jail break
-
మొజాంబిక్‌లో జైల్ బ్రేక్
మపుటో: మొజాంబిక్‌లో ఎన్నికల అనంతర హింస చల్లారడం లేదు. రాజధాని మపుటో శివార్లలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో కూడిన సెంట్రల్ జైల్లో బుధవారం అల్లర్లు చెలరేగాయి. పోలీసు సిబ్బంది నుంచి కొందరు ఖైదీలు ఆయుధాలు లాక్కుని తోటివారిని విడిపించడం మొదలు పెట్టారు. అల్లర్లు, తిరుగుబాటును అణిచేందుకు భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో 33 మంది మృతి చెందారు. 15 మందికి పైగా గాయపడ్డట్టు ప్రాథమిక సమాచారం. ఆ క్రమంలో జైలు గోడ కూలిపోవడంతో ఏకంగా 6,000 మందికి పైగా జైలు నుంచి తప్పించుకున్నట్టు దేశ పోలీసు జనరల్ కమాండర్ బెర్నార్డినో రఫెల్ తెలిపారు. వారిలో 150 మందిని పట్టుకున్నామన్నారు. ‘‘నేరారోపణలు రుజువైన 29 మంది కరడుగట్టిన ఉగ్రవాదులను కూడా ఖైదీలు విడిపించుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో రెండు జైళ్లలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి’’అని వివరించారు. ఖైదీలు జైలు నుంచి పారిపోతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ఫ్రెలిమో పార్టీ విజయం సాధించింది. ఫలితాలను నిరసిస్తూ అప్పట్నుంచే దేశమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. అధికార పార్టీ విజయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ధ్రువీకరించింది. దాంతో ఒక్కసారిగా అల్లర్లు తీవ్రతరమయ్యాయి. వాటిలో ఒక్క రోజే కనీసం 21 మంది మరణించినట్టు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. -
అమెరికాలో జైల్లో ఖైదీల బీభత్సం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత పటిష్టమైన భద్రత ఉంటే సెయింట్ లూయిస్ జైల్లో ఖైదీలు శనివారం తెల్లవారుజామున బీభత్సం సృష్టించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖైదీల పరామర్శకు వచ్చే బంధువులను పరిమితంగానే అనుమతిస్తున్నారు. ఖైదీల కేసుల్లో కోర్టు విచారణలు సైతం నిలిపివేశారు. దీంతో వారంతా అసహనానికి గురయ్యారు. జైలు నాలుగో అంతస్తులో కిటికీలను, పైప్‌లను ధ్వంసం చేశారు. కుర్చీలు, మంచాలు, పరుపులకు నిప్పు పెట్టారు. జైలు అధికారులతో ఘర్షణకు దిగారు. వారిని శాంతింపజేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఉదయం 10 గంటలకల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అర్పివేశారు. ఈ జైల్లో 633 మంది ఖైదీలు ఉండగా, దాదాపు 115 మంది బీభత్సం సృష్టించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఘటనలో ఖైదీలెవరూ గాయపడలేదు. ఓ అధికారి స్వల్పంగా గాయపడగా, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. సెయింట్ లూయిస్ జైలు నుంచి 65 మంది ఖైదీలను డౌన్‌టౌన్ జైలుకు తరలించారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై అదనపు చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. -
జైలు నుంచి హెలికాఫ్టర్‌లో గజదొంగ పరారీ
పారిస్: పెద్ద పెద్ద దోపిడీలకు పాల్పడిన ఓ గజదొంగ ధైర్యంగా జైలు నుంచి తప్పించుకున్నాడు. అది ఎలాగంటే ఏకంగా హెలికాఫ్టర్ తెప్పించుకుని పరారయ్యాడు. ఈ సంఘటన ఫ్రాన్స్ దేశంలోని పారిస్‌లో జరిగింది. పారిపోయేటపుడు మరో ముగ్గురు ఖైదీలను కూడా వెంటబెట్టుకుని తీసుకుపోయాడు. ఫ్రాన్స్‌లోని క్రెయిల్ ప్రాంతానికి చెందిన ఫెయిద్ రెడోయిన్(46) చిన్నప్పటి నుంచే చిన్న దొంగతనాలకు పాల్పడేవాడు. ఫెయిద్ యవ్వనమంతా నేరమయమే. 2010 సంవత్సరం మే నెలలో ఆయుధాలతో కలిసి దోపిడీ పాల్పడ్డాడు. ఆ సమయంలో పోలీసులకు, ఫెయిద్ సహచరులకు మధ్య తుపాకి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారిణి కూడా చనిపోయింది. ఆ తర్వాత ఫెయిద్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఫెయిద్కు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఫెయిద్ 2013లో జైలు తప్పించుకునేందకు పథకం రచించాడు. డైనమైట్లు ఉపయోగించి జైలు గోడలు బద్దలు కొట్టి తప్పించుకున్నాడు. ఆరు వారాల తర్వాత పోలీసులు ఫెయిద్ను మళ్లీ పట్టుకున్నారు. ఈ సారి జైలు నుంచి తప్పించుకునేందుకు ఏకంగా హెలికాఫ్టర్‌నే వాడుకున్నారు. ఆదివారం నాటి సంఘటనలో ఆయుధాలతో హెలికాప్టర్లో వచ్చిన ఫెయిద్ అనుచరులు చాకచక్యంగా నిమిషాల్లో జైలు నుంచి తప్పించుకున్నారు. తప్పించుకునేందుకు వాడిన హెలికాప్టర్‌ను పారిస్ శివార్లలో పోలీసులు తర్వాత కనుగొన్నారు. పారిపోయిన వారి కోసం పోలీసులు పారిస్ అంతా జల్లెడ పడుతున్నారు. ఫెయిద్ గతంలో పలు టీవీ ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. అలాగే రెండు పుస్తకాలకు సహ రచయితగా కూడా వ్యవహరించాడు. స్కార్ఫేస్, హీట్ అనే రెండు హాలీవుడ్ సినిమాలు తన జీవితం నేరమయం కావడానికి ప్రేరేపించాయని ఒకానొక సందర్భంలో ఫెయిద్ చెప్పినట్లు తెలిసింది. -
పోలీసుల దుస్తుల్లో వచ్చారు.. వస్తూనే.. !
-
పోలీసుల దుస్తుల్లో వచ్చారు.. వస్తూనే.. !
అమృతసర్: కరుడుగట్టిన ఖలీస్థాన్ ఉగ్రవాది హర్మిందర్ సింగ్ మింటూ జైలు నుంచి పరార్ కావడంతో పంజాబ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. పెద్దసంఖ్యలో వచ్చిన సాయుధులు నబా జైలుపై దాడి చేసి.. హర్మిందర్ సింగ్‌తోపాటు మరో నలుగురు గ్యాంగ్స్టర్లను విడిపించుకుపోయారు. ఈ సందర్భంగా వందరౌండ్లకుపైగా కాల్పులు జరిపినట్టు సమాచారం. సాయుధులు దాడి చేసి.. అత్యంత భద్రత నడుమ ఉన్న కీలక తీవ్రవాద సూత్రధారిని జైలు నుంచి విడిపించుకొనిపోవడం తీవ్ర భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన, అనంతర పరిణామాలపై పంజాబ్ డీజీపీ, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్బీర్సింగ్ బాదల్ భేటీ అయి చర్చించారు. మరోవైపు ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనపై పలు వివరాలు తెలిపారు. దాదాపు 20 మంది సాయుధులు పోలీసు దుస్తుల్లో జైలును ముట్టడించారని, వస్తూనే పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతూ విరుచుకుపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాయుధుల్లో ఒకడు ఏఎస్ఐ యూనిఫాం వేసుకోగా, మిగతావారు పోలీసు దుస్తులు వేసుకున్నారని చెప్పారు. మరోవైపు తప్పించుకుపోయిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. గస్తీని ముమ్మరం చేశారు. -
జైలుపై దాడి.. తీవ్రవాద చీఫ్ పరార్
-
ఫ్లాష్: జైలుపై దాడి.. తీవ్రవాద చీఫ్ పరార్
భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిది సిమీ ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయి.. ఆ తర్వాత హతమైన ఘటనను మరిచిపోకముందే.. పంజాబ్‌లో పోలీసు దుస్తుల్లో వచ్చిన సాయుధులు ఒక జైలుపై విరుచుకుపడ్డారు. పంజాబ్‌లోని నభా జైలుపై 10మంది సాయుధులు దాడి చేసి.. ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతోపాటు మరో నలుగురిని విడిపించుకొని తీసుకెళ్లారు. మింటూతోపాటు పరారైన నలుగురు కూడా గ్యాంగ్‌స్టర్లే కావడం గమనార్హం. గుర్ప్రీత్ సింగ్, విక్కీ గోండ్రా, నితిన్ డియోల్, విక్రమ్‌జీత్ సింగ్ అలియాస్ విక్కీ జైలు నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఖలీస్థాన్ చీఫ్‌ను జైలు నుంచి విడిపించుకొని వెళ్లేందుకే ఈ దాడి జరిగినట్టు భావిస్తున్నారు. ఖలీస్థాన్ చీఫ్ జైలు నుంచి పరార్ కావడంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పంజాబ్‌లో వేర్పాటువాద చిచ్చును రగిలిస్తున్న ఖలీస్థాన్ చీఫ్‌ను 2014 నవంబర్‌లో ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పంజాబ్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు మింటూ పాకిస్థాన్ ఐఎస్ఐ నుంచి థాయ్‌లాండ్‌లో శిక్షణ పొందాడని పోలీసులు గుర్తించారు. -
ఈజిప్టులో ఆగని హింస
కైరో: పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీకి మద్దతుగా ముస్లిం బ్రదర్హుడ్ సాగిస్తున్న నిరసనలను ఒకవైపు ప్రభుత్వ బలగాలు అణచివేసేందుకు ప్రయత్నిస్తుండగా, మరోవైపు మిలిటెంట్లు సైతం ప్రభుత్వ బలగాలపై తిరగబడుతుండటంతో ఈజిప్టులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈజిప్టులోని సరిహద్దు నగరమైన రఫాలో మిలిటెంట్లు జరిపిన దాడిలో 25 మంది పోలీసులు మరణించారు. పోలీసులపై దాడిని ఈజిప్టు తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మరోవైపు కైరో జైలులో ఉన్న 612 మంది తమ సభ్యులను విడిపించేందుకు ముస్లిం బ్రదర్హుడ్ సభ్యులు విఫలయత్నం చేశారని, వారి దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయని అధికార వర్గాలు చెప్పాయి. వారిని అబు జాబాల్ జైలుకు తరలిస్తుండగా, సాయుధలైన ముస్లిం బ్రదర్హుడ్ సభ్యులు దాడికి దిగారని, ఖైదీల్లో కొందరు ఒక మిలటరీ అధికారిని బందీగా పట్టుకున్నారని తెలిపాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలకు, ‘బ్రదర్హుడ్’ సభ్యులకు నడుమ జరిగిన పరస్పర కాల్పుల్లో, తొక్కిసలాటలో 36 మంది ఖైదీలు (బ్రదర్హుడ్ సభ్యులు) మరణించారని ఈజిప్టు అంతర్గత వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఖైదీలు ట్రక్కులో ఉండగానే ప్రభుత్వ బలగాలు వారిని కుట్రపూరితంగా హత్య చేశాయని, ‘బ్రదర్హుడ్’ ఆరోపించింది. అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. ముబారక్ విడుదలకు కోర్టు ఆదేశాలు: పదవీచ్యుత ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ విడుదలకు కైరోలోని ఒక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఒక అవినీతి కేసులో ముబారక్‌పై విచారణ పెండింగులో ఉండగా, ఆయన విడుదలకు కోర్టు ఆదేశించడం గమనార్హం. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ముబారక్ ఈ వారంలోనే విడుదల కానున్నారు. ముబారక్ విడుదలతో ఈజిప్టులో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.