Jan koum
-
వాట్సాప్‌కు సీఈవోగా భారతీయుడు..!
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పలు బహుళ జాతి సంస్థలకు భారతీయులు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో పేరు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ చాట్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ సీఈవోగా భారత్‌కు చెందిన నీరజ్ అరోరాను నియమించే ఆవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆ సంస్థ సీఈవో పదవి నుంచి జాన్ కౌమ్ వైదొలగడంతో.. వాట్సాప్ కొత్త సీఈవో వేటలో పడింది. 2014లో వాట్సాప్‌ను కొనుగోలు చేసిన ఫేస్బుక్ ప్రస్తుతం డేటా లీకేజీ వ్యవహరంతో ఇబ్బంది పడుతోంది. అయితే ఫేస్‌బుక్‌తో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే జాన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూజర్ల డేటా భద్రత అనేది ప్రధాన సమస్యగా మారిన ఈ తరుణంలో కొత్త సీఈవో ఎంపిక విషయంలో చాలా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే వాట్సాప్ ఇప్పటికే అర్హులతో కూడిన ఓ జాబితాను రూపొందించినట్టు సమాచారం. అందులో వాట్సాప్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న నీరజ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న నీరజ్.. గతంలో గూగుల్‌లో కార్పొరేటు డెవలప్మెంట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నీరజ్ ఓ క్లౌడ్ సొల్యూషన్ సంస్థలో చేరి.. ఆ కంపెనీలో ఉన్నత స్థాయికి చేరాడు. 2006లో ఐబీఎస్ నుంచి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం ఏడాదిన్నర పాటు టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్‌లో వర్క్ చేశాడు. ఆ తర్వాత గూగుల్‌లో చేరిన నీరజ్.. 2011లో వాట్సాప్‌లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ గూగుల్‌కు, సత్యానాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు, శంతను నారాయణ్ అడోబ్‌కు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఫేస్‌బుక్‌కు మరో దెబ్బ
ఇటీవల ఫేస్బుక్లో చోటు చేసుకున్న ప్రైవసీ స్కాండల్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కాండల్ నేపథ్యంలో వాట్సాప్ సీఈవో జాన్ కౌమ్, తన పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించారు. వాట్సాప్ నుంచి తాను వైదొలుగుతున్నట్టు కౌమ్ తన ఫేస్బుక్ పేజీలో సోమవారం ధృవీకరించారు. అదేవిధంగా ఫేస్బుక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నుంచి కూడా కౌమ్ రాజీనామా చేస్తున్నట్టు వాషింగ్టన్ పోస్టు రిపోర్టు చేసింది. కౌమ్ రాజీనామాపై ఫేస్బుక్ ఇంకా ఎలాంటి కామెంట్ చేయలేదు. కౌమ్ కూడా తాను ఎందుకు కంపెనీని వీడాలనుకుంటున్నారో తెలుపలేదు. వాట్సాప్ స్ట్రాటజీ విషయంలో పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో వివాదాలు చోటు చేసుకున్నాయని, ఈ కారణం చేత ఆయన వైదొలుగుతున్నట్టు రిపోర్టులు వెలువడ్డాయి. ఫేస్బుక్, వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత డేటా వాడుతుందని, వాట్సాప్ ఎన్క్రిప్షన్ను ఇది బలహీనపరుస్తుందని కౌమ్ ఆందోళన చెందుతున్నట్టు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ‘బ్రైయిన్, నేను కలిసి వాట్సాప్ ప్రారంభించి దశాబ్దమవుతోంది. కొంతమంది మంచి వ్యక్తులతో కలిసి సాగిన ఈ ప్రయాణం ఎంతో అద్భుతం’ అని వాట్సాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న కౌమ్ పేర్కొన్నారు. కానీ తాను బయటికి వచ్చేసే సమయం ఆసన్నమైందంటూ కూడా తెలిపారు. అయితే ఏ తేదీన తాను వాట్సాప్ సీఈవోగా తప్పుకోనున్నారో కౌమ్ వెల్లడించలేదు. ఈ పరిస్థితుల్లో కౌమ్ కంపెనీని వీడటం ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆందోళన పరుస్తోంది. 5000 యాప్ సాఫ్ట్వేర్ డెవలపర్లు, కొంతమంది వాట్సాప్ యూజర్లతో జుకర్‌బర్గ్ సమావేశం ఏర్పాటు చేశారు. కౌమ్ ఫేస్బుక్ పోస్టుకు సమాధానమిచ్చిన జుకర్‌బర్గ్, మీతో కలిసి పనిచేయడం మిస్ అవుతామని పేర్కొన్నారు. 2014లో వాట్సాప్‌ను ఫేస్బుక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫేస్‌బుక్‌తో వచ్చిన పొరపచ్చలతో గతేడాదే వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రెయిన్ కంపెనీని వీడారు. తాజాగా మరో సహ వ్యవస్థాపకుడు కౌమ్ కూడా వాట్సాప్‌కు గుడ్‌బై చెబుతున్నారు. -
70 కోట్లకు చేరుకున్న వాట్స్ప్ వినియోగదారులు
వాషింగ్టన్: వాట్సప్ మెసేజ్ సర్వీసు వినియోగదారుల సంఖ్య 70 కోట్లకి చేరిందని ఆ సంస్థ సీఈవో జాన్ కూమ్ గురువారం వాషింగ్టన్లో వెల్లడించారు. గత ఏడాది ఆగస్టులో ఈ సంఖ్య 60 కోట్లుగా ఉందని తెలిపారు. ప్రతిరోజు తమ నెట్వర్క్ ద్వారా వినియోగదారులు నిత్యం 3 వేల కోట్ల సందేశాలు పంపుతున్నారని... దీంతో వాట్సప్ అతి పెద్ద సామాజిక నెట్‌వర్క్‌గా అవతరించిందని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రమ్, ట్విట్టర్లు 30 కోట్లు, 28.4 కోట్ల వినియోగదారులతో ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయని చెప్పారు. వాట్సప్ నెట్వర్క్ రూ.1.18 లక్షల కోట్ల వ్యాపారంతో ముందుకు సాగుతోందని వివరించారు. 130కోట్ల మంది వినియోగిస్తున్న ఫేస్బుక్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉందని తెలిపారు. -
వాట్స్‌యాప్ వ్యవస్థాపకులకు రూ. 55,000 కోట్లు
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ సంస్థకు తమ కంపెనీని విక్రయించిన వాట్స్‌యాప్ వ్యవస్థాపకులు జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ భారీ జాక్‌పాట్ దక్కించుకున్నారు. డీల్‌లో భాగంగా ఫేస్బుక్లో వారికి 116 మిలియన్ షేర్లు లభించాయి. వీటి విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 55,000 కోట్లు) ఉంటుంది. మెసేజింగ్ సర్వీసుల సంస్థ వాట్స్‌యాప్‌ను ఫేస్బుక్ 22 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం తెలిసిందే. అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థకు ఫేస్బుక్ తెలిపిన వివరాల ప్రకారం కౌమ్‌కు 5.8 బిలియన్ డాలర్ల విలువైన 76.4 మిలియన్ల షేర్లు లభించాయి. దీంతో ఫేస్బుక్లో ఆయన నాలుగో అతి పెద్ద వాటాదారుగా మారారు. యాక్టన్కు 3 బిలియన్ డాలర్లు విలువ చేసే 39.7 మిలియన్ల ఫేస్బుక్ షేర్లు లభించాయి. వాట్స్‌యాప్‌లో 45 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులకు ఫేస్బుక్ షేర్లు లభించాయి.