Justice Lodha
-
పీఏసీఎల్ ఆస్తులతో లావాదేవీలొద్దు
జస్టిస్ లోధా కమిటీ హెచ్చరిక న్యూఢిల్లీ: పీఏసీఎల్ కంపెనీ ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపరాదని జస్టిస్ ఆర్.ఎం. లోధా అథ్యక్షతన గల కమిటీ హెచ్చరించింది. పీఏసీఎల్ గ్రూప్ కంపెనీల, అనుబంధ కంపెనీల సంబంధిత ఆస్తులను, కొనుగోలు చేయడం విక్రయించడం, మరే ఇతర తరహా లావాదేవీలనైనా నిర్వహించడం చేయరాదని ఈ కమిటీ పేర్కొంది. ఇలాంటి లావాదేవీలను నిర్వహిస్తే, అది చట్టవిరుద్ధమైనదిగా భావించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ కమిటీ హెచ్చరించింది. పీఏసీఎల్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ విధమైన హెచ్చరికలు జారీ చేస్తున్నామని వివరించింది. ఎవరి సొమ్ములు వారికివ్వడానికే...: పీఏసీఎల్ సంస్థ వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులను సమీకరించింది. 18 ఏళ్లుగా ఈ కంపెనీ అక్రమ పద్ధతుల్లో ప్రజల నుంచి రూ.49,000 కోట్లు సమీకరించిందని సెబీ గుర్తించింది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం ఇన్వెస్టర్లకు వారి సొమ్ములను వారికి తిరిగి చెల్లించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఇన్వెస్టర్లకు వారి డబ్బులు వారికి చెల్లించే ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ పీఏసీఎల్ ఆస్తులను విక్రయించే ప్రక్రియను నిర్వహిస్తోంది. -
న్యాయవ్యవస్థను స్వతంత్రంగానే ఉంచాలి
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థకు ఉన్న స్వాతంత్య్ర స్వభావాన్ని ఎంతమాత్రం వూర్చడానికి వీలు లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా అన్నారు. దాంట్లో ఏవైనా మార్పులు చేయాలనుకున్నా, అటువంటి ప్రయుత్నాలను తిప్పికొట్టే సత్తా న్యాయవ్యవస్థకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో ఉన్నతస్థాయి నియామకాలకు సంబంధించి కొలీజియం పద్ధతికి స్వస్తిచెప్పడానికి ప్రయుత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంలో పార్లమెంట్ చేసిన చట్టం గురించి ఆయన నేరుగా ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కానీ, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని హరించే ఎలాంటి ప్రయత్నమైనా విఫలంకాక తప్పదని పేర్కొన్నారు. ప్రజలు విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే న్యాయవ్యవస్థకు స్వేచ్ఛ అవసరవుని అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక వ్యవస్థకాని, వురేఇతర విభాగంకాని తప్పుచేస్తే తవుకు అండగా ఒక వ్యవస్థ ఉందనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందని జస్టిస్ లోధా అన్నారు. శనివారం ‘రూల్ ఆఫ్ లా’ అనే అంశంపై ఏర్పాటైన సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థపై బురదజల్లేందుకు ప్రయత్నించే వ్యక్తులను దూరంగా పెట్టాలని న్యాయవేత్తలను కోరారు. న్యాయవ్యవస్థ స్వేచ్ఛను హరించాలనుకునే ఎలాంటి ప్రయుత్నమైనా విఫలం కాకతప్పదని, ఈ రంగంలో తనకున్న 21 ఏళ్ల అనుభవంతో ఆ విషయం చెబుతున్నానన్నారు. కాగా, ఈ వ్యవస్థలో అవినీతి లేకుండా చూడాల్సిన అవసరం ఉందనిఅభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థపై గౌరవం ఉంది ... న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందని, ఈ వ్యవస్థ పవిత్రమైందని కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో అన్నారు. ఈ వ్యవస్థ స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. -
తీర్పుల్లో వేగమేది?: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో కోర్టు తీర్పుల మందగమనంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తీర్పులు ఆలస్యమవుతుండటం మంచి పాలన అందించేందుకు మంచి సంకేతం కాదని అభిప్రాయపడింది. క్రిమినల్ కేసు తీర్పుల్లో వేగం పెంచడానికి 4 వారాల్లో ఒక విధాన రూపకల్పన చేయాలని శుక్రవారం కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ‘క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ వేగంగా కదలాలంటే మరిన్ని కోర్టులు, మెరుగుపరిచిన మౌలికవసతులు కావాలి’ అని జస్టిస్ లోధా అన్నారు. అన్ని విభాగాల్లోనూ ఫాస్ట్ ట్రాక్ తీర్పులు అవసరమని ధర్మాసనం చెప్పింది. ఎంపిల పై ఉన్న క్రిమినల్ కేసులను వేగంగా పూర్తి చేయాలని ప్రధాని మోడీ కోరడాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీం తన అభిప్రాయం వెలిబుచ్చింది. -
అంతా ఏకపక్షం, ఆషామాషీ..
గోపాల సుబ్రమణియం వ్యవహారంలో మోడీ సర్కార్ తీరుపై సీజేఐ విమర్శ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం ఎంపికచేసిన నాలుగు పేర్ల ప్యానెల్‌నుంచి మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణియం పేరును పక్కన పెడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా మంగళవారం తీవ్రంగా విమర్శించారు. తనకు తెలియపరచడం లేదా, అనుమతి తీసుకోవడంలాంటివి ఏవీ లేకుండా ప్రభుత్వం ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందని జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు. న్యాయ విభాగం స్వతంత్రత విషయంలో రాజీపడేది లేదని, అలా జరిగినట్టు తెలిసిన రోజున ఒక క్షణంకూడా తన పదవిలో ఉండజాలనని లోధా స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ చౌహాన్‌కు ఢిల్లీలో మంగళవారం ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశంలో లోధా మాట్లాడుతూ, తొలిసారిగా ఈ వివాదంపై నోరువిప్పారు. ఉన్నతస్థాయి రాజ్యాంగ పదవి అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం విషయంలో ఇంత ఆషామాషీగా, నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారో తనకు అర్థంకావడంలేదన్నారు. గత నెల 28వ తేదీన తాను విదేశీపర్యటనుంచి తిరిగి వచ్చేటప్పటికి, న్యాయశాఖకు సంబంధించిన ఫైలు తన కార్యాలయానికి పంపారని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి సంబంధించి ఎంపికైన నాలుగు పేర్లలో మూడు పేర్లు ఆమోదం పొందినట్టు పైలులో ఉందని, తద్వారా గోపాల సుబ్రమణియం పేరును పక్కన పెట్టారని జస్టిస్ లోధా అన్నారు. గోపాల సుబ్రమణియం వ్యవహారంలో ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు,. లోధా వ్యాఖ్యలపట్ల ప్రభుత్వం కూడా స్పందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే తమకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొంది. ఈ విషయంలో గత సంప్రదాయాన్ని, ఆనవాయితీని పాటించామని, న్యాయమూర్తి నియామకానికి సంబంధించి ఎంపికైన నామినీపై పునరాలోచన చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. -
జాతీయం: సుప్రీం కోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లోధా
రోడ్డు ప్రమాదాలపై కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు రోడ్డు ప్రమాదాల నివారణపై సుప్రీం కోర్టు సత్వర చర్యలు అత్యవసరమని ఏప్రిల్ 22న వ్యాఖ్యానించింది. ఈ ప్రమాదాల నివారణ చర్యలను సూచించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. త్రిసభ్య కమిటీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తారు. రోడ్ల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల నివేదికలను అధ్యయనం చేసి కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తుంది. గోవాలో మైనింగ్‌పై నిషేధం ఎత్తేసిన సుప్రీంకోర్టు గోవాలోని అన్ని ఖనిజాల తవ్వకంపై 19 నెలలుగా ఉన్న నిషేధాన్ని సుప్రీం కోర్టు ఏప్రిల్ 21న ఎత్తేసింది. ఏటా 20 మిలియన్ టన్నుల పరిమితితో కూడిన ఇనుప ఖనిజాన్ని తవ్వుకోడానికి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ అనుమతించింది. జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలోని సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ సిఫార్సుల ఆధారంగా అత్యున్నత న్యాయస్థానం ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. గతంలో గోవాలోని అక్రమ మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయనే అంశంపై 2012 సెప్టెంబరులో నిషేధం విధించింది. రాజీవ్‌గాంధీ హంతకుల విడుదలపై స్టే పొడిగించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు ఏప్రిల్ 25న పొడిగించింది. జైల్లో ఉన్న ఏడుగురు నిందితులకు శిక్ష తగ్గించే అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. నిందితులకు శిక్ష తగ్గింపు తమిళనాడు ప్రభుత్వం పరిధిలోకి రాదని, అది చట్ట వ్యతిరేకమన్న కేంద్ర ప్రభుత్వ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుని పై నిర్ణయానికి వచ్చింది. నింగికెగిసిన ఆకాశ్ దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన ఆకాశ్ క్షిపణిని భారత్ ఏప్రిల్ 26న ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించింది. ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించడానికి అనుగుణంగా రూపొందించిన ఈ క్షిపణి 25 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు. 60 కిలోల వార్ హెడ్‌ను మోసుకెళుతుంది. మధ్య శ్రేణికి చెందిన క్షిపణి యుద్ధవిమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గగనతలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులను నాశనం చేస్తుంది. ఒక ఆకాశ్ వ్యవస్థ ఏకకాలంలో పలు లక్ష్యాలపై దాడి చేస్తుంది. సుప్రీం కోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లోధా భారత సుప్రీంకోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజేంద్ర మల్ లోధాతో ఏప్రిల్ 27న రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏప్రిల్ 26న పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సదాశివం స్థానంలో జస్టిస్ లోధా నియమితులయ్యారు. జస్టిస్ లోధా ఐదు నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగి 2014 సెప్టెంబరు 27న పదవీ విరమణ చేస్తారు. రాజస్థాన్‌కు చెందిన జస్టిస్ లోధా 1994 జనవరిలో రాజస్థాన్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008 మే 13న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టారు. 2008 డిసెంబరు 17 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. విజయవంతమైన బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స వ్యవస్థ శత్రు క్షిపణులను అడ్డుకునే బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స (బీఎండీ) వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఏప్రిల్ 27న జరిపిన దీర్ఘ శ్రేణి క్షిపణులను ముందుగా, ఆకాశంలోనే పేల్చివేసే పృథ్వీ డిఫెన్స వెహికల్ (పీడీవీ) ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి రక్షణ శాఖ ఈ ప్రయోగం నిర్వహించింది. పీడీవీ ఇంటర్‌సెప్టర్ క్షిపణితో పాటు బాలిస్టిక్ క్షిపణి తరహాలో రూపొందించిన లక్ష్యాన్ని కూడా ప్రయోగంలో వినియోగించారు. బంగాళాఖాతంలో నిలిపిన నౌకల నుంచి ముందుగా లక్ష్యాన్ని ప్రయోగించారు. తర్వాత ప్రయోగించిన పీడీవీ లక్ష్యాన్ని ఛేదించింది. 2000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని చేరుకోగల బాలిస్టిక్ క్షిపణులను పీడీవీ 120 కి.మీ. కంటే ఎత్తులో ఉండగానే గుర్తించి ధ్వంసం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దుకు, రాష్ర్టపతి పాలన పొడిగింపునకు కేంద్ర కేబినెట్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దుకు, రాష్ర్టపతి పాలన ఏప్రిల్ 30 తర్వాత పొడిగింపునకు కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 25న నిర్ణయించింది. రాష్ర్టంలో మార్చి 1 నుంచి అమల్లో ఉన్న రాష్ర్టపతి పాలన ఏప్రిల్ 30న ముగుస్తుంది. ప్రకరణ 356 సెక్షన్-3 ప్రకారం రాష్ర్టంలో రాష్ర్టపతి పాలనను పార్లమెంట్ 60 రోజుల లోపు ఆమోదించాల్సి ఉంటుంది. శాసనసభ రద్దు వల్ల పార్లమెంట్ రాష్ర్టపతి పాలన మరో రెండు నెలలు పొడిగించేందుకు అవకాశముంటుంది. ప్రస్తుతం 16వ పార్లమెంటుకు సాధారణ ఎన్నికలు జరగుతుండటంతో పార్లమెంటుకు సభ్యులు హాజరు కావడం వీలుకాని పరిస్థితి నెలకొంది. -
బొగ్గు ఫైళ్ల గల్లంతుపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల ఫైళ్లలో కొన్ని అందుబాటులో లేవని కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై సుప్రీంకోర్టు మండిపడింది. 1993-2009 మధ్యకాలంలోని పత్రాలు, సమాచారం, ఫైళ్లు కనిపించడం లేదని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. కనిపించకుండా పోయిన వాటిపై కనీసం పోలీసు ఫిర్యాదన్నా చేశారా లేదా అని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ ఆర్ఎం లోధా, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఈ కేసును విచారించింది. ‘కనిపించని ఫైళ్లపై కేసు ఎందుకు నమోదుచేయలేదు? అవి మొత్తానికే పోయాయా? లేక మళ్లీ దొరికే అవకాశముందా?’ అని ప్రభుత్వాన్ని అడిగింది. ఈ కేసులో సీబీఐ అడిగిన పత్రాలు, సమాచారం, ఫైళ్లను రెండువారాల్లోగా అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేసు దర్యాప్తుపై అక్టోబర్ 22 నాటికి స్థాయీ నివేదికను సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. బొగ్గు కుంభకోణంలో అధికారుల పాత్రపై విచారణ అంశం సీబీఐ, కేంద్రం మధ్య పరస్పరం ఘర్షణ వాతావరణం నెలకొంది. కోర్టు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈ కేసులో అధికారులను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని సీబీఐ తన వాదనను కొనసాగిస్తుండగా, ప్రభుత్వం మాత్రం వ్యతిరేకిస్తోంది. మరోవైపు, కేసు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘మీరింకా ఫస్ట్‌గేర్‌లోనే ఉన్నారు. వేగం పెంచండి’ అని జస్టిస్ లోధా సీబీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తుది చార్జిషీట్లను సీబీఐ తమ న్యాయవాదులతో పంచుకునేందుకు కోర్టు అనుమతించింది.