jala yagnam scheme
-
జల శేఖరుడు
-
మహా నేత సంకల్పం.. పోలవరం
సాక్షి, అమరావతి : డా.వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టిన ‘జల యజ్ఞం’ ప్రాజెక్టుల్లో ప్రధానమైనది పోలవరం. మిగతావాటి అన్నింటి కంటే బృహత్తరమైనది కావడంతో ఆయన దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అప్పటివరకు కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో ఆచరణ రూపంలోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా కేంద్ర జల సంఘం, అటవీ, పర్యావరణ, సహాయ పునరావాస ప్యాకేజీ సహా అవసరమైన అన్ని కీలక అనుమతులు సాధించి పనులకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో రూ.5,135.87 కోట్లు ఖర్చు చేసి 44.84 శాతం పనులు పూర్తి చేశారు. జాతీయ ప్రాజెక్టు హోదా వస్తే నిధుల కొరత అధిగమించవచ్చన్న భావనతో అందుకు అవసరమైన కేంద్ర ప్రణాళిక సంఘ అనుమతి కూడా సాధించారు. కేంద్రం నుంచి నేడో, రేపో ఆ మేరకు ప్రకటన కూడా రానుందనగా ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో వంద శాతం ఖర్చుతో ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని విభజన చట్టం సెక్షన్ 90 (1)లో ఆనాటి యూపీఏ–2 ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చింది. తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. కానీ, విభజన చట్టం ప్రకారం కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు నిర్మాణాన్ని తన ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేలా సీఎం చంద్రబాబు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ‘ప్రత్యేక హోదా’ను కేంద్రానికి తాకట్టు పెట్టారు. దీనికిముందు వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రాజెక్టుకు చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడ్డారు. ఇదీ వైఎస్ ముద్ర 2004–05 ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.10,151.04 కోట్లు. బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాబట్టి జాతీయ హోదా సాధిస్తే 90 శాతం నిధులను కేంద్రం ఇస్తుంది. దీంతో శరవేగంగా పూర్తి చేయొచ్చని వైఎస్ భావించారు. నిబంధనల మేరకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలంటే అన్ని అనుమతులుండాలి. దాంతో ‘సైట్ క్లియరెన్స్’ను సెప్టెంబరు 19, 2005న, అటవీ పర్యావరణ అనుమతిని అక్టోబర్ 25, 2005న, అభయారణ్య అనుమతిని జూలై 6, 2007న, సహాయ పునరావాస ప్యాకేజీకి ఏప్రిల్ 17, 2007న అనుమతి సాధించారు. కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి ఒక్కటీ వస్తే కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం ఖాయం. దానికోసం ఓవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు ప్రాజెక్టు పనులకు రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు సర్దుబాటు చేశారు. జలాశయం నిర్మాణంతో ముంపునకు గురయ్యే భూమిలో సింహభాగం, కుడి, ఎడమ కాలువల పనుల కోసం అవసరమైన భూమిలో 80 శాతం సేకరించారు. దీంతో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పన్నాగాలకు తెరతీశారు. కుడి కాలువ తవ్వకానికి అవసరమైన భూ సేకరణకు వ్యరేతికంగా కోర్టును ఆశ్రయించేలా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని రెండు మండలాలకు చెందిన తన సామాజికవర్గ రైతులను రెచ్చగొట్టారు. అయినా సరే వైఎస్... కుడి కాలువను 145 కి.మీ. పొడవునా, ఎడమ కాలువను 134 కి.మీ. పొడవునా లైనింగ్ సహా పూర్తి చేశారు. హెడ్ వర్క్స్ (జలాశయం) పనులకు ప్రయత్నిస్తూనే ఫిబ్రవరి 25, 2009న కేంద్ర ప్రణాళిక సంఘ అనుమతిని సాధించారు. మరే ఆటంకం లేకపోవడంతో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇంతలోనే 2009 ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో అది వాయిదా పడింది. ఆ ఎన్నికల్లో వైఎస్ గెలవడం, ఒకట్రెండు రోజుల్లో పోలవరానికి జాతీయ హోదా ప్రకటన చేయడానికి కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో అమరుడయ్యారు. మహా నేత సంకల్పం వైఎస్ చాలా ముందుచూపుతో పోలవరాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 194.6 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. కుడి కాలువ ద్వారా రోజూ 17,633 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 17,561 క్యూసెక్కులు తరలించవచ్చు. 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిస్తూ, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. విశాఖపట్నం నగర పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడమే కాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వొచ్చు. 960 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి చేయవచ్చు. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమూ పోలవరంతోనే సాధ్యం. వైఎస్ ఏం చేశారు? పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మాణ పనులను 2005లో దివంగత మహానేత వైఎస్ ప్రారంభించారు. వాటికి సమాంతరంగా కుడి, ఎడమ కాలువ పనులు చేపట్టారు. తద్వారా తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారానికి నడుంబిగించారు. 2005లో రూ.10,151 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలుపెట్టారు. ప్రణాళిక ప్రకారం వెళ్తూ ప్రాజెక్టుకు అడ్డంకులు రాకుండా చూశారు. రూ.5,135.87 కోట్లతో 44.84 శాతం పనులు పూర్తి చేయించారు. జాతీయ ప్రాజెక్టు హోదా సాధనకు అన్ని అనుమతులు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. – ఆలమూరు రామగోపాల్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, అమరావతి -
వ్యవసాయం.. పండగ చేసిండు...
దుర్భిక్షానికి తోడు.. ‘దండగ’మారి పాలన మిగిల్చిన దౌర్భాగ్యం.. పంట చేలలో ఇంకిన నీళ్లు.. కనుచూపు మేరా బీళ్లు.... అన్నదాత కళ్లలో సుడులు.. ఇవీ.. నాటివ్యథార్థ రైతుల యథార్థ దృశ్యాలు... రెక్కలు ముక్కలు చేసుకున్నా ఆరుగాలం శ్రమ నీరుకారిపోయి... అయినకాడికి మడిచెక్క అమ్ముకున్నా అప్పులు తీరకపోయి, దేహం ముక్కలు చేసుకున్నా, కిడ్నీలు అమ్ముకున్నా బతుకులు మారకపోయి... చెదిరిన ఆశలతో చూరుకు వేలాడిన దేహాలు!! ఇవీ.... తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన మిగిల్చిన గాయాలు... ఆ కన్నీటి గాథలే ‘ప్రజాప్రస్థానం’లో రాజన్న గుండెను తాకాయి.. ఆ దైన్యం... ఆ వేదన రైతన్న భుజం తట్టేలా మహానేత వైఎస్‌ను చలింపజేసింది.. ఊరూరా తిరిగి అన్నదాతకు ఓదార్పు ఇచ్చేలా సంకల్పం ఇచ్చింది... అధికారంలోకి రాగానే రైతు కన్నీళ్లు తుడవడమే లక్ష్యమైంది.. ఉచిత కరెంటుకు బాటలు వేసింది... రైతు రుణాల మాఫీకి పురిగొల్పింది.... జలయజ్ఞానికి స్ఫూర్తినిచ్చింది... రైతు ఇంటికి పండగ తెచ్చింది... పావలా వడ్డీ రుణాలతో ఊరట పిన్నింటి గోపాల్ / వనం దుర్గాప్రసాద్: అదనులో పెట్టుబడి ఉంటేనే రైతులకు స్వాంతన అనేది నిజం చేస్తూ పంట రుణాలపై వడ్డీని పావలాకు తగ్గించారు వైఎస్. ఇదే స్ఫూర్తితో రైతులకు రుణ వితరణ కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. దీనికి 2009-10లో రైతులకు ఇచ్చిన రూ. 28,434 కోట్ల పంట రుణాలే సాక్ష్యం. అన్ని రకాల పెట్టుబడి ఉపకరణాలకుతోడు రైతులకు కొండంత మనోధైర్యం కల్పించిన వైఎస్ హయాం(2009)లో రికార్డు స్థాయిలో 121 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనే పేరును నిలబెడుతూ అదే ఏడాది ఏకంగా 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. ఈ ఘనతకు గాను కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా దక్కింది. బీమాతో ధీమా పెంచి.. పెరుగుతున్న పెట్టుబడులకు తోడు ప్రకృతి విపత్తులతో వ్యవసాయం జూదంగా మారిన పరిస్థితుల నుంచి రైతుకు ధీమా కలిగించేందుకు దేశంలోనే మొదటిసారిగా ఖరీఫ్‌లో గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకం అమలు చేశారు వైఎస్. దీంతో 2008-09లో రాష్ట్రానికి ఏకంగా రూ.801 కోట్లు వచ్చింది. దీనివల్ల 7.58 లక్షల మంది రైతులకు దాదాపు పంటలు పండిన స్థాయిలో ఉపశమనం కలిగింది. వాతావరణంలోని మార్పుల వల్ల పంట నష్టపోయే రైతులకు భరోసా కల్పించేందుకు 2009 ఖరీఫ్‌లో రాష్ట్రంలోనే మొదటిసారిగా గుంటూరు జిల్లాలో మిరప పంటకు వాతావరణ బీమా అమలు చేశారు. విపత్తులతో పంటలు నష్టపోయే వారికి ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీని మూడింతలు పెంచి రైతుల్లో భరోసా కల్పించారు. ఆరు లక్షల ఎకరాల భూ పంపిణీ నిరుపేదలకు ఆరు లక్షల ఎకరాల భూములను వైఎస్సార్ పంపిణీ చేశారు. ఇందిరప్రభ పథకం కింద రూ.500 కోట్లతో ఈ భూములను అభివృద్ధి చేయించారు. బిందు సేద్యం, తుంపర సేద్యంపై రాయితీని 50 శాతం నుంచి 90 శాతానికి పెంచారు. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం రాయితీ కల్పించారు. ఉపాధిహామీ, ఉద్యానవన శాఖల సమన్వయంతో పండ్ల తోటల అభివృద్ధికి పథకం రూపొందించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు వ్యవసాయ, అనుబంధ శాఖల మధ్య సమన్వయం కోసం అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న 460 వ్యవసాయ అధికారులు, 700 వ్యవసాయ విస్తీర్ణ పోస్టులను భర్తీ చేశారు. లీజు ఫీజు లేకుండా.. చెరువులు, జలాశయాల్లో చేపలు పెంచినందుకు గాను ఆయా మత్స్యకార సంఘాలు ప్రభుత్వానికి లీజు కింద ఫీజు చెల్లిస్తుంటాయి. ఈ ఫీజు మొత్తం ఏటా 10 శాతం పెరుగుతుండేది. దీనివల్ల మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన వైఎస్ 2008 నుంచి ఈ ఫీజును ఐదేళ్లపాటు పెంచ కూడదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చేపలను నిల్వచేసేందుకు 50శాతం రాయితీపై ఐస్‌బాక్స్‌లు పంపిణీ చేశారు. ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక ప్యాకేజీ అందరికీ అన్నం పెట్టే రైతు పురుగు మందులు తాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకున్న వైఎస్ ఆత్మహత్యల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న 16 జిల్లాలకు రూ.10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కల్పించారు. బాబు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సైతం ఆర్థిక సహాయం అందించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ర్టంలోని 63 లక్షల మంది రైతులకు 11,353 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యేలా చేశారు. రుణమాఫీ పథకం వర్తించని 36 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.ఐదువేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రూ.1800 కోట్ల ప్రోత్సాహకం అందించారు. విప్లవాత్మక పథకాలు గొర్రెలు, మేకల పెంపకాన్ని లాభదాయకంగా చేయడంతోపాటు పెంపకందారుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. జీవక్రాంతి పథకాల పేరుతో సబ్సిడీపై మేలు జాతి గొర్రెలు, మేకలను 50 శాతం రాయితీతో రైతులకు సరఫరా చేశారు. విపత్తులతో పాడిపశువులు, గొర్రెలు చనిపోతే పెంపకందారులు రనష్టపోకుండా బీమా కల్పించారు. నిత్యం చెట్టుపుట్టల్లో తిరిగే పెంపకందారులకు రూ.లక్ష వరకు బీమా కల్పించారు. పల్లెల్లోని నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి గోపాలమిత్ర కార్యకర్తలుగా నియమిం చారు. మూగజీవాల వైద్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా సంచార వైద్యశాలలు ఏర్పాటు చేశారు. సమాఖ్య, దీని పరిధిలోని సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. వరికి వెయ్యి మద్దతు.. పంటలు ఎంత బాగా పండినా వాటికి గిట్టుబాటు ధరలు వస్తేనే రైతు కష్టానికి ప్రతిఫలం ఉంటుందని నమ్మిన నేత వైఎస్. ఆయన పాలనలో మద్దతు ధర 70 శాతం పెరిగింది. వరి మద్దతు ధరను 2009 నాటికి రూ.1030కి పెంచేలా కేంద్రాన్ని ఒప్పించారు. కందుల ఎంఎస్పీని క్వింటాల్‌కు రూ. 1390 నుంచి రూ.3000లకు, రూ.1960 ఉన్న పత్తి ధరను రూ.3000 వరకు వచ్చేలా చేశారు. ‘మోన్శాంటో’పై ‘సుప్రీం’కు వ్యవసాయానికి మూలాధారమైన నాణ్యమైన విత్తనం సరఫరా చేసేందుకు రాజశేఖరరెడ్డి కృషి చేశారు. 2009లో రూ.315 కోట్లతో 22 లక్షల క్వింటాళ్ల రాయితీ విత్తనాలు సరఫరా చేశారు. రైతులను నిలువునా ముంచుతున్న బహుళజాతి విత్తన కంపెనీ ‘మోన్శాంటో’కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు. రూ 1850 బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ ధరను రూ.750కి తగ్గించారు. మోన్శాంటో కంపెనీ దిగివచ్చేలా చేశారు. వర్సిటీలు నెలకొల్పి.. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ రంగాల విద్య, పరిశోధన, విస్తరణలకు వైఎస్సార్ అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ మూడు రంగాలకూ వేర్వేరుగా విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. ఐదేళ్లలోనే ఈ సంస్థలను వందల కోట్ల వ్యాపారం చేసే స్థాయికి తీసుకొచ్చి ఆ సంస్థల్లో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచారు. విత్తన గ్రామం పథకాన్ని పటిష్టంగా అమలుచేసి రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి రెట్టింపు అయ్యేలా చేశారు. మత్స్యకారుల అభ్యున్నతికి.. సునామీ వల్ల సర్వం కోల్పోయిన మత్స్యకారులు తిరిగి సాధారణ జీవనం గడిపేందుకు వైఎస్ ఎంతో కృషి చేశారు. ఇళ్లు, పడవలు, వలలు.. ఇలా అన్నింటినీ గరిష్ట రాయితీతో పంపిణీ చేశారు. మత్స్యకార మహిళలతో మత్స్యమిత్ర బృందాలు ఏర్పాటు చేశారు. వీరికి తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించారు. మత్స్యకారులు వేటాడి తెచ్చిన చేపలను వారే అమ్ముకునేలా 50 శాతం రాయితీతో మొబైల్ మార్కెట్లు ఏర్పాటు చేశారు. రెండువేల మత్స్యకార సంఘాలకు ఉచితంగా చేప విత్తనాలను సరఫరా చేయడం ప్రారంభించారు. రుణమాఫీకి ప్రత్యేక జీవో రైతు రుణాల రద్దు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించిన ఘనత వైఎస్‌కే చెల్లుతుంది. 63 లక్షల మందికి రుణాలు రద్దు చేయడం ఒక ఎత్తై, కేంద్ర మార్గదర్శకాల వల్ల రుణ మాఫీ వర్తించని రైతన్నలకు ప్రోత్సాహాన్నివ్వడం విశేషం. 2006 నాటికి బ్యాంకు రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించిన రైతుల కోసం ఆయన ప్రత్యేక జీవో తెచ్చారు. దీనివల్ల మన రాష్ట్రంలో 32 లక్షల మంది రైతులకు రూ. 1600 కోట్ల ప్రోత్సహకం లభించింది. ప్రతీ రైతన్న రూ. 5 వేలకు తగ్గకుండా ఆర్థిక సాయం అందుకున్నారు. పంపుసెట్లకు ఉచిత విద్యుత్ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడానికి ఆయన కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలను కున్నారు. దీనికోసం లక్ష కోట్ల బడ్జెట్ రూపొందించారు. 70 ఏళ్ళుగా కాగితాలకే పరిమితమైన పోలవరం దశ, దిశ మార్చారు. 25 ఏళ్ళ పులిచింతల పురిటినొప్పులకు పరిష్కారం కనుగొన్నారు. 12 ప్రాజెక్టులను పూర్తి చేశారు. 22 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. 56 ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు రూపొందించారు. 30 లక్షల పంపుసెట్లకు ప్రతీ రోజూ ఏడు గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్ ఇచ్చారు. పైసా పెరగని ఎరువులు అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు చుక్కల కెక్కాయి. 200 నుంచి 700 శాతం పెరిగాయి. అయినప్పటికీ రాష్ట్ర రైతాంగంపై ఆ భారం పడకుండా వైఎస్ ఆదుకున్నారు. 2003-04లో ఏ ధరకు రైతు ఎరువులు కొన్నారో, 2009 వరకు అదే ధరకు అందు బాటులో ఉండేలా సబ్సిడీ ఇచ్చి రైతులపై పెరిగిన ధరల భారం పడకుండా చూశారు. మిర్చి రైతుకు భరోసా మిరప సాగు వ్యయ ప్రయాసలతో కూడింది. వైఎస్ అధికారంలోకి వచ్చేనాటికి మిర్చి రైతు ఏనాడూ లాభాల పంట చూసింది లేదు. ప్రకృతి వైపరీత్యాలు నష్టాల్లోకి నెట్టాయి. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మిర్చిరైతుకు వైఎస్ భరోసా ఇచ్చారు. వ్యవసాయ పెట్టుబడుల సబ్సిడీ కింద చెల్లించే రూ. 2250 మొత్తాన్ని రూ. 4500 పెంచారు. దీని కోసం రూ. 169 కోట్లు వెచ్చించారు. రైతుల ఎంపిక కూడా హైదరా బాద్ సచివాలయంలో కాకుండా, గ్రామ సభ లకే ఆ అధికారాన్ని అప్పగించడం విశేషం. ఉచితంపైనే తొలి సంతకం - అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’ ఫైలు పైనే చేశారు. రైతుల విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తూ ఆయన రెండో సంతకం చేశారు. - ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ లభించింది. రైతులు బకాయిపడ్డ రూ. 1250 కోట్ల కరెంటు బకాయిలు మాఫీ అయ్యాయి. సుమారు రెండు లక్షల మంది రైతులపై నాటి చంద్రబాబు ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు రద్దయ్యాయి. - ప్రతీ ఏటా కొత్తగా లక్షన్నర వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. - 2004 నుంచి ఒక్క ఏడాది కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. కనీస సర్వీస్ చార్జీ అయిన రూ. 20లను కూడా వసూలు చేయలేదు. - వచ్చే ఐదేళ్లు కూడా విద్యుత్ చార్జీలు పెంచేది లేదని 2009 ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ హామీ ఇచ్చారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్‌ను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచుతామన్నారు. -
పూర్తికాని ‘పులిచింతల’
అచ్చంపేట, న్యూస్‌లైన్ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తు న్న ‘పులిచింతల’ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే శనివారం ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 15 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడంతోపాటు 46 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం వుంది. దీని ద్వారా 120 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇన్ని బహుళ ప్రయోజనాలు కలిగిన పులిచింతల ప్రాజెక్టును ‘జలయజ్ఞం’ పథకంలో భాగంగా నిర్మించతలపెట్టిన అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో శంకుస్థాపన చేశారు. పర్యావరణ అనుమతుల్లో జాప్యం తదితర కారణాలతో ప్రాజెక్టు పనులు 2005లో ప్రారభమయ్యాయి. మహానేత వైఎస్ మృతి నాటికి ప్రాజెక్టు 60శాతం పూర్తయింది. ఆ తరువాత పనులు మందగించి ఇప్పటికి 90 శాతం పూర్తి చేసుకుంది. మిగిలిన పది శాతం పనులు కూడా పూర్తయితేనే వినియోగంలోకి రాగలదని ఇంజినీరింగ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచాలంటే.... ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచాలంటే గుంటూరు జిల్లాలో 15, నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపాలి. బెల్లంకొండ, అచ్చంపేట, పిడుగురాళ్ల, రాజుపాలెం, మాచవరం మండలాల్లో 13 పునరావాస కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు 12,602 ఎకరాల భూమి కావలసి ఉండగా ఇప్పటివరకు 11,588 ఎకరాలను సేకరించారు. ఇప్పటివరకు 4,661 కుంటుంబాలకు పునరావాస కేంద్రాల్లో పట్టాలు ఇచ్చారు. మరో 1,784 కుంటుంబాలకు ఇవ్వవలసి ఉంది. గుంటూరు జిల్లాలో పునరావాస కేంద్రాల నిర్మాణాలకు రూ.168 కోట్లు వెచ్చించారు. అచ్చంపేట మండలంలో పునరావాస కేంద్రాలు.. అచ్చంపేట మండలం చిగురుపాడు, నీలేశ్వరపాలెం, పెదపాలెం పంచాయతీల పరిధిలో కోళ్లూరు, చిట్యాలతండా, కేతవరం గ్రామాలకు పునరావాస కేంద్రాల నిర్మాణం చేపట్టారు. పెదపాలెం పంచాయతీ పరిధిలో చిట్యాల తండా నిర్వాసితులకు 292 ప్లాట్లు వేసి గృహాల నిర్మాణం కూడా చేపట్టారు. ఇప్పటి వరకు 92 కుటుంబాలు గ్రామం వదిలి వచ్చాయి. అయితే కనీస సదుపాయాలు లేక అల్లాడుతున్నారు. దీంతో తిరిగి తమ గ్రామం వెళ్లిపోతామని నిర్వాసితులు చెబుతున్నారు. చిగురుపాడు పంచాయతీ పరిధిలో 196 ప్లాట్లు వేయవలసి ఉంది. ఇటీవల 19 ఎకరాల భూసేకరణ చేశారు. ప్రస్తుతం అంతర్గత రహదారులు వేసే పనిలో ఉన్నారు. ఇక్కడ అన్ని పనులు పూర్తి కావాలంటే కనీసం మరో సంవత్సర కాలమైనా పడుతుంది. నీలేశ్వరపాలెం పునరావాస కేంద్రంలో కేతవరం నిర్వాసితులకు 227 ప్లాట్లు వేశారు. ప్రభుత్వం భవనాలు కూడా నిర్మించారు. కాని నిర్వాసితులు ఈ కేంద్రానికి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు. ఈ కేంద్రం వాగు కింద ఉండటం వల్ల నివాసాలకు అనుకూలంగా లేదని చెబుతున్నారు. అదీకాక కేతవరం లక్ష్మీ నరసింహా స్వామి భూములపై జీవిస్తున్న తమకు కూడా పరిహారం ఇవ్వనిదే గ్రామం వదిలి వచ్చేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.