Jyoti Basu
-
Sitaram Yechury: జీవితమే కాదు.. దేహమూ ప్రజాసేవకే అంకితం
ప్రముఖ రాజకీయ నేత, సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూసిన విషయం తెలిసిందే. 72 ఏళ్ల ఏచూరి ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశనుంచే వామపక్ష భావాలను అలవరచుకున్న ఆయన.. తుదిశ్వాస విడిచే వరకు ప్రజా పోరాటాల్లో బతికారు. తన జీవితాన్నే కాదు.. చివరకు తన దేహాన్ని సైతం ప్రజాసేవకే అంకితమిచ్చారు.ఆయన బతికి ఉన్నప్పుడే తాను మరణిస్తే పార్థీవ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన పార్థీవదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. మృతదేహాన్ని శుక్రవారం ఆస్పత్రికి తరలించనున్నారు. దీంతో ఏచూరి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించటం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా కమ్యూనిస్టు నేతలు తమ పార్థివదేహాలను పరిశోధనల కోసం ఇవ్వడం ఇదే తొలిసారికాదు.. గత కొన్నేళ్లుగా వామపక్ష నాయకులు ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఆగస్టు 2024లో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) భౌతికకాయాన్ని కూడా వైద్య పరిశోధనల కోసం దానం చేశారు. కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కార్ ఆసుపత్రిలోని అనాటమీ విభాగానికి పార్థివ దేహాన్ని అప్పగించారు. ఇందుకు సంబంధించి మార్చి 2006లోనే బుద్ధదేవ్ ఓ స్వచ్ఛంద సంస్థకు హామీ ఇచ్చారు.ఆయనతోపాటు పశ్చిమ బెంగాల్‌కు 34 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు దిగ్గజ నేత జ్యోతిబసు కూడా 2010లో ఆయన మరణాంతరం శరీరాన్ని వైద్య సేవలకే అప్పగించారు.ఆయన పార్థివ దేహాన్ని కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి దానం చేశారు. ఇందుకు సంబంధించి 2006లోనే ఆయన హామీ ఇచ్చారు. మాజీ లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 2000 సంవత్సరంలో తన శరీరాన్ని దానం చేస్తానని ప్రమాణం చేశాడు. 2018లో అతని మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు శరీరాన్ని దానం చేశారు. సీపీఎం కార్యదర్శి అనిల్ బిశ్వాస్‌తోపాటు పార్టీ సీనియర్ నేత బెనోయ్ చౌధురీల భౌతికకాయాలూ ఆస్పత్రులకు అప్పగించారు. -
దీర్ఘకాలం సీఎంగా కొనసాగిన జాబితాలో నవీన్ పట్నాయక్ రికార్డు..
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దేశంలో దీర్ఘకాల ముఖ్యమంత్రిగా కొనసాగిన ప్రముఖుల జాబితాలో చేరనున్నారు. జాతీయ స్థాయిలో రెండో దీర్ఘకాలిక సీఎంగా సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. నవీన్ ప్రత్యక్ష రాజకీయ జీవితంలో ఇదో సుస్థిర మైలురాయిగా నిలుస్తుందని బిజూ జనతాదళ్ శిబిరంలో ఆనందం వెల్లివిరుస్తోంది. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి దివంగత జ్యోతి బసు తరువాత దీర్ఘకాలం ఈ పదవిలో కొనసాగిన రికార్డు ఆక్రయించనున్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ఒడిశా పరివర్తన ప్రధాన కార్యాచరణ ఆయనకు ఈ రికార్డు సాధకులుగా చరిత్రలో నిలుపుతుంది. జ్యోతి బసు సమగ్రంగా 23 సంవత్సరాల 138 రోజులు నిరవధికంగా పదవిలో కొనసాగారు. ఆయన తర్వాత సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ 24 ఏళ్ల 166 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నవీన్ పట్నాయక్ స్థానం సాధించడం విశేషం. ఆయన వరుసగా 5సార్లు సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఈనెల 22తో ముఖ్యమంత్రి పాలన సమగ్రంగా 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకుంటుంది. గతంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు ఇదే కాల పరిమితిలో గతంలో దీర్ఘకాలిక ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొలిపారు. తాజా రికార్డుతో నవీన్ ఆయన సరసన చోటు దిక్కించుకుకోవడం విశేషం. జాతీయ స్థాయిలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా ఎదిగేందుకు స్వల్ప దూరంలో ఉన్నారు. 2000, 2004, 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ రాష్ట్ర శాసనసభకు వరుసగా ఎన్నికయ్యారు. ఆయన అకుంఠిత కార్యదక్షత ముఖ్యమంత్రి హోదాని సొంతం చేసింది. ఎత్తుకు ప్రత్యర్థులు చిత్తు.. మహిళ, రైతు సాధికారిత ఇతరేతర రంగాల్లో సంస్కరణలు రాష్ట్రానికి సరికొత్త రూపురేఖలు అద్దాయి. సేవాభావం, సామాజిక శ్రేయస్సు పట్ల అంకితభావం ప్రజా ప్రాతినిధ్యానికి ప్రామాణికంగా రుజువు చేసిన దాఖలాలు కోకొల్లలు. గంజాం జిల్లా అసికా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మహిళా స్వయం సహాయక సంఘం సాధికార మహిళ ప్రమీల బిసొయిని ఎంపీగా గెలిపించుకున్న తీరు.. బిజూ జనతాదళ్ అధ్యక్షుడుగా నవీన్ పట్నాయక్ సాధించిన అపురూప విజయం. ప్రత్యర్థుల్లో ధీటైన సభ్యులను సమయోచితంగా ఆకట్టుకుని, పార్టీని బలోపేతం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలను ఖంగు తినిపించడంలో ఆయన ధీరత్వానికి ప్రతీక. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల కంచుకోటలుగా నిలిచిన పలు నియోజక వర్గాలను బీజేడీ ఖాతాలో చేర్చుకున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఒడిశా సమగ్రంగా కై వసం చేసుకునే వ్యూహంతో పావులు కదుపుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో.. గంజాం జిల్లా హింజిలికాట్ నవీనపట్నాయక్కు కలిసి వచ్చిన నియోజకవర్గంగా మిగిలింది. దీనితో పాటు పాలనలో విపత్కర పరిస్థితులను అవలీలగా అధిగమించి, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల విశేష గుర్తింపుతో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచారు. రాష్ట్రంలో ఆకలి చావులకు తెరదించిన దిశలో ఆయన కృషి అనన్యమని చెప్పవచ్చు. ప్రజలకు పారదర్శక పాలన ఇంటి ముంగిటకు చేర్చడంలో సాధించిన విజయం అత్యద్భుతం. ప్రభుత్వ సేవలు ప్రజలకు నిర్థారిత కాల పరిమితిలో కల్పించడమే ధ్యేయంగా చేపట్టిన 5టీ కార్యాచరణ రాష్ట్ర పరివర్తనలో సరికొత్త మలుపు తిప్పింది. అవినీతి రహిత పాలన కార్యాచరణ సులభతరం చేసిన సాటిలేని ముఖ్యమంత్రిగా పేరొందారు. సమాచారం, రవాణా, బాహ్య ప్రపంచంతో రాష్ట్రాన్ని అనుసంధానం చేయడం.. జాతీయ, అంతర్జాతీయ వర్తక వ్యాపారాలు, పారిశ్రామిక విస్తరణతో రాష్ట్ర పురోగతిలో వేగం పుంజుకుంది. విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలు సకాలంలో అక్కరకు వచ్చే రీతిలో ప్రవేశ పెట్టిన పథకాలు, కార్యక్రమాలు జాతీయ స్థాయిలో మార్గదర్శకంగా నిలిచాయి. -
చివరి నిమిషంలో ప్రధాని పదవి దూరం.. ఏం జరిగింది?
అదృష్టం తలుపు తట్టినా కలిసి రాని రాజయోగం. చివరి నిమిషంలో దురదృష్టం వెక్కిరించడంతో భోగం దూరమైంది. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా అదృష్ట రేఖ మలుపు తిరిగింది. కొందరికి ఇంటి పోరుతో పదవి దూరమైతే మరికొందరికి వేరే కారణాలెన్నో.. ఇక, ఈ లిస్టులో దిగ్గజ నేతల పేర్లే ఉన్నాయి. వారిలో ముఖ్యులు ములాయం సింగ్ యాదవ్, సోనియా గాంధీ, జ్యోతి బసు, ఎల్కే అద్వానీ ఉన్నారు.. వీరికి ప్రధాని పదవి ఎలా దూరమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. -
జ్యోతిబసు రికార్డుకు చేరువలో చామ్లింగ్
గ్యాంగ్‌టక్: దేశంలో అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వ్యక్తిగా దివంగత జ్యోతిబసు నెలకొల్పిన రికార్డును సిక్కిం సీఎం పవన్ చామ్లింగ్ బద్దలు కొట్టనున్నారు. సిక్కింలో వరుసగా ఐదో సారి ఆయన అధికార పీఠం అధిష్టించనున్నారు. చామ్లింగ్ 1994 డిసెంబర్ 12న సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇప్పటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నారు. కమ్యూనిస్టు నాయకుడు దివంగత జ్యోతిబసు 23 ఏళ్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన 1977 జూన్ 21న సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 2000 నవంబర్ 5 వరకూ పదవిలో కొనసాగారు. శుక్రవారం నాటి సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చామ్లింగ్ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్) మూడింట రెండొంతుల మెజారిటీని సాధించింది. మొత్తం 32 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 22 చోట్ల ఎస్డీఎఫ్ ఘన విజయం సాధించింది. రంగాంగ్-యంగాంగ్, నంచీ-సింగితాంగ్ స్థానాల నుంచి పోటీ చేసిన చామ్లింగ్ రెండు చోట్లా రికార్డు మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలోని ఒకే ఒక్క లోక్‌సభ స్థానంలో కూడా ఎస్డీఎఫ్ అభ్యర్థి పీడీ రాయ్ సుమారు 42 వేల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. -
జ్యోతిబసు రికార్డుకు పవన్ చామ్లింగ్ ఎసరు!
ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడపటమే గగనంగా మారిన ఈ రోజుల్లో వరుసగా 20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగడమంటే మామూలు విషయం కాదు. సిక్కింలో పవన్ కుమార్ చామ్లింగ్ త్వరలోనే ఓ రికార్డును సొంతం చేసుకోనున్నారు. వరుసగా 23 ఏళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన జ్యోతిబసు రికార్డుపై చామ్లింగ్ కన్నేశారు. త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ యోధుడు జ్యోతిబసు రికార్డును తిరగరాసేందుకు సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ సిద్దమవుతున్నారు. ఈ సంవత్సరం జరిగే అసెంబ్లీలో ఎన్నికల్లో చామ్లింగ్ విజయం సాధిస్తే వరుసగా ఐదవసారి ఎన్నికైన ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకి ఎక్కుతారు. 1994 డిసెంబర్ 12 తేది నుంచి సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎస్ డీఎఫ్) ప్రభుత్వాన్ని నడుపుతున్న చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 20 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. 23 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన రికార్డు జ్యోతిబసుపై ఉంది. జ్యోతిబసు 1977 జూన్ 21 నుంచి 2005 నవంబర్ 5 తేది వరకు అధికారంలో కొనసాగారు. ఆతర్వాత బుద్దదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 12 తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చామ్లింగ్ ప్రభుత్వం విజయం సాధిస్తే జ్యోతిబసు రికార్డును అధిగమించే అవకాశం ఉంది. జ్యోతిబసు రికార్డును చామ్లింగ్ అధిగమించే అంశాన్ని సిక్కిం రాష్ట్రంలోని 3,70,000 లక్షల ఓటర్లు ఏప్రిల్ 12 తేదిన నిర్ణయించనున్నారు. 2009 ఎన్నికలల్లో ఎస్ డీఎఫ్ 32 సిట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. చామ్లింగ్ కు ఓటర్లు అవకాశాన్ని అందిస్తారా లేదా అనే విషయం త్వరలోనే స్పష్టమవ్వడం ఖాయం.