Internal clash
-
పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన మహిళలు
-
నంద్యాల జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు
-
పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్‌లో మరోసారి వర్గవిభేదాలు
-
సంక్షోభంలో రష్యా
మాస్కో: ఉక్రెయిన్‌పై ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్న రష్యా అనూహ్య పరిణామాలతో అంతర్గత సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఇన్నాళ్లూ ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున పోరాడిన ప్రైవేటు సైనిక సంస్థ వాగ్నర్ శుక్రవారం రాత్రికి రాత్రే ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. రష్యా మిలటరీ నాయకత్వాన్ని కూలి్చవేస్తామని వాగ్నర్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ గర్జించారు. తమ సంస్థకు చెందిన బలగాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం దాడులకు దిగుతోందని అందుకే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. రష్యాలోని ప్రధాన నగరమైన రోస్తోవ్ దాన్ తమ అధీనంలోనే ఉందని ఆయన ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగును లక్ష్యంగా చేసుకుంటూ పలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తమ సంస్థపై సెర్గీ దాడులు చేయిస్తున్నారని ఆయనను విడిచిపెట్టబోమంటూ ఆగ్రహావేశాలతో వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత అంతరంగికుడైన ప్రిగోజిన్ ఈ తిరుగుబాటుకు పాల్పడడాన్ని ప్రభుత్వంలో ఎవరూ జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలతో రష్యాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రిగోజిన్‌ను నిలువరించడానికి తన సొంత దేశంలోనే రష్యన్ మిలటరీ దాడులకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కల్లోల పరిస్థితుల మధ్య ఏది వాస్తవమో , ఏది కాదో అన్న గందరగోళం కూడా ఏర్పడింది. ఒకానొక దశలో రష్యా అద్యక్షుడు పుతిన్ మాస్కో విడిచి పరారయ్యారన్న వార్తలు హల్చల్ చేశాయి. అయితే అందులో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రిగోజిన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడు పుతిన్ పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ తిరుగుబాటుపై జాతినుద్దేశించిన ప్రసంగించిన పుతిన్ ప్రిగోజిన్ పేరు ప్రస్తావించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని, వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తిరుగుబాటు చేసిన వారందరినీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో బలగాలను, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని, ఎలా ముందుకు వెళ్లాలో ఆదేశాలిచ్చామని చెప్పారు. రష్యా ఎఫ్ఎస్బీ సెక్యూరిటీ సరీ్వస్ ప్రిగోజిన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. పుతిన్ తప్పు చేశారు : ప్రిగోజిన్ పుతిన్ ప్రసంగం అనంతరం ప్రిగోజిన్ మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తమను దేశద్రోహులమని పేర్కొని పుతిన్ అతి పెద్ద తప్పు చేశారన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పోరాటం చేసిన తామే అసలు సిసలు దేశభక్తులమని అన్నారు. తాము ప్రభుత్వానికి లొంగి పోయే స్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 25వేల మంది సైన్యంతో తిరుగుబాటు ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఉన్న వాగ్నర్ సైనికుల్ని వెనక్కి రప్పించిన ప్రిగోజిన్ రోస్తోవ్ దాన్ నగరంలోసైనిక ప్రధాన కార్యాలయం, ఇతర సైనిక స్థావరాలను తమ అ«దీనంలోకి తెచ్చుకున్నట్టు చెబుతున్నారు. నగరంలో మిలటరీ వాహనాలు, ట్యాంకుల్ని మోహరించిన వీడియోలు కూడా విడుదల చేశారు. ఒక్క తుపాకీ తూటా పేలకుండానే తాము మిలటరీ కార్యాలయాన్ని స్వా«దీనం చేసుకున్నామని ప్రిగోజిన్ చెప్పారు. రక్షణ మంత్రి సెర్గీ షొయిగు, మిలటరీ జనరల్ గెరాసిమోవ్ రోస్తోవ్లోని మిలటరీ కార్యాలయంలో తనతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే రాజధాని మాస్కోని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వాగ్నర్ సంస్థకు చెందిన దాదాపుగా 25 వేల మంది సైనికులు మాస్కోదిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది. మాస్కోకి దక్షిణంఆ 360 కి.మీ. దూరంలోని లిపె్టక్ ప్రావిన్స్‌లో వాగ్నర్ బలగాలు, ఇతర ఆయుధాల్ని మోహరించినట్టుగా ప్రిగోజిన్ విడుదల చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని లిపె్టక్ ప్రావిన్స్ గవర్నర్ ఇగోర్ అర్టమోనోవ్ కూడా ధ్రువీకరించారు. వాగ్నర్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ సేనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజల భద్రతకు ఎలాంటి ప్రమాదమూ లేదని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున జనం గుమిగూడే కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు మాస్కో ప్రాంత గవర్నర్ తెలిపారు. విద్యా సంస్థలను జులై ఒకటి దాకా మూసివేసినట్లు తెలుస్తోంది. తాత్కాలిక విరమణ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకశెంకో మధ్యవర్తిత్వంతో శనివారం రాత్రికల్లా ఇరువర్గాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరింది. మాస్కో దిశగా వెళుతున్న వాగ్నర్ గ్రూపు సైనికులను ఆగిపోవాల్సిందిగా యెవ్గెనీ ప్రిగోజిన్ ఆదేశాలు ఇచ్చారు. రష్యన్ల రక్తం చిందకూడదనే ఉద్దేశంతోనే మాస్కో దిశగా ముందంజ వేయడాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లోని తమ స్థావరాలకు మళ్లాల్సిందిగా తమ బలగాలకు ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. వాగ్నర్ గ్రూపు సైనికుల రక్షణకు పుతిన్ నుంచి హామీ లభించిందని మధ్యవర్తిత్వం వహించిన లుకశెంకో ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి బలహీనంగా రష్యా : జెలెన్స్కీ రష్యాలో అంతర్గత సంక్షోభంతో ఆ దేశం పూర్తి స్థాయిలో బలహీనపడిపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. చెడు మార్గాన్ని అనుసరించే వారందరూ తమను తామే నాశనం చేసుకుంటారన్నారు. ‘‘చాలా కాలంగా రష్యా తన బలహీనతల్ని కప్పిపుచ్చుకుంటూ వస్తోంది. ప్రభుత్వంలో ఉన్న వారి మూర్ఖత్వాన్ని దాచిపెడుతూ వస్తోంది. ఇక ఏదీ దాచి ఉంచలేరు. అబద్ధాలు చెప్పలేరు. రష్యా తమ సైన్యాన్ని దళాలు, కిరాయి సైన్యం ఉక్రెయిన్‌లో ఎంత కాలం ఉంచుతుందో అంత ఎక్కువ బాధను ఆ దేశం కూడా ఎదుర్కొంటుంది’’ అని జెలెన్స్కీ ట్వీట్ చేశారు. -
టీడీపీ అంతర్గత సమావేశం.. అంతా గందరగోళం
నెల్లూరు(టౌన్): జిల్లాలో నిర్వహించిన టీడీపీ అంతర్గత సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ ఘటన ఉదయమే చోటు చేసుకోవడంతో ఏ పరిస్థితికి దారి తీస్తుందోనని నేతలు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం నెల్లూరులోని ఎస్వీజీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జోన్–4కు సంబంధించి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల టీడీపీ క్లస్టర్, యూనిట్, మండల పార్టీ నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. దీనికి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు వచ్చారు. అయితే ఆయన అనుచరులకు అనుమతి లేదని రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఉండే వారు నిలిపివేశారు. దీంతో కోపోద్రిక్తుడైన కొమ్మి ఆత్మకూరు టీడీపీకి చెందిన కన్నబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అనుచరులకు అనుమతి లేకుండా వేరే వాళ్లను ఎలా పంపిస్తారని వాగ్వాదానికి దిగారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బులు పంచాలని కన్నబాబుకు ఇస్తే.. ఎక్కడా పంచకుండా దాచుకున్నాడని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉండి వ్యాపారాలు చేసుకుంటూ నెలకో, రెండు నెలలకో ఆత్మకూరుకు వచ్చే కన్నబాబుకు ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తారని దుర్భాషలాడారు. దీంతో కన్నబాబు అనుచరులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నాయకులు ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపించారు. దీంతో అసంతృప్తికి లోనైన కొమ్మి సమావేశానికి చంద్రబాబు వచ్చిన తర్వాత కనిపించలేదు. ఇంకా భోజనాల దగ్గర మీడియా ప్రతినిధులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. ఇంకా నెల్లూరు నగరం నుంచి రానున్న ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్న మాజీ మంత్రి నారాయణ ముఖ్యమైన సమావేశానికి హాజరుకాకపోవడాన్ని ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో క్లస్టర్, యూనిట్ ఇన్చార్జి నుంచి ప్రతిస్పందన కరువైంది. -
దూసుకెళ్లిన బీజేపీ.. ప్రచారానికి రాని సోనియా!
ఒకనాటి కాంగ్రెస్ కంచుకోట హరియాణా, మహారాష్ట్రలలో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు ప్రధాని మోదీ శ్రమిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ప్రచారపర్వంలో చాలా వెనుకబడింది. ఓ పక్క దేశ పాలనా బాధ్యతల్లో తలమునకలైన మోదీ మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం అలుపెరగకుండా శ్రమించారు. రెండు రాష్ట్రాల్లో గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నా బీజేపీ చీఫ్ అమిత్‌షా, మోదీ ఇద్దరూ తమ అభ్యర్థుల గెలుపుకోసం ఏ చిన్న అవకాశాన్నీ విడిచిపెట్టలేదు. రెండు రాష్ట్రాల్లో కలిపి మోదీ మొత్తం 25 భారీ బహిరంగ సభల్లో పాల్గొనడమే అందుకు నిదర్శనం. ఈ రెండు రాష్ట్రాల ప్రచారంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పొచ్చు. గాంధీ కుటుంబం ఎదుర్కొంటోన్న అంతర్గత సంక్షోభానికి, పార్టీని పీడిస్తోన్న ఓటమి భయానికీ కాంగ్రెస్ ప్రచారసరళి అద్దం పడుతోందంటున్నారు నిపుణులు. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ప్రచార అంకం ముగిసింది. ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన బీజేపీ రెండు రాష్ట్రాల్లో అధికారపీఠం ఎక్కాలని చూస్తోంది. కాంగ్రెస్ మాత్రం హరియాణా, మహారాష్ట్ర ప్రచారంలో వెనకబడింది. సోనియా అసలు ప్రచారంలోనే పాల్గొనకపోతే, రాహుల్ నామమాత్రంగా పాల్గొన్నారు. సోనియా భయపడ్డారా? సోనియా గాంధీ ఈనెల 18న హరియాణాలో ఒక సభలో పాల్గొనాల్సి ఉండగా అనివార్యకారణాలతో సభకు రాలేదు. సోనియాకు వైరల్ జ్వరం వచ్చినందుకే రాలేదని రాహుల్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే జ్వరం సంగతి పక్కన పెడితే బహిరంగసభకు సోనియా దూరంగా ఉండడానికి ఏఐసీసీ అనేక కారణాలను పేర్కొంది. అవినీతి ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఉందని కొందరి వాదన. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయంతోపాటు ప్రజామోదం పెద్దగా లేకపోవడం, ఓటమి భయం, పార్టీలో అంతర్గత కలహాలు.. ఆ పార్టీ ప్రచారానికి బ్రేకులు వేసినట్టు పార్టీ వర్గాలు తమ అభిప్రాయం వ్యక్తం చేశాయి. స్థానిక నేతలు ఎక్కడ? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కెప్టెన్ అమరీందర్ సింగ్, అశోక్ గెహ్లోత్, కమల్‌నాథ్ లాంటి హేమాహేమీలు సైతం ఈ రాష్ట్రాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క బహిరంగ సభను నిర్వహించలేదని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన ప్రియాంకా గాంధీ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం రెండు రాష్ట్రాల ఎన్నికల్లో నామమాత్రంగా పాల్గొనడానికి స్థానిక నేతలే కారణమని భావిస్తున్నారు. ఢిల్లీ నేతలకంటే స్థానిక నేతలకే ఎన్నికల ప్రచారంలో అధిక ప్రాధాన్యతనివ్వాలని స్థానికనేతలు.. పార్టీ అధిష్టానానికి సూచించిన నేపథ్యంలోనే పెద్దలు ప్రచారంలో వెనకడుగువేసినట్టు తెలుస్తోంది. రాహుల్ రాష్ట్రంలో పర్యటించిన నేపథ్యంలో గాంధీ కుటుంబం ప్రచారంలో వెనుకబడిందన్న ప్రశ్నేలేదని పార్టీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. కాగా, పోలింగ్ రేపు జరగనుంది. మోదీ 25 రాహుల్ 7 ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ 25 ర్యాలీల్లో పాల్గొని ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని తిరిగి చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా మాత్రం ఒక్కటంటే ఒక్క బహిరంగ సభలో కూడా పాల్గొనకపోవడం ఎన్నికల్లో ఆ పార్టీ ఉదాసీనతకు అద్దంపడుతోంది. బీజేపీకే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ బీజేపీ జాతీయ నాయకులు, ప్రధాని మోదీ రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ హరియాణాలో రెండు, మహారాష్ట్రలో ఐదు మొత్తంగా ఏడు బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొన్నారు. -
టికాంగ్రెస్‌లో మొదలైన నేతల కుమ్ములాట
-
టీడీపీలో గ్రూపుల గోల
♦ టీడీపీలో విస్తరిస్తున్న అంతర్గత విభేదాలు ♦ అన్ని నియోజకవర్గాల్లోనూ అంతర్యుద్ధాలే... ♦ ఎవరికి వారే యమునాతీరేలా సాగుతున్న కార్యక్రమాలు ♦ మంత్రుల మధ్య కనిపించని సయోధ్య ♦ ఎమ్మెల్యేలపై స్థానిక ప్రజాప్రతినిధుల అసంతృప్తి ♦ నియోజకవర్గాల్లో ఎటూ తేలని పంచాయతీలు ♦ రాష్ట్ర అధిష్టానం వద్దే తేల్చుకోవాలనుకుంటున్న నేతలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: క్రమశిక్షణకు మారుపేరంటూ ప్రచారం చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు పెచ్చుమీరుతోంది. ఎక్కడికక్కడే నాయకుల మధ్య వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ విభేదాలు బట్టబయలవుతున్నాయి. సర్పంచ్ల నుంచి మంత్రుల వరకూ ఒకరంటే ఒకరికి పడటం లేదు. చివరికి జిల్లాలో ఈ వివాదాలు పరిష్కారం కాక ఇక రాష్ట్ర అధిష్టానం వద్దే తేల్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారాలు పాపం పార్టీనే నమ్ముకున్న కేడర్‌లో సందిగ్ధం నెలకొంటోంది. జామిలో జెంటిల్మన్ ఒప్పందం ఉల్లంఘన ఎస్.కోట నియోజకవర్గం జామి ఎంపీపీ పదవిని రెండున్నరేళ్లు చొప్పున పరసాన అప్పయమ్మ, ఇప్పాక చంద్రకళ పంచుకోవడానికి టీడీపీ పెద్దలు అప్పట్లో జెంటిల్మన్ ఒప్పందం కుదిర్చారు. ఇప్పుడు ఆ పదవిని వదిలిపెట్టడానికి అప్పయమ్మ ఇష్టపడటం లేదు. ఇక చేసేది లేక చంద్రకళ మంత్రి సుజయ కృష్ణరంగారావును కలి సి న్యాయం చేయాలని కోరేందుకు యత్నిస్తున్నా ఆయన ముఖం చాటేశారు. ఒప్పందం ప్రకారం అప్పయమ్మ చేత రాజీనామా చేయించకపోతే ధర్నాకైనా వెనుకాడబోమని వారు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ మంత్రి కూడా ఈ సమస్యను పరిష్కరించలేరన్న వాదన వినిపిస్తోంది. తెలుగు యువత అధ్యక్ష పదవిపై వివాదం జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవి మాజీ మంత్రి మృణాళిని తన కుమారుడు నాగార్జునకు ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి ప్రస్తుత అధ్యక్షుడు కర్రోతు నర్శింగరావు అడ్డుపడుతున్నారు. తనకు వేరే పదవి చూపించకుండా తన పదవిని ఎలా తీసుకుంటారంటూ మొండికేస్తున్నారు. మృణాళినికి మద్దతుగా ఎమ్మెల్యేలు కె.ఎ. నాయుడు, కోళ్ల లలితకుమారి, కర్రోతుకు మద్దతుగా ఎమ్మెల్యేలు నారాయణస్వామి నాయుడు, చిరంజీవి నిలవడంతో ఎమ్మెల్యేల మధ్య చీలికలు ఏర్పడ్డాయి. ఇంకా కొలిక్కి రాని ఈ వివాదం చివరికి ఏ పరిణామాలకు దారితీస్తుందో తెలియడం లేదు. మీసాలపై కెంగువ గరం గరం... విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీతకు స్థానిక ఎంపీపీతో పొసగడం లేదు. ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశం సాక్షిగా వీరి మధ్య విభేదాలు వీధిన పడ్డాయి. మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉన్న తనకు తన మండలంలో జరిగే కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వకపోవడమేమిటని ఎంపీపీ కెంగువ ధనలక్ష్మి బహిరంగంగానే ఎమ్మెల్యే గీతను నిలదీశారు. దీనిపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు నివాసంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో శనివారం పంచాయితీ పెట్టారు. తమకెందుకు సమాచారం ఉండటం లేదని ఎమ్మెల్యే గీతను వైస్ ఏంపీపీ వి.శ్రీనివాసరావు, ఎంపీపీ ధనలక్ష్మి కుమారుడు శ్రీనివాసరావు ప్రశ్నించడంతో మీకు చెప్పాల్సిన అవసరం లేదని ఆమె సమాధానమిచ్చారు. అంతటితో ఆగకుండా సమావేశం నుంచి అర్ధంతరంగా ఆమె వెళ్లిపోయారు. దీంతో పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కలిసి తమకు తెలియజెప్పకుండా ఎమ్మెల్యే ఎలాంటి కార్యక్రమాన్ని చేయకూడదనే తీర్మానాన్ని రాష్ట్ర పార్టీ అధిష్టానానికి పంపించాలని నిర్ణయించారు. మృణాళినిపై తిరుగుబాటు బావుటా... ఎమ్మెల్యే కిమిడి మృణాళికి, జడ్పీటీసీ మీసాల మరహాలనాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు రౌతు కామునాయుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తమను కనీసం పట్టించుకోవడం లేదంటూ వారు ఎప్పటి నుంచో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 500 ఇళ్లు మంజూరైతే మృణాళిని అన్ని ఊళ్లకు పంచడం వారికి నచ్చలేదు. కనీసం తమ సూచనలు కూడా తీసుకోకపోవడమేమిటంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి సుజయ తమ్ముడు బేబీ నాయన నియోజకవర్గానికి రావడంతో ఆయన ఎదుట తమ గోడు వినిపించారు. మంత్రిని కలిసే ఏర్పాటు చేస్తే అన్ని విషయాలు వివరిస్తామని చెప్పారు. దీంతో ఆయన అక్కడి నుంచే మంత్రితో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ విషయం తెలిసి మాట్లాడదాం రమ్మని ఎమ్మెల్యే పిలిచినా వారు వెళ్లలేదు. బొబ్బిలిలో ఇంటిపోరు బొబ్బిలి పట్టణ అధ్యక్ష పదవిని బొబ్బాది తవిటి నాయుడుకు ఇవ్వాలని మంత్రి సుజయ్ భావించారు. కానీ దానికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చోడిగంజి రమేష్‌నాయుడు, ఆ పదవి ఆశిస్తున్న రాంభట్ల శరత్ అడ్డుతగులుతున్నారు. దీంతో ఎటూ తేల్చ లేక ఈ అంశాన్ని పక్కనపెట్టేశారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడుకు పూసపాటిరేగ జెడ్పీటీసీ సభ్యుడు ఆకిరి ప్రసాద్‌కు మధ్య ఇసుక అక్రమ రవాణా, పరిశ్రమలకు నీటి సరఫరా విషయాల్లో వివాదాలు ఏర్పడ్డాయి. వీటిపై రోడ్డెక్కి మరీ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా ఆకిరి ప్రసాద్‌కు జిల్లా పార్టీ కొత్త అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు మద్దతుగా నిలవడంతో వివాదం తీవ్రత పెరిగింది. గంటాతో కొత్త తంటా... జిల్లా ఇన్చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి విషయంలో తలదూర్చడమే కాకుండా తన పంతం నెగ్గించుకున్నారు. గత అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ను కొనసాగించాలన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు యత్నాలను కొల్లగొట్టారు. ఈ పరిణామంతో జిల్లాలో టీడీపీ నేతల ప్రాభవంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పక్క జిల్లా మంత్రి పెత్తనం చెలాయించే పరిస్థితి రావడానికి ఇక్కడి నాయకుల సమర్ధతపై అధిష్టానానికి నమ్మకం సడలడమే కారణమని కేడర్ భావిస్తోంది. మంత్రి గంటా, కేంద్ర మంత్రి అశోక్ మధ్య జిల్లా కమిటీల నియామకాల విషయంలో తలెత్తిన వివాదం వారి మధ్య అఖాతాన్ని పెంచుతోంది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ వీరిద్దరూ కలిసి పాల్గొనడం లేదు. అశోక్ పాల్గొనని కార్యక్రమాల్లో గంటా ఉంటున్నారు. గంటా లేనప్పుడు మాత్రమే అశోక్ హాజరవుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా టీడీపీ కార్యవర్గ సమావేశానికి గంటా శ్రీనివాసరావు రాలేదు. గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో అశోక్ లేరు. ఒకపైపు అవినీతి, అక్రమాల ఆరోపణలతో మసకబారుతున్న టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య తాజా వివాదాలు పార్టీని ఛిన్నాభిన్నం చేసే దిశగా పయనింపజేస్తున్నాయి.