Jagmeet Singh
-
Canada: ట్రూడో ప్రభుత్వానికి ముప్పు
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి ఊహించని గట్టి దెబ్బ తగిలింది. ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ బుధవారం ప్రకటించారు. 2022లో తమ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి తప్పుకొంటున్నట్లు జగ్మీత్ తెలిపారు. తన నిర్ణయాన్ని ఇప్పటికే ప్రధానికి తెలియజేశానని చెప్పారు. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది. హౌస్ ఆఫ్ కామన్స్లో బల పరీక్షలో నెగ్గాలంటే ఇతర ప్రతిపక్షాల మద్దతు ట్రూడోకు తప్పనిసరి. అయితే కన్జర్వేటివ్లను ట్రూడో ఎదుర్కోలేకపోతున్నారని జగ్మీత్ విమర్శించారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా స్వార్థపరులతో నిండిపోయిందని, కార్పొరేట్ ప్రపంచానికి కొమ్ముకాస్తోందని జగ్మీత్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను ప్రధాని పదవికి పోటీ చేస్తానని జగ్మీత్ తన మనసులో మాట బయటపెట్టారు. 52 ఏళ్ల ట్రూడో తొలిసారిగా 2015 నవంబరులో బాధ్యతలు చేపట్టారు. గత రెండేళ్లుగా అధిక ద్రవ్యోల్బణం,గృహనిర్మాణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత రెండు ఎన్నికలలోనూ లిబరల్స్ మెజారిటీ సాధించలేదు. ఎన్డీపీ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ట్రూడో పాలిస్తున్నారు. 2015 నవంబర్లో తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన ట్రూడో పట్ల ప్రస్తుతం ఓటర్లలో వ్యతిరేకతతో ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే తాను ఘోరంగా ఓడిపోతానని సర్వేలు చెబుతున్న తరుణంలో పార్లమెంటు దిగువ సభలో విశ్వాస పరీక్షలో నెగ్గడానికి ట్రూడో ప్రతిపక్ష సభ్యుల మద్దతుపై ఆధారపడాల్సి వస్తుంది. కెనడా చట్టం ప్రకారం 2025 అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలి. సెప్టెంబర్ 16న హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ట్రూడో ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోతే సార్వత్రిక ఎన్నికలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల వార్తలను ట్రూడో తోసిపుచ్చారు. న్యూ ఫౌండ్ ల్యాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రూడో మీడియాతో మాట్లాడారు. కెనడియన్లకు సేవలందించడంపై తాను ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఆయన చెప్పారు. ఇతర రాజకీయాలపై దృష్టి పెట్టబోమని ఆయన స్పష్టంచేశారు. వచ్చే సంవత్సరమే ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. దానివల్ల తమ ప్రభుత్వం సొంత ఎజెండాతో ముందుకు సాగడానికి సమయం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
'జగ్మీత్ సింగ్ అంశం నన్ను బాధించింది'
కెనడా : న్యూ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ) అధినేత జగ్మీత్ సింగ్ బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి చెందిన సభ్యుడి పట్ల వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు బుధవారం పార్లమెంటు నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా జగ్మీత్సింగ్కు తాను మద్దతుగా ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం తెలిపారు. కెనడాలో ఫెడరల్ పార్టీకీ నాయకత్వం వహించిన మొదటి సిక్కు సభ్యుడిగానూ, మైనారిటీగానూ జగ్మీత్ సింగ్ నిలిచారు. కాగా దేశంలోని ఫెడరల్ పోలీస్ ఫోర్స్ దైహిక జాత్యహంకారాన్ని గుర్తించడానికి ఎన్డీపీ మోషన్లో సంతకం చేయాలంటూ వేర్పాటువాద సంస్థ బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి చెందిన నేతను బుధవారం జగ్మీత్ సింగ్ అడిగారు. మోషన్లో సంతకం చేయడానికి బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ ఒప్పుకోకవడంతో జగ్మీత్ గొడపడ్డారు. దీంతో జగ్మీత్ పార్లమెంట్ నుంచి తాత్కాలిక బహిష్కరణకు గురయ్యారు. ఈ అంశంపై ట్రూడో స్పందిస్తూ..' బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ వర్ణ వివక్షపై సంతకం చేయడానికి నిరాకరించడం నిరాశపరిచింది. మన దేశంలో ప్రతి భాగంలోనూ, ప్రతి సంస్థలోనూ దైహిక జాత్యహంకారం ఉంది. ఆ వివక్షతను గుర్తించి, దాన్ని పరిష్కరించడమే మొదటి అడుగుగా భావించాలి.దీనిపై ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ చేసిన సూచనకు తాను మద్దతుగా ఉన్నా. ఒకే దేశంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ఇలాంటి మంచి విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఎన్డీపీ మోషన్పై సంతకం చేయడానికి నిరాకరించిన బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి చెందిన నేతతో జగ్మీత్ గొడవపడ్డారు. దీంతో క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన జగ్మీత్ను పార్లమెంట్ చాంబర్ నుంచి బహిష్కరించారు. జగ్మీత్ క్షమాపణ చెబుతారనే అనుకుంటున్నా.. ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోతే హౌస్ ఆఫ్ కామన్ అధ్యక్షుడు కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. పరిస్థితి అంతదూరం వెళ్లదనే నేను అనుకుంటున్నా.' అంటూ తెలిపారు. ('ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చైనా సిద్ధం') మొత్తం 338 సీట్లలో జగ్మీత్ నేతృత్వంలోని ఎన్డీపీకి 24 సీట్లు, వేర్పాటువాద సంస్థ బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి 32 సీట్లు ఉన్నాయి. గత నెలలో జాత్యంహకార దాడిలో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ప్లాయిడ్కు మద్దతుగా వర్ణ వివక్షను రూపుమాపాలని, కెనడియన్ పోలీస్ వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావాలంటూ పార్లమెంట్లో ఎన్డీపీ తన పోరాటం కొనసాగిస్తుంది. -
తిట్టేందుకు వచ్చిన ఆమె తిక్కకుదిర్చాడు
ఒంటారియో: అమెరికాలోని బ్రాంప్టన్లో ఓ సిక్కు పౌరుడు, చట్టసభ ప్రతినిధికి జాత్యహంకార వ్యాఖ్యల దాడి తప్పలేదు. ఆయన ఆ మాటలకు తగిన బదులు ఇచ్చి పలువురి మనసులు దోచుకున్నాడు. ఆగ్రహంతో తనపైకి వచ్చిన ఓ అమెరికా మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ అతను ఏ మాత్రం సహనం కోల్పోకుండా సంయమనంగా వ్యవహరించడమే కాకుండా ఆమె కళ్లు చెదిరే సమాధానం ఇచ్చే సభికులతో షబాష్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జగ్మీత్ సింగ్ అనే వ్యక్తి కెనడాలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ(ఎన్డీపీ)ని స్థాపించి నడుపుతున్నాడు. ఆయన ఒక చట్టసభ ప్రతినిధి కూడా. ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా బ్రాంప్టన్ అనే పట్టణానికి వచ్చిన ఆయన సభ ముందు కొలువై ఉన్న వారిని సంబోధిస్తూ మాట్లాడే సమయంలోనే ఒక మహిళ అడ్డు తగిలింది. ఆమెను జెన్నిఫర్ అనే మహిళగా గుర్తించారు. నేరుగా వేదికపైకి వచ్చి 'మాకు తెలుసు నువ్వు ముస్లిం సోదరభావంతో ఉన్నావు' అంటూ ఆమె మొదలుపెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. అయితే, అక్కడ ఉన్నవారంతా ఆమెను సముదాయించే ప్రయత్నం చేయగా వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఆమె మాటలు విన్నతర్వాత ఆమెను నేరుగా అనకుండా ' మేం ప్రేమను, ధైర్యాన్ని నమ్ముతాం.. జాత్యహంకారాన్ని ప్రదర్శించం.. ఒక మంచిపనికి మేం జాత్యహంకారాన్ని పూయబోము.. ప్రేమను ఎలా పంచుతారో చెప్పేందుకు ముందుకు రండి.. అప్పుడైతే మేం మీకు స్వాగతం పలుకుతాం. మిమ్మల్ని ప్రేమిస్తాం. మీకు మద్దతిస్తాం' అంటూ ఆయన అన్నారు. ఈ మాటలు విన్న అక్కడి వారంతా కూడా ముగ్దులైపోయారు.