jaipur mandal
-
మంచిర్యాల: ప్రేమ వ్యవహారం.. పెళ్లి తర్వాత కూడా మహేశ్, శ్రుతి మధ్య సంబంధం
మంగళవారం ఉదయం సుమారు 8.20గంటలు.. జైపూర్ మండలం ఇందారం గ్రామం.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. గ్రామానికి చెందిన ముస్కే మహేశ్(27) మోటార్‌సైకిల్‌పై వెళ్తున్నాడు. అతడిపై కక్ష పెంచుకున్న కుటుంబం నడిరోడ్డుపై అడ్డుకున్నారు. అందరూ చూస్తుండగానే నలుగురు కలిసి కత్తి, ఇటుక, బండరాయితో మహేశ్ తలపై బాదుతూ విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అప్పటి దాకా ప్రశాంతంగా గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. తీవ్ర రక్తస్రావంతో ఆ యువకుడు కొద్ది సేపటికే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడున్న వారు ఎవరూ అడ్డుచెప్పలేదు. అనంతరం దాడి చేసిన నలుగురు ఓ ఆటోలో ఎక్కి మంచిర్యాల వైపు పారిపోయారు. దాడి దృశ్యాలను ఆ సమయంలో అక్కడున్న వారు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో జిల్లా వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ► ఈ నెల 11న ఉదయం 11.15గంటలకు మందమర్రి మండలం రామక్రిష్ణాపూర్ పరిధి గద్దెరాగిడిలోని చాకలివాడలో రియల్ వ్యాపారి నడిపెల్లి లక్ష్మీకాంతారావు(63) దారుణంగా హత్యకు గురయ్యాడు. భూ వివాదాల కారణంగా ఈ హత్య జరిగింది. పలు భూ వివాదాలు ఉండడంతో ప్రత్యర్థులు పక్కా ప్లాన్ వేసి చంపేశారు. ► గత డిసెంబర్ 16న మందమర్రి మండలం గుడిపల్లి శివారు వెంకటాపూర్‌లో ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో ఆరుగురు సజీవ దహమయ్యారు. ఇందులో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు సైతం కాలి బూడిదయ్యారు. తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడనే కోపంతో మహిళ మరో ఇద్దరితో కలసి పక్కాప్లాన్‌తో దాడి చేసి చంపింది. ఈ ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం రేపింది. ఒక్కరిపై కోపంతో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. పలు వివాదాలు, భూ తగాదాలు కక్షలతో ఏకంగా మనుషుల ప్రాణాలే తీస్తున్నాయి. తాజాగా ఇందారం గ్రామంలో జరిగిన ఘటనలో యువతీ, యువకుల ప్రేమ వ్యవహారం.. విభేదాలే కారణం. ఇందారం గ్రామం నజీర్పల్లికి చెందిన ముస్కే మహేశ్, ఇదే గ్రామానికి చెందిన పెద్దపల్లి శృతి చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో శృతి సీసీసీకి చెందిన పెంట శివను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా మహేశ్, శృతి మధ్య సంబంధం కొనసాగడం, ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో అటు భర్త కుటుంబం, ఇటు యువతి కుటుంబంలో చిచ్చురేపింది. భార్య తీరుతో భర్త శివ కలత చెంది విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకోవడం వారి ఇంట విషాదాన్ని నింపింది. ఇటు శృతి పుట్టింటికి చేరింది. పోలీసుస్టేషన్లో కేసులు నమోదు కావడం, వేధింపులు పెరగడంతో యువతి కుటుంబం పగ పెంచుకుంది. తెలిసీ, తెలియక చేసిన తప్పులతో అనేక కుటుంబాల్లో ఘర్షణకు దారి తీస్తున్నాయి. కక్షలతో రగిలిపోతూ.. ఇటీవల జరిగిన ఘటనలతో గొడవలు ఏవైనా కక్షలతో రగిలిపోతూ చంపేవరకు సాహసం చేస్తున్నారు. తర్వాత జరిగే పరిణామాలను లెక్కచేయడం లేదు. అనంతరం జైలు పాలవుతున్నారు. ఆవేశంలో చేసే తప్పులతో ఎంతోమంది కుటుంబాల్లో తీరని నష్టం చేకూరుస్తోంది. తర్వాత న్యాయస్థానాలు, జైలు జీవితం గడుపుతున్నారు. దీంతో తమ పిల్లల భవిష్యత్తుపైనా ప్రభావం పడుతోంది. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. -
ఉలిక్కిపడిన మంచిర్యాల.. యువకుడి దారుణ హత్య.. ఇదీ జరిగింది!
మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత నెలకొంది. హత్యకు గురైన మహేష్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. కనకయ్య కుటుంబానికి పోలీసులు మద్దతు ఇవ్వడం వల్లనే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. పోలీసుల వైఫల్యం వల్లే కొడుకు హత్య జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. (సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం.. ముక్కున వేలేసుకున్న కార్యకర్తలు) పోలీసుల భారీ బందోబస్తు మహేష్ బంధువుల ఆందోళన నేపథ్యంలో స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యువకుడి హత్య కేసులో ప్రమేయమున్న వారిపై చర్యలు తీసుకుంటామని జైపూర్ ఏసీపీ నరేందర్ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు మహేష్ బంధవులు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తరలించారు. (ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తా: వైఎస్ షర్మిల) అయిదుగురిపై కేసు మరోవైపు యువకుడి హత్య కేసులో అయిదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కనకయ్యతోపాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. కాగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని జైపూర్ మండలంలో ఇందారంలో మహేష్ అనే యువకుడిని కత్తులతో దాడి చేసి, బండరాళ్లతో మోదీ హత్య చేసిన ఉదంతం తెలిసిందే. పట్టపగలు అందరూ చూస్తుండగానే బాధితురాలి కుటుంబ సభ్యులు అత్యంత కిరాతకంగా అతడిని అంతమొందించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో సంచలనంగా మారింది. ఇదీ జరిగింది.. ఇందారం గ్రామానికి చెందిన కనకయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెతో ఎం. మహేశ్(24) అనే యువకుడు ప్రేమ వ్యవహారం సాగించాడు. గతేడాది యువతి తల్లిదండ్రులు మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. పైళ్లైనా కూడా మహేష్‌ను వివాహితను వదిలిపెట్టలేదు. యువతిపై కక్ష పెంచుకొని.. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను తన భర్తకు పంపాడు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం యువతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి యువతి తన పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. భర్త చనిపోయినా కూడా మహేష్ వేధింపులు ఆపలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు యువకుడిపై జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. పలుమార్లు యువతిని మహేష్ వేధిస్తూ వచ్చాడు. కూతురు కాపురం విచ్చిన్నం చేసి.. అల్లుడు మృతికి కారణమైన మహేష్‌పై కనకయ్య పగ తీర్చుకోవాలనుకున్నాడు. యువకుడి ప్రాణం తీసేందుకు పథకం రచించాడు. ఈ క్రమంలో ఇంటిముందు బైక్‌పై వెళ్తున్న మహేష్‌పై కనకయ్య, ఆయన కుటుంబ సభ్యులు ఆయుధాలతో దాడి చేశారు. దీంతో అతడు కిందపడిపోవడంతో కనకయ్య, ఆయన బార్య, కూతురు, కుమారుడు బండరాళ్లతో మోదీ, కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. అయితే ఇంత దారుణం జరుగుతున్నా అడ్డుకోవడానికి స్థానికులెవరూ ప్రయత్నించకపోవడం గమనార్హం. హత్య దృశ్యాలను కొందరు ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనాస్థలాన్ని ఏసీపీ నరేందర్, ఎస్సై రామకృష్ణ పరిశీలించారు. (దొంగ తెలివి! పని మనిషిగా చేరిన 24 గంటల్లోనే దోపిడీ.. ఎప్పటిలా మళ్లీ సిటీకి) -
మంచిర్యాల: ఇందారంలో లైవ్ మర్డర్
సాక్షి, మంచిర్యాల: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. ఊరంతా చూస్తుండగానే ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణానికి తెగబడింది ఒకే కుటుంబంగా తెలుస్తోంది. వేధింపుల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం. ముస్కె మహేష్(28) అనే వ్యక్తి బైక్‌లో పెట్రోల్ కొట్టించుకుని వస్తున్న క్రమంలో.. అడ్డగించిన ఆ నలుగురు దాడికి దిగారు. గొంతు కోసి ఆపై బండ రాయితో తల పగలకొట్టారు. ఆ సమయంలో స్థానికులెవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. పైగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందారం గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, మహేష్‌కు నడుమ గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. ఆపై ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ యువతి తల్లి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో మహేష్ ఫోన్ ద్వారా అసభ్య మెసేజ్‌లతో వేధిస్తుండడంతో ఆ కుటుంబం భరించలేకపోయింది. ఎంత చెప్పినా అతని తీరు మారలేదు. ఈ క్రమంలో వివాహిత తన తల్లిదండ్రులు, సోదరుడితో మాటువేసి ఈ ఉదయం మహేష్‌ను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై విచారణ చేపట్టారు. మరోవైపు మహేష్‌ను చంపిన నలుగురిని తమకు అప్పగించాలంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఇంకోవైపు మహేష్ వేధింపులపై వివాహిత కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా మహేశ్ వేధింపులు ఆగకపోవడంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఈ దారుణానికి తెగబడినట్లు చెబుతున్నారు. -
జ్వరంతో చిన్నారి మృతి
జైపూర్(ఆదిలాబాద్): జ్వరంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని వేలాల గ్రామానికి చెందిన అంజిలి(5) పది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపుడతుంది. అయితే ఈ రోజు వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందింది. -
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
జైపూర్ : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జైపూర్ మండలంలోని ఖాజీపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్ము పురుషోత్తం యాదవ్(34) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, ఎస్సై సాధీక్ పాషా వివరాల మేరకు...కొమ్ము లస్మయ్య-దేవక్కలకు ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు పురుషోత్తంకు పదిహేనేళ్లక్రితం సుజాతతో పెళ్లి జరిగింది. వ్యవసాయ పనులు చేసుకుంటు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమారుడు సిద్దు(8) ఉన్నాడు. పంటల్లో సరైన దిగుబడి రాక నష్టం పోయిన పురుషోత్తం రెండేళ్లక్రితం దుబాయ్‌కి వెళ్లడానికి ప్రయత్నాలు చేశాడు. వీసా రాకపోవడంతో ఖాజిపల్లిలో కూలీ పనులు చేస్తున్నాడు. అతడి భార్య సుజాత మూడునెలలక్రితం పుట్టింటికి వెళ్లింది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో మద్యానికి బానిసయ్యాడు. తండ్రి లస్మయ్య పలు మర్లు చెప్పినా వినలేదు. శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. కొంత సమయం తర్వాత కుటుంబ సభ్యులు గమినించి 108 ద్వారా మంచిర్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాధీక్ తెలిపారు. -
విద్యార్థిని అనూష దారుణ హత్య
-
'ప్రేమించలేదని కత్తితో పొడిచి చంపాడు'
ఆదిలాబాద్ : ఓ ఉన్మాది ఘాతుకానికి మరో బాలిక బలైన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జైపూర్ మండలం కాన్కూరులో తొమ్మిదో తరగతి విద్యార్థిని అనూష దారుణ హత్యకు గురైంది. గ్రామంలో జులాయిగా తిరిగే రవి అనే యువకుడు గత కొంతకాలంగా అనూషను ప్రేమ పేరిట వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే అతని ప్రేమను తిరస్కరించిన అనూష....ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. రవిని కుటుంబ సభ్యులు మందలించినా అతనిలో మార్పు రాలేదు. గత రాత్రి స్నేహితురాలితో కలిసి ఇంట్లో చదువుకుంటున్న అనూషను పక్క పథకం ప్రకారం రవి..గత రాత్రి హతమార్చాడు. ఆమె స్నేహితురాలిని బెదిరించి అక్కడ నుంచి పంపించివేసి... అరుపులు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచి కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం నిందితుడు రవి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అనూష మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆదిలాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
'ప్రేమించలేదని కత్తితో పొడిచి చంపాడు'