Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha Scheme
-
రైతాంగానికి ఇంత మేలు చేసిన నాయకుడిని ఇంతవరకు చూడలేదు..!
-
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞం ‘వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు..!
-
ఈ పాసు పుస్తకాలు అత్యంత ఆధునికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త డిజిటల్ భూ రికార్డుల విధానం గురించి ఏమాత్రం అవగాహనలేకుండా ప్రభుత్వంపై కొందరు ఉద్దేశపూర్వకంగా బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. జగనన్న భూహక్కు, భూరక్ష పథకం కింద ఇచ్చిన పట్టాదారు పాసుబుక్‌లు ఎందుకు పనికిరావని.. ఇందులో రైతులకు హక్కుల్లేవని, రుణాలు రావంటూ ప్రభుత్వంపై విద్వేషం రగిలిస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కానీ, భూముల రీసర్వే తర్వాత ప్రభుత్వం జారీచేస్తున్న పట్టాదార్ పాసు పుస్తకాలు అత్యంత ఆధునికమైనవని రెవెన్యూ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. రుణాలు తీసుకోవడానికి ప్రస్తుతం ఇస్తున్న పాసు పుస్తకం (భూ హక్కు పత్రం) ఉపయోగపడదనే ప్రచారం అవగాహన రాహిత్యమేననే చెబుతున్నాయి. నిజానికి.. భూములపై యాజమాన్య హక్కును ప్రతిబింబించేది పాసు పుస్తకమే. దాన్ని చూపించి బ్యాంకుల రుణం తీసుకోవడంతోపాటు తనఖా పెట్టుకోవడం, అమ్ముకోవడం వంటివన్నీ గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. రీ సర్వేకు ముందున్న పాస్ పుస్తకంలోని ఉపయోగాల కంటే ఇప్పుడిస్తున్న పాసు పుస్తకాలతో ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. ► 2016లో ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించిన తర్వాత భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, బహుమతి, తనఖా, లీజు వంటి లావాదేవీలను పాసు పుస్తకంలో రిజిస్ట్రేషన్ అధికారి నమోదు చేయాల్సిన అవసరంలేదు. ► రైతులు రుణాలు తీసుకోవడానికి తమ పాసు పుస్తకాలను బ్యాంకుల్లో ఇవ్వక్కర్లేదు. ► రెవెన్యూ రికార్డులు ఆన్లైన్లో ఉండటంతో పాసు పుస్తకాలను అప్డేట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండాపోయింది. ► రుణం మంజూరు చేసేటప్పుడు వెబ్‌ల్యాండ్ ఎలక్ట్రానిక్ రెవెన్యూ రికార్డుల్లో రుణం గురించి నమోదుచేస్తారు. ఈ విషయం తెలుసుకోకుండా కొందరు ఇప్పుడున్న పాసు పుస్తకాల కంటే గతంలో ఇచ్చిన పాస్ పుస్తకాలే మంచివని ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ► నిజానికి.. రీసర్వే ప్రక్రియకు ముందు జారీచేసిన పాసుబుక్‌లతో పోలిస్తే ప్రస్తుత పాస్బుక్లకే విలువ ఎక్కువ. కొత్త పాసు పుస్తకంతో రుణాలు రాలేదనే ఫిర్యాదు రాలేదు.. ఇక అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి తెలియని విషయం ఏమిటంటే.. జగనన్న భూహక్కు, భూరక్ష పథకం కింద ఇచ్చిన పాసు పుస్తకం (భూహక్కు పత్రం) అత్యంత ఆధునికమైంది. ఇందులో నమోదు చేసిన వివరాలన్నీ ఆన్లైన్లోని వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వివరాలే. అలాగే.. ► ఈ పాసుబుక్‌లో భూమికి సంబంధించిన జియో కోఆర్డినేటెడ్ లొకేషన్, భూ కమతం స్కెచ్, యజమాని పేరు వంటివన్నీ ఉంటాయి. డిజిటల్ యుగంలో వచ్చిన కొత్త మార్పు ఇది. ► గతంలో మాదిరిగా పాసు పుస్తకాలు అసలైనవా కాదా? అని ధృవీకరించుకోవాల్సిన అవసరంలేదు. ► పాస్ పుస్తకాల్లేవని, పోయాయని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్లో నమోదైన వివరాలే పక్కాగా ఉంటాయి. ► అంతేకాక.. ఈ కొత్త పాస్ పుస్తకాలను ఫోర్జరీచేసే అవకాశం కూడా లేదు. దొంగ పాస్ పుస్తకాలను సృష్టించడం కుదరదు. ► పాస్ పుస్తకంలో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నకిలీవి సృష్టించడం సాధ్యంకాదు. అందువల్లే ఈ పాస్ పుస్తకంపై భౌతికంగా సంతకాలు అవసరంలేదు. ► ఇలా వివరాలన్నీ ఆన్లైన్లో ఉండడంవల్ల గతంలో మాదిరిగా పాస్ పుస్తకాలు ఒకరి పేరుతో, అడంగల్, 1బీ మరొకరి పేరు మీద ఉండే అవకాశంలేదు. ► అందుకే దీన్ని దేశంలోనే అత్యంత ఆధునికమైన భూరికార్డు విధానంగా పలు రాష్ట్రాలు అంగీకరిస్తున్నాయి. ► ఇక ఈ పాస్ పుస్తకం ద్వారా రుణం రాలేదని, రిజిస్ట్రేషన్ జరగట్లేదని ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. జాయింట్ పట్టాలు ఇవ్వద్దని ఆదేశాలు.. ఇక జాయింట్ పట్టాలపైనా అపోహలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం జాయింట్ ఎల్పీఎంలు (ల్యాండ్ పార్సిల్ మాప్) జారీ చెయ్యొద్దని స్పష్టంగా ఆదేశాలిచ్చింది. ఆధీనంలో ఉన్న భూమి ప్రకారం, దానిపై హక్కులపై ప్రకారం సబ్ డివిజన్ చేసుకోని సందర్భాల్లో జాయింట్ ఎల్పీఎంలు ఇచ్చారు. గతంలో ఉన్న జాయింట్ పట్టాలవల్ల ఏర్పడిన గొడవలనే ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ధరణి వెబ్సైట్లో అనుభవదారుల హక్కులు కనపడని విధంగా ఏపీలోనూ హక్కులు కనపడడం లేదంటూ ప్రజల్లో అపోహలు పెంచే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో భూ హక్కుల రక్షణ విధానం అత్యంత ఆధునికంగా రూపొందించారు. ఈ విధానం భారతదేశంలోనే ఆదర్శంగా నిలిచింది. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా చట్టప్రకారం జరుగుతున్న రీ సర్వే ద్వారా పటిష్టమైన భూ హక్కులను రికార్డు చేసే వ్యవస్థ రాష్ట్రంలో రూపొందింది. ఈ విషయాలేవీ తెలుసుకోకుండా కేవలం రాజకీయ కోణంలో సీపీఐ నాయకుడు నారాయణ ఆరోపణలు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
భూ చరిత్రలో కొత్త శకం
ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో ఉంటుంది. వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో పలు వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కారమవుతాయి. ఈ టైటిల్ రిజిస్టర్నే చట్ట పరంగా కన్‌క్లూజివ్ రికార్డు అని పిలుస్తారు. అదే తుది రికార్డు కింద లెక్క. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజెంటివ్ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి కన్‌క్లూజివ్ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం ఉండదు. సాక్షి, అమరావతి: దేశంలోనే మొట్ట మొదటిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో రాష్ట్రంలో భూముల చరిత్రలో కొత్త శకం నమోదు కానుంది. భూ యజమానులకు భరోసా ఇచ్చే ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చాలా ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. పలు మార్పుల తర్వాత ఇటీవలే దానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా చెబుతోంది. ఈ ఆలోచనలను అందిపుచ్చుకుని దాన్ని ఆచరణలోకి తీసుకు రావడంలో ఆంధ్రప్రదేశ్ సఫలీకృతమైంది. గత నెల అక్టోబర్ 31వ తేదీ నుంచి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్–2023 అమల్లోకి వచ్చింది. ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కిపైగా రికార్డులున్నాయి. గ్రామ స్థాయిలో 1బీ, అసైన్మెంట్, ఈనాం వంటి 11 రిజిష్టర్లు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాలయంలో మరికొన్ని, సబ్ రిజిస్ట్రార్, పంచాయతీ, మున్సిపాల్టీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా, చట్టపరంగా ఏదీ కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా వేరే వాళ్లు అది తనదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు. టైట్లింగ్ చట్టంలో భూ యజమానులకు తమ భూములపై భరోసా వస్తుంది. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల వ్యవస్థ ► భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లో ఉంటాయి. వివాదం ఉన్న భూముల వివరాలను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. ► ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేతప్ప కింది స్థాయిలో ఏ రెవెన్యూ అధికారికి, ఏ సివిల్ కోర్టుకీ వివాదాన్ని పరిష్కరించే అధికారాలు ఉండవు. ► ఈ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్. ఆ భూమి వివాదంలో పడి భూములు కోల్పోయే పరిస్థితులు ఉండవు. టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు సంవత్సరాల లోపే చెప్పాలి. రెండేళ్ల లోపు ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. టైటిల్ నిర్థారణ అయిన రెండేళ్లలోపే దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారవుతుంది. భూ యజమాని హక్కులకు పూచీ ప్రభుత్వానిదే ► టైటిల్ రిజిష్టర్‌లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు. 1బిలో ఉన్నా, అడంగల్‌లో ఉన్నా, ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్నా ప్రభుత్వ గ్యారంటీ ఉండదు. ఈ గ్యారంటీ లేకపోవడాన్నే ప్రిజెంటివ్ రైట్స్ అనేవారు. 1బిలో ఉన్న పేరుపైన ఎవరైనా కోర్టుకు వెళ్లి అది తప్పని నిరూపించే వరకు అది కరెక్ట్ అని భావించేవారు. ► ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని, రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికి రావని స్పష్టం చేసింది. ఎందుకంటే అవన్నీ శిస్తు వసూలు చేయడానికి బ్రిటీష్ హయాం నుంచి రాసిన లెక్కల పుస్తకాలు. అందులో పన్ను ఎంత కట్టాలో ఉంటుంది తప్ప ఆ భూమి ఎవరిదో ఉండదు. ► టైటిలింగ్ చట్టం కింద రూపొందిన రిజిస్టర్ ప్రకారం ప్రిజెంటివ్ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. పాత రికార్డులేవీ చెల్లవు. భూమి హక్కుల చరిత్ర కొత్తగా మొదలవుతుంది. ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం ఇస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. టైటిల్ రిజిస్టర్‌గా మారనున్న ఆర్ఓఆర్ రికార్డు ► ఈ చట్టం అమలు కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టైటిల్ గ్యారంటీ అథారిటీలు ఏర్పాటవుతాయి. టైటిల్ రిజిస్టర్లను నిర్ధిష్ట విధానంలో ఈ అథారిటీలే ఖరారు చేస్తాయి. వారి ఆధ్వర్యంలోనే రిజిస్టర్లు నిర్వహిస్తారు. భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటి వరకు సబ్ రిజి్రస్టార్ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతోంది. హక్కుల రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ► పాత వ్యవస్థ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టైట్లింగ్ అథారిటీలు, గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. ► రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో తయారవుతున్న కొత్త రికార్డులను ల్యాండ్ టైట్లింగ్ చట్టం కింద నోటిఫై చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రీ సర్వేలో రూపొందించిన డిజిటల్ రికార్డులను ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం కింద నోటిఫై చేస్తున్నారు. టైటిల్ గ్యారంటీ చట్టం ప్రకారం ఆర్ఓఆర్ రికార్డు టైటిల్ రిజిస్టర్‌గా మారుతుందని చెబుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో విధివిధానాలు రూపొందించనుంది. గొప్ప ముందడుగు ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవడం చాలా గొప్ప ముందడుగు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. టైటిల్‌కు భద్రత ఉంది కాబట్టి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా ఆంధ్రాలో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది. భూ యజమానికి భరోసా ఉంటుంది. ఈ ఫలితాలు అందరికీ దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. ఇది ఒక ల్యాండ్ మార్క్ చట్టం కాబట్టి ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. చట్టం అమలులో పేదల కోసం పారా లీగల్ వ్యవస్థ వంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగానికి పూర్తి స్థాయిలో రీఓరియెంటేషన్ అవసరం. ఇది ఆర్ఓఆర్ చట్టం లాంటిది కాదు. దీనిపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేస్తే ఐదేళ్లలో ఆర్థిక ప్రగతిలో ఏపీ అద్భుతంగా దూసుకుపోయే అవకాశం ఉంటుంది. – ఎం సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ లా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ -
భూముల రీ సర్వేకు జాతీయ స్థాయిలో ప్రశంసలు
-
ఆ ప్రజా ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్షపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ‘రెవిన్యూ విభాగంలో విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు తెలియాలి. సమగ్ర భూసర్వే వలన ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలపై సమాచారాన్ని ప్రజల్లోకి పంపాలి. ప్రజలకు మేలు చేస్తున్న నిర్ణయాలపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేక… వక్రీకరిస్తోంది. ప్రజలకు మేలు జరుగుతున్న నిర్ణయాలను కూడా వక్రీకరించి ప్రచారం చేస్తోంది. వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. చాలా రాష్ట్రాల్లో మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు సర్వేయర్లు మాత్రమే ఉంటే మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయంలో కూడా సర్వేయరు ఉన్నారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతోంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాలకు తీసుకు వస్తున్నాం. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ఇంటిలో నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా సాంకేతికతను తీసుకు వస్తున్నాం. ఇన్ని సౌలభ్యాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తుంటే దానిపై తప్పుడు రాతలు, వక్రీకరణలు చేస్తున్నారు. అలాగే భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండలాలస్థాయిలో మొబైల్ కోర్టులు కూడా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్ సూచించారు. -
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
-
భూసర్వే గ్రామాల్లో ముమ్మరంగా రాళ్లు పాతే కార్యక్రమం
-
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్షపై సీఎం జగన్ సమీక్ష
-
భూముల రీసర్వే అత్యంత ప్రాధాన్యం: సీఎం జగన్
మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పని పూర్తి చేయాలి. రీ సర్వే కోసం రోవర్‌తోపాటు ఇతర పరికరాలు క్రమంగా ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఉండేలా చూసుకోవాలి. అందుబాటులో ఉన్న సాంకేతికతనూ ఉపయోగించుకోవాలి. దీనివల్ల సర్వేయర్ పూర్తి స్థాయిలో తన పని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుంది. భవిష్యత్ తరాల వారికి కూడా ఇది చాలా ఉపయోగకరం కాబట్టి ప్రత్యేకంగా దృష్టి సారించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద స్థాయిలో భూముల రీ సర్వే చేపట్టడం లేదని తెలిపారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ఈ పథకంపై రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, గనుల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూముల రీ సర్వే ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమమని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా భూ యజమానులకు భూ హక్కు పత్రాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ఇప్పటి వారికే కాకుండా భవిష్యత్తు తరాల వారికి కూడా చాలా ఉపయోగమని తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా జాప్యానికి తావు లేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2 వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియ గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే చాలా వరకు భూ హక్కుల పత్రాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. సర్వే రాళ్ల కొరత లేకుండా చూడాలి సర్వే పూర్తయ్యాక సరిహద్దుల వద్ద వేసేందుకు 31 లక్షల సర్వే రాళ్లను సిద్ధం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. రోజుకు 50 వేల సర్వే రాళ్ల చొప్పున సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. తర్వాత దశల్లో జరిగే సర్వే కోసం రాళ్ల కొరత రాకుండా ముందస్తుగానే సన్నాహాలు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ ప్రాంతాల్లో సర్వే కోసం సన్నాహాలు చేస్తున్నామని మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి డేటా క్రోడీకరణ జరుగుతోందన్నారు. నిర్దేశించుకున్న టైమ్ లైన్స్ ప్రకారం కచ్చితంగా సర్వే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్ మూడో వారం నాటికి 300 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తవుతుందని పంచాయతీ రాజ్ శాఖాధికారులు తెలిపారు. డిసెంబర్‌లోగా మొత్తం అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి సాయిప్రసాద్, వై శ్రీలక్ష్మి, బుడితి రాజశేఖర్, రజత్ భార్గవ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ జైన్, భూ పరిపాలన అదనపు చీఫ్ కమిషనర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న భూహక్కు-భూరక్షపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన బుధవారం భేటీ అయింది. సబ్ కమిటీలోని సభ్యులుగా ఉన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో కలిసి జగన్న భూరక్ష-భూహక్కు పథకం ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ... దేశంలో సమగ్ర సర్వే ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రమే ముందంజలో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి సర్వే ప్రక్రియ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. జగనన్న భూహక్కు-భూరక్ష కార్యక్రమంలో భాగంగా 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని మొత్తం 17,461 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కోరారు. బ్రిటీష్ పాలన తరువాత రాష్ట్రం అంతా కూడా ఒకేసారి నిర్థిష్టమైన విధానంతో జరుగుతున్న ఈ సర్వేలో ఎటువంటి అలసత్వం సహించేది లేదని అన్నారు. సీఎం వైస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేసి, శాశ్వత భూహక్కు పత్రాలను కూడా ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఇప్పటి వరకు 4.3 లక్షల సబ్ డివిజన్ లలో సుమారు 2 లక్షల మ్యూటేషన్ లను పరిష్కరించామని తెలిపారు. ఈ ఏడాది మే నెల నాటికి 6వేల గ్రామాలు, ఆగస్టు నెల నాటికి 9వేల గ్రామాలు, అక్టోబర్ నాటికి 13వేల గ్రామాలు, డిసెంబర్ నాటికి మొత్తం 17,461 గ్రామాలకు భూహక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటి వరకు 5264 గ్రామాల్లో డ్రోన్ ద్వారా చిత్రాలను రికార్డు చేయడం జరిగిందని, జూన్ 2023 నాటికి 4006 గ్రామాలకు ఓఆర్ఐ మ్యాప్‌లను సిద్దం చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే 3191 గ్రామాలకు గ్రౌండ్ ట్రూతింగ్, 2464 గ్రామాలకు గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తి చేశారని, మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటికే సమగ్ర సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామకంఠం భూముల్లో నివాసితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. అలాగే భూ యజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులపై కూడా మొబైల్ మేజిస్ట్రేట్ కోర్ట్‌లో విచారించి, ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీల్లో కూడా సమగ్ర సర్వేను ప్రారంభించాలని సూచించారు. చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే ఇప్పటికే సర్వే కోసం 30 అత్యాధునిక డ్రోన్లు, 70 బేస్ స్టేషన్లు, 1330 జిఎన్ఎస్ఎస్ రోవర్లను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. డ్రోన్ సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్, మ్యాప్ లను సిద్దం చేయడం, వెరిఫికేషన్, నోటీసుల జారీ చేయడం, వివాదాలను పరిష్కరించడం, సర్వే రాళ్లను నాటడం దశలవారీగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. సమావేశంలో సీపీఎల్ఎ జి.సాయిప్రసాద్, సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్పోరేషన్ చైర్మన్ సౌరబ్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూముల సమగ్ర రీ సర్వేపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ చేసిన సీఎం వైఎస్ జగన్
-
మహాయజ్ఞంలా భూరికార్డుల ప్రక్షాళన చేపడుతున్నాం: సీఎం జగన్
-
సీఎం జగన్ మాటలకు చంద్రబాబు గుండెల్లో గుబులు పుట్టింది
-
వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్
-
దేశంలో మొదటిసారి జరుగుతున్న కార్యక్రమం ఇది
-
సీఎం వైఎస్ జగన్ గ్రాండ్ ఎంట్రీ@శ్రీకాకుళం
-
జగనన్న శాశ్వత భూ హక్కుదారులతో సీఎం జగన్..
-
భూ రీ సర్వే స్టాల్స్‌ను పరిశీలిస్తున్న సీఎం జగన్
-
నరసన్నపేటలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం
-
రాష్ట్రవ్యాప్తంగా మహా యజ్ఞాన్ని చేపట్టిన సీఎం జగన్
-
Vizianagaram: భూముల రీసర్వేలో కొత్త అంకం ప్రారంభం
బొబ్బిలి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమం కింద విజయనగరం జిల్లాలో జోరుగా సాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియలో కొత్త అంకానికి జిల్లా అధికార యంత్రాంగం తెరతీసింది. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ నెలాఖరులోగా భూహక్కు పత్రాల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. పాస్ పుస్తకాలను ఇప్పటికే రెవెన్యూ డివిజనల్ కేంద్రాలకు సరఫరా చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు వీటిని రైతులకు అందజేయనుంది. సర్వే ఇలా... జిల్లాలో 983 గ్రామాల్లోని భూములను రీసర్వే చేయాల్సి ఉంది. తొలుత రామభద్రపురం మండలం మర్రి వలసలో సర్వే ప్రక్రియను పాలకులు ప్రారంభించారు. అధునాతన పరికరాలతో డ్రోన్ సర్వే చేపట్టి, తరువాత క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, సర్వే సిబ్బంది హద్దులు నిర్ణయిస్తున్నారు. రైతుల సమక్షంలో వివాదాలు లేకుండా సర్వే పూర్తిచేస్తున్నారు. విస్తీర్ణంను పక్కాగా నిర్ధారిస్తున్నారు. గ్రామ సభల్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి భూముల వివరాలను స్కానింగ్, కంప్యూటరైజ్డ్ చేస్తున్నారు. 179 గ్రామాల్లో సర్వే పూర్తి... జిల్లాలోని 4.84 లక్షల చదరపు కిమీల పరిధిలో రీసర్వే చేయాల్సి ఉంది. నేటి వరకు సర్వే, రెవెన్యూ అధికారులు 179 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. అందులో దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో రీసర్వే పూర్తయింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం తదితర డివిజన్లలో ఒక్కో డివిజన్లో ఐదేసి గ్రామాల చొప్పున ముందుగా జగనన్న భూ హక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు అధికారు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ మేరకు ఆయా డివిజన్లకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేసింది. వివాదాలకు తావులేకుండా... జగనన్న సంపూర్ణ భూ హక్కు పత్రాల్లో క్యూర్ కోడ్, మ్యాపుల ఫొటోలు, విస్తీర్ణం, సర్వే నంబర్లతో సహా అన్ని వివరాలూ ముద్రించారు. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే రైతు తమ భూముల సమస్త వివరాలనూ తెలుసుకోవచ్చు. భూ యజమాని, రైతులకు సంబంధించిన అన్ని వివరాలూ ఇందులో ఉన్నాయి. రైతులు, యజమానులు ఎటువంటి ఆందోళన, సందేహాలకు గురికానవసరం లేదు. అన్ని వివరాలతో ఉన్న హక్కు పత్రాలను పొందేలా అధికారులు ఈ హక్కు పత్రాలను సిద్ధం చేశారు. విడతల వారీగా రైతులకు ఈ పత్రాలు అందజేయనున్నారు. పొరపాట్లు దొర్లితే మ్యుటేషన్‌కు అవకాశం.. అత్యధిక గ్రామాల్లో ఒకే సారి హద్దుల గుర్తింపు, విస్తీర్ణం, రీసర్వే ప్రాంతాలు ఒకే సారి చేపట్టడం వల్ల ఎక్కడైనా చిన్న తప్పులు దొర్లితే దానిని మ్యుటేషన్ ద్వారా సరిదిద్దుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూముల రీ సర్వేలో 480 సర్వే సిబ్బంది నిమగ్నమయ్యారు. త్వరలోనే పంపిణీ చేస్తాం రీసర్వేకు సంబంధించిన ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్న గ్రామాల భూ హక్కు పత్రాలు ముద్రించి కార్యాలయానికి వచ్చాయి. అన్ని డివిజన్ కార్యాలయాలకూ ఈ హక్కు పత్రాలు వెళ్లాయి. ఉన్నతాధికారులు తేదీ నిర్ణయిస్తే వాటిని రైతులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. – పి.శేషశైలజ, ఆర్డీఓ, బొబ్బిలి -
నరసన్నపేట పర్యటనకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, శ్రీకాకుళం(నరసన్నపేట): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23న నరసన్నపేటకు రానున్నారని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్‌లు తెలిపారు. తొలుత 25న వస్తారని అనుకున్నా రెండు రోజులు ముందుగానే పర్యటన ఖ రారైందని వీరు తెలిపారు. ఈ మేరకు గురువారం హెలీప్యాడ్, సభాస్థలి కోసం కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎస్పీ జీఆర్ రాధికలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణదాస్ స్థల పరిశీలన చేశారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానం వద్ద విలేకరులతో మాట్లాడారు. 23 ఉదయం 10గంటలకు జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష (రీసర్వే) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, జమ్ము వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జమ్ము కూడలి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కళాశాల మైదానం వరకూ సీఎం రోడ్ షో ఉంటుందని అన్నారు. సభా ఏర్పాట్లను గురువారం రాత్రి నుంచే ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, ఆర్డీఓ బి.శాంతి, ఎంపీపీ ఆరంగి మురళి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చింతు రామారావు, నరసన్నపేట సర్పంచ్ బూరల్లి శంకర్ పాల్గొన్నారు. చదవండి: (హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ) -
CM Jagan: 25న నరసన్నపేటకు సీఎం వైఎస్ జగన్!
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఏదో ఒక చోట జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష (రీ సర్వే) రెండో విడత పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించి సీసీఎల్ఏ నుంచి కలెక్టర్ శ్రీ కేష్ బి.లాఠకర్‌కు ప్రాథమిక సమాచారం చేరింది. ఇదే అంశంపై శనివారం సాయంత్రం నరసన్నపేట ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌తో కలెక్టర్ లాఠకర్తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల విషయాన్ని ఈ సందర్భంగా చర్చించారు. తామరాపల్లిలో సభ నిర్వహణకు అనువుగా ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. సభ నిర్వహణ ఏర్పాట్లు, హెలీ పాడ్, తదితర అంశాలను సోమవారం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. డిసెంబర్ నెలాఖరులో భావనపాడు పోర్టుకు శంకుస్థాపన, ఉద్దానం మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి కూడా ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలను కూడా కలెక్టర్‌తో కలిసి చర్చించారు. ఈ భేటీలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, రాజాపు అప్పన్న, ముద్దాడ బైరాగి నాయుడు, చింతు రామారావు, కణితి కృష్ణారావు, త్రినాథ్ తదితరులు ఉన్నారు. చదవండి: (పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్) -
శాశ్వత భూసర్వే కోసం పెద్ద ఎత్తున సర్వేరాళ్ల తయారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతుల్లో జరుగుతున్న జగనన్న భూహక్కు భూరక్ష పథకం కోసం పెద్ద ఎత్తున సర్వే రాళ్లను గనులశాఖ సమకూరుస్తోందని ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని రెండువేల గ్రానైట్ పరిశ్రమల్లో సర్వేరాళ్లు తయారుచేస్తున్నారని వెల్లడించారు. గతంలో ఆర్డర్లు లేక, ఆర్థికంగా చితికిపోయి మూతపడిన వేలాది గ్రానైట్ పరిశ్రమలకు ప్రభుత్వం సర్వేరాళ్ల తయారీ ఆర్డర్ ఇవ్వడంతో ఆ పరిశ్రమలకు తిరిగి జీవం వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు రావాలని ప్రభుత్వపరంగా అనేక రాయితీలు ప్రకటించారని, స్లాబ్ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. దానికి అదనంగా సర్వేరాళ్ల తయారీని కూడా పరిశ్రమ నిర్వాహకులకు అప్పగించడం ద్వారా వారికి మరింత పనికల్పించారని పేర్కొన్నారు. సర్వేరాళ్లు గమ్యానికి చేరుకున్న వెంటనే బిల్లుల చెల్లింపు ముడిసరుకును గ్రానైట్ పరిశ్రమలకు అందించి, వారినుంచి నిర్దేశిత నమూనాలో సర్వేరాళ్లను తయారు చేయిస్తున్నామని తెలిపారు. సిద్ధమైన రాళ్ల నాణ్యతాప్రమాణాలను పరీక్షించి, వాటిని సూచించిన గమ్యస్థానానికి చేర్చిన వెంటనే గ్రానైట్ పరిశ్రమలకు బిల్లులు చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క పరిశ్రమకు కూడా బిల్లుల బకాయిలు లేవని స్పష్టం చేశారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకుల్లో ఆందోళన అంటూ పత్రికల్లో వచ్చిన వార్త పూర్తిగా అసత్యమని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఒక్కో సర్వేరాయికి రూ.300 గతంలో సిద్ధం చేసిన ఒక్కో సర్వేరాయికి ప్రభుత్వం రూ.270 చెల్లించేదని, దాన్ని ఇప్పుడు రూ.300కు పెంచామని అధికారులు తెలిపారు. దీంతో మరింత ఎక్కువమంది ఆర్డర్లు కా వాలని ఉత్సాహంగా ముందుకొస్తున్నారన్నారు. సర్వేరాళ్ల తయారీ, విక్రయాలు, రవాణా అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్లు పేర్కొన్నా రు. ఈ యాప్‌లో అన్ని వివరాలు ఉంటాయని, గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు కూడా దీన్లో లాగిన్ అయి తాము విక్రయించిన సర్వేరాళ్లకు బిల్లుల చెల్లింపులు ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం కల్పించామని వివరించారు. సర్వేరాళ్ల తయారీలో గ్రానైట్ యజమానులపై ఆర్థికంగా భారం పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సర్వేరాళ్లకు అవసరమైన బ్లాక్‌లను స్వయంగా గ్రానైట్ పరిశ్రమ యజమానులకు ఉచితంగా అందిస్తోందని తెలిపారు. కేవలం ఆ రాయిని సర్వేరాళ్లుగా తీర్చిదిద్దడం వరకే గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకుల బాధ్యత అని తెలిపారు. ఇది పూర్తిచేసిన వెంటనే వారికి బిల్లులు చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష
-
ఏపీ: ఎవరూ వేలెత్తి చూపకుండా సంపూర్ణ భూసర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల రీ సర్వే మహాయజ్ఞం ఫలాలు ప్రజలకు పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. సర్వేలో నాణ్యత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఒక గ్రామంలో రీ సర్వే చేసిన తర్వాత తమదైన ముద్రతో అన్ని రకాలుగా ఈ ప్రక్రియను ముగించాలన్నారు. భూ వివాదాలు, తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావడమే రీసర్వే లక్ష్యమన్నారు. సర్వే ఎక్కడా అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాటే రాకూడదన్నారు. ప్రజలను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేలా, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలని స్పష్టం చేశారు. అప్పుడే ఈ బృహత్తర కార్యక్రమానికి సార్థకత లభిస్తుందన్నారు. సర్వేతో రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన కావడంతోపాటు రికార్డులు, డేటా స్వచ్ఛీకరణ జరుగుతుందని తెలిపారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష’ పథకంపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం జగన్ సర్వే ప్రక్రియకు సంబంధించి కీలక సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ప్రణాళికాబద్ధంగా.. రీససర్వేలో నాణ్యత చాలా ముఖ్యం. ఈ మహాయజ్ఞం ఫలాలు ప్రజలకు సంపూర్ణంగా అందాలి. ఎక్కడా కూడా సర్వే అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాట రాకూడదు. మొబైల్ ట్రిబ్యునళ్లు, సరిహద్దులు, సబ్డివిజన్లు.. ఇవన్నీ చాలా క్రమ పద్ధతిలో ముందుకు సాగాలి. సర్వే చేస్తున్నప్పుడు ఉత్పన్నమైన సమస్యలను అత్యంత ప్రణాళికా బద్ధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ సర్వే ద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన అవుతుంది. రికార్డులు, డేటా స్వచ్ఛీకరణ జరుగుతుంది. ఈ అంశాలను అధికారులు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. వేలెత్తి చూపలేని విధంగా.. రీ సర్వే ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని కొంతమంది పనిగట్టుకుని ఈ కార్యక్రమంపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. అపోహలు సృష్టించేలా వ్యవరిస్తున్నారు. తద్వారా ఈ గొప్ప ప్రయత్నాన్ని నీరుగార్చి విశ్వసనీయతను దెబ్బతీసే యత్నాలు చేస్తున్నారు. 100 ఏళ్ల తర్వాత భూముల రీ సర్వే చేస్తున్నాం. దీనికోసం కొన్ని వేల మందిని నియమించి రూ.కోట్లు వెచ్చించి అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దోషాలు, తప్పులతో ఒక్క హక్కు పత్రం కూడా రైతులకు వెళ్లకూడదు. సర్వే పూర్తైన ప్రతి గ్రామంలో 5 శాతం రికార్డులను ఆర్డీవోలు, ఒక శాతాన్ని జేసీలు వెరిఫికేషన్ చేయాలి. అది పూర్తైన తరువాతే హక్కు పత్రాలను జారీ చేయాలి. గ్రామ సచివాలయంలో సర్వే పూర్తి కాగానే అక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు కావాలి. పై అధికారులు గ్రామాలను సందర్శించడం వల్ల అందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తారు. సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగుతుంది. అర్బన్‌లో జనవరి నుంచి.. పట్టణ ప్రాంతాల్లో సర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో 15,02,392 ఎకరాల్లో చేపట్టే సర్వేలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సర్వే పూర్తైన తర్వాత ఇక్కడ కూడా పత్రాల వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. వచ్చే జనవరిలో సర్వే ప్రక్రియ ప్రారంభించి మే నెల నుంచి హక్కు పత్రాల పంపిణీ ప్రారంభమయ్యేలా ముందుకు సాగుతామని అధికారులు తెలిపారు. 2023 ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. కచ్చితమైన విధానాలతో.. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా సర్వే జరుగుతోందని సమీక్షలో ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. పక్కా మార్గదర్శకాలతో తప్పులు, పొరపాట్లు లేని విధంగా హక్కు పత్రాలు జారీ చేస్తామన్నారు. సర్వే ప్రక్రియలో ఏ దశలో అభ్యంతరాలు వ్యక్తమైనా పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేస్తామని చెప్పారు. సమగ్ర సర్వే ద్వారా భూ యజమానుల హక్కులను తరతరాలు కాపాడటంతోపాటు ఆక్రమణలు, కబ్జాలు, రికార్డుల్లో అవకతవకలు లాంటి వాటికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుందన్నారు. కేవలం 5 సెంటీమీటర్ల వ్యత్యాసంతో కచ్చితమైన పద్ధతుల్లో సర్వే జరుగుతుందన్నారు. ఇప్పటివరకూ 6,037 గ్రామాల్లో డ్రోన్లు ఎగరవేశామని, ఇందులో 1,545 గ్రామాల్లో రెవిన్యూ రికార్డులు కూడా ఖరారయ్యాయని తెలిపారు. ప్రతి నెలా 13,335 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని లక్ష్యంగా చేసుకుని సర్వే చేస్తున్నామని వివరించారు. డ్రోన్లు ఎగరవేయడానికి అనువుగాలేని ప్రాంతాల్లో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా సర్వే చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యామన్నారు. నవంబర్ మొదటి వారంలో తొలివిడత గ్రామాల్లో హక్కు పత్రాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సమీక్షలో విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూ శాఖ (సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్) కమిషనర్ సిద్దార్ధ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఐజీ వి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
భూవివాదాలు, భూతగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి: సీఎం జగన్
-
రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నాం.. ఫలాలు ప్రజలకు అందాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష సందర్భంగా భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేలా, వారి భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలని స్పష్టం చేశారు. సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు ఇవే.. రీసర్వేలో నాణ్యత చాలా ముఖ్యం.. – ఒక గ్రామంలో రీసర్వే చేసిన తర్వాత అన్నిరకాలుగా ఈ ప్రక్రియను ముగించాలి. – ఆ గ్రామంలో మనదైన ముద్ర కనిపించాలి. – భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి. – రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నాం.. వాటి ఫలాలు ప్రజలకు అందాలి. – క్వాలిటీ అనేది కచ్చితంగా ఉండాలి. ఎక్కడా కూడా సర్వే అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాట రాకూడదు. – మొబైల్ ట్రిబ్యూనల్స్, సరిహద్దులు, సబ్డివిజన్లు.. ఇవన్నీకూడా చాలా క్రమ పద్ధతిలో ముందుకు సాగాలి. – రీసర్వే చేస్తున్నప్పుడు ఉత్పన్నమైన సమస్యలను అత్యంత ప్రణాళికా బద్ధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. – ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేలా, వారి భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలి. – ఈ సర్వే ద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన అవుతుంది. – రికార్డులు, డేటా అంతా కూడా స్వచ్ఛీకరణ జరుగుతుంది. – ఈ అంశాలను అధికారులు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. – రీ సర్వే ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కారణంతో చాలామంది ఈ కార్యక్రమంపై దుష్ప్రచారం చేస్తున్నారు. అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. – 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నాం, దీనికోసం కొన్ని వేల మందిని రిక్రూట్ చేసుకున్నాం. అత్యాధునిక పరికరాలను కోట్లాది రూపాయలు ఖర్చుచేసి కొనుగోలు చేశాము. – దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవ్వరూ కూడా వేలెత్తి చూపని విధంగా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. – దోషాలతో, తప్పులతో ఒక్క హక్కు పత్రం కూడా రైతులకు వెళ్లకూడదు. – సంబంధిత గ్రామ సచివాలయంలో సర్వే పూర్తికాగానే అక్కడే రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా ఏర్పాటయ్యేలా చూడాలి. – సర్వే పూర్తైన తర్వాత ప్రతీ గ్రామంలో ఆర్డీఓలు, జేసీలు హక్కుపత్రాలను తనిఖీలు చేయాలి. – ఉన్నతాధికారులు గ్రామాల్లో సందర్శించడం వల్ల అందరూ కూడా బాధ్యతాయుతంగా తమ పనులు నిర్వర్తిస్తారు. అలాగే సిబ్బందిలో జవాబుదారీతనం కూడా వస్తుంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మార్గదర్శకాలు రూపొందించుకుంటాము.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తప్పులు, పొరపాట్లు లేని విధంగా హక్కు పత్రాలు జారీచేస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే, భూ సర్వే ప్రక్రియలో ఏ దశలో అభ్యంతరాలు వ్యక్తమైనా వాటిని పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేస్తామన్నారు. ఈ సర్వే పూర్తిచేయడం ద్వారా భూ యజమానుల హక్కులను తరతరాలపాటు కాపాడుగలుగుతామని, ఆక్రమణలు, కబ్జాలు, రికార్డుల్లో అవకతవకలు ఇలాంటి వాటికి పూర్తిస్థాయిలో చెక్ పడుతుందని వెల్లడించారు. కేవలం ఐదు సెంటీమీటర్ల వ్యత్యాసంతో కచ్చితమైన పద్ధతుల్లో సర్వే జరుగుతుందని అధికారులు తెలిపారు. భూ యజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారిని పూర్తిస్థాయిలో సంతృప్తపరిచే పద్ధతుల్లో సర్వే జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ 6,037 గ్రామాల్లో డ్రోన్లను ఎగురవేశామని, ఇందులో 1,545 గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు కూడా ఖరారయ్యాయని అన్నారు. ప్రతీనెలా 13,335 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని లక్ష్యంగా చేసుకుని సర్వే చేస్తున్నామన్న అధికారులు తెలిపారు. డ్రోన్లు ఎగురవేయడానికి అనువుగాలేని ప్రాంతాల్లో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా సర్వే చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. నవంబర్ మొదటివారంలో తొలివిడత గ్రామాల్లో హక్కుపత్రాలను అందిస్తామని, ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. అర్బన్ ప్రాంతాల్లోనూ సర్వే.. అలాగే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని 15,02,392 ఎకరాల్లో సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తైన తర్వాత ఇక్కడ కూడా పత్రాలను అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు.. వచ్చే జనవరిలో సర్వే ప్రక్రియ ప్రారంభించి మే నెల నుంచి హక్కుపత్రాల పంపిణీ ప్రారంభమయ్యేలా ముందుకుసాగుతామన్నారు. ఆగస్టు 2023 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకున్నామని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ (సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్) కమిషనర్ సిద్దార్ధ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ ఎండీ ఇంతియాజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ వి రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సర్వేశ్వర నేత్రం.. పరిష్కారం కానున్న భూ వివాదాలు
సాక్షి, నరసరావుపేట: దశాబ్దాలుగా అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డులను ప్రక్షాళించి, రైతులకు సంపూర్ణ భూహక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష రీసర్వే పల్నాడు జిల్లాలో జోరుగా సాగుతోంది. చెదలు పట్టిన భూ రికార్డులు, ఎవరి భూములు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితిలో అడ్డూఅదుపూలేని అక్రమాలు ఓ వైపు, న్యాయపరమైన చిక్కులు మరోవైపు. వీటన్నింటికీ పరిష్కారం చూపి రైతులు భూవివాదాల నుంచి బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం భూ స్వచ్ఛీకరణకు రీ సర్వే ద్వారా శ్రీకారం చుట్టింది. సర్వే తర్వాత ప్రతి రైతుకూ హద్దులు నిర్ణయించడంతోపాటు రాళ్లను పాతి ప్రత్యేక నంబర్లను కేటాయించనుంది. 1904 తర్వాత... ఆంగ్లేయుల పాలనలో 1904లో చివరి సారిగా పూర్తి స్థాయిలో భూ సర్వే జరిపి రికార్డులు పొందుపరిచారు. ప్రతి 30 ఏళ్లకు ఓసారి సర్వే అండ్ రీ సెటిల్మెంట్ జరగాల్సి ఉన్నా, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ పూర్తిస్థాయిలో చేయలేదు. రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టేలా రికార్డుల స్వచ్ఛీకరణతోపాటు భూ రీసర్వేకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడంతో దశాబ్దాలుగా ఉన్న భూ చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. డ్రోన్ల ద్వారా సర్వే.. రాళ్లతో హద్దులు సర్వే చేపడుతున్న గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రికార్డులను ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మొదటగా డ్రోన్ కెమెరాలతో పాయింట్లను గుర్తిస్తున్నారు. ఆ పాయింట్లు, రోవర్ ఆధారంగా పొలాల్లోకి దిగి మాన్యువల్ సర్వే చేపడుతున్నారు. ప్రతి సర్వే నంబర్‌కు హద్దులు గుర్తించి రాళ్లు పాతుతున్నారు. ప్రస్తుతం 10 వేల హద్దు రాళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని అక్టోబర్ 15నాటికి పాతనున్నారు. 26 గ్రామాల్లో కొత్త హక్కుపత్రాలు జిల్లాలో ల్యాండ్ అండ్ సర్వే అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు సమన్వయంతో సర్వే ప్రక్రియ చేపడుతున్నారు. మొదటి దశలో జిల్లాలో 81 రెవెన్యూ గ్రామాల్లో 1,98,680 ఎకరాలను క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,38,024 ఎకరాల సర్వే పూర్తయింది. తొలివిడతగా 26 గ్రామాల్లోని 7,145 మంది రైతులకు అక్టోబర్ 2 నుంచి కొత్త హక్కు పత్రాలు అందజేయనున్నారు. జిల్లాలో రెండు డ్రోన్లు, 51 రోవర్ల సహాయంతో రీ సర్వే జరుగుతోంది. 300 మంది విలేజ్ సర్వేయర్లను పది బృందాలుగా ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికీ ఓ సర్వేయర్, ముగ్గురు డెప్యూటీ సర్వేయర్లు పనిచేస్తున్నారు. పూర్తిస్థాయిలో స్వచ్ఛీకరణ వందేళ్ల తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో భూముల రీ సర్వే జరుగుతోంది. ఎవరు సాగు చేస్తున్నారు, హద్దులేంటి, ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అన్న విషయాలను సమగ్రంగా పరిశీలించి రికార్డులను స్వచ్ఛీకరిస్తున్నాం. పూర్తి పాదర్శకంగా, వివాదాలు పరిష్కారమయ్యేలా సర్వే జరుగుతోంది. ఒక్కో రెవెన్యూ గ్రామంలో భూ సర్వే పూర్తికావడానికి 3, 4 నెలలు పడుతోంది. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్టోబర్ 2 నుంచి క్యూఆర్ కోడ్ కలిగిన భూహక్కు పత్రాలు, మ్యాప్‌లను రైతులకు అందజేయనున్నాం. ఆయా గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లోనే భూముల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. – శ్యాం ప్రసాద్, జాయింట్ కలెక్టర్, పల్నాడు జిల్లా