ins viraat
-
ఐఎన్ఎస్ విరాట్ విచ్ఛిన్నంపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: భారత నావికా దళ విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విరాట్’ను విచ్ఛిన్నం చేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జాతి ప్రయోజనాల రీత్యా నావికాదళ నౌకని విచ్ఛిన్నం చేయరాదని, ఈ చారిత్రక నౌకను భద్రపరచాలని కోరుతూ ఓ ప్రైవేటు కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. ఈ నౌకను ప్రస్తుత యజమాని నుంచి కొనుగోలు చేసి, సముద్ర మ్యూజియంగా మార్చాలని భావిస్తోన్న ఎంఎస్ ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. గత ఏడాది జరిగిన వేలంపాటలో దాదాపు రూ.65కోట్లకు శ్రీరాం షిప్ బ్రేకర్స్ దీన్ని కొనుగోలు చేసింది. గుజరాత్‌లోని అలంగ్ బీచ్‌లో ఈ నౌకను విచ్ఛిన్నంచేయనుంది. రూ. 100 కోట్లకు కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు ఎన్విటెక్ సంస్థ తెలిపింది. దీనిపై స్పందించాల్సిందిగా హోం శాఖను, నౌక ప్రస్తుత యజమానిని కోర్టు కోరింది. ఈ నౌకను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతూ గతంలో బాంబే హైకోర్టుని ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ కంపెనీ అభ్యర్థించింది. నౌకను కొనుగోలు చేసేందుకు ఎన్ఓసీ కోరిన ప్రైవేటు కంపెనీ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా గత ఏడాది నవంబర్ 3న, జస్టిస్ నితిన్ జామ్దార్, జస్టిస్ మిలిండ్ జాధవ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. -
రాజీవ్ యుద్ధనౌకను వాడుకున్నారా?
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్ తన వ్యక్తిగత ట్యాక్సిగా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో రాంలీలా మైదానంలో నిర్వహించిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ‘‘మిత్రులారా! యుద్ధనౌకను తమ సొంత అవసరాలకు వాడుకున్నట్లు.. మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ కాంగ్రెస్ కుటుంబం దేశానికి గర్వకారణం అయిన ఐఎన్ఎస్ విరాట్‌ను హాలీడే ట్రిప్‌కు వెళ్లడానికి వ్వక్తిగత ట్యాక్సిగా వాడుకుంది’’ అని విమర్శించారు. రాజీవ్ గాంధీ ఆయన కుటుంబం ఐఎన్ఎస్ విరాట్ యాత్రపై 1980లో ఇండియా టుడే మ్యాగజైన్ ప్రచురించిన 'ఇడిలిక్ వెకేషన్ ఆఫ్ దీ గాంధీ లక్షద్వీప్ అర్చిపీలాగో' ఆర్టికల్‌ను మోదీ ట్వీట్ చేశారు. ఆ ఆర్టికల్‌లో రాజీవ్ గాంధీ తన భార్య సోనియా గాంధీ, పిల్లలు రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు ఆయన అత్త మామలతో కలిసి ఐఎన్ఎస్ విరాట్‌లో విహర యాత్రకు వెళ్లినట్లుగా ఉంది. అయితే దీనిలో ఎంత వరకు నిజాలు ఉన్నాయో తెలుసుకోవడాని ఇండియా టూడే, భారత నేవి అధికారులను ఇంటర్వ్యూ చేసింది. దానిలో భాగంగా ఇండియన్ నేవీ యుద్ధ నౌకలను వ్యక్తిగత అవసరాలకు ఎన్నిసార్లు ఉపయోగించారు అనే ప్రశ్నకు.. నేవీ ఇంటిగ్రేటెడ్ అధికారులు భారత నౌకల్లో అనాధికార, ప్రైవేట్ ప్రయాణాలకు అనుమతి లేదని' సమాధానం ఇచ్చింది. 1987లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ విహార యాత్రకు ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ఉపయోగించారా? అనే ప్రశ్నకు భారత నావికదళం' దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1987 డిసెంబర్ 28న త్రివేండ్రం నుంచి ఐఎన్ఎస్ విరాట్‌ను ప్రారంభించారని, 1987 డిసెంబర్ 29 న మినికాయ్ దీవి నుంచి తిరిగి బయలుదేరారు. రాజీవ్ గాంధీతో ఎవరు వెళ్లారు అనే ప్రశ్నకు నావికాదళం ఇలా సమాధానం ఇచ్చింది 'సోనియా గాంధీతో కలిసి రాజీవ్ గాంధీ విరాట్‌ను ప్రారంభించినట్లు' తెలిపారు. Ever imagined that a premier warship of the Indian armed forces could be used as a taxi for a personal holiday? One Dynasty did it and that too with great swag. Read this and share widely! https://t.co/OcqpHsQ8xM — Narendra Modi (@narendramodi) May 8, 2019 -
‘కాలుష్యరహిత నగరాలుగా విశాఖ, విజయవాడ’
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు నగరాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దడానికి ఎంపిక చేసినట్టు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశంలో కాలుష్యం బారిన పడిన నగరాలను కాలుష్యరహితంగా మార్చేందుకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. 2011-2015 మధ్య కాలంలో దేశంలోని వివిధ నగరాల్లో వ్యాపించిన గాలి నాణ్యతకు సంబంధించిన డేటా ప్రతిపాదికన, ప్రపంచ బ్యాంక్ నివేదిక ఆధారంగా దేశంలోని 102 నగరాలు కాలుష్యం బారినపడినట్టు గుర్తించడం జరిగిందన్నారు. ఆ నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నగరాల్లో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన కార్యచరణ పథకాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆమోదించినట్టు చెప్పారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరుతోపాటు దేశంలోని 10 లక్షల జనాభా మించిన 28 నగరాల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టి, పరిశుభ్రమైన గాలిని అందించేందుకు.. ఈ ఏడాది ప్రతి నగరానికి 10 కోట్ల రూపాయలను తమ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిందని తెలిపారు. అంతేకాకుండా కాలుష్యాన్ని అరికట్టేందుకు చేపట్టే చర్యలను ఆయన వివరించారు. కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, యంత్ర పరికరాలను వినియోగించి వీధులను శుభ్రపరచడం, వాటర్ స్ప్రింక్లర్స్ వినియోగం, వాతావరణంలో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున మొక్కలు పెంపకం చేపడతామని తెలిపారు. ఐఎస్ఎస్ విరాట్ ఇక తుక్కే.. భారత నౌక దళ సేవల నుంచి విశ్రమించిన ప్రతిష్టాత్మక విమాన వాహక యుద్ద నౌక ఐఎన్ఎస్ విరాట్‌ను తుక్కుగా మార్చాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించినట్టు ఆ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. 2017లో నౌకదళ సేవల నుంచి ఉపసంహరించిన ఐఎన్ఎస్ విరాట్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అందచేయడం లేదని చెప్పారు. యుద్ధ నౌకను అప్పగిస్తే ఆర్థికంగా దానిని ఏ విధంగా భరించగలమో వివరించే ప్రతిపాదన ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు అందలేదని స్పష్టం చేశారు. భద్రత, రక్షణ అంశాలను దృష్టిలో పెట్టుకుని.. నౌక దళ అధికారులతో చర్చించిన అనంతరం ఐఎన్ఎస్ విరాట్‌ను తుక్కుగా మర్చాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. -
ఐఎన్ఎస్ విరాట్ చుట్టూ రాజకీయ దుమారం
-
విరాట్..ఎంతెంత దూరం?
విశాఖసిటీ: పర్యాటక స్వర్గధామమైన విశాఖలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు కార్యాచరణ దిశగా ముందుకు కదలడం లేదు. పర్యాటక కీర్తిని మరింత ప్రతిబింబించాలన్న ఆరాటం ఆచరణ రూపం ధరించకపోవడంతో ప్రయోజనం కానరావడం లేదు. పర్యటక మణిహారంగా మారుతుందనుకున్న ఐఎన్ఎస్ విరాట్ ప్రాజెక్టు తీరానికి ఇప్పట్లో చేరేట్టు కనిపించడం లేదు. ఇటీవల టీయూ– 142 మ్యూజియం ప్రారంభోత్సవంలో పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ విరాట్ ప్రాజెక్టు విశాఖకు వస్తుందని చెప్పినా.. ఎక్కడ, ఎప్పుడనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏడాది దాటినప్పటికీ ప్రభుత్వం ఇంకా.. అడుగులు సాగని దశలో..డీపీఆర్ స్థాయిలో ఉండడంతో విరాట్ మ్యూజియంగా మారుతుందా.. విశాఖకు వస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. చల్లారిన ఉత్సాహం విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ ప్రాజెక్టుపై మొదట్లో చాలా ఉత్సాహం ఉండేది. కానీ సందర్శకుల ఆశల తీరంలో లంగరేసిన పర్యాటక శాఖ.. కాలయాపన చేస్తోంది. ప్రాథమిక పరిశీలన నివేదిక రూపకల్పనకు ఇటీవల నిధులు కేటాయించినా.. ప్రాజెక్టు ఇంకా డీపీఆర్ స్థాయిలో ఉండడం మింగుడు పడని అంశంగా మారింది. మ్యూజియంగా మారనున్న యుద్ధ విమాన వాహన నౌక విరాట్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఈ నెల ఆరో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. హోటల్, కన్వెన్షన్ సెంటర్, నేవల్ మారిటైమ్ మ్యూజియంతోపాటు వివిధ సౌకర్యాలు కల్పించేలా టూరిజం డెస్టినేషన్‌గా విరాట్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కొలిక్కి వచ్చేదెప్పుడు? ప్రపంచంలో అతి పెద్ద విమాన యుద్ధ నౌకగా గుర్తింపు పొందిన ఐఎన్ఎస్ విరాట్ నేవీ సేవల నుంచి 2016 అక్టోబర్‌లో నిష్క్రమించింది. అప్పటి నుంచి దీన్ని మ్యూజియం, స్టార్ హోటల్‌గా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఇంకా డీపీఆర్ స్టేజిలో ఉండటంతో పర్యాటకులు విరాట్ వస్తుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ఖరారైన ఏడాది తర్వాత డీపీఆర్ తయారు చేసేందుకు ముంబైకి చెందిన మాస్టర్ అండ్ అసోసియేట్స్ ఆర్కిటెక్టŠస్ ఇంటీరియర్ డిజైనర్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలను అప్పగించింది. డీపీఆర్‌తోపాటు పూర్తి ప్రాజెక్టు అంచనా వ్యయం నిర్ధారించేందుకు ప్రొఫెషనల్ ఫీజుగా రూ. 60 లక్షలు ఖర్చవుతుందని ప్రభుత్వానికి నివేదిస్తూ.. తొలి విడతగా రూ.31.86 లక్షలు మంజూరు చేయాలని కోరింది. పరిశీలించిన ప్రభుత్వం రూ. 17.70 లక్షలు మంజూరు చేసింది. అదేవిధంగా విరాట్ మరమ్మతుల కోసం నియమించిన చెందిన లీడ్స్ కన్సల్టింగ్, సర్వీసెస్ సంస్థ (గుర్గావ్)కు రూ. 2.77 లక్షలు మంజూరు చేసింది. అయితే.. డీపీఆర్ ఎప్పుడు పూర్తవుతుందనే అంశంపై పర్యాటక శాఖ అధికారులకే స్పష్టత లేకపోవడం విడ్డూరం. ప్రాజెక్టు వ్యయం ఎంత? కేంద్ర ప్రభుత్వం విరాట్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలంటూ ఈ భారీ నౌకను ఏపీకి అందజేసేందుకు అంగీకరించింది. అప్పటి నుంచి ఈ ఏడాది ప్రథమార్థం వరకు దీనిపై ఎలాంటి చర్చలూ జరగకపోవడంతో, కేంద్ర ప్రభుత్వం, నేవీ అధికారుల నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో.. ప్రాజెక్టు వెనక్కు మళ్లిందని అనుకున్నారు. ఈ సమయంలో మూడు నెలల క్రితం ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక తయారు చేయాలంటూ చెన్నైకి చెందిన నాటెక్స్ మారిటైమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏపీ టూరిజం అథారిటీ బాధ్యతలు అప్పగించింది. అయితే.. ఈప్రాజెక్టు వ్యయం తొలుత వెయ్యి కోట్ల రూపాయలు అనుకున్నారు. దీనికవసరమయ్యే నిధుల్ని కేంద్రం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. ఎలాంటి స్పందన రాకపోవడంతో.. వ్యయాన్ని 500 నుంచి 700 కోట్ల రూపాయలకు కుదించవచ్చనే అంచనాలకు వచ్చారు. ఇందులో కూడా సగం నిధులు భరించాలని కేంద్రాన్ని కోరినా.. స్పష్టమైన హామీ రాకపోయే సరికి.. ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. స్థల ఎంపికపైనా మల్లగుల్లాలు విరాట్ మ్యూజియం, స్టార్ హోటల్‌ను ఎక్కడ ఏర్పాటు చెయ్యాలనే అంశంపైనా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. విరాట్‌ను బెర్తింగ్ చెయ్యకుండా నీళ్లలో ఉంచితే బెర్తింగ్ సమస్య తీరిపోతుందని నేవీ అధికారులు గతంలో సలహా అందించారు. కానీ.. అలా ఉండాలంటే సముద్రంలో కనీసం 30 నుంచి 40 అడుగుల లోతు ఉండాలి. అలా ఉంచితే.. అధిక భారం పడే అవకాశముందని లెక్కగట్టిన సర్కారు.. బెర్తింగ్ వైపు మొగ్గు చూపింది. అయితే.. దాంతో విరాట్‌ను బెర్తింగ్ చేసేందుకు అనువైన ప్రదేశాల్లో విశాఖ తీరంలోని భీమిలి మండలం మూలకుద్దు సరైందిగా గుర్తించారు. అయినా.. దీన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కనీసం ఈ విషయంపైనైనా... పర్యాటక శాఖ స్పష్టత ఇస్తే.. విశాఖ వాసులు కొంత వరకూ ఆనందపడే అవకాశాలున్నాయి. మొత్తమ్మీద.. దేశంలో తొలి సబ్‌మెరైన్ మ్యూజియం ఐఎన్ఎస్ కురుసుర, ఆసియాలోనే తొలి యుద్ధ విమాన మ్యూజియం టీయూ–142 ప్రాజెక్టులతో పర్యాటక రంగంలో వన్నెలద్దుకున్న విశాఖ.. విరాట్‌తో ప్రపంచస్థాయి మ్యూజియంగా ఖ్యాతి గడించే అవకాశముంది. అయితే అది ఎప్పుడన్నదే ప్రశ్న. -
విరాట్‌కు గుడ్‌బై.. నాలుగునెలల్లో భవితవ్యం
న్యూఢిల్లీ: భారత నేవీ దళానికి అతి కీలకమైన సేవలు అందించిన భారీ యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్ నేటితో బాధ్యతలకు గుడ్‌బై చెబుతుంది. దాదాపు 30 ఏళ్లపాటు గొప్ప సేవలు అందించిన విరాట్‌ను ఇక విధుల నుంచి విరమింపజేస్తున్నట్లు నేవీ చీఫ్ సునీల్ లంబా తెలిపారు. నాలుగు నెలల్లో దీనిని కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ కాకుంటే విడిభాగాలుగా చేసి స్క్రాప్‌కు పంపిస్తామని తెలిపారు. భారత ఆర్మీకి 30 ఏళ్లు, అంతకుముందు 27 ఏళ్లు రాయల్ నేవీకి సేవలు అందించిన విరాట్‌కు సోమవారం సాయంత్రం ముగింపు పలుకుతామని అన్నారు. అయితే, ఈ షిప్‌ను మ్యూజియంగా మారుస్తామని గతంలో ఆంధ్రప్రదేశ్ చెప్పింది. అయితే, ఇందుకోసం దాదాపు రూ.1000 కోట్లు అవసరం అవుతాయి. గుజరాత్‌లోని అలాంగ్ ప్రాంతంలో దీనిని ఈ రోజు సాయంత్రం నిలిపి అక్కడ నుంచే కొనేవాళ్లకు అప్పగించడమా లేకుంటే స్క్రాప్‌కు తరలించడమా అనే ప్రక్రియ జరుగనుంది. మొత్తం 11 లక్షల కిలోమీటర్ల దూరాన్ని విరాట్ పూర్తి చేసిందని, ఇది మొత్తం గ్లోబును 27సార్లు చుట్టొచ్చినట్లని అన్నారు. ఐఎన్ఎస్ విరాట్ ప్రత్యేకతలు.. ఇది ప్రపంచంలోనే అతి ప్రాచీన యుద్ధ వాహక నౌక భారతీయ నేవీలోకి 1987లో అడుగుపెట్టింది దేశంలో నిర్వహించిన అన్ని మేజర్ ఆపరేషన్లలో విరాట్ పాల్గొంది విరాట్‌ను 1959లో బ్రిటీష్ రాయల్ నేవీ కోసం తయారుచేశారు ఆ సమయంలో ఫాక్లాండ్ యుద్ధంలో విజయం సాధించడంతో విరాట్‌కు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఆ తర్వాత భారత నేవీలోకి 1987లో అడుగు ఈ వాహక నౌకకు 14 సార్లు మరమ్మత్తులు చేశారు కీలక ఆపరేషన్లు ఆపరేషన్ జూపిటర్ (1988, శ్రీలంకతో శాంతికొనసాగింపు మిషన్) ఆపరేషన్ విజయ్ (1999, పోస్ట్-కార్గిల్) ఆపరేషన్ పరక్రామ్(2001, పార్లమెంటుపై దాడి జరిగిన సందర్భంలో) విరాట్ కీలక పాత్ర పోషించింది. ప్రత్యేకతలు విరాట్ 743 అడుగుల పొడవు, 160 అడుగుల వెడల్పు, 29 అడుగుల ఎత్తు ఉంటుంది 16 సీ హ్యారియర్ జెట్స్, 4 సీ కింగ్ కాప్టర్స్, 2 చేతక్ చాపర్స్, 4 ధ్రువ కాప్టర్స్ను నిలిపే సామర్థ్యం విరాట్ సొంతం ఇందులోని నేవీ ఆయుధ సామాగ్రిని, యుద్ధ సామాగ్రిని బయటకు తీయడానికి ఆరు నెలల సమయం పడుతుంది. -
విశాఖ తీరంలో ఐఎన్ఎస్ విరాట్
-
కాక్ ట్రోఫీ గెలుచుకున్న విరాట్
భారత నౌకాదళంలోని విమానవాహక నౌక ఐఎన్ఎస్ విరాట్.. మరో ఘన విజయం సాధించింది. వెస్ట్రన్ ఫ్లీట్ వేలర్ పుల్లింగ్ రెగట్టా పోటీలలో 'కాక్ ట్రోఫీ'ని గెలుచుకుంది. త్వరలోనే డీకమిషన్ అవబోతున్న తరుణంలో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ పోటీలలో ఓవరాల్ విన్నర్‌గా ఐఎన్ఎస్ విరాట్‌ను ప్రకటించి, కాక్ ట్రోఫీ అందించారు. చాలా గట్టి పోటీ ఉన్న ఈ రేసులో.. మరో విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య రన్నరప్‌గా నిలిచింది. తదుపరి రెగట్టా జరిగేవరకు గెలిచిన నౌకను 'కాక్ షిప్' అని పిలుస్తారు. నౌకాదళ ఉప అధిపతి వైస్ అడ్మిరల్ ఎస్పీఎస్ చీమా ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మంచి క్రీడాస్ఫూర్తి, టెక్నిక్, ఉత్సాహం చూపించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆయన అన్నారు. వేలర్ అనేది 27 అడుగుల పొడువన్న బోటు. దీన్ని ఐదుగురు 'పుల్లర్లు' 17 అడుగుల పొడవున్న తెడ్లతో 1.3 కిలోమీటర్ల మేర తీసుకెళ్తారు. రెగట్టా జరిగేందుకు కొన్ని నెలల ముందు నుంచి దీని కోసం కఠోరమైన కృషి చేస్తారు. ఐఎన్ఎస్ విరాట్ తొలుత 30 ఏళ్ల పాటు బ్రిటిష్ నౌకాదళంలో పనిచేశాక, భారత్ దాన్ని కొనుగోలు చేసింది. 1987లో దానికి పూర్తిగా మార్పుచేర్పులు చేసి భారత నౌకాదళంలోకి తీసుకున్నారు.