ITC company
-
రూ. 1500 కోట్ల పెట్టుబడి.. ఐటీసీ ఆలోచన ఏంటంటే?
సెహోర్‌లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ & స్థిరమైన ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మధ్యప్రదేశ్‌లో రూ. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు 'ఐటిసి' తాజాగా వెల్లడించింది. ఈ రెండు ప్రాజెక్టులు దాదాపు 57 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండటం వల్ల.. రాష్ట్రంలో వ్యవసాయ, తయారీ రంగాలకు మరింత అనుకూలంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'శివరాజ్ సింగ్ చౌహాన్' ఈ ప్రాజెక్టులను ప్రకటిస్తూ.. బడియాఖేడిలోని రెండు కర్మాగారాలకు భూమి పూజ జరిగింది. ఇక్కడ దాదాపు 1,500 కోట్ల రూపాయల పెట్టుబడి జరగబోతోంది, దీని వల్ల దాదాపు 5000 మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. మనం పండించే ప్రతిదానికి ఇక్కడే సరైన ధర లభించేలా.. మన పిల్లలకు ఇక్కడే ఉపాధి కల్పించేలా చేయడమే లక్ష్యమని కూడా శివరాజ్ తెలిపారు. వ్యవసాయానికి పరిమితులున్నాయి, కావున శాశ్వత ఉద్యోగావకాశాలు లభించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. దీని కోసం పెట్టుబడులను తీసుకురావడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు. ఇదీ చదవండి: చిరిగిన కరెన్సీ నోట్లను ఫ్రీగా మార్చుకోవడం ఎలా? ఆర్బీఐ రూల్స్ ఇలా.. ఐటీసీ కంపెనికి చెందిన ఫుడ్ ప్లాంట్ ఆటా బ్రాండ్ ఆశీర్వాద్.. సన్‌ఫీస్ట్ బిస్కెట్లు, ఇప్పీ నూడిల్స్ కోసం ఉత్పత్తులు తయారు చేస్తోంది. అంతే కాకుండా స్థిరమైన ప్యాకేజింగ్‌లో అగ్రగామిగా ఉంటుందని, ఎలక్ట్రానిక్ వస్తువులకు ప్యాకేజింగ్, ఫుడ్ అండ్ డ్రింకింగ్ రంగం వంటి రంగాలలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. కాగా ITC ఇప్పటికే రాష్ట్రంలో ఫుడ్స్ అండ్ అగర్బత్తీల కోసం సహ తయారీ యూనిట్లతో గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. आज बड़ियाखेड़ी में दो फैक्ट्रियों का भूमिपूजन हुआ है। लगभग ₹1500 करोड़ का निवेश यहाँ होने वाला है, जिससे हमारे 5 हजार बच्चों को रोजगार मिल सकेगा। pic.twitter.com/zOKMTvrTTI — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 3, 2023 -
అదరగొట్టిన ఐటీసీ.. రూ. 5,070 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 5,070 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,119 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు 4 శాతం వృద్ధితో రూ. 19,021 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 18,366 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు 3 శాతంపైగా తగ్గి రూ. 12,772 కోట్లకు పరిమితమయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండు ప్రకటించింది. విభాగాలవారీగా.. క్యూ3లో సిగరెట్లుసహా మొత్తం ఎఫ్ఎంసీజీ విభాగం టర్నోవర్ 17 శాతం వృద్ధితో రూ. 12,935 కోట్లకు చేరింది. దీనిలో సిగరెట్ల ఆదాయం 16 శాతం ఎగసి రూ. 8,086 కోట్లను తాకింది. ఇతర ఎఫ్ఎంసీజీ నుంచి 18 శాతం అధికంగా రూ. 4,849 కోట్లు సమకూరింది. హోటళ్ల ఆదాయం 49 శాతం జంప్‌చేసి రూ. 739 కోట్లను దాటగా, గోధుమలు, బియ్యం ఎగుమతులపై ఆంక్షల కారణంగా అగ్రిబిజినెస్ 36 శాతం క్షీణించి రూ. 3,305 కోట్లకు పరిమితమైంది. పేపర్ బోర్డ్స్, ప్యాకేజింగ్ టర్నోవర్ 13 శాతం పుంజుకుని రూ. 2,306 కోట్లుకాగా.. ఇతర విభాగాల నుంచి రూ. 857 కోట్లు సమకూరింది. ఇది 18 శాతం అధికం.ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం బలపడి రూ. 381 వద్ద ముగిసింది. చదవండి: ఎలన్ మస్క్‌కు భారీ ఊరట.. ఆ దూకుడుకు కళ్లెం వేయడం కష్టమే! -
ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా రాష్ట్రం
తూప్రాన్, మనోహరాబాద్(తూప్రాన్): దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆవిర్భవిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లిలో రూ.450 కోట్ల పెట్టుబడితో 59 ఎకరాల్లో ఐటీసీ సంస్థ నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీని పరిశ్రమ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్‌పూరితో కలసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం పరిశ్రమలో తయారు చేసిన ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కంపెనీ భవిష్యత్‌లో మరో రూ.350 కోట్లు వెచ్చించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుందన్నారు. పరిశ్రమ యాజమాన్యం స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు కంపెనీలో తయారు చేసే చిప్స్, బిస్కెట్ల కోసం ఆలుగడ్డలు, గోధుమలను ఇక్కడే కొనుగోలు చేయాలన్నారు. ఇందుకోసం స్థానిక రైతులను ప్రోత్సహించాలని కోరారు. అప్పుడే రైతులు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. కాళేశ్వరం ద్వారా 10 టీఎంసీల నీరు.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తక్కువ సమయంలో పూర్తి చేసి నీటి వనరుల్లో విప్లవం సాధించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనితో సాగునీరు, తాగునీటికి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా పరిశ్రమలకు 10 టీఎంసీల నీటిని అందిస్తున్నామని తెలిపారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్న ఘనత తెలంగాణకే దక్కుతుందని, మిషన్ కాకతీయ ద్వా రా 46 వేల చెరువులను బాగు చేశామని వివరించారు. పాడిపంటలతోనే రాష్ట్రం సుభిక్షం అవుతుందని, అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్: పాడి అభివృద్ధికి కృషి చేయడంతో పాటు విజయ డెయిరీ ద్వారా పాల ఉత్పత్తులను కూడా పెంపొందిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ కోసం ప్రత్యేకంగా సెజ్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా ఇతర దేశాల నుంచి వంట నూనెల దిగుమతిని తగ్గించడానికి చర్యలు చేపట్టామని వివరించారు. ఇక్కడ ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు స్థానికులు, నాయకులు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలతాశేఖర్ గౌడ్, సర్పంచ్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మసాలా.. అదిరింది
సాక్షి, అమరావతి: ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ఐటీసీ రాష్ట్రంలో భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే రూ.140 కోట్లతో వెల్కమ్ పేరుతో గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్‌ను ఏర్పాటు చేసిన ఈ కంపెనీ.. తాజాగా రూ.200 కోట్లతో అభివృద్ధి చేసిన గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను అందుబాటులోకి తేనుంది. పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలో సుమారు 6.2 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే విధంగా గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను అభివృద్ధి చేసింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు తదితర సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేయనుంది. సుమారు 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. గతంలో ఐటీసీ గ్రూపు రాష్ట్రంలో పొగాకు వ్యాపారానికే పరిమితం కాగా, 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో గుంటూరు కేంద్రంగా సుగంధ ద్రవ్యాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఇందుకోసం ఐటీ స్పైసెస్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసి, వేగంగా విస్తరించింది. సుమారు 170 గ్రామాల్లో 10,000 మందికి పైగా రైతులతో 35,000 హెక్టార్లల్లో వివిధ సుగంధ ద్రవ్యాలను సాగు చేయిస్తోంది. ఆ పంటలను ఈ కంపెనీ నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఐటీసీ గ్రూపు దేశంలో ఆశీర్వాద్ బ్రాండ్ పేరుతో వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో రేపు సీఎం పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ఉదయం 9.40 – 10.35 గంటల మధ్య ప్రారంభిస్తారు. అనంతరం 11 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. ఈ కళాశాల ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం 1.30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
మార్కెట్లోకి ఐటీసీ కొత్త చాక్లెట్.. ప్రత్యేక టెక్నాలజీతో తయారీ!
ముంబై: పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌లో భాగమైన దేశీ లగ్జరీ చాక్లెట్ బ్రాండ్ ఫాబెల్ కొత్తగా ఫైనెస్ పేరిట మరో కొత్త చాక్లెట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రచారం కోసం ప్రముఖ ఆస్ట్రేలియన్ షెఫ్ ఎడ్రియానో జుంబోతో ఫాబెల్ చేతులు కలిపింది. ది కోకో ఫైనెసర్ అనే ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించిన ఈ చాక్లెట్ కన్నా మృదువైనది తయారు చేసిన వారికి రూ.1 కోటి బహుమతిగా అందిస్తామని ఈ సందర్భంగా ఐటీసీ తరఫున ఫాబెల్ సవాలు కూడా విసిరారు. చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
దిగ్గజ కంపెనీలను ఆకర్షించేలా..
సాక్షి, అమరావతి: పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు దిగ్గజ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో నమోదైన పలు భారీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఆయా కంపెనీల అధినేతలు పలువురు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో ప్రముఖ కంపెనీల రాక.. స్టాక్ మార్కెట్లో నమోదైన 15కిపైగా కంపెనీలు గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. రూ.లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన సన్‌ఫార్మా, ఐటీసీ, అదానీ, ఓఎన్జీసీ, ఆదిత్య బిర్లా గ్రూపు, అరబిందో, కాంకర్, బీఈఎల్, జిందాల్ స్టీల్, ఎస్సార్ స్టీల్, డిక్సన్, బ్లూస్టార్, సెంచరీ ఫ్లైవుడ్, శ్రీ సిమెంట్ లాంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టు బడులు పెడుతున్నాయి. సన్‌ఫార్మా అధినేత దిలీప్ షాంఘ్వీ ముఖ్యమంత్రితో సమావేశమై రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఐటీసీ సంస్థ గుంటూరులో తొలి ఫైవ్‌స్టార్ హోటల్‌ను నెలకొల్పడమే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో కూడా ఐటీసీ పాలు పంచుకుంటోంది. సుమారు రూ.7.50 లక్షల కోట్ల విలువైన అదానీ గ్రూపు కూడా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు విశాఖలో రూ.14,634 కోట్లతో 200 ఎంవీ డేటా సెంటర్, బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడి ద్వారా రూ.24,990 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, బీఈఎల్ లాంటి కేంద్ర సంస్థలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఏపీలో రూ.96,400 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 79,700 మందికి ఉపాధి లభించనుంది. ఒక్క ఓఎన్జీసీనే తూర్పు గోదావరి జిల్లాలో రూ.78,000 కోట్లు వెచ్చిస్తుండటం గమనార్హం. ఓఎన్జీసీ చైర్మన్ సుభాష్ కుమార్ గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించిన సంగతి తెలిసిందే. కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌పై ప్రధానంగా చర్చించారు. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో బీఈఎల్ యూనిట్ల పనులు జరుగుతుండగా విశాఖలో హెచ్‌పీసీఎల్ రూ.17,000 కోట్ల పెట్టుబడులను పెడుతోంది. పీఎల్ఐపై ప్రత్యేక దృష్టి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పథకం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ రంగంలో బ్లూస్టార్, డిక్సన్ లాంటి లిస్టెడ్ కంపెనీలను ఆకర్షించగా ఫార్మా, ఆటోమొబైల్, టెక్స్టైల్ రంగాల్లో కూడా భారీ పెట్టుబడులను రప్పించేలా చర్చలు జరుపుతోంది. దేశాన్ని తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేలా 13 రంగాల్లో రూ.1.97 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ఇచ్చేలా పీఎల్ఐ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం విధానం రాష్ట్ర సమగ్రాభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానమని స్పష్టమైంది. పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. సాంకేతికతను వినియోగించుకుని అత్యంత నిపుణులైన మానవ వనరులను సిద్ధం చేయడం ద్వారా ప్రజల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ముందడుగు వేస్తున్నారు. ఔషధ రంగంలో మా ఆలోచనలను ఆయనతో పంచుకున్నాం. ఏపీలో ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్ ఏర్పాటు ద్వారా ఔషధాల ఎగుమతి మా లక్ష్యం. – సన్‌ఫార్మా అధినేత దిలీప్ షాంఘ్వి. ఏపీలో మరో రూ.400 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌తో మాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహం బాగుంది. త్వరలో మరో రూ.400 కోట్ల మేర ఏపీలో పెట్టుబడి పెట్టనున్నాం. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కార్యక్రమాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగస్వాములు కావడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వెచ్చిస్తాం. – గుంటూరులో ఐటీసీ ఫైవ్‌స్టార్ హోటల్ ప్రారంభోత్సవంలో సంస్థ చైర్మన్, ఎండీ సంజీవ్ పూరి -
CM YS Jagan: గ్రామాల్లో అభివృద్ధి పరవళ్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సమూల మార్పులు గమనించవచ్చని, అభివృద్ధి కళ్లెదుట కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. బుధవారం ఆయన గుంటూరు విద్యానగర్‌లో నూతనంగా నిర్మించిన ఐటీసీ వెల్కమ్ హోటల్‌ను ప్రారంభించారు. హోటల్ ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన రిబ్బన్‌ను కత్తిరించి, జ్యోతి వెలిగించారు. అనంతరం హోటల్లోని కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సభలో మాట్లాడుతూ.. గుంటూరు వంటి నగరంలో ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభించటం మంచి పరిణామం అని, చాలా సంతోషంగా ఉందన్నారు. ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజివ్ పూరికి ధన్యవాదాలు తెలిపారు. ఐటీసీతో భాగస్వామ్యం ఒక మంచి అవకాశం అని చెప్పారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఐటీసీతో కలిసి ముందుకు వెళుతోందన్నారు. ఐటీసీ వెల్కమ్ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఉన్నాయని, దాదాపు 10,700 ఆర్బీకేలు విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులే ఆర్బీకేల ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ రంగంలో ప్రాథమిక స్థాయిలో.. ప్రత్యేకించి గ్రామ స్థాయిలో ప్రాసెసింగ్, మౌలిక సౌకర్యాలు కల్పించామని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సెకండరీ స్థాయిలో ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో ఐటీసీ ముందుకు వచ్చి భాగస్వామ్యం కావడం ద్వారా కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. కొత్తగా ప్రారంభించిన ఐటీసీ వెల్కమ్ హోటల్ ఐటీసీతో దృఢమైన భాగస్వామ్యం గుంటూరు పట్టణంలో ఫైవ్ స్టార్ హోటల్ రావడం చాలా మంచి పరిణామమని, దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తొలి లీడ్ ప్లాటినం సర్టిఫైడ్ ఫైవ్ స్టార్ హోటల్ కావడం సంతోషించదగిన విషయం అన్నారు. ఐటీసీతో మరింత దృఢంగా, పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నామని చెప్పారు. ప్రధానంగా పర్యాటక, వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఐటీసీతో భాగస్వామ్యం దీర్ఘకాలం కొనసాగుతుందని బలంగా నమ్ముతున్నామని వివరించారు. అంతకు ముందు సీఎం.. మంత్రులు మేకతోటి సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ, జిల్లా కలెక్టరు వివేక్ యాదవ్, ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరితో కలసి హోటల్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప సభాపతి కోన రఘుపతి, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
బాయ్‌కాట్ బింగో.. ఐటీసీ వివరణ
రణ్వీర్ సింగ్ తాజాగా నటించిన బింగో మ్యాడ్‌యాంగిల్స్ యాడ్‌పై నెటిజనులు తీవ్రంగా విరుకుచపడిన సంగతి తెలిసిందే. ఈ యాడ్‌లో రణవీర్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ని కించపరిచారని నెటిజనలు ఆరోపించారు. దాంతో బాయ్‌కాంట్ బింగో అంటూ రణ్‌వీర్‌ని ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో ఐటీసీ ఈ వివాదంపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. "బింగో మ్యాడ్ యాంగిల్స్ తాజా ప్రకటన దివంగత బాలీవుడ్ ప్రముఖుడిని ఎగతాళి చేసేలా రూపొందించారని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.ఇలాంటి తప్పుడు సందేశాలు, పోస్టులకు బలైపోవద్దని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఇటీవలి ప్రసారం అవుతోన్న బింగో మ్యాడ్‌యాంగిల్స్ యాడ్‌ని ఒక సంవత్సరం క్రితం అక్టోబర్ 2019 లో షూట్ చేశాం. బింగో ప్రయోగం ఆలస్యం కావడంతో ఈ ప్రకటన ఈ ఏడాది ప్రసారం అవుతోంది. కోవిడ్ కారణంగా ‘మ్యాడ్ యాంగిల్స్ చీజ్ నాచోస్ అండ్ బింగో!’ ‘మ్యాడ్ యాంగిల్స్ పిజ్జా’ లాంచ్ చేయడంలో ఆలస్యం జరిగింది" అంటూ ఐటీసీ ఫుడ్స్ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. (బాయ్‌కాట్ బింగో: రణ్‌వీర్‌పై ట్రోలింగ్) ఇక బింగో మ్యాడ్ యాంగ్సిల్ ప్రకటనలో రణ్వీర్ తన తదుపరి ప్లాన్ గురించి బంధువులకు వివరిస్తూ.. పారడాక్సికల్ ఫొటాన్స్, అల్గారిథమ్స్, ఏలియన్స్.. అంటూ చెప్తూ ఇదే తన నెక్స్ట్ ప్లాన్ అని జవాబివ్వడంతో అందరూ షాక్ అవుతారు. అయితే ఈ యాడ్‌లో ఎక్కడా సుశాంత్ పేరును ప్రస్తావించలేదు. కానీ దివంగత నటుడి అభిమానులు మాత్రం సుశాంత్ మాత్రమే ఫొటాన్స్, ఏలియన్స్ అంటూ సైన్స్ గురించి ఎప్పుడూ మాట్లాడేవారని, కావాలనే ఈ యాడ్‌లో అతన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈ యాడ్‌ని వెంటలనే తొలగించాలని డిమాండ్ చేశారు. -
ఐటీసీ లాభం రూ. 2,567 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.2,567 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,436 కోట్లతో పోల్చుకుంటే 25 శాతం తగ్గిపోయింది. ఎక్కువ మంది అనలిస్టుల అంచనాలకు అనుగుణంగానే కంపెనీ ఫలితాలు ఉండడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం 17% తగ్గి రూ.12,658 కోట్లుగా నమోదైంది. సిగరెట్ల అమ్మకాల రూపంలో వచ్చిన ఆదాయం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే రూ.6,142 కోట్ల నుంచి రూ.4,330 కోట్లకు పరిమితమైంది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాల పనితీరు మెరుగుపడింది. వీటి ఆదాయం మాత్రం రూ.3,068 కోట్ల నుంచి 3,379 కోట్లకు వృద్ధి చెందింది. హోటళ్ల ఆదాయం రూ.411 కోట్ల నుంచి 25 కోట్లకు తగ్గిపోగా.. అగ్రి వ్యాపారం ఆదాయం రూ.3,622 కోట్ల నుంచి రూ.3,765 కోట్లకు పెరిగింది. పేపర్‌బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ ఆదాయం రూ.1,527 కోట్ల నుంచి రూ.1,026 కోట్లకు క్షీణించింది. -
ఐటీసీ లాభం రూ.2,955 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.2,955 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.2,640 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. ఎఫ్ఎమ్సీజీ, సిగరెట్లు, వ్యవసాయ, పేపర్ విభాగాలు మంచి వృద్ధి సాధించాయని కంపెనీ తెలియజేసింది. స్టాండ్ అలోన్ ప్రాతిపదికన గత క్యూ2లో రూ.10,258 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.11,777 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.6,314 కోట్ల నుంచి రూ.7,408 కోట్లకు చేరాయి. ప్రతికూలతలున్నా... మంచి పనితీరు... సిగరెట్ పరిశ్రమపై తీవ్రమైన ఒత్తిడి కొనసాగుతుండటం, వ్యాపార పరిస్థితులు సమస్యాత్మకంగా ఉండటం వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ, మంచి పనితీరు సాధించామని ఐటీసీ తెలిపింది. వివిధ విభాగాల పనితీరును చూస్తే... ఎఫ్ఎమ్సీజీ వ్యాపారం (సిగరెట్ల విభాగంతో కలుపుకొని) ఆదాయం రూ.7,358 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.8,186 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయంలో 45 శాతం వాటా ఉండే సిగరెట్ల విభాగం వ్యాపారం రూ.4,554 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.5,026 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలియజేసింది. ఎఫ్ఎమ్సీజీ–యేతర వ్యాపార విభాగం రూ.2,804 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.3,160 కోట్లకు ఎగసిందని తెలిపింది. వ్యవసాయ విభాగం ఆదాయం రూ.1,968 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.2,220 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐటీసీ షేర్లు 2.3 శాతం నష్టంతో రూ.281 వద్ద ముగిసింది. -
ఐటీసీకి చార్మినార్, జీఎమ్ఆర్కు గోల్కొండ!
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ఎర్రకోటను దాల్మియా భారత్ కంపెనీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోకి ఇప్పుడు జీఎమ్ఆర్, ఐటీసీ హోటల్స్ కూడా చేరాయి. ఈ క్రమంలో ఐటీసీ కంపెనీ 400 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం, హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న చార్మినార్‌ను దత్తత తీసుకోవడం కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)ను దాఖలు చేసింది. చార్మినార్ దత్తత కోసం ఐటీసీకి పోటీగా మరే ఇతర కంపెనీ పోటీ పడకపోవడంతో ఐటీసీ దరఖాస్తును విజన్ కమిటీ, ఒవర్‌నైట్ కమిటీ ఆమోదించాయి. అలానే జీఎమ్ఆర్ స్పోర్ట్స్ ఈ ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఏడు చారిత్రక కట్టడాల దత్తత కోసం దరఖాస్తు చేసింది. వాటిలో ఢిల్లీలోని ఎర్రకోట, గోల్కొండ కోట కూడా ఉన్నాయి. దీని గురించి జీఎమ్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ అధికారులు ‘ మేము గోల్కొండ కోట కోసం వేసిన బిడ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకవేళ మా బిడ్ కమిటీకి నచ్చి, మాకు గోల్కొండ కోటను కేటాయిస్తే అప్పుడు మేము ప్రభుత్వంతో ఒక ఎమ్వోయూను కుదుర్చుకుంటాము’ అని తెలిపారు. జీఎమ్ఆర్ స్పోర్ట్స్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ :... చారిత్రక కట్టడాల సంరక్షణతో పాటు పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం 2017, సెప్టెంబరులో ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమం ప్రారంభింది. ఈ దత్తత కార్యక్రమంలో భాగంగా దాదాపు 100 చారిత్రక కట్టడాల పేర్లను ప్రకటించింది. తాజ్‌మహల్, ఎర్రకోట, సూర్య దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశం పర్యటక రంగంలో కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేసి ఆయా చారిత్రక కట్టడాలను సంరక్షించడం. చారిత్రక కట్టడాల దత్తత కార్యక్రమంలో భాగంగ కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తుంది. అత్యధిక బిడ్ వేసిన కంపెనీలకు ఈ చారిత్రక కట్టడాలను కేటాయిస్తారు. ఇక రానున్న ఐదేళ్లపాటు ఆయా చారిత్రక కట్టడాల సంరక్షణ బాధ్యత ఆ కంపెనీలదే. ఈ కార్యక్రమం అమలులో భాగంగా ఎర్రకోటను దత్తత చేసుకోవాడానికి దాల్మియా భారత్ గ్రూపు, ఇండిగో ఎయిర్‌లైన్స్ కంపెనీలు పోటీ పడగా... చివరకు ఈ రేసులో దాల్మియా భారత్ కంపెనీ 25 కోట్ల రూపాయల టెండర్ వేసి ఎర్రకోటను దక్కించుకుంది. ఇకమీదట ఎర్రకోట సంరక్షణ బాధ్యతలతో పాటు ఎర్రకోటకు వచ్చే పర్యాటకుల బాధ్యత కూడా ఇక దాల్మియానే చూసుకోనుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) : ఏదైనా వ్యాపారంలో భాగస్వామి అయ్యేందుకు లేదా ఉద్యోగం చేసే ఉద్ధేశంతో ఒక కంపెనీ లేదా పెట్టుబడిదారు పోటీ పడటం. -
ఐటీసీ నికర లాభం రూ.2,640 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.2,640 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.2,500 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. అయితే అధిక పన్నుల భారం కారణంగా సిగరెట్ల సెగ్మెంట్‌పై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది. గత క్యూ2లో సిగరెట్ల సెగ్మెంట్ ఆదాయం రూ.8,528 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో 47 శాతం తగ్గి రూ.4,554 కోట్లకు తగ్గిందని తెలిపింది. జీఎస్టీ కారణంగా అధిక పన్నుల భారం పడటంతో సిగరెట్ల వ్యాపారం ఆదాయం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం గత క్యూ2లో రూ.14,092 కోట్లుగా, ఈ క్యూ2లో రూ.10,258 కోట్లుగా నమోదైందని పేర్కొంది. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన కారణంగా గత క్యూ2 మొత్తం ఆదాయాన్ని ఈ క్యూ2 మొత్తం ఆదాయంతో పోల్చడానికి లేదని వివరించింది. ఎఫ్ఎంసీజీ ఆదాయం డౌన్.... కాగా, వ్యయాలు గణనీయంగా తగ్గడం కంపెనీకి కలసివచ్చింది. గత క్యూ2లో రూ.10,266 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు ఈ క్యూ2లో రూ.6,314 కోట్లకు తగ్గాయి. సిగరెట్లు, ఇతరాలతో కూడిన ఎఫ్ఎంసీజీ వ్యాపార ఆదాయం రూ.11,200 కోట్ల నుంచి రూ.7,358 కోట్లకు తగ్గింది. హోటల్ వ్యాపార ఆదాయం మాత్రం రూ.297 కోట్ల నుంచి రూ.300 కోట్లకు, వ్యవసాయ విభాగ ఆదాయం రూ.1,880 కోట్ల నుంచి రూ.1,968 కోట్లకు పెరిగాయి. ఇక పేపర్‌బోర్డ్‌లు, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపారం రూ.1,331 కోట్ల నుంచి రూ.1,309 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేర్ 0.3 శాతం క్షీణించి రూ.269 వద్ద ముగిసింది. -
రూ. 4 కోట్ల సిగరెట్లు దోపిడీ
సిగరెట్ల లారీని అటకాయించి బెదిరింపులు డ్రైవర్‌ను కొట్టి.. సమీపంలోని గుట్టల్లోకి లారీని తీసుకెళ్లి మరో లారీలోకి సరుకంతా మార్చేసుకున్న దుండగులు రంగారెడ్డి జిల్లా చౌటుప్పల్ వద్ద ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం.. చౌటుప్పల్, హైదరాబాద్: శనివారం అర్ధరాత్రి.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి.. దారిపక్కన రెండు సుమోలు కాచుకుని ఉన్నాయి.. వాటిల్లో ఉన్న 20 మంది అటుగా వస్తున్న ఓ లారీని అటకాయించారు.. డ్రైవర్‌ను చితకబాది లారీని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.. అందులోని రూ.4 కోట్ల విలువైన సిగరెట్లను దోచుకున్నారు.. అప్పటికే సిద్ధం చేసుకున్న మరో లారీలోకి ఆ సిగరెట్ల పెట్టెలను వేసుకుని ఉడాయించారు.. నిత్యం రద్దీగా ఉండే రంగారెడ్డి జిల్లా పెద్దఅం బర్పేట వద్ద పక్కాగా సినీ ఫక్కీలో ఈ సంచలన దోపిడీ జరగడం గమనార్హం. పక్కా ప్రణాళికతో.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉన్న ఐటీసీ కంపెనీ నుంచి శనివారం అర్ధరాత్రి ఒక లారీ సిగరెట్ల కాటన్లను తీసుకుని.. ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంటకు బయలుదేరింది. జాతీయ రహదారిపై పెద్ద అం బర్పేట వద్ద నిర్మానుష్య ప్రాంతానికి ఆ లారీ చేరుకోగానే.. అప్పటికే అక్కడ కాపుకాస్తున్న సుమారు 20 మంది దుండగులు దానిని ఆపారు. బిహార్‌కు చెందిన డ్రైవర్ అఖిలేశ్‌యాదవ్ (35)ను చితకబాది లారీని లాక్కున్నారు. ఈ లారీతో పాటు తాము అప్పటికే సిద్ధం చేసుకున్న కంటైనర్ లారీని తీసుకుని చౌటుప్పల్ ప్రాంతం వైపు వచ్చారు. ఇంకా ముందుకు వెళ్తే టోల్‌ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు, సీసీ కెమెరాలతో ప్రమాదం ఉంటుందని గ్రహించి... దండుమల్కాపురం గ్రామ శివార్లలోని గుట్టల ప్రాంతం వైపు తీసుకెళ్లారు. సిగరెట్లన్నింటినీ వేసుకుని.. దండుమల్కాపురం గ్రామ శివార్లలోని గుట్టల ప్రాంతంలో రెండు లారీలను నిలిపి.. సిగరెట్ల కాటన్లను తమ కంటైనర్ లారీలోకి మార్చుకున్నారు. లారీ డ్రైవర్ కళ్లకు గంతలు కట్టి.. చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ లారీని చౌటుప్పల్ వైపు తీసుకొచ్చి ఖైతాపురం వద్ద వదిలేశారు. తమ కంటైనర్‌ను తీసుకుని పారిపోయారు. అయితే చివరకు ఎలాగో కట్లు విప్పుకున్న లారీ డ్రైవర్ అఖిలేశ్‌యాదవ్.. సమీపంలోని దాబా హోటళ్ల వద్దకు చేరుకుని, వారి సాయంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో రాచకొండ పోలీస్ జాయింట్ కమిషనర్ తరుణ్‌జోషి, క్రైం డీసీపీ జానకి, భువనగిరి డీసీపీ పాలకుర్తి యాదగిరి తదిత రులు ఘటనా స్థలాన్ని సందర్శించి.. వివరాలు సేకరించారు. వేలి ముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకొ నేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దొంగలు పాతవారేనా? కొత్తగా ఏదైనా ముఠా ఈ ప్రాంతానికి వచ్చిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది రెండో ‘సిగరెట్’ దోపిడీ 2012 అక్టోబర్ 18న చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం శివారులో కూడా సిగరెట్ల లారీ చోరీకి గురైంది. అప్పట్లో రూ.19 లక్షల విలువైన సిగరెట్లను దోచుకెళ్లారు. దీనికి పాల్పడిన 11 మంది దొంగలను పోలీసులు అదే ఏడాది నవంబర్‌లో అరెస్టు చేశారు. వారంతా నల్లగొండ జిల్లాలోని మర్రిగూడెం, చింతపల్లి మండలాలకు చెందినవారే. -
ఐటీసీ అమెరికా అనుబంధ కంపెనీ విక్రయం
♦ పూర్తి వాటా విక్రయించిన ఐటీసీ ♦ డీల్ విలువ రూ.160 కోట్లు న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ తన అమెరికా పూర్తి అనుబంధ సంస్థ, కింగ్ మేకర్ మార్కెటింగ్‌లో పూర్తి వాటాను విక్రయించనున్నది. ఈ వాటాను రూ.160 కోట్లకు విక్రయించనున్నామని ఐటీసీ కంపెనీ బీఎస్ఈకి నివేదించింది. అమెరికాలోని న్యూజెర్సీలో నమోదైన కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ.. ఐటీసీ తయారు చేసిన సిగరెట్లను అమెరికాలో పంపిణి చేస్తోంది. కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీలో పూర్తి వాటాను విక్రయించాలన్న ప్రతిపాదనను తమ కార్పొరేట్ మేనేజ్మెంట్ కమిటీ ఆమోదం తెలిపిందని ఐటీసీ వివరించింది. దీనికి సంబంధించిన ఒక ఒప్పందం ఈ నెల 8న జరిగిందని, ఈ విక్రయానికి అమెరికాలోని వివిధ ప్రభుత్వ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంది. ఏస్, చక్కర్స్, హై-వాల్, గోల్డ్ క్రెస్ట్బ్రాండ్లను కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ పంపిణి చేస్తోంది. ఈ విక్రయం పూర్తయిన తర్వాత కింగ్ మేకర్ మార్కెటింగ్ కంపెనీ తమ అనుబంధ కంపెనీగా కొనసాగదని ఐటీసీ స్పష్టం చేసింది. ఈ వాటా విక్రయ నేపథ్యంలో బీఎస్ఈలో ఐటీసీ షేర్ అర శాతం లాభపడి రూ.240 వద్ద ముగిసింది. -
ఐటీసీ రూ.4,000 కోట్ల పెట్టుబడులు
♦ 2-3 ఏళ్లలో 8-9 ఫ్యాక్టరీల ఏర్పాటు ♦ ఐటీసీ ఫుడ్స్ సీఈఓ వి. ఎల్. రాజేశ్ వెల్లడి న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ కంపెనీ ఆహార ఉత్పత్తుల తయారీ కోసం దేశవ్యాప్తంగా 8-9 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నది. ఈ ఫ్యాక్టరీల ఏర్పాటు కోసం 2-3 ఏళ్లలో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ఐటీసీ తెలిపింది. తాము విక్రయిస్తున్న వివిధ కేటగిరీల ఆహార ఉత్పత్తుల తయారీ కోసం ఈ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీసీ ఫుడ్స్ సీఈఓ వి. ఎల్. రాజేశ్ తెలిపారు. కంపెనీ బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ డివిజన్ టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో 11% వృద్ధి చెంది రూ.7,097.49 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సిగరెట్ల తర్వాత ఐటీసీ రెండో అతి పెద్ద వ్యాపారం ఆహార ఉత్పత్తులేనని వివరించారు. ఆరోగ్య స్పృహ ఉన్న వినియోగదారులకు కొత్తగా సన్‌ఫీస్ట్ ఫార్మ్లైట్ బిస్కట్స్‌ను మార్కెట్లోకి తెచ్చామని తెలిపారు. సన్‌ఫీస్ట్ ఫార్మ్లైట్ బిస్కట్లలో ఓట్స్ బిస్కట్లను ఆల్మండ్స్, రెజిన్స్, చాకొలెట్ వేరియంట్లలో అందిస్తున్నామన్నారు. బిస్కెట్ మార్కెట్లో హెల్త్ బిస్కట్ మార్కెట్ వాటా 1 శాతమేనని, ఈ కేటగిరి వేగంగా వృద్ధి సాధిస్తోందని వివరించారు. మధుమేహ బాధితుల కోసం గ్లూకోజ్‌ను విడుదలను నియంత్రించే ఆశీర్వాద్ ఆటాను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.