Jagran
-
పనిసంస్కృతి లేకే వెనకబడ్డాం
న్యూఢిల్లీ: గతంలో ఘనమైన పేర్లున్న నేతలు పాలించినప్పటికీ సరైన పని సంస్కృతి లేని కారణంగానే దేశం వెనుకబాటుకు గురైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. దైనిక్ జాగరణ్ మీడియా గ్రూప్ శుక్రవారం నిర్వహించిన ‘జాగరణ్ ఫోరం’లో ఆయన ప్రసంగించారు. ‘ఘనమైన పేర్లున్న నేతలు గతంలో అధికారం చేపట్టారు. కానీ, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారు’ అని నెహ్రూ–గాంధీ కుటుంబం గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘గత నాలుగేళ్లలో సంభవించిన మార్పును మీకై మీరే చూశారు. గతంలో ఇలా జరగలేదు. ప్రజలు, అధికారులు, యంత్రాంగం అప్పటికీ ఇప్పటికీ మారనప్పటికీ పని సంస్కృతి లేని కారణంగానే దేశం వెనుకబడింది. గత పాలకులు పేదరికాన్ని పారదోలి ఉన్నట్లయితే గరీబీ హఠావో నినాదాన్ని ఎందుకు ఇచ్చి ఉండేవారు? అది కచ్చితంగా ఓటు బ్యాంకు రాజకీయమే’ అని ప్రధాని అన్నారు. నిరుపేదలకు కనీస అవసరాలైన మరుగుదొడ్లు, వంటగ్యాస్, విద్యుత్, బ్యాంకు అకౌంట్, సమకూర్చి ఉంటే వారు తమంతట తామే పేదరికం నుంచి బయటపడి ఉండేవాళ్లు అని ఆయన తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో భారీ లక్ష్యాలను సాధించేలా పెద్ద నిర్ణయాలు తీసుకునే సాహసం తమ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కంటే తమ ప్రభుత్వంలోనే పన్ను చెల్లింపు దారులు, జీఎస్టీ ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పెరిగారన్నారు. పారిపోయిన ఆర్థిక మోసగాళ్లను తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
జగ్రాన్ చలనచిత్రోత్సవం ప్రారంభం
ముంబై: అంతర్జాతీయ చిత్రోత్సవం జగ్రాన్ నగరంలోని అంధేరీలో బుధవారం ప్రారంభమైంది. తొలి సినిమాగా ఇజ్రాయిల్-పాలస్తీనా చిత్ర నిర్మాత రూపొందించిన ‘వాటర్’ను ప్రదర్శించారు. అంధేరీలోని ఫన్ రిపబ్లిక్ సినిమా హాలులో నటుడు అక్షయ్‌కుమార్, నటి నిమ్రత్‌కౌర్ (లంచ్‌బాక్స్ ఫేం)లు జ్యోతి వెలిగించి ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ చలన చిత్రోత్సవం ఆరు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు వాటర్‌తో పాటు హకో చెకో టర్కిష్ చిత్రం ‘నో వేర్ లి వీర్’, సంజయ్జాదవ్ చిత్రం ‘ధునియాదరి’, కుందన్‌షా చిత్రం జానే బీ దో యారోలను ప్రదర్శించారు. ఉత్సవాన్ని ప్రారంభించిన అక్షయ్‌కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘చలన చిత్ర పరిశ్రమ ఆదరించి అక్కున చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చలన చిత్రోత్సవాలకు హాజరైన సందర్భంగా అన్ని రకాల చిత్రాలను చూడడానికి అవకాశం లభిస్తుంది. ప్రపంచ సినిమా రీతులను తెలుసుకోవడానికి ఇష్టపడతాను’’ అని తెలిపాడు. నిమ్రత్‌కౌర్ మాట్లాడుతూ ‘‘తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఓ చిత్రం రూపొందించాను. ఇందులో మిధున్ చక్రవర్తిగారితో నేను నటించాను. ఇందులో నేను నటించిన హర్యాన్వీ పాత్ర ఇప్పటి వరకు హిందీ చలన చిత్రాల్లో ఎవరూ చేయలేదు. ఇది చిన్న చిత్రమైనా ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని తెలిపింది. నమ్రత చిత్రం భారతదేశం తరఫున పోటీలో ఉంటుందని ఆశించినా.. గుజరాత్‌కు చెందిన ‘ది గుడ్ రోడ్’ ఎంపికైంది. ఈ చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖులు అనిల్ శర్మ, సుధీర్ మిశ్రా, సునీల్ ప్రభు ముంబై మేయర్ తదితరులు హాజరయ్యారు.