John Hastings
-
అరుదైన వ్యాధితో ఆటకు బౌలర్ గుడ్‌బై
మెల్బోర్న్: వైద్యులకు అంతు చిక్కని అరుదైన వ్యాధితో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ ఆటకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. హేస్టింగ్స్ బౌలింగ్ చేసినప్పుడల్లా ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరుగుతోంది. దాదాపు నెల రోజుల క్రితం అతనికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. రన్నింగ్, రోయింగ్, ఫిట్నెస్ ట్రైనింగ్‌వంటి ఎన్నో ఎక్సర్సైజ్లు చేసినా ఇబ్బంది రాకపోగా, బౌలింగ్ చేసినప్పుడు మాత్రమే సమస్య కనిపించడం అరుదైన వ్యాధిగా మారింది. వైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా దీనిపై స్పష్టత రాలేదు. ఇకపై కూడా రక్తస్రావం జరగదని తాము హామీ ఇవ్వలేమని వైద్యులు స్పష్టంగా చెప్పేశారు. దాంతో ఆటకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాలని 33 ఏళ్ల హేస్టింగ్స్ నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 29 వన్డేలు, 9 టి20లు ఆడిన హేస్టింగ్స్... ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, కొచ్చి టస్కర్స్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. -
బౌలింగ్ చేసిన ప్రతీసారి రక్తపు వాంతులు
సిడ్నీ: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాన్ హేస్టింగ్స్ అంతుచిక్కని జబ్బుతో బాధపడుతున్నాడు. ఊపిరితిత్తుల్లో సమస్య వల్ల బౌలింగ్ చేసిన ప్రతిసారీ రక్తపు వాంతులు అవుతుండడంతో భవిష్యత్తుపై అతడు ఆందోళన చెందుతున్నాడు. ‘ఇప్పుడు బౌలింగ్ చేసిన ప్రతిసారీ రక్తం వాంతి చేసుకుంటున్నా. కేవలం బౌలింగ్ చేస్తేనే.. పరిగెత్తితే కాదు. నేను బాక్సింగ్, రోయింగ్ చేయగలను. బరువులూ ఎత్తగలను. కానీ కేవలం బౌలింగ్ చేసినప్పుడే అలా జరుగుతోంది. మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేసినపుడు ఊపిరితిత్తుల నుంచి రక్తం ఎగజిమ్మి.. దగ్గినపుడు అది నోటి ద్వారా బయటకు వస్తోంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు అని వైద్యులు కచ్చితంగా చెప్పట్లేదు. ఇకపై నేను బౌలింగ్ చేస్తానో లేదో’అని హేస్టింగ్స్ అన్నాడు. ఆస్ట్రేలియా తరపున ఓ టెస్టు, 9 టీ20లు, 29 వన్డేలు ఆడిన 32 ఏళ్ల హేస్టింగ్స్ గత కొన్నేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడు. దాంతో అతని కెరీర్ ప్రమాదంలో పడింది. -
హెల్మెట్ లేకుంటే ఈ బ్యాట్స్‌మన్ పరిస్థితేంటీ .!
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా క్రికెటర్ జాన్ హేస్టింగ్స్ తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా మెల్ బోర్న్ స్టార్స్‌కి బ్రిస్బెన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మెల్ బోర్న్ స్టార్స్‌కి కెప్టెన్ అయిన హేస్టింగ్స్ బ్యాటింగ్ చేస్తుండగా ఆస్ట్రేలియా పేస్ బౌలర్ బెన్ కటింగ్ వేసిన ఓ షార్ట్ బాల్ బంతి వేగంగా దూసుకొచ్చి ఆయన తల కుడివైపు బలంగా తాకింది. బాల్ దాటికి హేస్టింగ్స్ హెల్మెట్ ఎగిరి పడింది. హేస్టింగ్స్‌కు ఎలాంటి గాయం కాకపోవడంతో మైదానంలోని ఆటగాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో సంభ్రమాశ్చర్యానికి లోనైన హేస్టింగ్స్ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. మూడేళ్ల క్రితం ఫిలిప్ హ్యూస్ మరణ ఘటనను గుర్తు చేసిన ఈ ఘటన ఆటగాళ్లను కొంత సేపు కలవరపెట్టింది. హెల్మెట్ లేకుంటే హేస్టింగ్స్ పరిస్థితేంటీ అని ప్లేయర్లంతా భయాందోళనలకు గురయ్యారు. 2014లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో సౌత్ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ జట్ల మధ్య షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బౌన్సర్ తలకు తగలడంతో ఫిలిప్ హ్యూస్ గాయపడి మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన క్రికెట్ చరిత్రలోనే ఓ విషాద ఘటనగా మిగిలిపోయింది. -
'మాపై గంగూలీ దూకుడు సెపరేటు'
కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్‌కు దూకుడును అలవాటు చేయడంలో గంగూలీ తనదైన ముద్రవేశాడన్నాడు. ప్రత్యేకంగా ఆస్ట్రేలియాతో జరిగే పోరులో గంగూలీ మరింత దూకుడు వ్యవహరించే తీరు ఆకట్టుకునేదని హేస్టింగ్ కొనియాడాడు. ఆస్ట్రేలియాకు వచ్చి ఆసీస్‌పై ఆ రకమైన దూకుడును ప్రదర్శించిన వారి జాబితాను చూస్తే గంగూలీనే తొలి క్రికెటర్ గా నిలుస్తాడని హేస్టింగ్స్ తెలిపాడు. గంగూలీ కెప్టెన్ గా ఉన్న 2000 నుంచి 2005 సమయంలో అతని శైలి చాలా భిన్నంగా ఉండేదన్నాడు. ఒకానొక సందర్భంలో అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వాను టాస్ కోసం నిరీక్షించేలా చేసిన ఘనత గంగూలీ దక్కుతుందన్నాడు. ఇదే తరహాలో ఆస్ట్రేలియన్లను గంగూలీ భయపెట్టే సందర్భాలను కూడా తాను చాలా చూశానన్నాడు. కాగా, భారత్-ఆస్ట్రేలియా జట్లు ఎప్పుడూ క్రికెట్‌ను ఆరాధిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. దాంతో పాటు ఇరు జట్లలో ఆత్మవిశ్వాసం కూడా మెండుగానే ఉందన్నాడు. అయితే ప్రస్తుత ఆస్ట్రేలియా-టీమిండియా జట్లలో ఆనాటి దూకుడు లేదన్న విషయాన్ని అంగీకరించాలన్నాడు. అత్యంత నమ్మకంతో పాటు సహజసిద్ధంగా ఆడటమే తాను ఇప్పుడు ఇరు జట్లలో చూస్తున్నట్లు హేస్టింగ్స్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ ఐపీఎల్ ఆడటంతో తనకు భారత్ లో చాలా మంది స్నేహితులున్నట్లు పేర్కొన్నాడు. పేస్ బౌలింగ్ విషయానికొస్తే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పరిస్థితులకు, భారత్ లో పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నాడు. -
ఆసీస్ కు మరో ఎదురుదెబ్బ
లండన్: ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆటకు దూరం కాగా, తాజాగా సీనియర్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్, ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్-నిలె కూడా గాయాలతో సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వీరిద్దరి స్థానంలో పీటర్ హ్యాండ్స్ కొబ్, జాన్ హాస్టింగ్స్ లను జట్టులోకి తీసుకున్నారు. ఐదు వన్డేల సిరీస్ లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గి ఆసీస్ దూకుడు మీద ఉంది. ఇలాంటి సమయంలో కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడడం ఆస్ట్రేలియా టీమ్ ను కలవరపరుస్తోంది. వార్నర్, వాట్సన్, కౌల్టర్ లేకపోవడం తమకు ప్రతికూలం అయినప్పటికీ ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయడం ద్వారా వారి స్థానాన్ని భర్తీ చేశామని ఆసీస్ కోచ్ డారెన్ లెహమాన్ తెలిపారు. కాగా, టెస్టు క్రికెట్ కు వాట్సన్ ఆదివారం గుడ్ బై చెప్పాడు.