ఆయుర్వేదంపై ఆసక్తి
కొండాపూర్, న్యూస్‌లైన్: ఆయుర్వేద వైద్యానికి పల్లెల్లోని ప్రజలు మక్కువ చూపుతున్నారు. సహజంగా లభించే ఔషధ వనమూలికలు, వాయిదినుసులు ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి ఆయుర్వేద వైద్యుల సహకారంతో సర్వ రోగాలకు నివారణిగా త యారుచేసిన సంజీవని చూర్ణాన్ని ప్రజ లు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. మండలంలో ఏకైక ఆయుర్వేద వైద్యశాల మారెపల్లిలో ఉంది. మిగతా 20 గ్రామాల్లో హైదరాబాద్ చెందిన మాన స ఆయుర్వేద ఆస్పత్రి, కృష్ణలాల్ మదన్‌లాల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వారు ఊరూర తిరుగుతూ గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బహిరంగంగా ఔషధ మూ లికలు, వాయిదినుసులు 168 రకాల ఆయుర్వేద వస్తువులను సమ భాగాలుగా తీసి రోలు కుందెనగడ్డ పారతో తయారుచేసి సర్వరోగ నివారణ కోసం గ్రామాల్లోనే ఇస్తున్నారు.
పదేళ్ల పిల్లలకు 30 గ్రాముల చూర్ణం 11 రోజులు, పెద్దలకు 60 గ్రాముల చూర్ణం 21 రోజులు వాడాలని సూచిస్తున్నారు. వంకాయ, గోంగూర, గోరు చిక్కుడు, ఎండు చేపలు, బంగాళదుంపలు చూర్ణం వాడే సమయంలో ఉపయోగించవద్దని సూచి స్తున్నారు. గ్యాస్ ట్రబుల్, పక్షవాతం, బీ పీ, అల్సర్, మోకాళ్ల నొప్పులు, సొరి యాసిస్, ఆస్తమా, అలర్జీ, అజీర్ణం, ఉ బ్బసం, తిమ్మిర్లు, అర్శమొలలు, కిడ్నీలో రాళ్లు, దగ్గు తదితర దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేద చూర్ణం పనిచేస్తుందని చెబుతున్నారు. అయితే ఆయుర్వేదంపై గ్రామాల్లో అవగాహన కలిగినవారు కొనుగోలు చేస్తున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని ఆయుర్వేద మందులతో రోగాలు పూర్తిగా నయమవుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆయుర్వేదంపై ప్రచారం చేసి మందులను అందుబాటులో ఉంచాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.