దుబాయ్ ఎడారిలో భారతీయ బాలుడి మృతి
దుబాయ్లో జరిగిన డిజర్ట్ సఫారీలో వాహనం తిరగబడి కేరళకు చెందిన ఓ చిన్నారి మరణించాడు. కేరళలోని అళప్పుజ ప్రాంతానికి చెందిన ప్రణవ్ (4) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. షార్జా ప్రాంతంలో వాళ్లు ప్రయాణిస్తున్న వాహనం తిరగబడింది. దాంతో ప్రణవ్ కింద పడిపోయాడు. అతడిని వెంటనే ధయాడ్ ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే తలకు తీవ్రమైన గాయం కావడంతో తీసుకొచ్చేసరికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
ప్రణవ్ తండ్రి అరుణ్ కుమార్ ఓ టీవీ చానల్ కెమెరామన్. ఆయన సోదరుడు అజిత్ కుమార్ ఈ పర్యటన ఏర్పాటుచేశారు. ప్రణవ్ తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి వెళ్తుండగా, మిగిలిన కుటుంబ సభ్యులంతా వేరే వాహనంలో ఉన్నారు. వాహనం కాస్త కిందకు వెళ్తుండగా అదుపుతప్పి రెండు మూడు సార్లు పల్టీకొట్టింది. ప్రణవ్ ఓ కిటికీ గుండా బయట పడిపోయి.. తలకు గాయమై మరణించాడు.