -
ఊరిస్తున్న బ్రిటన్ వీసా..
లండన్: విదేశీ వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూర్చేలా.. తన వలస విధానం(ఇమిగ్రేషన్ పాలసీ)లో మార్పులు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇమిగ్రేషన్ పాలసీలో సవరణల్ని ఆమోదం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. బ్రిటన్ వ్యాపార సంస్థలు, కంపెనీలు తమ అవసరం మేరకు విదేశీ వృత్తి నిపుణుల్ని నియమించుకునేందుకు అవకాశం కల్పించేలా వీసా నిబంధనల్ని సరళతరం చేయాలని ఈ సవరణల్లో ప్రతిపాదించారు. బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయం మన వృత్తి నిపుణులకు మేలు చేకూరుస్తుందని భారత ఐటీ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. విదేశీ వృత్తి నిపుణుల కోసం బ్రిటన్ జారీ చేస్తోన్న టైర్ 2 వీసాల ప్రక్రియలో ఇంతవరకూ కఠిన నిబంధనలు కొనసాగాయి. అయితే బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్ మానవవనరుల కొరతతో ఇబ్బందిపడుతోంది. దాన్ని అధిగమించేందుకు వలస విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. వీసాల పరిమితిని సడలించడంతో పాటు.. ప్రస్తుతం కొనసాగుతున్న కఠిన నిబంధనల్ని సమీక్షించాలని ప్రతిపాదించింది. వేర్వేరు రంగాల్లో ఉద్యోగుల కొరతపై నెలవారీ సమీక్ష నిర్వహించాలని స్వతంత్ర వలసల సలహా కమిటీని కోరతామని పార్లమెంటుకు తెలిపింది. బ్రిటన్ పార్లమెంట్ ప్రకటన ప్రకారం.. ‘ఐరోపాయేతర దేశాల నుంచి బ్రిటన్‌లో పనిచేయడానికి వచ్చే వైద్యులు, నర్సుల్ని టైర్–2 వీసాల పరిధి నుంచి మినహాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ఆస్పత్రుల్లో వైద్య నిపుణులు, సిబ్బంది కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది’ అని వెల్లడించారు. ప్రస్తుతం నెలకు 1,600 వరకూ టైర్ 2 వీసాలు జారీ చేస్తుండగా.. ఆ కేటగిరి నుంచి వైద్యులు, నర్సుల్ని మినహాయించడంతో భారతీయ వైద్యులు, నర్సులు లబ్ధి పొందనున్నారు. ఇతర కీలక వృత్తులను టైర్ 2 కేటగిరీ నుంచి మినహాయించవచ్చని భావిస్తున్నారు. సృజనాత్మకత ఉన్న ఫ్యాషన్ డిజైనర్లకు టాలెంట్ వీసాను జారీ చేయనున్నట్లు సవరణల్లో బ్రిటన్ వెల్లడించింది. ఆహ్వానించదగ్గ పరిణామం: ఫిక్కీ బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఫిక్కీ, బ్రిటిష్ పరిశ్రమల సమాఖ్య స్వాగతించాయి. ‘భారతీయ నిపుణులు ఎంతో కాలంగా ఈ డిమాండ్‌ను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టైర్ 2 వీసా కేటగిరీని సులభతరం చేయాలన్న బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో వృత్తి నిపుణులు బ్రిటన్‌లో పనిచేసేందుకు మార్గం సులభతరమవుతుంది. దీర్ఘకాలంలో బ్రిటన్ వ్యాపార సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుంది’ అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) అధ్యక్షుడు రశేష్ షా అన్నారు. రెండు దేశాల మధ్య ఉత్సాహపూరితమైన వాణిజ్య, ఆర్థిక సంబంధాల కోసం స్వేచ్ఛాయుత, నిజాయితీ, పారదర్శకతతో కూడిన వీసా నిబంధనల కోసం ఫిక్కీ ప్రయత్నాలు చేసిందని ఆయన చెప్పారు. బ్రిటన్ వ్యాపార సంస్థలు ఈ సంస్కరణల్ని ఆహ్వానిస్తాయని, అంతర్జాతీయ నైపుణ్యం, ప్రతిభ బ్రిటన్ కంపెనీలకు కీలకమని బ్రిటన్ పరిశ్రమ సమాఖ్యకు చెందిన ముఖ్య అధికారి మాథ్యూ ఫెల్ పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులకు బ్రిటన్ ఝలక్ బ్రిటన్‌లో విద్యార్థి వీసాలకు సంబంధించి ‘లో రిస్క్’ దేశాల జాబితా నుంచి భారత్‌ను మినహాయించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వలస విధానం సవరణల్లో భాగంగా విదేశీ విద్యార్థులకు ఇచ్చే ‘టైర్ 4’ వీసాలకు సంబంధించి 25 దేశాల విద్యార్థులకు నిబంధనల్లో సడలింపు నిచ్చారు. ఈ జాబితాలో ఉన్న అమెరికా, కెనడా, న్యూజిలాండ్ తదితర దేశాలకు ఎప్పటినుంచో సడలింపు కొనసాగుతుండగా.. తాజాగా చైనా, బహ్రైన్, సెర్బియా తదితర దేశాల్ని చేర్చారు. జూలై 6 నుంచి ఇది అమల్లోకి రానుంది. జాబితాలోని దేశాలకు చెందిన విద్యార్థులు పెద్దగా తనిఖీలు ఎదుర్కోవాల్సిన అవసరముండదు. అయితే మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులు కఠిన తనిఖీలు ఎదుర్కోక తప్పదు. ఇది అవమానకరమని, తప్పుడు సంకేతాలు పంపుతుందని భారత సంతతి వ్యాపారవేత్త లార్డ్ కరణ్ బిలిమోరియా విమర్శించారు. -
బ్రిటన్ ‘వీసా’ సరళతరం!
లండన్: బ్రెగ్జిట్ తర్వాత తీవ్రమైన మానవవనరుల కొరతతో సతమతమవుతున్న బ్రిటన్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలుచేస్తున్న వలస విధానం(ఇమిగ్రేషన్ పాలసీ)లో సవరణలను బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచింది. ఇందులో భాగంగా వ్యాపార సంస్థలు మరింతమంది విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు వీలుగా వీసా నిబంధనల్ని సరళతరం చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల భారత్‌కు చెందిన ఐటీ నిపుణులకు గణనీయమైన లబ్ధి కలగనుంది. ప్రస్తుతం వేర్వేరు రంగాల్లో ఉద్యోగుల కొరతపై నెలవారీ సమీక్ష నిర్వహించాల్సిందిగా స్వతంత్ర వలసల సలహా కమిటీని కోరతామని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. సృజనాత్మకత ఉన్న ఫ్యాషన్ డిజైనర్లకు టాలెంట్ వీసాను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఐరోపాయేతర దేశాల నుంచి బ్రిటన్‌లో పనిచేయడానికి వచ్చే నర్సులకు ఇస్తున్న టైర్–2 వీసాల గరిష్ట పరిమితిని బ్రిటన్ ఇంతకుముందు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ఆస్పత్రుల్లో వైద్య నిపుణులు, సిబ్బంది కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. -
అప్పుడు అమెరికా..ఇప్పుడు ఆస్ట్రేలియా..
ముంబై : అమెరికా అంటే ఒకప్పుడు ఉన్నత విద్యకు, ఉపాధి అవకాశాలకు కల్పతరువు వంటిది. ఉన్నత విద్య, ఉపాధి కోసం మనలో చాలా మంది అమెరికా వెళ్లాలని ఉవ్విళ్ళూరిన వారున్నారు. అప్పుడు అనుకున్నదే తడవుగా అమెరికా వెళ్లడానికి ఎటువంటి అడ్డంకులు లేవు. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక పరిస్థితులు మారాయి. ప్రస్తుతం అక్కడ వీసా నిబంధనలు, వలస విధానం ఎంత కఠినంగా మారాయో ఈసారి మన విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్యను చూస్తే అర్థం అవుతుంది. అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వేర్వేరు దేశాల వ్యక్తులకు జారీ చేసే వీసాల సంఖ్య 2016లో 5.02లక్షలు ఉండగా 2017, సెప్టెంబరు 30 నాటికి ఈ సంఖ్య 16శాతం తగ్గి 4.21లక్షలకు పడిపోయింది. 2016లో 65,257మంది భారతీయ విద్యార్థులకు వీసాలను జారీ చేయగా 2017 నాటికి ఆ సంఖ్య 47,302కు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా... 2017 సెప్టెంబర్ 30నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.93లక్షల మంది విద్యార్థులకు ఎఫ్1 కేటగిరికి సంబంధించిన వీసాలను, వారి కుటుంబ సభ్యులకు(జీవిత భాగస్వాములు, పిల్లలకు) ఎఫ్2 కేటగిరికి సంబంధించిన వీసాలను మంజూరు చేసింది. వీరిలో 68శాతం ఆసియా ఖండానికి చెందిన వారే ఉన్నారు. వారిలోనూ 40శాతం మంది భారత్, చైనాలకు చెందినవారు కావడం విశేషం. 2017లో 2.86లక్షల వీసాలను ఆసియా దేశాల వారికి జారీ చేశారు. 2016తో పోలిస్తే ఇది 20శాతం తగ్గింది. గతంలో.... ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందు విద్యార్థులకు జారీ చేసే వీసాల సంఖ్య ఎక్కువగా ఉండేది. 2015లో ఈ సంఖ్య 6.50లక్షలు. గత సంవత్సరం నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రావడంతో హెచ్1-బీ దరఖాస్తుదారులు వర్క్ వీసా, అమెరికా పౌరసత్వం, వలస సేవల ప్రయోజనాలు పొందడం కఠినంగా మారింది. ప్రస్తుంతం వారికి చెల్లిస్తున్న వేతనాలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అమెరికా వెళ్లలనుకునే ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణం అక్కడ ఉద్యోగం చేయాలంటే ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని సంపాదించాలి అనే నిభందన ఉండటం . వీటన్నిటి ఫలితంగా ఇంతకాలం అమెరికా...అమెరికా అని పలవరించిన భారతీయ విద్యార్థులు ప్రస్తుతం ఆస్ట్రేలియా,కెనడా వైపు చూస్తున్నారు. -
గ్రీన్‌కార్డుల్లో జాప్యానికి ముగింపు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిస్తోన్న వలస విధానం అమల్లోకి వస్తే.. నిపుణులైన ఉద్యోగులకు గ్రీన్‌కార్డుల జారీలో జాప్యానికి తెరపడనుందని వైట్‌హౌస్ పేర్కొంది. ఒక్కో దేశానికి కోటా ప్రకారం గ్రీన్‌కార్డుల కేటాయింపుల్ని రద్దు చేయాలని భారతీయ హెచ్–1బీ వీసాదారులు డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. గత వారం రోజులుగా భారత్‌కు చెందిన నిపుణులైన ఉద్యోగులు అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి వాషింగ్టన్ చేరుకుని.. ప్రస్తుత వలస విధానంలో మార్పు తీసుకురావాలని కోరుతూ ట్రంప్ యంత్రాంగం, అమెరికన్ కాంగ్రెస్ సభ్యులపై ఒత్తిడి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా అనుసరిస్తోన్న వలస విధానం వల్ల హెచ్–1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయ– అమెరికన్లు ఎక్కువగా నష్టపోతున్నారు. గ్రీన్‌కార్డు కోసం వారు గరిష్టంగా 70 ఏళ్లు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ‘ప్రతిభ ఆధారిత వలస విధానానికే ట్రంప్ మొగ్గు చూపుతున్నారు. దీంతో అత్యుత్తమ నిపుణులైన ఉద్యోగుల్ని ఆకర్షించవచ్చు. అందుకనుగుణంగా వీసా లాటరీ విధానానికి స్వస్తి చెప్పేలా ట్రంప్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది’ అని వైట్‌హౌస్ డిప్యూటీ మీడియా కార్యదర్శి రాజ్ షా చెప్పారు. ‘వీసా లాటరీ విధానానికి ముగింపు పలికే సమయం దగ్గరపడింది. మెరుగైన వలస విధానాన్ని రూపొందించడంతో పాటు అమెరికన్ల భద్రతకు కాంగ్రెస్ కృషిచేయాల్సిన అవసరముంది’ అని ట్వీటర్లో ట్రంప్ అన్నారు. -
మెరిట్ బేస్డ్ విధానమే భేష్
వాషింగ్టన్: నైపుణ్య ఆధారమైన వలసలను ప్రోత్సహించటం ద్వారా అక్రమ వలసలకు చెక్ పెట్టొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తద్వారా మంచి ట్రాక్ రికార్డున్న నిపుణులు అమెరికాకు వచ్చేందుకు వీలుంటుందన్నారు. శ్వేతసౌధంలో రిపబ్లిక్, డెమొక్రాట్ చట్ట సభ్యుల బృందంతో ట్రంప్ సమావేశమయ్యారు. అమెరికాలో ప్రవేశానికి ప్రస్తుతం అనుసరిస్తున్న చైన్ మైగ్రేషన్ విధానానికి (అమెరికా పౌరుడై ఉన్న లేదా అక్కడ చట్టపరంగా నివసిస్తున్న కుటుంబ సభ్యుల స్పాన్సర్షిప్ ద్వారా ప్రవేశం పొందటం) ముగింపు పలకాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ విధానం ద్వారా అమెరికాలో వేగంగా, సులభంగా ప్రవేశం పొందేందుకు అనుమతి లభిస్తోంది. ‘వీసాల గురించి మనం ప్రవేశపెట్టే అన్ని బిల్లుల్లోనూ నైపుణ్యం అనే పదాన్ని జోడించాలి. ఎందుకంటే.. కెనడాలో, ఆస్ట్రేలియాలో ఉన్నట్లుగా మనకు కూడా నైపుణ్యాధారిత వలసలుండాలని భావిస్తున్నాను. అందుకే మంచి ట్రాక్ రికార్డున్న వారు మనదేశానికి వస్తే బాగుంటుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ: సరైన అనుమతి పత్రాలు లేకుండా చిన్నతనంలోనే తల్లిదండ్రులతోపాటు అమెరికా వెళ్లి,అక్రమంగా నివసిస్తున్న స్వాప్నికుల (డ్రీమర్స్)ను తిరిగి స్వదేశాలకు పంపేందుకు ప్రయత్నించిన ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పథకాన్ని రద్దు చేయాలన్నప్రతిపాదనను శాన్ఫ్రాన్సిస్కోలోని జిల్లా కోర్టు తిరస్కరించింది. విచారణ ముగిసేవరకు దీన్ని కొనసాగించాలని చెప్పింది. -
ఇన్ఫోసిస్‌పై ట్రంప్ ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాల కారణంగా.. ఈసారి ఇన్ఫోసిస్ లాభాల మీద ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. తాను తీసుకునే టాప్ 3 విధాన నిర్ణయాల్లో ఇమ్మిగ్రేషన్ ఒకటని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. దానివల్ల సంస్థ లాభాల మీద ప్రభావం పడొచ్చని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా చెప్పారు. అయితే, ఈ ప్రభావం ఎంత ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చన్న విషయంపై మాత్రం కంపెనీ ఇంకా ఒక అంచనాకు రాలేకపోతోంది. భారతీయ ఉద్యోగులైతే తక్కువ జీతాలతోనే తాత్కాలిక వర్క్ పర్మిట్ వీసాలతో విదేశాలకు కూడా పంపి అక్కడ పనిచేయించుకోవడం సులభం అనేది ఇక్కడి కంపెనీల భావన. అమెరికన్లను అక్కడ ఉద్యోగాల్లోకి తీసుకుంటే వారికి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేతప్ప అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దొరకరనే సమస్య మాత్రం లేదని సిక్కా అంటున్నారు. అక్కడ కూడా కావల్సినన్ని యూనివర్సిటీలున్నాయని, కావల్సినంత మంది ఇంజనీర్లు దొరుకుతారని చెప్పారు. అయితే.. ఇప్పుడు అక్కడివారిని ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే అమెరికా మార్కెట్‌ను కాగ్నిజెంట్ లాంటి పోటీదారులకు వదులుకోవాల్సి వస్తుంది. అందుకే ఎలాగోలా ఖర్చు పెరిగినా సరే.. అక్కడి ప్రాజెక్టులను మాత్రం వదులుకోకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ తన వార్షిక రెవెన్యూ వృద్ధి లక్ష్యాలను మూడు నెలల్లో రెండోసారి తగ్గించుకుంది. చాలావరకు పాశ్చాత్య దేశాల క్లయింట్లు ఖర్చు తగ్గించుకోవాలని నిర్ణయించడంతో ఇక్కడి సాఫ్ట్వేర్ సేవల ఎగుమతి కంపెనీలకు ఆదాయం తగ్గుతోంది. ఈ ప్రభావం ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీల మీద కూడా పడింది. రాబోయే రోజుల్లో ఇది ఇంకెంత తీవ్రంగా ఉంటుందో చూడాలి.